Paralysis
-
‘స్ట్రోక్’ను దెబ్బతీద్దాం
చాలా మందిలో స్ట్రోక్ అంటే ఇప్పటికీ గుండెపోటు అనే అపోహ ఉంది. పరిభాషలో పలకాలంటే స్ట్రోక్ అంటే మెదడు పోటు. పూర్తిగా మెదడుకి సంబంధించిన అత్యయిక స్థితి. ఈ స్ట్రోక్ ప్రస్తుతం కలవరపెడుతోంది. స్ట్రోక్‌కి గురువుతున్న వారి సగటు వయసు నానాటికీ తక్కువవుతోంది. పదేళ్ల క్రితం కనీసం 40 ఏళ్లు సరాసరిగా ఉన్న బాధితుల వయసు.. ప్రస్తుతం 26కి చేరిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అవగతమవుతోంది.కాకినాడ క్రైం: ప్రజల్లో ఈ విపత్తుపై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏటా అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డేగా ప్రకటించింది. ప్రజల్లో విస్తృత అవగాహన పెంపొందించి, స్ట్రోక్‌కు స్టాప్ చెప్పడమే ప్రస్తుతం ప్రపంచం ముందున్న లక్ష్యం. స్ట్రోక్ అంటే.. స్ట్రోక్‌ను వాడుక భాషలో పక్షవాతం అంటారు. బ్రెయిన్ అటాక్ అని కూడా పిలుస్తారు. మెదడులో రక్తనాళాలు పూడుకున్నా, పగిలినా, ధమనులు, సిరల్లో ఆటంకాలు ఏర్పడినా, మెదడుకు రక్తం సరఫరా నిలిచిపోతుంది. తద్వారా స్ట్రోక్ వస్తుంది. అప్పటివరకు చురుగ్గా ఉన్న మనిషి జీవచ్ఛవమవుతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, జీవితమంతా నరకప్రాయమవుతుంది. స్ట్రోక్ సంభవిస్తే.. మెదడుకు ప్రవహించే రక్తంలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో మెదడు పనితీరు క్షీణిస్తుంది. 80 శాతానికి పైగా స్ట్రోక్ బాధితుల్లో మూతి వంకర్లు పోవడం, నత్తి, కాళ్లు చేతులు చచ్చుబడటం, మాట్లాడలేకపోవడం, కళ్లు మసకబారడం, చూపు శాశ్వతంగా కోల్పోవడం వంటి లక్షణాలుంటాయి. 15 శాతం మందికి పైగా బాధితుల్లో మెదడులో నరాలు చిట్లి, అంతర్గత రక్తస్రావం అవుతుంది. ఈ స్థితి మరణానికీ దారితీయవచ్చు. లక్షణాలివీ.. మాటల్లో తడబాటు, అకస్మాత్తుగా ముఖం, చేయి, కాలు తిమ్మిర్లు, బలహీనంగా లేదా పట్టు వదిలేసినట్లు అనిపించడం. ఒకటి లేదా రెండు కంటి చూపుల్లో ఇబ్బందులు ఏర్పడి.. చూడడంలో సమస్య, శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, అకారణంగా విపరీతమైన తలనొప్పి స్ట్రోక్ లక్షణాలు. రావడానికి కారణాలు ⇒ ఆడవారితో పోలిస్తే మగవారిలో ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం అధికం. ⇒ ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఇష్టానుసారంగా మత్తు పానీయాల వినియోగం, రక్తపోటు, ఏట్రియల్ ఫిబ్రిలిఏషన్, అధిక కొలె్రస్టాల్ స్థాయి, ఊబకాయం, జన్యుపర నిర్మాణంతో పాటు, మానసిక సమస్యలు కూడా స్ట్రోక్‌కు కారణమవుతాయి. గురి కాకూడదంటే.. స్ట్రోక్‌కి గురి కాకూడదంటే జీవన శైలిలో సానుకూల మార్పులను ఆహా్వనించాలి. సమయానుగుణంగా ఆహారం, నిద్ర అవసరం. ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో మంచి మార్పుల వల్ల స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు. సీజనల్ పండ్లు, తృణధాన్యాలు, చేపలు, కొవ్వు తక్కువగా ఉండే పాల పదార్థాలు, వ్యాయామం, నడక, ధ్యానం దోహదం చేస్తాయి.ఫాస్ట్ ఫార్ములాతో సేఫ్ స్ట్రోక్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. రోగి వయసు, హెల్త్ హిస్టరీకి అనుగుణంగానే స్ట్రోక్ నుంచి తేరుకోవడం అన్నది ఆధారపడి ఉంటుంది. రక్తనాళాల్లో బలహీన ప్రాంతాన్ని అన్యూరిజం అంటారు. బయటికి ఉబికిన ఈ ప్రాంతంలో పగుళ్లు ఏర్పడితే మెదడు పూర్తిగా దెబ్బతింటుంది. దీనికి అత్యవసర చికిత్స చేయాల్సి ఉంటుంది. ‘బి గ్రేటర్ దేన్ స్ట్రోక్’ అన్న నినాదాన్ని ఈ ఏడాది థీమ్‌గా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. స్ట్రోక్‌కు మించిన మనోధైర్యాన్ని పెంపొందించుకుని, ముందుకు వెళ్లాలన్నది ఈ థీమ్ ఉద్దేశం. డాక్టర్ ఆర్.గౌతమ్ ప్రవీణ్, న్యూరో ఫిజీషియన్, కాకినాడ -
ఫేషియల్ పెరాలసిస్ అని భయపడొద్దు..!
ముఖంలో ఒక పక్క పక్షవాతం వచ్చినట్లుగా వాలిపోయే కండిషన్‌ను ఫేషియల్ పెరాలసిస్ అంటారు. పక్షవాతంలో ఒకవైపు దేహభాగం అచేతనమై పోయినట్టే... ఫేషియల్ పెరాలసిస్లో కేవలం ముఖం వరకే చచ్చుబడినట్లుగా అయిపోతుంది. నిజానికి లక్షణాల పరంగా ఇది చాలా ఆందోళనకరంగా అనిపించినా ..చాలా వరకు సాధారణ సమస్యగానే పరిగణించవచ్చు.కారణాలు: మెదడు నుంచి బయల్దేరిన వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె భాగం నుంచి బయటకు వస్తాయి కాబట్టి వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఇందులో ఏడవ నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకర దనం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా హెర్పిస్ సింప్లెక్స్ లాంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, ఆ పరిణామం వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్ నర్వ్ అనే ముఖానికి సంబంధించిన నరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరంతో కనెక్ట్ అయిన ముఖ భాగాలు చచ్చుబడి΄ోయినట్లు కనిపిస్తాయి. వచ్చే లక్షణాలు: మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు ఒకవైపు నుంచే పుక్కిలించగలగడం... దాంతో నోటికి ఒకవైపు నుంచే నీళ్లు బయటకు రావడం, ఒకవైపు కనురెప్ప వాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: డాక్టర్లు అవసరాన్ని బట్టి ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేస్తారు. ఇది కేవలం కొద్ది రోజుల్లోనే తగ్గుతుంది. పూర్తిగా తగ్గిపోయే ఈ సమస్యతో ఆందోళన అవసరం లేదు. (చదవండి: టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!) -
పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో!
సంకల్ప బలం గట్టిగా ఉంటే.. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సుఖ్జీత్ సింగ్. పక్షవాతం బారినా పడినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి.. తన కలను నిజం చేసుకున్నాడు.హాకీ ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని విశ్వ క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. పంజాబ్‌లోని జలంధర్‌లో 1996లో జన్మించాడు సుఖ్జీత్ సింగ్. అతడి తండ్రి అజిత్ సింగ్ పంజాబ్ పోలీస్ విభాగంలో పనిచేసేవాడు.తండ్రిని చూసిపోలీస్ టీమ్ తరఫున హాకీ ఆడే తండ్రిని చూసి చిన్ననాటి నుంచే గమనించిన సుఖ్జీత్.. ఆటపై మక్కువ పెంచుకున్నాడు. ఆరో ఏటనే హాకీ స్టిక్ చేతబట్టి ఓనమాలు నేర్చాడు.నాటి నుంచి తండ్రి ప్రోత్సాహంతో భారత జట్టులో చోటే లక్ష్యంగా శ్రమించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ లక్ష్యానికి చేరువగా వచ్చాడు. కానీ.. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు పక్షవాతం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. తాత్కాలిక పక్షవాతంఆరేళ్ల క్రితం వెన్నునొప్పి బారిన పడిన సుఖ్జీత్.. కుడికాలు తాత్కాలిక పక్షవాతానికి గురైంది. దీంతో అతడి కలలు కల్లగానే మిగిలిపోతాయేమోనని కుటుంబం భయపడింది. అయితే, తండ్రి ప్రోత్సాహం, తన సంకల్ప బలం వల్ల సుఖ్జీత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.భారత జట్టు తరఫున అరంగేట్రం చేసి తానేంటో నిరూపించుకున్నాడు. తద్వారా ప్యారిస్ ఒలింపిక్స్-2024 జట్టులో స్థానం సంపాదించాడు ఈ ఫార్వర్డ్ ప్లేయర్. ఈ నేపథ్యంలో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ..ఐదు నెలలు మంచానికే పరిమితం‘‘ఒలింపిక్స్ ఆడటం నా కల. నా కుటుంబం కూడా ఇదే కోరుకుంది. నాకు దక్కిన గొప్ప గౌరవం ఇది. కఠినంగా శ్రమిస్తే కచ్చితంగా ఫలితం వస్తుందని నేను నమ్ముతాను.ఇప్పుడు అది మరోసారి నిరూపితమైంది. జట్టు ప్రయోజనాలే ప్రధానంగా ఆడుతాను. నాపై నమ్మకం ఉంచిన కోచ్‌లు, సహచర ఆటగాళ్లు తలెత్తుకునేలా చేస్తాను.ఇక హాకీ ఆడలేమోనని భయపడ్డాఅయితే, ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా పాక్షిక పక్షవాతం కారణంగా ఐదు నెలలు మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి వచ్చింది.నా జీవితంలో అత్యంత కఠినమైన దశ అదే. శారీరకంగా.. మానసికంగా చాలా చాలా అలసిపోయాను. నడవలేకపోయాను. కనీసం నా పనులు కూడా నేను చేసుకోలేకపోయాను.ఇక హాకీ ఆడలేమోనని భయపడ్డాను. అయితే, మా నాన్న నన్ను తేలికగా తలవంచనీయలేదు. నొప్పిని భరించేలా తన మాటలతో ఉపశమనం కలిగించారు. నాలో స్ఫూర్తిని రగిల్చారు.ఆయన వల్లే నేను కోలుకోగలిగాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్‌పైనే ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాను’’ అని సుఖ్జీత్ సింగ్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశాడు.పసిడి గెలిచిన జట్లలో సభ్యుడుకాగా రెండేళ్ల క్రితం సుఖ్జీత్ భారత జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. FIH Pro League 2021-2022 సీజన్లో స్పెయిన్‌తో మ్యాచ్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన అతడు ఇప్పటి వరకు 70 మ్యాచ్‌లు ఆడి.. 20 గోల్స్ స్కోరు చేశాడు.భువనేశ్వర్‌లో జరిగిన హాకీ వరల్డ్‌కప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన సుఖ్జీత్.. మూడు గోల్స్ కొట్టాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు.గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జట్టులోనూ సుఖ్జీత్ ఉన్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ డిఫెన్స్ స్ప్లిట్టింగ్ పాస్‌లు మూవ్ చేసే సుఖ్‌జీత్‌కు, టీమిండియాకు ఆల్ ది బెస్ట్!.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా భారత్ తొలుత న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. పూల్-బిలోని ఇరు జట్ల మధ్య జూలై 27న ఈ మ్యాచ్ జరుగనుంది.చదవండి: ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న మాక్సీ!.. కారణం అదే! -
జీజీహెచ్‌లో ‘వోకల్ పెరాలసిస్’కు అరుదైన శస్త్రచికిత్స
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వోకల్ కార్డు (స్వరతంత్రి) కుడి వైపు పెరాలసిస్(పక్షవాతం)కు గురై సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగికి ఈఎన్టీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి మరలా మాట్లాడేలా చేయగలిగారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించిన ఈ శస్త్ర చికిత్స గురించి ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కొణిదె రవి శుక్రవారం మీడియాకు వివరించారు. ఒంగోలుకు చెందిన డ్రైవర్ అప్పయ్య స్వర సమస్యతో చికిత్స కోసం తమ విభాగానికి రాగా, అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి వోకల్కార్డు కుడివైపు పెరాలసిస్ వచ్చినట్లు నిర్ధారించామని చెప్పారు. ఈ నెల 17న వీడియో ఎండోస్కోపీ ద్వారా స్వరాన్ని విశ్లేషిస్తూ థైరోప్లాస్టీ–1 అనే అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి మామూలుగా మాట్లాడగలుగుతున్నారని చెప్పారు. ఈ శస్త్ర చికిత్సలో ఈఎన్టీ వైద్యులు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లీలాప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రత్నబాబు, శ్రీనివాస్, ఆదిత్య, స్పందన, వర్థిని, పీటర్లతో పాటు పీజీ విద్యార్థులు, స్పీచ్ థెరపిస్ట్ జి గాయత్రి, మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ లవకుమార్ పాల్గొన్నారు. వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ అభినందించారు. -
మెదడుకు మెరుగైన చికిత్స...
సాక్షి,హైదరాబాద్: గుండెజబ్బులు, గుండె పోట్లు సాధారణమైపోతున్న కాలమిది. గుండెజబ్బు చేస్తే స్టెంట్లు వేసుకుని కాలం వెళ్లదీయవచ్చునేమో కానీ.. పోటు వస్తే, మెదడుకు రక్త సరఫరా ఆగిపోతే పక్షవాతం బారిన పడాల్సి వస్తుంది. జీవితాంతం మంచానికి పరిమితం కావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అయితే...ఈ పరిస్థితి ఇంకొంతకాలమే అంటున్నారు ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత కలాం–రాజు స్టెంట్ రూపకర్తల్లో ఒకరైన ఎన్.జి.బద్రీ నారాయణ్. మెదడు నాళాల్లోని అడ్డంకుల (క్లాట్)ను తొలగించేందుకు తాము అత్యాధునిక వ్యవస్థ ఒకదాన్ని తయారు చేశామని ఎన్.జి.బద్రీ నారాయణ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుండెపోటు వచ్చిన తరువాత వీలైనంత తొందరగా (గోల్డెన్ అవర్... గరిష్టంగా 24 గంటల్లోపు) ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే పక్షవాతం రాకుండా చూడవచ్చునని ఆయన తెలిపారు. న్యూరో క్లాట్ రిట్రీవర్, న్యూరో ఆస్పిరేషన్ క్యాథరర్, న్యూరో మైక్రో క్యాథరర్ అనే పరికరాలన్నీ కలిగిన ఈ వ్యవస్థను అతితక్కువ ధరల్లోనే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని చెప్పారు. భారత్‌లో ఇలాంటి విప్లవాత్మకమైన టెక్నాలజీ ఒకటి అందుబాటులోకి రావడం ఇదే తొలిసారని, తెలంగాణ గవర్నర్ తమిళిసై గురువారం (డిసెంబరు 15) ఈ కొత్త టెక్నాలజీని లాంఛనంగా ప్రారంభించనున్నారని చెప్పారు. ఎలా పనిచేస్తుంది?: ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ తయారు చేసిన వ్యవస్థ స్టెంట్లు వేసేందుకు వాడే క్యాథరర్ మాదిరిగానే ఉంటుంది కానీ.. వెంట్రుక మందంలో నాలుగోవంతు మాత్రమే ఉంటుంది. దీని చివర సమయంతోపాటు తన ఆకారాన్ని మార్చుకునే ధాతువు (నికెల్–టైటానియం) తో తయారు చేసిన స్టెంట్లాంటి నిర్మాణం ఉంటుంది. మెదడులో అడ్డంకి ఉన్న ప్రాంతానికి దీన్ని తీసుకెళ్లి... వెనుకవైపు నుంచి వ్యతిరేక పీడనాన్ని సృష్టిస్తారు. దీంతో అక్కడి క్లాట్ క్యాథరర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. తద్వారా పక్షవాతం లక్షణాలు తగ్గిపోయే అవకాశం ఏర్పడుతుంది. గోల్డెన్ అవర్‌లో ఈ చికిత్స చేయగలిగితే కనీసం 70 శాతం మందిని పక్షవాతం నుంచి రక్షించుకోవచ్చు. పక్షవాతాన్ని నివారించగలిగే వ్యవస్థను ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో చేర్చగలిగేంత తక్కువ ధరకు అందించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, తద్వారా భారత్‌లో ఏటా కనీసం 2.5 లక్షల మందిని పక్షవాతం నుంచి రక్షించవచ్చని బద్రీ నారాయణ్ తెలిపారు. ఈ వ్యవస్థపై తాము కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నామని, డిజైనింగ్‌తోపాటు పూర్తిస్థాయిలో తయారీ కూడా దేశీయంగానే నిర్వహించినట్లు వివరించారు. ఈ న్యూరో పరికరాల పరీక్షకు తగిన లైసెన్సులు ఇప్పటికే పొందామని, వాణిజ్యస్థాయి ఉత్పత్తికి కూడా తగిన అనుమతులు త్వరలోనే పొందుతామని వివరించారు. వైద్య పరికరం కాబట్టి.. మందులేవీ లేని కారణంగా ఇది యూఎస్ఎఫ్డీఏ క్లాస్–2 వర్గానికి చెందుతుందని, అనుమతులు తొందరగానే వస్తాయన్న ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. మైసూరులో ఫ్యాక్టరీ ఏర్పాటు: ఎం.వి.గౌతమ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 2011లో పురుడు పోసుకున్న ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ ఇప్పుడు మైసూరు వద్ద అత్యాధునిక ఫ్యాక్టరీ ఒకదాన్ని నిర్మించనుందని, కర్ణాటక ప్రభుత్వం తమకు 8.5 ఎకరాల స్థలాన్ని అందజేసిందని ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ డైరెక్టర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మాజీ సీఎండీ ఎం.వి.గౌతమ తెలిపారు. యూఎస్ ఎఫ్‌డీఏ ప్రమాణాలతో దీన్ని రానున్న 18 నెలల్లో నిర్మించనున్నామని చెప్పారు. -
భర్త క్రూరత్వం! భార్య అనారోగ్యంతో ఉందని..
యశవంతపుర: అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన భార్యను భర్త అతి క్రూరంగా చంపిన ఘటన సోమవారం బెంగళూరు తలఘట్టపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు...శివమ్మ (50), శంకరప్ప భార్యభర్తలు. శంకరప్ప తుహళ్లి రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే రెండేళ్ల నుంచి శివమ్మ పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నాడు. శివమ్మను ఎలాగైన అడ్డు తొలగించుకోవాలని శంకరప్ప పథకం వేశాడు. పిల్లలు పనికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం సెల్లార్‌లోని నీటి ట్యాంకులోకి ఆమెను తీసుకువచ్చి పడేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన కొడుకు, కుమార్తె తల్లి కనిపించకపోవడంతో తండ్రిని నిలదీశారు. తనకు తెలియదని శంకరప్ప చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. కొడుకు అనుమానంతో సెల్లార్‌లోని నీటి ట్యాంకులో చూడగా శివమ్మ శవమై కనిపించింది. తలఘట్టపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. (చదవండి: కొడుకు హత్యకు తండ్రి సుపారీ) -
ఎన్వోసీ లభించక.. ఇంటికి చేరుకోలేక.. పాపం మనోడు
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధికోసం విజిట్ వీసాపై మలేసియాకు వెళ్లిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన కూన గంగాధర్ పక్షవాతంతో మంచం పట్టాడు. వీసా గడువు ముగిసిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి మలేసియా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖ ద్వారా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ను కోరుతోంది. అయితే ఎన్వోసీని జారీ చేయడంలో భారత విదేశాంగ శాఖ తాత్సారం చేయడంవల్ల అనారోగ్యంతో అవస్థలు పడుతున్న కూన గంగాధర్ ఇంటికి చేరుకోలేకపోతున్నాడు. గంగాధర్ నాలుగు నెలల క్రితం మలేసియాకు వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. పదిహేను రోజుల కిందట పని ముగించుకుని తన గదికి చేరుకున్న తరువాత గంగాధర్‌కు పక్షవాతం వచ్చింది. దీంతో అతనితో పాటు ఉన్న తెలంగాణ వాసులు అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పక్షవాతంతో బాధపడుతున్న గంగాధర్‌ను ఇంటికి పంపించడానికి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు యనమల వెంకటస్వామి, శుభ్రలు ప్రయత్నిస్తున్నారు. విజిట్ వీసాపై వెళ్లిన గంగాధర్ మలేసియాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి రూ.25 వేల జరిమానా చెల్లించడంతో పాటు భారత రాయబార కార్యాలయం నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంది. జరిమానా చెల్లించడానికి బాధితుని పక్షాన తెలంగాణ వాసులు సిద్ధంగా ఉన్నారు. ఎన్వోసీ జారీ చేయడానికి విదేశాంగ శాఖ అధికారులు స్పందించకపోవడంతో పదిహేను రోజులుగా గంగాధర్ ఆస్పత్రిలోనే ఉండిపోయాడు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కూన గంగాధర్‌ను ఇంటికి పంపడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. (క్లిక్ చేయండి: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే) -
నర్వ్ స్టిమ్యులేషన్‌తో... పక్షవాతానికి చెక్!
జెనీవా: పక్షవాత రోగులకు శుభవార్త. నర్వ్ స్టిమ్యులేషన్ చికిత్స, మెరుగైన ఫిజియోథెరపీ ద్వారా పక్షవాతానికి చెక్ పెట్టడంలో వైద్య పరిశోధక బృందం విజయం సాధించింది. తొమ్మిది మంది పక్షవాత రోగులు ఈ రెండు చికిత్సల ద్వారా పూర్తిగా కోలుకుని తిరిగి నడవగలిగారు! వీరంతా వెన్నుముక తీవ్రంగా దెబ్బతినడం వల్ల పక్షవాతం బారిన పడ్డవారే! ఈ ప్రయోగాత్మక చికిత్స ఫలితం పట్ల పరిశోధకులు, వైద్యులు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ప్రయోగం... ‘స్విస్ రీసెర్చ్ గ్రూప్ న్యూరో రీసెర్చ్’ అనే పరిశోధక బృందం ఇటీవల ఓ ప్రయోగం జరిపింది. దీన్ని తొలుత ఎలుకలపై జరిపిన అనంతరం మనుషులను ఎన్నుకుంది. వీరంతా ప్రమాదాల్లో నడకకు తోడ్పడే వెన్నెముక చివరి భాగంలోని కీలక నరాల సమూహమైన లంబార్ న్యూరాన్లు దెబ్బతిన్నవారే. దాంతో నడివాల్సిందిగా మెదడు ఇచ్చే ఆదేశాలు కాళ్లను చేరవు. ఫలితం...? శాశ్వత పక్షవాతం! ఇలాంటి 9 మంది రోగులకు స్వీస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాసెన్నేకు చెందిన క్లాడియా కేథీ అనే న్యూరో సైంటిస్ట్ బృందం ఎపిడ్యూరల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇచ్చింది. తద్వారా నడకకు తోడ్పడే నరాలను ఉద్దీపింపజేసింది. ఇందుకోసం శస్త్రచికిత్స ద్వారా వెన్నుపాములో న్యూరో ట్రాన్స్మిటర్ అమర్చారు. దాని ద్వారా వెన్నెముక ఉత్తేజితమయ్యేలా చూశారు. దీంతోపాటు రొబో టిక్ ప్రక్రియలతో ఫిజియోథెరపీ అందిస్తూ వచ్చారు. వారిని పలు దిశల్లో కదిలించడంతోపాటు నడిపించారు. దాంతో రోగులు ఐదు నెలల్లోనే నడవడం,వాకర్ సాయంతో మెట్లెక్కడం మొదలుపెట్టారు. కొత్త మార్గం దొరికినట్టే... ఎలుకలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్‌తో పాటు అక్కడి కణజాలం పనితీరుపై స్పేషియల్ ట్రాన్స్క్రిప్టోమెటిక్స్ టెక్నిక్ సాయంతో కేథీ బృందం అవగాహనకు వచ్చింది. ‘‘వెన్నెముకకు గాయమయ్యాక కోలుకునేందుకు ఎస్సీ బీఎస్‌ఎక్స్2, హెచ్ఓఎక్స్10 అనే న్యూరాన్లతో తయారైన కణజాలం సాయపడుతుందని గుర్తించాం. బ్రెయిన్‌స్టెమ్ నుంచి అందే ఆదేశాలను అమల్లో పెట్టేందుకు వీలుగా ఈ నాడీ కణజాలం చాలా విలక్షణమైన రీతిలో అమరి ఉంది. నడకకు అవే దోహదపడ్డాయి’’ అని కేథీ వివరించారు. అయితే, ‘అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియలో ఇది భాగం మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎస్సీ టు ద పవర్ ఆఫ్ బీఎస్‌ఎక్స్2, హెచ్ఓఎక్స్10 కణజాలం పక్షవాతం తర్వాత కోలుకుని నడకకు దోహదపడే ప్రాథమిక అంశాలన్నది మా పరిశోధనలో తేలింది. పక్షవాత చికిత్సలో కొత్త పద్ధతులకు ఈ అవగాహన మార్గాలు తెరచినట్టే’’ అంటూ ముక్తాయించారు. -
స్ట్రోక్‌తో కోమాలోకి నటి.. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై!
పొట్టి జుట్టు.. చందమామ లాంటి రూపంతో కనిపించే ఆ ముద్దుగుమ్మ.. మామూలు యోధురాలు కాదు. ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించింది. అదీ ఒక్కసారి కాదు.. రెండుసార్లు!. పూర్తిగా కోలుకుని నటనలోకి మళ్లీ అడుగుపెట్టి అభిమానులను అలరిస్తోందనగా.. పిడుగులాంటి వార్త. ఆమె ఆరోగ్యం మరోసారి తిరగబడింది. ఈసారి పరిస్థితి విషమించి ప్రాణాంతక స్థితికి చేరుకుంది. ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ.. చక్కని రూపం, హోమ్లీ క్యారెక్టర్లతో ఇంటిల్లిపాదిని అలరిస్తూ విశేష అభిమానుల్ని సంపాదించుకుంది. జుమూర్, భోలే, బాబా పర్ కరేగా లాంటి పలు చిత్రాలతో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. మరోవైపు సీరియల్స్‌లోనూ నటిస్తూ బుల్లితెర గుర్తింపూ దక్కించుకుంది. క్యాన్సర్ సోకపోయి ఉంటే ఆమె ఖాతాలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు ఉండేవే. రెండుసార్లు క్యాన్సర్‌ను జయించిన ఐంద్రీలా శర్మ.. తాజాగా స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చేరింది. క్రమంగా కోలుకుంటోందని వైద్యులు ప్రకటించడంతో.. ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని అంతా భావించారు. అయితే ఆమె ఇంకా కోమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఆమె శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైందని వైద్యులు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. వెంటిలేటర్‌పై ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెదడులో అక్కడక్కడ రక్తం గడ్డకట్టిందని తెలుస్తోంది. దిగ్గజ నటి సుచిత్ర సేన్ స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఐంద్రీలా శర్మ.. చిన్నవయసులోనే ఇలా ప్రాణాంతక స్థితికి చేరకోవడంపై బెంగాలీ ప్రేక్షకులు, ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అద్భుతం జరిగి ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గతంలో కీమోథెరపీల ద్వారా, సంక్లిష్టమైన సర్జరీల ద్వారా ఆమె క్యాన్సర్ నుంచి రెండుసార్లు కోలుకున్నారు. బెంగాలీలో పలు చిత్రాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులతోనూ ఆమె అలరించారు. టీవీ షోలతోనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తోటి నటుడు(జుమూర్ సీరియల్లో లీడ్ పెయిర్) సవ్యసాచి చౌదరితో డేటింగ్ చేస్తోంది. క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న సమయంలో ఇలా ఒక్కసారిగా ఆస్పత్రి పాలైంది. ఇదీ చదవండి: వీ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్: జాన్వీ కపూర్ -
Paralysis: పక్షవాతం పడగొడుతోంది!
ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు ముస్తాబాద్‌కు చెందిన అనమేని బాలయ్య, శ్యామల. మేస్త్రీ పనిచేస్తూ, వ్యవసాయం చేసుకునే బాలయ్యకు ఏడాదిన్నర క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. రూ.3లక్షల వరకు అప్పు చేసి వైద్యం చేయిస్తున్నారు. కూతురు వెన్నెలను ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదివిస్తున్నారు. బాలయ్యకు నెలకు రూ.13వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ చిత్రంలో మంచానికే పరిమితమైన మెంగని శ్రీనివాస్(51)ది ముస్తాబాద్. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీనివాస్ 2020లో తిరిగొచ్చాడు. ఆరు గెదెలు కొని, డెయిరీతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతలోనే శ్రీనివాస్‌కు పక్షవాతం రాగా.. రూ.8లక్షలు ఖర్చ య్యింది. అయినా నయం కాలేదు. కుటుంబ పెద్ద పక్షవాతానికి గురవడంతో పాలిటెక్నిక్ పూర్తి చేసిన కొడుకు వివేక్ బీటెక్‌కు చదువలేకపోయాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తండ్రికి ఆసరాగా నిలుస్తున్నాడు. చిన్నకుమారుడు సాత్విక్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో ఇటీవల పక్షవాతానికి గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మారుతున్న జీవన విధానం.. ఆహారమార్పులతో బీపీ(బ్లడ్ ప్రెషర్) పెరిగి అనారోగ్యం పాలవుతున్నారు. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వ్యక్తులు మంచానికి పరిమితం అవుతుండగా.. చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. మారుతున్న జీవన విధానం ప్రస్తుత ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలతో చిన్న వయస్సులోనే పక్షవాతానికి గురవుతున్నారు. పెరుగుతున్న రక్తపోటు(బీపీ), షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటితో పక్షవాతం దాడి చేస్తుంది. ఒకే చోట కదలకుండా పనిచేయడం, మద్యం ఎక్కువగా తాగడం, మాంసం, జంక్‌ఫుడ్ తీసుకోవడం, పొగతాగే అలవాటు ఉన్న వాళ్లలో పెరాలసిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. అతిగా మొబైల్ వినియోగించే వారిలోనూ పెరాలసిస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. స్పందించే సమయం ముఖ్యం పక్షవాతానికి గురయ్యే వారికి ముందుగానే లక్షణాలు బయటపడుతుంటాయి. ఇలాంటి లక్షణాలు ముందుగానే గుర్తించి తక్షణమే వైద్యం అందిస్తే త్వరగా కోలుకునే లక్షణాలు ఉన్నాయి. ఇటీవల సిరిసిల్లకు చెందిన ఒకరు పక్షవాతానికి గురికాగా కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యంత వేగంగా స్పందించిన డ్యూటీ డాక్టర్ పక్షవాతానికి గురైన నాలుగు గంటల్లోపే ఖరీదైన ఇంజక్షన్ ఇవ్వడంతో శాశ్వత పక్షవాతం నుంచి బయటపడ్డాడు. (క్లిక్: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే..) ఇలా తెలుసుకోవాలి మెదడులో ఒక ప్రాంతం ఒక్కో భాగాన్ని నియంత్రిస్తుంది. రక్తప్రసరణ నిలిచిపోయినప్పుడు ఆ భాగంలో రక్తం గడ్డకట్టి తలనొప్పి, కళ్లు తిరగడం, అపస్మారక స్థితిలోకి వెళ్తుంటాయి. నాడీవేగం తగ్గడం, తల, కళ్లు ఒక వైపునకు తిరగడం. కనుపాపలు వెలుతురుకు స్పందించకపోవడం జరుగుతుంది. మూత్ర ఆపుకునే శక్తి సన్నగిల్లడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతి సమస్యలు లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వారు బలహీనంగా ఉంటారు. పక్షవాతానికి గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి, ఎంతవేగంగా చికిత్స అందిస్తే రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ–హెల్త్ ద్వారా నమోదు జిల్లాలో ఈ–హెల్త్ అధికారులు సర్వే చేపట్టారు. జిల్లాలో అధిక రక్తపోటు(బీపీ) కేసులు 29,213 ఉన్నాయి. ఇందులోని వారే పెరాలసిస్‌కు గురవుతున్నట్లు ఆరోగ్యశాఖ భావిస్తోంది. జిల్లాలో దాదాపుగా 2500 ఆపైగా పక్షవాతం కేసులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పక్షవాతానికి కారణమయ్యే షుగర్ కేసులు కూడా జిల్లాలో 13,331 కేసులు ఉన్నాయి. పెరాలసిస్ బాధితులకు కూడా ప్రభుత్వం అండగా నిలవాలని పేద కుటుంబాలు కోరుతున్నాయి. (క్లిక్: స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి) జీవన విధానం మార్చుకోవాలి ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చా యి. స్మోకింగ్, ఆల్కహల్, జంక్‌ఫుడ్ తీసుకుంటున్నారు. యువత కూడా పెరాలసిస్‌కు గురవడం సాధారణంగా మారింది. లక్షణాలు బయటపడగానే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. మానసిక ఒత్తిడికి గురికావద్దు. వ్యాయామం, యోగా చేయాలి. – డాక్టర్ చింతోజు శంకర్, ఐఎంఏ జిల్లా మాజీ అధ్యక్షుడు -
ఈ పక్షి ఎంత డేంజరో తెలుసా?.. నిలువెల్లా విషమే..
జంతు ప్రపంచంలో విషపూరితమైనవి అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లు పాములు, తేళ్లే. అలాగే కొన్ని జాతుల కప్పలు, సాలీళ్లు, కీటకాలు, చివరకు కొన్ని రకాల చేపల్లోనూ విషం ఉంటుందని మనకు తెలుసు. కానీ నిలువెల్లా విషం నింపుకున్న ఓ పక్షిజాతి గురించి ఎప్పుడైనా విన్నారా?! ఆ పక్షి పేరే హుడెడ్ పిటోహుయ్. పపువా న్యూగినియాలో ఎక్కువగా కనిపించే ఈ చిన్న పిట్ట ప్రపంచంలోకెల్లా శాస్త్రీయంగా నిర్ధారణ అయిన మొట్టమొదటి విషపూరిత పక్షి అట. చదవండి: జీబ్రాలు నిలబడే నిద్రపోతాయి.. ఎందుకో తెలుసా? హుడెడ్ పిటోహుయ్ పక్షి ఈకలు, చర్మం, అంతర్గత అవయవాలు, చివరకు ఎముకల్లోనూ విషం దాగి ఉంటుందట! ముద్దొస్తున్నాయి కదా అని దాని ఈకలను సరదాగా నోట్లో పెట్టుకుంటే నోరంతా మొద్దుబారిపోతుందట! కొన్ని గంటలపాటు భరించలేనంత నొప్పి వస్తుందట! అది గోళ్లతో రక్కినా ఇదే సీన్ రిపీట్ అవుతుందట. పక్షవాతం కూడా వచ్చే చాన్స్ ఉంటుందట. ఇక విషం డోసు ఎక్కువగా శరీరంలోకి ప్రవేశిస్తే ఏకంగా గుండెపోటు, మరణం సంభవిస్తాయట!! అందుకే వేటగాళ్లు సైతం దీన్ని వేటాడేందుకు వెనకాడతారట! ఎవరైనా తెగించి దాని మాంసాన్ని వండుతుంటే విపరీతమైన దుర్వాసన రావడంతోపాటు దాని రుచి సైతం అత్యంత చేదుగా ఉంటుందట!! అందుకే స్థానికులు దీన్ని గార్బేజ్ బర్డ్ (చెత్త పిట్ట)గా పిలుస్తుంటారు. నాడీమండల వ్యవస్థను దెబ్బతీసే బట్రచోటాక్సిన్ అనే రసాయనం ఈ పక్షిలో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈ విషాన్ని పిటోహుయ్ స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుందా లేదా అనే దానిపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో దీని ఆహారమైన పురుగుల వల్ల ఈ విష రసాయనం పక్షిలోకి చేరుతోందని చెబుతున్నారు. ఇంకొందరేమో పేలు, ఇతర కీటకాలను దరిచేరనీయకుండా ఉండేందుకే హుడెడ్ పిటోహుయ్ ఇలా విషాన్ని ఉత్పత్తి చేస్తుందని విశ్లేషిస్తున్నారు. -
నా బిడ్డను కాపాడండి: దాతలూ ఆదుకోండి ప్లీజ్!
రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. అందులోనూ కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఏమైనా జరిగితే వారి జీవితం అంధకారంలోకి కూరుకు పోతుంది. తన ప్రాణానికి ప్రాణం, కుటుంబానికి పెద్దదిక్కైన 28 ఏళ్ల కొడుకు రాహుల్ పనినుంచి తిరిగి వస్తాడని ఎదురుచూస్తూన్న తల్లికి అతనికి ప్రమాదం జరిగిందని తెలిస్తే గుండె పగిలి పోదూ! సరిగ్గా నిర్మల జీవితంలోనూ ఇదే జరిగింది. కొడుకు వస్తాడనే సంబురంతో రాత్రి భోజనానికి సిద్ధమవుతుండగా కుమారుడి స్నేహితుడి ఫోన్‌కాల్ పిడుగులా మారింది. రాహుల్ బైక్‌ను లారీ ఢీకొట్టిందనీ, తీవ్రంగా గాయపడిన రాహుల్‌ని ఆసుపత్రికి తరలించారని అతని స్నేహితుడు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ వార్త వినేసరికి కుప్పకూలిపోయింది నిర్మల. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తింది. అక్కడ రాహుల్ జాడ కనిపించలేదు. దీంతో బిడ్డ ఏమై పోయాడో అన్న భయంతో గుండె వేగం మరింత పెరిగింది. అయితే దెబ్బలు బాగా తగలడంతో మరో ఆసుపత్రికి తరలించినట్లు నర్సు చెప్పడంతో కాస్త ఊరట పడింది. దెబ్బలు తగిలినా పరవాలేదు. బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు ఎలాగైనా కాపాడుకుంటా అంటూ ఆ తల్లి మనసు ఆరాట పడింది. ఆందోళనతో ఆ ఆసుపత్రి కెళ్లేసరికి అత్యవసర శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు తీసుకెళ్లారని తెలిసింది. దీంతో సాయం చేసిన వారందరికీ కన్నీళ్లతోనే ధన్యవాదాలు తెలుపుకొని, నా బిడ్డను ఎలాగైనా కాపాడు తండ్రీ అంటూ వేయి దేవుళ్లకు మొక్కుకుంది. మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రాహుల్‌ని కళ్లారా చూసేందుకు ఆరాటపడుతూ థియేటర్ బయట కూర్చొని ఎదురు చూస్తోంది. రాహుల్ చిన్నతనంలోనే తండ్రి కంటి చూపుకోల్పోయాడు. అప్పటినుంచి అన్నీ తానే అయ్యా కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్నాడు. పగలూ రాత్రి కష్టపడి కూలిపని చేస్తూ, తల్లి దండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కొడుకు జ్ఞాపకాల్లో మునిగిపోయింది నిర్మల. ఇంతలో థియేటర్ నుంచి బైటికి వచ్చి వైద్యులు చెప్పిన మాట విని నిర్మలమ్మ కాళ్ల కింద భూమి కంపించిపోయింది. ‘‘రాహుల్‌కి అన్నిపరీక్షలు చేశాం అతని మెదడులో తీవ్రమైన ఇంటర్నల్ బ్లీడింగ్‌ను గుర్తించాం. మెదడులోని రక్తస్రావాన్ని ఆపి, అతడి ప్రాణాల్ని రక్షించేందుకు అత్యవసరంగా అతనికి పుర్రెలో ఒక భాగానికి శస్త్రచికిత్స చేశాం. కానీ శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. అయినా ఈ గండంనుంచి రాహుల్ గట్టెక్కాలంటే మరిన్ని ఆపరేషన్లు చేయాలి. సుమారు 10-15 రోజుల ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఈ చికిత్సకు మొత్తం ఖర్చు రూ. 7 లక్షలు ($ 8878.46) అవుతుంది’’ ఇదీ డాక్టర్లు చెప్పిన మాట. చెట్టంత ఎదిగిన కొడుకు అచేతనంగా పడిపోవడంతో, బిడ్డను బతికించుకోవడానికి అవసరమైన డబ్బు లేక ఆ నిరుపేద కుటుంబం అల్లాడిపోతోంది. మరోవైపు ప్రమాదానికి ముందు, తరువాత సంగతులు కొడుకు మర్చిపోతాడేమోననే భయం నిర్మలను ఆవరించాయి. అయినా తన కొడుకును దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దయగల దాతలు స్పందించి దయచేసి నా బిడ్డను రక్షించండి! అని నిర్మల దీనంగా వేడుకుంటోంది. సరిగ్గా కదలలేక, తిండిలేక, నిద్రలేక అల్లాడిపోతున్న కొడుకును ఈ స్థితిలో చూడలేపోతున్నాను. మా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం అంటూ రాహుల్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు ఆ నిర్మలమ్మ దంపతులు. రాహుల్ ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి! దానం చేయండి!! (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు పక్షవాతం వచ్చింది: బుల్లితెర నటి
రామ్సే హంట్ సిండ్రోమ్.. ఇది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల ముఖభాగం పక్షవాతానికి గురవుతుంది. ప్రతి లక్ష మందిలో 5 నుంచి 10 మంది ఈ వ్యాధి బారిన పడుతారు. ఇటీవలే స్టార్ సింగర్ జస్టిన్ బీబర్ తాను రామ్సే హంట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. తాజాగా బుల్లితెర నటి ఐశ్వర్య సఖుజ మాట్లాడుతూ.. తాను కూడా రామ్ సే హంట్ బాధితురాలినేనని చెప్పుకొచ్చింది. 'ఇది 2014 నాటి సంగతి. షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నాను. నాకు గుర్తున్నంతవరకు అప్పుడు నేను మధ్యాహ్నం రెండు గంటల షిఫ్ట్‌కు వెళ్లాను. రోహిత్(ఐశ్వర్య భర్త) ఎందుకు కన్ను కొడుతున్నావంటూ అడిగాడు. ఏదో జోక్ చేస్తున్నాడనుకుని లైట్ తీసుకున్నాను. కానీ తర్వాతి రోజు ఉదయం పళ్లు తోముకునేటప్పుడు విపరీతమైన నొప్పి వచ్చింది. తర్వాత నా రూమ్మేట్ నా ముఖం మారిపోతున్నట్లు గ్రహించింది. నేను వెంటనే డాక్టర్‌ను కలిశాను. అప్పుడు నాకు రామ్సే హంట్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. కానీ నేను ఒప్పుకున్న షెడ్యూల్స్ కారణంగా విశ్రాంతి తీసుకోలేదు. నా ముఖం సగం కనిపించకుండా జాగ్రత్తపడుతూ షూటింగ్స్ చేశారు. తర్వాత స్టెరాయిడ్స్ ఇచ్చి వైద్యం అందించారు. నటిగా అందంగా కనిపించడం ఎంతో ముఖ్యం. తిరిగి నార్మల్ అవుతానో లేదోనని భయపడ్డాను. కానీ నెల రోజుల్లోనే ఈ వ్యాధి నుంచి కోలుకున్నాను. జస్టిన్ బీబర్ కూడా దీన్నుంచి తప్పకుండా బయటపడతాడు' అని చెప్పుకొచ్చింది. కాగా ఐశ్వర్య చివరగా 2019లో 'ఉజ్దా చమాన్' సినిమాలో ఏక్త పాత్రలో నటించింది. 'సాస్ బీనా ససురాల్', 'ఆషికి', 'త్రిదేవియాన్', 'యే హై చహతే' వంటి పలు సీరియల్స్ చేసింది. View this post on Instagram A post shared by Aishwarya Sakhuja (@ash4sak) చదవండి: షూలతో ఆలయంలోకి హీరో? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ పెళ్లి తర్వాత నయన తార మొదటి చిత్రం.. 'ఓ2' రివ్యూ.. ఎలా ఉందంటే ? -
పక్షవాతం బారిన స్టార్ సింగర్.., వీడియో వైరల్
Justin Bieber Reveals He Suffer With Face Paralysis: కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జస్టిన్ పాటలంలే చెవి కొసుకునేవారు ఇండియాలో సైతం ఉన్నారు. చిన్న వయసులోనే బేబీ.. బేబీ అంటూ పాడి ఎంతో మంది సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్నాడు. అంతగా తన గాత్రంతో ఆకట్టుకున్న జస్టీన్ తాజాగా ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను పాక్షిక పక్షవాతానికి గురైనట్టు ప్రకటించాడు. ఈ మేరకు జస్టీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. చదవండి: నయనతార దంపతులపై టీటీడీ ఫైర్, నోటీసులు జారీ ‘చాలా ముఖ్యమైనది దయచేసి చూడండి.. నా కోసం ప్రార్థించండి’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో జస్టీన్ తాను అరుదైన వ్యాధితో భాధపడుతున్నట్లు వెల్లడించాడు. ‘నేను రామ్ సే హంట్ సిండ్రోమ్ భారిన పడ్డాను. ఈ వ్యాధి వల్ల నా ముఖ భాగంలోని నాడీ వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో ముఖం పక్షపాతానికి గురైంది. కదలికలు సరిగా లేవు. కుడి కన్ను ఆర్పలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చాడు. దీని శరీరం కూడా మెల్లిగా శక్తి లేకుండా పోతుంది. తనలో ఈ వ్యాధి లక్షణాలో కాస్తా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే తాను వరల్డ్ టూర్ క్యాన్సల్ చేసుకున్నానని చెప్పాడు. ‘టొరంటో, వాషింగ్టన్ డీసీ, ఇండియా టూర్ రద్దు చేసుకున్నాను. పూర్తిగా కోలుకునే వరకు ఎటువంటి సంగీత ప్రదర్శనలు చేయాలేను’ అని తెలిపాడు. చదవండి: Vignesh Shivan-Nayanthara: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’ కాగా ఈ రామ్సే హంట్ సిండ్రోమ్ అనేది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. సాధారణంగా చెవి, నోటి భాగంలోని నరాలపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ముఖ భాగం పక్షవాతాని గురవుతుంది. ముఖ పక్షవాతం బారినపడినవారిలో ఒకవైపు ముఖ కదళికలు మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ప్రస్తుతం బీబర్ ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా కొన్నిసార్లు వినికిడి లోపం కూడా రావొచ్చు. పిల్లలు, పెద్దల్లో చికెన్‌పాక్స్ వ్యాధికి కారణమయ్యే వైరసే ఈ రామ్సే హంట్ సిండ్రోమ్. ప్రతీ 1 లక్ష మందిలో ఐదు నుంచి 10 మంది మాత్రమే రామ్సే సిండ్రోమ్ బారినపడుతారు. ఈ సిండ్రోమ్ బారినపడితే.. చెవి వద్ద ఎర్రని దద్దురు ఏర్పడుతుంద న్యూయార్క్ టైమ్స్ తమ కథనంలో పేర్కొంది. View this post on Instagram A post shared by Justin Bieber (@justinbieber) -
బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ?
కొన్ని జబ్బు లక్షణాలు వ్యాధి రాకముందే బయటపడతాయి. తాము రాబోతున్నామంటూ హెచ్చరికలు జారీచేస్తాయి. జాగ్రత్తపడమంటూ చెప్పి, నివారించుకునేందుకు అవకాశాలిస్తాయి. ఆ వార్నింగ్ సిగ్నల్స్‌ను ఎలా గుర్తించాలో ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి వివరిస్తున్నారు. వాటిని నిలువరించే మార్గాలూ చెబుతున్నారు. తెలుసుకుందాం... రండి. ప్రశ్న : వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులేమైనా ఉన్నాయా? జ: న్యూరో విభాగానికి సంబంధించిన చాలా జబ్బులు ముందస్తు వార్నింగ్ ఇచ్చాకే వస్తాయి. ఉదాహరణకు మైగ్రేన్, ఫిట్స్, పక్షవాతం, అల్జైమర్స్ వంటివి. వీటిల్లో మైగ్రేన్ బాధాకరమే గానీ... చాలావరకు నిరపాయకరం. కానీ పక్షవాతం వల్ల అవయవాలు పనిచేయకపోయే ప్రమాదం ఉంది. ఇతరులపై జీవితాంతం ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. ఫిట్స్ కూడా ప్రమాదమే. అందుకే ముందస్తు హెచ్చరికలు చేసే ఆ వ్యాధుల వార్నింగ్ సిగ్నల్స్ అర్థం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలను నివారించుకోవచ్చు. ప్రశ్న : పక్షవాతం ముందస్తు సిగ్నల్స్ ఇస్తుందా? అదెలా? జ: పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్)లో చేయిగానీ, కాలుగానీ, లేదా రెండూ పడిపోవడం గానీ, ఒకవైపు చూపు తగ్గిపోవడం, మూతి వంకరపోవడం, మాట పడిపోవడం, మింగడం కష్టం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తాత్కాలికంగా పది నిమిషాల నుంచి ఒక గంట లోపు వస్తే దాన్ని ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అంటారు. ఈ టీఐఏ లక్షణాలు... అసలు పక్షవాతం కంటే కొంత ముందుగానే కనపడవచ్చు. ముందుగా వచ్చే ఈ ‘టీఐఏ’ తర్వాత బాధితులు పూర్తిగా కోలుకుంటారు. కానీ ఆ సిగ్నల్స్ పెడచెవిన పెట్టి... అసలు పక్షవాతం వచ్చే వరకు నిర్లక్ష్యం చేస్తే కోలుకోడానికి చాలా టైమ్ పట్టవచ్చు లేదా ఆ నష్టం జీవితాంతం బాధించవచ్చు. ప్రశ్న : బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ? జ: సాధారణంగా 50 ఏళ్లు దాటి... షుగరు, హైబీపీ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు ఈ ముప్పును మరింత పెంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికీ, ఊబకాయం ఉన్నవారికీ స్ట్రోక్ ముప్పు ఎక్కువ. ప్రశ్న : మైగ్రేన్‌లో ఏయే ముందస్తు లక్షణాలు కనిపిస్తాయి? జ: మైగ్రేన్ తలనొప్పి రెండు విధాలుగా వస్తుంది. మొదటిదానిలో తలనొప్పికి ముందర కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘మైగ్రేన్ విత్ ఆరా’ అంటారు. దాదాపు 20శాతం మందిలో ‘ఆరా’ కనిపిస్తుంది. రెండో రకంలో నేరుగా తలనొప్పి వస్తుంది. ‘మైగ్రేన్ ఆరా’లో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. ∙తలనొప్పి వచ్చే గంటలోపు చూపు కొద్దిగా మందగిస్తుంది. ∙కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లుగా అనిపించడం, వెలుగు చూడలేకపోవడం, శబ్దాలు వినడంలో ఇబ్బంది కలగడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙చుట్టూరా ఉన్నవి కనిపించకుండా, ముందు ఉన్నవే కనిపిస్తాయి. దీన్ని టెలిస్కోపిక్ విజన్ అంటారు. ∙అరుదుగా ఏదో ఓ పక్క కాలు / చేతిలో బలం తగ్గడం. ∙త్వరగా కోపం రావడం, చికాకు పడటం వంటివి కనిపించిన గంట లేదా రెండు గంటల్లోపు అసలు తలనొప్పి మొదలవుతుంది. ప్రశ్న : మైగ్రేన్‌కు చికిత్స ఎలా? జ: దీనికి రెండు రకాలుగా చికిత్స అందిస్తారు. మొదటిది తీక్షణంగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందులు. ఇవి ఎంత త్వరగా తీసుకుంటే, అంత త్వరగా ఉపశమనం కలుగుతుంది. రెండోవి... మళ్లీ రాకుండా ఉండేందుకు ఇచ్చే మందులు. ప్రశ్న : ఫిట్స్‌లో కూడా ముందస్తు సిగ్నల్స్ కనిపిస్తాయా? జ: మూర్ఛను వైద్యపరిభాషలో ఫిట్స్ అనీ, ఆ జబ్బును ఎపిలెప్సీ అని అంటారు. ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు చల్లటి నీటితో ఒళ్లు తుడుస్తూ, శరీర ఉష్ణోగ్రత తగ్గించి ఫిట్స్ రాకుండా నివారించుకోవచ్చు. కొంతమందిలో ఫిట్స్ వచ్చే కొన్ని నిమిషాల నుంచి గంటల ముందుగా తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లు జలదరించడం (జర్క్స్), కనురెప్పలు కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు ఈ లక్షణాలను గమనించలేరు. కాబట్టి పెద్దలే వాటిని గమనించాలి. ముఖ్యంగా ముందురోజు నిద్ర సరిపోకపోవడం, తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం వంటి పరిస్థితుల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రశ్న : అల్జైమర్స్ జబ్బును ముందస్తుగా గుర్తుపట్టడం ఎలా? జ: అల్జైమర్స్‌లో ముఖ్యమైన మొట్టమొదటి లక్షణం – కొన్ని సెకండ్ల నుంచి నిమిషాలకు ముందుగా జరిగిపోయిన విషయాలను మరచిపోతుండటం. (వీళ్లలో చిన్నప్పటి విషయాలు మాత్రం బాగా గుర్తుండవచ్చు). తర్వాత క్రమంగా దారులు, తేదీలు, పండుగలు మరచిపోతారు. కొత్త విషయాలు ఏవీ గుర్తుపెట్టుకోలేరు. క్రమంగా ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు. సరైన సమయంలోనే ఈ లక్షణాలను గుర్తించలిగితే... సరైన చికిత్సతో... వ్యాధి పెరుగుదలనూ, తీవ్రతనూ నియంత్రించవచ్చు. ఇక్కడ చెప్పిన ఏ వార్నింగ్ కనిపించినా వెంటనే ‘న్యూరో ఫిజీషియన్’ను సంప్రదించి, తగిన పరీక్షలూ, వాటి ఆధారంగా తగిన చికిత్స తీసుకుంటే... ఈ జబ్బులను చాలావరకు రాకముందే నివారించవచ్చు. - డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
పక్షవాతంతో ఉన్నా హెచ్ఎం బదిలీ.. మనస్తాపానికి గురై..
సాక్షి,మహబూబాబాద్ రూరల్: ఆర్నెల్లుగా పక్షవాతంతో బాధపడుతున్నానని.. స్పౌజ్ కేట గిరీనీ పరిగణనలోకి తీసుకొని తనను బదిలీ చేయొద్దని కోరినప్పటికీ ప్రభుత్వం బదిలీ చేసిందనే ఆవేదనతో ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పంచముఖ ఆంజనేయస్వామి సమీపంలో నివసించే బానోతు జైత్రాం (57) నెల్లికుదురు మండలం చిన్నముప్పారం ఎంపీపీఎస్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు చేపడుతున్న నేపథ్యంలో జైత్రాం తనను స్పౌజ్ కేటగిరీ కింద మహబూబాబాద్ జిల్లాలోనే ఉంచాలని ఆప్షన్ ఇచ్చాడు. తన భార్య పద్మ మహబూబాబాద్ జిల్లా సంధ్య తండాలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నందన ఈ ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. అయినప్పటికీ ఆయనకు ములుగు జిల్లాకు బదిలీ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులుగా బజారుకు వెళ్లగా.. దీనిపైనే మదనపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో పడిపోయాడు. కుటుంబ సభ్యులు తిరిగొచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
ఎమర్జెన్సీ సర్జరీ చేస్తుండగా పక్షవాతం బారిన పడ్డ దిగ్గజ ఆల్‌రౌండర్
సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ పక్షవాతం బారినపడ్డాడు. అస్ట్రేలియాలో గుండెకు ఎమర్జెన్సీ సర్జరీ చేసేటప్పుడు వెన్నెముకలో స్ట్రోక్ రావడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతనికి రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు ఆస్ట్రేలియాలోనే మరో ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. కెయిన్స్.. గత కొంతకాలంగా ఆరోటిక్ డిసెక్షన్ అనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. కెయిన్స్ తన జమానాలో మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. చదవండి: అఫ్గాన్లను చంపడం ఆపండి ప్లీజ్.. రషీద్ ఖాన్ ఉద్వేగం -
అద్భుత విజయం: పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి..
కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన ఘనత సాధించారు. పక్షవాతానికి గురై పూర్తిగా మాట్లాడే శక్తిని కోల్పోయిన వాళ్ల నుంచి.. చెప్పదల్చుకున్న విషయాల్ని బయటకు రప్పించే టెక్నాలజీని రూపొందించారు. ‘స్పీచ్ న్యూరోప్రోస్థెసిస్’ Speech Neuroprosthesisతో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ.. బ్రెయిన్ నుంచి గొంతు ద్వారా సిగ్నల్స్ సేకరించి, అటుపై పేషెంట్లు చెప్పదల్చుకున్న విషయాన్ని ఎదురుగా ఉన్న తెరపై వేగంగా డిస్ప్లే చేస్తాయి. ఫ్లోరిడా: కాలిఫోర్నియా యూనివర్సిటీ(UCSF) న్యూరోసర్జన్ డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ నేతృత్వంలోని బృందం పదేళ్ల పరిశోధనల తర్వాత ఈ విజయాన్ని సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి పరిశోధనలే జరిగినప్పటికీ.. చేతి కండరాల కదలికల ద్వారా చెప్పదల్చుకున్న విషయాన్ని రాబట్టడం లాంటి ఫలితాలొచ్చాయి. కానీ, కాలిఫోర్నియా బృందం సాధించిన విజయంలో.. నేరుగా స్వర వ్యవస్థకే అనుసంధానమై ఉండడం వల్ల ఒక్కో అక్షరం కాకుండా, ఒకేసారి ఎక్కువ పదాలను తెరపై చూపించేందుకు ఆస్కారం ఏర్పడింది. తద్వారా సాధారణ వ్యక్తి మాట్లాడగలిగినట్లే.. పెరాలసిస్ బారినపడ్డ వ్యక్తి నుంచి(75 శాతం) సందేశాలను ఆశించొచ్చు. పైగా ఇది సంక్లిష్టమైన పద్ధతి కాదని, పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ వెల్లడించారు. ‘స్టెనో’ పేరుతో కొనసాగిన ఈ ప్రాజెక్ట్‌కు ఫేస్బుక్ స్పాన్సర్ చేసింది. పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి సహజంగా పదాలను బయటకు తెప్పించడం నిజంగా ఓ అద్బుత విజయంగా పేర్కొంటూ న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో బుధవారం ఈ పరిశోధనకు సంబంధించిన విషయాల్ని ప్రచురించింది. కేవలం పక్షవాతానికి గురైమాత్రమే కాదు.. ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో, షాక్‌లతో మాట్లాడలేని స్థితికి చేరుకుంటుంటారు. వాళ్ల కోసం ఈ న్యూరాల్ టెక్నాలజీ ఉపయోగపడొచ్చని ఆ జర్నల్‌లో పలువురు వైద్యు నిపుణులు అభిప్రాయపడ్డారు. జుకర్‌బర్గ్ ఖుష్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా(సిగ్నల్స్ చేరివేత ద్వారా) పేషెంట్ చెప్పాలనుకున్న విషయం తెరపై దానికదే టైప్ కావడం ఈ న్యూరల్ టెక్నాలజీ ప్రత్యేకం. ఇక తమ సౌజన్యంతో రూపొందించిన ఈ న్యూరల్ టెక్నాలజీ ఘన విజయంపై ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘బ్రావో’ పేరుతో జరిగిన ఈ అధ్యయనంలో 15 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో గాయపడి కదల్లేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తిపై కాలిఫోర్నియా ప్రొఫెసర్లు పరిశోధనలు చేశారు. ‘నాకేం దాహంగా లేదు, నా వాళ్లను పిలవండి, బాగానే ఉన్నా’ లాంటి పదాల్ని ఆ వ్యక్తి వ్యక్తం చేశాడు. -
ఫేషియల్ పెరాలసిస్‌కు భయపడకండి!
ముఖంలో ఒక పక్క పక్షవాతం వచ్చినట్లుగా వాలిపోయే పరిస్థితే ఫేషియల్ పెరాలసిస్. పక్షవాతంలో కనిపించే లక్షణాలైన దేహంలోని ఒక పక్క ఉండే భాగాలు అచేతనంగా మారిపోయినట్లే.... కొందరికి కేవలం ముఖం వరకే ఒక భాగం చచ్చుబడినట్లుగా అయిపోతుంది. దీన్నే సాధారణ భాషలో ‘ఫేషియల్ పెరాలసిస్’ అనీ, వైద్యపరభాషలో ‘బెల్స్పాల్సీ’ అని అంటారు. ఇది చాలా మందిలో కనిపించే సాధారణ జబ్బే. మన మెదడునుంచి బయల్దేరిన వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె భాగం నుంచి బయటకు వస్తాయి కాబట్టి వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఇందులో ఏడవ నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా హెర్పిస్ సింప్లెక్స్ లాంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, ఆ పరిణామం వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్ నర్వ్ అనే ముఖానికి సంబంధించిన నరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరం వాపు వచ్చి, అది అనుసంధానం చేసే ముఖ భాగాలు చచ్చుబడిపోతాయి. లక్షణాలు : మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తుంటే ఒకవైపు నుంచే సమర్థంగా పుక్కిలించగలగడం... ఫలితంగా నోటికి ఒకవైపు నుంచే నీళ్లు చిమ్మినట్లుగా బయటకు రావడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సగానూ ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేస్తారు. ఇది కేవలం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గిపోయే ఈ సమస్యతో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. -
ఫేషియల్ పెరాలసిస్..కారణాలివే!
ముఖంలో ఒక పక్క పక్షవాతం వచ్చినట్లుగా వాలిపోయే పరిస్థితే ఫేషియల్ పెరాలసిస్. పక్షవాతంలో కనిపించే లక్షణాలైన దేహంలోని ఒక పక్క ఉండే భాగాలు అచేతనంగా మారిపోయినట్లే.... కొందరికి కేవలం ముఖం వరకే ఒక భాగం చచ్చుబడినట్లుగా అయిపోతుంది. దీన్నే సాధారణ భాషలో ‘ఫేషియల్ పెరాలసిస్’ అనీ, వైద్యపరభాషలో ‘బెల్స్పాల్సీ’ అని అంటారు. ఇది చాలా మందిలో కనిపించే సాధారణ జబ్బే. మన మెదడునుంచి బయల్దేరిన వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె భాగం నుంచి బయటకు వస్తాయి కాబట్టి వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఇందులో ఏడవ నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా హెర్పిస్ సింప్లెక్స్ లాంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, ఆ పరిణామం వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్ నర్వ్ అనే ముఖానికి సంబంధించిన నరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరం వాపు వచ్చి, అది అనుసంధానం చేసే ముఖ భాగాలు చచ్చుబడిపోతాయి. లక్షణాలు : మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తుంటే ఒకవైపు నుంచే సమర్థంగా పుక్కిలించగలగడం... ఫలితంగా నోటికి ఒకవైపు నుంచే నీళ్లు చిమ్మినట్లుగా బయటకు రావడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సగానూ ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేస్తారు. ఇది కేవలం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గిపోయే ఈ సమస్యతో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. -
పల్స్ చూసుకోండి.. పక్షవాతం నుంచీ కాపాడుకొండి!
ప్రపంచాన్ని ఇటీవల కరోనా చుట్టుముట్టాక పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కుని మన రక్తంలో ఆక్సిజన్‌తో పాటు పల్స్ చూసుకోవడం అన్నది చాలా ఇళ్లలో జరుగుతోంది. ఇలా పల్స్ ఆక్సిమీటర్‌తో కేవలం రక్తంలో ఆక్సిజన్‌ను పరీక్షించుకోవడం మాత్రమే కాదు... దాంతో పక్షవాతం ప్రమాదాన్ని కూడా అద్భుతంగా నివారించుకోవచ్చని జర్మనీకి చెందిన న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వాళ్లే కాదు... అమెరికాకు చెందిన యూఎస్ నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కూడా అదే మాట చెబుతున్నారు. వేర్వేరుగా వారిద్దరూ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైందట. అమెరికాకు చెందిన నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కనుగొన్న విషయాల ప్రకారం... మొదటిసారి పక్షవాతం (స్ట్రోక్)కు గురై కోలుకున్నవారిలో 24 శాతం మంది మహిళల్లో, 42 శాతం మంది పురుషుల్లో ఐదేళ్లలోపు పక్షవాతం మరోసారి వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. మొదటిసారి స్ట్రోక్ వచ్చిన 256 మందిపై నిర్వహించిన పల్స్ రీడింగ్ ద్వారా తేడాలు తెలుసుకుని, రాబోయే ఈ తరహా ప్రమాదాలను గుర్తించి, వాటిని నివారించడం సాధ్యమైనట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ అనే జర్నల్‌లోనూ పొందుపరిచారు. చదవండి: ఒళ్లు కరిగించే మధుమేహ మాత్ర! రక్తపోటు వచ్చేముందు ప్రీ–హైపర్‌టెన్షన్ దశ అంటే..? -
చచ్చుబడిన కాళ్లలో మళ్లీ చైతన్యం
సాక్షి, హైదరాబాద్: వెన్నెముక గాయాలతో శరీరం దిగువభాగం, ముఖ్యంగా కాళ్లు చచ్చుబడిపోయిన వారికి శుభవార్త. జర్మనీలోని రుహర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పుణ్యమా అని.. కాళ్లు చచ్చుబడిన ఎలుకలు ఒక్క ఇంజక్షన్‌తోనే మూడు వారాల్లో మళ్లీ నడవగలిగాయి. అద్భుతం అనేందుకు ఏమాత్రం తీసిపోని ఈ పరిశోధనకు కీలకం.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రొటీన్! హైపర్ ఇంటర్‌ల్యూకిన్–6 (హెచ్ఐఎల్–6) అని పిలిచే ఈ ప్రొటీన్ నాడీ కణాల పునరుత్పత్తికి అవసరమైన సంకేతాలు అందిస్తుంది. వాస్తవానికి ఈ ప్రొటీన్లు శరీరంలోనే ఉన్నప్పటికీ వాటికి ఈ సామర్థ్యం ఉండదు. రుహర్ శాస్త్రవేత్తలు ఈ ప్రొటీన్‌ను కృత్రిమంగా డిజైన్ చేసి, అభివృద్ధి చేయడమే కాకుండా.. దాన్ని ఓ సాధారణ వైరస్ సాయంతో ఎలుకల మెదళ్లలోకి జొప్పించారు. వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్న ఈ ఎలుకలకు ప్రొటీన్ అందించినప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన సెన్సరీ కార్టెక్స్ ప్రాంతంలో మోటార్ ఆక్సాన్ల (కదలికలకు సంబంధించిన సంకేతాలు ఇచ్చేవి) ఉత్పత్తి మొదలైంది. అంతేకాదు.. ఈ ఉత్పత్తి వెన్నెముక ప్రాంతంలోనికీ విస్తరించింది. నడకకు అవసరమైన భాగాలను చైతన్యం చేసింది. ఫలితంగా చచ్చుబడిన కాళ్లలో కొన్ని వారాల వ్యవధిలోనే కదలికలు వచ్చాయి. శరీరం దిగువభాగం చచ్చుబడిన ఎలుకల్లో రెండు మూడు వారాల్లోనే తాము కదలికలు చూశామని, ఇప్పటివరకూ ఇలా ఎప్పుడూ జరగలేదని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త దైమర్ ఫిషర్ తెలిపారు. వెన్నెముక గాయమైన కొన్ని వారాల తరువాత ఈ చికిత్స అందిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నామని, వాటి ఆధారంగా మనుషులకూ ఈ చికిత్స విధానం విస్తరించడంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. పరిశోధన ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్స్ తాజా జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అసాధ్యాన్ని సాధించారు... వెన్నెముక గాయాల కారణంగా శరీరం దిగువ భాగం చచ్చుబడడాన్ని మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. వెన్నెముక నుంచి మెదడుకు మధ్య సంకేతాల ఆదాన ప్రదానాలు నిలిచిపోవడం దీనికి కారణం. వెన్నెముకలోని నాడీ పోగులు (ఆక్సాన్లు) సమాచారాన్ని అటూ ఇటూ చేరవేస్తాయనేది తెలిసిందే. ఆక్సాన్లు దెబ్బతింటే శరీర భాగాలకు, మెదడుకు మధ్య సంబంధం తెగిపోతుందన్నమాట. ఒకసారి దెబ్బతిన్న ఆక్సాన్లు మళ్లీ పెరగవు కాబట్టి బాధితులు జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెన్నెముకను సరిచేసి, తద్వారా చచ్చుబడిన శరీర భాగం మళ్లీ చైతన్యవంతమయ్యేలా చేయడం ఇప్పటివరకూ అసాధ్యంగానే మిగిలింది. విద్యుత్తు ప్రచోదనాల ద్వారా చికిత్స చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినా సాధించిన ఫలితాలు అంతంతే. వెన్నెముక గాయమైన ప్రాంతాన్ని తప్పించి మిగిలిన నాడులను ఉత్తేజపరిచేలా చేసేందుకూ విఫలయత్నాలు జరిగాయి. రుహర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ రెండు పద్ధతులనూ కాదని జన్యుమార్పిడితో ప్రయత్నించి విజయం సాధించడం విశేషం. వీరు తయారు చేసిన హెచ్ఐఎల్–6 డిజైనర్ ప్రొటీన్ కేవలం కదలికలకు సంబంధించిన నాడీ కణాలపై మాత్రమే కాకుండా.. చూపునకు సంబంధించిన కణాలపైనా సానుకూల ప్రభావం చూపగలవని ఇప్పటికే రుజువైంది. అంటే అంధులకు మళ్లీ చూపునిచ్చేందుకూ ఈ ప్రొటీన్లను ఉపయోగించే అవకాశం ఉందన్నమాట. -
కరోనా: పక్షవాతం బారినపడ్డ షారుక్ సహనటి
ముంబై: కోవిడ్ రోగులకు సేవలందిస్తూ కరోనా వైరస్ బారిన పడిన బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. మహమ్మారితో పోరాడి ఇంటికి వచ్చిన ఆమె తాజాగా పక్షవాతం బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ అశ్విన్ శుక్లా మంగళవారం ప్రకటించారు. ‘శిఖా పక్షవాతానికి గురయ్యారు. ఆమెకు కుడి వైపు స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతం శిఖా కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’ అంటూ ఆమె ఫొటోను షేర్ చేశాడు. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు షాక్ గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు. (చదవండి: నటి ఆర్య బెనర్జీ మృతి: కీలక విషయాలు వెల్లడి) అయితే వైద్య విద్యార్థిని అయిన శిఖా నటనపై ఆసక్తితో ఇండస్త్రీలో అడుగుపెట్టారు. బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఆమె సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’ చిత్రంలో కీలక పాత్ర పోషించి నటిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో కోవిడ్ బారిన పడిన వారికి సేవలందించేందుకు శిఖా మళ్లీ నర్సుగా మారి ఎంతోమంది కరోనా పెషేంట్స్‌కు ఆస్పత్రిలో సేవలు అందించారు. ఈ క్రమంలో ఆమెకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే మహమ్మారితో పోరాడి ఇటీవల ఆరోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె తాజాగా పక్షవాతం బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. (చదవండి: మా నాన్న జీవితం స్ఫూర్తిదాయకం) -
పక్షవాతం వంశపారంపర్యమా?
నా వయసు 36 ఏళ్లు. మేము ముగ్గురు అన్నదమ్ములం. మా నాన్నగారు నా చిన్నతనంలో పక్షవాతానికి గురయ్యారు. అప్పట్లో సరైన వైద్యసౌకర్యాలు లేకపోవడంతో మంచానపడి పదేళ్లపాటు నరకం అనుభవించి చనిపోయారు. నా పెద్దతమ్ముడికి 29 ఏళ్లు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. నెల్లాళ్ల కిందట ‘బ్రెయిన్‌స్ట్రోక్’కు గురయ్యాడు. వెంటనే మంచి వైద్యం ఇప్పించడం వల్ల వెంటనే కోలుకున్నాడు. కుడి చేయి, కుడి కాలు ఇంకా స్వాధీనంలోకి రాలేదుగానీ ప్రాణాపాయం లేదనీ, ఫిజియోథెరపీ, మందులు వాడటం వల్ల తొందరలోనే కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. ఇప్పుడు నాకూ, మా చిన్న తమ్ముడికి ఒక భయం పట్టుకుంది. నాన్నగారిలా, తమ్ముడిలా మాకూ పక్షవాతం వస్తుందా? ‘బ్రెయిన్‌స్ట్రోక్’ వంశపారంపర్యంగా వచ్చే జబ్బా? పక్షవాతం గురించి వివరాలను విపులంగా తెలియజేయండి. పక్షవాతం (బ్రెయిన్‌స్ట్రోక్) వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. ఈ విషయంలో మీరు ఎలాంటి భయాలూ, ఆందోళనలూ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. మీ ఫ్యామిలీ హిస్టరీలో పక్షవాతం ఉంది కాబట్టి బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీసే ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్... అంటే అధిక రక్తపోటు, డయాబెటిస్, హైకొలెస్ట్రాల్ వంటి వంశపారంపర్య వ్యాధుల పట్ల మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త వహించాలి. మీరు క్రమం తప్పకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుని, ఒకవేళ ఏమైనా తేడాలుంటే క్రమం తప్పకుండా మందులు వాడుతూ, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బ్రెయిన్‌స్ట్రోక్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు. పరిశోధనల ప్రకారం మహిళల కంటే పురుషుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. పక్షవాతంలో రెండు రకాలున్నాయి. ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడు మొత్తానికి నాలుగు రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇందులో రెండు రక్తనాళాలు మెదడు ఎడమవైపునకూ, రెండు కుడివైపునకూ వెళ్తాయి. ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దాంతో మెదడుకు రక్తసరఫరా సరిగా జరగక, కణాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుంది. దాదాపు 80 శాతం కేసుల్లో ఇదే కారణం. హేమరేజిక్ స్ట్రోక్ : రక్తనాళాల్లో ఏదైనా చిట్లిపోయి, రక్తం బయటకు రావడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ఈ తరహా పక్షవాతం 20 శాతం కేసుల్లో కనిపిస్తుంటుంది. ఈ రెండు కారణాల వల్ల ఎడమవైపు మెదడు భాగాలు దెబ్బతింటే శరీరంలోని కుడివైపున ఉండే అవయవాలు, కుడివైపు మెదడు భాగాలు దెబ్బతింటే ఎడమ వైపున ఉండే అవయవాలు దెబ్బతింటాయి. కారణాలు : పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు అధిక రక్తపోటు. డయాబెటిస్. డ్రగ్స్, అధిక ఒత్తిడి కూడా ఇందుకు కారణాలే. ఇంతకుమునుపు ఇవి అరవై ఏళ్ల వయసులో కనిపించేవి. కానీ ఇప్పుడు మూడు పదుల్లోనే కనిపిస్తున్నాయి. అందుకే పక్షవాతం ఇప్పుడు చాలా చిన్న వయసువారిలోనూ కనిపిస్తోంది. ఎలా గుర్తించాలి : ►మాటలో తేడా రావడం, నత్తినత్తిగా రావడం ►విన్నది అర్థం చేసుకోలేకపోవడం ►మూతి పక్కకి వెళ్లిపోవడం ►ఒకవైపు కాలు, చెయ్యి బలహీనం కావడం ►నడిస్తే అడుగులు తడబడటం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సీటీ స్కాన్ చేసి, తక్షణం చికిత్స మొదలుపెట్టాలి. పక్షవాతం వచ్చిన మూడు నుంచి నాలుగున్నర గంటలలోపు చికిత్స అందించగలిగితే శరీరం చచ్చుబడకుండా కాపాడవచ్చు. ఇక ప్రధాన చికిత్స తర్వాత పక్షవాతం నుంచి పూర్తిగా కోలుకోడానికి ఫిజియోథెరపీ చికిత్స కూడా అవసరమవుతుంది. డా. జయదీప్ రాయ్ చౌధురి, సీనియర్ ఫిజీషియన్, యశోద హస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
ప్రముఖ నటుడికి తీవ్ర అస్వస్థత
ప్రముఖ తమిళ నటుడు తెన్నవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం తెల్లవారు జామున ఆయనకు పక్షవాతం రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అయనకు వచ్చిన పక్షవాత ప్రభావం ఎక్కువగా ఉండటంతో అత్యవసర చికిత్సా విభాగంలో వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే తెన్నవన్ పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సహాయ నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన తెన్నవన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న వార్త తెలుసుకున్న కోలీవుడ్ వర్గాలు ఆస్పత్రికి చేరుకుని.. తెన్నవన్‌ను పరామర్శించి ఆయన కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపుతున్నారు. తెన్నవన్‌ను భారతీరాజా కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే తొలి సినిమాతో అంతగా పేరు రానప్పటికీ.. చియాన్ విక్రమ్ సినిమా ‘జెమిని’తో తెన్నవన్‌కు సహాయనటుడిగా మంచి గుర్తింపు లభించింది. అనంతరం ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కమల్ హాసన్ విరుమండి, జిగర్తాండా, సుందర పాండియన్, సండకోళి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రజనీ కాంత్ ‘పెట్టా’సినిమాలో మినిస్టర్ పాత్రలో తెన్నివన్ ఆకట్టుకున్నాడు. -
పక్షవాతం వచ్చినా మళ్లీ నడవొచ్చు..
పారిస్: ఒక్కసారి పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు పడిపోతే.. ఇక అంతే సంగతులు. ఆ మనిషి మంచానికే పరిమితం అయిపోతారు. ఇవీ ఇప్పటివరకు పక్షవాతంపై ఉన్న ఆలోచనలు. కానీ ఇకపై ఈ లెక్క మారిపోనుంది. పక్షవాతం వచ్చినా కూడా లేచి నిలబడే అవకాశం ఉంది. ఇది ఫ్రాన్స్ వాసి విషయంలో నిజమైంది. మన మెదడు నియంత్రించేలా శరీరం బయట అస్తిపంజరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. టెలీప్లెజిక్స్ అని పిలిచే ఈ సాంకేతికతకు ఊతమిచ్చినట్లు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవనంపై నుంచి కింద పడటంతో వెన్నెముక పూర్తిగా దెబ్బతిని 28 ఏళ్ల థిబాల్ట్‌కు భుజం నుంచి కింది భాగం మొత్తం పక్షవాతం వచ్చింది. దీంతో టెలీప్లెజిక్స్ సాంకేతికత సాయంతో అతడికి కొత్త జీవితాన్ని డాక్టర్లు ప్రసాదించారు. దీంతో తిరిగి చక్కగా నడుస్తున్నాడు. ఈ సాంకేతికతలో కంప్యూటర్ ద్వారా మెదడు నుంచి సిగ్నల్స్.. శరీరం బయట ఉన్న అస్తిపంజరాన్ని నియంత్రిస్తారు. కొన్ని నెలల పాటు ఈ అస్తిపంజరంతో శిక్షణ అందించడంతో ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు. గ్రెనోబెల్ అల్పస్ ఆస్పత్రి నిపుణుల బృందం, సినాటెక్ పరిశోధకులు ఈ విజయం సంధించారు. -
ఉద్యోగం ఇప్పించండి..
సాక్షి, పాల్వంచ: పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేసి ఓ వ్యక్తి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఓ రోడ్డు ప్రమాదంలో అతడి భార్య కదల్లేని స్థితిలో ఉంది. అదే రోడ్డు ప్రమాదంలో వారి కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక మిగిలింది ఆ ఇంట్లో వారి కూతురు. ఆమెకు తన తండ్రి ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటోంది. తద్వారా తన తల్లిదండ్రులకు మంచి వైద్యం చేయించుకుంటానని, చివరి అంకంలో వారికి చేదోడువాదోడుగా ఉంటానని చెబుతోంది. ఆ కుటుంబ దీన గాథ పలువురిని కలచివేస్తోంది.పాల్వంచ పట్టణంలోని బాపూజీ నగర్‌కు చెందిన షేక్ ఖాసీం పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించాడు. 1999లో పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. దీంతో మంచానికే పరిమితమయ్యాడు. అతడి ఉద్యోగం భార్య మొగలాబీ చేయాలంటే ఖాసీంకు సపర్యలు చేసే దిక్కులేదు. దీంతో ఉద్యోగం కుమారుడు యాకూబ్‌పాషాకు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులకు ధరఖాస్తు చేసుకున్నాడు. ఐదేళ్లుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నారు. ఇంతలో గత జనవరి 4వ తేదీన కొత్తగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు యాకూబ్‌పాషాతో పాటు మనవడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొగలాబీ నడుము విరిగింది. ఏ పని చేయలేని పరిస్థితికి చేరింది. దీంతో కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోయి ఉంది. ఇక కుటుంబ భారం మొత్తం ఎకైక కూతురు షేక్ మీరాబిపై పడింది. తల్లిదండ్రులు ఇద్దరు మంచానికి పరిమితం అవడంతో తండ్రి ఉద్యోగం తనకు కల్పించాలని కూతురు మీరాబీ వేడుకుంటోంది. తన భర్త ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, ఒక్కడు పనిచేస్తేనే మందులకు, ఇళ్లు గడవడానికి ఇబ్బందికరంగా మారిందని వాపోతోంది. పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీలతో పాటు, ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించినా సంవత్సరాల తరబడి తిరగాల్సి వస్తోంది తప్ప ఉద్యోగం ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమవుతోంది. ఇప్పటికైనా తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ఆదుకోవాలని వేడుకుంటోంది. -
కండరాలు ఎందుకు ఇలా పట్టేస్తున్నాయి?
నా వయసు 38 ఏళ్లు. గత కొంతకాలంగా నాకు కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. కొన్నిసార్లు కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు, మరికొన్నిసార్లు నిద్రలో ఇలా జరుగుతోంది. నిద్రలో ఇలా జరిగినప్పుడు అకస్మాత్తుగా నిద్ర లేచి కుంటుతూ నడుస్తుంటాను. ఈ వేసవిలో మరిన్నిసార్లు ఈ సమస్య కనిపిస్తోంది. నాకు ఈ సమస్య ఎందుకు వస్తోంది. దీని నుంచి బయట పడటానికి మార్గం చెప్పండి. తరచూ కాళ్లు, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టేయడానికి (క్రాంప్స్‌కు), నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కొందరిలో తమ శరీరంలోని నీటి పాళ్లు తగ్గినా (సింపుల్ డీహైడ్రేషన్ వల్ల ) కూడా మీరు చెప్పిన లక్షణాలు వ్యక్తమవుతాయి. మీరు తీవ్రమైన అలసటకు గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు వ్యాయామం చేయని కారణంగా కండరాలు బలహీనమైపోయి, తీవ్రమైన అలసట కలగడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగే పరిణామం. దీనివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మీ కండరాలను బలపరచుకోవాల్సి ఉంటుంది. ఇక కొందరిలో సోడియమ్, పొటాషియమ్, చక్కెరపాళ్లు, క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి ఖనిజ లవణాలు తగ్గడం గానీ లేదా పెరగడం గానీ జరిగినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో విటమిన్ బి12, విటమిన్ డి తగ్గడం వల్ల, థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొందరిలో కొన్నిసార్లు సాధారణ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరిలో పెరిఫెరల్ నర్వ్స్ అనే నరాలు, వెన్నెముక లోపాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలిసి, విపులంగా రక్త పరీక్షలు చేయించుకొని, లక్షణాలకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. సమస్య ఏమిటన్నది కనుగొంటే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. పక్షవాతానికి సెమ్సెల్ థెరపీ అందుబాటులో ఉందా? నేను గత తొమ్మిదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాను. ఇటీవల వార్తాపత్రికలు చదువుతూ పెరాలసిస్‌కు మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అందుబాటులోకి వచ్చినట్లు తెలుసుకున్నాను. నేను ఈ చికిత్స తీసుకోదలిచాను. ప్రస్తుతం ఇది ఎక్కడ లభ్యమవుతోంది, దీనికి ఎంత ఖర్చవుతుంది, దాని ఫలితాలెలా ఉన్నాయనే వివరాలు విపులంగా తెలియజేయండి. ఒకసారి మెదడులోని కణాలు చనిపోతే అవి శాశ్వతంగా చనిపోయినట్టే. అది పక్షవాతం వల్ల చనిపోయినా లేదా మెదడుకు గాయం కావడం వల్ల చనిపోయినా మెదడులోని కణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరుజ్జీవించలేవు. కానీ ఒక ఆశారేఖ ఉంది. మెదడు కణాలు చనిపోయిన సమయంలోనే ఆ కణాలలో నిక్షిప్తం అయి ఉన్నదాన్ని మనం తిరిగి పొందాలంటే దెబ్బతిన్న కణాలకు పక్కనే ఉండే కణాలు తోడ్పడతాయి. మన మెదడుకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని ‘న్యూరోనల్ ప్లాస్టిసిటీ’ అని వ్యవహరిస్తారు. ఇలా మనం 80 శాతం మేరకు కోలుకోడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధి పడుతుంది.ఇక మూలకణాల విషయానికి వద్దాం. మూలకణాలతో చికిత్స అంటే... ఇవి మన శరీరంలోని ఎలాంటి కణాలుగానైనా మారేశక్తి ఉన్న కణాలన్నమాట. పక్షవాతానికి మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియలో విషయంలో రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాం. మొదటిది... మెదడులోనే చెడిపోయి ఉన్న కణాలను కొన్ని మందుల ద్వారా మళ్లీ ప్రేరేపించి పనిచేయించేలా చూడటం; ఇక రెండోది... బయటి నుంచి మూలకణాలను శరీరంలోకి పంపడం. అంటే ఉదాహరణకు చెడిపోయిన మూలగ స్థానంలో కొత్త కణాలు పంపి, కొత్త మూలగను రూపొందించేలా అన్నమాట.ఇక చనిపోయిన మెదడుకణాల స్థానంలో మూలకణాలను ప్రవేశపెట్టడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మూలకణాలు పాతకణాలతోనూ, న్యూరాన్ల దారులతో అనుసంధానితం అయి, అక్కడి రసాయన చర్యలకు అనుగుణంగా స్పందిస్తూ ఉండటానికి చాలా కాలం పడుతుంది. ఇందుకు కొన్నేళ్ల వ్యవధి కూడా పట్టవచ్చు. ఇవ్వాళ్టికీ ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి వచ్చిన ఫలితాలైతే అంత సంతృప్తికరంగా లేవు. కాబట్టి ప్రస్తుతానికి మూలకణ చికిత్స అన్నది పరిశోధనదశలోనే ఉంది. పరిస్థితి ఇంకా ఆసుపత్రిలో చికిత్స అందించే వరకు రాలేదు. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మణికర్ణికకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై : వివాదాల్లో కూరుకుపోయిన మణికర్ణిక మూవీ టీమ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సమయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిత్ర నిర్మాత కమల్ జైన్ పక్షవాతానికి గురై ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో చేరేందుకు ఇది కచ్చితంగా సరైన సమయం కాదు..త్వరలోనే కోలుకుని చిత్ర విజయానికి మన సమిష్టి కృషిని గుర్తుచేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందామని అంతకుముందు జైన్ ట్వీట్ చేశారు. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించడంతో పాటు కొంత భాగానికి దర్శకత్వం వహించారు. కాగా జనవరి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సినిమాలో కొన్ని సన్నివేశాలపై హిందూ కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
గర్భిణులు తిండి బాగా తినాలా?
నా వయసు 23. నేను ప్రెగ్నెంట్. నాకు పెద్దగా తిండిమీద ధ్యాస ఉండదు. ఏదో సమయానికి తినాలి కాబట్టి తింటూ ఉంటాను. అయితే గర్భిణులు తిండి బాగా తినాలంటున్నారు నా సన్నిహితులు. ‘గర్భిణులు కచ్చితంగా 350 కేలరీల ఆహారం అధికంగా తీసుకోవాలి’ అంటుంటారు. దీని గురించి వివరించండి. నాకు సీతాఫలాలు అంటే చాలా ఇష్టం. ఈ సమయంలో తినవచ్చా? తెలియజేయగలరు – కె.శ్యామల, కొత్తపట్నం సాధారణ మహిళలకు రోజువారి బరువును బట్టి, చేసే పనిని బట్టి 1800 నుంచి 2200 క్యాలరీల శక్తి అవసరం ఉంటుంది. అదే గర్భిణీలలో అయితే 350 క్యాలరీల శక్తి అధికంగా అవసరం ఉంటుంది. మొదటి 7 నెలల వరకు . తర్వాత నుంచి 500 క్యాలరీల అధికంగా అవసరం ఉంటుంది. ఇది తల్లిలో జరిగే మార్పులకు, గర్భంలో పెరిగే శిశువు బరువుకు అవయవాల అవసరాలకు ముఖ్యం. గర్భం అంటే ఇద్దరికి సరిపడా తినాలని అనుకుంటూ ఉంటారు. అది సరికాదు. సాధారణంగా తీసుకునే ఆహారం కంటే 350 క్యాలరీలు శక్తినిచ్చే ఆహారం అంటే రోజుకు కనీసం రెండు గ్లాసులు పాలు, పండ్లు, పప్పులు తీసుకున్నా సరిపోతుంది. ఆహారంలో ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పాలు, పెరుగు, పండ్లు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఉండేటట్లు చూసుకోవడం మంచిది. మాంసాహారలు అయితే రోజు ఒక గుడ్డు, వారానికి రెండుసార్లు బాగా ఉడకబెట్టిన మాంసాహారం తీసుకోవచ్చు. సీతాఫలాలలో విటమిన్–సి, ఎ, బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. బరువు ఎక్కువగా లేనివాళ్లు రోజుకొక సీతాఫలం తీసుకోవచ్చు. ఇందులో చక్కెరశాతం కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి, బరువు ఎక్కువ ఉన్నవారు, షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నవారు, ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. లేదా ఇది తీసుకునప్పుడు ఆ పూటకి మిగతా కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం వంటివి తీసుకోకపోవటం మంచిది. మా చెల్లికి పెళ్లై ఎనిమిదేళ్లు కావస్తోంది. తనకి ఇంకా పిల్లలు పుట్టలేదు. తన వయసు 29. ఎన్నో ట్రీట్మెంట్స్, పరీక్షలు చేయించుకున్న తర్వాత ‘థ్రాంబోఫిలియా’ వల్లనే పిల్లలు కలగడం లేదని డాక్టర్ చెప్పారట. అసలు థ్రాంబోఫిలియా అంటే ఏమిటి? దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – బి.సుకన్య, కర్నూల్ రక్తనాళాలల్లో కొన్ని కారణాల వల్ల రక్తం ఎక్కువగా గూడు కట్టి.. దాని వల్ల వచ్చే పరిస్థితినే థ్రాంబోఫిలియా అంటారు. దీని వల్ల ఏ అవయవానికి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గూడు కడుతుందో ఆ అవయవానికి రక్త సరఫరా తగ్గి, ఆక్సిజన్ సరఫరా తగ్గి, ఆ అవయవం పని తీరు స్తంభించి సమస్యలు ఏర్పడవచ్చు. మన శరీరంలో ఎక్కడైన దెబ్బతగిలినప్పుడు, రక్తస్రావం(బ్లీడింగ్) అవుతుంది. దీనిని ఆపటానికి సహజసిద్ధంగా మన శరీరంలో ఉండే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ రక్తం గూడు కట్టేటట్లు బ్లీడింగ్‌ని ఆపుతాయి. ఇది సహజం. కానీ థ్రాంబోఫిలియాలో జన్యుపరమైన కారణాలతో పాటు ఇంకా అనేక కారణాల వల్ల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉత్పత్తి పనితీరులో లోపాలు వల్ల, రక్తనాళాలలో రక్తం మరీ ఎక్కువగా గూడు కట్టిపోతుంది. అది ఎక్కడ గూడు కట్టింది అనే దానిబట్టి గుండెనొప్పి, ఆయాసం, పక్షవాతం, కళ్లు కనిపించకపోవడం వంటి అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇందులో కొందరిలో పుట్టుకతో లోపాలు ఉండవచ్చు. కొందరిలో రక్తనాళాలలో కొన్ని పదార్థాలకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవడం వల్ల లోపాలు ఏర్పడవచ్చు. థ్రాంబోఫిలియా ఉన్నవారిలో గర్భాశయపొరకి రక్తసరఫరా చేసే రక్తనాళాలలో రక్తం గూడు కట్టి రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల అక్కడ పిండం అంటుకుని ఎదగలేక (జీఝp ్చn్ట్చ్టజీౌn జ్చజీ uట్ఛ) గర్భం అందదు. అలాగే గర్భం పెరగకుండా అబార్షన్లు అవటం జరుగుతుంది. కొందరిలో పీరియడ్స్ ఆలస్యంగా వచ్చి, గర్భం దాల్చినట్లు అనిపించి పీరియడ్స్ వచ్చేయడం జరుగుతుంది. కొందరిలో తల్లి నుంచి బిడ్డకు రక్తం అందించే రక్తనాళాల్లో, మాయలో రక్తం గూడు కట్టడం వల్ల తీవ్ర సమస్యలు వస్తాయి. (కొందరిలో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నాలు చేసేవారిలో గర్భం రాకపోవడం, అబార్షన్లు అవ్వడం, బిడ్డ బరువు పెరగకపోవడం, బీపీ పెరగడం, గర్భం బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, కడుపులో బిడ్డ చనిపోవడం, నెలలు నిండకుండానే కాన్పు చెయ్యవలసి రావటం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి) థ్రాంబోఫిలియా సమస్య ఉన్నవారిలో గర్భాశయానికి రక్తసరఫరా సరిగా లేకపోవడం వల్ల కొందరిలో టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతిని అనుసరించినా కూడా గర్భం అందదు. డాక్టర్ పర్యవేక్షణలో ఇఆ్క యాంటీ పాస్పోలిపిడ్ యాంటీబాడీస్, అ్కఖీఖీ, ్కఖీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వంటి అనేక రక్తపరీక్షలు చెయ్యడం వల్ల థ్రాంబోఫిలియా నిర్ధారణ చెయ్యడం జరుగుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేసేవారికి రక్తం గూడుకట్టకుండా ఉండేందుకు ఉఛిౌటpటజీn, ఏ్ఛp్చటజీn జీn్జ్ఛఛ్టిజీౌnటఇవ్వడం జరుగుతుంది. ఇది గర్భం వచ్చిన తర్వాత కూడా 9 నెలలు వరకు ఇవ్వడం జరుగుతుంది. గర్భస్థ శిశువు ఆరోగ్యంపై శ్రద్ధ చూపమని చెబుతుంటారు. అయితే ఏ రకంగా అనే దాని గురించి మాత్రం నాకు తెలియదు. దయచేసి తెలియజేయగలరు. – కె.రుక్మిణి, విజయనగరం గర్భంలో శిశువు ఆరోగ్యంగా పెరగటానికి, తల్లి మానసికంగా.. శారీరకంగా.. ఆరోగ్యం కలిగి ఉండాలి. శిశువు ఎదుగుదలకి తల్లి నుంచే పోషకపదార్థాలు అందుతాయి. దీని కోసం తల్లి తొమ్మిది నెలల పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం మంచిది. డాక్టర్ దగ్గర సక్రమంగా చెకప్‌లకు వెళ్లడం, అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగ్‌లు చెయ్యించుకుని, పరిస్థితిని బట్టి అవసరమైన ఐరన్, ఫోలిక్‌యాసిడ్, కాల్షియం వంటి విటిమిన్ టాబ్లెట్స్ వాడుకుంటూ, డాక్టర్ సలహాలను పాటించటం మంచిది. ఆహారంలో పచ్చని ఆకుకూరలు, తాజా కూరగాయలు పప్పులు, పాలు, పెరుగు, పండ్లు, గుడ్లు, కొద్దిగా మాంసాహారం వంటివి తీసుకోవడం మంచిది. ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ సలహా మేరకు చిన్నగా నడక, ధ్యానం, చిన్నచిన్న వ్యాయామాలు, యోగా, ప్రాణాయామం వంటివి చెయ్యడం మంచిది. ఈ సమయంలో ఆందోళన చెందకుండా ఎక్కువగా మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవటం మంచిది. దీనికి కుటుంబసభ్యుల సహకారం అవసరం. మనసుని ఆనందంగా ఉంచుకునప్పుడు బిడ్డ యొక్క మానసిక పెరుగుదల కూడా బాగుంటుంది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
పక్షవాతానికి వినూత్నమైన విరుగుడు...
ప్రమాదవశాత్తూ లేదా.. ఆరోగ్య సమస్యల కారణంగా పక్షవాతానికి గురైన వారికి లూయివిల్లీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరిష్కారాన్ని సిద్ధం చేశారు. వెన్నెముకను మళ్లీ చైతన్యవంతం చేసేందుకు ఓ పరికరాన్ని అమర్చడం.. నెలల తరబడి ఫిజియోథెరపీ కొనసాగించడం అనే రెండు పనులను కలిపి ప్రయోగించడం ద్వారా పక్షవాతానికి గురైన వారు ఇతరుల సాయం లేకుండా నడిచేలా చేయవచ్చునని వీరు అంటున్నారు. పక్షవాతానికి గురైన నలుగురికి తామీ వినూత్న పద్ధతి ద్వారా చికిత్స అందించామని, ఇద్దరు తమంతట తాము లేచి నుంచోగలిగారని, కొన్ని అడుగులు వేయగలిగారని, మిగిలిన ఇద్దరు ఎటువంటి సాయం అవసరం లేకుండా నడవగలిగారని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేవడ్ డారో తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్ మెడిసిన్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఈ పద్ధతి వెన్నెముక గాయాల చికిత్సలో కొత్త అధ్యాయమని చెప్పారు. అయితే ప్రస్తుతం జరిగింది చాలా చిన్న స్థాయి అధ్యయనం మాత్రమేనని, వేర్వేరు గాయాలు, ఆరోగ్య సమస్యలున్న వారికీ ఇదేస్థాయి ఫలితాలు వచ్చినప్పుడే విస్తృత వినియోగానికి అవకాశముంటుందని చెప్పారు. -
వెన్నెముకకు పక్షవాతం వచ్చినా నడవొచ్చు!
బోస్టన్: వెన్నెముకకు గాయమై పక్షవాతం బారిన పడి నడక సామర్థ్యాన్ని కోల్పోయిన వారిని తిరిగి నడవగలిగేలా చేసే చికిత్సను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ నూతన చికిత్సను ఎలుకలపై ప్రయోగించినప్పుడు 100 శాతం ఫలితాలతో నడక సామర్థ్యం కలిగినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ చికిత్సను మానవులపై ప్రయోగించి సత్ఫలితాలను పొందవచ్చని వారు భావిస్తున్నారు. వెన్నెముకకు గాయమైన ప్రదేశం కింది భాగం పక్షవాతం బారిన పడి అత్యధికులు నడక సామర్థ్యాన్ని కోల్పోతున్నారని వివరించారు. గాయం కాని వెన్నుముక భాగాలు ఎందుకు పనిచేయకుండా పోతున్నాయో తెలుసుకునేందుకు గాను అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా సీఎల్పీ 290 అనే మిశ్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో ఇంట్రాపెరిటోనియల్ ఇంజెక్షన్ ద్వారా ఎలుకలకు ఎక్కించారు. అనంతరం నాలుగైదు వారాల్లో ఎలుకల్లో నడక సామర్థ్యం కలిగినట్లు తెలిపారు. ఈ మిశ్రమం కారణంగా కాలి వెనుక భాగాల్లో కదలికలు ఏర్పడినట్లు ఎలక్ట్రోమయోగ్రఫీ రికార్డులో స్పష్టమైనట్లు వివరించారు. -
పేదింటికి పుట్టెడు కష్టం
దొరవారిసత్రం: చిన్నారుల ఆటపాటలు, సరదాలతో ఆనందంగా గడపాల్సిన కుటుంబం పుట్టెడు కష్టంతో విలవిల్లాడుతోంది. శారీరక, మానసిక ఎదుగుదల లేకుండా జన్మించిన ఇద్దరు పిల్లలను చూసి తల్లిదండ్రులు పడుతున్న వేదన అంతుపట్టలేకుండా ఉంది. మెరుగైన చికిత్సను అందించే స్తోమత సైతం లేకపోవడంతో కుటుంబం అంతులేని ఆవేదనకు గురవుతోంది. దొరవారిసత్రం మండలం తీర గ్రామమైన మీజూరు పంచాయతీ పరిధిలో గల కారికాడు ఎస్సీ కాలనీకి చెందిన కొమ్మక శేఖర్, వసంతమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు అమ్ములు(13), శ్రీమంజుల(11), రాజేష్(09). వీరిలో అమ్ములు, రాజేష్ పుట్టిన ఏడాది నుంచే కాళ్లు, చేతులు చచ్చుబడి నడవలేకపోయారు. పిల్లల ఆలనాపాలనకే తండ్రి పిల్లవాడికైతే మాట కూడా సక్రమంగా రాదు. అప్పట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వయస్సు పెరిగినా, శారీరకంగా ఇద్దరి పిల్లల్లో ఎదుగుదల్లేదు. ఇద్దరు పిల్లలకు ఎవరో ఒకరి సాయం లేనిదే ఏమీ చేయలేని పరిస్థితి. కుటుంబ పరిస్థితి బాగొలేకపోవడంతో తడ ప్రాంతంలోని అపాచీ కంపెనీలో తల్లి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తండ్రి మాత్రం ఇంటి వద్దే ఉండి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నారు. అమ్ములు ఐదో తరగతి వరకు స్థానిక ప్రాథమిక పాఠశాలలోనే తండ్రి సాయంతో చదివింది. ఉన్నత విద్యకు బయట పాఠశాలకు పంపలేని పరిస్థితి. రాజేష్‌కు నోటి మాట కూడా సక్రమంగా రాకపోవడంతో పాఠశాలకు పంపలేదు. పింఛన్ మంజూరులో అన్యాయం దివ్యాంగులైన అమ్ములు, రాజేష్‌కు 100 శాతం వికలత్వ సర్టిఫికెట్ ఉన్నా, ప్రభుత్వం నుంచి పింఛన్ అందడంలేదు. పింఛన్ కోసం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తండ్రి ఏడేళ్లుగా తిరుగుతున్నా, ప్రయోజనం శూన్యమవుతోంది. గతేడాది రేషన్ కార్డులో పిల్లలను నమోదు చేసుకుంటే పింఛన్ వస్తుందని అధికారులు సూచించారు. పలుచోట్ల తిరిగి రేషన్‌కార్డులో పేర్లు నమోదు చేయించి పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం మాత్రం కానరాలేదు. తాజాగా ప్రజాసాధికారిక సర్వేలో పిల్లల పేర్లు లేవని, ఈ క్రమంలోనే దివ్యాంగుల పింఛన్ రావడంలేదని మండలాధికారులు తెలిపారు. ప్రజాసాధికారిక సర్వేలో పిల్లల పేర్ల నమోదుకు కొన్ని రోజులు నుంచి తిరుగుతూనే ఉన్నా అధికారులు మాత్రం కనికరం చూపడంలేదు. పింఛనైనా వస్తే పిల్లలకు మంచి ఆహారాన్ని అందించవచ్చనే ఆశతో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. -
భార్య శవం పక్కనే వారం రోజులు
దొడ్డబళ్లాపురం : గుండెపోటుతో మృతి చెందిన భార్య శవాన్ని కూడా ముట్టుకోలేని స్థితిలో అచేతనంగా ఉన్న భర్త శవం పక్కనే వారం రోజులు గడిపిన సంఘటన కారవారలోని కేహెచ్‌బీ కాలనీలో చోటుచేసుకుంది. గిరిజ మడివాళ్ (42) గుండెపోటుతో మృతి చెందారు. ఆనంద్ అనారోగ్యం కారణంగా మంచానపడ్డాడు. పెరాలసిస్‌తో కదలేని స్థితిలో ఉన్న ఆయన ఏమీ చేయలేని స్థితిలో వారం రోజుల పాటు భార్య శవం పక్కనే ఉన్నాడు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయనకు భార్యే సపర్యలు చేసేది. ఇళ్ల పనులు చేసే గిరిజ కొద్ది రోజులుగా రాకపోవడంతో ఆదివారం కొందరు వెతుక్కుంటూ ఆమె ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే శవం కుళ్లిన స్థితికి చేరింది. ఆనంద్ కూడా కొన ఊపిరితో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. -
పక్షవాతం..ప్రాణాంతకం..!
గురజాలకు చెందిన వెంకటేశ్వర్లు ఏడాది క్రితం పక్షవాతానికి గురయ్యాడు. చుట్టుపక్కల వారి మాటలు విన్న ఆయన ఆకుపసరు మందు తీసుకుని మిన్నకుండిపోయాడు. దీంతో వ్యాధి తగ్గకపోగా శాశ్వత అంగవైకల్యానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆయన దివ్యాంగుల సర్టిఫికెట్ కోసం గుంటూరు జీజీహెచ్‌కు వచ్చాడు. దివ్యాంగుల సర్టిఫికెట్ల కోసం వచ్చే వారిలో 80 శాతం మంది పక్షవాతాన్ని అశ్రద్ధ చేయడం వల్లే వికలాంగులుగా మారుతున్నారని, వారంతా మందులు వాడకుండా అంత్రాలు, ఆకుపసరులతో కాలం వెళ్లదీయటం వల్లే ఈ దుస్థితి నెలకొంటోందని న్యూరాలజీ వైద్యులు వెల్లడిస్తున్నారు. గుంటూరు మెడికల్: పక్షవాతాన్ని వైద్య పరిభాషలో సెరిబ్రో వాస్క్యులర్ యాక్సిడెంట్ అని పిలుస్తారు. ఈజబ్బు సోకిన వారిలో శరీరంలో ఏదో ఒకభాగం చచ్చుబడుతుంది. ఒక భాగం (పక్షం) పడిపోతుంది కనుక పక్షవాతం అని పిలుస్తారు. రక్తనాళాల్లో రక్తం కొంత ఒత్తిడితో ప్రవహిస్తుంటుంది. రక్తంలోని ఒత్తిడి పెరిగితే కొంత పరిమితి వరకు రక్తనాళాలు ఒత్తిడిని తట్టుకుంటాయి. ఆ ఒత్తిడి బాగా పెరిగితే కొంత రక్తస్రావం జరుగుతుంది. మెదడులో రక్తస్రావం జరిగినా, రక్తం గూడు కట్టినా పక్షవాతం వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పక్షవాతంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్ 24 ఏటా ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. పక్షవాతానికి కారణాలు.. మెదడుకి వెళ్లే రక్తనాళం గాని, మెదడులోని రక్తనాళం గాని పూడుకుపోవటం వల్ల రక్తం సరఫరా ఆగిపోతే పక్షవాతం వస్తుంది. మెదడులో కణుతులు, రక్తపోటు పెరగటం, పొగతాగడం, మద్యపానం వల్ల రక్తనాళాలు దెబ్బతిని పక్షవాతం వస్తుంది. రక్తంలో కొవ్వు పదార్ధాలు (కొలెస్ట్రాల్)వల్ల, స్థూలకాయం వల్ల వ్యాధి వస్తుంది. లక్షణాలు ఇవి.. పక్షవాతం వచ్చినప్పుడు కొందరికి ఒకే వస్తువు రెండుగా కనబడతుంది. మాట తడబడటం, అయోమయంగా మాట్లాడటం, మింగుడు పడకపోవటం, నీరు కూడా సరిగా తాగలేకపోవడం, నీరు తాగబోతే ముక్కు వెంట కొంత బయటకు రావడం, కళ్లు తిరగడం, తల తిరగడం, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, వాంతులు, నడకలో తూలుడు, చేయి, మూతి ఒకవైపునకు ఒంకరపోవటం, దృష్టి మందగించడం, కాళ్ళు చేతులు ఉన్నట్టుండి బలహీన పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో రోగి అపస్మారక స్థితి (కోమా)లోకి వెళ్తాడు. ముందస్తు జాగ్రత్తలు... కొన్ని సందర్భాల్లో ప్రాణాలు హరించి వేసే పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. షాలిష్ బియ్యం కాకుండా ముడి బియ్యం తినాలి. రాగులు, సజ్జలు, జొన్నలు లాంటి చిరుధాన్యాలు తీసుకోవాలి. ప్రతిరోజూ యోగా, నడవడం చేయడం మంచిది. జీవనశైలిని మార్చుకోవాలి. ఇంట్లో, బయట పొల్యూషన్‌కు దూరంగా ఉండాలి. రక్తపోటు, షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవాలి. పొగ తాగరాదు. మద్యం సేవించరాదు. కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తినకూడదు. స్థూలకాయం తగ్గించుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. పెరుగుతున్న బాధితుల సంఖ్య గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో 2018 జనవరిలో 50 మంది, ఫిబ్రవరిలో 58 మంది, మార్చిలో 52 మంది, ఏప్రిల్‌లో 54 మంది, మే లో 51 మంది చికిత్స పొందారు. 2016లో 455 మంది, 2017లో 625 మంది పక్షవాతం బారిన పడి చికిత్స పొందారు. జిల్లాలో 20 న్యూరాలజీ స్పెషాలిటి ఆస్పత్రులు ఉన్నాయి. ప్రతిరోజూ ఒక న్యూరాలజీ వైద్యుడు ఒకరు లేదా ఇరువురు పక్షవాత బాధితులను కొత్తగా గుర్తించి వైద్యసేవలు అందిస్తున్నారు. -
పరి పరిశోధన
పక్షవాతం రోగులకు మేలు చేసే ఎక్సోజీటీ పక్షవాతం వచ్చిన వారు తమ కాళ్లపై నిలిచేందుకు, నడిచేందుకు ఉపయోగపడే ఓ వినూత్నమైన బయోనిక్ ఎక్సోస్కెలిటన్‌ను తయారు చేశారు కాలిఫోర్నియాలోని ఎక్సో బయోనిక్స్ శాస్త్రవేత్తలు. శరీరం దిగువభాగం చచ్చుబడిపోయిన వారు రెండుకాళ్లపై నిలబడగలిగితే పొందే ఆత్మవిశ్వాసం వేరే ఉంటుందని ఎక్సోజీటీ ఇందుకు ఉపయోగపడుతుందని షికాగోలోని రష్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్త డయాన్ గెనాజ్ తెలిపారు. ఈ మెడికల్ సెంటర్లో ఇప్పటికే తాము ఎక్సోజీటీని ఉపయోగించడం మొదలుపెట్టామని చెప్పారు. బ్యాటరీతో పని చేసే ఎక్సోజీటీని నడుముకు బిగించుకుంటే కంట్రోల్ ప్యాడ్ ద్వారా నడవడం సాధ్యమవుతుందని, అడుగు ఎంత దూరంలో పడాలి ఎంత వేగంతో పడాలన్న విషయాలను ప్యాడ్ ద్వారానే నిర్ణయించుకోవచ్చునని వివరించారు. తుంటి, మోకాలి ప్రాంతాల్లో ఉండే రెండు మోటార్ల ద్వారా ఎక్సోజీటీ కదలికలకు కారణమవుతుందని చెప్పారు. శరీరం ఎత్తు 5.2 నుంచి 6.2 అడుగుల మధ్య ఉన్న వారందరితోనూ ఈ ఎక్సోస్కెలిటన్ పనిచేస్తుందని 110 కిలోల వరకూ శరీర బరువును భరించగలదని అన్నారు. అయితే ఇది సమర్థంగా పని చేయాలంటే శరీరం పై భాగం, కనీసం ఒక్క చేయి పనిచేస్తూ ఉండాలి. తగిన శిక్షణ ఉన్న వారు ఎక్సోస్కెలిటన్ నుంచి వీల్ ఛెయిర్‌కు.. వీల్ ఛెయిర్ నుంచి ఎక్సోస్కెలిటన్‌కు చాలా వేగంగా మారిపోగలరని గెనాజ్ తెలిపారు. టైమ్ మ్యాగజైన్ 2017 అద్భుత ఆవిష్కరణలో దీన్ని ఒకటిగా గుర్తించడం విశేషం. మొక్కల జన్యుక్రమ నమోదుకు మహా ప్రయత్నం జన్యుక్రమాన్ని తెలుసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి కాబట్టే కొన్నేళ్లక్రితం శాస్త్రవేత్తలు మానవ జన్యుక్రమ నమోదును పూర్తి చేశారు. బాగానే ఉందిగానీ మనకు తిండిపెట్టే మొక్కల సంగతేమిటి? ‘ద ఎర్త్ బయోజినోమ్ ప్రాజెక్టు’ పేరుతో ఈ కొరతను పూరించేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సిద్ధమవుతోంది. భూమ్మీద ఉన్న మొత్తం 15 లక్షల మొక్కల జన్యుక్రమ నమోదు ద్వారా భవిష్యత్తులో వీటిని సంరక్షించుకోవడం ఎలా అన్నది తెలుస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ఇటీవల ముగిసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాల్లో ప్రాజెక్టు వివరాలను ప్రకటించారు. ఇప్పటివరకూ కొన్ని మొక్కల జన్యుక్రమాలను నమోదు చేసినప్పటికీ అది పిసరంత మాత్రమేనని మనిషికి తెలిసిన 15 లక్షల మొక్కల అధ్యయనం పూర్తి చేయాలంటే పదేళ్ల సమయం, దాదాపు 470 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తరువాత అందుబాటులోకి వచ్చే 100 కోట్ల గిగాబైట్ల సమాచారాన్ని అందరూ వాడుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు. మొక్కలు ఎలా పుట్టాయి? ఎలా పరిణామం చెందాయి వంటి సంక్లిష్ట ప్రశ్నలకు ఈ ప్రాజెక్టు ద్వారా సమాధానాలు లభిస్తాయని అంచనా. 90 వేల కార్ల కాలుష్యం.. ఉఫ్! ఫొటో చూశారుగా.. అదీ సంగతి. ఇలా ఓ ప్రత్యేకమైన వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఒక ఏడాదిలో 90 వేల కార్లు విడుదల చేసే పొగలోని కాలుష్యాన్ని శుద్ధి చేసేయవచ్చు. కెంగో కుమా అనే సంస్థ డిజైన్ చేసిన ఈ కళాకృతి నానో టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. పేరు ‘బ్రీత్ ఇంగ్’. ఇటలీలో జరుగుతున్న మిలాన్ డిజైన్ వీక్ 2018లో దీన్ని ప్రదర్శిస్తున్నారు. దాదాపు 175 చదరపు మీటర్ల వైశాల్యమున్న వస్త్రాన్ని ఇలా చుట్టలు చుట్టలుగా ఏర్పాటు చేశారు. పరిసరాల్లో ఉండే అన్ని రకాల కాలుష్యకారకమైన వాయువులను పీల్చేసుకుంటుంది. వేలాడదీసేందుకు ఉపయోగించిన కడ్డీ, బిగించేందుకు వాడుతున్న జాయింట్లు అన్నీ హెచ్‌పీ మల్టీజెట్ ఫ్యూజన్ త్రీడీ ప్రింటర్ ద్వారా తయారు చేసినవి కావడం గమనార్హం. యుద్ధవిమానాల తయారీ కంపెనీ డసాల్ట్ సిస్టెమ్స్ అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ ఆధారంగా ఈ డిజైన్ ఏర్పాటు జరిగింది. నగరాల్లో ఏటికేడాదీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. చైనాలో డాన్ రొసగ్రేడ్ అనే డిజైనర్ రూపొందించిన భారీ సైజు వాక్యూమ్ క్లీనర్ గాల్లోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చేస్తున్న విషయం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. -
పక్షవాతం వచ్చిన వారికీ కదలికలు...
వెన్నెముక గాయంతో శరీరం చచ్చుబడిపోయిన వారికి అమెరికాలోని కాల్టెక్ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త తీసుకొచ్చారు. మెదడులో ఓ కొన్ని ఎలక్ట్రోడ్లు జొప్పించి, వెన్నెముక గాయం కారణంగా పక్షవాతానికి గురైన వ్యక్తి చేతుల్లో కదలికలు తీసుకురాగలిగారు వీరు. భవిష్యత్తులో కృత్రిమ అవయవాలు అమర్చుకున్న వారికీ కొన్ని సెన్సర్ల ద్వారా స్పర్శ తాలూకు అనుభూతిని ఇచ్చేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని అంచనా. మూడేళ్ల క్రితం వెన్నెముక గాయం కారణంగా ఓ వ్యక్తి భుజాల కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. ఈ వ్యక్తి మెదడులోని సొమాటో సెన్సిరీ కార్టెక్స్ భాగంలోకి కొన్ని ఎలక్ట్రోడ్లు జొప్పించారు. విద్యుత్తు ద్వారా ప్రేరణ కలిగించినప్పుడు ఆ ప్రాంతంలోని న్యూరాన్లు చైతన్యవంతమైనట్లు, తద్వారా తనకు గిల్లినట్లు.. తట్టినట్లు ఇలా అనేక రకరకాల అనుభూతులు కలిగినట్లు ఆ రోగి చెప్పారు. ఈ అనుభూతులు ఎలా కలుగుతున్నాయో తెలుసుకోవడం ద్వారా వాటిని నియంత్రించేందుకు, తద్వారా పక్షవాతం వచ్చిన వారిలోనూ కదలికలు తీసుకు రావచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన అర్చన
హైదరాబాద్ : ‘సాక్షి’ టీవీలో ప్రసారం అయిన ’కంటే కూతుర్నే కనాలి’ కథనానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తనను కన్నవాళ్లకే అమ్మగా మారి.. తల్లిదండ్రులను పిల్లలుగా భావించి సేవలందిస్తున్న అర్చన అనే యువతికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తికి చెందిన అర్చన తల్లిదండ్రులు పద్మ, దుర్గారెడ్డిల దీనగాథపై ‘సాక్షి’లో ప్రసారం అయిన కథనానికి స్పందించిన మంత్రి కేటీఆర్... అర్చనకు అండగా నిలిచారు. ఆమెకు డీఆర్డీఓ ఉద్యోగంతో పాటు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయడం, అలాగే ఆమె తల్లిదండ్రులకు నిమ్స్‌లో మెరుగైన చికిత్స చేయించనున్నట్లు కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగా తన కుటుంబ దీనగాథను ప్రసారం చేసి, ఆదుకున్న ’సాక్షి’కి అర్చన కృతజ్ఞతలు తెలిపింది. కాగా సాక్షి దినపత్రిక ఫ్యామిలీ పేజీలో ఈ నెల 18న మంగళవారం ‘కూతురమ్మ’ శీర్షికన ప్రచురించిన కథానానికి విశేష స్పందన వస్తోంది. ఆ కథనాన్ని చదివి మానవత్వానికి ఎల్లలు లేవు.. మనసుంటే మార్గముంటుంది.. అన్న మంచి మనసుతో అర్చనకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. చదవండి.... (కూతురమ్మ!) -
కూతురమ్మ!
అమ్మ తెలుసు... అమ్మమ్మ తెలుసు... నానమ్మ తెలుసు... వదినమ్మ తెలుసు... అత్తమ్మ తెలుసు... చెల్లెమ్మ తెలుసు... చిన్నమ్మ కూడా తెలుసు! వీళ్లందరి ప్రేమ కలిపితే కూతురమ్మ. అంధురాలైన తల్లికి బొట్టు పెట్టుకునే అద్దం తను. కుప్పకూలిన తండ్రికి అన్నం పెట్టే కంచం తను. ఈ కూతురమ్మను చూస్తే ఎంతో ధైర్యం వస్తుంది. ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. మరి... ఇంత ఇస్తున్న కూతురమ్మకు మనం ఏమివ్వగలం? నవమాసాలు మోసి కంటుంది అమ్మ... చిట్టి పాదాలను తన అరచేతులమీద పెట్టుకుని నడిపిస్తాడు నాన్న. అల్లారుముద్దుగా పెంచిన బిడ్డకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతారు. ప్రాణమున్నన్ని రోజులు తమ బిడ్డకు సాయపడాలని ఆశిస్తారు అమ్మానాన్నలు. కానీ... ఇక్కడ విధి ఆ అమ్మానాన్నలతో ఆడుకుంది. వాళ్లు కన్న... ఆ బిడ్డ ఒడిలో... వాళ్లనే చిన్నపిల్లల్లా మార్చేసింది. కన్నవాళ్లను కొట్టి తరిమేస్తున్న ఈ రోజుల్లో... తన రెక్కలను ముక్కలు చేసుకుంటూ... ఉబికి వచ్చే కన్నీళ్లను దిగమింగుకుంటూ... జన్మనిచ్చిన వాళ్లకోసం జీవితాన్ని ధారబోస్తోంది. పేదరికంతో బతుకు పోరాటం చేస్తోంది అర్చన. ఆనందంగా మొదలైన జీవితం.. పచ్చని అడవులు... ప్రశాంతమైన వాతావరణం ఉన్న పల్లె నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి. అలాంటి గ్రామంలో హెల్పర్‌గా కరెంటు పనులు చేసేవాడు చెరుకు దుర్గారెడ్డి. ఆయనతో జీవితాన్ని పంచుకుంది పద్మ. వాళ్ల అన్యోన్య దాంపత్యానికి దేవుడిచ్చిన వరమే అర్చన. ఒక్కగానొక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచారు. ఉన్నంతలో ఆ కుటుంబం సంతోషంగా గడిపింది. అర్చన చదువుకూ ఎలాంటి ఇబ్బంది రాలేదు. ప్రభుత్వం నుంచి కొత్త నిబంధన వచ్చింది. హెల్పర్‌గా ఉండాలంటే కరెంటు స్తంభాలను ఎక్కి తీరాల్సిందేనని సర్కారు ఆదేశించింది. గ్రామంలో చేసేందుకు పని లేదు. కూతురిని ఊళ్లోనే ఆమె నానమ్మ దగ్గర ఉంచి దుర్గారెడ్డి... భార్యతోపాటు హైదరాబాద్ బాట పట్టాడు. కష్టాల పయనం ప్రారంభం... పైసల కోసం పట్నంలో కూలీగా మారాడు. పెళ్లాం బిడ్డలను పోషించడం కోసం పగలనక, రాత్రనక పనిచేశాడు. వచ్చిన డబ్బులో కొంత బిడ్డకు పంపేవాడు. బతుకుబండి గాడిన పడిందనుకున్నాడు. అప్పుడే మరో పెద్ద దెబ్బ... అతడికి పక్షవాతం వచ్చింది. చేతులు, కాళ్లు, నోరు పనిచేయక ఆయన్ను మంచానికి పరిమితం చేసింది. దాంతో భార్య పద్మ తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో ఆమెకు హైబీపీ, షుగర్ వచ్చేశాయి. ముసురుకున్న చీకట్లు... అప్పటికి అర్చన ఇంటర్ సెకండియర్కొచ్చింది. నాన్నకు పక్షవాతం, అమ్మకు హైబీపీ, షుగర్. సంపాదన లే కుండా హైదరాబాద్ వంటి నగరంలో ఉండటం అసాధ్యమని తెలిసింది అర్చనకు. అమ్మానాన్నలను దిమ్మదుర్తికి తీసుకువచ్చింది. ఇక చదువు సాగే దారిలేదని అర్థమైపోయింది. తానే సంపాదించాలి. అందుకు సిద్ధమైంది. తండ్రి కోలుకోకపోగా... తల్లికి హైబీపీ, షుగర్ మరింత పెరిగి చూపు పోయింది. దెబ్బమీద దెబ్బ... కుటుంబ భారమంతా ఆ అమ్మాయి మీదనే పడింది. గుండె నిండా బాధే... తన వేలు పట్టి నడిపించిన నాన్న... కనీసం వేలు కూడా కదపలేని స్థితిలో ఉన్నాడు. ఏది మంచో... ఏది చెడో... దారి చూపించాల్సిన అమ్మ కనుచూపు కోల్పోయి... కన్నీటికే పరిమితమైంది. కనీసం తోబుట్టువులు, బంధుమిత్రులు ఉండి ఉంటే ఆమెకు కొంతైనా అండ ఉండేది. ఆ పరిస్థితీ లేదు. ఫలితం ఇవ్వని కష్టం... తనను కన్నవాళ్లకోసం కష్టపడటానికి అర్చన సిద్ధమైంది. చిన్ననాటి స్నేహితుల సలహాతో ఖానాపూర్‌లో గల ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా జాయినైంది. రోజూ 40–50కి.మీ ప్రయాణం చేస్తూ... బడిలో పాఠాలు చెబుతోంది. అయినా ఆమె కష్టం తీరలేదు. అక్కడ వచ్చే వేతనం మూడు వేల లోపే. అది అమ్మానాన్నల మందులకే సరిపోవడం లేదు. ఆమె పడుతున్న కష్టం మందుల కొనడానికే ఖతమైపోతోంది. బియ్యం అమ్మి... బీపీ, షుగర్ ఉన్న అమ్మకు ఒక్కరోజు ట్యాబ్లెట్ వేయకున్నా కష్టమే. నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కనీసం తోడు లేరు. వాళ్లకు జ్వరం వచ్చినా డాక్టర్ వద్దకు తీసుకెళ్లలేని దుస్థితి. రెక్కల కష్టంతో సేవలు చేస్తోంది. ఒక్కోసారి మందులకు డబ్బుల్లేక తమకు వచ్చే రేషన్ బియ్యాన్ని అమ్ముకుని మందులు కొంటోంది. వాళ్లు తలదాచుకుంటున్న ఆ ఇల్లూ సొంతమేమీ కాదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వాళ్లకు సంబంధించిన ఓ పాడుబడ్డ క్వార్టర్. అది ఎంతకాలం ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. మంచిరోజు కోసం ఎదురుచూపు... అర్చనకు ఇప్పుడు 22 ఏళ్లు. పెళ్లీడుకొచ్చింది. అదే మాట ఆమెనడిగితే ‘నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే... వీళ్లను ఎవరు చూస్తారు. నేను లేకుండా అమ్మానాన్న ఒక్కక్షణం ఉండలేరు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇన్నింటిలో సంతోషం కలిగించే సంగతేమిటంటే... ఇంతటి కటిక పేదరికం వెక్కిరిస్తున్నా... ఆమెలో ధైర్యం సడలలేదు. కన్నవాళ్లకోసం జీవితాంతం సేవలు చేస్తానంటోంది. ఈరోజు కాకపోతే రేపు... ఓ మంచిరోజు రాకపోతుందా... అని అర్చన ఎదురు చూస్తూనే ఉంది. ఆ రోజు త్వరగా వస్తే బావుండు. డైలీ రొటీన్ ఇది! ఆకలైనా... దాహమేసినా, మూత్రమొచ్చినా... నోటితో చెప్పుకోలేడు తండ్రి. భర్త కష్టాన్ని కళ్లతో చూసి గ్రహించలేదు తల్లి. అందుకే వాళ్ల అవసరాలను ఓ తల్లిలా చూస్తోంది అర్చన. తండ్రికి తినిపించడం, స్నానం చేయించడం, గడ్డం గీయడం, దుస్తులు మార్చడం, మలమూత్రాలు శుభ్రం చేయడం... ఇలా అన్నీ తానే చేస్తోంది. నాన్నను లేపి కూర్చోబెట్టడం తన ఒక్కదాని వల్ల కాదు. దీంతో అమ్మను సాయంగా కూర్చోబెట్టి... తండ్రిని లేపుతోంది. ఇక కంటిచూపు లేని అమ్మకూ దాదాపు అన్ని పనులు చేసి పెడుతుంది. బడికి వెళ్లే ముందే వాళ్లకు స్నానాలు చేయించి, అన్నాలు పెడుతుంది. తాను సాయంత్రం వచ్చేవరకు వాళ్లకు కావల్సినవన్నీ సర్దిపెట్టి వెళ్తోంది. చిన్నపిల్లాడిలా మంచంలోనే ఒంటికి, రెంటికి వెళ్లే నాన్నను, ఏ చిన్నపనీ చేయలేని స్థితిలో ఉన్న అమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఇలా ఓ కన్నతల్లి కూడా తన బిడ్డలకు చేయలేదేమో... అన్నంతగా అమ్మానాన్నల కోసం అర్చన జీవితాన్ని ధారబోస్తోంది. నేను కాకపోతే ఎవరు! మా కుటుంబం ఇలా అవుతుందని ఒక్క క్షణం కూడా ఊహించలేదు. ఉన్నదాంట్లో ఆనందంగా బతికాం. అలాంటిది ఇప్పుడు ఇలా... (కన్నీళ్లు పెట్టుకుంటూ) అయిపోయింది. నన్ను కన్నవాళ్ల కష్టాన్ని నేను కాకపోతే ఎవరు తీరుస్తారు. బిడ్డగా... జన్మనిచ్చిన వారి కోసం ఎంత చేసినా తక్కువే. కానీ... ఓ ఆడపిల్లగా ఈ సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లడమే కష్టంగా మారుతోంది. మంచిరోజులు వస్తాయన్న ఆశే నడిపిస్తోంది. అమ్మానాన్న మళ్లీ మామూలుగా అవ్వాలి. మా కుటుంబంలో సంతోషం నిండాలన్నదే నా కోరిక. – అర్చన – రాసం శ్రీధర్, ఆర్సీ ఇన్చార్జి, నిర్మల్ -
ఈ–సిగరెట్‌తో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ!
సిగరెట్ మానాలనే ఉద్దేశంతో కొందరు ఈ–సిగరెట్ వాడుతుంటారు. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే విషయం ఇప్పటికే పలు అధ్యయనాల్లో తెలిసింది. అంతేకాదు... దాని నుంచి వచ్చే రసాయన ఆవిర్ల వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఎలుకలపై నిర్వహించిన ఈ పరీక్షలో సాధారణ పొగాకుతో ఎన్ని అనర్థాలు వస్తాయో... ఈ–సిగరెట్‌తో సైతం అన్ని అనర్థాలే ఉంటాయని తేలడంతో పాటు ఈ–సిగరెట్లో వెలవడే రసాయనాలు మెదడులోని రక్తనాళాల్లో అడ్డంకులు కలిగిస్తాయని తేలింది. టెక్సాక్–టెక్ యూనివర్సిటీలోని నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం తేటతెల్లమైంది. వారి పరిశోధనల్లో తేలిన అంశాలను హ్యూస్టన్‌లో నిర్వహించిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్‌లో ఇటీవలే పరిశోధకులు వెల్లడించారు. -
పక్షవాతానికి ఫేస్ టర్నింగ్
ఫేషియల్ పాల్సీ పక్షవాతం అనిపిస్తుంది కానీ... అది పక్షవాతం కాదు. స్ట్రోక్ లాంటి షాక్‌నిస్తుంది అయినా... భయపడాల్సిన పనిలేదు. ధైర్యంగా ఫేస్ టర్నింగ్ ఇవ్వండి నార్మల్ ఫేస్‌కు టర్న్ అవ్వండి. ‘అమ్మా! కన్ను ఎర్రగా ఉందేమిటి?’ కంగారుగా అడిగింది కావ్య.‘‘తలస్నానం చేసేటప్పుడు షాంపూ కంట్లోకి వెళ్లింది. అప్పటికీ కళ్లు గట్టిగా మూసుకున్నాను. అయినా ఎలా వెళ్లిందో’’ అంది రమాదేవి చాలా మామూలుగా. అంతలోనే...‘‘నిన్నటి నుంచి చెవి వెనుక నొప్పిగా ఉంది. పట్టించుకోకుండా తలస్నానం చేశాను. నొప్పి పెరుగుతుందో ఏమో’’ టవల్ అంచును సన్నగా చేసి చెవిలో దూరుస్తూ అన్నదామె. ‘‘అసలే చలికాలం. చెవి నొప్పెడుతుంటే తలస్నానం చేశావా? అయినా చెవి నొప్పి ఎందుకు వస్తోంది. ఓసారి ఈఎన్టికిచూపించుకుందామా’’ అన్నది కావ్య. ‘‘ఈ రోజూ, రేపు చూద్దాం. తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు పోదాం’’ అని టాపిక్‌కి ఫుల్స్టాప్ పెట్టేసిందామె. తల్లీకూతుళ్లిద్దరూ డాక్టర్ ఎదురుగా ఉన్నారు. వాళ్ల ముఖంలో కంగారు. రమాదేవి ముఖం పూర్తిగా మారిపోయింది. ఆమె ఏదో చెప్పడానికి నోరు తెరుస్తోంది. కానీ మాట్లాడిన మాటకు, బయటకు వచ్చే శబ్దానికి పొంతన కుదరడం లేదు. పదాలు స్పష్టంగా పలకలేకపోతోంది. నోరు తెరిస్తే మూతి ఓ పక్కకు లాగేస్తోంది. పెదవులు అదుపు తప్పుతున్నాయి. తన ఇబ్బందిని వ్యక్తం చేయలేకపోతున్నాననే బాధ, తనకు వైద్యం అందేదెలా అనే భయం ఆమె ముఖంలో కనిపిస్తోంది.ఆమె ఆందోళనను అర్థం చేసుకున్న డాక్టరు మెల్లగా చెప్పారు. ‘‘ఇది ఫేషియల్ పెరాలసిస్. కంగారేం లేదు. ఒకటి – రెండు వారాల్లో మామూలవుతారు’’ అని ధైర్యం చెప్పారు. పెరాలసిస్ అనే పదం వినగానే రమాదేవి, కావ్య భయంతో బిగుసుకుపోయారు. అది గమనించిన డాక్టరు ‘‘ఇది పెరాలసిస్ కాదు, పెరాలసిస్కీ దీనికీ సంబంధమే లేదు’’ అని ధైర్యం చెబుతూ పరీక్షలు, మందులు రాశారు. ‘‘నిజం అమ్మా! మాటలో స్పష్టతే కాదు, ముఖం కూడా బాగయిపోయింది. పూర్తిగా మామూలయ్యావ్. కావాలంటే అద్దంలో చూసుకో’’ అంటూ రమాదేవి భుజం పట్టుకుని లాగి అద్దం ముందు నిలబెట్టింది కావ్య.‘‘అవును నిజమే’’ అంటూ చెంప నిమురుకున్నదామె. నాలుగు వారాలుగా తనను తాను అద్దంలో చూసుకోవడానికే భయపడింది రమాదేవి. రెండు కళ్లను మూస్తూ తెరుస్తూ అద్దంలో చూసుకుంది. నుదుటిని కదిలించి చూసుకుంది. ఆందోళన, భయం స్థానంలో సంతోషం నిండిపోయింది. కావ్య వైపు చూస్తూ ‘‘మందులు ఇంకా వాడాలా? డాక్టర్ గారు ఇంకా ఎన్ని రోజులకు రాశారు’’ అంటూ ప్రిస్కిప్షన్ చేతిలోకి తీసుకుంది.‘‘మళ్లీ చెకప్ వరకు డాక్టర్ రాసిన మందులు రాసినట్లు వేసుకో, నీ సందేహాలన్నీ డాక్టర్నే అడుగు. సొంత వైద్యాలు చేయకు. నేను లేను కదా అని ఫిజియోథెరపీని నిర్లక్ష్యం చేయకు’’ అని మందలించింది కావ్య చిరుకోపంగా. సర్జరీ ఎప్పుడు? మందులు, ఫిజియోథెరపీతో నూటికి ఎనభై మందిలో చక్కటి ఫలితాలు వస్తుంటాయి. మూడు నెలల్లో ఫలితం కనిపిస్తుంది, కొందరిలో ఆరు నెలలపాటు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుంది. అప్పటికీ ఫలితం కనిపించనప్పుడు ఏడాది– రెండేళ్ల పాటు నిరీక్షించి ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముఖాకృతిని సరి చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఫేషియల్ పాల్సీ రావడానికి కారణం ప్రమాదవశాత్తూ ఫ్రాక్చర్ కావడం, నరం నొక్కుకుపోవడం వంటివైతే దానికి సర్జరీ చేయడం ఒక్కటే చికిత్స. చెవి వెనుకభాగంలో నరాన్ని సరి చేయడం ద్వారా పరిస్థితి చక్కబడుతుంది. నిర్ధారణ... చికిత్స! నూటికి 90 – 95 మందిలో పేషెంట్ హిస్టరీ (డాక్టరు ప్రశ్నలకు పేషెంటు ఇచ్చే జవాబులతో అందిన సమాచారం) ద్వారానే నిర్ధారణకు రావచ్చు. కొన్ని సందర్భాలలో ఎంఆర్ఐ, ఫేషియల్ నర్వ్ కండక్షన్ స్టడీ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే... వ్యాధి కారణాన్ని బట్టి ఉంటుంది. అలాగే పేషెంటు వ్యాధి నిరోధక శక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మొదటి మూడు రోజుల్లో స్టిరాయిడ్స్ ద్వారా ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒకటి – రెండు వారాలు సాధారణ మందులు వాడితే సరిపోతుంది. హెర్పిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీ వైరల్ డ్రగ్స్ వాడాలి ∙కనురెప్ప మూతపడక కన్ను తేమ కోల్పోతుంటుంది. దాంతో ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనిని నివారించడానికి ఐ డ్రాప్స్ సూచిస్తారు. కళ్లలో దుమ్ము, అతి వెలుతురు పడకుండా ఉండడానికి గాగుల్స్ పెట్టుకోవాలి ∙మందుల వాడకం ఎంత ముఖ్యమో ఫిజియోథెరపీ కూడా అంతే ముఖ్యం. ముఖం కండరాలు మామూలు స్థితికి రావడానికి కొన్ని ఎక్సర్‌సైజ్‌లను సూచిస్తారు. అవి బెలూన్‌లో గాలి ఊదడం, కొవ్వొత్తిని నోటితో ఊది ఆర్పడం, బబుల్గమ్ నమలడం (కండరం బలహీనపడిన వైపు దవడతో), ముఖం కండరాలకు మసాజ్ చేయడం, కంటిని మూసి తెరవడం వంటి వ్యాయామాలు చేయాలి ∙ఇటీవలి వరకు... ముఖం కండరాలకు కరెంట్ స్టిములేషన్ ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చనే అభిప్రాయం ఉండేది. కానీ దాని ద్వారా అదనంగా పొందే ప్రయోజనం ఏదీ లేదని పరిశోధనల్లో తేలింది. సాధారణ ఫిజియోథెరపీని కచ్చితంగా పాటించడం ద్వారానే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకు వస్తుందో? ఫేషియల్ పెరాలసిస్ రావడానికి స్పష్టమైన, ప్రత్యక్ష కారణాలేవీ లేవు. కానీ ఎక్కువ సందర్భాలలో బెల్స్ పాల్సీ కారణమై ఉంటుంది. హెర్పిస్ వైరస్ కారణంగా నరంలో వాపు రావడం కూడా ఉంటుంది. ఫేషియల్ నర్వ్ చిన్న మెదడు నుంచి చెవి వెనుక ఎముక రంధ్రం నుంచి ముఖంలోకి వస్తుంది. దీనికి ఎక్కడ ఇబ్బంది కలిగినా ముఖం కండరాలు బలహీనపడతాయి. ఆ పరిస్థితి ఫేషియల్ పెరాలసిస్‌కి దారి తీస్తుంది. వీటితోపాటు... తలకు గాయం కావడం, తలలో ట్యూమర్, ఏదైనా సర్జరీ చేసేటప్పుడు నరం దెబ్బతినడం, మధుమేహం, సార్క్ ఐడోసిస్, జిబి సిండ్రోమ్‌లు కూడా కారణమవుతుంటాయి. మాట్లాడబోయినప్పుడు మూతి ఒక పక్కకు లాగుతుంది. ఈ లక్షణం కనిపించే వరకు దీని గురించి పట్టించుకోవడం జరగదు. ఈ లక్షణం బయటపడడానికి ఒకటి – రెండు రోజుల ముందు... చెవి వెనుక ఒక మోస్తరుగా నొప్పి వస్తుంది. అది తీవ్రమైన నొప్పి కాకపోవడంతో పెద్దగా పట్టించుకోరు n నుదుటి కండరాలు కదలికలు మందగిస్తాయి. అయితే అది పరిశీలనగా చూస్తే తప్ప గుర్తించడం కష్టం. కాబట్టి దానిని సామాన్యంగా గుర్తించలేరు n కనురెప్ప మూత పడదు. దీనిని కూడా ఎవరికి వారు వెంటనే తెలుసుకోలేరు. నిద్రపోతున్నప్పుడు చూసినవాళ్లు గుర్తించగలుగుతారు. సబ్బుతో ముఖం కడిగినప్పుడు రెప్ప మూతపడక కన్ను మంట పుట్టినప్పుడు తెలుస్తుంది. అయినా సీరియెస్‌గా తీసుకోవడం జరగదు n నాలుక ముందు భాగం రుచిని గుర్తించలేదు. లాలాజల ఉత్పత్తి తగ్గడంతో ఆహారం నమిలి తినడం కష్టమవుతుంది n అతి కొద్ది మందిలో చెవి దగ్గర చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపిస్తుంది n ఈ సమస్య1–3వ రోజు వరకు ఒక్కొక్క లక్షణం తోడవుతూ తీవ్రస్థాయికి చేరి ఆగిపోతుంది n సాధారణంగా ఇది ముఖంలో ఒక వైపే వస్తుంది. రెండువైపులా రావడం అనేది నూటికి ఒక్క కేసుకు మించదు n మెదడులో రక్తనాళం బ్లాక్ అయినా కూడా మాటలు తడబడతాయి. అలాంటప్పుడు ఒక వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలుంటాయి. బ్రెయిన్ స్ట్రోక్‌లో భాగంగా కూడా ముఖం కండరాలు బలహీనపడి పక్కకు లాగుతాయి. అది ముఖం కిందిభాగంలో మాత్రమే ఉంటుంది. డా. బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం.12 బంజారాహిల్స్, హైదరాబాద్ – వాకా మంజుల -
సకాలంలో చికిత్స అందిస్తే పక్షవాతాన్ని నియంత్రించవచ్చు!
న్యూరో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 45 ఏళ్లు. ఇటీవల ఆమెకు పక్షవాతం వచ్చింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైంది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే మా అమ్మగారికి బ్రెయిన్లో రక్తం క్లాట్ అవ్వడంతో స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం మా అమ్మగారు మాట్లాడలేకపోతున్నారు. ఆమెను క్రమం తప్పకుండా ఆసుపత్రికి తీసుకెళ్ల చికిత్స అందిస్తున్నాం. పక్షవాతం వస్తే అది పూర్తిగా నయం కాదా? ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి ఎలాంటి చికిత్సను అందించాలో దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - కళ్యాణి, చిత్తూరు శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించేది మెదడు ఒక్కటే. శరీరానికి బ్రెయిన్ ఒక కంట్రోల్ రూమ్ లాంటిది అలాంటి మెదడులో క్లాట్ ఏర్పడటం అంటే అది శరీరంలోని అవయవాలపై నేరుగా ప్రభావం చూపడమే. ఈ సమస్య వల్ల కొన్ని అవయవాలపై మెదడు తన నియంత్రణను కోల్పోతుంది. అయితే మెదడులో క్లాట్ ఏర్పడటం అరుదైన విషయమేమీ కాదనే చెప్పాలి. వయసు, స్ట్రెస్, మానసిక ఆందోళన, జీవనశైలి, డయాబెటిస్, స్థూలకాయం, బీపీ, జన్యుపరమైన ఇతరత్రా కారణాల వల్ల ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. పక్షవాతం బారిన పడటానికి ముందస్తుగా ప్రతి ఒక్కరిలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ ప్రమాద ఘంటికలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు. మెదడులో రక్తసరఫరా ఆగిన చోటును బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మూతి వంకరపోవడం, ముఖం, చేతులు బలహీనపడటం, నడకలో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెచ్చరికల్లాంటి ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలా కాకుండా స్ట్రోక్ వచ్చి ఆలస్యమైనప్పటికీ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అన్ని వైద్య సదుపాయాలున్న ఆసుపత్రిలో నిపుణులైన న్యూరోసర్జన్ లేదా న్యూరాలజిస్ట్లను సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ అమ్మగారి చికిత్స విషయంలో మీకు ఎలాంటి భయాలూ అవసరం లేదు. వైద్యశాస్త్రంలో వచ్చిన అధునాతనమైన సాంకేతిక పురోగతితో మీ అమ్మగారి సమస్యను కరెక్టుగా గుర్తించి న్యూరో నావిగేషన్, మినిమల్లీ ఇన్వేజిక్, అవేక్ సర్జరీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన వైద్యాన్ని అందించి, ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా కాపాడుకోవచ్చు. అలాగే బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ హ్యామరేజి, మల్టిపుల్ క్లాట్స్, బ్రెయిన్ ఎన్యురిజమ్స్ లాంటి తీవ్రమైన మెదడుకు సంబంధించిన ప్రాణాపాయ వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనే అవకాశమూ ఉంది. మీకు ఎలాంటి భయాందోళనలూ అవసరం లేదు. అలాగే మీ అమ్మగారికి పక్షవాతం వచ్చింది కాబట్టి మీరు, మీ తోబుట్టువులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు గానీ, మీ తోబుట్టువులకు గాని డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం (ఒబేసిటీ) లాంటి సమస్యలు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవడం అవసరం. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ పీసీఓడీని నయం చేయవచ్చా? హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 26 ఏళ్లు. తనకు నెలసరి క్రమంగా రాదు. బరువు కూడా పెరుగుతోంది. ఇంకో 2 నెలల్లో వివాహం చేయాలనుకుంటున్నాం. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్ని పరీక్షలు చేసి పీసీఓడీ అని చెప్పారు. దీని గురించి మాకు అవగాహన లేదు. అంతేకాదు... ఆ టాబ్లెట్లు వేసుకుంటున్నప్పటి నుంచి బరువు మరింతగా పెరిగిపోతోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - సంతోషమ్మ, విజయవాడ అండాశయంలో ద్రవంతో నిండిన చిన్న చిన్న నీటి బుడగల్లాంటి సంచులు వస్తాయి. అవి అండం విడుదలకు అడ్డుపడటం వల్ల వచ్చే సమస్యను పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. కొన్నిసార్లు అవి 1 నుంచి 12 వరకు ఉండవచ్చు. లక్షణాలు అండం విడుదల ఆగిపోవడం వల్ల నెలసరి సరిగా రాకపోవడం లేదా 2 - 3 నెలలకు ఒకసారి రావడం నెలసరి వచ్చినా తక్కువ రక్తస్రావం కావడం కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవడం వల్ల గర్భం దాల్చే పరిస్థితిక కూడా ఉండకపోవచ్చు సాధారణంగా ఈ సమస్య ఉన్న కొందరిలో అవాంఛిత రోమాలు, ముఖంపై మొటిమలు, జుట్టు ఊడటం, బరువు పెరగడం వంటివి కనిపిస్తాయి దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి లోనవుతారు. లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో సాధారణ స్థాయిలో ఉంటే మరికొందరిలో తీవ్రస్థాయిలో ఉండవచ్చు. కొందరిలో అసలు ఏ విధమైన లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి వల్ల కలిగే ఇతర సమస్యలు పీసీఓడీ వ్యాధి ఉన్నా హార్మోన్లపై అది ప్రభావం చూపనప్పుడు దీనివల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే ఈ వ్యాధి హార్మోన్లపై ప్రభావం చూపినప్పుడు హార్మోన్ల అసమతుల్యత కలిగి సమస్యలు మొదలవుతాయి. వాటిలో ముఖ్యంగా డయాబెటిస్ నెలసరి ఇబ్బందులు సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోవడం అవాంఛిత రోమాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు బరువు తగ్గాలి. కానీ అదే సమయంలో కడుపు మాడ్చుకోకూడదు. కేవలం మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాల్సి ఉంటుంది. అలా జరగకపోతే చికిత్స తీసుకున్నా ప్రయోజనం ఉండకపోగా సమస్య అధికమయ్యే అవకాశం ఉంటుంది అవాంఛిత రోమాలను నివారించేందుకు వాక్సింగ్, హెయిర్ రిమూవల్ క్రీమ్‌లు వాడకపోవడం మంచిది నెలసరి రావడం కోసం అధికంగా హార్మోన్ ట్యాబ్లెట్లు వాడకపోవడం మంచిది ఒకవేళ గర్భం దాల్చినట్లయితే క్రమం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. లేదంటే గర్భస్రావం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. చికిత్స హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, హార్మోన్ల సమతౌల్యత సాధారణ స్థాయికి వచ్చి వ్యాధి తగ్గుతుంది. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
తండ్రిని చంపిన కూతురు!
సేవలు చేయలేక.. ఉరేసి చంపింది సంగారెడ్డి రూరల్ : ఓ కూతురు కన్నతండ్రినే పొట్టన పెట్టుకుంది. పక్షవాతంతో మంచాన పడ్డ తండ్రికి సేవ చేయడం ఇష్టంలేక మట్టుబెట్టింది. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కలివేములకు చెందిన మహ్మద్ జహంగీర్(73)కు నలుగురు కూతుళ్లు. జహంగీర్‌కు ఇటీవలే పక్షవాతం వచ్చింది. తండ్రిని ఒక్కో కూతురు ఒక్కోనెల అతడి బాగోగులు చూసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా హత్నూర మండలం రుస్తుంపేటకు చెందిన చిన్న కూతురు షహనాజ్ తండ్రి జహంగీర్‌ను చూసుకోవడానికి కలివేములకు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఆమె తన తండ్రి మెడకు చీరతో ఉరివేసి చంపింది. ముందస్తు పథకంలో భాగంగా సదాశివపేటకు వెళ్లి వస్తానంటూ, తన తండ్రిని చూడాలని ఇరుగుపొరుగు వారితో చెప్పి వెళ్లింది. తిరిగి వచ్చిన షహనాజ్ తన తండ్రి మృతి చెందాడని రోదించడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. శవాన్ని పరిశీలించిన ఎస్ఐ ప్రసాద్‌రావు అనుమానంతో షహనాజ్‌ను విచారించగా, తన తండ్రి జహంగీర్‌ను తానే ఉరివేసి చంపినట్లు ఒప్పుకుంది. -
బతికి ఉండగానే అచేతనం అవుతారు!
హోమియో కౌన్సెలింగ్ మావారి వయసు 55 ఏళ్లు. ఈమధ్య హైబీపీతో బాధపడుతూ, పని ఒత్తిడితో మందులు సరిగా వేసుకోలేదు. అకస్మాత్తుగా ఒకవైపు కాళ్లు, చేతులు పనిచేయలేదు. పక్షవాతం (స్ట్రోక్) వచ్చిందన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - సుమతి, కాకినాడ మీవారికి వచ్చిన పక్షవాతం అన్నది సమస్య నాడీ సంబంధిత వ్యాధి. శరీరంలోని ఒక భాగం లేదా సగభాగం ప్రయత్నపూర్వకంగా కదలించలేకపోవడాన్ని పక్షవాతం అంటారు. మూతివంకరపోవడం, కాళ్లు, చేతులు మెలిదిరిగిపోవడం, గుండె కూడా సరిగా పనిచేయకపోవడం... ఇలా శరీరంలోని ప్రతి అవయవంపై దీని ప్రభావం ఉంటుంది. మనిషి బతికి ఉండగానే అచేతనం అయిపోయే విచిత్ర స్థితి పక్షవాతం. గతంలో ఇది వృద్ధుల్లోనే కనిపించేది. ఇటీవల చిన్న వయసు వారు సైతం దీనికి గురవుతున్నారు. పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకండ్‌కు 32 వేల నాడీకణాలు చనిపోతాయి. ఆ లెక్కన నిమిషానికి దాదాపు 19 లక్షల నాడీకణాలు చచ్చుబడిపోతాయి. మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో జరిగే రక్తప్రవాహంలో రక్తపు గడ్డలు అడ్డుపడతాయి. దాంతో మెదడుకు రక్తప్రసారం తగ్గిపోయి అది పక్షవాతానికి దారితీస్తుంది. పక్షవాతంలో మెదడుకు తీరని నష్టం కలిగే అవకాశం ఉంది. అలా నష్టం కలిగే సమయంలో మృతిచెందే కణాలపైనే పక్షవాతం తీవ్రత ఆధారపడి ఉంది. అందుకే పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. కారణాలు: అధిక రక్తపోటు; అధిక బరువు డయాబెటిస్ పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు కొలెస్ట్రాల్, గుండెజబ్బులు... ఇవి ఉన్నవారికి పక్షవాతం వచ్చే అవకావం ఉంది. లక్షణాలు: తిమ్మిర్లు; ఒక కాలు, చేతిలో శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది మాట్లాడలేకపోవడం; ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం చూపు మసకబారుతుంది కాళ్లు, చేతులు వెనక్కుతిరిగిపోతాయి; మూతి వంకర తిరుగుతుంది. వ్యాధి నిర్ధారణ: ఎక్స్-రే, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, మైలోగ్రఫీ, ఎలెక్ట్రోమైలోగ్రఫీ. చికిత్స: పక్షవాతానికి హోమియోలో మంచి వైద్యచికిత్స అందుబాటులో ఉంది. ఈ చికిత్సతో పాటు ఫిజియోథెరపీ తీసుకుంటూ హోమియో మందులు వాడుతుంటే మంచి ఫలితాలను చూడవచ్చు. కాస్టికమ్, జెల్సీమియం, ప్లంబంమెట్ వంటి చాలా రకాలు హోమియోలో ఉన్నాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ హితంగా... మితంగా తినాలి డయాబెటిక్ కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 64 ఏళ్లు. గత పదేళ్లుగా ఆమె డయాబెటిస్తో బాధపడుతున్నారు. డయాబెటిస్ అదుపులో లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఈమధ్య మా డాక్టర్ చెప్పారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి ఏం తినాలి? ఎలాంటి వ్యాయామం చేయాలి? - నరేశ్, మంచిర్యాల డయాబెటిస్ ఏ మేరకు అదుపులో ఉందో తెలుసుకోడానికి ఎఫ్బీఎస్, పీఎల్బీఎస్ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హెచ్‌బీఏ1సీ అనే పరీక్ష చేస్తారు. దీని ఫలితాలు 7 శాతం కంటే తక్కువగా ఉంటే డయాబెటిస్ అదుపులో ఉందని అర్థం. మీ అమ్మగారి వయసు ప్రకారం 7.5 శాతం ఉన్నా పర్వాలేదు. బీపీ మాత్రం 130 / 80 లోపల ఉండటం శ్రేయస్కరం. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి. భోజన నియమాలకు వస్తే అన్నం, వైట్ బ్రెడ్ వంటివి మితంగా తినాలి. గోధుమ, జొన్న, పండ్లు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఉడకబెట్టినవి, ఆవిరి మీద ఉడికించినవి తినాలి. వేపుళ్లు చాలా తక్కువగా తినాలి. కొవ్వు ఎక్కువగా ఉండే మాంసం తీసుకోవద్దు. ఈ ఆహార నియమాలతో పాటు రోజుకు కనీసం 30 నిమిషాల తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇలా వ్యాయామం చేయడం వల్ల ఎముకల క్షీణత తగ్గడంతో పాటు రక్తంలోని గ్లూకోజ్ పాళ్లు అదుపులోకి వస్తాయి. వీటి వల్ల శరీరం బరువు పెరగకుండా నివారించవచ్చు. వ్యాయామం మొదలుపెట్టే ముందర డాక్టర్ సలహా తీసుకోవాలి. డాక్టర్ వి. శ్రీ నాగేష్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,హైదరాబాద్ . -
కంటినిండా నిద్రతో పక్షవాతం దూరం!
పరిపరి శోధన కంటినిండా నిద్రపోవాలి. లేకపోతే ఒక్కోసారి అది పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కంటినిండా నిద్రించకపోతే అది మెదడును చురుగ్గా పనిచేయేనివ్వదని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఆ అధ్యయనం వివరాలివి... వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర వ్యవధి తగ్గుతుంటుంది. నిద్రపట్టే వ్యవధి తగ్గుతున్న కొద్దీ మెదడులోని కణాలకు పుష్కలంగా ఆక్సిజన్ అందడమూ తగ్గుతుంది. దాంతో మెదడులో అప్పటికే మనం నేర్చుకున్న పరిజ్ఞానాల విషయంలోనూ లోపం ఏర్పడుతుందంటున్నారు కెనడాకు పరిశోధకులు. ఇది మన నైపుణ్యాలనే కాకుండా మన జ్ఞాపకశక్తినీ దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు. సీనియర్ సిటిజెన్లలు కొందరిపై నిర్వహించిన ఈపరిశోధనల్లో సరిగా నిద్రపోలేని వారిలో మెదడుకు మంచి రక్తం అందించే రక్తనాళాలు తమ మృదుత్వాన్ని కోల్పోయి కాస్త గట్టిబారినట్లు కూడా గుర్తించారు. దాంతో ఒక్కోసారి పక్షవాతమూ రావచ్చు అని అధ్యయనవేత్తలు తెలుపుతున్నారు ఈ వివరాలన్నీ కెనడా చెందిన ‘స్ట్రోక్’ అనే మెడికల్ జర్నలో ప్రచురించారు. ‘పెద్ద వయసు వారిలో నిద్రపోయే సమయం తగ్గినా, నిద్ర నాణ్యత బాగుండేలా, ఆ వయసుకు తగిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం అవసరమని పరిశోధకులు సూచన. -
పక్షవాతం వస్తుందో రాదో ఈ పరీక్షతో కనిపెట్టేయొచ్చు!
కొత్త పరిశోధన ఇది చాలా చిన్న పరీక్ష. ఒకే కాలిపై నిల్చొని, మరో కాలిని లేపి... నిటారుగా ఉన్న కాలి మోకాలి వద్ద ఆనించి 20 సెకన్లపాటు బ్యాలెన్స్ తప్పకుండా నిలబడగలరా? పరీక్షించి చూసుకోండి. అలా నిలబడగలిగితే చాలు... భవిష్యత్తులో పక్షవాతం, మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు చాలా తక్కువని జపాన్ పరిశోధకులు పేర్కొంటు న్నారు. ఈ పరిశోధకులు 1,387 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనల్లో 67 ఏళ్ల వయసు ఉన్నవారినీ పరిశీలించారు. ఇలా కనీసం 20 సెకన్ల పాటు నిల్చోగలిగితే పక్షవాతం, మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తేలిన అంశాన్ని ‘స్ట్రోక్’ అనే మెడికల్ జర్నల్‌లోనూ పొందుపరచినట్లు జపాన్ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
అమ్మ చేతిలో చెయ్యేసి...
మనసు చీటీ అమ్మకి ఆరోగ్యం బాగోక ఆరునెలలు అయింది. కొద్దిపాటి విరేచనాలతో మొదలైన అనారోగ్యం, అన్నిరకాల కాంప్లికేషన్స్నీ పోగేసుకుని - చివరకు స్ట్రోక్‌గా (పక్షవాతం) అవతరించి - అమ్మని వీల్ చెయిర్‌కి పరిమితం చేసేసింది. అంతకుముందు నాకూ, ఆమెకీ ఎప్పుడూ ఒకటే యుద్ధం. నా దగ్గరే ఉండిపొమ్మని నేనూ - ‘‘నాకిక్కడ తోచదు. గుంటూరులోనే ఉంటాను’’ అని ఆమె - బోల్డన్నిసార్లు మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం. కానీ ఈరకంగా నా దగ్గర ఉండిపోతుందని అనుకోలేదు. రోజూ అమ్మతో కాసేపు గడుపుదామని ప్రయత్నిస్తుంటాను. అన్ని రోజులూ కుదరదు. ఉదయం హాస్పిటల్‌కి వెళ్లే టైమ్‌కి నిద్రలో ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి లేట్ అయితే మళ్లీ దొరకదు తనతో సాంగత్యం. దగ్గరకు వెళ్లగానే, నా గడ్డం పట్టుకుం టుంది. చేయి వదలదు. ‘‘ఆరోగ్యం చూసుకో నాన్నా’’ అని పదిసార్లు గుర్తు చేస్తుంది. అది కొద్దిసేపే - తర్వాత తన లోకంలోకి వెళ్లిపోతుంది. ‘రేపు గుంటూరు వెళ్లిపోతాను నాన్నా’’ అంటుంది ఒక్కోసారి. తనకి ఏమయిందో - ఎందుకు నడవలేకపోతోందో - ఎక్కడ ఉందో తనకు పూర్తిగా అవగాహన లేదు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల, కొంత భాగం పనిచేయక - ఈ రకమైన అనిశ్చిత పరిస్థితిలో ఇరుక్కుపోయింది. ఓ రకంగా దేముడు ఆమెకి ఇచ్చిన వరమేమో ఇది. అనారోగ్యంతో చేయి, కాలు కదలక పోవడం, తనంతట తాను టాయ్‌లెట్‌కి వెళ్లలేకపోవడం ఎంత దుర్భరమో... ఆ అశక్తత మనసుకు తెలియకపోవడం అంతకంటే మించిన వరమే అనిపిస్తుంది. వరప్రసాదరెడ్డిగారు తన ప్రతి పుట్టినరోజుని, మాతృదినోత్సవంగా జరుపుతారు. ఆ రోజు కొందరు అమ్మలను గౌరవిస్తారు. పోయిన సంవత్సరం చిరంజీవిగారి అమ్మ, ఎస్పీబాలుగారి అమ్మ, తనికెళ్ల భరణిగారి అమ్మలతో పాటు, మా అమ్మకి కూడా ఆ గౌరవం దక్కింది. కానీ దురదృష్టం, ఆ రోజుకి వారం ముందే అమ్మకి పక్షవాతం వచ్చి హాస్పిటల్లో ఉండిపోయింది. అమ్మ తరఫున నాన్న ఆ సత్కారం అందుకున్నారు. ఆ సందర్భంలో నేను మాట్లాడ ప్రయత్నించి విఫలమయ్యి, అందరి ముందూ ఏడ్చేశాను. గుండె లోతుల్లో కూరుకున్న, పేరుకున్న అను భూతులన్నీ పెల్లుబికి కన్నీళ్ల రూపంలో రావడం ఓ అనిర్వచనీయమైన ప్రక్రియ. ఈ రోజు నేను డాక్టర్నయ్యి ఇంత మందికి సాయం చేయగల్గుతున్నానంటే - అది అమ్మ చలవే. ఆమెకి నేను డాక్టర్ కావాలని ప్రగాఢమైన కోరిక. ఆమె ప్రోద్బలం లేకపోతే పట్టు వదలని విక్రమా ర్కుడిలాగా అన్నిసార్లు ప్రయత్నించగలిగి ఉండేవాడ్ని కాదేమో! కానీ దేవుడి లీల - పక్షవాతం పర్మినెంట్‌గా ఆమెని వీల్ చెయిర్‌కి పరిమితం చేయడం - మా డాక్టర్లందరం నిమిత్తమాత్రులుగా మిగిలి పోవడం దురదృష్టం కాక మరేమిటి! కాకపోతే - ఆమెకి ఈ రకంగానైనా కొంత సేవ చేయగలగడం అదృష్టం. అయిదేళ్ల క్రితం నేను తెచ్చిన ‘గురవాయణం’ పుస్తకంలో ‘మాతృ దేవోభవ’ అని అమ్మ గురించి రాశాను. దాంట్లో నామిని రాసిన ‘అమ్మకి జేజే’ పుస్తకం గురించి ప్రస్తావించాను. ఈసారి చీకోలు సుందరయ్యగారి సంపాదకత్వంలో వచ్చిన ‘అమ్మ’ కవితా సంకలనం గురించి చెప్పడం సముచితం. మూడేళ్ల క్రితం మృణాళిని దగ్గర ఈ పుస్తకం చూశాను. వాకబు చేస్తే అదే చివరి కాపీ అని తెల్సింది. ‘‘ఈ పుస్తకం నేను అచ్చేసిస్తాను అవకాశం వస్తే’’ అనుకున్నాను. ఆ అవకాశం ఇన్నాళ్టికి సుందరయ్యగారి ద్వారా వచ్చింది. వందమందికి పైగా కవులు అమ్మ గురించి వివిధ కోణాలని స్పృశిస్తూ పండించిన కవితల సంకలనం ఇది. సుందరయ్యగారన్నట్లు - మన పూర్వీకులు మాతృదేవోభవ అని తొలి నమస్కారం అమ్మకే కేటాయించారు. తొలిస్థానం ఆమెకే ఇచ్చారు. సినీకవులు సైతం ‘అమ్మంటే అంతులేని సొమ్మురా - అది ఏనాటికీ తరగని భాగ్యమ్మురా’ అని అందంగా చెప్పారు. విమలగారు ‘వంటిల్లు’ పేరున అమ్మ గురించి, అమ్మ వంటల గురించి ఆర్ద్రంగా రాశారు. ‘ఎంత అద్భుతమైందీ వంటగది రుచులు రుచులుగా పరిమళాన్ని వెదజల్లుతూ తెరచిన తినుబండారాల దుకాణంలా ఎంత నోరూరిస్తుందో తాలింపు ఘుమాయింపులతో పూజామందిరం అగరొత్తుల సువాసనల్తో మా వంటిల్లు నిత్యం శ్వాసిస్తూ ఉంటుంది’ అని. ఈ కవిత చదువుతూనే చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి జారిపోయాను, పారిపోయాను. అమ్మ రవ్వలడ్లు, కొబ్బరి లౌజులు చేసేది. శనివారం ఎప్పుడు వస్తుందా అని చూసేవాణ్ని. ఎందుకంటే - ఆ రోజు దేవుడికి నాన్న కొట్టిన కొబ్బరికాయ - మాకు రవ్వలడ్డుగా అమ్మ చేతుల్లో ప్రత్యక్షం. అమ్మ చేసిన టొమాటో పప్పు అద్భుతహ. అలానే గుత్తి వంకాయకూర ఆమె చేతుల్లో అమృత ధార. మజ్జిగచారు గురించి చెప్పక్కర్లేదు. కానీ నా దురదృష్టం. ఇప్పుడు అమ్మ ఏ వంటా చేయలేని పరిస్థితి. మా వంటామె చేసిన వంటకాల్ని అమ్మకి తినిపిస్తూ, ‘‘అమ్మా! నువ్వు చేసిన పప్పు ఇంతకంటే ఎంత బాగుండేదో’’ అని అంటుంటే - ఆ అలసిపోయిన మొహంలో కొసమెరుపుగా మళ్లీ ఓ చిరునవ్వు మొలుస్తుంది. అదే చాలు నాకు. నేను మెడికల్ కాలేజీలో చేరేదాకా - అమ్మే తల దువ్వేది నాకు. దువ్వెన ఆమె చేతికిచ్చి తలవంచుకుని నిలబడితే... ప్రేమగా, గోముగా ఓ చేత్తో గడ్డం పట్టుకుని ఇంకో చేత్తో పాపిట తీసి తలదువ్వడం నా గుండెల్లో పదిలంగా దాచుకున్న అనుభూతి. ఆప్యాయత ఎక్కడ కనపడ్డా - ఎవరు పంచినా అమ్మే గుర్తొస్తుంది నాకు. నా ఆరోగ్యం గురించి, నా కెరీర్ గురించి, అనుక్షణం ఆలోచిస్తూ ఆరాటపడే స్నేహితురాలిలో కనపడుతుంది అమ్మ నాకు. సమస్యలలో సతమతమయ్యే సమయాన ధైర్యాన్నిచ్చి చేయూతనిచ్చే భార్యలో కనపడుతుంది అమ్మ నాకు. హాస్పిటల్ నుంచి ఆలస్యంగా వచ్చినప్పుడు, నా కోసం ఎదురుచూసి, భోజనం పెట్టే కూతురిలో కనపడు తుంది అమ్మ నాకు. చూడగలిగితే - ఎటు చూసినా అమ్మే. అమ్మ గుంటూరులో ఉన్నన్నాళ్లూ ఆమెతో గడపటానికి సమయం దొరికేది కాదు. జీవితంలో స్థిరపడ్డానికి బోల్డన్ని యుద్ధాలు, పరుగు పందేలు! ఇప్పుడు అమ్మతో గడిపే సమయం, సందర్భం వచ్చినా అమ్మ లేదు. శారీరకంగా నా ముందే ఉన్నా, నాకందని లోకాల్లోకి వెళ్లిపోయింది. కొడుకు చేతిలో చెయ్యేసి, మాట్లాడ ప్రయత్నిస్తూనే మనకెవరికీ అర్థం కాని శూన్యంలోకి జారిపోయింది. ‘అమ్మ బాగున్నప్పుడు ఇంకొంచెంసేపు గడిపి ఉంటే ఎంత బాగుండేదో కదా’’ అని ఎన్ని వందలసార్లు అనుకుని నాలో నేను ఏడ్చుకుంటున్నానో, నాలాగే కొన్ని కోట్లమంది కొడుకులు అమ్మలతో గడపక, గడపలేక కుమిలిపోతూ ఉండి ఉంటారు. వాళ్లందరికీ నా విన్నపం ఒకటే. అమ్మతో గడపటానికి వచ్చిన ప్రతి అవకాశాన్నీ రెండు చేతుల్తో అందుకోండి. అమ్మ మాటలు చాదస్తంగా, ఛాందసంగా అనిపించినా పట్టించుకోవద్దు. చిన్నప్పుడు మీకు రవ్వలడ్డు పెట్టిన అమ్మని, పెద్దయినాక తల దువ్విన అమ్మని గుర్తు తెచ్చుకోండి. మాటలు చేతకాకపోతే చేతిలో చెయ్యేసి అలానే కూచోండి. ఆ స్పర్శలో, ఆ నిశ్శబ్దంలో అవధి లేని అనురాగ గ్రంథాలు ఆవిష్కృతమవుతాయి. డా.గురవారెడ్డి -
తీవ్రమైన మతిమరపు పక్షవాతానికి సూచన కావచ్చు!
కొత్త పరిశోధన అత్యధిక విద్యావంతులూ, ఎప్పుడూ ఏ విషయాన్నైనా అనర్గళంగా గుర్తు తెచ్చుకొని చెప్పేవారిలో... అకస్మాత్తుగా వారు తమ పరిజ్ఞానాన్ని మరచిపోతుండటం, అవసరమైనప్పుడు బాగా గుర్తున్నట్లుగా ఫీలయ్యే అంశాలే జ్ఞప్తికి రాకపోతుండటం జరుగుతుంటే వారికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా పరిగణించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒక డచ్ అధ్యయనం పేర్కొంటోంది. ఈ అధ్యయనాన్ని 55 ఏళ్లు పైబడ్డ 9,152 మందిపై నిర్వహించారు. దాదాపు 20 ఏళ్లపాటు ఈ అధ్యయనం సాగింది. వీళ్లలో 1,134 మంది పక్షవాతానికి గురయ్యారు. ఇక మతిమరపు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన మరో 20 శాతం మందిలో స్ట్రోక్ (పక్షవాతం) వచ్చే లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. యూనివర్సిటీలలో నిత్యం బోధించే సబ్జెక్టులను సైతం మరచిన వారిలో స్ట్రోక్ అవకాశాలు 39 శాతం ఎక్కువగా ఉన్నట్లు కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయన ఫలితాలను ‘స్ట్రోక్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు. కాబట్టి బాగా గుర్తున్న విషయాలను మరచిపోయేవారు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు. -
రెండోసారి పక్షవాతాన్ని నివారించుకోండి
న్యూరాలజీ కౌన్సెలింగ్ మా దగ్గరి బంధువుల్లో ఒకరి వయసు 47. ఆర్నెల్ల క్రితం నుంచి ఆయనకు నాలుక పట్టేసినట్లుగా ఉండి, మాట ముద్దముద్దగా వస్తోంది. కుడివైపు భాగమంతా చచ్చుబడినట్లుగా మారుతోందని గొడవపెడ్తున్నాడు. చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేదంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దీన్ని నివారించలేమా? - అరవింద్‌కుమార్, దిల్సుఖ్నగర్ అకస్మాత్తుగా కలిగే పరిణామం ఏదైనా సరే... అంటే మాట సరిగా రాకపోవడం, చూపులో తేడా రావడం, శరీరంలోని ఒకవైపు భాగం బలహీనపడటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం... ఇవన్నీ పక్షవాత లక్షణాలే. అయితే దీన్ని నిర్ధారణ చేయడానికి సీటీ/ఎమ్మారై స్కాన్ పరీక్ష అవసరం. సాధారణంగా తొలిసారి కొద్దిపాటి పక్షవాతం వచ్చిన 30 శాతం మందిలో, ఏడాదిలో రెండోసారి తీవ్రంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకంగా దీనికోసం రక్తాన్ని పలుచబార్చే మందులైన యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్, స్టాటిన్స్ వంటివి తీసుకోని వారిలో ఇది తీవ్రంగా రావచ్చు. దీనితో పాటు పక్షవాతానికి ఆస్కారమిచ్చే రిస్క్ ఫ్యాక్టర్లు అయిన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హోమోసిస్టిన్ లేదా గురక వంటివి రోగికి ఉండి, వాటిని నియంత్రించకపోతే పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మీ బంధువుకు వెంటనే అన్ని రకాల పరీక్షలు చేయించి, వ్యాధి విషయంలో తగిన నిర్వహణ చర్యలు (మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజ్) తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బంధువుకు మళ్లీ పక్షవాతం (స్ట్రోక్) వస్తే అది వైకల్యాన్ని తెస్తుంది. కాబట్టి మీరు వెంటనే మీ దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. రెండోసారి స్ట్రోక్‌ను నివారించేందుకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడండి. నా వయసు 35. నాకు గత 16 ఏళ్లుగా ప్రతినెలా తలనొప్పి వస్తోంది. అది నెలలో నాలుగైదుసార్లు వస్తోంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మా అబ్బాయి కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. వాడి వయసు ఎనిమిదేళ్లు. ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్యా? నాకు తగిన సలహా ఇవ్వండి. - వసుంధర, మహబూబ్‌నగర్ తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు చెప్పినట్టే మైగ్రేన్ అనేది కుటుంబసభ్యుల్లో వంశపారంపర్యంగా రావచ్చు. అయితే మీ అబ్బాయిలో కనిపించే లక్షణాలు కంటి చూపునకు సంబంధించినవా లేక మెదడుకు సంబంధించినవా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ బి. చంద్రశేఖరరెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదారాబాద్ -
పక్షవాతాన్ని తగ్గించే పాలకూర!
పక్షవాతం వచ్చే రిస్క్‌ను నివారించే విషయంలో పాలకూర సమర్థంగా ఉపయోగపడుతుందని చైనీస్ శాస్త్రవేత్తల అధ్యయనం నిరూపించింది. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. మరీ ముఖ్యంగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్ యాసిడ్ బాగా నివారిస్తుందని, పాలకూరలో ఇది పుష్కలంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. హైబీపీ ఉన్న 20,702 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది. వీళ్లంతా హైబీపీని తగ్గించే ‘ఎనాలప్రిల్’ అనే మందును వాడుతున్నవారే. వీరికి మందుతో పాటూ ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలలో ఆహారాన్ని అందించారు. అయితే ఫోలిక్ యాసిడ్‌ను క్రమం తప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్నవారిలో స్ట్రోక్ వచ్చేందుకు అన్ని విధాలా రిస్క్ ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం పడిపోయాయని అధ్యయనవేత్తలు గుర్తించారు. పైగా దీనితో పాటు గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఈ పరిశోధన ఫలితాలను ‘ద జర్నల్ ఆఫ్ ద అమెరికన్ అసోసియేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
వేరుశెనగలతో గుండెకు మేలు..
మూడు ముచ్చట్లు వేరుశెనగలు తింటే గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేరుశెనగ గింజల్లో దాదాపు 48 శాతం కొవ్వుపదార్థాలు ఉన్నా, వాటిలో గుండెకు మేలుచేసే మోనో శాచ్యురేటెడ్, పోలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వేరుశెనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్-బి 1, బి 6, ఫొలిక్ యాసిడ్, విటమిన్-ఇ, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు శరీరానికి చాలా మేలు కలిగిస్తాయని అంటున్నారు. వేరుశెనగలే కాకుండా బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వంటి ఎలాంటి గింజలనైనా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే, గుండెజబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని వివరిస్తున్నారు. అమెరికన్ నిపుణులు, చైనీస్ నిపుణులు నిర్వహించిన వేర్వేరు పరిశోధనల్లో వేరుశెనగలు సహా వివిధ రకాల గింజలు తినడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు ఇటీవల గుర్తించారు. -
పల్స్ చూసుకోండి... పక్షవాతం నుంచి రక్షణ పొందండి...
క్రమం తప్పకుండా నాడీ స్పందించే తీరును పరీక్షించుకుంటూ ఉంటే అది పక్షవాతం ప్రమాదాన్ని గణనీయంగా నివారిస్తుందంటున్నారు జర్మనీకి చెందిన న్యూరాలజిస్టులు. వాళ్లే కాదు... అమెరికాకు చెందిన యూఎస్ నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కూడా అదే మాట చెబుతున్నారు. పైగా వారు నిర్వహించిన ఒక అధ్యయనంలోనూ ఇదే తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కనుగొన్న విషయాల ప్రకారం... మొదటిసారి పక్షవాతం (స్ట్రోక్)కు గురై కోలుకున్నవారిలో 24 శాతం మంది మహిళల్లో, 42 శాతం మంది పురుషుల్లో ఐదేళ్లలోపు మరోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. ఎడమచేతి మణికట్టు వద్ద ఉండే రేడియల్ ఆర్టరీ అనే రక్తనాళాన్ని పట్టుకుని పల్స్‌ను పరీక్షిస్తున్నప్పుడు అందులో ఏవైనా తేడాలు ఉంటే గుండె కొట్టుకోవడంలో తేడా ఉందని అర్థం. గుండె స్పందనల లయ సరిగ్గా లేని ఈ కండిషన్‌ను ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఇది ఒక్కోసారి మరణానికి దారితీయవచ్చు. మొదటిసారి స్ట్రోక్ వచ్చిన 256 మందిపై నిర్వహించిన పల్స్ రీడింగ్ ద్వారా వాళ్లలో ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్‌ను గుర్తించి, ప్రమాదాలను నివారించడం సాధ్యమైనట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ అనే జర్నల్‌లోనూ పొందుపరిచారు. -
వృద్ధ మహిళల్లో పక్షవాతం నివారణ ఇలా...
పోరాడే పొటాషియమ్ వయసు పైబడ్డ మహిళలు, మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో అకస్మాత్తుగా వచ్చే హార్మోన్ల అసమతౌల్యత వల్ల పక్షవాతం రిస్క్ పెరుగుతుంది. ఆహారంలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువగా ఉంటే, అది రక్తపోటును నియంత్రించి, పక్షవాతం రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుందని రుతుస్రావం ఆగిన 50-79 ఏళ్ల మధ్యన ఉన్న 90,137 మంది మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. వీళ్లకు పొటాషియమ్ అధిక మోతాదులో ఉండే అరటి వంటి పండ్లు, ఆకుకూరలు, బీన్స్ వంటి కూరగాయలు, పాలు, మాంసాహారం ఇచ్చారు. ఈ ఆహారం తీసుకున్న 16% మందిలో ఇస్కిమిక్ స్ట్రోక్ నివారితమైంది. అంతేకాదు... స్ట్రోక్ వల్ల కలిగే మరణాలలోనూ 10% తగ్గుదల కనిపించింది. ఈ విషయాలన్నీ ‘స్ట్రోక్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. డబ్ల్యూహెచ్ఓ సిఫార్సుల మేరకు మహిళలు, ప్రత్యేకంగా మెనోపాజ్ వచ్చిన వారికి ప్రతిరోజూ 3.510 గ్రాముల పొటాషియమ్ అవసరం కాగా కేవలం 16.6 శాతం మందిలోనే ఈ మేరకు పొటాషియమ్ పాళ్లు ఉన్నాయి. -
కూర్చునేవారూ... కుర్చీ వదలండి!
సిట్ రైట్ అండ్ స్టాండ్ స్ట్రైట్ కుదురుగా కుర్చీలో కూర్చొని పనిచేసేవారు అదేపనిగా గంటలు గంటలు కూర్చోవద్దని చెబుతున్నారు రోచెస్టర్, మిన్నెసోటాకు చెందిన మయో వైద్య పరిశోధక బృందం అధ్యయనవేత్తలు. ఇలా రెండుగంటల పాటు అదేపనిగా కూర్చొని ఉండటం వల్ల 20 నిమిషాల సేపు వ్యాయామం చేయడం వల్ల ఒనగూరిన ఆరోగ్యాన్ని మనం నష్టపోతామని చెబుతున్నారా పరిశోధకులు. కూర్చుని చేసే ఉద్యోగాలలో ఉన్న 2,223 మందిపై నిర్వహించిన ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కనీసం రెండు గంటలకోసారి అయినా లేవకుండా పనిచేసేవారిలో గుండెజబ్బులు, ఆస్తమా, పక్షవాతం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే మధ్యాన్న భోజనం తర్వాత వెంటనే కుర్చీని అంటిపెట్టుకోకుండా కొద్దిగా అటు ఇటు తిరగాలని కూడా వారు సలహా ఇస్తున్నారు. -
కణ మార్పిడితో మళ్లీ నడిచాడు!
లండన్: పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి పోలండ్ వైద్యులు కణమార్పిడి చికిత్సతో తిరిగి నడవగలిగాడు. డెరెక్ ఫిడికా (38)పై 2010లో ఓ వ్యక్తి కత్తితో దాడిచేయడంతో అతడి వెన్నుపాము చిట్లిపోయి..ఛాతీ కింది నుంచి దేహం చచ్చుబడిపోయింది. పూర్తిగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. అయితే.. డెరెక్ కేసును సవాల్‌గా తీసుకున్న పోలండ్ వైద్యులు లండన్ వైద్యుల సాయంతో చికిత్స ప్రారంభించారు. ముక్కు వెనక వాసనలు గ్రహించేందుకు తోడ్పడే ఘ్రాణశక్తి కణాలు(ఆల్ఫాక్టరీ ఎన్షీతింగ్ సెల్స్-ఓఈసీ)ను సేకరించి ప్రయోగశాలలో అభివృద్ధిపర్చారు. వాటిని వెన్నుపాము దెబ్బతిన్నచోటకు ఇంజెక్షన్ చేశారు. చీలమండ నుంచి నాడీకణజాలాన్ని సేకరించి వెన్నుపాము ఖాళీవద్ద అతికించారు. మూడునెలల చికిత్స తర్వాత ఫలితం కనిపించింది. వెన్నుపాములో తెగిపోయిన నాడీకణాలు ఘ్రాణ నాడీకణాలతో తిరిగి అనుసంధానం అయ్యాయి. దీంతో ఛాతీ కింద అవయవాలకు స్పర్శ, చలనం వచ్చింది. ప్రస్తుతం డెరెక్ కొద్దిగా నడవగలుగుతున్నాడు. వెన్నెముక దెబ్బతిన్నవారికి ఈ విధానం ఉపయోగపడుతుందని చికిత్సకు నేతృత్వం వహించిన వ్రోక్లా వర్సిటీ డాక్టర్ పావెల్ తబకోవ్ వెల్లడించారు. -
సంకల్పమే బలం
నాడీ వ్యవస్థ అదుపు తప్పితే... ఆ పరిస్థితే అనూహ్యం. పెరాలిసిస్ (పక్షవాతం).. జీవితాన్ని శాశ్వత వైకల్యంలోకి నెట్టేసే వ్యాధి ఇది. రకరకాల ఒత్తిళ్లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, దుర్వ్యసనాలు వంటివి నగరజీవిని కుదేలు చేస్తున్నాయి. మెదడు నుంచి కీలక అవయవాలకు నాడీ వ్యవస్థ ద్వారా వెళ్లే సంకేతాలు దారి తప్పుతున్నాయి. సంకేతాల చేరవేత ప్రక్రియలో మోత తట్టుకోలేక నరాలు చిట్లిపోతున్నాయి. కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో పక్షవాతం బాధితులు ఎక్కువగా ఉన్నారు. దృఢ సంకల్పం ఉంటే దుర్వ్యసనాలను మానేసి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని ప్రముఖ న్యూరో ఫిజీషియన్ బి.చంద్రశేఖర్‌రెడ్డి అంటున్నారు. పక్షవాతానికి ఇవే కారణాలు... - పొగతాగే వారి సంఖ్య బాగా పెరిగినందునే పక్షవాతం కేసులు ఎక్కువవుతున్నాయి. - ఆకు కూరలు, కూరగాయల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది. అదనంగా ఉప్పు వేసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి అనర్థాలకు గురవుతున్నారు. - ఆల్కహాల్ కారణంగా నరాలు బలహీనంగా మారుతున్నాయి. - నగరంలో ఎక్కువ మంది టెన్షన్ హెడేక్ (ఒత్తిడి కారణంగా తలనొప్పి) బాధితులుగా మారుతున్నారు. ఇది నరాల మీద ఒత్తిడి పెంచి పెరాలసిస్‌కు గురిచేస్తోంది. - చాలామంది అనవసరంగా నెగిటివ్ థింకింగ్ వల్ల ఒత్తిడి పెరిగి హార్ట్ ఎటాక్, అల్జీమర్, పెరాలసిస్‌కు గురవుతున్నారు. - గతంలో 50-55 ఏళ్ల వయసు దాటితే గానీ పెరాలిసిస్ వచ్చేది కాదు. నగరంలో పలు కారణాల వల్ల 40 ఏళ్లకే పెరాలిసిస్ బారిన పడుతున్నారు. నివారణకు ఈ జాగ్రత్తలు కీలకం... - తక్షణమే ఉప్పు తగ్గించాలి. ఉప్పు తగ్గిస్తే లో-బీపీ వస్తుందనేది అపోహ. రోజుకు ఐదు గ్రాములకు మించి వాడటం మంచిది కాదు. - రోజూ కనీసం 45 నిమిషాలు, వారానికి 5 రోజులు తప్పనిసరిగా నడవాలి. సాధారణంగా మణికట్టు వద్ద పల్స్‌రేటు 60 ఉంటే, నడిచేటప్పుడు 140 ఉండాలి. నెమ్మదిగా నడవడం వల్ల ఫలితం ఉండదు. - నడక బదులు సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం, షటిల్, టెన్నిస్ వంటి ఆటలు ఆడటం కూడా మంచిదే. - రోజువారీ ఆహారంలో 30 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 30 శాతం పిండి పదార్థాలు (బియ్యం, గోధుమలు వంటివి), 20 శాతం ప్రొటీన్స్ (పప్పులు, పెరుగు, పాలు వంటివి) విధిగా ఉండాలి. మాంసాహారులు మటన్ తినడం తగ్గించి, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. - రోజుకు రెండు కప్పుల కాఫీ లేదా టీ మంచిదే. డార్క్ చాక్లెట్, ఆల్మండ్, వాల్నట్, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవడం కూడా మంచిదే. వీటి వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. - రోజూ కొత్తగా ఆలోచించడం, కొత్త రూట్లో ప్రయాణిస్తే జ్ఞాపక శక్తి చురుగ్గా పనిచేస్తుంది. - రోగం వచ్చినప్పుడు ఆహారపు అలవాట్లు మార్చుకొనేకంటే, చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే జీవితకాలం పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రెజెంటేషన్: జి.రామచంద్రారెడ్డి డాక్టర్స్ కాలమ్ -డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్, సెక్రటేరియట్ రోడ్ -
తమ్ముడి చేతిలో అన్న హతం
వేధిస్తున్నాడని దారుణం పహాడీషరీఫ్: తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్న అన్నను దారుణంగా హత్య చేశాడో యువకుడు. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం...వెంకటాపూర్ ఫాతీమా కాలనీకి చెందిన అహ్మద్ ఖాన్ (29) క్యాబ్ డ్రైవర్. ఇతనికి భార్య కతీజాబేగం, ఇషాఖాన్, జ్యోత్స్న బేగం ఇద్దరు సంతానం. భార్యతో వివాదం తలెత్తడంతో ఎనిమిది నెలల క్రితం విడాకులిచ్చి, పిల్లలను కూడా ఆమె వెంటే పంపేశాడు. అప్పటి నుంచి తాగుడుకు బానిసైన అహ్మద్ ఖాన్ ఏ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బుల కోసం తల్లిదండ్రులను, సోదరుడిని వేధించసాగాడు. బుధవారం రాత్రి చిత్తుగా తాగొచ్చిన అహ్మద్‌ఖాన్ తనకు రూ.లక్ష ఇవ్వాలని, సౌదీ వెళ్తానంటూ పక్షవాతంతో బాధ పడుతున్న తల్లిదండ్రులను కొట్టాడు. ఇది గమనించిన తమ్ముడు అజ్మత్‌ఖాన్ (27) నిత్యం కుటుంబసభ్యులను వేధిస్తున్న అన్నను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో నిద్రిస్తున్న అన్న అహ్మద్‌ఖాన్ తలపై రెండు బండరాళ్లు వేసి హత్య చేశాడు. గురువారం ఉదయం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ డి.భాస్కర్ రెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు. -
దేహంలో ఒక పార్శ్వం కదలకపోతే... పక్షవాతం
అవగాహన పక్షవాతం దాడి చేసినప్పుడు ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే రోగి కోలుకోవడం కూడా అంతే వేగంగా జరుగుతుంది. చిక్కంతా ‘పక్షవాతం లక్షణాలు ఇలా ఉంటాయి’ అని తెలియకపోవడంతోనే వస్తుంటుంది. బలహీనత, దేహంలో ఒక వైపు కదలికలు మందగించడం, స్పర్శ కోల్పోవడం, తిమ్మిరి ఉన్నట్లుండి కంటి చూపు మసకబారడం (ముఖ్యంగా ఒక కన్ను). మాట తడబాటు, మాట పట్టేయడం, మాట స్పష్టంగా అర్థం కాకపోవడం మింగలేకపోవడం (ఘన పదార్థాలే కాక ద్రవాలు మింగడం కూడా) తల తిరిగినట్లు ఉండడం, మెదడుకు, దేహ కదలికలకు మధ్య సమన్వయం లోపించడం (ఉదాహరణకు చెయ్యి పెకైత్తబోయినప్పుడు అనుకున్నట్లు కదిలించలేకపోవడం, వేళ్లకు పట్టు దొరకకపోవడం, నుదుటిని తాకాలని ప్రయత్నిస్తే చేయి ముక్కు దగ్గరే ఆగిపోవడం వంటివి), కదలికలు మద్యం సేవించిన వారిలా ఉండడం నిలబడినప్పుడు రెండు కాళ్ల మీద ఒకే విధంగా బరువును మోపలేకపోవడం రెండు చేతులను ఒకే రకంగా కదిలించలేకపోవడం, చేతులను పెకైత్తినప్పుడు ఒక చెయ్యి కిందకు పడిపోతుండడం భరించలేనంత తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవడం లాంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో కొన్ని కనిపించినా, వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. -
గుండెజబ్బు, పక్షవాతం ముప్పుల వెనక జన్యుమార్పు
న్యూయార్క్: గుండెజబ్బు, పక్షవాతం ముప్పులకు కారణమయ్యే ఓ కీలక జన్యు ఉత్పరివర్తనాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో కూడిన మెటబాలిక్ సిండ్రోమ్ (జీవక్రియల సంబంధమైన సమస్య) వల్ల గుండెజబ్బు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది. అయితే శరీరంలో కొవ్వులు, గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే ‘డీవైఆర్కే1బీ’ అనే జన్యువులో మార్పే మెటబాలిక్ సిండ్రోమ్‌కు కారణమవుతోందని తాజాగా అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ అర్యమణి నేతృత్వంలోని బృందం కనుగొంది. డీవైఆర్కే1బీ జన్యువులో ఉత్పరివర్తనం వల్ల.. అది శరీరంలో కొవ్వు, గ్లూకోజ్ నిల్వలను స్థిరంగా ఉంచే వ్యవస్థను నిరోధిస్తోందని, ఫలితంగా గ్లూకోజ్, కొవ్వులు పెరిగిపోయి మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తోందని మణి తెలిపారు. డీవైఆర్కే1బీ జన్యువులో ఉత్పరివర్తనాన్ని సరిచేసేందుకు కొత్త చికిత్సలు రూపొందిస్తే గనక.. మెటబాలిక్ సిండ్రోమ్‌ను నివారించవచ్చని, తద్వారా గుండెజబ్బు, పక్షవాతం ముప్పులూ తగ్గుతాయన్నారు. వీరి పరిశోధన వివరాలు ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి -
మెదడుకు చైతన్యం
ఆవిష్కరణ మ్యాగ్నటిక్ బ్రెయిన్ థెరపీ విధానంలో మరో కొత్త ఆవిష్కరణ ట్రాన్స్‌క్రేనియల్ మాగ్నటిక్ స్టిమ్యులేషన్. ఈ విధానంలో మైగ్రేన్, డిప్రెషన్, పక్షవాతం వంటి సమస్యలకు చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. మెదడును చైతన్యవంతం చేయడం ద్వారా కోమాలోకి వెళ్లిన వ్యక్తికి కూడా చికిత్స చేయవచ్చని వారి అభిప్రాయం. ఈ ప్రక్రియను యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ ఎఫ్‌డిఎ) ఆమోదించింది. డిప్రెషన్‌తో బాధపడుతూ యాంటీ డిప్రెసెంట్ మందులు ప్రభావం చూపని వారికి ఈ ప్రక్రియ చక్కటి పరిష్కారమవుతుందని ఎఫ్‌డిఎ ధ్రువీకరిస్తోంది. ఈ చికిత్స విధానంలో తల మీద ఎలెక్ట్రో మ్యాగ్నటిక్ కాయిల్‌ను అమరుస్తారు. ఈ కాయిల్ మెదడు టికణాలను చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. ప్రయోగదశ దాటిన ఈ వైద్యప్రక్రియ అందుబాటులోకి రావడానికి కనీసం ఏడాది పట్టవచ్చు. -
నోరు మంచిదైతే... మెదడుకూ మంచిదే! రోజూ వాడే బ్రష్‌తో పక్షవాతాన్నీ తరిమేయండి!
ఇటీవల తమ వద్దకు వచ్చే కేసులతో ఒక కొత్త పరిణామాన్ని గమనించారు దంతవైద్యులు డాక్టర్ ప్రత్యూష, న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మ వీరపనేని. పక్షవాతంతో తన వద్దకు వచ్చిన కేసులను పరిశీలిస్తే... వారికి గతంలో దంత సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చిన కేస్ హిస్టరీని గమనించినట్లు పేర్కొంటున్నారు పద్మ వీరపనేని. అలాగే దంత సంబంధమైన వ్యాధులు జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వచ్చి ఉన్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువే అంటున్నారు డాక్టర్ ప్రత్యూష. ఈ సంయుక్త పరిశీలన ఫలితాలను బేరీజు వేసి చూస్తే... దంతసంబంధమైన వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదనేది ఆ ఇద్దరు డాక్టర్ల మాట. నోటి శుభ్రతతో పక్షవాతానికి వాత పెట్టవచ్చని వారి సలహా. దంతాలకు వచ్చే జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వ్యాధులు దీర్ఘకాలంలో పక్షవాతానికి దారితీసే వైనాన్ని వివరిస్తున్నారు వీరు. చాలామందిలో చిగుర్ల భాగం కాస్తంత ఉబ్బి, ఎర్రగా మారుతుంది. నిజానికి చిగుర్లకు వచ్చే వ్యాధులు నొప్పి లేనివిగా ఉంటాయి. దాంతో చిగుర్లకు వచ్చే వ్యాధుల్ని గుర్తించడం కష్టం. చిగుర్లను ‘జింజివా’ అంటారు. వీటికి వచ్చే ఇన్ఫెక్షనే ‘జింజివైటిస్’. చిగుర్లలోపలి భాగంలో పంటికి గట్టిగా అతుక్కుపోయే గార, బ్యాక్టీరియా వల్ల చిగుర్లవాపు లక్షణంతో కనిపించే జింజివైటిస్ వస్తుంది. ప్రతిరోజూ సరిగా బ్రష్ చేయకపోవడం అనే చిన్న కారణం మొదలుకొని, చాలామందిలో ఉండే పొగాకు నమిలే దురలవాటు వరకు ఈ గార, బ్యాక్టీరియాల పెరుగుదలకు కారణం. మనం రోజూ సరిగా బ్రష్ చేయకపోతే కనీసం 400 రకాల హానికర బ్యాక్టీరియా పళ్ల మధ్య పెరగడానికి ఆస్కారం ఉంది. అలా హానికరమైన బ్యాక్టీరియా కారణంగా పంటిపై గార పెరుగుతుంది. తొలిదశలో గారను సులభంగా తొలగించవచ్చు. కానీ అదే దీర్ఘకాలికంగా ఉంటే తొలగించలేనంత గట్టిగా మారి కాలక్రమంలో పెరియోడాంటైటిస్‌కు దారితీస్తుంది. ఇది ప్రధానంగా పొగతాగేవారిలో, పొగాకును గుట్కా, ఖైనీ, పాన్పరాగ్ల రూపంలో నమిలేవారిలో మరింతగా ఉంటుంది. నోటి ఆరోగ్యానికీ... పక్షవాతానికీ సంబంధమేమిటి? నోటిజబ్బులకూ, చిగుర్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా కొన్ని రకాల విషపదార్థాల (టాక్సిన్స్)ను వెలువరిస్తుంటాయి. ఆ టాక్సిన్స్ రక్తంలో ప్రవేశించి, రక్తప్రవాహానికి అడ్డుపడటానికి కారణమయ్యే కొన్ని రక్తపుగడ్డలు (క్లాట్స్)నూ, కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ క్లాట్స్, ప్లాక్స్ ఒకవేళ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలకు అడ్డుపడితే గుండెపోటు రావచ్చు. ఇది ఒక థియరీ. ఇక పక్షవాతానికి దారితీసే మరో థియరీ కూడా ఉంది. దీని ప్రకారం... నోటిలో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందినప్పుడు మన కాలేయంలో కొన్ని రకాల ప్రోటీన్లు తయారవుతాయి. అవి రక్తప్రవాహంలోకి తద్వారా మెదడులోని రక్తనాళాల్లోకి ప్రవేశించి రక్తప్రవాహానికి అడ్డుపడటం వల్ల ‘ఇస్కిమిక్ స్ట్రోక్’ (ఒక రకం పక్షవాతం)కు దారితీయవచ్చు. మెదడులో ఏ అవయవాన్ని నియంత్రించే సెంటర్‌కు రక్తసరఫరా నిలిచిపోతే ఆ భాగం చచ్చుబడి... అలా అది పక్షవాతం రూపంలో వ్యక్తమవుతుంది. ఇదీ నోటిఆరోగ్యానికీ, చిగుళ్ల ఆరోగ్యానికీ... మెదడుకూ ఉన్న సంబంధం. అలాగే కోరపన్నుకు వచ్చే ఇన్ఫెక్షన్ నేరుగా మెదడుకి వెళ్లి కేవర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అనే కండిషన్ వస్తుంది. అది నేరుగా పక్షవాతానికి దారితీస్తుంది. ఇక కొందరిలో అసలు పళ్లే ఉండవు. దాంతో చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశమే ఉండదు. ఇలా చిగుర్ల ఇన్ఫెక్షన్ లేనివాళ్లలో పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్న దృష్టాంతం కూడా పళ్లకూ, పక్షవాతానికి ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తోంది. చిగుర్లు ఆరోగ్యంగానే ఉన్నాయని గుర్తించడం ఎలా? చిగుర్లు గులాబి రంగులో ఆరోగ్యంగా కనిపిస్తుంటాయి. ఈ గులాబి రంగు చిగుర్లు కాస్తా ఎర్రగా వాచి కనిపించడం, బ్రష్ చేసుకుంటుంటే చిగుర్ల నుంచి రక్తం రావడం జరిగితే అది చిగుర్ల వ్యాధి (జింజివైటిస్)కి లక్షణంగా భావించాలి. జింజివైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది దీర్ఘకాలంలో పెరియోడాంటైటిస్‌కు దారి తీస్తుంది. పెరియోడాంటైటిస్ను గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి... చిగుర్లలో పుండ్లు పడటం, దంతాల మధ్య గ్యాప్ పెరగడం, దంతాలు వదులు కావడం వంటి లక్షణాలతో తెలుసుకోవచ్చు. పక్షవాతానికి బ్రష్‌తోనూ నివారణ... మనం రోజూ పళ్లు తోముకునే ఒక చిన్న బ్రష్ గుండెజబ్బులతో పాటు పక్షవాతాన్నీ నివారిస్తుందని తెలుసుకోండి. ఒకవేళ ఇప్పుడు మీరు బ్రషింగ్ కోసం చేతిని కదిలించడానికి బద్దకిస్తే... అసలు భవిష్యత్తులో చెయ్యే కదలకుండా చచ్చుబడిపోయే ప్రమాదం ఉందని గుర్తించండి. పంటి పక్కవైపున ఉండే ప్లాక్‌ను ఫ్లాసింగ్‌తో (దారం సహాయంతో) తొలగించుకోండి. ఒకవేళ ఇప్పటికే ప్లాక్ చేరి ఉన్నట్లు గుర్తిస్తే డెంటిస్ట్‌ను కలిసి దాన్ని స్కేలింగ్ వంటి ప్రక్రియలతో తొలగించుకోవాలి. ఒకసారి ఆ పని చేసి ఇక ఆ తర్వాత ఎప్పటికప్పుడు నోటి శుభ్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఇది పళ్లను శుభ్రపరచడమే గాక... రక్తనాళాలనూ శుభ్రం చేసి అటు గుండెపోటూ, ఇటు బ్రెయిన్స్ట్రోక్లను నివారిస్తుంది. -నిర్వహణ: యాసీన్ పక్షవాతం రిస్క్ తగ్గించే షార్ట్‌కట్స్ ఇవి... ఊ రోజూ బ్రషింగ్, ఫ్లాసింగ్ ద్వారా దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాలను తొలగించాలి దంతాలకు బలం చేకూర్చే సమతుల పోషకాహారం తీసుకోవాలి. దంతాలకు తగినంత క్యాల్షియం లభించేలా పాలు, పాల ఉత్పాదనలు తీసుకోండి సిగరెట్, పొగాకుకు సంబంధించిన ఇతర ఉత్పాదనలైన గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వంటి అలవాట్లను తక్షణం మానేయండి. అవి తీసుకునే సమయంలో భవిష్యత్తులో అదే పక్షవాతానికి కారణం కావచ్చనే మాటను గుర్తుచేసుకోండి. డాక్టర్ ప్రత్యూష దంత వైద్య నిపుణులు, ప్రొఫెసర్, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. డాక్టర్ పద్మ ఎస్. వీరపనేని సీనియర్ న్యూరాలజిస్ట్, అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ , సికింద్రాబాద్.