ఘటనా స్థలంలో పడి ఉన్న కత్తి
భార్యపై కత్తితో దాడి
Published Sun, Oct 23 2016 8:58 PM | Last Updated on Fri, Jul 27 2018 2:26 PM
గణపవరంలో ఈ దారుణం
చిలకలూరిపేట టౌన్: భార్యపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన పడాల సావిత్రి తన అక్క కూతురిని పట్టణంలోని కళామందిర్ సెంటర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చింది. వైద్యుడు లేకపోవడంతో ఇద్దరూ ఓపీ వద్ద వేచి ఉన్నారు. సుమారు మధ్నాహ్యం మూడు గంటల సమయంలో సావిత్రి భర్త పడాల అక్కిరాజు ఆసుపత్రికి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. హటాత్తుగా బొడ్డులో నుంచి కత్తి తీసి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన సావిత్రి డాక్టర్ గదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకొనే ప్రయత్నం చేసింది. తలుపు గడియ పడకపోవడంతో లోనికి తోసుకువెళ్లిన అక్కిరాజు తన వద్ద ఉన్న కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యాడు. దాడిలో పొట్ట,ఛాతీ, తల,చేతిపై మొత్తం ఏడు పోట్లు పడ్డాయి. స్థానికులు గాయపడిన సావిత్రిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి తీవ్ర రక్తస్రావం కావడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పట్టణ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement