
వినేందుకు కొంత విచిత్రంగా అనిపిస్తుంది. ఫిజిక్స్ నేర్చుకుంటే... మెదడులో కొన్ని ప్రాంతాలు మరింత చైతన్యవంతమవుతాయి అంటున్నారు ఫ్లారిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. మెదడు పనిచేసే తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాడే ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్‌ఎమ్మారై) వాడి తాము ఈ అంచనాకు వచ్చామని ఎరిక్ బ్రూవీ అనే శాస్త్రవేత్త తెలిపారు. దాదాపు 50 మంది స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్న ఈ ప్రయోగంలో అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తూ తాము ఒక భౌతికశాస్త్ర కోర్సు మొదలుపెట్టామని, ఎఫ్‌ఎమ్మారై ద్వారా వారి మెదడును పరిశీలించినప్పుడు కొన్ని కొత్త ప్రాంతాలు చైతన్యవంతం కావడాన్ని గుర్తించామని వివరించారు.
కోర్సు ప్రారంభానికి ముందు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సమస్య పూరణం వంటి అంశాలకు సంబంధించిన మెదడు ప్రాంతాలు చురుకుగా మారితే.. కోర్సు పూర్తయిన తరువాత ఫ్రంటల్ పోల్స్ ప్రాంతంతోపాటు పోస్టీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే భాగం కూడా చైతన్యవంతమైంది. మొదటి భాగం నేర్చుకోవడానికి సంబంధించిందైతే.. రెండోది ఎపిసోడిక్ మెమరీ అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలను క్రమపద్ధతిలో నెమరేసుకోవడం, సెల్ఫ్ రెఫరెన్షియల్ థాట్ అంశాలకు సంబంధించినవని బ్రూవీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment