మెదడుకు చైతన్యం
ఆవిష్కరణ
మ్యాగ్నటిక్ బ్రెయిన్ థెరపీ విధానంలో మరో కొత్త ఆవిష్కరణ ట్రాన్స్‌క్రేనియల్ మాగ్నటిక్ స్టిమ్యులేషన్. ఈ విధానంలో మైగ్రేన్, డిప్రెషన్, పక్షవాతం వంటి సమస్యలకు చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. మెదడును చైతన్యవంతం చేయడం ద్వారా కోమాలోకి వెళ్లిన వ్యక్తికి కూడా చికిత్స చేయవచ్చని వారి అభిప్రాయం.
ఈ ప్రక్రియను యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ ఎఫ్‌డిఎ) ఆమోదించింది. డిప్రెషన్‌తో బాధపడుతూ యాంటీ డిప్రెసెంట్ మందులు ప్రభావం చూపని వారికి ఈ ప్రక్రియ చక్కటి పరిష్కారమవుతుందని ఎఫ్‌డిఎ ధ్రువీకరిస్తోంది. ఈ చికిత్స విధానంలో తల మీద ఎలెక్ట్రో మ్యాగ్నటిక్ కాయిల్‌ను అమరుస్తారు. ఈ కాయిల్ మెదడు టికణాలను చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. ప్రయోగదశ దాటిన ఈ వైద్యప్రక్రియ అందుబాటులోకి రావడానికి కనీసం ఏడాది పట్టవచ్చు.