Globe
-
జాగ్రఫీ బోధించే గ్లోబ్..!
పెద్దలకు, పిల్లలకు నచ్చే ఆట బొమ్మలు చాలా అరుదు. అలాంటి వాటిలో ఈ ఆర్బూట్ ఎర్త్ ఒకటి. ఇదొక గ్లోబ్ బొమ్మ మాత్రమే కాదు, వర్చువల్ వరల్డ్ జాగ్రఫీ టీచర్ కూడా! ఈ గ్లోబ్‌ను ఐప్యాడ్‌కు లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని వాడాలి. ఈ బొమ్మ ప్యాకేజీ బాక్స్‌లో మొత్తం పది అంగుళాల ఇంటరాక్టివ్ ఏఆర్ వరల్డ్ గ్లోబ్, పాస్‌పోర్ట్, వివిధ స్టాంప్స్, దేశాల జెండాలు, జంతువుల స్టిక్కర్లలతో పాటు ఒక హెల్ప్ గైడ్ ఉంటుంది. గ్లోబ్‌ను యాప్ ద్వారా ఐప్యాడ్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని, ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నయినా ఎంచుకుంటే, అప్పుడు అది పూర్తి యానిమేషన్ చిత్రాలతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలన్నింటినీ చూపిస్తుంది. ఇందులో జాగ్రఫీకి సంబంధించిన చిన్న చిన్న టాస్క్‌లు కూడా ఉంటాయి. వాటిని ఈ గ్లోబ్‌తో పాటు ఇచ్చే స్టాంపులు, స్టిక్కర్లతో పూర్తి చేయవచ్చు. ప్రపంచంలోని ఏ దేశాన్ని అయినా ఇట్టే గుర్తుపట్టేలా చిన్నారులకు నేర్పిస్తుంది ఈ గ్లోబ్. మూడు నుంచి ఐదేళ్ల వయసు గల పిల్లలకు ఇదొక మంచి బహుమతి. దీని ధర రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది. వివిధ ఆన్లైన్ స్టోర్స్‌లలో దొరుకుతుంది. (చదవండి: ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!) -
81st Golden Globe Awards 2024: 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో తారల సందడి.. ఫోటోలు
-
విదేశాల్లో కూడా వనభోజన సంప్రదాయం.. ! ఐతే ఎలా ఉంటాయంటే..
ఇది కార్తీకమాసం. శివకేశవుల ఆరాధనకు విశిష్టమైన మాసం. కార్తీకమాసంలో దీపారాధన చేయడం, దాన ధర్మాలు చేయడం ఆచారంగా కొనసాగుతోంది. కార్తీకమాసం అంటే ఆలయ దర్శనాలు, పూజలు, వ్రతాలు మాత్రమే కాకుండా వనభోజనాలు కూడా గుర్తుకొస్తాయి. మన దేశంలో కార్తీక వనభోజనాలు సంప్రదాయ ప్రకారం కొనసాగుతున్నట్లే, వివిధ దేశాల్లో వనభోజనాలు చేసే సంప్రదాయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా కాస్త ముచ్చటించుకుందాం.. కార్తీకమాసంలో వనభోజనాలు చేయడం మనకు చిరకాలంగా కొనసాగుతున్న ఆచారం. శివకేశవులకు పవిత్రమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. యాగాలు, హోమాలు, పూజలు, వ్రతాలు, తర్పణాలు చేసేటప్పుడు జరిగిన లోపాల వల్ల సంభవించిన దోషాలను తొలగించుకోవడానికి తప్పనిసరిగా కార్తీకమాసంలో వనభోజనాలు చేసి తీరాలని ‘స్కాందపురాణం’ చెబుతోంది. ఈ పురాణం ప్రకారం కార్తీక వనభోజనాల కోసం ఎంపిక చేసుకునే వనంలో నానాజాతుల వృక్షాలు పుష్కలంగా ఉండాలి. వాటిలో ఉసిరి చెట్టు తప్పనిసరిగా ఉండాలి. ఉసిరిచెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి శాస్త్రోక్తంగా పూజించి, పురోహితులకు యథాశక్తి దక్షిణ తాంబూలాలను సమర్పించుకోవాలి. వనంలోనే వంటలు చేసుకుని, పురోహితులతోను, బంధుమిత్రులతోను కలసి భోజనాలు చేయాలి. కార్తీకమాసంలో ఉసిరిచెట్టు నీడన సాలగ్రామాన్ని పూజించి, పురోహితులకు అన్నసంతర్పణ చేసి, వనభోజనాలు చేసి, కార్తీక మహాత్మ్యాన్ని విన్నవారికి సమస్త పాపాలు తొలగి, మరణానంతరం విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ‘కార్తీక పురాణం’ చెబుతోంది. చరిత్రలో వనభోజనాలు వన భోజనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కార్తీక వనభోజనాల ప్రస్తావన స్కాంద, కార్తీక పురాణల్లో ఉంది. వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణం ఒకటి. స్కాందపురాణం ప్రాచీన తాళపత్ర ప్రతి 1898లో దొరికింది. ఇది క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిదని పరిశోధకుల అంచనా. దీనిని బట్టి మన దేశంలో వనభోజనాల సంస్కృతి ఎనిమిదో శతాబ్దికి ముందు నుంచే ఉండేదని అర్థమవుతుంది. పలు ఇతర దేశాల్లో కూడా సంప్రదాయకమైన వనభోజనాల సంస్కృతి మధ్యయుగం నాటికే వ్యాప్తిలో ఉండేది. ఇంగ్లిష్‌లో వనభోజనాలకు ‘పిక్నిక్’ అనే పేరు ఉంది. ‘పెక్’ లేదా ‘పిక్’ అంటే ఏరడం, ‘నిక్’ అంటే స్వల్ప పరిమాణం అని అర్థం. ఇవి ఫ్రెంచ్ మాటలు. ‘పిక్’, ‘నిక్’ అనే ఈ రెండు మాటల కలయికతో ‘పిక్నిక్’ అనే మాట ఏర్పడింది. ఇంగ్లిష్‌లో ఈ మాట పదహారో శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో సంపన్నులు తీరిక వేళల్లో బంధుమిత్రులతో కలసి ఊళ్లకు దగ్గర్లో ఉండే వనాలకు వెళ్లి, రోజంతా అక్కడే విందు వినోదాలతో కాలక్షేపం చేసేవారు. ఫ్రెంచ్ విప్లవం తర్వాత పద్దెనిమిదో శతాబ్ది నాటికి పిక్నిక్ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో బాగా వ్యాప్తి చెందింది. పాశ్చాత్య సాహిత్యంలో కూడా పిక్నిక్ల ప్రస్తావన కనిపిస్తుంది. ‘పిక్నిక్ భోజనం వంటి ఆహ్లాదకరమైన విషయాలు జీవితంలో చాలా తక్కువగా ఉంటాయి’ అని ప్రసిద్ధ ఇంగ్లిష్ రచయిత సోమర్సెట్ మామ్ అన్న మాటలు ఆనాటి పాశ్చాత్య ప్రపంచంలో పిక్నిక్ల ప్రశస్తిని తెలియజేస్తాయి. ఫ్రెంచ్ విప్లవకాలంలో ఫ్రాన్స్ నుంచి వచ్చి లండన్‌లో స్థిరపడిన సుమారు రెండువందల మంది సంపన్న ఫ్రెంచ్ యువకుల బృందం 1801లో లండన్‌లో ‘పిక్నిక్ సొసైటీ’ని నెలకొల్పింది. ‘పిక్నిక్ సొసైటీ’ నిర్వహించే వనభోజనాల్లో విందుతో పాటు వినోద కార్యక్రమాలు అట్టహాసంగా ఉండేవి. ఎలాంటి నటనానుభవం లేని అతిథులు సైతం ఈ పిక్నిక్ పార్టీల్లో నటీనటులుగా మారి నాటకాలు వేసేవారని ‘ది టైమ్స్’ దినపత్రిక అప్పట్లో ఒక కథనంలో పేర్కొంది. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభం నాటికి ఆధునిక వాహనాలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా పిక్నిక్ సంస్కృతి మరింతగా విస్తరించింది. అయితే, పాశ్చాత్య ప్రపంచంలో పిక్నిక్లు వ్యాప్తిచెందడానికి శతాబ్దాల ముందు నుంచే చైనా, జపాన్ వంటి తూర్పు దేశాల్లో సంప్రదాయ వనభోజనాల సంస్కృతి ఉండేది. ప్రాక్ పాశ్చాత్య దేశాల్లో వనభోజనాల సంస్కృతీ సంప్రదాయాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. క్లీన్ మండే: గ్రీస్ క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘గ్రేట్ లెంట్’ తొలిరోజును ‘క్లీన్ మండే’ అంటారు. క్లీన్ మండే రోజున విందు వినోదాలతో గడుపుతారు. గ్రీస్‌లో క్లీన్ మండే రోజున ప్రజలు పార్కులు, తోటలు, చిట్టడవులు, సముద్ర తీరాల్లో గుమిగూడి పిక్నిక్లు జరుపుకొంటారు. పిక్నిక్ సందర్భంగా చిత్రవిచిత్రమైన రంగు రంగుల గాలిపటాలను ఎగురవేయడం గ్రీకు ప్రజల ఆనవాయితీ. పిక్నిక్ విందులో సంప్రదాయబద్ధంగా చేసే రొట్టెలు, ఆల్చిప్పలు, ఆక్టోపస్, పీతలు, రొయ్యలతో చేసిన వంటకాలను ఆరగిస్తారు. మధ్యాహ్నం విందు తర్వాత పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తారు. బెర్రీ పికింగ్: ఐస్లాండ్ ఐస్లాండ్లో వేసవి మాత్రమే పిక్నిక్లకు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన కాలాలన్నీ ఆరుబయట నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఐస్లాండ్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేసవికాలం ఉంటుంది. ఆగస్టు రెండోవారం నుంచి సెప్టెంబర్ రెండోవారం వరకు బెర్రీపండ్లు విరగకాస్తాయి. చెట్ల మీదనే బాగా పండినవి ఎక్కడికక్కడ రాలిపడతాయి. ఆరుబయటి వాతావరణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. అందువల్ల ఐస్లాండ్ ప్రజలు బెర్రీలు విరగకాసే కాలంలో ‘బెర్రీ పికింగ్’ పేరుతో పిక్నిక్లు చేసుకుంటారు. పార్కులు, తోటలు, చిట్టడవుల్లో చేసుకునే ఈ పిక్నిక్‌లలో నేలరాలిన బెర్రీ పండ్లను ఏరుకోవడం పిల్లా పెద్దా అందరికీ ఒక కాలక్షేపం. బెర్రీ పికింగ్ పిక్నిక్ విందులో సంప్రదాయబద్ధంగా చేసే రొట్టెలు, మంటపై కాల్చిన గొర్రెమాంసం, కప్కేకుల్లాంటి సాఫ్ట్స్కోన్స్, సాల్మన్ చేపలు, చీజ్‌తో చేసిన వంటకాలను ఆరగిస్తారు. తిండి పోటీలు: అమెరికా అమెరికాలో నేషనల్ పిక్నిక్ డే ఏప్రిల్ 23న జరుపుకొంటారు. దేశంలో అప్పటి నుంచే పిక్నిక్ల హడావుడి మొదలవుతుంది. మే 27న జరుపుకొనే మెమోరియల్ డే మొదలుకొని నవంబర్ 11న జరుపుకొనే వెటరన్స్ డే వరకు అమెరికాలో పిక్నిక్ సీజన్‌గానే పరిగణిస్తారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4న ఎక్కువ మంది పిక్నిక్లు జరుపుకొంటారు. దాదాపు ఆరునెలల పాటు కొనసాగే పిక్నిక్ సీజన్లో బంధు మిత్రుల బృందాలు మాత్రమే కాకుండా, కార్పొరేట్ సంస్థలు కూడా ఉద్యోగుల కోసం పిక్నిక్ పార్టీలు నిర్వహిస్తూ ఉంటాయి. ఎక్కువగా పార్కులు, తోటలు, సముద్ర తీరాల్లో బార్బెక్యూ పిక్నిక్ పార్టీలు చేసుకుంటారు. పలు పిక్నిక్‌లలో తిండి పోటీలు నిర్వహిస్తుంటారు. భారీ పరిమాణంలో వంటకాలను తక్కువ సమయంలో భోంచేయడంలో జరిగే ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉంటాయి. పిక్నిక్ డే: ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఆగస్టు మొదటి సోమవారాన్ని పిక్నిక్ డేగా పాటిస్తారు. వేర్వేరు చోట్ల నుంచి వచ్చి ఆస్ట్రేలియా గనుల్లో పనిచేసే గనికార్మికులు పంతొమ్మిదో శతాబ్దిలో ఇక్కడ పిక్నిక్ సంస్కృతిని ప్రారంభించారు. 1881లో బలారాట్ మైనర్స్ అసోసియేషన్ తొలిసారిగా అబ్బరీ బొటానికల్ పార్కులో వేలాదిమంది కార్మికులతో భారీ పిక్నిక్ నిర్వహించింది. ఆస్ట్రేలియాలో 1940ల నాటికి దేశవ్యాప్తంగా రైల్వేలైన్లు ఏర్పడటంతో ఆగస్టు మొదటి సోమవారాన్ని రైల్వే హెరిటేజ్ పిక్నిక్ డేగా పాటించడం ఆనవాయితీగా మారింది. ఆస్ట్రేలియన్లు పిక్నిక్‌లలో ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యమిస్తారు. పిక్నిక్‌లలో నృత్య గానాలు, టగ్ ఆఫ్ వార్ వంటి వివిధ క్రీడల పోటీలు నిర్వహిస్తారు. పిక్నిక్ టీ: న్యూజిలాండ్ న్యూజిలాండ్‌లో పిక్నిక్ సంస్కృతి పంతొమ్మిదో శతాబ్దిలో బ్రిటిష్ పాలకుల ద్వారా మొదలైంది. దక్షిణార్ధ గోళంలో ఉన్న న్యూజిలాండ్‌లో నవంబర్ నుంచి వసంత రుతువు మొదలవుతుంది. వసంతకాలంలో ఇక్కడ ఆరుబయట పిక్నిక్లు జరుపుకొంటారు. న్యూజిలాండ్ సంప్రదాయ పిక్నిక్‌లలో టీ పార్టీలు ప్రత్యేకం. పిక్నిక్ల కోసం జనాలు ఉదయాన్నే తోటలు, చిట్టడవులు, సముద్రతీరాలు వంటి ఆరుబయటి ప్రదేశాలకు చేరుకుంటారు. ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. మధ్యాహ్నం సంప్రదాయకమైన రొట్టెలు, కాల్చిన మాంసాహార వంటకాలతో విందు భోజనాలు ఆరగిస్తారు. పొద్దుగూకడానికి ముందు స్కోన్స్, బిస్కట్లు వంటి చిరుతిళ్లతో టీ పార్టీ చేసుకుంటారు. బాస్టీల్ డే రికార్డు నవ సహస్రాబ్దిలో వచ్చిన తొలి బాస్టీల్ డే సందర్భంగా 2000 సంవత్సరంలో ఫ్రాన్స్‌లో అత్యంత భారీ పిక్నిక్ జరిగింది. ఈ పిక్నిక్ ఆరువందల మైళ్ల పొడవున డన్కిర్క్ నుంచి స్పెయిన్ సరిహద్దుల్లో ఉన్న ప్రాట్స్ డి మోలో వరకు 337 నగరాలు, పట్టణాల మీదుగా సాగింది. ఈ విందులో లక్షలాది మంది పాల్గొన్నారు. వెండితెర మీద పిక్నిక్ హాలీవుడ్ దర్శకుడు జోషువా లోగాన్ 1955 ‘పిక్నిక్’ సినిమాను తెరకెక్కించాడు. విలియమ్ హోల్డన్, కిమ్ నోవాక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆరు ఆస్కార్ నామినేషన్లు పొందింది. వాటిలో రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు పొందింది. ఫిల్మ్ ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో ‘పిక్నిక్’ సినిమా ఈ అవార్డులను దక్కించుకుంది. హనామీ: జపాన్ జపాన్‌లోని వనభోజనాలను ‘హనామీ’ అంటారు. మన కార్తీక వనభోజనాల వేడుకలను ఉసిరిచెట్లు ఉన్న వనాల్లో జరుపుకున్నట్లే జపాన్ ప్రజలు చెర్రీచెట్లు విస్తారంగా ఉన్న వనాల్లో వనభోజనాలు చేస్తారు. ఏటా చెర్రీ వృక్షాలు విరగబూసే కాలంలో గుంపులు గుంపులుగా చెర్రీ వనాలకు చేరుకుని, అక్కడ విందు వినోదాలతో ఘనంగా వనభోజనాలు చేస్తారు. జపాన్ దేశవ్యాప్తంగా మార్చి నుంచి మే వరకు చెర్రీపూత కాలం కొనసాగుతుంది. ఒకినావా దీవిలో మాత్రం జనవరిలోనే చెర్రీపూత మొదలవుతుంది. జపాన్ వాతావరణ శాఖ ప్రతి ఏడాది చెర్రీపూత కాలం తేదీలను వెల్లడిస్తుంది. చెర్రీవృక్షాలకు పూలు పూయడం మొదలైతే, వాటి పూత ఒకటి రెండు వారాల వరకు మాత్రమే ఉంటుంది. పూత ఉన్న సమయంలోనే జనాలు విందు వినోదాలతో వనభోజన వేడుకలను జరుపుకొంటారు. విందులో సంప్రదాయ వంటకాలను ఆరగిస్తారు. జపాన్‌లో ఈ ‘హనామీ’ వనభోజనాల సంస్కృతి క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది ప్రారంభం నుంచి కొనసాగుతోంది. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో ‘హనామీ’ సంస్కృతి అమెరికా, కెనడా దేశాలకూ వ్యాపించింది. పిక్నిక్ డే: బ్రిటన్ బ్రిటన్‌లో ఏటా జూన్ 18న నేషనల్ పిక్నిక్ డేగాను, జూన్ 17 నుంచి 25 వరకు నేషనల్ పిక్నిక్ వీక్గాను పాటిస్తారు. జూన్ 18 ఇంటర్నేషనల్ పిక్నిక్ డే కూడా కావడం విశేషం. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా జనాలు ఆరుబయట పిక్నిక్ పార్టీలు చేసుకుంటారు. బ్రిటన్‌లో పద్దెనిమిదో శతాబ్ది నుంచి పిక్నిక్ సంస్కృతి ఉంది. పురాతన డిపార్ట్మెంట్ స్టోర్ ‘ఫోర్ట్నమ్ అండ్ మేసన్’ అప్పట్లో ప్రవేశపెట్టిన ‘స్కాచ్ ఎగ్’ను పిక్నిక్ విందుల్లో ప్రత్యేక వంటకంగా వడ్డించేవారు. సాసేజ్లో చుట్టిన గుడ్డును నిప్పుల మీద కాల్చి తయారు చేసే ఈ వంటకం సంపన్నుల పిక్నిక్ విందులో తప్పనిసరిగా ఉండేది. చిట్టడవులు, పార్కులు, సముద్ర తీరాల్లో నిప్పుల మీద కాల్చిన మాంసపు వంటకాలను ఆరగిస్తూ పిక్నిక్ విందులు జరుపుకోవడం బ్రిటిష్ సంస్కృతిలో భాగంగా మారింది. క్రిస్మస్ పిక్నిక్: అర్జెంటీనా అర్జెంటీనా ప్రజలు ఏటా క్రిస్మస్ సీజన్లో పిక్నిక్లు జరుపుకొంటారు. మంచు కురిసే ఈ కాలంలో ఆరుబయట వనభోజనాలు చేయడానికి అర్జెంటీనా ప్రజలు ఆసక్తి చూపుతారు. అర్జెంటీనాలో ఏటా డిసెంబర్ 8 నుంచి క్రిస్మస్ సీజన్ మొదలవుతుంది. డిసెంబర్ 8న ‘ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ డే’ జరుపుకొంటారు. ఆ రోజున మేరీమాత పాపవిమోచన పొందిందని కేథలిక్ల నమ్మకం. అర్జెంటీనాలో డిసెంబర్ 8న ప్రభుత్వ సెలవు దినం. దేశంలో పిక్నిక్ల సందడి కూడా అప్పటి నుంచే మొదలవుతుంది. కొందరు వనాల్లోను, తీరప్రాంతాల్లో ఉండేవారు సముద్ర తీరంలోను ఆరుబయట విందు వినోదాలతో పిక్నిక్లు చేసుకుంటారు. ఆరుబయట మంటలు వేసి, కోడి, టర్కీ, మేక, పంది వంటి వాటి మాంసాలను కాల్చుకుని, వాటితో విందు చేసుకుంటారు. హెరింగ్ లంచ్: ఫిన్లాండ్ ఫిన్లాండ్లో వసంత రుతువు కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. మేడే నుంచి దేశంలో పిక్నిక్ల హడావుడి మొదలవుతుంది. నిజానికి మేడే పిక్నిక్ల కోసం జనాలు ఏప్రిల్ 30 నుంచే హడావుడి ప్రారంభిస్తారు. ఊళ్లకు వెలుపల ఉండే చిట్టడవులు, పార్కులు, సముద్ర తీరాల్లో ఎక్కువగా పిక్నిక్లు చేసుకుంటారు. అట్టహాసంగా విందు వినోదాలతో జరిగే పిక్నిక్‌లలో సంప్రదాయబద్ధంగా వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని ‘హెరింగ్ లంచ్’ అంటారు. ఉప్పుచేపలు, ఊరవేసిన చేపలు, బంగాళ దుంపలు, ఆరుబయట నిప్పుల మీద కాల్చిన మాంసాహార పదార్థాలతో విందు భోజనాలు చేస్తారు. వెండిరంగులో మెరిసే చిన్నచేపలను ‘హెరింగ్’ అంటారు. సంప్రదాయక ఫిన్నిష్ పిక్నిక్ విందులో హెరింగ్ చేపలు తప్పనిసరి. పిక్నిక్ డే: ఫ్రాన్స్ ఫ్రాన్స్‌లో ఏటా జూలై 14న నేషనల్ పిక్నిడ్ డే జరుపుకొంటారు ఈ రోజు ‘బాస్టీల్ డే’ అని కూడా అంటారు. ఆ రోజున పిక్నిక్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రాన్స్‌లో ఏటా వేసవి పిక్నిక్లు జరుపుకోవడానికి అనుకూలమైన కాలం. అందువల్ల వేసవి పొడవునా ఫ్రెంచ్ ప్రజలు సెలవు రోజుల్లోను, తీరిక వేళల్లోను ఆరుబయట పిక్నిక్లు చేసుకుంటారు. ఫ్రెంచ్ విప్లవానికి ముందు పిక్నిక్ సంస్కృతి కేవలం సంపన్నులకే పరిమితమై ఉండేది. ఫ్రెంచ్ విప్లవం తర్వాత సామాన్యులకు సైతం ఇది పాకింది. సంప్రదాయ ఫ్రెంచ్ పిక్నిక్ విందుల్లో సంప్రదాయ వంటకాలతో పాటు మద్యానికి కూడా అమిత ప్రాధాన్యం ఉంటుంది. వైన్, షాంపేన్, బ్రాందీ వంటి మదిరానంద పానీయాలు లేకుండా ఫ్రెంచ్ ప్రజలు పిక్నిక్లు జరుపుకోరు. పిక్నిక్ విందుల్లో ఎక్కువగా రకరకాల చీజ్‌తో చేసిన వంటకాలు, కాల్చిన మాంసాహార వంటకాలను ఆరగిస్తారు. నృత్యగానాలలో ఓలలాడతారు. (చదవండి: ఘనాపాటీలు! అసామాన్యమైన కళతో మతాబుల్లా వెలిగిపోతున్న చిచ్చరపిడుగులు!) -
భూగోళంపై అత్యంత వేడి దినం.. జూలై 4
వాషింగ్టన్: గత 1,25,000 సంవత్సరాల్లో ఈ ఏడాది జూలై 4వ తేదీ భూగోళంపై అత్యంత వేడి దినంగా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దినంగా ఈ నెల 3వ తేదీ రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ఒక్కరోజులోనే బద్దలు కావడం విశేషం. 3న ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 17.01 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మెయిన్‌కి చెందిన క్లైమేట్ చేంజ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. 4వ తేదీన ఇది 17.18 డిగ్రీల సెల్సియస్(62.92 డిగ్రీల ఫారన్‌హీట్)కు ఎగబాకినట్లు తెలియజేసింది. ఈ ఉష్ణోగ్రతను గణించడానికి మోడలింగ్ సిస్టమ్‌ను 1979 నుంచి ఉపయోగిస్తున్నారు. దీని ప్రకారం లక్షల సంవత్సరాల క్రితం నాటి ఉష్ణోగ్రతను సైతం అంచనా వేయొచ్చు. -
రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ,ఎండీ ముఖేశ్ అంబానీ గురించి తెలియని వారుండరు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు బిలియనీర్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఆస్తులను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం అంబానీ భారీ నికర విలువతో, విలాసవంతమైన జీవనశైలి, విలాసవంతమైన ఇళ్ళు, లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నారు. రూ. 15 వేల కోట్ల ఇంద్రభవనం యాంటిలియా నుంచి 2 వేల కోట్ల లావిష్ హోటల్ దాకా అంబానీ ప్రాపర్టీ పోర్ట్‌ఫోలియో ఎప్పుడూ చర్చనీయాంశాలే. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన కొన్నిఆస్తులను చూద్దాం: అంబానీ నివాసముండే ఆంటిలియా గురించి ముందుగా చెప్పాలి. ముఖేశ్ అంబానీ, భార్య నీతా అంబానీ రాజభవనం లాంటి ఆంటిలియాలోనే ఉంటారు. పిల్లలు ఆకాష్, అనంత్ అంబానీ, ఇషా అంబానీలకు ఇప్పటికే పెళ్ళిళ్లు చేసిన సంగతి తెలిసిందే. అంబానీ 15 వేల కోట్ల రూపాయల విలువైన తన 27అంతస్తుల నివాసం యాంటిలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా ఖరీదైన ఆస్తులను కలిగి ఉన్నారు. అలాగై లగ్జరీ కార్లు, ఆభరణాల కలెక్షన్ వారికి పెద్ద లెక్కే కాదు. యాంటిలియా ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన నివాసం యాంటిలియా. 60 ప్లోర్లతో 27 అంతస్తుల భవనం యాంటిలియా విలువ రూ. 15,000 కోట్లు. ఈ ఇంటి పైఅంతస్తులో హెలిప్యాడ్ ప్రత్యేక ఆకర్షణ, ఇంకా గుడి, థియేటర్, ఐస్ క్రీం పార్లర్, స్విమ్మింగ్ పూల్, స్పా లాంటివి ఉన్నాయి. యాంటిలియాకు మారడానికి ముందు, ముఖేశ్ అంబానీ కుటుంబం, అనిల్ అంబానీ కఫ్ పరేడ్‌లోని సీ విండ్ అపార్ట్మెంట్లో నివసించేవారు. 17 అంతస్తుల భవనాన్ని దక్షిణ ముంబైలో రిలయన్స్ ఫౌండర్ ధీరూభాయ్ అంబానీ కొనుగోలు చేశారు. యూకేలోని స్టోక్ పార్క్ లండన్‌లోని 900 ఏళ్ల పురాతన హోటల్, స్టోన్ పార్క్‌కు కూడా ముఖేశ్ అంబానీ సొంతం. అల్ట్రా-రిచ్ ఫెసిలిటీస్‌తో ఉండే ఈహోటల్ కొనుగోలు విలువ 2020 నాటికి రూ. 529 కోట్లు. 1760లో సైనికుడు జాన్ పెన్ నిర్మించిన ఈ హోటల్లో 49 విలాసవంతమైన గదులు మూడు రెస్టారెంట్లు ఉన్నాయి. అంతేకాదు స్టోన్ పార్క్‌లో 4000 చదరపు అడుగుల జిమ్, గోల్ఫ్ కోర్స్, పదమూడు మల్టీ-సర్ఫేస్ టెన్నిస్ కోర్ట్ , ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. న్యూయార్క్‌లోని లావిష్ హోటల్ దీంతోపాటు హాలీవుడ్ ప్రముఖులు బస చేసే, న్యూయార్క్‌లోని కొలంబస్ సర్కిల్లోని పాపులర్ హోటల్లో అంబానీ 248 సూట్లతో ఉన్న ఒక ఇంటిని 2022లో 98.15 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారట. పామ్ జుమేరియా ఇల్లు లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. దుబాయ్‌లోని పామ్ జుమేరియా ఇల్లు. అంబానీకి రూ. 639 కోట్ల విలువైన, బీచ్-ఫేసింగ్ ప్రాపర్టీలో స్పా బార్, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి స్పెషల్ ఎట్రాక్షన్స్. అనేది అరచేతి ఆకారంలో ఉండే జుమేరియా కృత్రిమ ద్వీపం పోష్ కాలనీలు, అతి విలాసవంతమైన నివాస ఆస్తులకు ప్రసిద్ధి. -
స్టార్ హీరోపై నెటిజన్ల ఫైర్.. మీకు కొంచెమైనా సిగ్గుందా..!
బాలీవుడ్ అక్షయ్‌కుమార్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచం చూపే గ్లోబ్‌పై నడుస్తూ ఇండియా మ్యాప్‌పై ఆయన షూస్ ధరించి నడవడాన్ని నెటిజన్స్ తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అక్షయ్ కుమార్ తన ట్వటర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు బాలీవుడ్ హీరో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అక్షయ్ తన ఉత్తర అమెరికా టూర్‌ను ప్రమోట్ చేయడానికి ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఆయన చేసిన పనితో ఇండియాను అగౌరవపరిచారని మండిపడుతున్నారు. ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో పాటు దిశా పటానీ, నోరా ఫతేహి, మౌని రాయ్, సోనమ్ బజ్వా కూడా ఉన్నారు. ప్రమోషనల్ పోస్ట్‌లో వారు గ్లోబ్‌పై నడుస్తూ కనిపించారు. అక్షయ్ కుమార్ ఈ వీడియో క్లిప్ షేర్ చేస్తూ.. "ఉత్తర అమెరికాకు 100% దేశీ వినోదాన్ని తీసుకురావడానికి ఎంటర్టైనర్స్ సిద్ధంగా ఉన్నారు. మీ సీట్ బెల్ట్‌లు పెట్టుకోండి. మేము మార్చిలో వస్తున్నాము.' అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. ఓ ట్విటర్ యూజర్.. ఓ కెనడియన్ నటుడు భారత మ్యాప్‌పై తిరుగుతూ భారతీయులను అవమానిస్తున్నారు. ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం? ఈ సిగ్గుమాలిన చర్యకు మీరు 150 కోట్ల భారతీయులకు క్షమాపణలు చెప్పాలి.' అని రాశారు. మరొక నెటిజన్ రాస్తూ.. భాయి మన భారత్‌ను కాస్తైనా గౌరవించండి.' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చాలా మంది అతన్ని 'కెనడియన్ కుమార్' అని ఎగతాళి చేశారు. అక్షయ్ కుమార్ పౌరసత్వంపై పలు ప్రశ్నలు సంధించారు నెటిజన్స్. అతను కెనడియన్ పాస్‌పోర్ట్ కలిగి ఉండటం వల్ల నెటిజన్ల్ ట్రోల్స్ చేస్తున్నారు. The Entertainers are all set to bring 100% shuddh desi entertainment to North America. Fasten your seat belts, we’re coming in March! 💥 @qatarairways pic.twitter.com/aoJaCECJce — Akshay Kumar (@akshaykumar) February 5, 2023 The Entertainers are all set to bring 100% shuddh desi entertainment to North America. Fasten your seat belts, we’re coming in March! 💥 @qatarairways pic.twitter.com/aoJaCECJce — Akshay Kumar (@akshaykumar) February 5, 2023 Bhai sahab indian political map ko har subeh me puja karta hun rajniti shastra ka vidyarthi hun .aur ap bharat ke upar he shoe pahen ke khada ho gaye. — Raja.. (@MadanBag8) February 5, 2023 #AkshayKumar set foot on India🤬 Sharm nhi aayi @akshaykumar aisa karte huye jis india me itna paisa kama raha ..usi par apne per rakh raha hai..@narendramodi jii plzz take action.#shameonyouakshaykumar pic.twitter.com/PfIaxyzl30 — Devil V!SHAL (@VishalRCO07) February 5, 2023 -
సైకిల్‌పై 14 దేశాలు చుట్టేసింది!
సైకిల్‌పై దేశమంతా తిరగడం ఇప్పటిదాకా చాలా మంది చేశారు. మరి దేశాలు తిరిగినవారి గురించి విన్నారా? ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 దేశాలు.. 29వేల కిలోమీటర్లు..! ఈ ఘనత సాధించింది ఏ కండలు తిరిగిన యువకుడో కాదు.. నిండా 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతి. అతితక్కువ సమయంలో ఎక్కువ దూరం సైకిల్‌పై ప్రయాణించిన తొలి ఏషియన్‌గా రికార్డు కూడా సాధించింది. వివరాల్లోకెళ్తే.. నాలుగేళ్ల క్రితం సరదాగా సైకిల్‌పై సుదూర ప్రయాణం చేద్దామని నిర్ణయించుకుంది. కానీ అప్పుడు కుదరలేదు.. చివరికి ఈ ఏడాది తన సరదా తీర్చుకునేందుకు సైకిల్‌పై ప్రయాణాన్ని మొదలుపెట్టి, కేవలం 159 రోజుల్లో 14 దేశాలను చుట్టేస్తూ 29 వేల కిలోమీటర్లు పూర్తిచేసింది. ఈ ఘనత సాధించిన తొలి ఏషియన్‌గా నిలిచిన ఆ యువతి వేదాంగి కులకర్ణి. అందరిలా కాకుండా.. పుణేకు చెందిన వేదాంగి.. ఉండేది మాత్రం యూకేలో. అక్కడ బౌర్నెమౌత్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేస్తోంది. ఎప్పుడూ సాహసాలు చేయడం.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండటం ఆమెకు ఇష్టం. అందుకే 130 రోజుల్లో 29 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కాలని నిర్ణయించుకుంది. అయితే మధ్యలో తలెత్తిన కొన్ని అవాంతరాలవల్ల తన లక్ష్యాన్ని 159 రోజుల్లో పూర్తిచేసింది. ప్రాణాలను లెక్కచేయక.. కెనడాలో ప్రయాణిస్తున్నప్పుడు వేదాంగిని ఓ ఎలుగుబంటి వెంబడించింది. దాని నుంచి ఎలాగోలా తప్పించుకుంది. ఇక స్పెయిన్‌లో దోపిడీ దొంగలు పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి ఉన్నదంతా దోచుకున్నారు. –20 డిగ్రీల చలిని, 37 డిగ్రీల ఎండనూ తట్టుకుంది. ప్రాణాలకు తెగించి తన లక్ష్యాన్ని చేరుకుంది. పెర్త్‌లో ప్రారంభం.. పెర్త్‌లో తన సైకిల్ యాత్రను ప్రారంభించి... ఆస్ట్రేలియా నుంచి బ్రిస్బేన్ ద్వారా న్యూజిలాండ్ వెళ్లింది. అక్కడ కెనడాకు విమానంలో వెళ్లి కెనడాలోని హలీఫాక్స్ నుంచి మళ్లీ సైకిల్ యాత్రను కొనసాగించింది. అక్కడి నుంచి ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా వెళ్లి అక్కడి నుంచి విమానంలో వచ్చి.. ఇండియాలో 4000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసింది. అలా తన యాత్రను ఇండియాలో ముగించింది. -
వ్యవసాయం తీరు మారితే.. భూతాపోన్నతి తగ్గుతుంది!
భూతాపోన్నతి పుణ్యమా అని భూగోళం భగ్గుమంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకొన్నేళ్లలోనే జీవరాశులేవీ బతికే పరిస్థితి ఉండదు. ఈ విపత్తును తప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఏఆర్సీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. పంటభూముల వినియోగంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా భూమి సగటు ఉష్ణోగ్రతలను రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గించవచ్చునని వీరు అంటున్నారు. దీంతోపాటు అధిక జనాభా గల నగరాల్లో భవనాలు, రోడ్లు అన్నింటికీ తెల్లరంగు వేయడం... దుక్కుల్లేకుండా వ్యవసాయం చేయడం ద్వారా భూమి నుంచి విడుదలయ్యే రేడియోధార్మికత గణనీయంగా తగ్గుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త యాండీ పిట్మన్ అంటున్నారు. ఈ చర్యల వల్ల ఇబ్బందులేవీ ఎదురుకావని, ఎక్కడికక్కడ ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల వ్యయప్రయాసలు తక్కువగానే ఉంటాయని యాండీ వివరించారు. కంప్యూటర్ మోడలింగ్ ద్వారా, వ్యవసాయం ద్వారా వెలువడుతున్న రేడియోధార్మికతలో మార్పులు చేసి తాము విశ్లేషించామని చెప్పారు. తాము సూచించిన చర్యలు చేపడితే సగటు ఉష్ణోగ్రతలతోపాటు విపరీత వాతావరణ పరిస్థితులు కూడా తగ్గుతాయని చెప్పారు. అధ్యయన వివరాలు నేచర్ జియోసైన్సెస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
చైనా బరితెగింపు.. కశ్మీర్ లేకుండా చేసి..
కెనడా : నిత్యం భారత్‌తో పేచి పెట్టుకునే చైనా మరో దుర్మార్గపు చర్యకు పూనుకుంది. ఏకంగా కశ్మీర్ మొత్తాన్ని భారత్‌తో సంబంధం లేదన్నట్లుగా చూపించే గ్లోబులను మార్కెట్లోకి విక్రయించింది. పెద్ద మొత్తంలో కెనడా దుకాణాల్లో దర్శనం ఇస్తున్న ఈ గ్లోబులు ఇప్పుడు భారత సంతతి అమెరికన్ పౌరులను తీవ్రంగా కలవర పెడుతున్నాయి. వాటిని చూసే తమ చిన్నారులకు భారత భౌగోళిక స్వరూపం ఎలా చూపించాలని ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నూతన సంవత్సరం సందర్భంగా సందీప్ దేశ్వాల్ అనే ఓ భారత సంతతి అమెరికన్ తన ఆరేళ్ల కూతురు అస్మితాకు గ్లోబు కొని తీసుకొచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా శాంటా తాతకు తనకు గ్లోబ్ కావాలని అస్మిత విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తల్లిదండ్రులు ఆమె కోరికను తీర్చారు. అయితే, ఆ గ్లోబులో భారత్ ఎక్కడ ఉంది? కెనడా ఎక్కడ ఉంది ? అని పాప అడిగినప్పుడు వారు ఒక్కసారిగా కలవరపడ్డారు. భారత్‌కు తలకాయలాంటి కశ్మీర్‌ను పూర్తిగా వేరు చేసి ఆ గ్లోబులో ఉంది. ఆ గ్లోబులన్నీ కూడా చైనా తయారు చేసినవే. దీంతో తాను ఈ విషయాన్ని గ్లోబులు విక్రయిస్తున్న దుకాణానికి తెలియజేశాడు. ఈ సందర్బంగా తన ఆందోళనను మీడియాతో పంచుకుంటూ 'కశ్మీర్ కూడా భారత్‌లో భాగమే అనే విషయాన్ని ఇప్పుడు తాను తన కూతురుకి చెప్పకుంటే తను మరో రూపంలో ఉన్న భారత్ చిత్రపటాన్ని ఊహించుకుంటుంది. ముందు తరాల వారు కూడా దానినే అనుసరించే ప్రమాదం ఉంది. చైనా చేసిన ఈ చర్యను ఏమాత్రం సహించకూడదు' అని ఆయన అన్నారు. -
చైనా దురహంకారం !
టారొంటో : అమెరికాకు చెందిన అంతర్జాతీయ రీటైల్ చైన్ లింక్ సంస్థ ఒకటి వివాదాస్పదమైన భారత చిత్ర పటం ఉన్న గ్లోబును విక్రయిస్తోంది. ఈ గ్లోబులో జమ్మూ కశ్మీర్‌ను, అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ నుంచి వేరు చేసి చూపుతోంది. ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా అంతర్భాగంగా ఈ గ్లోబు చూపుతోంది. అలాగే జమ్మూ కశ్మీర్‌ను స్వతంత్ర ప్రాంతంగా గుర్తించింది. కెనడాలోని కోస్టాకోలోని ఒక మాల్లో ఈ గ్లోబును విక్రయిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్, కశ్మీర్లు భారత్‌లో భాగంకావని చూపుతున్న ఈ గ్లోబును కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ గ్లోబ్ చైనాలో రూపొందించినట్లు తెలుస్తోంది. గ్లోబ్ కింది భాగంలో మేడ్ ఇన్ చైనా అని రాసిఉండడంతో అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ఈ గ్లోబ్‌పై కెనడాలో స్థిరపడ్డ భారతీయులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లోబ్‌ను తక్షణం అమ్మకాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ గ్లోబ్ గురించి స్పందించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌లకు ట్విటర్లో సెటిజన్లు పలు ట్వీట్లు చేస్తున్నారు. @SushmaSwaraj 🇮🇳🇮🇳🇮🇳🇮🇳Today in Costco we are shocked when we saw this “India without kashmir”.This was a globe made in china.we gave a complaint regarding this to the costco management .so, anyone went to costco complain about this to the management.Lets raise our Voi pic.twitter.com/jvl2Mxgqsr — bhavesh dave (@bombay411) December 13, 2017 The OFBJP Canada calls upon COSTCO Management in Canada and elsewhere to withdraw the product Globe that excludes Kashmir from India. The globe is made in china. A complaint has been made to COSTCO in GTA. pic.twitter.com/d7UwrwdKFc — OFBJP Canada (@OFBJPCanada) December 12, 2017 Dear Modiji, @narendramodi I am a resident of NewJersey, USA from Hyderabad India. I came across this Picture of an educational globe sold in a US retail store Costco and other active online websites like AMAZON. The pic shows Kashmir as No Mans Land not in sync to India Map. pic.twitter.com/TXhA9pj3kP — Joe (@JoeEmani) December 13, 2017 -
భూగోళం అగ్నిగోళంగా మారుతుంది
భూగోళం మండే అగ్నిగోళంగా మారుతుందట. ఇదేదో కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యవాణి కాదు. భౌతిక, అంతరిక్ష శాస్త్రాల్లో అనితరసాధ్యమైన పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేస్తున్న హెచ్చరిక. ఇప్పటికప్పుడే ముంచుకొచ్చే ముప్పేమీ లేకపోయినా, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులు ఇదే రీతిలో కొనసాగుతూ పోతే 2600 సంవత్సరం నాటికి భూగోళం మండే అగ్నిగోళంలా తయారవుతుందని హాకింగ్ చెబుతున్నారు. ఆ పరిస్థితి దాపురించి మానవజాతి అంతరించిపోకుండా ఉండాలంటే, మనుగడకు అనుకూలమైన వాతావరణం గల ఇతర గ్రహాలకు వలస పోవడానికి మనుషులందరూ సిద్ధం కావాలని ఆయన సూచిస్తున్నారు. బీజింగ్‌లో ఇటీవల ఏర్పాటైన ఒక సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చేసిన ప్రసంగంలో హాకింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో జీవితంలోని ప్రతి విషయంలోనూ మార్పులు తేవచ్చని, అయితే, కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరాలను సజావుగా నియంత్రించుకోవాల్సి ఉంటుందని కూడా సూచించారు. -
ఏ జీవులు ఎప్పుడు పుట్టాయి?
స్కూల్ ఎడ్యుకేషన్ మన భూగోళంపై ఇప్పటివరకు లక్షలాది జీవజాతులు అవతరించాయి. అనేక కారణాలవల్ల వాటిలో కొన్ని జీవజాతులు ఎప్పుడో అంతరించిపోయినా, మిగిలినవి మాత్రం మనుగడ కొనసాగిస్తున్నాయి. మన భూగోళం ఏర్పడి ఇప్పటికి సుమారు 460 కోట్ల సంవత్సరాలు అవుతోందని అంచనా. అయితే భూమి పుట్టిన 110 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 350 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) భూమిపై జీవం ఆవిర్భవించలేదు. భూమి పుట్టిన తర్వాత 210 కోట్ల సంవత్సరాల నుంచి 418 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 42 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) గడచిన కాలాన్ని ‘ప్రథమ జీవ మహాయుగం’ అంటారు. భూగోళంపై అనేక రకాల ఏకకణ జీవులు, బహుకణ జీవులు ఈ యుగంలోనే ఉద్భవించి బాగా విస్తరించాయి. గవ్వలతో (పై పెంకుతో) బతికే జీవులు, వెన్నెముక లేని ప్రాణులు పుట్టింది ఈ దశలోనే. -
ఈ గాలి... ఈ నేల... సెలయేరు...
చిరుగాలి సితార సంగీతం వినిపించాల్సిన కాలంలో... గాలి పీల్చాలంటే భయం! సంబరం అంబరాన్ని అంటే కాలంలో...ఒంటరి ఆకాశాన్ని చూస్తే భయం! సెలయేరు తీయగా చెలిమి చేసే కాలంలో...నీరు కన్నీరవుతున్న కాలాన్ని చూస్తే భయం!! మన ‘అభివృద్ధి’ రథాల వేగానికి ఈ గాలి...ఈ నేల... సెలయేరు... ఏవీ క్షేమంగా లేవు. అవి క్షేమంగా లేకపోవడం వాటి దుఃఖం మాత్రమే కాదు... ఈ భూగోళం మీద ప్రతి మనిషి దుఃఖం. సామూహిక దుఃఖం. నీరు కరువై, కరువే బతుకైన కాలంలో వర్షపు నీటిలో ప్రాణాన్ని చూసుకుంటున్న పశ్చిమబెంగాల్ అమ్మాయిని ప్రశాంత్ బిస్వాస్, ఆఫ్రికాలోని డిజిటల్ వ్యర్థాల వికృతిని ఇగోర్ పెట్కోవిక్, బాలీలోని టుకడ్ డ్యామ్‌లో... నీటిలో తన ప్రేమను నింపుతున్న కుర్రాడి సృజనను అలెక్స్ మసి, జార్జియాలోని కొండ, కోన సౌందర్యాన్ని ఎనైస్ స్టుప్క చిత్రించారు. పరిశ్రమల కాలుష్యం వల్ల జీవాలు ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభాన్ని ‘పోల్యూటెడ్ ల్యాండ్‌స్కేప్’ పేరుతో లు గౌంగ్ చిత్రించారు.చైనాలోని హోలింగల్ సిటీ పారిశ్రామిక ప్రాంతంలో 120 గొర్రెలను ప్రతీకాత్మకంగా ఏర్పాటు చేశారు. అక్కడ గొట్టల నుంచి వచ్చే పొగ, ఇక్కడ లేని మేతను మేస్తున్న జీవాలను చూస్తే చాలు... విషయం లోతుగా అర్థమవుతుంది. ఒక్క చిత్రం వంద మాటలు చెబుతుంది. ఈ ఛాయాచిత్రాలు కూడా అంతే!! -
కెసెండ్రా మాట ఎవరు వింటారు?
నీరు జీవితం! చెట్టు చేమకు సమస్త ప్రాణికోటికి నదులు, ఇతర నీటి వనరులే జీవనాధారం! కాబట్టే నగరాలు నదీతీరాల వెంట వెలిశాయి. టైగ్రిస్, నైలు, సింధు నదీతీరాల్లో నాగరికతలు నవనవలాడాయి. నదుల నడక మారిన కారణంగా, నదుల్లో జలరాశులు హరించుకుపోయిన కారణంగా చారిత్రక నగరాలు అంతరించిపోయిన దాఖలాలున్నాయి. మొన్న ఆదివారం వరల్డ్ వాటర్ డే చేసుకున్నాం! నీరు చరిత్రలోకి ప్రవహించక ముందే ఓసారి నీటిని స్మరించుకుందాం! భూగోళం బాస్కెట్‌బాల్ సైజులో ఉంటే మంచినీటి గోళం పింగ్‌పాంగ్ బంతి సైజులో ఉంటుంది. భూగోళాన్ని ఆక్రమించిన 70 శాతం నీటిలో మంచి నీరు ‘గరిటెడే’! భూమి ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకూ మనిషికి అవసరమైన మంచి నీటి పరిణామంలో మార్పు లేదు! నీటి నిలువల్లోనే మార్పులు. సాంప్రదాయక పద్ధతుల్లోని నీటి నిలువలను మనుషులమైన మనం మార్పునకు గురిచేస్తున్నాం! నదుల సహజ ప్రవాహాన్ని అరికట్టి కృత్రిమ జలాశయాలను ఏర్పరుస్తున్నాం. సహజనీటి వనరుల చుట్టూ పరిశ్రమలు, నివాసాలు ఏర్పరచుకుంటున్నాం. ఒక కారు తయారీకి పెద్ద స్విమ్మింగ్ పూల్ పరిమాణంలో మంచినీరు వాడతాం. మంచినీటి విలువలు లేని ఒక కూల్‌డ్రింక్ కోసం రెండువందల రెట్లు అధికంగా మంచినీరు వాడతాం. మన చేష్టల ఫలితంగా మంచినీటికి నిలువ జాగా లేకపోతోంది! నీటిని నిలువ చేయడంలో ప్రకృతికి తనదైన పద్ధతులున్నాయి. మన పూర్వీకులు వాటిని గౌరవించారు. అధికారిక జలాశయాలు ఏర్పడ్డాక వాటి సరఫరా, నియంత్రణ కేంద్రీకృతం అయ్యింది. నీటి సరఫరా బ్యూరోక్రసీ విధుల్లో భాగం అయ్యింది. జలాశయాలు, కాలువల్లో మేటలు (సిల్ట్) ఏర్పడతాయి. వీటిని క్రమానుగతంగా తొలగించాలి. పాలకులు, అధికార గణం వాటిని పట్టించుకోరు. ఫలితంగా నీటి నిలువ సామర్ధ్యం కుంచించుకుపోతోంది! కొత్త కాలనీలు నిర్మించేపుడు, ఇళ్లు నిర్మించే సందర్భాల్లో అప్పటికే ఉన్న మురుగుకాల్వలకు నష్టం కలుగకుండా చేయడం, కొత్తవాటిని ఏర్పరచుకోవడం అనే అంశంలో దారుణమైన అంధత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితం? చినుకు చిటుక్కుమంటే నగరం ముంపునకు గురికావడం అనుభవంలోకి వస్తూనే ఉంది కదా! సేద్యానికి జూదానికి తేడా ఏమిటి? వీటికి తోడు భూతాపపు పెరుగుదల వాతావరణంపై విపరీత ప్రతికూలతను చూపుతోంది. వానలు వెర్రెత్తుతున్నాయి. రుతువులకూ వానలకూ సంబంధం లేకుండా పోతోంది. ఈ నెలలో ఈ కార్తెలో వానలు వస్తాయి అనే శతాబ్దాల లెక్కలు తల్లకిందులు కావడంతో నీటి నిలువలపైనా ఆ ప్రభావం పడుతోంది. ‘వానాకాలం పంట’ అనే నానుడికీ కాలం చెల్లుతోంది. భారతీయ వ్యవసాయం జూదప్రాయంగా మారుతోంది. జూదశాల (క్యాసినో)కు వ్యవసాయానికీ తేడా ఏమిటి? క్యాసినో ఎప్పుడు తెరుస్తారో తెలుస్తుంది. మనమెంత నష్టపోతామో తెలుస్తుంది. వ్యవసాయ జూదం ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ముగింపు ఎప్పడూ సుఖాంతం కాదు కదా! ప్రాణాంతకంగా కూడా మారుతోంది. నీటి కంటె చమురు చౌక గతంలో ఎప్పుడూ వినని ‘నీటి కరువు’ అనే పరిస్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. కెసెండ్రా గుర్తుంది కదా? ట్రాయ్ రాజు ప్రియం కూతురు కెసెండ్రా. ఆమె అందానికి అబ్బురపడ్డ అపోలో దేవుడు ఆమెకు జరగబోయే సంఘటనలను సవివరంగా చెప్పగల వరాన్ని ఇస్తాడు. కానుకకు కొనసాగింపుగా ఆమెతో సంగమాన్ని కోరతాడు. కెసెండ్రా అంగీకరించదు. అపోలో కోపితుడవుతాడు. ఆమె చెప్పే భవిష్యవాణిని ఎవ్వరూ నమ్మకుందురు గాక అని శపిస్తాడు. ఆధునిక కెసెండ్రాలు నీటి విషయంలో భవిష్యవాణిని చెబుతూనే ఉంటారు. ఎవరు నమ్ముతారు? వచ్చే ఐదేళ్లలో మంచినీటికి విపరీత కరువు వస్తుందని 2050 నాటికి శాశ్వత కరువు ఏర్పడుతుందని కెసెండ్రాలు సెలవిస్తున్నారు. భవిష్యత్ యుద్ధాలు చమురు కోసం కాదు నీటికోసమే జరుగుతాయి అనే జోస్యాన్ని నమ్మాల్సి వస్తోంది. కడవ నీటికోసం పల్లెతల్లులు పదిమైళ్లు నడవడం కంటిముందు కనిపిస్తున్న వాస్తవమే కదా! నదీప్రవాహాలను పంచుకుంటున్న కర్ణాటక-తమిళనాడు మధ్య అంతర్యుద్ధం ఏర్పడ్డ పరిస్థితులను చూశాం కదా! తెలుగు రాష్ట్రాల్లోనూ సెగలు-పొగలు కన్పిస్తున్నాయి. పోలీసులు పోలీసులపై లాఠీచార్జ్ చేసిన వైనానికి కారణం ఇరురాష్ట్రాల నీటి అవసరాలే కదా! ఆ దండ కట్టలేం! ‘చెంగ’ అనే పంజాబీ పదానికి అర్థం మంచి, చక్కని, అందమైన.. ఇలాంటి పేర్లున్నాయి. భారతదేశానికి నదులతో ఒక చెంగల్వ దండ వేద్దామనుకున్నారు దివంగత ఇంజనీర్ కె.ఎల్.రావు. ఆయన నెహ్రూ కేబినెట్లో ఇరిగేషన్ మినిస్టర్‌గా పనిచేశారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలు నీటి చుక్కకు తపిస్తోంటే కొన్ని ప్రాంతాలు వరదల్లో మునిగిపోవడం గురించి రావుగారి ఇంజనీరింగ్ హృదయం కలత చెందింది! ఈ దుస్థితి తొలగాలంటే ఏంచెయ్యాలి..? నదులను కాల్వల ద్వారా అనుసంధానం చేస్తూ ‘గార్లెండ్ ప్రాజెక్ట్’ను సూచించారు. దశాబ్దాల క్రితపు ఖరీదైన ఆ కల ఇప్పటికీ ఆచరణలోకి అడుగువేయలేదు. ఒక వేళ అమలు చేయాలనుకుంటే గార్లెండ్ ప్రాజెక్ట్‌కు ఎంత ఖర్చవుతుంది? పదేళ్ల క్రితం అంచనా ప్రకారం 5,60,000 కోట్ల రూపాయలు! ఆర్థిక కారణాలొక్కటే ఈ ప్రాజెక్ట్ అమలుకు అడ్డంకి కాదు. రాష్ట్రాల భిన్న ధోరణులు కూడా! ‘ నా జీవిత కాలంలో ఈ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టదు’ అని ప్లానింగ్ కమిషన్ సభ్యులొకరు ఇటీవల నిర్వేదం చెందారు. అతడిని నిరాశావాదని అందామా..!! ప్రజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
తొలిగడప
టూకీగా ప్రపంచ చరిత్ర భూగోళం మరింత చల్లబడింది. వేడి పెనంలాటి నేల చీకటి వేళల్లో గోరువెచ్చగా మారిన వాతావరణంలో ‘మీసోజోయిక్’ యుగం - అంటే ‘మధ్యంతర’ యుగం మొదలయింది. సుమారు 22కోట్ల సంవత్సరాల నాడు ప్రారంభమైన ఈ యుగం దాదాపు పదనాలుగున్నర కోట్ల సంవత్సరాలు కొనసాగింది. అదివరకటి యుగం చిట్టచివరి దశలో పొడజూపిన ‘రెప్టైల్’ తరగతి జంతువుల విస్తృతి మధ్యంతరయుగంలో విజృంభించడంతో దీన్ని ‘గోల్డన్ ఏజ్ ఆఫ్ రెప్టైల్స్’ - అంటే ‘సరీసృపాల స్వర్ణయుగం’గా అభివర్ణించారు. ఆ వివరాలకు వెళ్ళేముందు సరీసృపాల స్వభావాన్ని స్థూలంగా కొంత తెలుసుకుందాం. వెన్నెముక కలిగిన జంతువులు ఉనికిలోకి వచ్చిన తొలిదశ జీవుల్లో చేప, కప్ప, తొండలను తీసుకుంటే, అవి వేరు వేరు తరగతులకు చెందినవే గాక, పరిణామక్రమంలో ఒకదానికంటే మరొకటి ఎగువస్థాయి లక్షణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. చేప ఎట్టిపరిస్థితుల్లోనూ నీటిని వదలి బ్రతకలేదు. సంతానోత్పత్తి విధానాన్ని పరిశీలిస్తే, చేపకు ఉండేది అండాశయమేగానీ గర్భాశయంగాదు. అందువల్ల, ఆడ చేప మగబీజకణాలను కడుపులోకి తీసుకోలేదు. సంగమించే సమయంలో ఆడచేప విడుదల చేసే గుడ్లూ, మగచేప విడుదల చేసే రేతస్సూ, వాటి శరీరాలకు వెలుపలిగా, అంటే నీటిలో సంయోగమై పిండం ఏర్పడుతుంది. కప్ప ‘ఉభయచరం.’ నేలమీద జీవిస్తుంది గానీ, గుడ్లు పెట్టే సమయం రాగానే అది ఎన్ని తిప్పలైనా పడి నీటిగుంట చేరుకోవలిసిందే. ఎందుకంటే, చేపకు మల్లే కప్పకు గూడా గర్భాశయం ఏర్పడకపోవడంతో, దాని గుడ్లకు మగబీజకణాలతో సంయోగం నీటిలోనే జరగాలిగాబట్టి. తొలిదశలో కప్పపిల్లలు నీటిలోనే జీవిస్తూ, చేపల్లాగే మొప్పలతో ప్రాణవాయువును గ్రహిస్తాయి. ఊపిరితిత్తులు ఎదిగిన తరువాత వాటి జీవితం ఒడ్డుమీదికి మారుతుంది. సరీసృపం తరగతికి చెందిన తొండకు అండాశయంతోపాటు గర్భాశయం కూడా ఉంటుంది. తొక్కిళ్ళు పడినప్పుడు మగజీవి రేతస్సును ఆడజీవి తన గర్భంలోకి గ్రహిస్తుంది. ఆడ మగ బీజకణాల సంయోగం గర్భాశయంలో జరిగి, చుట్టూ దళసరి రక్షకపటలం ఏర్పడేవరకు గుడ్డును ఇది తన గర్భంలోనే ఉంచుకుంటుంది. ఆ తరువాత, పొదిగేందుకు అనుకూలమైన వెచ్చని నేలలో గుడ్లను దించి, వాటి రక్షణ కోసం తనకు చేతనయిన జాగ్రత్తలు తీసుకుంటుంది. దీని సంతానోత్పత్తి విధానానికి నీటితో సంబంధం తెగిపోయింది. ఉదాహరణ కోసం మనకు బాగా పరిచయమున్న జంతువుల నుండి తరగతికి ఒకటిగా ఎన్నుకున్నాం గాని, మొత్తంగా చూస్తే ఏ తరగతికి ఆ తరగతిలో ఇంచుమించు ఒకేలా బతికే జీవులు వేలసంఖ్యలో ఉంటాయి. ఒక్క చేపల్లోనే ప్రస్తుతం మనకు తెలిసినవి దాదాపు 20,000 కులాలు. ఉభయచరాల్లో 6,500 రకాలు తెలుస్తుండగా, సరీసృపాల్లో బల్లులూ, తొండలూ, పాములూ, తాబేళ్ళూ, మొసళ్ళవంటి జాతులే అనేకం ఉన్నాయి. ఒక్కొక్క జాతికి తిరిగి బోలెడన్ని కులాలు; తాబేళ్ళలో 300 కులాలు కనిపిస్తుండగా, తొండలూ పాములవంటి ప్రాణుల్లో 7,900 కులాలు తేలుతున్నాయి. ‘పైకస్’ తరగతికి చెందిన చేప, ఉభయచరాల్లో కప్ప, రెప్టైల్స్లో తొండల మధ్య నుండే తేడాలు కొన్నింటిని తెలుసుకున్నాక, వాటిల్లో కనిపించే ఒక సామాన్య లక్షణాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. గుడ్లను పెట్టేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవడం ఈ జీవులన్నిట్లో కనిపించే సామాన్య లక్షణం. ఆ ప్రేరణకు కారణమైంది మెదడు. కపాలంగా ఏర్పడిన తల ఎముకలూ, ‘మెదడు’ అనదగిన మాంసభాగం తొట్టతొలిగా కనిపించేది చేపల్లో. వానపాములాంటి వెన్నెముకలేని జీవుల్లో మెదడులా ఏర్పడిన కేంద్రాలు కనిపించినా, అవి కేవలం నాడీకణాల సముదాయం మాత్రమే. ఆలోచనలు కలిగించగల ‘గ్రే మేటర్’- అంటే ‘బూడిదరంగు పదార్థం’ ఆ తరహా జీవులకు ఉండదు. అతి చిన్న మోతాదులో బూడిదరంగు పదార్థం వెన్నెముక ఏర్పడిన ప్రాణులతో మొదలౌతుంది. పరిణామదశ స్థాయి పెరిగేకొద్దీ దాని మోతాదు పెరుగుతుంది. మెదడంటే మానవునికున్న ‘పెద్దమెదడు’ సామర్థ్యంతో పోల్చుకునేందుకు వీలయ్యేంతది కాదు. మనిషితో పోల్చదగిన మెదడుండేది మరో మనిషికేగాని, మరే జంతువూ సాటి రాదు. మనం మాట్లాడుకున్న ప్రాణులకుండే మెదడు అత్యంత ప్రాథమికమైంది. ఇంద్రియాల నుండి సంకేతాలు స్వీకరించడం, వాటిని విశ్లేషించుకుని అవసరానికి తగినట్టు శరీరభాగాలను ప్రేరేపించడం వరకే దాని పరిమితి. జంతువుల్లో కనిపించే చర్యలు ‘ఉద్రేక’ జనితాలే తప్ప, ఆలోచనా జనితాలు కాకపోవడానికి కారణం ఇదే. చేప వంటి జీవులకు నిద్రతో అవసరం కలుగకపోవడానికి కారణం కూడా ఇదే. ‘నిద్ర’ అనేది ప్రధానంగా పెద్దమెదడు తీసుకునే విశ్రాంతి. గుండె, ఊపిరితిత్తులూ, మూత్రపిండాలూ, కాలేయం తదితర అవయవాలన్నీ మెలకువలో ఎలా పనిచేస్తాయో నిద్రలోనూ అదేవిధంగా పని చేస్తుంటాయి. మెదడు విశ్రాంతిలో ఉందిగాబట్టి, కండరాలకు ‘సంకల్పిత’ చర్యలు మాత్రమే ఉండవు; ఇంద్రియాలకు చురుకుదనం మందగిస్తుంది. చూపుతో అవసరం లేనందున రెప్పలు మూసుకుపోతాయి. ఈ యోగమంతా పెద్దమెదడు తీసుకునే విశ్రాంతికి అనుబంధం. అలసిపోయేందుకు మెదడేలేని జీవుల్లో నిద్రగా చెప్పుకునే స్థితే సంభవించదు. బహుశా అందుకేనేమో, మనిషితో పోలిస్తే నిద్రకు అవసరమయ్యే సమయం మిగతా ఏ జంతువుకైనా తక్కువే ఉంటుంది. సరీసృపాల తరగతికి చెందిన జీవులను ‘కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్’- అంటే ‘చల్లనెత్తురు జంతువులు’ అంటారు. వాస్తవానికి చేప, కప్ప తరగతులకు చెందిన జీవుల్లోగూడా వేడిరక్తం ఉండదు. శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే వ్యవస్థ ఆ జీవులకు ఏర్పడలేదు. వేడిని గ్రహించాలన్నా, తగ్గించుకోవాలన్నా అవి పరిసరాల మీద ఆధారపడతాయి. లోతులు మార్చుకుంటూ చేప ఆ అవసరాలను పూడ్చుకుంటుంది; వెచ్చదనం కోసం ఎండనూ, చల్లదనం కోసం నీటినీ ఉభయచరాలు ఉపయోగించుకుంటాయి; -
చీకటి ప్రపంచపటం!
వాషింగ్టన్: ఇప్పటిదాకా భూగోళంపై పగటిపూట కనిపించే వివిధ ప్రాంతాలను గుర్తిస్తూనే ప్రపంచపటాలు(అట్లాస్‌లు) రూపొందాయి. గూగుల్ ఎర్త్లోనూ పగటి ఫొటోల ఆధారంగానే ప్రపంచపటాన్ని పొందుపర్చారు. అయితే.. రాత్రిపూట కనిపించే భూమిపై కూడా ఆయా దేశాలను, నగరాలను గుర్తిస్తూ సరికొత్త చీకటి అట్లాస్‌ను రూపొందించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకుగాను ‘ద గేట్‌వే టు ఆస్ట్రోనాట్ ఫొటోగ్రఫీ ఆఫ్ ఎర్త్’ వెబ్సైట్ ద్వారా లక్షలాది ఫొటోలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. 1960ల నుంచీ ఇటీవలి దాకా వ్యోమగాములు తీసిన 18 లక్షల ఫొటోలను ఈ వెబ్సైట్లో ఉంచింది. ఎవరి నగరాన్ని వారు గుర్తించడం తేలిక కాబట్టి.. ప్రజలందరూ ఈ ఫొటోలను పరిశీలించి తమతమ ప్రదేశాలను గుర్తించాలని నాసా పిలుపునిచ్చింది. ఈ వెబ్‌సైట్‌లోని ఫొటోల్లో 13 లక్షల ఫొటోలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీశారు. వీటిలో 30 శాతం ఫొటోలు రాత్రిపూట తీసినవి ఉన్నాయి. ఇప్పటిదాకా వందలాది మంది వలంటీర్లు 20 వేల ఫొటోలను విశ్లేషించి, ఆయా ప్రదేశాలను గుర్తించారట. ఈ చీకటి అట్లాస్‌ను ప్రజలకు, మీడియాకు, శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచుతామని, ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం, కాలుష్యం, వాతావరణంలో రసాయనాల వంటి అనేక అంశాలపై పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది.