మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. | Husband Pours Petrol On Wife Sets Her On Fire In Suryapet | Sakshi

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..

Published Sun, Sep 18 2022 2:35 AM | Last Updated on Sun, Sep 18 2022 2:35 AM

Husband Pours Petrol On Wife Sets Her On Fire In Suryapet - Sakshi

వెంకటమ్మ

హుజూర్‌నగర్‌ రూరల్‌: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సూర్యాపేట జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హుజూర్‌నగర్‌ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన గొట్టెముక్కల గోపయ్యకు 35ఏళ్ల క్రితం గరిడేపల్లి మండలం కట్టవారిగూడెం గ్రామానికి చెందిన వెంకటమ్మ(50)తో వివాహమైంది.

వీరికి ఇద్దరు కుమారులు. గతంలో ఓ కుమారుడు మృతిచెందగా మరో కుమారుడు జానకిరామయ్య లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, గోపయ్య ఏడాదిలో కొంతకాలం పాటు చెన్నై వెళ్లి భిక్షాటన చేసేవాడు. భార్య వెంకటమ్మ గ్రామంలో కూలి పనులు చేస్తూండేది. పది రోజుల క్రితమే గ్రామానికి వచ్చిన గోపయ్య భిక్షాటన చేయ గా వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ.. భార్య ను వేధిస్తూ కొడుతుండేవాడు.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మద్యం తాగడానికి డబ్బులు కావాలని వెంకట మ్మను అడగ్గా..ఆమె డబ్బుల్లేవని చెప్పడంతో గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి ఇంటికి చేరుకున్న గోపయ్య మంచంపై నిద్రిస్తున్న భార్యపై వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. దీంతో ఆమె పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం మేరకు పోలీసులు ఘట నా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement