
భూగోళం మండే అగ్నిగోళంగా మారుతుందట. ఇదేదో కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యవాణి కాదు. భౌతిక, అంతరిక్ష శాస్త్రాల్లో అనితరసాధ్యమైన పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేస్తున్న హెచ్చరిక. ఇప్పటికప్పుడే ముంచుకొచ్చే ముప్పేమీ లేకపోయినా, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులు ఇదే రీతిలో కొనసాగుతూ పోతే 2600 సంవత్సరం నాటికి భూగోళం మండే అగ్నిగోళంలా తయారవుతుందని హాకింగ్ చెబుతున్నారు. ఆ పరిస్థితి దాపురించి మానవజాతి అంతరించిపోకుండా ఉండాలంటే, మనుగడకు అనుకూలమైన వాతావరణం గల ఇతర గ్రహాలకు వలస పోవడానికి మనుషులందరూ సిద్ధం కావాలని ఆయన సూచిస్తున్నారు.
బీజింగ్‌లో ఇటీవల ఏర్పాటైన ఒక సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చేసిన ప్రసంగంలో హాకింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో జీవితంలోని ప్రతి విషయంలోనూ మార్పులు తేవచ్చని, అయితే, కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరాలను సజావుగా నియంత్రించుకోవాల్సి ఉంటుందని కూడా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment