చైనా దురహంకారం ! | India without Kashmir, Arunachal Pradesh in China | Sakshi
Sakshi News home page

చైనా దురహంకారం !

Published Wed, Dec 13 2017 11:38 AM | Last Updated on Wed, Dec 13 2017 11:39 AM

India without Kashmir, Arunachal Pradesh in China - Sakshi

టారొంటో : అమెరికాకు చెందిన అంతర్జాతీయ రీటైల్‌ చైన్‌ లింక్‌ సంస్థ ఒకటి వివాదాస్పదమైన భారత చిత్ర పటం ఉన్న గ్లోబును విక్రయిస్తోంది. ఈ గ్లోబులో జమ్మూ కశ్మీర్‌ను, అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌ నుంచి వేరు చేసి చూపుతోంది. ప్రధానంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనా అంతర్భాగంగా ఈ గ్లోబు చూపుతోంది. అలాగే జమ్మూ కశ్మీర్‌ను స్వతంత్ర ప్రాంతంగా గుర్తించింది.


కెనడాలోని కోస్టాకోలోని ఒక మాల్‌లో ఈ గ్లోబును విక్రయిస్తున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, కశ్మీర్‌లు భారత్‌లో భాగంకావని చూపుతున్న ఈ గ్లోబును కొందరు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


ఇదిలా ఉండగా ఈ గ్లోబ్‌ చైనాలో రూపొందించినట్లు తెలుస్తోంది. గ్లోబ్‌ కింది భాగంలో మేడ్‌ ఇన్‌ చైనా అని రాసిఉండడంతో అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ఈ గ్లోబ్‌పై కెనడాలో స్థిరపడ్డ భారతీయులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లోబ్‌ను తక్షణం అమ్మకాల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ గ్లోబ్‌ గురించి స్పందించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌లకు ట్విటర్‌లో సెటిజన్లు పలు ట్వీట్‌లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement