Husband attack
-
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే హత్య
ఖమ్మం అర్బన్: కాపురంలో విభేదాలతో ఆ భార్యాభర్తలు విడిపోయారు. ఆ తర్వాత భార్యకు మరో యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సదరు యువకుడితో పలుమార్లు గొడవ పడిన మహిళ భర్త.. ఇద్దరూ ఏకాంతంగా కలుసుకోవడాన్ని జీర్ణించుకోలేక దాడికి తెగబడ్డాడు. విచక్షణారహితంగా కత్తితో యువకుడిని పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, హత్య చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం అల్లీపురానికి చెందిన సంపంగి వీరబాబుకు వైరా మండలానికి చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో సదరు మహిళ ఖమ్మం శివారు గోపాలపురం సమీపాన ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో నాలుగేళ్లుగా ఉంటోంది. పోలీస్ కేసులు కూడా నమోదు.. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న అల్లీపురానికి చెందిన నల్లగట్ల నవీన్‌తో ఆమెకు వివాహేతర సం బంధం ఏర్పడింది. ఈ విషయం వీరబాబుకు తెలియడంతో నవీన్‌తో పలుమార్లు గొడవ పడ్డాడు. ఇరువురు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. అయినా నవీన్, తన భార్య సన్నిహితంగా ఉండడాన్ని వీరబాబు తట్టుకోలేకపోయాడు. ఇంతలోనే నవీన్‌కు నిశ్చితార్థం జరగగా, వచ్చే నెల 9న పెళ్లి నిర్ణయించారు. కాగా, సదరు మహిళ ఇంటికి ఆదివారం రాత్రి నవీన్ వెళ్లాడని తెలుస్తోంది. అక్కడకు వీరబాబు వెళ్లి నవీన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో నవీన్ పేగులు బయటకు వచ్చాయి. దాడిని అడ్డుకోబోయిన మహిళకు సైతం గాయాలయ్యాయి. నవీన్‌ను ఆమె ఆటో లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చేర్పించుకోకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున నవీన్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్ సీఐ రామకృష్ణ పరిశీలించి విచారణ మొదలుపెట్టారు. అయితే, పెళ్లి కార్డు ఇచ్చేందుకే మహిళ ఇంటికి వెళ్లిన నవీన్‌పై వీరబాబు దాడి చేసి హత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి శ్రీను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరబాబు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి భర్తను చంపిన భార్య -
భార్య మీద కోపంతో అత్తింటివారిపై దాడి
కొండపాక (గజ్వేల్): భార్యమీద కోపంతో ఓ వ్యక్తి అత్తింటి వారిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులపై మండే స్వభావం ఉన్న టిన్నర్‌ను చల్లి టపాకాయలతో అగ్గి రాజేశాడు. దీంతో మంటలు చెలరేగి భార్య, బావమరిది కుటుంబీకులు, వదినతో కలిపి ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నెమలికొండకు చెందిన చిలుముల లక్ష్మీరాజం (42)కు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రాజమల్లి రామవ్వ–రామయ్య రెండో కూతురు విమల (35)తో 2007లో వివాహం జరిగింది. లక్ష్మీరాజం కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. దంపతుల మధ్య గొడవల కారణంగా పదేళ్లనుంచి ఎవరికి వారు వేర్వేరుగా ఉంటున్నారు. భార్యపై కక్ష పెంచుకున్న లక్ష్మీరాజం ఎలాగైనా భార్య విమలతోపాటు పిల్లలను, అత్తింటివారిని హతమార్చాలని పథకం వేశాడు. దీంతో అత్తగారి ఊరైన ఖమ్మంపల్లికి వెళ్లి ఇంట్లో నిద్రలో ఉన్న భార్య విమల, కూతురు పవిత్ర, బావమరిది జాన్‌రాజ్, అతని భార్య రాజేశ్వరి, లక్ష్మీరాజంకు వదిన వరుస అయ్యే సుజాతలపై తలుపు సందులోంచి టిన్నర్‌ను పోశాడు. తర్వాత దీపావళికి కాల్చే సుతిలి బాంబులను గదిలోకి వేశాడు. మంటలు అంటుకుని తీవ్ర గాయాల పాలైన ఆ ఐదుగురు బాధ తాళలేక గదిలోంచి బయటకు వచ్చి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు మేల్కొని వెంటనే గాయాలైన ఆ ఐదుగురిని సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షత గాత్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విమల, జాన్‌రాజ్, సుజాతల పరిస్థితి విషమంగా ఉంది. లక్ష్మీరాజంను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. -
కోరిక తీర్చలేదని భార్యపై కత్తిపీటతో దాడి
తాడేపల్లిరూరల్: తన కోరిక తీర్చలేదని భార్యపై కత్తిపీటతో దాడిచేసి గాయపరిచాడో భర్త. అయితే తన భర్తను వెంటనే విడుదల చేయాలని పోలీసులకే అల్టిమేటం ఇచ్చింది ఆ ఇల్లాలు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వడ్డేశ్వరం గ్రామంలో నివసించే ఓ వ్యక్తి (40) తన కోరిక తీర్చలేదనే కోపంతో భార్యపై కత్తిపీటతో దాడిచేశాడు. ఈ ఘటనలో ఆమెకు వీపు కింద భాగంలో తీవ్రమైన గాయమైంది. విపరీతంగా రక్తస్రావం జరగడంతో స్పృహ కోల్పోయింది. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బంధువులు క్షతగాత్రురాలిని వైద్యం కోసం గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. గాయమైన చోట 15 కుట్లు వేశారు. ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. అయితే వైద్యుల సూచనలను పక్కన పెట్టిన ఆమె.. తన భర్తను పోలీసులు అరెస్టు చేశారని, వెంటనే ఆయన్ను విడిపించాలంటూ గ్రామానికి తిరిగి వచ్చేసింది. తన భర్తను విడిచిపెట్టాలని, తాను ఎలాంటి ఫిర్యాదూ చేయడం లేదని తాడేపల్లి పోలీసులను కోరింది. పోలీసులు మాత్రం నిందితుడిని అదుపులోనే ఉంచుకున్నారు. సాయంత్రం మరోసారి సదరు మహిళ పోలీసులకు ఫోన్ చేసి.. తన భర్తను విడిచిపెట్టకపోతే ఆయనకు ఏం జరిగినా మీరే బాధ్యులంటూ హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. భార్యాభర్తలన్న తర్వాత గొడవలు జరగకుండా ఎలా ఉంటాయి? కేసు పెట్టి మా పరువు తీసుకోమంటారా? అలాగైతే మేము మీపైనే ఫిర్యాదు చేస్తాం అంటూ ఆమె పోలీసులను హెచ్చరించినట్లు సమాచారం. దీంతో విస్తుపోయిన పోలీసులు ఏ నిర్ణయమూ తీసుకోవాలో అర్థంగాక సతమతమవుతున్నారు. -
గర్భిణిపై భర్త దాడి
శృంగవరపుకోట : కంటికి రెప్పలా కాపాడతానంటూ తాళి కట్టిన భర్త నిండు గర్భిణి అయిన భార్య కడుపుపై తన్ని కర్కశత్వాన్ని చాటుకున్నాడు. సంఘటనకు సంబంధించి ఎస్సై అమ్మినాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో మొండివీధికి చెందిన గనివాడ ఈశ్వరరావుకు సీతంపేట గ్రామానికి చెందిన సరోజినితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 1,50,000 రూపాయల కట్నం ఇస్తామన్న సరోజిని కుటుంబీకులు రూ. 1,20,000 ఇచ్చారు. మిగిలిన రూ.30 వేలు ఇవ్వాలని భర్త ఈశ్వరరావు, అత్త, మామలు తరచూ వేధిస్తుండేవారు. ఇదిలా ఉంటే సరోజిని భర్త ఈశ్వరరావు వేరొక వ్యక్తి బంగారు ఉంగరం తాకట్టుపట్టాడు. సదరు వ్యక్తి పదే పదే వచ్చి సొమ్ము తీసుకుని ఉంగరం ఇవ్వాలని అడిగినా ఇవ్వకపోవడంతో సరోజిని తన భర్తను ఉంగరం ఏంచేశావు. . ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన ఈశ్వరరావు ఏడు నెలల గర్భిణి అయిన భార్య కడుపుపై తన్నాడు. విషయం తెలిసి సరోజిని తండ్రి, బావలు వచ్చి ఈశ్వరరావుతో పాటు అతని తండ్రిపై చేయి చేసుకున్నారు. సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త గనివాడ ఈశ్వరరావు, మామ రామకృష్ణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గర్భిణి సరోజిని ఎస్.కోట సీహెచ్‌సీలో చికిత్స పొందుతోంది. -
పెళ్లి ఇష్టం లేదని బ్లేడ్‌తో కోసి..!
సాక్షి, సూర్యాపేట : పట్టణంలో దారుణం వెలుగుచూసింది. పెళ్లి ఇష్టం లేదంటూ భార్యపై బ్లేడ్‌తో దాడి చేసి వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన అల్లీ అనూషను, రాజీవ్‌నగర్‌కు చెందిన సాయి శివకు ఇచ్చి గత ఏడాది ఏప్రిల్ 29న వివాహం చేశారు. అయితే పెళ్లైన కొంత కాలానికే సాయి సైకోలో ప్రవర్తిస్తూ అనూషను వేధింపులకు గురిచేస్తున్నాడు. బ్లేడ్‌తో కోయడం, కొడుతూ శారీరకంగా వేధిస్తున్నాడు. అత్తమామలు, ఆడపడుచులు సైతం అనూషను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి అనూషను హత్య చేయాడానికి మంచినీటిలో నిద్రమాత్రలు కలిపి తాగించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఆమె తప్పించుకొని తల్లిదండ్రులకు వద్దకు చేరింది. శనివారం ఉదయమే పోలీస్‌స్టేషన్‌కు జరిగిందంతా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనూషకు సాయి శివ సొంత మేనబావే కావడం గమనార్హం. -
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మక్తల్ మండలం ముసులేపల్లిలో బుధవారం మహిళా హెడ్మాస్టర్పై ఆమె భర్త కత్తితో దాడి చేశాడు. పాఠశాలలోనే జరిగిన ఈ ఘటనలో హెడ్మాస్టర్ కన్యాకుమారి తీవ్రంగా గాయపడింది. అనంతరం భర్త కూడా గొంతుగోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలతో భర్త రమణారెడ్డి దాడి చేసినట్లుగా సమాచారం. -
‘చనిపోతున్నాను.. రక్షించండి’
జింద్: మరోసారి మానవత్వం మంటగలిసింది. భర్త చేతిలో తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో కొట్టుకుంటూ రక్షించండి అని అరుస్తున్నా చుట్టుపక్కల వారు నిర్దయగా వ్యవహరించారు. ఆమెకు సహాయం చేయాల్సింది పోయి తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ ఉండిపోయారు. ఆమె కన్నబిడ్డలు చుట్టూ చేరి రోదిస్తున్నా ఒక్కరూ కనికరించలేదు. ఈ దయనీయ ఘటన హర్యానాలోని జింద్‌లో చోటు చేసుకుంది. మరోలీ అనే గ్రామంలో సంజూ అనే మహిళ ఉంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. భర్త నరేశ్ మంచివాడు కాదు. నిత్యం గొడవపడుతూ హింసిస్తుండేవాడు. ఈ క్రమంలో ఒకసారి తన భర్తపై కేసు పెట్టింది. శుక్రవారం రోజు సాయంత్రం బయటకు వెళ్లిన సంజు ఇంటికి రాగానే వెంటనే ఆమె కళ్లలో కారం పోశాడు. ఆ వెంటనే చెట్లను, మొద్దులను కత్తిరించేందుకు ఉపయోగించే రంపంతో ఆమె భుజంపై, కడుపులో, మొకాలిపై దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఇంటిముందే నడివీధిలో పడిపోయింది. తాను చనిపోతున్నానని, రక్షించాలని ప్రాధేయపడినా ఎవరూ రక్షించే ప్రయత్నం చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రాగా ఓ వ్యక్తి వీడియో తీసుకుంటూ కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిని గట్టిగా మందలించిన పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలోనే ఉంది. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
కొత్త పేట చౌరస్తాలో దారుణం
హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట చౌరస్తాలో దారుణం చోటుచేసుకుంది. కాపురానికి రావడం లేదని ఓ యువకుడు తన భార్యపై బ్లేడుతో శనివారం సాయంత్రం దాడి చేశాడు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఉస్మానియ ఆస్పత్రికి తరలిచి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. వివరాలు..సంగారెడ్డి జిల్లాకు చెందిన మమత(19) నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ నర్సింగ్ విద్యనభ్యసిస్తొంది. ఈ క్రమంలో బీకామ్ చదువుతున్న రమేష్ అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరు పెద్దలకు చెప్పకుండా.. ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువకుడిని మందలించి మమతను అతని నుంచి దూరం చేశారు. అప్పటి నుంచి ఆమె కోసం గాలిస్తున్న రమేష్ శనివారం ఆమెపై బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మెడభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఆసుపత్రిలో భార్యపై కత్తితో దాడి
-
భార్యపై కత్తితో దాడి
-
భార్యపై కత్తితో దాడి
గణపవరంలో ఈ దారుణం చిలకలూరిపేట టౌన్: భార్యపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన పడాల సావిత్రి తన అక్క కూతురిని పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చింది. వైద్యుడు లేకపోవడంతో ఇద్దరూ ఓపీ వద్ద వేచి ఉన్నారు. సుమారు మధ్నాహ్యం మూడు గంటల సమయంలో సావిత్రి భర్త పడాల అక్కిరాజు ఆసుపత్రికి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. హటాత్తుగా బొడ్డులో నుంచి కత్తి తీసి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన సావిత్రి డాక్టర్ గదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకొనే ప్రయత్నం చేసింది. తలుపు గడియ పడకపోవడంతో లోనికి తోసుకువెళ్లిన అక్కిరాజు తన వద్ద ఉన్న కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యాడు. దాడిలో పొట్ట,ఛాతీ, తల,చేతిపై మొత్తం ఏడు పోట్లు పడ్డాయి. స్థానికులు గాయపడిన సావిత్రిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి తీవ్ర రక్తస్రావం కావడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పట్టణ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది. -
అనుమానంతో భార్యపై భర్త దాడి
విజయనగరం/కొట్టాం(శృంగవరపుకోట): అనుమానం పెనుభూతమైంది. దీనికి మద్యం రక్కసి తోడైంది. తాళికట్టిన భార్యపై మద్యం మత్తులో ఓ భర్త దాడికి తెగబడ్డాడు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు. మండలంలోని కొట్టాం గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొట్టాం గ్రామానికి చెందిన సింగిడి శ్రీను, రమణమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం కావటంతో అత్తవారింట ఉంటోంది. కొడుకు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ వేరొక చోట ఉంటున్నాడు. శ్రీనుకు భార్య రమణమ్మ ప్రవర్తనపై అనుమానం ఉంది. గతంలో పలు దఫాలు ఆమెను హెచ్చరించాడు. ఇదే విషయమై బుధవారం మధ్యాహ్నం ఇద్దరూ గొడవ పడ్డారు. ఆవేశంలో శ్రీను భార్యపై కత్తితో దాడి చేశాడు. తర్వాత క్రిమిసంహారక గుళికలు తిని వాంతులు చేసుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు 100కు సమాచారం ఇవ్వటంతో ఎస్.కోట పోలీసులు వారిద్దరిని ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు పోలీసులు తెలిపారు. -
ఆస్తీమీద కన్నేసి భార్య పై హత్యయత్నం