పెద్దలకు, పిల్లలకు నచ్చే ఆట బొమ్మలు చాలా అరుదు. అలాంటి వాటిలో ఈ ఆర్బూట్ ఎర్త్ ఒకటి. ఇదొక గ్లోబ్ బొమ్మ మాత్రమే కాదు, వర్చువల్ వరల్డ్ జాగ్రఫీ టీచర్ కూడా! ఈ గ్లోబ్‌ను ఐప్యాడ్‌కు లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని వాడాలి. ఈ బొమ్మ ప్యాకేజీ బాక్స్‌లో మొత్తం పది అంగుళాల ఇంటరాక్టివ్ ఏఆర్ వరల్డ్ గ్లోబ్, పాస్‌పోర్ట్, వివిధ స్టాంప్స్, దేశాల జెండాలు, జంతువుల స్టిక్కర్లలతో పాటు ఒక హెల్ప్ గైడ్ ఉంటుంది.
గ్లోబ్‌ను యాప్ ద్వారా ఐప్యాడ్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని, ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నయినా ఎంచుకుంటే, అప్పుడు అది పూర్తి యానిమేషన్ చిత్రాలతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలన్నింటినీ చూపిస్తుంది. ఇందులో జాగ్రఫీకి సంబంధించిన చిన్న చిన్న టాస్క్‌లు కూడా ఉంటాయి.
వాటిని ఈ గ్లోబ్‌తో పాటు ఇచ్చే స్టాంపులు, స్టిక్కర్లతో పూర్తి చేయవచ్చు. ప్రపంచంలోని ఏ దేశాన్ని అయినా ఇట్టే గుర్తుపట్టేలా చిన్నారులకు నేర్పిస్తుంది ఈ గ్లోబ్. మూడు నుంచి ఐదేళ్ల వయసు గల పిల్లలకు ఇదొక మంచి బహుమతి. దీని ధర రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది. వివిధ ఆన్‌లైన్ స్టోర్స్‌లలో దొరుకుతుంది.
(చదవండి: ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!)
Comments
Please login to add a commentAdd a comment