అమెరికాలో కాల్పులు: వేర్వేరు చోట్ల 12 మంది మృతి | Man Open Gun Firing At His Friend Birthday Party In America | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు: వేర్వేరు చోట్ల 12 మంది మృతి

Published Mon, May 10 2021 8:48 AM | Last Updated on Mon, May 10 2021 11:36 AM

Man Open Gun Firing At His Friend Birthday Party In America - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి  కాల్పులు మోత మోగింది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. స్థానికంగా ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడో పార్క్‌లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ  చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఆ కుటుంబంలోని ఓ మహిళకు నిందితుడు స్నేహితుడని పోలీసులు గుర్తించారు. వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా  గన్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం తనను తాను కాల్చుకొని మృతి చెందినట్లు తెలిపారు.

అదేవిధంగా ఉడ్‌ల్యాండ్‌లో ఓ దుండగుడు ఇరుగుపొరుగువారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత నిందితుడు కాల్పులు జరిగిన ఓ ఇంటికి నిప్పంటించినట్లు పేర్కొన్నారు. దీంతో స్థానికులు ఆ దుండగుడిపై ఎదురుకాల్పులు జరపడంతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. 
చదవండి: ‘ఈ వేరియంట్‌ వల్లే భారత్‌లో కరోనా కల్లోలం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement