creatures
-
ప్రేమించు... జీవించు...
ఈ సృష్టి సమస్తం ప్రేమ మయం.. సృష్టిలో సమస్త జీవరాశుల పట్ల ప్రేమ కలిగి ఉండటమే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సాధన అని మహాభారతం చెబుతోంది. ప్రాణం పోసే మహత్తర శక్తి ప్రేమకు ఉంది. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాలకు ప్రేమ ఎంతో అవసరం. ప్రేమకు కొలతలు లేవు. తరతమ భేదాలు లేవు. అది అనంతమైనది. విశ్వవ్యాప్తమైనది.. మనిషి సంఘజీవి. ఏకాకిగా అతడు సంఘంలో ఎక్కువ కాలం ఉండలేడు. అతడు జీవించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ లేనిదే మనిషి జీవితం వ్యర్ధం. మనిషి మనుగడకు మూలం ప్రేమ. మానవ సంబంధాలు నిలబడేది, కొనసాగేది ప్రేమ పునాది పైనే. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీయువకుల మధ్య ఉండే ప్రేమ.. కేవలం యువతీయువకులదే కాదు ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. సమస్త మానవాళిలో ఉన్న ప్రేమను అవగతం చేసుకుంటే అది మానవ జీవితానికి పరిపక్వతనిస్తుంది. ప్రేమ గురించి సంపూర్ణంగా తెలిసినవారే, దాన్ని ఆస్వాదిస్తారు. ఇతరులకు పంచగలుగుతారు. ప్రేమ మనిషిని దైవంగా మారుస్తుంది.. ఆ దైవత్వంతోనే మనిషి ఎలాంటి కార్యాలనైనా సాధించగలుగుతాడు.. ప్రేమ గురించి , దాని శక్తి గురించి స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్త్ లాంటి ఎందరో మహనీయులు ఈ లోకానికి తెలియ చేశారు. ఈ క్రమంలో ప్రేమతత్వం ద్వారా కోట్ల మందిని ప్రభావితం చేశారు. ప్రేమలో నిర్భయత్వాన్ని, ఆనందాన్ని సాధించే మార్గాలను వారు ఈ లోకానికి అందించారు. అయితే ప్రేమ అనేది కేవలం మనుషుల మధ్యనే కాదు అది సమస్త జీవరాశుల మీదా ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్రకతి అంతా ప్రేమ మయంగా అందంగా, ఆహ్వాదంగా కనిపిస్తుంది. బొందితో స్వర్గానికి వెళ్ళే అర్హత ధర్మరాజుకు ఉంది. ఆయన స్వర్గానికి వెళ్ళే సమయంలో ఓ కుక్క అతని వెంట పడుతుంది. ఆ కుక్కను ప్రేమగా చూసిన ధర్మరాజు కుక్కను వదిలి స్వర్గానికి వెళ్ళడానికి అంగీకరించడు. ఇలా చివరి క్షణంలో సైతం కుక్క మీద ప్రేమ కురిపించి మూగజీవాల పట్ల తన దయాగుణాన్ని చాటుకున్నాడు. సాక్షాత్తు శిరిడీ సాయి నాధుడు ఎప్పుడూ ప్రజలతో పాటు మూగ జీవాలను కూడా ఎంతగానో ప్రేమించేవారు. అలాగే రమణ మహర్షితో పాటు ఇంకా అనేక మంది యోగులు, మునులు, సిద్ధులు తమ ప్రేమను జంతు జీవాలపై కురిపించి విశ్వ మానవ ప్రేమను చాటుకున్నారు...ఇలా ఆపదలో ఉన్నవారిని, రోగ గ్రస్తులను మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను ప్రేమించిననాడే మానవ జీవితానికి పరిపక్వత సిద్ధిస్తుంది. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తారసపడుతుంది. జీవితంలో ప్రతి మనిషి తన స్నేహితులను, తల్లితండ్రులను, పిల్లలనూ ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే సుందరమైన నదులు, కొండలపై జారు జలపాతాలు, ఇసుకతో కూడిన ఎడారులు, ప్రకతి శోభ, చెట్టు చేమ, జంతువులు, పక్షుల, వింతగా కనిపించే మబ్బులు, మిణుకు మిణుకుమనే నక్షత్ర సముదాయం, రోదసి, అందం, సుందరం, బుజ్జి పాపాయి అమాయక నవ్వు, మనుషుల స్నేహం, అభిమానం, వీటి అన్నింటిలో కూడా ప్రేమ కనిపిస్తుంది. వికసిస్తుంది. ప్రేమ మనకు ప్రకృతి ఇచ్చిన వరం.మనిషి మౌలికంగా దైవస్వరూపుడని, శరీరంలో నివసించే ఆత్మే దైవమని అనేక మంది మహనీయులు సెలవిచ్చారు. జ్ఞానం పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత వికసిస్తుంది. అలా వికసించినపుడే అన్ని భేదాలు అంతరించి ప్రేమతత్వం సాధ్యపడుతుంది. ఏవిధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, మంచి మనసుతో మనం ఒకరి పట్ల చూపే నిస్వార్థమైన ఆదరణే ప్రేమ‘. ఇది ఒక ఉన్నతమైన, పవిత్రమైన, గొప్పదైన భావన.– దాసరి దుర్గాప్రసాద్ -
నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా..
ఢిల్లీ: దేశంలో నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి. రేపు కొత్త పార్లమెంట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే.. కొత్త పార్లమెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చే గుమ్మాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పార్లమెంట్ భవనంలో ఆరు దర్వాజలకు ఆరు పౌరాణిక ప్రాణుల పేర్లను పెట్టారు. ఈ ఆరు ప్రాణులు 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేకతలను సూచిస్తున్నాయి. అవేంటంటే.. నూతన పార్లమెంట్లో ఆరు ద్వారాలు ఉన్నాయి. అవి.. గజ ద్వారం, అశ్వ ద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారం, హంస ద్వారం. ప్రతి ద్వారం దాని పేరుపై ఉన్న ప్రాణి శిల్పాన్ని కలిగి ఉంది. గజ ద్వారం.. బుద్ధి, జ్ఞాపకశక్తి, సంపద, జ్ఞానాన్ని సూచించేది ఏనుగు. దీని పేరు మీదుగా గజ ద్వారంగా ఓ గుమ్మానికి పేరు పెట్టారు. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపు ఉంది. ఉత్తరం, వాస్తు శాస్త్రం ప్రకారం, బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంది. ఇది తెలివికి మూలం అని విశ్వసిస్తారు. అశ్వ ద్వారం.. రెండవది అశ్వ ద్వారం. గుర్రం పేరు మీదుగా గుమ్మానికి ఈ పేరు పెట్టారు. గుర్రం శక్తి, బలం, ధైర్యాన్ని సూచిస్తుంది. పాలనలో కావాల్సిన లక్షణాలను ఈ గుమ్మం గుర్తుచేస్తుంది. గరుడ ద్వారం.. మూడవ ద్వారానికి గరుడ అనే పేరు పెట్టారు. పక్షుల రాజు గరుడ.. విష్ణువు వాహనంగా నమ్ముతారు. హిందూ త్రిమూర్తులలో సంరక్షకుడు అయిన విష్ణువుతో దానికి అనుబంధం ఉంది. గరుడను శక్తి, ధర్మం (కర్తవ్యం)నికి చిహ్నంగా భావిస్తారు. ఇది అనేక దేశాల చిహ్నాలపై ఎందుకు ఉపయోగించారో కూడా వివరణ ఉంటుంది. గరుడ ద్వారం కొత్త పార్లమెంటు భవనానికి తూర్పు ద్వారం. మకర ద్వారం.. నాలుగో ద్వారం మకర ద్వారం. మకరాన్ని సముద్ర చేపగా పిలుస్తారు. వివిధ జంతువుల కలయికగా దీన్ని గుర్తిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించి ఉన్న హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో మకరం సాధారణంగా కనిపిస్తాయి. మకరం వివిధ జీవుల కలయికగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. గుమ్మాల వద్ద మకర శిల్పాలు రక్షకులుగా కనిపిస్తాయి. మకర ద్వారం పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు ఉంది. శార్దూల ద్వారం.. ఐదవ ద్వారం శార్దూలం. ఇది సింహం శరీరం, కానీ గుర్రం, ఏనుగు లేదా చిలుక తల. కొత్త పార్లమెంట్ భవనం గేటుపై శార్దూల ఉండటం దేశ ప్రజల శక్తిని సూచిస్తుందని ప్రభుత్వ నోట్ పేర్కొంది. హంస ద్వారం పార్లమెంటు ఆరవ ద్వారానికి హంస ద్వారం అని పేరు పెట్టారు. హంస అనేది హిందూ జ్ఞాన దేవత అయిన సరస్వతి వాహనం. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు గేటుపై ఉన్న హంస శిల్పం స్వీయ-సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం. ఇదీ చదవండి: ఇండియా కూటమిని గొర్రెలు, మేకలతో పోల్చిన ఏక్నాథ్ షిండే -
చిన్నవే కానీ..ప్రాణాలు తీసేస్తాయ్!
-
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 సముద్ర జీవులు
-
ప్యాంటు చెక్ చేస్తే నిండా పాములు, బల్లులు.. అధికారులే షాక్!
వాషింగ్టన్: పాముల వంటి విష జీవులను తాకేందుకే భయంతో వణికిపోతాం. అయితే, ఓ వ్యక్తి తన దుస్తుల్లో దాచిపెట్టి వాటిని స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇటీవలే తన ప్యాంటులో 60 రకాల పాములు, బల్లులు, ఇతర సరిసృపాలను దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా దొరికిపోయాడు. ఈ సంఘటన అమెరికా- మెక్సికో సరిహద్దులో వెలుగు చూసింది. 7,50,000 డాలర్ల విలువైన సరిసృపాల స్మగ్లింగ్‌లో భాగంగా ప్యాంటులో దాచిపెట్టి అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుడికి రెండు దశాబ్దాలకిపైగా జైలు శిక్ష పడినట్లు వెల్లడించారు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్ మాన్యుయెల్ పెరెజ్ అనే వ్యక్తి ఆరేళ్లలో 1,700 జంతువులను మెక్సికో, హాంకాంగ్‌ల నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేసినట్లు చెప్పారు అధికారులు. నిరాటంకంగా సాగుతున్న అతడి అక్రమ రవాణా ఈ ఏడాది మార్చిలో బట్టబయలైంది. పాములు, బల్లులు వంటి వాటిని ప్యాంటులో దాచి మెక్సికో నుంచి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అయితే, ముందు తన పెంపుడు బల్లులను తీసుకెళ్తున్నాని కస్టమ్స్ అధికారులకు తెలిపాడు. కానీ, అతడి దుస్తులు మొత్తం విప్పి పరిశీలించగా ప్యాంటులో 60 పాములు, బల్లుల వంటివి బయపడినట్లు అధికారులు తెలిపారు. కోర్టు విచారణ సందర్భంగా తన స్మగ్లింగ్‌పై ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు నిందితుడు జోస్ పెరెజ్. కొన్నిసార్లు గాడిదలపై తరలించేందుకు డబ్బులు చెల్లించానని, ఇతర సమయాల్లో తానే సరిహద్దులు దాటానని ఒప్పుకున్నాడు. అతడు అక్రమ రవాణా చేసి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తన ఖాతాదారులకు సుమారు 7,39,000 డాలర్లకు సరిసృపాలను విక్రయించినట్లు పత్రాలు సమర్పించారు అధికారులు. అందులో యుకాటాన్ బాక్స్ తాబేళ్లు, మెక్సికన్ బాక్స్ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్ పూసల బల్లులు సహా ఇతర జంతువులు ఉన్నాయి. రెండు కేసుల్లో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇదీ చదవండి: ప్రపంచం చుట్టేశాడు.. రెండు గిన్నిస్ రికార్డులు పట్టేశాడు -
ఈ జేజమ్మ మళ్లీ పుడుతుందట!
ఇదేంటి ఈ ఏనుగులకు జూలు ఉంది.. భలే విచిత్రంగా ఉన్నాయే అనుకుంటున్నారా? కానీ ఇవి ఏనుగులు కాదు.. వాటి జేజమ్మలు.. అంటే ఏనుగుల పూర్వీకులన్నమాట. వీటిని వూలీ మామత్‌లు అంటారు. చూసేందుకు ఆఫ్రికా ఏనుగుల తరహాలో బలిష్టంగా కనిపిస్తూ ఒంటినిండా జూలుతో మంచు యుగంలో భూమిపై సంచరించిన జీవులివి. యూరప్, ఉత్తర అమెరికాతోపాటు ఆసియాలోని మంచు ప్రాంతాల్లో 3 లక్షల ఏళ్ల కిందట తిరిగిన ఈ జీవులు దాదాపు 10 వేల ఏళ్ల కిందటే అంతరించిపోయాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే.. ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రం జురాసిక్ పార్క్‌లో జన్యు శాస్త్రవేత్తలు ఎలాగైతే అంతరించిన డైనోసార్లను ప్రతిసృష్టి చేస్తారో అదే తరహాలో వూలీ మామత్లను తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ కొలోస్సల్ బయోసైన్సెస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏకంగా 15 లక్షల డాలర్లను కూడా సమీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ కంపెనీ బయటకు వెల్లడించనప్పటికీ డీఎన్ఏ ఎడిటింగ్ పద్ధతి ద్వారా వూలీ మామత్లను సృష్టించాలనుకుంటోంది. దీన్నే మరోలా చెప్పాలంటే వూలీ మామత్లకు అత్యంత దగ్గరి పోలికలుగల, 99% డీఎన్ఏను పోలిన ఇప్పటి ఏనుగుల డీఎన్ఏను క్రమంగా వూలీ మామత్ల తరహాలోకి మార్చుకుంటూ వెళ్లాలని భావిస్తోంది. వచ్చే 10–15 ఏళ్లపాటు ఈ ప్రక్రియపైనే పనిచేయనున్నట్లు సంస్థ చెబుతోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే అప్పుడు వూలీ మామత్ లేదా మామత్ను పోలిన అండాలను ల్యాబ్‌లలో తయారు చేసి వాటిని ఆసియా ఏనుగుల గర్భంలో ప్రవేశపెట్టాలనేది కొలోస్సల్ బయోసైన్సెస్ లక్ష్యం. ఎందుకీ ప్రయోగం? ఆర్కిటిక్ ప్రాంతంలో మట్టి, ఇసుక, మంచుతో ఘనీభవించిన నేల (పర్మాఫ్రాస్ట్) పొరల నుంచి భూతాపం వల్ల క్రమంగా మంచు కరిగిపోతోంది. భూమిపై అత్యధికంగా కార్బన్, మీథేన్‌లను పట్టి ఉంచిన పర్మాఫ్రాస్ట్ బలహీనపడితే అది భూ వాతావరణంలోకి భారీ స్థాయిలో కార్బన్ డై ఆౖð్సడ్, మీథేన్ వాయువులను విడుదల చేస్తుంది. ఈ పరిణామం మానవాళి ఉనికికే ప్రమాదం కానుంది. ఈ నేపథ్యంలో కొలోస్సల్ బయోసైన్సెస్తోపాటు మరికొన్ని బయోటెక్నాలజీ సంస్థలు వూలీ మామత్‌లు సహా అంతరించిపోయిన ఆర్కిటిక్ ప్రాంతాల జంతువులను భారీ స్థాయిలో ప్రతిసృష్టి చేసి వాటిని సహజ ఆవాస ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నాయి. ఈ జీవులు ఆర్కిటిక్‌లో సంచరిస్తే వాటి బరువు వల్ల మంచుపొరలు లోపలకు తిరిగి గట్టిపడటంతోపాటు ఆ పొరల మధ్య చిక్కుకుపోయిన ఉష్ణం వెళ్లిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. ఫలితంగా పర్మాఫ్రాస్ట్‌లో చల్లదనం శాశ్వతంగా ఉండిపోతుందని.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
వీటికి ‘డబ్బు’ చేసింది.. ప్రపంచంలో టాప్ ధనిక జంతువులు ఇవేనండి!
డాలర్లైనా, రష్యన్ రూబుళ్లైనా... డబ్బుంటేనే ఖానా పీనా! అన్నాడో సినీ కవి. మనవాళ్లు ఈ విషయం ఎప్పుడో కనిపెట్టి ధనం మూలం ఇదం జగత్ అన్నారు. మానవ చరిత్రలో కుబేరులుగా ఖ్యాతికెక్కినవాళ్లు అనేకమంది ఉన్నారు. అయితే మనుషులు కాకుండా ప్రపంచంలో ధనిక జీవులుగా కొన్ని జంతువులు పేరుగాంచాయి. జంతువులేంటి.. వాటికి సంపదేంటి అనుకుంటున్నారా! అవేమీ కంపెనీలు పెట్టి ధనం కూడబెట్టలేదండీ! వాటి యజమానులు ప్రేమతో ఇచ్చిన సంపదతో ఈ పెంపుడు జంతువులకు డబ్బు చేసింది. అయితే వీటిలో కొన్ని స్వయంకృషి జంతువులు కూడా ఉన్నాయి. అంటే సినిమాల్లో, టీవీల్లో నటించడం ద్వారా ఇవి బోలెడు సంపద ఆర్జించాయన్నమాట! ఇలా ఈ జాబితాలో చేరిన జంతువుల ఆస్తుల వివరాల్లో కొన్ని అతిశయోక్తులున్నాయని తర్వాత తెలిసింది. ప్రస్తుతం ► జిగో అనే కోడి పెట్టను టెక్ట్స్ బుక్ రచయిత మైల్స్ బ్లాక్వెల్ పెంచుకున్నారు. తన తదనంతరం సదరు పెట్టగారికి బ్లాక్వెల్ 1.5 కోట్ల డాలర్లు రాసిచ్చారు. ► ఇటలీకి చెందిన రియల్టీ వ్యాపారి మారియా అసుంటా బజార్లో ఒక పిల్లిని చూసి జాలిపడి తెచ్చుకొని టొమసో అని పేరు పెట్టి పెంచుకున్నారు. 94ఏళ్ల వయసులో ఆమె మరణించారు. ఆమె విల్లు ప్రకారం టొమసోకు 1.3 కోట్ల డాలర్ల ఆస్తి దక్కింది. ► 2018 వరకు బ్లాకీ అనే పిల్లి 1.25 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్న పిల్లిగా పేరుగాంచింది. ► గైల్ పోస్నర్ అనే ఆమె తన పెంపుడు కుక్క కొంచిటాకు 30 లక్షల డాలర్ల ధనంతో పాటు దా దాపు 80 లక్షల విలువైన భవంతిని ఇచ్చేసింది. ► లియోనా హెల్మ్స్లే అనే ఆమె తన మనవళ్లపై కోపంతో తనకున్న 1.2 కోట్ల డాలర్లను ట్రబుల్ అనే కుక్కకు రాసింది. అయితే తర్వాత కోర్టులో జడ్జిగారు కుక్కకు 20 లక్షలు చాలని తీర్పిచ్చారు. ► అగ్ని ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి తమను రక్షించిందన్న కృతజ్ఞతతో ఫ్లాసీ అనే పెంపుడు కుక్కకు డ్రీ బారీమోర్ దంపతులు 13లక్షల డాలర్ల ఇంటిని ముద్దుగా ఇచ్చేసింది. ► టింకర్ అనే పిల్లికి దాని యజమాని ద్వారా దాదాపు 8లక్షల డాలర్ల ఇల్లు, 2.26 లక్షల డాలర్ల సంపద ముట్టాయి. ► ఫాషన్ మేనేజర్ కార్ల్ పెంచుకునే చుపెట్టే అనే పిల్లికి 20 కోట్ల డాలర్ల ఆస్తి దక్కినట్లు వార్తలు వచ్చాయి, కానీ నిర్ధారణ జరగలేదు. ► ఇక పిల్లుల్లో మహారాజా పిల్లి అంటే గ్రుంపీ క్యాట్నే చెప్పుకోవాలి. అనేక షోలు, సినిమాల్లో నటించి ఈ పిల్లి దాదాపు 10 కోట్ల డాలర్లు సంపాదించింది. ► ఒలివియా బెన్సన్ అనే పిల్లి సుమారు 9.7 కోట్ల డాలర్లను వివిధ కార్యక్రమాల ద్వారా సంపాదించింది. ► గుంతర్6 అనే కుక్కకు కోట్ల డాలర్ల ఆస్తి దక్కిందని అనేక వార్తలు వచ్చినా అదంతా ప్రాంక్ అని తర్వాత తెలిసింది. డబ్బున్నవారు ఏక్షణం ఏం చేస్తారో తెలియదు కాబట్టి, ఈ జాబితా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. చట్టబద్దత ఉందా? జంతువులు న్యాయ పరిభాషలో లీగల్ పర్సన్స్ కావు కనుక వీటి పేరుమీద సొంత ఆస్తులు, ధనం ఉండదు. పెంపుడు జంతువంటేనే ఒక ఆస్తి, అందువల్ల మరో ఆస్తిని ఈ ఆస్తికి కట్టబెట్టేందుకు చట్టాలు అంగీకరించవు. అందుకే ఆయా జంతువుల యజమానులు ఏర్పాటు చేసిన ట్రస్టులు ఈ జంతువుల ఆస్తుల నిర్వహణ చేస్తుంటాయి. ఈ సొమ్మును కేవలం సదరు జీవి బాగోగులు చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించాల్సిఉంటుంది. సదరు జంతువు మరణిస్తే ట్రస్టు నిబంధనల ప్రకారం మిగిలిన సొత్తును వినియోగిస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
అత్యంత ప్రత్యేకం.. ప్రళయమొచ్చినా.. లైట్ తీసుకుంటాయ్!
జీవులేవైనా నీరు, ఆహారం వంటివి లేకుండా కొద్దిరోజులు కూడా బతకలేవు. గాలి లేకుంటే కొద్ది నిమిషాలైనా ప్రాణంతో ఉండలేవు. కానీ కంటికి సరిగా కనిపించని ఓ రకం జీవులు మాత్రం.. నీళ్లు, ఆహారం లేకున్నా ఏళ్లకేళ్లు బతికేస్తాయి. అవే టార్డిగ్రేడ్లు. చూడటానికి ఎలుగుబంట్లలా ఉంటాయి కాబట్టి ‘వాటర్ బేర్’ అని కూడా పిలుస్తుంటారు. మరి ఏమిటీ జీవులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ అటు తాబేళ్లు.. ఇటు ఎలుగుబంట్లు భూమ్మీది జీవులన్నింటిలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని బతకగలిగేవి ‘వాటర్ బేర్’లు. నీటిలో ఉండే వీటిని 1777లో జర్మన్ శాస్త్రవేత్త జోహాన్ ఎఫ్రేమ్ గోజ్ గుర్తించారు. తాబేళ్ల (టార్టాయిస్)లా నిదానంగా కదులుతాయి కాబట్టి ‘టార్డిగ్రేడ్స్’ అని పేరుపెట్టారు. ఇక శరీరం ఎలుగుబంటిని పోలి ఉండటంతో ‘వాటర్ బేర్స్’ అని పిలుస్తారు. వీటికి జంతువుల్లా ఎటంటే అటు కదలగలిగే తల, దానిపై గుండ్రని నోరు, ఎనిమిది కాళ్లు ఉంటాయి. సైజు సగటున ఒక మిల్లీమీటర్ మాత్రమే. కానీ 40వేలకుపైగా కణాలు ఉంటాయట. భూమిపై సుమారు 1,300 జాతుల వాటర్ బేర్లు ఉన్నాయని అంచనా. నీళ్లు లేకుండా 30 ఏళ్లు.. సాధారణంగా నీళ్లు లేకుండా.. మనుషులు మూడు రోజుల పాటు మాత్రమే బతకగలరు. ఒంటెలు 15 రోజుల దాకా జీవిస్తాయి. కానీ ‘వాటర్ బేర్’లు ఏకంగా 30 ఏళ్లపాటు నీళ్లు లేకుండా బతుకుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ♦నీళ్లు లేకపోవడం, అత్యంత వేడి పరిస్థితుల్లో టార్డిగ్రేడ్లు ‘యాన్హైడ్రోబయోసిస్’ స్థితిలోకి మారిపోతాయి. అంటే వాటి శరీరాన్ని గుండ్రంగా చుట్టేసుకుని ఒక బంతి రూపంలోకి వస్తాయి. పైన గట్టి కవచం ఏర్పడుతుంది. ఇదే సమయంలో లోపల కణాల్లోని నీటి స్థానంలో గాజు వంటి ఒక ప్రత్యేకమైన ప్రొటీన్ (గ్లాన్ మ్యాట్రిక్స్) చేరుతుంది. కణాల్లోని భాగాలు, డీఎన్ఏ, ఇతర ప్రొటీన్లు, మెంబ్రేన్ వంటివేవీ ఏమాత్రం దెబ్బతినకుండా గ్లాస్ మ్యాట్రిక్స్ చూసుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియను ‘టన్ స్టేట్’గా పిలుస్తారు. పరిస్థితి అనుకూలంగా మారగానే.. టార్డిగ్రేడ్లు తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తాయి. ఆ కేటగిరీయే.. సెపరేటు! భూమ్మీది జీవజాలంలో అత్యంత ప్రత్యేకమైన ‘ఎక్స్‌ట్రీమోఫైల్స్’ కేటగిరీలో టార్డిగ్రేడ్స్‌ను చేర్చారు. అంటే.. ఎప్పటికీ మంచుతో నిండి ఉండే శీతల పరిస్థితులు, అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన రేడియేషన్, అధిక పీడనం, అంతరిక్షంలోని శూన్యం.. వంటి అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని జీవించగలవని అర్థం. బుల్లెట్నూ తట్టుకుంటాయి టార్డిగ్రేడ్లను గన్‌తో కాల్చినా బతకగలవని కెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు టార్డిగ్రేడ్లను అతి చల్లదనానికి గురిచేసి, అవి ‘టన్’ పరిస్థితికి చేరాక.. బుల్లెట్ల ముందుభాగాన అంటించి వేర్వేరు దూరాల్లోని లక్ష్యాలను కాల్చారు. అందులో కొన్ని బుల్లెట్లపై టార్డిగ్రేడ్లు బతికి ఉండటంతో.. ఎంత ఒత్తిడిని తట్టుకోగలిగాయన్నది తేల్చారు. గంటకు 3వేల కిలోమీటర్ల వేగంతో దూ సుకొచ్చేవాటిని టార్డిగ్రేడ్లు తట్టుకోగలిగినట్టు గుర్తించారు. ప్రళయం వచ్చినా.. ♦టార్డిగ్రేడ్లు భూమ్మీద సుమారు 60 కోట్ల ఏళ్ల కిందటి నుంచే ఉన్నట్టు శాస్త్రవేత్తల అంచనా. అంటే అప్పటికి డైనోసార్లు కూడా పుట్టలేదు. ♦టార్డిగ్రేడ్లు 150 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలనూ తట్టుకోగలవు. 100 సెంటీగ్రేడ్ల వేడికే నీళ్లు మరుగుతాయి. అంటే మరిగే నీటిలోనూ ఇవి బతికగలవు. ♦మనం కాస్త చలికే వణికిపోతాం. అదే టార్డిగ్రేడ్లు మైనస్ 200 డిగ్రీల శీతల పరిస్థితినీ తట్టుకుని.. 30 ఏళ్లకుపైగా జీవంతో ఉండగలవు. ♦ఆక్సిజన్ లేకుండా ‘టన్ స్టేట్’లో ఏళ్లపాటు బతక గలవు. అంతరిక్షంలో శూన్యాన్ని, తీవ్రస్థాయి రేడియేషన్‌ను తట్టుకోగలవు.అందుకే వీటిని ఇటీ వలే అంతరిక్షంలోకి పంపి ప్రయోగం చేశారు. ♦ఇంత ‘గట్టి’ జీవి కావడంతోనే.. ఒకవేళ భూమిపై ప్రళయం వచ్చినా అవి బతికేయగలవని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఓ వీక్నెస్సూ ఉంది! చిత్రమేమిటంటే ఎన్నో కఠిన పరిస్థితులను తట్టుకునే టార్డిగ్రేడ్లు.. నత్తలు విడుదల చేసే జిగురువంటి పదార్థం (స్లైమ్)లో మాత్రం బతకలేవట. ఇటీవల దీనిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. స్లైమ్లో ముంచిన టార్డిగ్రేడ్లలో 34 శాతమే బతికినట్టు గుర్తించారు. -
చచ్చేదాకా బతికేస్తాయి.. వీటి వయసు వందలు, వేల ఏళ్లు!
భూమ్మీద ప్రతి జీవికి ఏదో ఒక సమయంలో మరణం తప్పదు. ముసలితనం వచ్చేసి, శరీరం ఉడిగిపోయి చనిపోవడమో... ఏదో ప్రమాదం, రోగం వంటి కారణాలతో అర్ధాంతరంగా ప్రాణాలు పోవడమో జరగొచ్చు. ఇందులో ప్రమాదం, రోగాలు వంటివేవీ లేకుండా.. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక జీవి ఎంతకాలం బతకగలుగుతుందన్న దానిని దాని ఆయుష్షుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనుషుల ఆయుష్షు గరిష్టంగా 130–150 సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతకుమించి బతికారనిగానీ, బతుకుతారని గానీ చెప్పేందుకు ఆధారాల్లేవు. తాబేళ్లు వంటి జీవులు 250 ఏళ్ల వరకు జీవిస్తాయని గుర్తించారు. కానీ ఎలాంటి ప్రమాదం, రోగాలు వంటివి లేకుంటే.. చావు అనేదే లేకుండా వేలకు వేల ఏళ్లు బతికుండే జీవులు ఉన్నాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ పెద్ద జీవి.. మళ్లీ పిండంగా మారి.. ఇది సముద్రంలో జీవించి ‘టుర్రిటోప్సిస్ డోహ్రిని’ రకం జెల్లీఫిష్. ఉండేది అర సెంటీమీటరే. పారదర్శక శరీరం, సన్నగా వెంట్రుకల్లా ఉండే టెంటకిల్స్‌తో అందంగా కనిపిస్తాయి. అయితే ఈ రకం జెల్లీఫిష్‌లకు వయసు పెరగడం అంటూ ఉండదని, సహజంగా వీటికి చావు లేనట్టేనని అమెరికన్ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. సాధారణంగా ఏ ప్రాణి అయినా దశలు దశలుగా ఎదుగుతూ పూర్తిస్థాయి జీవిగా మారుతుంది. కానీ ఈ జెల్లీఫిష్ ఏదైనా గాయం కావడమో, ఇంకేదైనా సమస్య రావడమో జరిగితే.. తిరిగి పూర్వరూపమైన ‘పాలిప్స్’గా (ఉదాహరణకు పిండం అనుకోవచ్చు) మారిపోతుంది. తర్వాత మళ్లీ జెల్లీఫిష్‌గా ఉత్పత్తి అయి ఎదుగుతుంది. ఎప్పటికీ ఇలా జరుగుతూనే ఉంటుందని, సాంకేతికంగా దానికి సహజ మరణం లేనట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చేపలో, ఇతర సముద్ర జీవులో వీటిని గుటుక్కుమని మింగేస్తాయి. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ జెల్లీఫిష్‌లకు మెదడు, గుండె ఉండవట. ప్రతి కణం.. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ ఈ ఫొటోలో కనిపిస్తున్న మరో సముద్ర జీవి పేరు హైడ్రా. ఒక సెంటీమీటర్ వరకు పెరుగుతుంది. చూడటానికి జెల్లీఫిష్‌లా కనిపించే ఈ జీవి కూడా దాదాపు చావులేనిదే. దీని శరీరం చాలా వరకు మూలకణాలు (స్టెమ్‌సెల్స్)తో నిర్మితమై ఉంటుందట. మూలకణాలకు శరీరంలో ఏ అవయవంగా, ఏ కణాజాలంగా అయినా మారే సామర్థ్యం ఉంటుంది. దనివల్ల హైడ్రాకు గాయాలైనా, ఏ భాగం దెబ్బతిన్నా తిరిగి పునరుత్పత్తి అవుతాయి. అందువల్ల ఈ జీవులకు వృద్ధాప్య ఛాయలే కనబడవు. కానీ చేపలు, ఇతర సముద్ర జీవుల తినేయడం, రోగాలు వంటివాటితో హైడ్రాల పని ముగిసిపోతుంది. మానవ పిండం కూడా తొలిదశలో మూలకణాల సమాహారమే. ఆ కణాలే విభజన చెందుతూ.. వివిధ అవయవాలు, ఎముకలు, కండరాలుగా మారుతాయి. పూర్తిస్థాయి మనుషుల్లో ఎముక మజ్జలో మాత్రమే మూలకణాలు ఉంటాయి. వాటిని వివిధ అవయవాలుగా అభివృద్ధి చేసే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు. వీటి వయసు వందలు, వేల ఏళ్లు.. ఇవి అంటార్కిటికా మహాసముద్రం అడుగున జీవించే ‘గ్లాస్ స్పాంజ్’లు. అత్యంత శీతల పరిస్థితుల్లో, అత్యంత మెల్లగా పెరిగే ఈ జీవులు 10–15 వేల ఏళ్లపాటు జీవిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉండే ‘ఓసియన్ క్వాహోగ్’ రకం ఆల్చిప్పలు. అమెరికా నేషనల్ మ్యూజియం శాస్త్రవేత్తలు 2006లో ఈ రకం ఆల్చిప్పపై పరిశోధన చేసి.. దాని వయసు 507 ఏళ్లు అని గుర్తించారు. 1499వ సంవత్సరంలో అది పుట్టి ఉంటుందని అంచనా వేశారు. ఇది గ్రీన్‌ల్యాండ్ షార్క్. ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోని లోతైన ప్రాంతాల్లో జీవిస్తుంది. ఎనిమిది మీటర్ల పొడవు పెరిగే ఈ షార్క్‌లు 250 ఏళ్లకుపైనే జీవిస్తాయని తొలుత భావించేవారు. అయితే 2016లో వలకు చిక్కిన ఓ గ్రీన్‌ల్యాండ్ షార్క్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. దాని వయసు 392 ఏళ్లు అని తేల్చారు. తాబేళ్లు.. లెక్క తక్కువే.. మనకు స్కూళ్లు, కాలేజీల్లో పాఠాల్లో, ఇతర పుస్తకాల్లో.. భూమ్మీద ఎక్కువకాలం బతికే జంతువు తాబేలు అని చెప్తుంటారు. రెండు వందల ఏళ్లకుపైగా జీవిస్తాయని అంటుంటారు. కానీ వాస్తవంగా.. ఎక్కువకాలం బతికే జీవుల్లో తాబేలు ఓ లెక్కలోకే రాదని శాస్త్రవేత్తలు తేల్చారు. తాబేళ్లలో అన్నింటికన్నా జియాంట్ గలపాగోస్ రకం తాబేళ్లు ఎక్కువ కాలం బతుకుతాయి. వీటిలో ఇప్పటివరకు అధికారికంగా గుర్తించిన అత్యధిక వయసు 192 ఏళ్లు మాత్రమే. అయితే ఈ తాబేళ్లు ఎలాంటి ఆహారం, నీళ్లు లేకున్నా ఏడాదిపాటు బతకగలవని.. వాటి శరీరంలో ఈ మేరకు నిల్వ ఏర్పాట్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎరుపు, తెలుపు రంగులతో పెయింట్ వేసినట్టు అందంగా ఉండే చేపలు కొయి కార్ప్స్. అక్వేరియంలలో పెంచుకునే ఈ చేపలు సాధారణంగా 40 ఏళ్లు జీవిస్తాయని చెప్తారు. కానీ 1977లో జపాన్ తీరంలో పట్టుకున్న ఒక కొయికార్ప్స్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు దాని వయసు 226 ఏళ్లు అని గుర్తించారు. గుండ్రంగా ఉండి, శరీరం చుట్టూ ముళ్లలాంటి నిర్మాణాలు ఉండే సముద్ర జీవి ‘రెడ్సీ ఉర్చిన్’. పసిఫిక్ మహాసముద్రంలో బతికే ఇవి కనీసం 200 ఏళ్లపాటు బతుకుతాయట. తొండలా ఉండే ఈ జీవి పేరు ‘ట్వటరా’. న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే ఇవి. వందేళ్ల వరకు బతుకుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీటికి తలపై మధ్యభాగంలో మూడో కన్ను ఉంటుంది. వృద్ధాప్యం ఎందుకొస్తుంది? జీవుల కణాల్లోని క్రోమోజోమ్‌లపై జన్యువులు, క్రోమోజోమ్‌ల అంచుల్లో సన్నని పోగుల్లాంటి టెలోమెర్లు ఉంటాయి. మన వయసు పెరిగిన కొద్దీ, శరీర కణాలు విభజన చెందినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతినడం, టెలోమెర్ల పరిమాణం తగ్గిపోవడం జరుగుతూ ఉంటాయి. ఒకస్థాయి దాటిన తర్వాత కణాలకు పునరుత్పత్తి చెందే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనితో శరీరం, అవయవాలు బలహీనమై వృద్ధాప్యం వస్తుంది. ఇది సహజ మరణానికి దారితీస్తుంది. ఆయా జీవుల్లో జన్యువుల సామర్థ్యం, ఇతర అంశాల ఆధారంగా వాటి ఆయుష్షు ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కాలం బతకడానికి కారణాలేమిటి? ►వయసు పెరిగినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతింటున్నా.. దానిని తిరిగి మరమ్మతు చేసుకునే సామర్థ్యం కొన్నిరకాల జీవుల్లో ఉంటుంది. వాటిలోని కొన్ని ప్రత్యేకమైన జన్యువులే దీనికి తోడ్పడుతుంటాయి. ►కొన్ని ప్రాణులు అవి జీవించే వాతావరణానికి తగినట్టుగా శరీరంలో మార్పులు చేసుకుంటాయి. కణాజాలాలను పునరుత్పత్తి చేసుకుంటాయి. ఈ క్రమంలో వాటి జీవితకాలం పెరుగుతుంటుంది. ►కొన్నిరకాల షార్కులు, ఎండ్రకాయలు, ఇతర జంతువుల్లో ‘టెలోమెరేస్’ అనే ప్రత్యేకమై ప్రొటీన్ విడుదలవుతుంది. అది కణాల్లో టెలోమెర్లు పొడవు పెరగడానికి తోడ్పడి.. వాటి జీవితకాలం పెరుగుతుంది. ►అత్యంత మెల్లగా ఎదిగే జీవుల్లో చాలా వరకు ఎక్కువకాలం బతుకుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిల్లో తరచూ కణాల విభజన జరగాల్సిన అవసరం లేకపోవడమే దానికి కారణమని చెప్తున్నారు. -
మరో 23 జీవులు అంతరించిపోయాయి
మనుషుల విధ్వంసక చర్యల కారణంగా ఎన్నో జీవులు అంతరించి పోతున్నాయి. ఆ జాబితాలోకి తాజాగా మరో 23 జీవులు చేరాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత డిసెంబర్ 29న తుది ప్రకటన చేయనుంది. అంతరించిపోయిన జాబితాలో పండ్లను తిని జీవించే ఓ రకం గబ్బిలం, పదకొండు రకాల పక్షులు, మంచినీటి ఆల్చిప్పలు, రెండు రకాల చేపలు, పుదీనా జాతికి చెందిన ఓ మొక్క ఉన్నాయని అమెరికా ఇంటీరియర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇన్ని జీవులను ఒకేసారి అంతరించిపోయిన జాబితాలో ప్రకటించడం ఇదే మొదటిసారి అని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మనుషులు సృష్టిస్తున్న కాలుష్యం మూలంగా ఏర్పడిన పర్యావరణ మార్పులు, ఆవాసాల ధ్వంసం కారణంగా ఆ జీవులు మనుగడ కోల్పోవడం వంటి కారణాలతో ఆ జీవులు ఇక కనపడకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల చర్యలు మరిన్ని జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని, వన్యజీవులను కాపాడటానికి మరింత ఉత్సాహంగా, కలసికట్టుగా పనిచేయాలని అమెరికా ఇంటీరియర్ సెక్రటరీ డెబ్ హాలాండ్ అభిప్రాయపడ్డారు. 1970 నుంచి చూస్తే ఉత్తర అమెరికాలోని పక్షుల సంఖ్య 3 బిలియన్ల మేర తగ్గిపోయిందని తెలిపారు. చట్టంతో కాస్త మెరుగు.. అమెరికా అంతరించిపోతున్న జీవుల చట్టం (ఈఎస్ఏ) తీసుకొచ్చిన తర్వాత ఇతర జీవుల మనుగడలో కాస్త మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రక్షించాల్సిన జాబితాలో ఉన్న 54 జీవుల సంతతి సమృద్ధిగా ఉండటంతో వాటిని ఆ జాబితా నుంచి ఇటీవల తొలగించారు. వాటిలో అమెరికన్ పెరిగ్రిన్ ఫాల్కన్, బాల్డ్ ఈగిల్ ఉన్నాయి. మరో 56 జీవులను అంతరించిపోతున్న జాబితా నుంచి ‘ప్రమాదకర’ జాబితాకు తగ్గించారు. అమెరికా వ్యాప్తంగా ఈ జాబితాల్లో ప్రస్తుతం 1,600లకు పైగా జీవులు ఉన్నాయి. ఇక కానరాని.. దేవుడు పక్షి అంతరించిన పోయిన జాబితాలో ఉన్న పక్షుల్లో ఐవరీ బిల్ల్డ్ వడ్రంగి పిట్ట, వీనుల విందైన గొంతు కలిగిన ఓ రకం పిచ్చుక ఉన్నాయి. వడ్రంగి పిట్టను అమెరికా ప్రజలు దేవుడు పక్షిగా పిలుచుకునేవారు. ఆదేశంలోని వడ్రంగి పిట్ట జాతుల్లో ఇది పెద్దది. ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని భారీ వృక్షాలు వీటి ఆవాసం. కలప కోసం, ఇతర అవసరాల కోసం ఆ వృక్షాలను నరికివేయడంతో వడ్రంగి పిట్టలు ఆవాసాలను కోల్పోయాయి. 1944 ప్రాంతంలో ఈశాన్య లూసియానా ప్రాంతంలో చివరిసారిగా ఇది కనిపించింది. ఇక శ్రావ్యమైన గొంతు కలిగిన పక్షుల్లో ఒకటిగా, అత్యంత అరుదైన దానిగా పేరుగాంచిన బాచ్‌మన్స్ వార్బ్లెర్ పిచ్చుక అమెరికాలో 1962లో చివరిసారిగా కనిపించింది. ఈ వలస పిచ్చుక 1981లో క్యూబాలో చివరిసారిగా కనిపించిన తర్వాత మళ్లీ దాని జాడ లేకుండా పోయింది. ఈ రెండింటిని 1967లో తొలిసారిగా అంతరించిపోయే జాబితాలో చేర్చగా.. ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయిన వాటిగా ప్రకటించారు. -
300 కోట్ల ప్రాణులు కనుమరుగు!
మెల్బోర్న్: దాదాపు 300 కోట్ల వన్య ప్రాణులు మరణాలు/వలసలకు ఆస్ట్రేలియాలో చెలరేగిన భీకర కార్చిచ్చు కారణమని తాజా నివేదికలో వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ కసెల్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, బర్డ్ లైఫ్ ఆస్ట్రేలియాలు కలసి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)లు సంయుక్తంగా 11.46 మిలియన్ల హెక్టార్ల పరిధిలోని కార్చిచ్చుతో ధ్వంసమైన అటవీ ప్రాంతం, జనావాసాలపై పరిశోధన నిర్వహించి నివేదికను వెల్లడించాయి. గతంలో 120 కోట్ల వన్య ప్రాణులు చనిపోయినట్లు ఆ నివేదికలో వెల్లడించాయి. అయితే ఆ పరిశోధన పూర్తి స్థాయిలో జరగలేదని, కార్చిచ్చు వ్యాపించిన చోటంతా నిర్వహించిన తాజా పరిశోధనలో దానికి మూడు రెట్ల సంఖ్యలో వన్య ప్రాణులు మరణించినట్లు వేరే ప్రాంతానికి వెళ్లినట్లు వెల్లడైందని పరిశోధకులు చెప్పారు. 143 మిలియన్ల పాలిచ్చే జంతువులు, 246 కోట్ల పాకే జంతువులు, 180 మిలియన్ల పక్షులు, 5.1 కోట్ల కప్పలు మరణించినట్లు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చెప్పింది. ఆధునిక ప్రపంచంలో ఈ స్థాయిలో నష్టం కలిగిన ఘటన కనీవినీ ఎరుగనిదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తెలిపింది. ఎగసిన మంటల నుంచి వన్యప్రాణులు తప్పించుకునే అవకాశం లేదని, తప్పించుకున్నా ఆహారం లేక మరణించి ఉంటాయని, వేరే చోట మనుగడ సాగించలేక కూడా మరణించి ఉండవచ్చని పేర్కొంది. -
ఏ జీవులు ఎప్పుడు పుట్టాయి?
స్కూల్ ఎడ్యుకేషన్ మన భూగోళంపై ఇప్పటివరకు లక్షలాది జీవజాతులు అవతరించాయి. అనేక కారణాలవల్ల వాటిలో కొన్ని జీవజాతులు ఎప్పుడో అంతరించిపోయినా, మిగిలినవి మాత్రం మనుగడ కొనసాగిస్తున్నాయి. మన భూగోళం ఏర్పడి ఇప్పటికి సుమారు 460 కోట్ల సంవత్సరాలు అవుతోందని అంచనా. అయితే భూమి పుట్టిన 110 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 350 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) భూమిపై జీవం ఆవిర్భవించలేదు. భూమి పుట్టిన తర్వాత 210 కోట్ల సంవత్సరాల నుంచి 418 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 42 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) గడచిన కాలాన్ని ‘ప్రథమ జీవ మహాయుగం’ అంటారు. భూగోళంపై అనేక రకాల ఏకకణ జీవులు, బహుకణ జీవులు ఈ యుగంలోనే ఉద్భవించి బాగా విస్తరించాయి. గవ్వలతో (పై పెంకుతో) బతికే జీవులు, వెన్నెముక లేని ప్రాణులు పుట్టింది ఈ దశలోనే. -
జీవితమే వలస..
మనలో చాలా మందికి ప్రయాణం అంటే ఇష్టం. కాస్త ఖాళీ దొరికినా ప్రయాణాలు చేస్తూ ప్రపంచాన్ని చూసేవాళ్లు కోకొల్లలు. మనం జీవితంలో ప్రయాణాన్ని ఒక భాగంగా చూస్తే, కొన్ని రకాల జీవులు మాత్రం ప్రయాణాలే జీవితంగా బతికేస్తుంటాయి. కఠిన వాతావరణ పరిస్థితులకు తట్టుకుని మనుగడ సాగించాలంటే కొన్ని జీవులకు వలసే మార్గం. తమ ఉనికిని కాపాడుకునేందుకు అవి వందలు, వేల మైళ్ల దూరం ప్రయాణిస్తాయి. అలా వలస వెళ్లే జీవుల్లో టాప్-10 జీవులను గుర్తించారు శాస్త్రవేత్తలు. వాటి వైపు ఓ లుక్కేద్దాం రండి..! వైల్డ్ బీస్ట్ జింకల జాతికి చెందిన వైల్డ్ బీస్ట్‌లు వలస వెళ్లే సమయంలో చాలా ధైర్యంతో ఉంటాయి. వీటి వలసకి నిర్దిష్ట సమయం ఉండదు. ఇవి ఒక్కోసారి జీబ్రాలను కూడా తమతో తీసుకెళ్తాయి. పచ్చదనం ఎక్కడుంటే అక్కడికి ఇవి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇతర జంతువుల భాషని అర్థం చేసుకోగలగడం వీటికున్న మరో ప్రత్యేక లక్షణం. ఇవి ఎక్కువగా ఆఫ్రికాలో కనబడతాయి. చిత్రమేమిటంటే వీటి సంఖ్య ఏ ప్రాంతంలో తగ్గితే అక్కడ రాబందులు సంఖ్య కూడా తగ్గుతుంది. ఇసుక కొంగలు ఇవి ఈశాన్య సైబీరియా నుంచి అమెరికాలోని మధ్య పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటాయి. లక్షలకొద్దీ పక్షులు గుంపులుగా ప్రయాణిస్తాయి. మెక్సికో, అరిజోనాలో లోతైన గుంటలు తవ్వి వెచ్చగా ఉండేలా చూసుకుని అందులో విశ్రమిస్తాయి. ఆర్కిటిక్ టెర్న్స్ ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో కనిపించే ఈ పక్షులు ప్రయాణాన్ని ఆస్వాదిస్తాయి. ఉత్తర ధ్రువంలో శీతాకాలం అంటే ఆ సమయంలో దక్షిణ ధ్రువంలో వేసవికాలం అన్నమాట. ఇవి ప్రతి ధ్రువంలో ఎండాకాలం ఉండి చలికాలం ప్రారంభమవగానే ఇంకో ధ్రువానికి వెళ్లిపోతాయి. ఇలా ప్రతి ఏటా ఇవి సుమారు 64,300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. వీటి జీవిత కాలం 30 సంవత్సరాలు. అంటే ఇవి మొత్తం జీవితంలో సుమారు 20 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయన్న మాట. ఇవి తమ జీవితంలో అధిక భాగం ఎగురుతూనే గడుపుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆర్మీ చీమలు అన్ని రకాల జీవులు వలస పోతుంటే తామేమీ తక్కువ తినలేదంటూ ఇవి కూడా వలస వెళ్తాయి. ఆర్మీ చీమల్లోనే 200 రకాల జాతులు ఉండటం విశేషం. ఇవి ప్రత్యేకంగా నివాసాలు ఏర్పరచుకోవు. సైన్యంలా ఓ నిర్దిష్టమైన ఆకారంలో ఏర్పడి అలాగే ఉండిపోతాయి. ఇవి తమ బలమైన దవడలతో పెద్ద సైజు సాలెపురుగులను సైతం ముక్కలుగా చేయగలవు. టూనా చేపలు రెస్టారెంట్లలో ఎక్కువగా వినిపించే ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ఆహార అవసరాల కోసం ఈ చేపను వేటాడతారు. ఇవి ఎక్కువగా వలస వెళ్తుంటాయి. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో అన్ని దేశాల వారు వీటి పెంపకానికి మొగ్గు చూపుతున్నారు. వీటి సంఖ్య ఎక్కువైతే వినాశనం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మోనార్క్ సీతాకోక చిలుకలు పేరుకు తగ్గట్టే వీటిని ప్రయాణంలో ఇతర జాతి సీతాకోక చిలుకల కంటే రాజులనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి సంవత్సరానికి 8,000 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి మరి. అమెరికాలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే ఈ సీతాకోక చిలుకలు చలికాలం మొదలవగానే మెక్సికోకు వలసపోతాయి. మళ్లీ అక్కడ శీతాకాలం మొదలైనపుడు తిరుగుముఖం పడతాయి. సాల్మన్ చేపలు సముద్రాల్లో కనిపించే ఈ చేపల వలసలు నాటకీయంగా ఉంటాయి. ఇవి సముద్రాల్లోంచి స్వచ్ఛమైన నీరుండే నదుల్లోకి వెళ్తాయి. అక్కడ తమకు అపాయకరంగా అనిపించిన జంతువులను చంపేస్తాయి. ఉవ్వెత్తున ఎగిసే నీటిపై గాల్లోకి లేవడం వీటికి చాలా ఇష్టం. వందలాది చేపలు గుంపులుగా కలిసుంటాయి. నీటి ఏనుగు (వాల్స్) ఇవి ఎక్కువగా పసిఫిక్ మహా సముద్రంలో కనిపిస్తాయి. ఈ జీవులు శీతాకాలంలో మంచులోనూ, వేసవికాలంలో రాతి ఉపరితలంపై నివసిస్తాయి. ఇవి అలాస్కా దగ్గర పసిఫిక్‌ను ఆనుకున్న బెరింగ్ సముద్రం నుంచి రష్యా దగ్గర ఉన్న చుక్చీ సముద్రం వరకు ప్రయాణిస్తాయి. వీటిలో మగవాటి కంటే ఆడ జీవులు, చిన్నవి ప్రయాణంలో చురుకుగా ఉంటాయి. ఫ్లయింగ్ ఫాక్సెస్ గబ్బిలం జాతికి చెందిన ఈ జీవిని తెలుగులో చీకురాయి అంటారు. ఇవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే కాలంలో ఇవి శీతల ప్రాంతాలకు వలస వెళ్తాయి. ఫ్లయింగ్ ఫాక్సెస్ ఆహారంకోసం తేనెటీగల్లా పూలలోని మకరందంపై ఆధారపడతాయి. అడవులు, వ్యవసాయం తగ్గిపోవడంతో ప్రస్తుతం వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కొయిలా పక్షుల్లా ఇవి కూడా యూకలిప్టస్ చెట్లపై నివసిస్తాయి. బూడిద రంగు తిమింగలాలు తిమింగలాల్లో ఏ జాతివైనా వలస జీవులే. కానీ వీటికి పిల్లల్ని కనడానికి స్థిరంగా ఉండే నీరు, ఆహారం కోసం చల్లటి నీరు అవసరం. ఈ తిమింగలాలు దాదాపు అంతరించిపోయాయి అనుకున్న సమయంలో ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో తిరిగి కనిపించాయి. ప్రతి సంవత్సరం ఈ తిమింగలాలు చుక్చీ సముద్రం నుంచి మెక్సికన్ సముద్రానికి వలస వెళ్తాయి. ఈ ప్రయాణానికి వాటికి 3-4 నెలల సమయం పడుతుంది. -
కాటేస్తే కానరాని లోకాలకే!
సాక్షి, స్కూల్ ఎడిషన్: పాము కాటుకు మనిషి ప్రాణాలు వదలడం చూశాం... కప్ప నోట్లో కూడా విషం ఉంటుందా? తేలు కొండెంలో విషం ఉంటుందని తెలుసు... సాలె పురుగు కూడా మనిషిని చంపుతుందా?... కింగ్ కోబ్రా విషం చిమ్మితే ఏనుగు లాంటి బలమైన జంతువు కొన్ని గంటల్లోనే చనిపోతుందని తెలుసు... నత్త నుంచి వచ్చే ఒక్క విషపు చుక్కతో 20 మందిని చంపవచ్చా? అంటే మాత్రం అవుననక తప్పదు. ఇలాంటి పది జీవుల గురించి తెలుసుకుందాం.. డార్ట్ ఫ్రాగ్... ఈ కప్ప చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ముదురు నీలం రంగులో ఉండి శరీరం అంతా నల్ల చుక్కలను కలిగి ఉంటుంది. ఈ కప్పలు మధ్య, దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనపడతాయి. ఒక కప్పలో 10 మందిని చంపగలిగేంత విషం ఉంటుంది. ఇవి కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. పుప్ఫర్ ఫిష్... సముద్రాల్లో ఉండే ఈ పుప్ఫర్ ఫిష్ చాలా ప్రమాదకర జీవి. ముదురు నీలం రంగులో బంతి ఆకారంలో ఉండి శరీరం అంతా ముళ్లు ఉంటాయి. ఈ చేపలో దాదాపు 30 మందిని చంపేంత విషం ఉంటుంది. ఈ విషం లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. అయితే అప్పుడే పుట్టిన ఈ చేపలు అంత విషపూరితం కావు. వీటితో చేసే వంటను చైనాలో బాగా తింటారు. ఆ వంటపేరు 'ఫుగు'. తేలు.. బంగారు వర్ణంలో ఉన్న ఈ కొండెం కలిగిన తేలు చాలా చురుకుగా ఉంటుంది. తూర్పు, ఉత్తర ఆఫ్రికాల్లోని ఎడారుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇది కుడితే చాలా నొప్పి ఉంటుంది. అంతేకాదు కుట్టిన వెంటనే సరైన వైద్యం అందకపోతే శరీరంలోని చాలా బాగాలు పనిచేయకుండా పోవడంతోపాటు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కింగ్ కోబ్రా... కింగ్ కోబ్రా 18 అడుగుల పొడవుతో ఎక్కువ విషం కలిగిన పాముగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆఫ్రికన్ ఏనుగును కూడా కొన్ని గంటల్లోనే చంపేంత శక్తి దీని విషానికి ఉంది. ఇది కాటు వేస్తే విపరీతమైన నొప్పి ఉంటుంది. అంతేకాదు వెంటనే వైద్యం అందకపోతే చనిపోవడం ఖాయం. ఇన్‌ల్యాండ్ తైపాన్... ఈ విషపూరిత తైపాన్లు మధ్య ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తాయి. మామూలు కోబ్రాలతో పోల్చితే ఈ పాములు 200 శాతం ప్రమాదకరమైనవి. 100 మందిని చంపగలిగేంత విషం ఈ పాముల్లో ఉంటుంది. అయితే ఇవి మనుషులపై దాడి చేసిన సంఘటనలు చాలా తక్కువ. ఇవి సారవంతమైన నేలలు, రాళ్లల్లో ఎక్కువగా ఉంటాయి. బాక్స్ జెల్లీ ఫిష్... క్యూబిక్ ఆకారంలో ఉండే ఈ జెల్లీ ఫిష్ చాలా ప్రమాదకారి. సముద్ర జీవి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉండే ఈ జెల్లీ ఫిష్ 10 అడుగుల పొడువు ఉంటుంది. ప్రతి వైపు 15 స్పర్శాంగాలు ఉంటాయి. ఒక్కో స్పర్శాంగానికి 5000 జీవకణాలు ఉంటాయి. దీని విషం నరాలు, గుండెపై ప్రభావం చూపుతుంది. సముద్రపు ఒడ్డుకు చేరేలోపు చనిపోతారు. స్టోన్ ఫిష్.. కదలకుండా చూడడానికి రాయిలాగా ఉంటుంది కాబట్టి దీనిని రాయి ఆకారపు చేప (స్టోన్ ఫిష్) అంటారు. పసిఫిక్ సముద్రాల్లో ఈ చేపలు ఎక్కువగా ఉంటాయి. గడ్డకట్టిన మట్టి, బురదలాగా ఉండే చోట ఎక్కువగా ఉంటాయి. ఆహారం కోసం, అవసరమైనప్పుడు తప్ప మరే సమయాల్లో ఇది ఎక్కువగా కదలదు. అయితే నిశితంగా గమనిస్తూ ఉంటుంది. వెనుకభాగంలో వెన్నముక కలిగి ఉంటుంది. దీని విషం కూడా అక్కడే ఉంటుంది. ఈ చేప విషం మాత్రం మనపై పడితే విపరీతమైన నొప్పి ఉంటుంది. వాపు వస్తుంది. కండరాలు పనిచేయకుండా పోతాయి. దాదాపు పక్షవాతం వచ్చినంత పని అవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోతే చనిపోవడం ఖాయం. బ్లూ ఆక్టోపస్... ఆక్టోపస్ కుటుంబంలోనే ఈ బ్లూ ఆక్టోపస్ చాలా చిన్నది. 20 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది కానీ చాలా ప్రమాదకారి. తన ఉమ్మి ద్వారా రెండు రకాల విషాలను బయటకు పంపిస్తుంది. ఒకటేమో ఆహారం అవసరమైనప్పుడు పీతలను వేటాడడానికి, మరొకటి మనుషులను చంపడానికి. వీటి నుంచి వచ్చే 25 గ్రాముల విషంతో 10 మంది చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ విషం మీద పడితే ఎలాంటి నొప్పి ఉండదు. తిమ్మిరిగా ఉంటుంది. వాంతులు అవుతాయి. వికారంగా ఉంటుంది. శ్వాస కూడా సరిగా తీసుకోలేరు. సరైన సమయంలో వైద్యం అందకపోతే ప్రాణం పోయినట్లే. నత్త... పాలరాతి శంకువు ఆకారంలో ఉండే ఈ నత్తలు ఎక్కువగా భారతదేశ సముద్రాల్లో ఉంటాయి. వీటిల్లో ఎంత ప్రమాదకర విషం ఉంటుందంటే ఒక్క చుక్క విషంతో 20 మందిని చంపగలిగేంత. సముద్రాల్లోకి వెళ్లేవాళ్లు అజాగ్రత్తగా ఉంటే వీటికి బలి కావలసిందే. బ్రెజీలియన్ స్పైడర్... బ్రెజీలియన్ వండరింగ్ స్పైడర్ పేరుతో పిలిచే ఈ సాలెపురుగు చాలా డేంజరస్. ఇది ప్రమాదకర విష పూరిత సాలె పురుగుగా 2007లో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. నొప్పి తెలియకుండానే చంపేస్తుంది. దీనిని అరటిపండు సాలెపురుగు (బనానా స్పైడర్)గా కూడా పిలుస్తారు. నాలుగు నుంచి ఐదు అంగుళాల పొడవున్న కాళ్లు, 8 కళ్లు కలిగి ఉంటుంది. అందులో రెండు కళ్లు మాత్రం పొడవుగా ఉంటాయి. అడవుల్లోను, ఇళ్లల్లోనూ, జనసంచారం లేని ప్రదేశాల్లో ఇవి నివాసాలు ఏర్పరుచుకుంటాయి. అయితే ఈ సాలె పురుగులు తమ ఆత్మరక్షణకు మాత్రమే విషాన్ని వెదజల్లుతాయి.