Married Woman Eloped With Lover, Dead Bodies Of Both Found In Well At Rajasthan - Sakshi
Sakshi News home page

పక్కింటి కుర్రాడిపై మనసు పారేసుకున్న వివాహిత.. వివాహేతర సంబంధం సాగించి..

Published Mon, Nov 28 2022 6:10 PM | Last Updated on Mon, Nov 28 2022 7:34 PM

Body Of Two Lovers Found In Well At Rajasthan Barmer - Sakshi

కొందరు వ్యక్తులు ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా తమ దాంపత్య జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్న చిన్న కలహాలు, అనుమానాల కారణంగా బయట వ్యక్తులవైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో, ఆ అడుగులు వివాహేతర సంబంధానికి దారితీస్తున్నాయి. చివరకు అవే తమ ప్రాణాల తీసుకునేందుకు, హత్య చేసేందుకు ప్రేరేపిస్తున్నాయి. 

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. భార్య చేసిన పని.. రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం.. బార్మర్‌ జిల్లాలోని మోతిసర గ్రామానికి చెందిన విష్ణారం సింధారి అనే వ్యక్తితో బాధితురాలికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలో కొద్దిరోజులు వీరి వివాహ జీవితం సంతోషంగానే సాగింది. అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆమెకు పక్కింటి వారితో పరిచయాలు పెరిగాయి. 

ఈ క్రమంలోనే తమ ఇంటి పక్కనే ఉండే జోగారమ్‌ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొత్తలో ఎక్కవ మాట్లాడకపోయిన కాలం గడుస్తున్న కొద్దీ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇదే తరుణంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఇలా వివాహేతర సంబంధం కొద్దిరోజుల పాటు కొనసాగింది. దీంతో, ఆమెకు అతడిపై ప్రేమ మరింతగా పెరిగింది. అతడు లేకుండా ఆమె ఉండలేకపోయింది. 

దీంతో ఎలాగైన ఆ యువకుడిని సొంతం చేసుకోవాలనే ఆలోచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా నవంబర్ 14 నుంచి ఆ మహిళతో పాటు ఆమె ప్రియుడు కూడా కనిపించకుండాపోయాడు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ఎంత వెతికినా వారి జాడ కనిపించలేదు. కట్ చేస్తే తాజాగా అదే గ్రామంలోని ఓ బావిలో వీరిద్దరు శవాలై కనిపించారు. వారి మృతితో కుటుంబ సభ్యులు షాకయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఇక, వీరిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement