
కుమారుడితో అస్మాబేగం(ఫైల్)
సాక్షి, రాయచూరు(కర్ణాటక): మూడుముళ్లు వేసి జీవితాంతం తోడుగా ఉంటానని బాసలు చేసిన భర్త కాలముడై భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన నగరంలోని అంద్రూన్ కిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సదర్‌బజార్ పోలీస్‌స్టేషన్ సీఐ గుండురావ్ కథనం మేరకు.. రాయచూరులో టీ పోడి విక్రయిస్తున్న ఫజీలుద్దీన్‌కు తాలూకాలోని సుల్తాన్‌పురకు చెందిన అస్మాబేగం(34)తో 2013 జూన్ 30న వివాహమైంది.
పెళ్లి సమయంలో ఏడు తులాల బంగారు, రూ.50వేల నగదు కట్నంగా ఇచ్చారు. ఈ దంపతులకు కుమారులు అన్వరుద్దీన్(7)అరాపథ్(4) ఉన్నారు. అస్మా తండ్రి ఆర్‌టీసీలో ఉద్యోగ విరమణ చేయగా పింఛన్ డబ్బు చేతికి అందింది. అందులో కొంత మొత్తం తేవాలని ఆస్మాబేగంను భర్త ఫజులుద్దీన్ వేధింపులకు గురి చేశాడు.
ఇతనికి తల్లి తాహీర, చెల్లెలు యాస్మిన్‌లు వంతపాడారు. ఈ క్రమంలో ఫజులుద్దీన్ ఆస్మాబేగం గొంతుకు తాడు బిగించి హత్య చేశాడు. సోమవారం ఈ ఘటన వెలుగు చూసిందని, ఫజులుద్దీన్, అతని తల్లి, చెల్లెలిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment