lover killed
-
తమిళనాడులో దారుణం.. ఐటీ ఉద్యోగిని హత్యలో డబుల్ ట్విస్ట్
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని దారుణ హత్యకు గురైంది. ప్రియుడే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. దీంతో ఈ ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. చెన్నై శివారులోని తాలంబూర్‌లో దారుణం జరిగింది. శనివారం రాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని(25)ని ప్రియుడు వెట్రిమారన్(26) కిరాతకంగా హత్య చేశాడు. వెట్రిమారన్ మొదట నందినిని బ్లేడ్‌తో తీవ్రంగా గాయపరిచి, అనంతరం ఆమెను గొలుసులతో బంధించి, చివరగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సగం కన్నా ఎక్కువ కాలిపోయి ఉన్న డెడ్‌బాడీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. నందిని, వెట్రిమారన్ మధురైలోని ఒకే ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్నారని పోలీసులు తెలిపారు. ఎనిమిది నెలల క్రితమే వీరిద్దరూ ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారని, ప్రేమించుకుంటున్నారని వెల్లడించారు. కాగా, నందినిపై అనుమానంతోనే వెట్రిమారన్ ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించారు. ఈ కేసులో వెట్రిమారన్‌ను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్టు తెలిపారు. అయితే, ఈ హత్యలో ఓ ట్రాన్స్‌జెండర్ పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ, మరో ట్విస్ట్ ఏంటంటే.. వెట్రిమారన్ అలియాస్ పాండి మహేశ్వరి గత ఆరు నెలల క్రితమే అబ్బాయిగా మారడం గమనార్హం. మహేశ్వరి.. వెట్రిమారన్‌గా అబ్బాయిగా పేరు మార్చుకున్నాడు. దీంతో, కొద్దిరోజులుగా వెట్రిమారన్‌ను నందిని దూరం పెడుతుండటంతోనే ఆమెను హత్య చేసినట్టు సమాచారం. Deceased woman Nandhini and accused Pandi Maheshwari alias Vetrimaran. pic.twitter.com/fSaJBPoRWV — A Selvaraj (@Crime_Selvaraj) December 24, 2023 -
ఏడు నెలల గర్భిణి..పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రేయసి..అడవిలోకి తీసుకెళ్లి
నాగర్‌కర్నూల్: పెళ్లి చేసుకోమని ప్రియురాలు గట్టిగా అడుగుతుండటంతో శ్రీశైలంలో చేసుకుందామంటూ నల్లమల అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసిన ఓ కిరాతకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాలిలా.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గొరిటకు చెందిన లక్ష్మి అలియాస్ రత్నమ్మ(34) మూడేళ్ల క్రితం భర్తతో గొడవ పడి దూరంగా ఉంటూ.. కూలి పనులకు వెళ్లే క్రమంలో అదే గ్రామానికి చెందిన లింగన్ చెన్నయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా, చెన్నయ్యకు మరో యువతితో వివాహం కాగా.. లక్ష్మి గొడవపడి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో రూ.లక్ష జరిమానా చెల్లించాడు. గతేడాది చెన్నయ్య భార్య గర్భిణిగా ఉండడంతో మళ్లీ లక్ష్మికి దగ్గరయ్యాడు. ప్రస్తుతం లక్ష్మి కూడా 7 నెలల గర్భిణి. ఈ సమయంలో తననూ పెళ్లి చేసుకోవాలని, తన పేరిట 2 ఎకరాల భూమి రాసివ్వాలని లేకపోతే గ్రామానికి వచ్చి గొడవ చేస్తానని చెన్నయ్యపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఎలాగైనా ఆమెను అంతమొందించాలని చెన్నయ్య పథకం వేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే.. శ్రీశైలంలో పెళ్లి చేసుకుందామని నమ్మించి ఫిబ్రవరి 28న జడ్చర్ల నుంచి తన బైక్‌పై లక్ష్మిని తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఫర్హాబాద్– మన్ననూర్ మధ్యలో తాళ్ల చెరువు వద్ద నల్లమల అడవిలోకి వెళ్లారు. అక్కడ కర్రతో ఆమె తలపై బాది గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం బైక్‌లో ఉన్న పెట్రోల్ తీసి మృతదేహంపై చల్లి కాల్చివేశాడు. ఈ క్రమంలో తన కూతురు కనిపించడం లేదంటూ చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేస్తూ హతురాలి తల్లి చెన్నమ్మ మార్చి 25న జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న చెన్నయ్యను సోమవారం స్థానిక నిమ్మబాయిగడ్డ వద్ద పోలీసులు పట్టుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు చెన్నయ్యపై గతంలో తిమ్మాజిపేట పోలీస్‌స్టేషన్‌లో ఓ ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసు కూడా నమోదైందని, .మూడేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించాడని సీఐ తెలిపారు. చదవండి: బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ.. భర్త, ఆడపడచుతో గొడవ.. బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పి... -
పాత ప్రియుడితో కలిసి మహిళ ఘాతుకం.. అనుమానంతో వేధిస్తున్నాడని
సాక్షి, నాగర్‌కర్నూల్: తాగి వేధిస్తున్న ప్రియుడిని మరో ప్రియుడితో కలిసి మహిళ హత్య చేసిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వట్టెం గ్రామానికి చెందిన కృష్ణమ్మకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకే ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు వలస వెళ్లింది. అక్కడే ఉంటున్న రవికుమార్ (38)తో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో వారు ఐదేళ్ల క్రితం అక్కడి నుంచి వచ్చి వట్టెంలో సహజీవనం చేస్తున్నారు. కాగా, కృష్ణమ్మకు గతంలో జడ్చర్లకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. దీంతో వీరిద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానంతో రవి రోజూ తాగి వచ్చి ఆమెను వేధించేవాడు. ఆ వేధింపులు తీవ్రం కావడంతో తట్టుకోలేక మాజీ ప్రియుడు శ్రీనివాస్‌కు విషయం చెప్పింది. వారిద్దరూ కలిసి ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిద్రలో ఉన్న రవికుమార్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ హన్మంత, ఎస్ఐ కృష్ణా ఓబుల్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వెంటనే విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు చెప్పారు. -
మరో వ్యక్తితో లవర్‌కు పెళ్లి ఫిక్స్.. ప్రియుడు ఏం చేశాడంటే..
ప్రేమ పేరుతో యువతులపై దాడులు మరింతగా పెరుగుతున్నాయి. వారి ప్రేమను అంగీకరించకపోవడంతో కొందరు ప్రేమికులు క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రియుడి దాడిలో గాయపడిన యువతి మృతిచెందగా.. అతడు ఆసుప్రతిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. వివరాల ప్రకారం.. కర్నాటకలోని దావణగెరెలో పట్టపగలే ఓ వ్యక్తి.. యువతిపై కత్తితో దాడి చేశాడు. కాగా, అదే ప్రాంతానికి చెందిన సుల్తానా అనే యువతిని కొంత కాలంగా సాదత్ అలియాస్ చాంద్పీర్ అనే యువకుడు ఫాల్ చేస్తున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నా అంటూ వెంటపడ్డాడు. అంతటితో ఆగకుండా.. పెళ్లి చేసుకుంటానని కూడా వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో సాదత్.. ఆమె ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకుంటానని కోరాడు. కానీ, దీన్ని ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇంకోసారి తమ కూతురు వెంటపడితే పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యే సుల్తానాకు ఆమె పేరెంట్స్ మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో, ఆగ్రహానికి లోనైన సాదత్.. ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే గురువారం ఓ షాపు వద్ద ఉన్న సుల్తానా దగ్గరకు వెళ్లిన సాదత్.. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించి తనతో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం, బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు సుల్తానాను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తర్వాత.. సాదత్ కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించడంతో చికిత్సలో భాగంగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ಪ್ರೀತಿ ನಿರಾಕರಿಸಿದ ಯುವತಿ - ನಡು ರಸ್ತೆಯಲ್ಲೇ ಕೊಂದ ಪಾಗಲ್ ಪ್ರೇಮಿ https://t.co/qCFZISKAU5 #Davanagere #Police #Crime #Love #YoungWomen — PublicTV (@publictvnews) December 22, 2022 -
నలుగురు పిల్లలున్న వ్యక్తితో వివాహిత లవ్ ట్రాక్.. చివరకు భలే ట్విస్ట్
తిరువణ్ణామలై (వేలూరు): వివాహేతర సంబంధాలు పచ్చిన కాపురంలో చిచ్చురేపుతున్నాయి. చిన్న చిన్న కోరికలు, ఆనందాల కోసం తప్పటడుగులు వేస్తున్న వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. నలుగురు పిల్లలున్న వ్యక్తితో వివాహిత వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాల ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా కనకూరు పంచాయతీ కేకే నగర్ గ్రామానికి చెందిన తంగరాజ్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య ఉమ. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడున్నారు. చెన్నై మాంగాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య నిత్య(30). వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఇదిలా ఉండగా తంగరాజ్కు నిత్యతో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. తర్వాత తంగరాజ్ పని నిమిత్తం చెన్నై వెళ్లే సమయంలో నిత్యను కలిసి మాట్లాడి వచ్చేవాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న నిత్య భర్త పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. దీంతో మూడురోజుల క్రితం నిత్య ఇద్దరు కుమార్తెలు, భర్తను వదిలి పెట్టి తిరువణ్ణామలైలోని తంగరాజ్ ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకున్న తంగరాజ్ భార్య భర్తతో పాటు నిత్యను ఇంటిలో చేర్చకుండా బయటకు పంపించి వేసింది. దీంతో తంగరాజ్ నిత్య వద్ద చర్చించి చెన్నైకి పంపేందుకు యతి్నంచాడు. ఇందుకు నిత్య నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈక్రమంలో తంగరాజ్ నిత్య కట్టుకున్న చీరను ఆమె గొంతుకు బిగించి హత్య చేశాడు. స్థానికులు స్థానికులు గుర్తించి కొండ ప్రాంతానికి వెళ్లగా.. తంగరాజ్ అక్కడ నుంచి పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న తిరువణ్ణామలై పోలీసులు నిత్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
మాదాపూర్: ప్రేయసిపైనే అత్యాచారం.. ఆపై దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపైనే అత్యాచారం చేసి.. ఆమె ప్రాణం తీశాడో ప్రియుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాలుప్రసాద్ అనే యువకుడు హైటెక్‌సిటీ ఔట్‌పోస్ట్ వద్ద తన ప్రేయసిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితున్ని సీసీటీవీ కెమెరాల ఆధారం పట్టుకొని అరెస్ట్ చేశారు. తనతో కాకుండా నరేష్ అనే యువకునితో సన్నిహితంగా ఉంటుందనే అక్కసుతోనే తను ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు పోలీసులు ముందు లాలుప్రసాద్ ఒప్పుకున్నాడు. -
ప్రియురాలి ఘాతుకం
చెడు వ్యవసనాలకు బానిసైన ఓ వ్యక్తి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. బతుకు దారిలో వక్ర మార్గాన్ని ఎంచుకున్న మహిళ విచ్చలవిడితనం ఆమె జీవితాన్ని అధఃపాతాళంలోకి నెట్టేసింది. తోటి ఉద్యోగిపై అసూయతో రగిలిన ఓ కార్మికుడి భవిష్యత్ చీకటిమయంగా మారిపోయింది. ఇలా అడ్డదారుల్లో పెనవేసుకున్న బంధాలన్నీ విచ్చిన్నమై వారిపై ఆధారపడిన కుటుంబాలను రోడ్డున పడేశాయి. తాడేపల్లి కొత్తూరులో ఓ ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని హతమార్చిన ఓ మహిళ ఉదంతం బుధవారం బట్టబయలైంది. రాజధాని ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కొత్తూరు (తాడేపల్లి రూరల్): రాజధాని ప్రాంతమైన తాడేపల్లి కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రియురాలు ప్రియుడిని మరో ప్రియుడితో కలిసి హత్య చేసింది. మృతదేహాన్ని నెల రోజులపాటు నివాసాల మధ్య సెప్టిక్ ట్యాంక్‌లో దాచింది. మృతుడి బంధువులు మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు బుధవారం తాడేపల్లిలో మృతదేహాన్ని వెలికితీశారు. విజయవాడ పటమట సీఐ కె.దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దామవరపు మండలం రామకృష్ణాపురానికి చెందిన మార్కండి రాజయ్య (35) కుటుంబ పోషణ నిమిత్తం పదేళ్ల క్రితం విజయవాడకు వలస వచ్చాడు. విజయవాడలోని లిక్కర్ డిపోలో ముఠా కార్మికుడిగా పని చేస్తూ స్థిరపడ్డాడు. ఇదే కంపెనీలో మంచిర్యాల జిల్లా బెల్లంకొండకు చెందిన సుధాకర్ కూడా ముఠా పనికి చేరాడు. వీరిద్దరికీ తాడేపల్లికి చెందిన చిక్కల కమలగాయత్రి ముఠా పని వద్ద పగిలిపోయిన సీసా పెంకులు ఏరుకొనే పని చేస్తూ పరిచయమైంది. అవివాహితురాలైన కమలగాయత్రి సుధాకర్‌తో సహజీవనం చేసింది. తర్వాత రాజయ్యనూ పరిచయం చేసుకుని ఒకరికి తెలియకుండా మరొకరితో సహ జీవనం కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. రాజయ్య, సుధాకర్ ఓ సారి విజయవాడ ఆటోనగర్‌లో గాయత్రి విషయంలో ఘర్షణకు దిగారు. ఆ క్రమంలో ఆమె అక్కడ పని మానేసి తాడేపల్లిలోని అపార్ట్మెంట్లలో పని చేస్తూ జీవించసాగింది. డ్రైవర్ పోస్టు విషయమై పన్నాగం.. లిక్కర్ డిపో మేనేజర్.. రాజయ్యను నమ్మి పర్సనల్ డ్రైవర్‌గా నియమించుకున్నాడు. అనంతరం మేనేజర్ బదిలీ అయ్యాడు. ఆ స్థానంలో వచ్చిన మరో డిపో మేనేజర్.. సుధాకర్‌ను డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. మరో నెలలో పాత డిపో మేనేజర్ రానుండడం, రాజయ్యను డ్రైవర్‌గా పెట్టుకుంటాడని అనుమానంతో కమలగాయత్రి వద్దకు అక్టోబర్ 24న సుధాకర్ వచ్చి రాజయ్యను హతమార్చేందుకు పథకం పన్నారు. కమలగాయత్రి రాజయ్యను గత నెల 29న ఇంటికి పిలిచింది. అనంతరం సుధాకర్, కమలగాయత్రి కలసి రాజయ్య కళ్లలో కారం కొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి, రోకలి బండతో మోది కిరాతకంగా చంపి, దూలానికి ఉరి వేశారు. మృతదేహాన్ని పాత సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చేశారు. రాజయ్య కనిపించలేదని భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సుధాకర్‌ను, కమలగాయత్రిని విచారించగా వారు నోరు మెదపలేదు. పోలీసులు ఫోన్‌కాల్స్ రికార్డుల ద్వారా పునఃవిచారణ నిమిత్తం గాయత్రి ఇంటికి వెళ్లారు. ఆమె నాలుగేళ్ల కుమారుడు నిఖిల్‌తో పోలీసులు మాట్లాడగా ‘మా అమ్మ, మరో వ్యక్తి కలసి రోకలితో ఓ వ్యక్తిని కొట్టి చంపేశార’ని రోకలిని పోలీసులకు చూపాడు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కూపీ లాగారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దామోదర్ తెలిపారు. రాజయ్యకు భార్య సుజాతతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుధాకర్ పరారీలో ఉన్నాడు. కంటికి కనిపించినంత దూరంలో అమ్మ..పిలిచినా పలక లేదు. అమ్మా అమ్మా అంటూ బిగ్గరగా ఏడ్చాడు. అయితే ఆ పసిమొగ్గ వేదన అరణ్యరోదనగా మారింది. నిందితురాలిని పోలీసులు తీసుకెళుతుండగా కొడుకు ఇలా జీవం లేని కళ్లతో బేలగా చూస్తుండిపోయాడు. తల్లికి ఏమైందో అర్థంగాక, ఎక్కడికి తీసుకెళుతున్నారో తెలియక, తండ్రి అనే మాట ఏనాడూ నోట రాక ఆ చిన్నోడు దిక్కులేని వాడయ్యాడు. -
ప్రియుడే కాలయముడు
తిరుత్తణి: ఆరు సవర్ల నగల కోసం మహిళను హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెలుగుచూసింది. తిరుత్తణి తాలూకా తిరువాలాంగాడు లక్ష్మీవిలాసపురం గ్రామం సమీపంలో తల నరికిన స్థితిలో మహిళ మొండెంను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అనంతరం గాలింపు చేపట్టి అదే ప్రాంతంలోని చెరువు కట్ట వద్ద తలను గుర్తించారు. కేసును ఛేదించేందుకు తిరుత్తణి డీఎస్పీ బాలచంద్రన్ ఆధ్వర్యంలో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. హత్యకు గురైన మహిళ చెన్నై అంబత్తూరు సమీపం పట్రవాక్కంకు చెందిన రేవతి(42)గా తెలిసింది. ఈమె పదేళ్ల కిందట భర్త రామచంద్రన్ విడిపోయి తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఇలాఉండగా తిరువళ్లూరు సమీపం వేపంపట్టుకు చెందిన మారియప్పన్(37) పట్రవాక్కంలో రేవతి ఇంటికి ఎదురుగా కిరాణా దుకాణం నడిపేవాడు. ఈ క్రమంలో రేవతి, మారియప్పన్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 10న రేవతి, మారి బైక్‌పై వాలాజాలోని ధన్వంతరి ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తా ను వ్యాపారంలో నష్టపోయానని ఆదుకోవాలని మారి రేవతిని కోరాడు. అతనికి సహాయపడేందుకు రేవతి సిద్ధంగా లేకపోవడంతో ఆగ్రహించిన మారి కత్తితో ఆమె తల నరికి మెడలో ఉన్న ఆరుసవర్ల నగలు తీసుకుని తలను అక్కడి సమీపంలోని చెరువుకట్ట ప్రాంతంలో వేసి పరారయ్యాడు. నగల కోసం హత్య చేసినట్టు మారి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. -
ప్రియుడి పుట్టిన రోజుకు వెళ్లి.. తెల్లవారే సరికి
బొమ్మనహళ్లి (బెంగళూరు): ప్రియుడి పుట్టిన రోజుకు వెళ్లిన ప్రియురాలు తెల్లవారె సరికి విగతజీవిగా మారింది. ఈ ఘటన ఆదివారం ఉదయం నగరంలోని కాడుగోడిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. సునంద (19), సైద్రా అనే యువతీయువకులు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం వారి పెద్దలకు తెలియడంతో వివాహానికి అంగీకరించారు. ఈ క్రమంలో సైద్రా శనివారం కొడిగేహళ్లిలోని తన అక్క, బావ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలను జరుపు కున్నాడు. ఈ వేడుకులకు సునంద కూడా హాజరైంది. వేడుకల అనంతరం సైద్రా అక్క, బావలు వెళ్లిపోగా ప్రియుడు, ప్రియురాలు ఇంట్లోనే ఉండిపోయారు. అదే రోజు రాత్రి ఎదో చిన్న విషయంలో ఇద్దరు గోడవ పడ్డారు. ఈవిషయాన్ని సునంద తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆదివారం ఉదయానికి సునంద ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. అయితే సైద్రానే తన కుమార్తెను హత్య చేసినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా సైద్రా పరారీలో ఉన్నట్లు తెలిసింది.