నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అనే టాపిక్ నమ్మకాలు, అపనమ్మకాలకు అతీతంగా ఎప్పుడూ ఆసక్తికరమే. దీన్ని దృష్టిలో పెట్టుకునే కావచ్చు అమెరికన్ సైకియాట్రిస్ట్ డా. బ్రూస్ గ్రేసన్ తాజాగా ఒక పుస్తకం రాశాడు. చావుముఖం వరకు వెళ్లి వచ్చిన వారి అనుభవాలు ‘ఆఫ్టర్’ అనే ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవి భ్రమ, మనోరూపాల్లో నుంచి వచ్చిన అనుభవాలు కావని, నూరుశాతం నిజాలని అంటున్నాడు రచయిత.
ఒక లారీడ్రైవర్‌కు హార్ట్‌సర్జరీ జరుగుతుంది. బయటి లోకానికి అతడు అపస్మారకస్థితిలో ఉన్నాడు. కానీ డాక్టర్ ఏం చేస్తున్నాడో అతడికి తెలుస్తుంది. షాకింగ్ ఏమిటంటే, ఆపరేషన్ టేబుల్ పక్కన డ్రైవర్ తల్లి నిల్చొని సర్జన్లకు ఏవో సలహాలు చెబుతుంది. మరో షాకింగ్ ఏమిటంటే ఆమె చనిపోయి 20 సంవత్సరాలవుతుంది!
ఒక కుర్రాడి తల్లి చనిపోయింది. తట్టుకోలేక సమాధిరాయి మీద తల బాదుకున్నాడు. ఇంచుమించుగా చనిపోయాడు. ‘నాయనా! ఇలా చేయకు. ఎలా అయిందో చూడు’ తల్లి గొంతుతో సమాధి నుంచి ఏవేవో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎలా బతికాడో ఏమోగానీ అతడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. తల్లి మాటలు అక్షరాలా గుర్తున్నాయంటాడు... శాస్త్రీయ నిర్ధారణకు అందని ఇలాంటివి ఎన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment