Woman Talk About Divorce On TikTok, She Killed | Sania Khan - Sakshi
Sakshi News home page

వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చి హత్య.. ఆపై మాజీ భర్త ఆత్మహత్య

Aug 9 2022 6:46 PM | Updated on Aug 9 2022 7:42 PM

Women Said Divorce Marriage Failure On Tiktok She Killed - Sakshi

ఇటీల ఏం జరిగిన ప్రతి విషయాన్ని సోషల్‌ మాధ్యమ్యంలో షేర్‌ చేయడం ఒక అలవాటైపోయింది జనాలకు. ఇవి ఒక్కోసారి వారిని ఇబ్బందులకు గురి చేస్తాయనే స్ప్రుహ కూడా ఉండటం లేదు. అదీగాక వ్యూస్‌, ఫాలోవర్స్‌ మాయలో ఏ చేస్తున్నారో కూడా తెలియడం లేదు. వ్యక్తిగత విషయాలు గురించి చెప్పేటప్పుడూ కాస్త జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీతో ఉండే వ్యక్తులకు అలా చెప్పడం నచ్చుతుందో లేదో తెలియదు. అందువల్ల లేనిపోని సమస్యలు కూడా వస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక మహిళ సామాజిక మాధ్యమంలో తన వ్యక్తిగత విషయాలను చెప్పి.. విగత జీవిగా మారింది.

వివరాల్లోకెళ్తే...పాకిస్తానీ​ అమెరికన్‌ మహిళ సానియా ఖాన్ తన వ్యక్తిగత విషయానికి సంబంధించి వివాహం ఎందుకు విఫలమయ్యిందో, అందుకు దారితీసిని విషయాల గురించి సోషల్‌ మాధ్యమంలో షేర్‌ చేసింది. పైగా విడాకుల తీసుకున్న మహిళగా తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా వివరించింది. పైగా ఆమె మాజీ భర్త కుటుంబం నుంచి తనకు ఎదురైన  కూడా పంచుకుంది. అంతే ఇది నచ్చిన ఆమె మాజీ భర్త ఆమెను చంపేందుకు రెడీ అయిపోయాడు.

వాస్తవానికి సానియా ఖాన్ తన మాజీ భర్త రహెల్‌ అహ్మద్‌ ఇద్దరు ఐదేళ్లు  డేటింగ్‌ చేసి గతేడాది 2021లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారు ఇద్దరు చికాగోలో కొన్నాళ్లు కలిసి ఉన్నారు. ఏమైందో ఇద్దరిమధ్య విభేదాలు తలెత్తి కొద్దిరోజుల్లోనే విడిపోయారు. దీంతో ఆమె టేనస్సీకి వెళ్లిపోదాం అనుకుంది. ఐతే ఆమె టిక్‌టాక్‌, ఇన్‌స్ట్రాగ్రాంలో మంచి యాక్టివిగ్‌ ఉంటుంది. తనకు ఆనందం కలిగినా, బాధ కలిగినా ఆ విషయాలను సోషల్‌ మీడియాలోని నెటిజన్లతో షేర్‌ చేసుకోవడం అలవాటే. అలానే ఆమె టేనస్సీకి బయలుదేరే సమయంలో సోషల్‌ మీడియాలో ఈ విషయాల‍న్ని  వివరిస్తూ...పోస్ట్‌లు  పెట్టింది.

పైగా తనలాంటి వాళ్ల కోసం పాటుపడతానని, సమాజం నుంచి, బంధువుల నుంచి ఎలాంటి అవమానాన్నైనా తట్టుకుంటానంటూ చెప్పుకొచ్చింది. అంతే ఇది తెలుసుకున్న జార్జియాలో ఉన్న ఆమె మాజీ భర్త  చికాగోలో ఉన్న తన వద్దకు వచ్చి తుపాకితో ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఐతే అహ్మద్‌ తల్లిదండ్రలు తమ కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషాధ ఘటన వెలుగు చూసింది. ఏదీ ఏమైన కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. 

(చదవండి: అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement