
ముఖ్య అనుచరుడు శ్రీనివాస్ హత్యపై కోమటిరెడ్డి తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యను ఖండిస్తూ ఆయన నల్గొండలో నిరసనకు దిగారు. హత్య కేసులో అసలు దోషులను దాచేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. హత్యకు కారకులైన అసలు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని క్లాక్ టవర్ వద్ద బైఠాయించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రక్తత ఏర్పడింది. అంతేకాకుండా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మొహరించారు. నిరసన కారణం భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడిందని, వెంటనే విరమించాలని కోమటిరెడ్డిని కోరారు. కోమటిరెడ్డి మాత్రం తన నిరసన దీక్షను విరమించలేదు. అయితే పోలీసులు ఆయన్ను బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులకు తోపులాట కోమటిరెడ్డి అభిమానులకు జరిగింది. ఉదయం నుంచి పార్టీ కార్యకర్తలతో ఎండలో నిరసన చేపట్టిన కోమటి రెడ్డి కొద్ది సేపటికి స్పృహతప్పి పడియారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.