నలుగురు పిల్లలున్న వ్యక్తితో వివాహిత లవ్‌ ట్రాక్‌.. చివరకు భలే ట్విస్ట్‌ | Love Affair Women killed By lover At Tamil Nadu | Sakshi

నలుగురు పిల్లలున్న వ్యక్తితో వివాహిత లవ్‌ ట్రాక్‌.. చివరకు భలే ట్విస్ట్‌

Oct 19 2022 9:11 AM | Updated on Oct 19 2022 9:15 AM

Love Affair Women killed By lover At Tamil Nadu - Sakshi

నలుగురు పిల్లలున్న వ్యక్తితో వివాహిత వివాహేతర సంబంధం అనేక మలుపులు తిరిగింది.

తిరువణ్ణామలై (వేలూరు):  వివాహేతర సంబంధాలు పచ్చిన కాపురంలో చిచ్చురేపుతున్నాయి. చిన్న చిన్న కోరికలు, ఆనందాల కోసం తప్పటడుగులు వేస్తున్న వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. నలుగురు పిల్లలున్న వ్యక్తితో వివాహిత వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.

వివరాల ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా కనకూరు పంచాయతీ కేకే నగర్‌ గ్రామానికి చెందిన తంగరాజ్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య ఉమ. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడున్నారు. చెన్నై మాంగాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య నిత్య(30). వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఇదిలా ఉండగా తంగరాజ్‌కు నిత్యతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. తర్వాత తంగరాజ్‌ పని నిమిత్తం చెన్నై వెళ్లే సమయంలో నిత్యను కలిసి మాట్లాడి వచ్చేవాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న  నిత్య భర్త పలుమార్లు ఆమెను హెచ్చరించాడు.

దీంతో మూడురోజుల క్రితం నిత్య ఇద్దరు కుమార్తెలు, భర్తను వదిలి పెట్టి తిరువణ్ణామలైలోని తంగరాజ్‌ ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకున్న తంగరాజ్‌ భార్య భర్తతో పాటు నిత్యను ఇంటిలో చేర్చకుండా బయటకు పంపించి వేసింది. దీంతో తంగరాజ్‌ నిత్య వద్ద చర్చించి చెన్నైకి పంపేందుకు యతి్నంచాడు. ఇందుకు నిత్య నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈక్రమంలో తంగరాజ్‌ నిత్య కట్టుకున్న చీరను ఆమె గొంతుకు బిగించి హత్య చేశాడు. స్థానికులు స్థానికులు గుర్తించి కొండ ప్రాంతానికి వెళ్లగా.. తంగరాజ్‌ అక్కడ నుంచి పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న తిరువణ్ణామలై పోలీసులు నిత్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి ఆధార్‌ కార్డు నెంబర్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement