
యశవంతపుర: అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన భార్యను భర్త అతి క్రూరంగా చంపిన ఘటన సోమవారం బెంగళూరు తలఘట్టపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు...శివమ్మ (50), శంకరప్ప భార్యభర్తలు. శంకరప్ప తుహళ్లి రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే రెండేళ్ల నుంచి శివమ్మ పక్షవాతంతో మంచానికే పరిమితమైంది.
వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నాడు. శివమ్మను ఎలాగైన అడ్డు తొలగించుకోవాలని శంకరప్ప పథకం వేశాడు. పిల్లలు పనికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం సెల్లార్‌లోని నీటి ట్యాంకులోకి ఆమెను తీసుకువచ్చి పడేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన కొడుకు, కుమార్తె తల్లి కనిపించకపోవడంతో తండ్రిని నిలదీశారు. తనకు తెలియదని శంకరప్ప చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. కొడుకు అనుమానంతో సెల్లార్‌లోని నీటి ట్యాంకులో చూడగా శివమ్మ శవమై కనిపించింది. తలఘట్టపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
(చదవండి: కొడుకు హత్యకు తండ్రి సుపారీ)
Comments
Please login to add a commentAdd a comment