
చికాగో : అమెరికాలోని చికాగోలో ఆదివారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక విందు వేడుకలో భాగంగా యువకుల మద్య జరిగిన వివాదం కాల్పులకు దారి తీయడంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..చికాగోలో కొందరు యువకులు ఒక ఇంట్లో విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వివాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కాల్పులు చోటుచేసుకున్నట్లు ప్యాట్రోల్ చీఫ్ ఫ్రెడ్ వాలర్ పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో 13 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 12.30 గంటలకు చోటుచేసుకుందని, బాధితులంతా 16 నుంచి 48 మధ్య వయస్సు వారేనని పేర్కొన్నారు. కాగా, తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఫ్రెడ్ వాలర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment