ఏ జీవులు ఎప్పుడు పుట్టాయి?
స్కూల్ ఎడ్యుకేషన్
మన భూగోళంపై ఇప్పటివరకు లక్షలాది జీవజాతులు అవతరించాయి. అనేక కారణాలవల్ల వాటిలో కొన్ని జీవజాతులు ఎప్పుడో అంతరించిపోయినా, మిగిలినవి మాత్రం మనుగడ కొనసాగిస్తున్నాయి. మన భూగోళం ఏర్పడి ఇప్పటికి సుమారు 460 కోట్ల సంవత్సరాలు అవుతోందని అంచనా. అయితే భూమి పుట్టిన 110 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 350 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) భూమిపై జీవం ఆవిర్భవించలేదు.
భూమి పుట్టిన తర్వాత 210 కోట్ల సంవత్సరాల నుంచి 418 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 42 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) గడచిన కాలాన్ని ‘ప్రథమ జీవ మహాయుగం’ అంటారు. భూగోళంపై అనేక రకాల ఏకకణ జీవులు, బహుకణ జీవులు ఈ యుగంలోనే ఉద్భవించి బాగా విస్తరించాయి. గవ్వలతో (పై పెంకుతో) బతికే జీవులు, వెన్నెముక లేని ప్రాణులు పుట్టింది ఈ దశలోనే.