ప్రియుడి పుట్టిన రోజుకు వెళ్లి.. తెల్లవారే సరికి
Published Mon, Jul 4 2016 7:11 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM
బొమ్మనహళ్లి (బెంగళూరు): ప్రియుడి పుట్టిన రోజుకు వెళ్లిన ప్రియురాలు తెల్లవారె సరికి విగతజీవిగా మారింది. ఈ ఘటన ఆదివారం ఉదయం నగరంలోని కాడుగోడిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. సునంద (19), సైద్రా అనే యువతీయువకులు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం వారి పెద్దలకు తెలియడంతో వివాహానికి అంగీకరించారు.
ఈ క్రమంలో సైద్రా శనివారం కొడిగేహళ్లిలోని తన అక్క, బావ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలను జరుపు కున్నాడు. ఈ వేడుకులకు సునంద కూడా హాజరైంది. వేడుకల అనంతరం సైద్రా అక్క, బావలు వెళ్లిపోగా ప్రియుడు, ప్రియురాలు ఇంట్లోనే ఉండిపోయారు. అదే రోజు రాత్రి ఎదో చిన్న విషయంలో ఇద్దరు గోడవ పడ్డారు. ఈవిషయాన్ని సునంద తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆదివారం ఉదయానికి సునంద ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. అయితే సైద్రానే తన కుమార్తెను హత్య చేసినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా సైద్రా పరారీలో ఉన్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement