
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కామారెడ్డి : ఇతరులకు చెందిన భూమిని తన పేరిట పట్టా చేయాలని ఓ మాజీ నక్సలైట్ ఏకంగా తహసీల్దార్‌నే బెదిరించారు. పట్టా చేయకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డిలో చోటు చేసుకుంది. రామారెడ్డి మండల తహసీల్దార్ షర్ఫుద్దీన్‌పై గిద్ద గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ నర్సారెడ్డి బెదిరింపులకు దిగారు. ఇతరులకు చెందిన 6 ఎకరాల భూమిని తన పేరిట రికార్డు చేయాలని బెదిరించాడు. దీంతో భయానికి లోనైన తహసీల్దార్ షర్ఫుద్దీన్ రామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతరుల భూమిని పట్టా చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై కేసు
కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇప్పించమని అడిగితే, తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎల్లారెడ్డి కాంగ్రెస్ మండల మాజీ మహిళ అధ్యక్షురాలు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒడ్డెపల్లి సుభాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment