consciousness
-
మంచి మాట: జీవన స్పృహ
స్పృహ అనేది ప్రాణం ఉన్న ప్రతిమనిషికీ ఉండాల్సిన వాటిల్లో అతిముఖ్యమైంది. స్పృహ ఉండాలన్న స్పృహ కూడా లేనివాళ్లు ఉన్నారు. మనిషి ఏ పరిస్థితిలోనూ ఏ రకమైన మత్తుకూ లోనుకాకూడదు. ఏ రకమైన మత్తుకూ మనిషి చిల్తై పోకూడదు. కొన్ని సందర్భాల్లో మనిషిని నిస్పృహ ఆవరిస్తూ ఉంటుంది. దానికి కొనసాగింపుగా నిస్తేజం పట్టి పీడిస్తూ మనిషిని అదిమేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోంచి మనిషి తెప్పరిల్లి తేరుకోగలగాలి. అందుకు స్పృహ అనేది తప్పకుండా ఉండాలి. స్పృహతో నిస్తేజాన్ని నిశ్వాసిస్తూ ఉత్తేజాన్ని ఉచ్ఛ్వాసిస్తూ ఉండాలి; సత్తేజంతో ఉండాలి. మనిషిలో లేదా మనిషికి తప్పకుండా ఉండాల్సింది స్పృహ. స్పృహ అన్నది లేకుండా పోతే మనిషి తన నుంచి తాను తప్పిపోతాడు; మనిషి తనకు తాను కాకుండా పోతాడు. ఒక మనిషి తన జీవనోపాధిని కోల్పోవచ్చు, తన ఆస్తుల్ని కోల్పోవచ్చు, తనవి అన్నవాటిని అన్నిటిని ఒక మనిషి కోల్పోవచ్చు కానీ స్పృహను మాత్రం కోల్పోకూడదు. దేన్ని అయినా వదులుకోవచ్చు కానీ స్పృహను వదులుకోకూడదు. మనిషికి ఏదైనా లేకుండా పోవచ్చు కానీ స్పృహ లేకుండా పోకూడదు. తనకు తాను ఉన్నంత వరకూ, తనలో రక్తం పారుతున్నంత వరకూ మనిషికి స్పృహ ఉండాలి. మనిషి రక్తంలో స్పృహ పారుతూ ఉండాలి. మనిషిలో రక్తంలా స్పృహ ప్రవహిస్తూ ఉండాలి. తనలో స్పృహ ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితంలోకి ప్రయాణం చేస్తూ ఉండగలడు. స్పృహ మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. స్పృహ వల్ల మనిషికి బయటా, లోపలా చలనం కలుగుతుంది. ఆ చలనం గతికి, ప్రగతికి కారణం అవుతుంది. స్పృహ లేనప్పుడు మనిషికి ఏదీ అందదు, మనిషివల్ల ఏదీ జరగదు. స్పృహలేకపోతే మనిషికి గతి, ప్రగతి ఉండవు. ‘జీవితం నిన్ను బలపరిచేందుకు సిద్ధంగా ఉంది; అందుకు ముందు నువ్వు జీవితానికి తలుపు తెరిచి ఉంచాలి‘ అని జర్మన్ తాత్త్వికుడు ఎక్‌హార్ట్ టోల్ తెలియజె΄్పారు. స్పృహ ఉన్నప్పుడు మాత్రమే మనం జీవితానికి తలుపు తెరిచి ఉంచగలం. లేదా మనకు ఉన్న స్పృహ మాత్రమే జీవితానికి తలుపు తెరిచి ఉంచగలదు. మత్తు జీవితాన్ని మూసేస్తుంది. మన మత్తును మనం వదిలించుకోవాలి. మనల్ని మన జీవితం బలపరచాలంటే మనకు స్పృహ కావాలి. ఎక్‌హార్ట్ టోల్ స్పృహ విషయంలో ఇంకా ఇలా స్పష్టతను ఇచ్చారు, ‘మనకు కలిగే ఆలోచనను స్పృహ అని అనుకోవడం తప్పు. ఆలోచన, స్పృహ పర్యాయపదాలు కావు. ఆలోచన అనేది స్పృహలోని ఒక చిన్న క్రియారూపం మాత్రమే. స్పృహ లేకుండా ఆలోచన ఉనికిలో ఉండదు; కానీ స్పృహకు ఆలోచన అవసరం ఉండదు’. మనం స్పృహ తోనే జీవనం చెయ్యాలి. మనకు ముందు కొందరికైనా సామాజిక స్పృహ ఉండి ఉండబట్టే ఇవాళ సమాజం ఉంది. సంగీతం, సాహిత్యం, ఇతర కళలపై స్పృహ ఉన్న కొందరివల్ల అవి చలామణిలో ఉన్నాయి. విద్య, వృత్తులు, పరిశోధనలు వంటివాటిపై మనకు పూర్వం ఉన్నవాళ్లకు స్పృహ ఉండబట్టే మనం మనుగడ చెయ్యగలుగుతున్నాం. స్పృహలేని మనిషి ఊపిరితో ఉన్న రాయి . మనం స్పృహతో మనుగడ చేద్దాం. రాళ్లల్లా కాదు మనుషులమై బతుకుదాం. – శ్రీకాంత్ జయంతి -
పిల్లలు అకస్మాత్తుగా ఎందుకు స్పృహ తప్పుతుంటారు?
పిల్లల్లో చాలామంది కొన్నిసార్లు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోతుంటారు.ఇది చాలా మంది పిల్లల్లో కనిపించేదే. నిజానికి చాలా సందర్భాల్లో స్కూళ్లలో ప్రేయర్‌కు నిలబడ్డ సమయంలో ఇలా జరుగుతుడటం గమనించవచ్చు. ఈ సమస్యను ‘సింకోప్’ అంటారు. దీన్ని సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌గా చెప్పవచ్చు. పిల్లల్లో సింకోప్ కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా ఇలాపడిపోడానికి కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి. ఇటువంటి పిల్లల్లో గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్‌కూడా ఈ రకంగానే కనిపించవచ్చు. సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగిస్తూ ఉండటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు బాగా ఉపయోగపడతాయి. అలా కాకుండా పిల్లలు పదే పదే ‘సింకోప్’కు లోనై పడిపోతుంటే మాత్రం డాక్టర్‌కు చూపించాల్సిందే. -
అవునా! ఇవి నిజమేనా?
నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనే టాపిక్ నమ్మకాలు, అపనమ్మకాలకు అతీతంగా ఎప్పుడూ ఆసక్తికరమే. దీన్ని దృష్టిలో పెట్టుకునే కావచ్చు అమెరికన్ సైకియాట్రిస్ట్ డా. బ్రూస్ గ్రేసన్ తాజాగా ఒక పుస్తకం రాశాడు. చావుముఖం వరకు వెళ్లి వచ్చిన వారి అనుభవాలు ‘ఆఫ్టర్’ అనే ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవి భ్రమ, మనోరూపాల్లో నుంచి వచ్చిన అనుభవాలు కావని, నూరుశాతం నిజాలని అంటున్నాడు రచయిత. ఒక లారీడ్రైవర్‌కు హార్ట్సర్జరీ జరుగుతుంది. బయటి లోకానికి అతడు అపస్మారకస్థితిలో ఉన్నాడు. కానీ డాక్టర్ ఏం చేస్తున్నాడో అతడికి తెలుస్తుంది. షాకింగ్ ఏమిటంటే, ఆపరేషన్ టేబుల్ పక్కన డ్రైవర్ తల్లి నిల్చొని సర్జన్లకు ఏవో సలహాలు చెబుతుంది. మరో షాకింగ్ ఏమిటంటే ఆమె చనిపోయి 20 సంవత్సరాలవుతుంది! ఒక కుర్రాడి తల్లి చనిపోయింది. తట్టుకోలేక సమాధిరాయి మీద తల బాదుకున్నాడు. ఇంచుమించుగా చనిపోయాడు. ‘నాయనా! ఇలా చేయకు. ఎలా అయిందో చూడు’ తల్లి గొంతుతో సమాధి నుంచి ఏవేవో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎలా బతికాడో ఏమోగానీ అతడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. తల్లి మాటలు అక్షరాలా గుర్తున్నాయంటాడు... శాస్త్రీయ నిర్ధారణకు అందని ఇలాంటివి ఎన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. -
స్పృహలోకి వచ్చిన మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో 2రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలు మధులిక(17) ఆరోగ్యం శుక్రవారానికి కొంత మెరుగుపడింది. 2 రోజుల నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందు తున్న ఆమె శుక్రవారం స్పృహలోకి వచ్చింది. చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తుండటంతో పాటు బీపీ, పల్స్‌రేటు సహజస్థితికి చేరుకు న్నాయి. న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ భొట్ల, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చంద్రమౌలి, వాస్క్యూలర్ సర్జన్ డాక్టర్ ప్రకాశ్, జనరల్ సర్జన్ డాక్టర్ సాయిబాబా, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రసీద్‌లతో కూడిన వైద్య బృందం సుమారు 7 గంటలు శ్రమించి ఆమె తల, ఇతర భాగాలకైన గాయాలకు చికిత్స చేశారు. విరిగిన చేతి ఎముకలకు రాడ్డు సాయంతో సరిచేశారు. గదుమ, మెడ, మోచేతి భాగాల్లోని కత్తిగాట్లను శుభ్రం చేసి, గాయాలకు కుట్లు వేశారు. రక్త స్రావం పూర్తిగా నియంత్రించారు. ఇప్పటి వరకు పదిబాటిళ్లకు పైగా రక్తం ఎక్కించారు. ఉన్మాది ఉపయోగించిన కత్తి తుప్పుపట్టి ఉండటం వల్ల తలపై గాయానికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చికిత్సకు స్పందిస్తున్నప్పటికీ..ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం వెంటిలేటర్ నుంచి బయటికీ తీసుకురానున్న ట్లు తెలిపారు. మధులిక స్వయంగా శ్వాస తీసు కోగలిగి..ఇన్ఫెక్షన్ నుంచి బయటపడాల్సి ఉంది. మరో 48 గంటలు గడిస్తే కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్య బృందం స్పష్టం చేసింది. -
ఫిజిక్స్‌తో మెదడులో కొత్త చైతన్యం!
వినేందుకు కొంత విచిత్రంగా అనిపిస్తుంది. ఫిజిక్స్ నేర్చుకుంటే... మెదడులో కొన్ని ప్రాంతాలు మరింత చైతన్యవంతమవుతాయి అంటున్నారు ఫ్లారిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. మెదడు పనిచేసే తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాడే ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎమ్మారై) వాడి తాము ఈ అంచనాకు వచ్చామని ఎరిక్ బ్రూవీ అనే శాస్త్రవేత్త తెలిపారు. దాదాపు 50 మంది స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్న ఈ ప్రయోగంలో అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తూ తాము ఒక భౌతికశాస్త్ర కోర్సు మొదలుపెట్టామని, ఎఫ్ఎమ్మారై ద్వారా వారి మెదడును పరిశీలించినప్పుడు కొన్ని కొత్త ప్రాంతాలు చైతన్యవంతం కావడాన్ని గుర్తించామని వివరించారు. కోర్సు ప్రారంభానికి ముందు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సమస్య పూరణం వంటి అంశాలకు సంబంధించిన మెదడు ప్రాంతాలు చురుకుగా మారితే.. కోర్సు పూర్తయిన తరువాత ఫ్రంటల్ పోల్స్ ప్రాంతంతోపాటు పోస్టీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే భాగం కూడా చైతన్యవంతమైంది. మొదటి భాగం నేర్చుకోవడానికి సంబంధించిందైతే.. రెండోది ఎపిసోడిక్ మెమరీ అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలను క్రమపద్ధతిలో నెమరేసుకోవడం, సెల్ఫ్ రెఫరెన్షియల్ థాట్ అంశాలకు సంబంధించినవని బ్రూవీ తెలిపారు. -
జయ స్పృహలో ఉండే సంతకం చేశారు!
టీ.నగర్: తమిళనాడులో 3 నియోజకవర్గాల ఉపఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో జయలలిత స్పృహలో ఉండగానే సంతకం చేసినట్లు ఆమె మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్ వెల్లడించింది. ఆమె అపోలో ఆసుపత్రిలో ఉన్నకాలంలో రాష్ట్రంలో 3 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. రెండాకుల చిహ్నం కేటాయింపునకు సంబంధించిన బీ ఫారంలో జయలలిత వేలిముద్ర ఉంది. వేలిముద్రలు తీసుకున్న సమయంలో జయ స్పృహలోనే ఉన్నట్లు వైద్యుడు బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు. బాలాజీ వాంగ్మూలం వాస్తవమేనని విచారణ కమిషన్ తాజాగా నిర్ధారించింది. ఆసుపత్రి గదిలో జయలలిత వేలిముద్రలు తీసుకున్నది నిజమేనని, తర్వాత ఆమె వేలికి అంటుకున్న సిరాను బాలాజీ తుడిచేందుకు ప్రయత్నించగా ఆయన్ని అడ్డుకుని శశికళ సిరాను తుడిచినట్లు తెలిపింది. -
స్పృహ తప్పి పడిపోయిన కోమటిరెడ్డి
ముఖ్య అనుచరుడు శ్రీనివాస్ హత్యపై కోమటిరెడ్డి తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యను ఖండిస్తూ ఆయన నల్గొండలో నిరసనకు దిగారు. హత్య కేసులో అసలు దోషులను దాచేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. హత్యకు కారకులైన అసలు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని క్లాక్ టవర్ వద్ద బైఠాయించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రక్తత ఏర్పడింది. అంతేకాకుండా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మొహరించారు. నిరసన కారణం భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడిందని, వెంటనే విరమించాలని కోమటిరెడ్డిని కోరారు. కోమటిరెడ్డి మాత్రం తన నిరసన దీక్షను విరమించలేదు. అయితే పోలీసులు ఆయన్ను బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులకు తోపులాట కోమటిరెడ్డి అభిమానులకు జరిగింది. ఉదయం నుంచి పార్టీ కార్యకర్తలతో ఎండలో నిరసన చేపట్టిన కోమటి రెడ్డి కొద్ది సేపటికి స్పృహతప్పి పడియారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
భూగోళం అగ్నిగోళంగా మారుతుంది
భూగోళం మండే అగ్నిగోళంగా మారుతుందట. ఇదేదో కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యవాణి కాదు. భౌతిక, అంతరిక్ష శాస్త్రాల్లో అనితరసాధ్యమైన పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేస్తున్న హెచ్చరిక. ఇప్పటికప్పుడే ముంచుకొచ్చే ముప్పేమీ లేకపోయినా, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులు ఇదే రీతిలో కొనసాగుతూ పోతే 2600 సంవత్సరం నాటికి భూగోళం మండే అగ్నిగోళంలా తయారవుతుందని హాకింగ్ చెబుతున్నారు. ఆ పరిస్థితి దాపురించి మానవజాతి అంతరించిపోకుండా ఉండాలంటే, మనుగడకు అనుకూలమైన వాతావరణం గల ఇతర గ్రహాలకు వలస పోవడానికి మనుషులందరూ సిద్ధం కావాలని ఆయన సూచిస్తున్నారు. బీజింగ్‌లో ఇటీవల ఏర్పాటైన ఒక సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చేసిన ప్రసంగంలో హాకింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో జీవితంలోని ప్రతి విషయంలోనూ మార్పులు తేవచ్చని, అయితే, కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరాలను సజావుగా నియంత్రించుకోవాల్సి ఉంటుందని కూడా సూచించారు. -
డ్రగ్స్ మత్తులో.. హల్చల్ చేసి యువత
కాజీపూట: బెంగుళూరు నుంచి లక్నో వెళ్తున్న యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆరుగురు యువకులు డ్రగ్స్ తీసుకొని రైల్లో హల్చల్ చేసి స్పృహ కోల్పోయారు. వారితో విసుగు చెందిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైలు కాజీపేట రైల్వే స్టేషన్ చేరుకోగానే ఆ ఆరుగురు యువకులను దింపి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. డ్రగ్స్ తీసుకున్నా యువకులు మాత్రం మాకు ఎవరో మత్తు మందు ఇచ్చి తమ వద్ద ఉన్న డబ్బులు తీసుకెళ్లారని చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ ప్రిన్సిపాల్.. ఇద్దరు అమ్మాయిలు..ఓ ఫైట్
లండన్: ఇద్దరు విద్యార్థినుల మధ్య గొడవను సర్దుమణిగేలా చేసేందుకు వెళ్లిన ఓ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ సమస్యల్లో ఇరుక్కున్నాడు. మరో అమ్మాయితో గొడవ పడుతున్న పదిహేనేళ్ల విద్యార్థిని విడిపించేందుకు ఆ విద్యార్థిని గొంతుదగ్గరపట్టుకొని లాగడంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి పోయింది. ఇది కాస్త వీడియో రూపంలో బయటకు రావడంతో పెద్ద రచ్చగా మారి పోలీసుల వరకు వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. లండన్ లోని కింగ్ స్ట్రీ సీనియర్ హై స్కూల్లో మాక్ బర్గెస్ అనే అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఉన్నాడు. గత సోమవారం ఇద్దరు విద్యార్థినులు బాగా గొడవపడుతుంటే ఇతర విద్యార్థినులు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. అనంతరం తమ చేతుల్లోని సెల్ ఫోన్లు బయటకు తీసి రికార్డు చేయడం మొదలు పెట్టారు. కానీ, వారిని విడిపించేందుకు ఏ ఒక్కరూ వెళ్లలేదు. దీంతో స్కూల్ యాజమాన్యంలో ఒకరైన మాక్ బర్గెస్ ఆ గొడవపడుతున్నవారి వద్దకు వెళ్లి తొలుత ఆపే ప్రయత్నం చేశాడు. మందలించి చూశాడు. అయినా, వారు ఆయన మాట వినకుండా కొట్టుకుంటుండటంతో అందులో పదిహేనేళ్ల విద్యార్థినిని మెడదగ్గరపట్టుకొని గట్టిగా వెనక్కి లాగాడు. అలా కొన్ని అడుగుల దూరం వెనక్కిలాగుతూ వెళ్లాడు. దీంతో ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి పోయింది. ఈ వీడియో వెలుగుచూడంతో ఆ బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేశారు. అయితే, తొలుత ఆయనను అరెస్టు చేయాలని చెప్పిన కోర్టు అనంతరం కేవలం నోటీసులు మాత్రం జారీ చేస్తే సరిపోతుందని, వివరణ కోరాలని తెలిపింది. కానీ, ఆ బాలిక తల్లి మాత్రం ఆయనకు శిక్ష పడాలని అంటోంది. గత ఐదురోజులుగా తన కూతురు సస్పెండ్ అయ్యి ఇంట్లోనే ఉంటుందని, ఆ ప్రిన్సిపాల్ తన కూతురును ఈడ్చేసిన విధానం చూస్తుంటే ఓ తల్లిగా ఎంతో బాధకలుగుతుందని, కనీసం మెడ కూడా తిప్పలేకుండా ఉండి మెడిసిన్ వాడుతుందని చెప్పింది. -
స్పృహలోకి ఇంద్రాణి
-
స్పృహలోకి ఇంద్రాణి
ముంబయి: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్పృహలోకి వచ్చింది. దీంతో ఇక ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని వైద్యులు ధృవీకరించారు. తన కూతురు షీనాబోరాను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పరిస్థితి శనివారం అకస్మాత్తుగా విషమంగా మారిన విషయం తెలిసిందే. బైకలా జైల్లో ఉన్న ఆమె కొన్ని మాత్రలు వేసుకున్న వెంటనే ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటంతో హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలింది. దీంతో వెంటిలేటర్ ద్వారా ఆమెకు ఆక్సిజన్ అందించారు. కాగా, ఈ కేసు నేపథ్యంలో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక మరేదైనా తెలియని కారణం ఉందా ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఆమె ఫిట్స్ నిరోధానికి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అది కూడా జైలు అధికారుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి.కానీ ఆ మాత్రలను అధిక మోతాదులో ఇంద్రాణి వాడటం వల్లే అపస్మారక స్థితిలోనికి వెళ్లారని వైద్యులు అంటున్నారు. -
ఆ నగరం ధన్యమైంది!
ఆ నేడు - 20 సెప్టెంబర్, 1946 అదేమిటోగానీ కాన్స్ అనే పేరు వినబడగానే, అది ఒక నగరం పేరనే స్పృహ కంటే, వెండితెర ఒకటి కళ్ల ముందు కదలాడుతుంది. ఆ తెరపై ఒక్కటొక్కటిగా చిత్రాలు ప్రదర్శితమవుతాయి. ‘కాన్స్‌లో సినిమా హాళ్లు మాత్రమే ఉంటాయట’ అనే పుకారు ఒకటి ఉండేది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు... కాన్స్‌కు, సినిమాలకు ఎంత దగ్గరి సంబంధం ఉందో! ఫ్రాన్స్‌లోని కాన్స్ పట్టణాన్ని భౌగోళిక, ఆర్థిక, సామాజిక కోణాలలో అంచనా వేయడం కంటే...కళాత్మక దృష్టితో అంచనా వేయడమే ఎక్కువ. ఒక పట్టణానికి ఇంతకంటే అదృష్టం ఏముంటుంది గనుక! ప్రపంచం ముచ్చట పడి మురిసిపోయే కాన్స్ చిత్స్రోత్సవానికి పునాది రాయి 1946 సెప్టెంబరు 20లో పడినప్పటికీ, దీని తాలూకు వేర్లు 1932లో ఉన్నాయి. బ్రిటన్, అమెరికాల సహకారంతో ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ సినిమాటోగ్రాఫిక్ ఫెస్టివల్’ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ కిక్కు చాలాకాలం వరకు పోలేదు. దాని ప్రభావంతోనే కావచ్చు 1946లో ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ రెక్కలు దాల్చింది. ఆర్థిక సమస్యల వల్ల రెండుసార్లు తప్ప అప్పటి నుంచి క్రమం తప్పకుండా పసందైన రుచితో ప్రపంచ ప్రేక్షకులను కనువిందు చేస్తూనే ఉంది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. చిత్రోత్సవ సమయంలో.... కాన్స్‌కు వెళ్లడం అంటే వినోదం మాత్రమే కాదు... విజ్ఞాన దారుల్లో పయనించడం కూడా! -
స్పృహలో ఉండగానే ‘బ్రెయిన్‌డెడ్’!
మన్సూరాబాద్: ప్రాణాలతో స్పృహలో ఉన్న ఓ మహిళకు బ్రెయిన్‌డెడ్ అయిందని వైద్యులు చెప్పడంపై రోగి తరపు బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. బాధితుల కథనంప్రకారం... హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి భార్య అమృతారెడ్డి(22)ని ప్రసవం కోసం గత నెల 23న కమ్మగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రసవం సమయంలో గర్భ సంచి చీలిపోవడంతో అధిక రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల చికిత్స తర్వాత కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత మరోసారి అధిక రక్తస్రావం అవడంతో ఈనెల 19న మళ్లీ ఆమెను ఇదే ఆస్పత్రిలో చేర్పించారు. 20న వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేశారు. ఈ సమయంలో ఆమె కోమాలోకి వెళ్లింది. శ్వాస కూడా తీసుకోలేక పోతుండటంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ అమర్చారు. కిడ్నీ ఫెయిల్ కావడంతో పాటు బ్రెయిన్‌డెడ్ అయిందని ఆదివారం ఉదయం చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమె బంధువులకు తెలిపారు. డిశ్చార్జ్ చేస్తామని అంబులెన్స్ తెచ్చుకోండి అని చెప్పారు. ఇదే సమయంలో కొంత మంది బంధువుల ఐసీయూలోకి వెళ్లి అమృతారెడ్డిని పలకరించగా కాళ్లు, చేతులు కదిపింది. దీంతో ఆశ్చర్యపోయిన వారు ప్రాణాలతో స్పృహలో ఉన్న మనిషిని బ్రెయిన్‌డెడ్ అయిందని చెప్పడం ఏమిటని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస ్పత్రి ముందు బైఠాయించారు. ఇదిలా ఉండగా... రోగిని బతికించేందుకు వైద్యులు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రోగి బంధువులు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆస్పత్రి ఎండీ డాక్టర్ శశిధర్‌రెడ్డి‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం అమృతారెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యానికి ఆమె శరీరం కూడా సహకరించడం లేదన్నారు. -
‘షుమాకర్ స్పృహలోనే ఉన్నాడు’
జెనీవా: కోమాలో నుంచి బయటపడిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్‌ను ఫ్రెంచ్ ఆసుపత్రి నుంచి తరలిస్తున్న సమయంలో స్పృహలోనే ఉన్నాడని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రైవేట్ అంబులెన్స్‌లో స్విట్జర్లాండ్‌లోని లుసానే ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు కళ్లు తెరిచే ఉన్న షుమీ మాట్లాడే ప్రయత్నం మాత్రం చేయలేదని తెలిపాయి. అయితే కళ్లతోనే సైగలు చేస్తూ తలను అటూ ఇటూ తిప్పినట్లు సమాచారం. షుమాకర్ తరలింపు వ్యవహారం మొత్తం అత్యంత రహస్యంగా చేపట్టారు. షుమీ గురించి కనీసం అంబులెన్స్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వలేదు. సహాయక సిబ్బందికి సంబంధించిన మొబైల్స్‌ను తీసేసుకున్నారు. -
వాస్తవ ప్రపంచంలోకి....
స్పృహ డిస్నీ వారి పాత్రలన్నీ కాల్పనిక ప్రపంచంలో సంచరిస్తుంటాయి. వినోదాన్ని పంచుతుంటాయి. బాగానే ఉందిగానీ, ఇలా ఎంతకాలం అనుకున్నాడు జెఫ్ హాంగ్ అనే అమెరికన్ యానిమేషన్ ఆర్టిస్ట్. డిస్నీ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాత పాత్రలను ఎంచుకొని వాటిని వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన గీసిన ఒక చిత్రంలో, సముద్ర కాలుష్యాన్ని తట్టుకోలేక మత్స్యకన్య బయటికి పరిగెడుతుంటుంది. పిల్లలకు ఈ బొమ్మను చూడడంతోనే ఎన్నో సందేహాలు వస్తాయి. ‘‘ఆమె ఎవరు? ఎందుకలా పరుగెడుతోంది?’’ ‘‘మత్స్యకన్య గురించి మీరు బోలెడుసార్లు చదువుకొని ఉంటారు. ఇక మీరు తెలుసుకోవాల్సిన విషయం... ఆమె అలా ఎందుకు పరుగెడుతోందో’’ అంటూ సముద్ర కాలుష్యానికి గల కారణాలను వివరంగా పిల్లలకు చెప్పవచ్చు. పచ్చటి అడవి నుంచి మొక్కలు లేని ఎడారి ప్రాంతంలోకి వచ్చిపడుతుంది ‘ఫూ’ అనే పాత్ర. అడవులు నరకడాన్ని గురించి ఈ చిత్రం చెబుతుంది. పర్యావరణ సంబంధమైన సమస్యలను మాత్రమే కాకుండా జంతుదయ, సేవాధర్మం... మొదలైన విషయాలను కూడా డిస్నీ పాత్రల ద్వారా చెప్పిస్తున్నాడు హాంగ్. ‘‘మేడల్లో మాత్రమే నివసించే డీస్నీ రాణి... ఒకవేళ పర్యావరణ కాలుష్యం ఉట్టిపడే ప్రాంతంలో ఉండాల్సి వస్తే ఎలా ఉంటుంది?’’ అనే ఆలోచన నుంచి ‘అన్హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్’ సిరీస్ రూపుదిద్దుకుంది. ‘‘ఈ సిరీస్ చేస్తున్న క్రమంలో.... మనకు ఇన్ని సామాజిక సమస్యలు ఉన్నాయా?’’ అనిపించింది అని ఆశ్చర్యపోతున్నాడు హాంగ్. ‘‘మంచి విషయాలను పెద్దలు చెప్పడం కంటే, కార్టూన్ క్యారెక్టర్లు చెప్పడం ద్వారానే పిల్లలు త్వరగా గ్రహిస్తారు’’ అని ముచ్చటపడుతున్నారు సరికొత్త డిస్నీ బొమ్మలను చూసి తల్లిదండ్రులు. -
మెదడుకు చైతన్యం
ఆవిష్కరణ మ్యాగ్నటిక్ బ్రెయిన్ థెరపీ విధానంలో మరో కొత్త ఆవిష్కరణ ట్రాన్స్‌క్రేనియల్ మాగ్నటిక్ స్టిమ్యులేషన్. ఈ విధానంలో మైగ్రేన్, డిప్రెషన్, పక్షవాతం వంటి సమస్యలకు చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. మెదడును చైతన్యవంతం చేయడం ద్వారా కోమాలోకి వెళ్లిన వ్యక్తికి కూడా చికిత్స చేయవచ్చని వారి అభిప్రాయం. ఈ ప్రక్రియను యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ ఎఫ్‌డిఎ) ఆమోదించింది. డిప్రెషన్‌తో బాధపడుతూ యాంటీ డిప్రెసెంట్ మందులు ప్రభావం చూపని వారికి ఈ ప్రక్రియ చక్కటి పరిష్కారమవుతుందని ఎఫ్‌డిఎ ధ్రువీకరిస్తోంది. ఈ చికిత్స విధానంలో తల మీద ఎలెక్ట్రో మ్యాగ్నటిక్ కాయిల్‌ను అమరుస్తారు. ఈ కాయిల్ మెదడు టికణాలను చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. ప్రయోగదశ దాటిన ఈ వైద్యప్రక్రియ అందుబాటులోకి రావడానికి కనీసం ఏడాది పట్టవచ్చు.