
సాక్షి, సూర్యాపేట : పట్టణంలో దారుణం వెలుగుచూసింది. పెళ్లి ఇష్టం లేదంటూ భార్యపై బ్లేడ్‌తో దాడి చేసి వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన అల్లీ అనూషను, రాజీవ్‌నగర్‌కు చెందిన సాయి శివకు ఇచ్చి గత ఏడాది ఏప్రిల్ 29న వివాహం చేశారు. అయితే పెళ్లైన కొంత కాలానికే సాయి సైకోలో ప్రవర్తిస్తూ అనూషను వేధింపులకు గురిచేస్తున్నాడు. బ్లేడ్‌తో కోయడం, కొడుతూ శారీరకంగా వేధిస్తున్నాడు. అత్తమామలు, ఆడపడుచులు సైతం అనూషను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
అయితే శుక్రవారం రాత్రి అనూషను హత్య చేయాడానికి మంచినీటిలో నిద్రమాత్రలు కలిపి తాగించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఆమె తప్పించుకొని తల్లిదండ్రులకు వద్దకు చేరింది. శనివారం ఉదయమే పోలీస్‌స్టేషన్‌కు జరిగిందంతా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనూషకు సాయి శివ సొంత మేనబావే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment