బీసీ రాయ్‌ అవార్డు గ్రహీత రామారెడ్డికి సత్కారం | ramareddy satkaram | Sakshi
Sakshi News home page

బీసీ రాయ్‌ అవార్డు గ్రహీత రామారెడ్డికి సత్కారం

Published Sat, Apr 8 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

ramareddy satkaram

కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) : 
బీసీ రాయ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ కర్రి రామారెడ్డిని కలాం ఐఏఎస్‌ ఇ¯ŒSస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎస్‌.టేకి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే గొప్పగా ఎదగాలని కలలు కంటూ వాటి సాకారంకోసం నిత్యం శ్రమించాలన్నారు. సీసీసీ ఎండీ పంతం కొండలరావు మాట్లాడుతూ గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ డాక్టర్‌ రామారెడ్డి రాజమహేంద్రవరానికే గర్వకారణమన్నారు. డాక్టర్‌ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ పదో తరగతి, ఇంటరీ్మడియట్‌ విద్యార్థులు విద్యాభివృద్ధికి,  ఉద్యోగ సాధనకు లక్ష్యాలను ఏర్పర్చుకోవాలన్నారు. అనంతరం రెండుగంటల పాటు లైవ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేష¯ŒS నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్‌సీఐ డైరెక్టర్‌ రజనీష్‌ రెడ్డి, విజ్ఞానభారతి రాష్ట్ర కన్వీనర్‌ కె.సుబ్బరాయశాస్త్రి, ఆదిరెడ్డి వాసు, రామ్‌గోపాల్‌రెడ్డి, జి.సూర్యకుమారి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement