‘గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి –నూతన ఆవిష్కరణ’లే ప్రధాన ఎజెండాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి నోవాటెల్‌లో అంతర్జాతీయ యువజన సదస్సు ప్రారంభమైంది. 135 దేశాలకు చెందిన 550 మంది ప్రతి నిధులతోపాటు 16 దేశాల నుండి డెబ్బై మందికిపైగా నిపుణులు హాజరయ్యారు.