
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మక్తల్ మండలం ముసులేపల్లిలో బుధవారం మహిళా హెడ్‌మాస్టర్‌పై ఆమె భర్త కత్తితో దాడి చేశాడు. పాఠశాలలోనే జరిగిన ఈ ఘటనలో హెడ్‌మాస్టర్ కన్యాకుమారి తీవ్రంగా గాయపడింది. అనంతరం భర్త కూడా గొంతుగోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలతో భర్త రమణారెడ్డి దాడి చేసినట్లుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment