shoot gun
-
యాభై ఏళ్ల తర్వాత.. ప్రభుత్వ లాంఛనాలతో క్వీన్‌కు అంత్యక్రియలు
లండన్: బ్రిటన్‌లో దాదాపు అర్థ శతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలను రాజరిక సంప్రదాయంలో కాకుండా.. ప్రభుత్వా లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1965లో మాజీ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ ఈ గౌరవాన్ని పొందిన చివరి నేత. సుదీర్ఘకాలం రాణిగా పనిచేసిన క్వీన్ ఎలిజబెత్-2 గురువారం బాల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఐతే ఆమెకు ప్రిన్స్ ఫిలిఫ్‌లా.. రాజరిక అంత్యక్రియలు కాకుండా ప్రభుత్వ లాంఛనలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు సైనిక ఊరేగింపులో నేవికి చెందిన నావికులు గన్క్యారేజీపై క్వీన్ ఎలిజబెత్ మృతదేహాన్ని తీసుకువెళ్లడంతో అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వెస్ట్మిన్స్టర్ అబ్బే లేదంటే సెయింట్ పాల్స్ కేథడ్రల్ వరకు ఊరేగింపు జరుగుతుంది. ప్రజలు సందర్శనార్ధం రాణి భౌతికదేహాన్ని ఉంచుతారు. అంత్యక్రియలకు దాదాపు నాలుగు రోజులు ముందు వరకు ఆమె భౌతిక దేహం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంటుంది. ఆ తదనంతరం దేశాధినేతలకు 21 తుపాకుల గౌరవ వందనం ఇస్తారు. ఐతే బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 జ్ఞాపకార్థం డెత్ గన్‌సెల్యూట్ సందర్భంగా శుక్రవారం యునైటెడ్ కింగ్డమ్ నలుమూలల్లో ఫిరంగా కాల్పలు నిర్వహించారు బ్రిటన్ అధికారులు. ఇలా ప్రతి ఏడాది 96 రౌండ్ల గన్ షాట్లతో క్విన్ ఎలిజబెత్‌కి గౌరవ వందనం ఇవ్వాలని బ్రిటన్ అధికారలు నిర్ణయించారు. ఈ మేరకు స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ కోట, నార్తర్న్ ఐర్లాండ్‌లోని హిల్స్‌బరో కోట, వేల్స్‌లోని కార్డిఫ్ కోట నుంచి కాల్పులు నిర్వహించారు. (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం సెప్టెంబర్ 11న సంతాపదినంగా ప్రకటించిన భారత్) -
దుండగులపై పోలీసు కాల్పులు
గంగావతి: ఇద్దరు దోపిడీ దొంగలు తప్పించుకుని పారిపోతుండగా ఓ పోలీసు కానిస్టేబుల్ తుపాకీతో కాల్చడంతో గాయపడిన ఘటన శుక్రవారం తాలూకాలోని ముస్టూరు గ్రామ సమీపంలో జరిగింది. కొప్పళ జిల్లా ఎస్పీ అరుణ్గిరి కథనం మేరకు ఈనెల 16న బెంగళూరులో ఓ పందుల ఫారంలో ఇద్దరు దుండగులు దోపిడీకి పాల్పడగా, ఫారం యజమాని రామకృష్ణ వారికి అడ్డుపడ్డారు. ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి ఉడాయించారు. దుండగులు గంగావతి తాలూకాలో సంచరిస్తున్నట్లు తెలియడంతో చిక్కజాల ఎస్ఐ ప్రవీణ్ నేతృత్వంలోని పోలీసు బృందం గంగావతికి చేరుకుంది. దుండగులు ప్రైవేట్ వాహనంలో వెళ్తుండగా వెంబడించి ముస్టూరు సమీపంలో అటకాయించారు. అయితే దుండగులు పోలీసులపై తిరగబడి పరారవ్వడానికి ప్రయత్నించగా కానిస్టేబుల్ బసవరాజ్ వారిపై తుపాకీతో కాల్పులు జరిపారు. శంకర్ సింధనూరు, అశోక్ బెళహట్టిల కాళ్లకు తూటాలు తగిలి తీవ్రంగా గాయపడగా గంగావతి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆస్పత్రి వద్ద డీఎస్పీ రుద్రేశ్ ఉజ్జినకొప్ప గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అమెరికాలో కాల్పులు: వేర్వేరు చోట్ల 12 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు మోత మోగింది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. స్థానికంగా ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడో పార్క్‌లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఆ కుటుంబంలోని ఓ మహిళకు నిందితుడు స్నేహితుడని పోలీసులు గుర్తించారు. వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా గన్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం తనను తాను కాల్చుకొని మృతి చెందినట్లు తెలిపారు. అదేవిధంగా ఉడ్‌ల్యాండ్‌లో ఓ దుండగుడు ఇరుగుపొరుగువారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత నిందితుడు కాల్పులు జరిగిన ఓ ఇంటికి నిప్పంటించినట్లు పేర్కొన్నారు. దీంతో స్థానికులు ఆ దుండగుడిపై ఎదురుకాల్పులు జరపడంతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ‘ఈ వేరియంట్ వల్లే భారత్‌లో కరోనా కల్లోలం’ -
పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్
-
పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్: రెండు ప్రాణాలు బలి
న్యూఢిల్లీ: పెరోల్ మీద విడుదల అయిన ఓ రౌడీ షీటర్ కాల్పులకు పాల్పడ్డాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే తన భార్యతో పాటు మరొకరిని దారుణంగా తుపాకీతో కాల్చి హత్య చేశాడు.ఈ ఘటనలో ఓ నిండు గర్భిణి, యువకుడు మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని దక్షిణ నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన డ్రగ్ డీలర్ షరాఫత్ షేక జైలుకు వెళ్లాడు. మూడు రోజుల కిందట పెరోల్‌పై విడుదల అయ్యాడు. వచ్చి రాగానే తన భార్య ఎక్కడుందో ఆచూకీ తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్లాడు ఈ క్రమంలో మంగళవారం భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు షెరాఫత్. బయట కూర్చున్న భార్య షైనాతో కొద్దిసేపు మాట్లాడి ఆ వెంటనే తనతో తెచ్చుకున్న తుపాకీతో మొదట కాల్చాడు. అయితే పక్కన ఉన్న ఆమె సహాయకుడు వెంటనే షఫత్‌ను నిలువరించే ప్రయత్నం చేశాడు. దీంతో షఫత్ అతడిపై కూడా కాల్పులు జరిపాడు. అనంతరం భార్యపై మళ్లీ నాలుగు, ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆమె చనిపోయేదాక తుపాకీతో పేలుస్తూనే ఉన్నాడు. అడ్డుకోబోయిన వారిని తుపాకీతో బెదిరించాడు. తుపాకీ తూటాలకు బలయిన భార్య షైనా నిండు గర్భిణి. ఇంత కర్కషంగా.. విచక్షణా రహితంగా గర్భిణి అయిన తన భార్యను హతమార్చడం కలకలం రేపింది. అయితే కాపాడేందుకు వచ్చిన వారంతా ప్రాణభయంతో వెనక్కి తిరిగారు. వారిద్దరినీ కాల్చిన అనంతరం దర్జాగా అతడు వెళ్లిపోయాడు. ఇదంతా ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమరాలో రికార్డయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: మే 2 తర్వాతనే కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం? చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ -
తుపాకీ పేల్చిన మాజీ నక్సలైట్
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోసానిపేట గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ శిలాసాగర్ తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీని దుర్వినియోగం చేసినందుకు కేసు నమోదైంది. ఎస్పీ శ్వేత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాజీ నక్సలైట్ అయిన శిలాసాగర్ లైసెన్స్డ్ తుపాకీ కలిగి ఉన్నాడు. ఆయనకు కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయి. ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కుటుంబ సభ్యులను బెదిరించడం కోసం తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీని బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ విషయమై శిలాసాగర్ కూతురు శ్రీలేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. బెదిరించడమే గాకుండా ఆయుధ లైసెన్సును దురి్వనియోగం చేయడం కూడా నేరమన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (విశాఖలో మావోయిస్టు కీలక నేతల అరెస్ట్)