ఖమ్మం అర్బన్: కాపురంలో విభేదాలతో ఆ భార్యాభర్తలు విడిపోయారు. ఆ తర్వాత భార్యకు మరో యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సదరు యువకుడితో పలుమార్లు గొడవ పడిన మహిళ భర్త.. ఇద్దరూ ఏకాంతంగా కలుసుకోవడాన్ని జీర్ణించుకోలేక దాడికి తెగబడ్డాడు. విచక్షణారహితంగా కత్తితో యువకుడిని పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందాడు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, హత్య చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం అల్లీపురానికి చెందిన సంపంగి వీరబాబుకు వైరా మండలానికి చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో సదరు మహిళ ఖమ్మం శివారు గోపాలపురం సమీపాన ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో నాలుగేళ్లుగా ఉంటోంది.
పోలీస్ కేసులు కూడా నమోదు..
ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న అల్లీపురానికి చెందిన నల్లగట్ల నవీన్‌తో ఆమెకు వివాహేతర సం బంధం ఏర్పడింది. ఈ విషయం వీరబాబుకు తెలియడంతో నవీన్‌తో పలుమార్లు గొడవ పడ్డాడు. ఇరువురు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. అయినా నవీన్, తన భార్య సన్నిహితంగా ఉండడాన్ని వీరబాబు తట్టుకోలేకపోయాడు.
ఇంతలోనే నవీన్‌కు నిశ్చితార్థం జరగగా, వచ్చే నెల 9న పెళ్లి నిర్ణయించారు. కాగా, సదరు మహిళ ఇంటికి ఆదివారం రాత్రి నవీన్ వెళ్లాడని తెలుస్తోంది. అక్కడకు వీరబాబు వెళ్లి నవీన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో నవీన్ పేగులు బయటకు వచ్చాయి. దాడిని అడ్డుకోబోయిన మహిళకు సైతం గాయాలయ్యాయి. నవీన్‌ను ఆమె ఆటో లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చేర్పించుకోకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున నవీన్ మృతి చెందాడు.
ఘటనా స్థలాన్ని నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్ సీఐ రామకృష్ణ పరిశీలించి విచారణ మొదలుపెట్టారు. అయితే, పెళ్లి కార్డు ఇచ్చేందుకే మహిళ ఇంటికి వెళ్లిన నవీన్‌పై వీరబాబు దాడి చేసి హత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి శ్రీను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరబాబు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి భర్తను చంపిన భార్య
Comments
Please login to add a commentAdd a comment