
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోసానిపేట గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ శిలాసాగర్ తన దగ్గర ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీని దుర్వినియోగం చేసినందుకు కేసు నమోదైంది. ఎస్పీ శ్వేత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాజీ నక్సలైట్ అయిన శిలాసాగర్ లైసెన్స్‌డ్ తుపాకీ కలిగి ఉన్నాడు. ఆయనకు కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయి. ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కుటుంబ సభ్యులను బెదిరించడం కోసం తన దగ్గర ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీని బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ విషయమై శిలాసాగర్ కూతురు శ్రీలేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. బెదిరించడమే గాకుండా ఆయుధ లైసెన్సును దురి్వనియోగం చేయడం కూడా నేరమన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (విశాఖలో మావోయిస్టు కీలక నేతల అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment