
భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో..
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భర్తను భార్య హత్య చేయడం కలకలం రేపింది. భర్తను పచ్చడి బండతో బాది హత్య చేసింది. అనంతరం భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.