ramareddy
-
వానరాల దాడిలో వృద్ధురాలి మృతి
రామారెడ్డి (ఎల్లారెడ్డి) : ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేయడంతో ఒక వృద్ధురాలు మృతి చెందింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చాతరబోయిన నర్సవ్వ (70) ఇంట్లో అన్నం గిన్నెలను శుభ్రం చేస్తుండగా.. సుమారు 20 వరకు కోతులు దాడి చేశాయి. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల మహిళలు భయంతో కోతులను తరిమే ప్రయత్నం చేయక ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. నర్సవ్వ ఛాతీ, వీపు, నడుముపై కోతులు తీవ్రంగా కరిచాయి. పెళ్లికని కామారెడ్డికి ఆమె కూతురు సుగుణ 20 నిమిషాల తర్వాత వచ్చి.. తల్లిని కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ నర్సవ్వ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కూతుళ్లుండగా, ఇద్దరి వివాహం జరిగింది. ప్రస్తుతం చిన్న కూతురితో కలిసి ఉంటోంది. నర్సవ్య అంత్యక్రియలను చిన్న కుమార్తె పూర్తి చేసింది. -
మహిళ ప్రాణాన్ని నిలిపిన పోలీసులు
సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్): కుటుంబంలో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా, గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం రామారెడ్డి మండల కేంద్రం శివారులోని పెద్దమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో గల చెట్టుకు ఓ మహిళ ఉరి వేసుకునేందుకు యత్నిస్తోంది. అటు వైపు వెళ్తున్న ప్రొబేషనరీ ఎస్సై ఆదిల్, కానిస్టేబుల్ సిద్దిరాములు గమనించి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళను కాపాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి గ్రామానికి చెందిన సులోచనగా ఆమెను గుర్తించారు. రామారెడ్డిలో ఉండే తన అన్న ఇంట్లో శుభకార్యం కోసం వచ్చానని, కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని ఆమె తెలిపారు. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన ప్రొబెషనరీ ఎస్సై.. కుటుంబ సభ్యులను పిలిపించి ఆమెను అప్పగించారు. చదవండి: పరిచయం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ ఇద్దరిని కాపాడిన పోలీసులు.. నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరి ప్రాణాలను కాపాడారు రామారెడ్డి పోలీసులు. కుటుంబ తగాదాలతో నాలుగు రోజుల క్రితం గిద్ద చెరువు కట్టపై ఆత్మహత్యకు యత్నించిన మహిళను గమనించి పోలీసులు కాపాడారు. తాజాగా చెట్టుకు ఉరి వేసుకునేందుకు యత్నిస్తున్న మహిళను కూడా సంరక్షించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. చివరి క్షణాల్లో రెండు నిండు ప్రాణాలను కాపాడిన రామారెడ్డి పోలీసులు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. -
ఒక్క సినిమాకే పది సినిమాల అనుభవం!
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ‘88’ రామారెడ్డి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 20) రామారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘మాది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని కొంకుదరు గ్రామం. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డిగారిది మా ఊరే. నా స్నేహితుడు, డిస్ట్రిబ్యూటర్ వినోద్ వల్ల సినిమాలపై నాకు ఆసక్తి పెరిగింది. ‘రాజా విక్రమార్క’ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో ఎన్ఐఏ (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) అధికారిగా నటించారు కార్తికేయ. ప్రేమ, వినోదం, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం కార్తికేయ హిట్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’ను మించిన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ‘రాజా విక్రమార్క్’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్టోబరులో మా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారికి నేను వీరాభిమానిని. ‘ఇంద్ర’ సినిమా చూసేందుకు సైకిల్‌పై మండపేట వెళ్లి, ఆ షోకు టిక్కెట్స్ దొరక్కపోతే నెక్ట్స్ షో వరకు వెయిట్ చేసి మరీ సినిమా చూశాను. ‘రాజావిక్రమార్క’ చిరంజీవిగారి సినిమా టైటిల్. కథ ప్రకారం కుదిరందని ఈ టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో చిరంజీవిగారి అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఉంది. ‘రాజా విక్రమార్క’ జర్నీలో కరోనా పరిస్థితుల వల్ల పది సినిమాలు తీసిన నిర్మాతగా అనుభవం వచ్చింది. నేను నిర్మించబోయే తర్వాతి రెండు సినిమాల వివరాలను త్వరలో వెల్లడిస్తాను. ఇక నా పేరు ‘88’ అని ఎందుకు పెట్టుకున్నానో ఓ నాలుగు సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత చెబుతాను’’ అని అన్నారు. -
తహసీల్దార్‌కు మాజీ నక్సలైట్ బెదిరింపు
సాక్షి, కామారెడ్డి : ఇతరులకు చెందిన భూమిని తన పేరిట పట్టా చేయాలని ఓ మాజీ నక్సలైట్ ఏకంగా తహసీల్దార్‌నే బెదిరించారు. పట్టా చేయకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డిలో చోటు చేసుకుంది. రామారెడ్డి మండల తహసీల్దార్ షర్ఫుద్దీన్‌పై గిద్ద గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ నర్సారెడ్డి బెదిరింపులకు దిగారు. ఇతరులకు చెందిన 6 ఎకరాల భూమిని తన పేరిట రికార్డు చేయాలని బెదిరించాడు. దీంతో భయానికి లోనైన తహసీల్దార్ షర్ఫుద్దీన్ రామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతరుల భూమిని పట్టా చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై కేసు కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇప్పించమని అడిగితే, తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎల్లారెడ్డి కాంగ్రెస్ మండల మాజీ మహిళ అధ్యక్షురాలు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒడ్డెపల్లి సుభాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కరోనా భయం వీడండి
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పొద్దున్న లేచింది మొదలు అర్ధరాత్రి వరకూ స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు.. ఇలా అనేక కార్యకలాపాల్లో నిత్యం తలమునకలైన వారందరూ పక్షం రోజులుగా కరోనా బంధనాల్లో చిక్కి ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలోకి జారిపోయారు. అప్పటి వరకూ రోజూ ఎంతో బిజీగా ఉన్న వారందరూ లాక్డౌన్ కారణంగా ఒక్కసారిగా ఇళ్లకే పరిమితమైపోయారు. కొంతమంది ఈ అవకాశాన్ని రకరకాల పనులు చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు. మరికొంతమంది ‘ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్’ (ఖాళీగా ఉన్న మెదడు దెయ్యాల కొంపవంటిది) అని అన్నట్టుగా.. ఊహించని ఈ ఆపత్కాలంలో కొంతమంది తమకు ఏదో అయిపోతుందని మానసిక ఆందోళనకు గురవుతున్నారు. యథాస్థితికి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులను ఊహించుకొని భయపడుతున్నారు. మందుబాబులు చుక్క దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలందరినీ కాపాడుకునే లక్ష్యంతో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో పలువిధాలుగా మానసిక సంఘర్షణలకు గురవుతున్న వారికోసం ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు కర్రి రామారెడ్డితో ‘సాక్షి’ ఆదివారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనలకు గురవుతున్న ప్రజలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేసి తమ సమస్యలు నివృత్తి చేసుకున్నారు. వాటిలో ముఖ్యమైన కొన్ని.. కృష్ణ, లూధర్‌గిరి, రాజమహేంద్రవరం : ఎవ్వరూ లేరు, ఒంటరిననే ఫీల్ వస్తోంది. వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్‌ని. కరోనా లాక్‌డౌన్‌తో దిక్కు తోచడం లేదు. అభద్రతా భావం పెరిగిపోయి భయాందోళనకు లోనవుతున్నాను. డాక్టర్ రామారెడ్డి : మొదట ‘నేను ఒంటరి’ అనే భావం వీడండి. మీ చుట్టూ ఎంతో ప్రపంచం ఉంది. ఇంట్లో ఎవ్వరూ ఉండరని చెబుతున్నారు కాబట్టి ఏదో పని పెట్టుకుని అందులో బిజీగా ఉండాలి. ఒత్తిడి తగ్గేందుకు యోగా చేయండి. వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్ కాబట్టి ఆ కోవలో ఉండే చిత్రలేఖనం వంటివి ఇంట్లోనే ప్రాక్టీస్ చేయండి. శరీర వ్యాయామానికి కొంత, జ్ఞానం పెంపొందించేందుకు కొంత, ఇంట్లో పనికి కొంత చొప్పున సమయం కేటాయించుకుంటే అసలు ఖాళీ అనేదే కనిపించదు. శ్రీనివాసరావు, రామచంద్రపురం : కరోనా వ్యాప్తి జరుగుతున్నప్పటి నుంచీ రోజులు చాలా భయంగా గడుస్తున్నాయి. ఏవో ఆలోచనలు. నిద్ర పోవడానికి చాలా సమయం పడుతోంది. వైరస్ నా చేతికి అంటుకుందేమో, నాకు వచ్చేసిందేమోననే భయం ఎక్కువైపోయింది. డాక్టర్ రామారెడ్డి : చీకట్లో భయపడుతూ వెళ్తే తాడు కూడా పాములానే కనిపిస్తుంది. మీ సమస్య అలాంటిదే. కరోనా గురించి భయపడనక్కర్లేదు. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఉదయం, సాయంత్రం సమయాల్లో నడక, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, అవి పూర్తయ్యాక స్నానం చేసి, పిల్లలతో సరదాగా గడపడం వంటివి చేయండి. శ్రీనివాసరెడ్డి, మాచవరం : టెన్షన్ ఎక్కువగా ఉంది. రాత్రుళ్లు కలలు ఎక్కువగా వస్తున్నాయి. బయటికి వెళ్లకపోవడంతో తెలియని ఏదో ఫీల్. డాక్టర్ రామారెడ్డి : మీరు ప్రాణాయామం చేయాలి. ఇందులో అనులోమ, వినులోమ ప్రక్రియలు ఉంటాయి. ఎడమ ముక్కుతో శ్వాస తీసుకుని, కుడి ముక్కుతో వదలడం, కుడి ముక్కుతో శ్వాస తీసుకుని ఎడమ ముక్కుతో వదలడం చేయాలి. దీంతో మెదడు బ్యాలన్స్‌లో ఉంటుంది. విపరీతమైన ఆలోచనలుంటే మందులు వాడాల్సి ఉంటుంది. అప్పటి వరకూ తాత్కాలిక ఉపశమనానికి దగ్గరలోని డాక్టర్‌ను సంప్రదించవచ్చు. రామకృష్ణ, అమలాపురం : ఇంట్లో ఉంటే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. దీనికి మందులేమైనా ఉంటాయా? డాక్టర్ రామారెడ్డి : ఒత్తిడితో శరీరంలో పలు మార్పులు చేసుకుంటాయి. ప్రాణాయామం, ధ్యానం చేయాలి. యూట్యూబ్‌లో దీనికి సంబంధించినవి లభిస్తాయి. ఒత్తిడి తగ్గడానికి మందులుంటాయి. వీటిని డాక్టర్ సలహా మేరకే వాడాలి. (ఫోన్లో మందులు సూచించారు) రాఘవాచారి, రాజమహేంద్రవరం : లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. నాకు పైల్స్ సమస్య ఉంది. ఇలా కూర్చోవడంతో సమస్య ఎక్కువైంది. ఏం చేయాలి? డాక్టర్ రామారెడ్డి : ఇంట్లో కూర్చుంటే పైల్స్ రావడానికి అవకాశం ఉంది. దగ్గరలోని జనరల్ సర్జన్, ఎంఎస్ దగ్గరకు వెళితే తగు పరీక్షలు చేసి సమస్య పరిష్కరిస్తారు. మందులతో కొన్ని, ఆపరేషన్‌తో కొన్ని పరిష్కారమవుతాయి. రామారావు, రాజమహేంద్రవరం : మా ఇంటి పక్కనే ఇద్దరు పెద్ద వయస్సు వాళ్లు ఉన్నారు. వారి పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. లాక్డౌన్ కారణంగా వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రాత్రుళ్లు నాకు ఫోన్ చేసి ఆందోళనకరంగా మాట్లాడుతున్నారు. వాళ్లను చూస్తే నాకు భయమేస్తోంది. డాక్టర్ రామారెడ్డి : మీ భయం కరెక్టే. పిల్లలు ఇంట్లో ఉండరు. ఒంటరిగా ఉంటున్నారు. ఈ సమయంలో అనేక ఆలోచనలు వారిని చుట్టుముడతాయి. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా రావచ్చు. దీనిని మీరు కనిపెట్టాలి. ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా సంగీతం వినడం, చిన్న పిల్లలతో ఆటలు ఆడించడం, బొమ్మలు వేయించడం వంటివి చేయాలి. మనవళ్లతోను, వారి పిల్లలతోను మాట్లాడిస్తూ ఉండాలి. పార్వతిదేవీ, మందపల్లి : లాక్డౌన్ కారణంగా మానసిక సమస్యకు వాడే మందులు ఆపేశాను. ఏం చేయాలి? డాక్టర్ రామారెడ్డి : లాక్డౌన్ కారణంగా ఆస్పత్రుల సేవలు ఆపిన మాట వాస్తవం. అయితే రోగులు ఆస్పత్రికి ఫోన్ చేసి సమస్యలు చెప్తే ఏం చేయాలో సూచిస్తారు. మీరు వాడే మందులు దగ్గరలోని మందుల దుకాణంలో ఉంటే తీసుకుని లాక్డౌన్ పూర్తయ్యే వరకూ వాడొచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు ఈవిధంగా చేయవచ్చు. లావణ్య, కాకినాడ : మా వారికి మందు అలవాటు ఉంది. అది దొరక్క నిద్ర పట్టడం లేదు. ఇంట్లో ఉంటున్నారే కానీ ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? డాక్టర్ రామారెడ్డి : మందు తాగడం అనేది ఒక్కసారిగా మానకూడదు. దానివల్ల పలు సమస్యలు తలెత్తుతాయి. లాక్డౌన్ కారణంగా మందు తాగడం ఆగిపోయింది. దీంతో వారికి నిద్రపట్టకపోవడం, ఆందోళనగా ఉండడం, విపరీతమైన షేకింగ్, భ్రమలకు లోనవడం వంటివి చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి వస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వారు దీనికి చికిత్సనందిస్తారు. శశికళ, బొమ్మూరు : గతంలో లేదు. ఇప్పుడో సమస్య వచ్చింది. ముఖం మీద దురద ఎక్కువగా వస్తోంది. చేతులతో ఎక్కువగా ముఖం మీద తాకవద్దంటున్నారు. కరోనా నాకు వచ్చేస్తుందోమోనని ఒక్కోసారి భయమేస్తోంది. ఏ జబ్బు గురించి విన్నా ఆ జబ్బు లక్షణాలు నాకే ఉన్నట్టు అనిపిస్తోంది. డాక్టర్ రామారెడ్డి : మీ సమస్యను హైపోకాండ్రియాసిస్ అంటారు. అప్పటి వరకూ ఏమీ ఉండదు. ఊరు వెళ్తూ మంచినీటి బాటిల్ మర్చిపోయారు. ఇక అదే ఆలోచనతో దాహం వేస్తూ ఉంటుంది. అదే బాటిల్ కూడా తీసుకువెళ్తే సాయంత్రం అయినా దాని పట్టించుకోరు. మీకు వచ్చిన సమస్య ఇలాంటిదే. చేతులు ముఖాన్ని తాకకూడదని చెప్పిన నాటి నుంచి మీకీ సమస్య ప్రారంభమైంది. ఆ భ్రమలోంచి బయటకు రండి. లక్ష్మణరావు, కోరుకొండ : దిక్కు తోచడం లేదు. ఇన్ని రోజులు పని లేకపోవడంతో రోజు భారంగా గడుస్తోంది. అనేక ఆలోచనలు మెదడులో తిరిగేస్తున్నాయి. డాక్టర్ రామారెడ్డి : ఏకంగా 21 రోజులు ఇంట్లోనే ఉండడం అనేది చాలా ఇబ్బందికర విషయమే. పని చేసేవారు ఖాళీగా కూర్చోవడం వలన ఏమీ తోచక మెదడు అనేక ఆలోచనలకు తావిస్తుంది. వాటి ద్వారా ఆందోళనలకు లోనవుతూంటాం. దీనిని అధిగమించడానికి యోగా, ప్రాణాయామం చేయాలి. ‘నేను చేసే పని ఎక్కడికీ పోలేదు. నాకు ఏ భయం లేదు. నేనొక్కడినే కాదు కదా ఇంట్లో ఉండేది. ప్రపంచ మొత్తం ఇలాగే ఉంది కదా’ అనే పాజిటివ్ ఆలోచనలు ఏర్పరచుకోవాలి. భయం వద్దు.. ధైర్యంగా ఉండండి రాజానగరం: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చేపట్టిన 14 రోజుల ఇంక్యుబేషన్ కాలం పూర్తి కావస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా క్వారంటైన్లలో ఉన్న మొదటి బ్యాచ్ వారికి టెస్టులు జరుగుతాయని స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు అన్నారు. దీనివలన పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఈ అంకెలను చూసి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతకు ఎన్నో రెట్లు నెగెటివ్ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలున్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి చేసిన టెస్టింగ్ ఫలితాలు ఆందోళనకరంగా లేవని, ఢిల్లీ నుంచి వచ్చిన వారి ట్రేసింగ్ పూర్తి కావచ్చిందని, పరిస్థితి అదుపు తప్పలేదని వివరించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపర్చుకుంటూ ఓర్పు, సహనంతో వ్యవహరించాలని సూచించారు. కరోనాపై అపోహలొద్దు : మాజీ ఎంపీ పండుల కాకినాడ రూరల్: కరోనా బారిన పడితే మనిషి మరణిస్తాడని తప్పుడు ప్రచారం జరుగుతోందని ఇటువంటి అపోహలు వద్దని... కరోనా బారిన పడినా కోలుకోవచ్చని అమలాపురం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నాయకుడు, డాక్టరు పండుల రవీంద్రబాబు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా ప్రకటనలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి లాక్డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారన్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు భౌతిక దూరం పాటిస్తే సరిపోతుందన్నారు. ఆపదవేళ పేదలకు ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. -
తుపాకీ పేల్చిన మాజీ నక్సలైట్
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోసానిపేట గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ శిలాసాగర్ తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీని దుర్వినియోగం చేసినందుకు కేసు నమోదైంది. ఎస్పీ శ్వేత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాజీ నక్సలైట్ అయిన శిలాసాగర్ లైసెన్స్డ్ తుపాకీ కలిగి ఉన్నాడు. ఆయనకు కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయి. ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కుటుంబ సభ్యులను బెదిరించడం కోసం తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీని బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ విషయమై శిలాసాగర్ కూతురు శ్రీలేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. బెదిరించడమే గాకుండా ఆయుధ లైసెన్సును దురి్వనియోగం చేయడం కూడా నేరమన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (విశాఖలో మావోయిస్టు కీలక నేతల అరెస్ట్) -
సెల్ఫీ సోకు.. ప్రాణం మీదకు తెచ్చుకోకు..
ఎక్కడ చూసినా, ఎవర్ని చూసినా సెల్ఫీ సెల్ఫీ. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు తిన్నా, పడుకున్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏడ్చినా సందర్భం ఉన్నా లేకున్నా సరే సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు నేటి జనం. ఎక్కడ ఉండి సెల్ఫీ దిగుతున్నామన్న ఆలోచన లేకుండా ఎక్కడ బడితే అక్కడ దిగేస్తున్నారు. లైకుల కోసం ఆరాట పడుతూ ప్రమాదకరమైన చోట్ల సెల్ఫీలు దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇలా ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్) : యువతలో ఇటీవల కాలంలో సెల్ఫీల మోజు విపరీతంగా పెరిగింది. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కొత్తగా కనిపించేందుకు, లైకుల కోసం సాహసాలు చేస్తూ ఫొటోలు దిగుతున్నారు. చెరువులు, వాగులు, నదులు, కొండ లు, గుట్టలు, రైళ్లు తదితర చోట్ల ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ప్రాణాపాయం కొనితెచ్చుకుంటున్నారు. విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటూ తమ కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న మోజు యువత రోజురోజుకీ సెల్ఫీల మోజులో పడి కొట్టుకుపోతోంది. కూర్చుంటే సెల్ఫీ. నిలబడితే సెల్ఫీ, హోటల్‌కు వెళ్లినా, ప్రయాణంలో ఉన్నా.. ఇలా ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇలా సెల్ఫీలు దిగి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల సమయం వృధా తప్ప భారీ నష్టంలేదు. కానీ కొందరయితే కొండలు, గుట్టలు, నదులు, నడుస్తున్న రైళ్లు, సాహస కృత్యాలు చేస్తూ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సెల్ఫీలు దిగుతున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు. ప్రాణం అంటే లెక్కలేనితనం వెనక్కి తగ్గితే పక్కన ఉన్నవారు వెక్కిరిస్తారేమోనన్న చిన్నతనంతో యువత ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. యువతలో సాహసం చేయాలనే తపన ఉండడం సహజం. అది అవసరమే అయినప్పటికీ, పది మందికి ఉపయోగపడేలా ఉండాలి. చావు బతుకుల్లో ఉన్న వారిని అపాయంలో ఉన్న వారిని రక్షించడానికి ప్రాణాలకు తెగించి సాహసాలు చెయవచ్చు. కానీ కేవలం ఒక ఫొటో కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవివేకం. సందర్భం ఏదైనా సెల్ఫీ గోలే.. నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ల రాకతో ఫొటోల గోల ఎక్కుపోతుంది. సందర్భంగా ఏదైనా సరే ఫొటో దిగాల్సిందే. వాట్సప్‌లో స్టేటస్ పెట్టాల్సిందే. ఇది ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అధికారుల వరకు నేడు సాగే ట్రెండ్. ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఎంత మంది అధికారులు, ఎంత మంది నాయకులు ఉంటారో అంతమంది ఒక ఫొటో దిగాల్సిందే. ఈ సెల్ఫీల గోల యువత నుంచి వయస్సు మళ్లిన వారికి పాకింది. దీంతో వారు కూడా సందర్భం ఏదైనా సెల్ఫీ మోజులో పడిపోతున్నారు. గతంలో జిల్లాలో ఓ యువకుడి మృతి భీమ్‌గల్ మండలం గోన్‌గొప్పులకు చెందిన ఇందపురపు దినేశ్(22) గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన కప్పల వాగు చెక్‌డ్యాం వద్ద సెల్ఫీ దిగుతూ నీటి పడిపోయాడు. నీటి ఉధృతిలో కొట్టుకుపోయాడు. గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించారు. వారు వచ్చి గాలింపు చర్యలు చేపట్టగా రెండు రోజుల అనంతరం మృతదేహం లభ్యమైంది. సెల్ఫీల మోజు బాగా పెరిగింది సాంకేతికతను పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. అతిగా సెల్‌ఫోన్ వినియోగంచడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక యువతకు సెల్ఫీ మోజు బాగా పెరిగింది. సెల్ఫీ మోజులో ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. – నిజాం, ప్రిన్సిపాల్, రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల తల్లిదండ్రులు నియంత్రించాలి అనవసరమైన వయస్సులో పిల్లలకు సెల్‌ఫోను ఇవ్వకూడదు. యువత ఫోన్లను విపరీతంగా వాడుతోంది. సరదా కోసం తీస్తున్న సెల్ఫీలు చివరకు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. –గోవర్ధన్‌రెడ్డి, హెచ్ఎం ఉప్పల్వాయి -
రామారెడ్డి రోడ్డుకు మహర్దశ
సదాశివనగర్(ఎల్లారెడ్డి):సదాశివనగర్ – రామారెడ్డి రోడ్డుకు మహర్దశ వచ్చింది. రూ. 13 కోట్లతో రోడ్డు పనులు చురుకుగా సాగుతున్నాయి. గతంలో ఈ సింగిల్ రోడ్డుగా ఉండగా ప్రస్తుతం డబుల్ బీటీ రోడ్డు వేస్తుండడంతో వేస్తుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సదాశివనగర్ నుంచి మాచారెడ్డి చౌరస్తాకు వెళ్లడానికి గతంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో సదాశివనగర్ నుంచి రామారెడ్డి వరకు బీటీ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. దీంతో పనులు చకాచకా కొనసాగుతున్నాయి. గతంలో అధికారుల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉండేది. ఈ రోడ్డు మీదుగా గుండా సదాశివనగర్ నుంచి రామారెడ్డి మీదుగా మాచారెడ్డి చౌరస్తా వరకు వెళ్లడానికి దారి సులువుగా ఉంటుంది. రామారెడ్డి మండలంలో గల ప్రధాన దేవాలయం శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకోవడానికి భక్తులకు ఈ రోడ్డు గుండానే వెళ్తుంటారు. రోడ్డు అధ్వానంగా ఉండడం వల్ల గతంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డుకు నిధులు మంజూరు కావడం, పనులు వేగంగా కొనసాగుతుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే మండలంలోని తిర్మన్‌పల్లి, మర్కల్ గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవడంతో పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు మండలంలోని మరిన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి ఎంఆర్ఆర్ గ్రాంట్ కింద నిధులు మంజూరవడంతో రోడ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో మండలంలోని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీటీ రోడ్లకు మరమ్మతులు సదాశివనగర్ మండలంలో ఎంఆర్ఆర్ గ్రాంట్ కింద జాతీయ రహదారి నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి వరకు రూ. 24 లక్షలు, గర్గుల్ నుంచి రంగంపేట్ వరకు రూ. 64 లక్షల 50 వేలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోకుల్‌తండాకు రూ. 47లక్షలు, రామారెడ్డి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గర్గుల్ నుంచి కన్నాపూర్‌కు రూ. 77లక్షలు, కన్నాపూర్ రోడ్డు నుంచి రెడ్డిపేట్ రోడ్డుకు రూ. 45లక్షలు, జాతీయ రహదారి నుంచి సదాశివనగర్ వరకు రూ. 36లక్షలు, జాతీయ రహదారి నుంచి మర్కల్–తిర్మన్‌పల్లి గ్రామం వరకు రూ. 22లక్షలు, జాతీయ రహదారి నుంచి కుప్రియాల్ వరకు రూ. 36 లక్షలతో మరమ్మతు పనులు చేపడుతున్నారు. అలాగే జాతీయ రహదారి నుంచి మోషంపూర్ వయా అడ్లూర్ ఎల్లారెడ్డి వరకు రూ. 66లక్షలు, అడ్లూర్ఎల్లారెడ్డి నుంచి అడ్లూర్‌కు రూ. 55లక్షలు, జాతీయ రహదారి నుంచి ధర్మారావ్‌పేట్ వరకు రూ. 47లక్షలు, జాతీయ రహదారి నుంచి మల్లుపేట్ వరకు రూ. 6లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రంగంపేట్ వయా పోసానిపేట్ వరకు రూ. 40లక్షలు, పద్మాజివాడి రోడ్డు నుంచి భూంపల్లి వయా లింగంపల్లి వరకు రూ. 26లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మోడెగాం వరకు రూ. 16లక్షల 50వేలు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా గ్రామాల్లో రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. -
బీసీ రాయ్ అవార్డు గ్రహీత రామారెడ్డికి సత్కారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) : బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డిని కలాం ఐఏఎస్ ఇ¯ŒSస్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.టేకి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే గొప్పగా ఎదగాలని కలలు కంటూ వాటి సాకారంకోసం నిత్యం శ్రమించాలన్నారు. సీసీసీ ఎండీ పంతం కొండలరావు మాట్లాడుతూ గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ డాక్టర్ రామారెడ్డి రాజమహేంద్రవరానికే గర్వకారణమన్నారు. డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ పదో తరగతి, ఇంటరీ్మడియట్ విద్యార్థులు విద్యాభివృద్ధికి, ఉద్యోగ సాధనకు లక్ష్యాలను ఏర్పర్చుకోవాలన్నారు. అనంతరం రెండుగంటల పాటు లైవ్ పవర్ పాయింట్ ప్రజెంటేష¯ŒS నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్‌సీఐ డైరెక్టర్ రజనీష్ రెడ్డి, విజ్ఞానభారతి రాష్ట్ర కన్వీనర్ కె.సుబ్బరాయశాస్త్రి, ఆదిరెడ్డి వాసు, రామ్‌గోపాల్‌రెడ్డి, జి.సూర్యకుమారి పాల్గొన్నారు. -
డాక్టర్ కర్రి రామారెడ్డికి ‘కీర్తి’ పురస్కారం
రాజమహేంద్రవరం రూరల్ : రాజమహేంద్రవరం ఖ్యాతిని డాక్టర్ కర్రి రామారెడ్డి జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీఠాధిపతి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ కొనియాడారు. సరస్వతీపుత్రునిగా, మానసిక వైద్యునిగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని ఖ్యాతి పొందారని చెప్పారు. తెలుగు వర్సిటీలో ఫిలాంత్రోపిక్ సొసైటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ కర్రి రామారెడ్డికి ప్రతిష్టాత్మక ‘కీర్తి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ముఖ్యఅతిథిగా సుధాకర్ మాట్లాడుతూ విద్యా రంగం నుంచి 24 డిగ్రీలు పొంది, మానసిక వైద్య రంగం, సామాజిక రంగాలలో డాక్టర్ రామారెడ్డి అందిస్తున్న సేవలను అభినందించారు. అంతర్జాతీయ దళిత క్రైస్తవ స్వేచ్ఛా హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బవిరి చక్రవర్తి మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా వైద్య రంగంలోనే కాకుండా సామాజిక రంగంలోనూ డాక్టర్ రామారెడ్డి విశేష సేవలందిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఫిలాంత్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు అద్దంకి రాజయోనా, మాజీ సర్పంచ్ మత్సేటి ప్రసాద్, జిల్లా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియ¯ŒS అధ్యక్షుడు కోరుకొండ చిరంజీవి, జిల్లా ఎస్సీ రైట్స్ ప్రొటెక్ష¯ŒS అధ్యక్షుడు తాళ్ళూరి రవిరాయల్, ఏపీ ట్రా¯Œ్సకో అసిస్టెంట్ ఇంజనీర్ విజయకుమార్, నన్నయ్య వర్సిటీ సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి.వి.ఎస్.మణిరమణ, మాజీ ఉప సర్పంచ్‌లు సోమన రాజేశ్వరి, దాకే శ్రీనివాసరావు, మానికిరెడ్డి ఫౌండేష¯ŒS అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, పెదపూడి మణి, అప్పా పరిమళకుమార్, రెవరెండ్ లివింగ్స్టన్, బి.మురళీధరరావు, బొత్స రామారావు తదితరులు పాల్గొన్నారు.