geography
-
జాగ్రఫీ బోధించే గ్లోబ్..!
పెద్దలకు, పిల్లలకు నచ్చే ఆట బొమ్మలు చాలా అరుదు. అలాంటి వాటిలో ఈ ఆర్బూట్ ఎర్త్ ఒకటి. ఇదొక గ్లోబ్ బొమ్మ మాత్రమే కాదు, వర్చువల్ వరల్డ్ జాగ్రఫీ టీచర్ కూడా! ఈ గ్లోబ్‌ను ఐప్యాడ్‌కు లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని వాడాలి. ఈ బొమ్మ ప్యాకేజీ బాక్స్‌లో మొత్తం పది అంగుళాల ఇంటరాక్టివ్ ఏఆర్ వరల్డ్ గ్లోబ్, పాస్‌పోర్ట్, వివిధ స్టాంప్స్, దేశాల జెండాలు, జంతువుల స్టిక్కర్లలతో పాటు ఒక హెల్ప్ గైడ్ ఉంటుంది. గ్లోబ్‌ను యాప్ ద్వారా ఐప్యాడ్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని, ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నయినా ఎంచుకుంటే, అప్పుడు అది పూర్తి యానిమేషన్ చిత్రాలతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలన్నింటినీ చూపిస్తుంది. ఇందులో జాగ్రఫీకి సంబంధించిన చిన్న చిన్న టాస్క్‌లు కూడా ఉంటాయి. వాటిని ఈ గ్లోబ్‌తో పాటు ఇచ్చే స్టాంపులు, స్టిక్కర్లతో పూర్తి చేయవచ్చు. ప్రపంచంలోని ఏ దేశాన్ని అయినా ఇట్టే గుర్తుపట్టేలా చిన్నారులకు నేర్పిస్తుంది ఈ గ్లోబ్. మూడు నుంచి ఐదేళ్ల వయసు గల పిల్లలకు ఇదొక మంచి బహుమతి. దీని ధర రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది. వివిధ ఆన్లైన్ స్టోర్స్‌లలో దొరుకుతుంది. (చదవండి: ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!) -
వాతావరణ హెచ్చరికలకు ఐఎండీ–బీఎస్ఎన్ఎల్ జట్టు
న్యూఢిల్లీ: దేశంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రజల్ని హెచ్చరించేందుకు వీలుగా భారత వాతావరణశాఖ(ఐఎండీ) సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా ప్రజలకు ముందస్తు అలర్ట్స్ పంపేందుకు బీఎస్ఎన్ఎల్తో ఐఎండీ జట్టుకట్టినట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వాతావరణ శాఖ తమకు కచ్చితమైన అలర్ట్స్ పంపడం లేదని ఇటీవల పలు రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శించిన నేపథ్యంలో ఐఎండీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలకు వాతావరణానికి సంబంధించిన అలర్ట్స్ పంపేందుకు ఐఎండీ, బీఎస్ఎన్ఎల్ కలసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ ఓ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఐఎండీ ఓ అలర్ట్‌ను పంపిస్తే.. దాన్ని బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులందరికీ పంపిస్తుంది. ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉంది’ అని చెప్పారు. -
మమ!
పేరుకే ‘మెదక్ జిల్లా’.. నాడు రెవెన్యూ డివిజన్లో 18 మండలాలు నేడు జిల్లా రూపమిచ్చినా.. 14 మండలాలే! జిల్లాల పునర్విభజనలో మెదక్‌కు అన్యాయం ఒకే ఒక్క నియోజకవర్గంతో సరిపెట్టారు! ఇతర జిల్లాల్లోకి సమీప మండలాలు ఇదీ మెదక్ జిల్లా స్వరూపం మెదక్ జిల్లాలో ఆయా నియోజకవర్గాల నుంచి కలిసిన మండలాల వివరాలిలా ఉన్నాయి. మెదక్: మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట (ఇదొక్కటే మెదక్ జిల్లాలోని మండలాలతో ఉన్న నియోజకవర్గం) నర్సాపూర్: కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, శివ్వంపేట గజ్వేల్: తూప్రాన్ దుబ్బాక: చేగుంట నారాయణఖేడ్: పెద్దశంకరంపేట, రేగోడ్ ఆందోలు: టేక్మాల్, అల్లాదుర్గం మెదక్:ప్రజాభీష్టం మేరకే జిల్లాలను ఏర్పాటు చేస్తామన్న పాలకులు.. ఇష్టారీతిన జిల్లాను విభజించి మెదక్‌ను 14 మండలాలకే పరిమితం చేశారు. 18 మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మెదక్‌ను.. జిల్లాగా చేసి 14 మండలాలే మిగల్చడంపై ఈ ప్రాంత వాసుల్లో ఆవేదనను కలిగిస్తోంది. సంగారెడ్డి నూతన జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా, సిద్దిపేటకు నాలుగు పూర్తిస్థాయి నియోజకవర్గాలున్నాయి. మెదక్ జిల్లాలో మాత్రం కేవలం ఒకేఒక్క పూర్తిస్థాయినియోజకవర్గం ఉండగా, మిగతా నియోజకవర్గాల నుంచి పది మండలాలను వేరుచేసి మెదక్‌లో కలిపారు. ఈ విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రం నుంచి మండలాలకు ఉండే దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని..విభజన చేయాల్సి ఉండగా మెదక్ విషయంలో అది జరగలేదన్న విమర్శలున్నాయి. మెదక్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న నాగిరెడ్డిపేట, నర్సాపూర్, నారాయణఖేడ్ మండలాలను మెదక్‌లో కలిపేందుకు అవకాశమున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. జిల్లా కేంద్రం కోసం పోరాటం ఒకప్పుడు మెదక్ నాలుగు జిల్లాలకు సుభాగా ఉండేదని, ఇక్కడి నుంచే పాలన కొనసాగేదని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక జిల్లా కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. చివరకు ఒకే నియోజకవర్గంతో కూడిన జిల్లా ఏ ర్పాటు కావడంపై వారంతా ఆవేదన చెందుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జి ల్లా ఒకచోట, జిల్లా కేంద్రం మరోచోట ఉం దంటే అది ఒక్క మెదక్‌లోనే! దీంతో ఈ ప్రాం తం అన్ని రంగాల్లో వెనకబాటుకు గురైంది. నాటి పాలకులు జిల్లా కేంద్రాన్ని సంగారెడ్డికి తరలించి, హైదరాబాద్‌లో ఉంటూ పాలన కొనసాగించారు. కాగా, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్న సమయంలోనూ ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక జిల్లా కోసం ఆందోళనలు నిర్వహించారు. జిల్లాకు అన్యాయం ఒక నియోజకవర్గంతో పాటు 10 మండలాలను కలిపి మెదక్ కొత్త జిల్లా ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు అతి సమీపంలో ఉన్న మండలాలను సైతం పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. మెదక్ మండలంలో 35 గ్రామ పంచాయతీలు, 12 మధిర గ్రామాలు, 21 గిరిజన తండాలున్నాయి. మెదక్ డివిజన్‌లోనే ఇది అతిపెద్ద మండలం. కాగా, జిల్లా విభజన ప్రారంభం కాగానే మెదక్ మండలంలోని హవేళిఘణాపూర్ను మండలకేంద్రంగా ప్రకటిస్తారని ఈ ప్రాంత ప్రజలు భావించారు. అదీ జరగలేదు. అంతేకాకుండా నర్సాపూర్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలోనే ఉంచాలని, అక్కడి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సైతం కోరుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల ప్రజలు సైతం తమ మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి నర్సాపూర్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్‌లో కలిపితేనే ఈ ప్రాంతానికి ఒక భౌగోళిక స్వరూపం వస్తుంది. ప్రయోజనం శూన్యం 14 మండలాలతో మెదక్‌ను జిల్లాగా ఏర్పాటు చేయడమంటే ఈ ప్రాంత ప్రజలను అవమాన పర్చినట్టే. ఎలాంటి అభివృద్ధి వనరులు ఈ 14 మండలాల్లో లేవు. మెదక్ జిల్లాలో నర్సాపూర్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు నాగిరెడ్డిపేట మండలాలన్ని కలపాల్సిన అవసరం ఉంది. – హర్కార్ మహిపాల్, మ్యాప్స్ అధ్యక్షుడు, మెదక్ అశాస్త్రీయ ఏర్పాటు మెదక్ జిల్లా ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను ఆయా జిల్లాల్లోనే ఉంచుతామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అదీ అమలు కాలేదు. శాస్త్రీయ ప్రకారమే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. – అస్త్రగల్ల బాలరాజ్, ఎంవైఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ -
త్వరలో సాక్షి ఇండియా జియో బీ-2014
జాగ్రఫీలో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం నిర్వహణ అర్హులు 7, 8, 9, 10వ తరగతుల విద్యార్థులు రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ ఈ నెల 20 జనవరి 23న ఫైనల్స్.. విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాక్షి, హైదరాబాద్: పిల్లలూ.. మీరు రోజూ స్కూళ్లో చూసే గ్లోబ్లో అసలు పాములే ఉండని దేశం ఎక్కడుందో గుర్తుపట్టగలరా?.. బంధువులు మరణిస్తే చేతి వేళ్లు కట్ చేసుకునే జాతి ఏంటో చెప్పగలరా?.. ఇలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే పేరుప్రఖ్యాతులతోపాటు బంగారు, వెండి, కాంస్య పతకాలను గెలుచుకునే అవకాశాన్ని సాక్షి మీడియా గ్రూప్ కల్పిస్తోంది. జాగ్రఫీలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఇండియా స్పెల్ బీ భాగస్వామ్యంతో ‘సాక్షి ఇండియా జియో బీ-2014’ పేరిట ప్రత్యేక పోటీని నిర్వహించనుంది. హైదరాబాద్‌లో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. పోటీలో భాగంగా ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, రీజినల్ జాగ్రఫీ, క్లైమటాలజీ, కోస్టల్ జాగ్రఫీ, హిస్టారికల్ అండ్ టైమ్ జాగ్రఫీ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రశ్నల సరళి, విజేతల ఎంపిక విధానాన్ని వివరించేందుకు ఈనెల 14, 15, 16, 17 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు సాక్షి టెలివిజన్‌లో డెమో క్లాస్‌లు ప్రసారం చేస్తారు. ‘ఆధునికత పెరిగే కొద్దీ పిల్లలకు ప్రకృతితో సంబంధం తగ్గిపోతోంది. ప్రకృతిని, భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత భవిష్యత్ తరాలపై ఉంది. అందుకే పిల్లలను ప్రకృతితో అనుసంధానించాలి. అందుకే భూమ్మీది వింతలు, విశేషాలు, ఆధునీకరణ నేపథ్యంలో అవెలా నాశనమవుతున్నాయన్న విషయం తెలిస్తే.. ప్రకతిని, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకే సాక్షి ఇండియా జియో బీ-2014 పోటీని నిర్వహిస్తున్నాం’ అని సాక్షి మీడియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి తెలిపారు. దీని వల్ల విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్‌తోపాటు ప్రకతి పట్ల ప్రేమ పెరుగుతుందన్నారు. జియో బీ పోటీని మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 28న, ప్రీ ఫైనల్స్ జనవరి 10న, ఫైనల్స్ జనవరి 23న జరుగుతాయి. విజేతలకు బంగారు, వెండి, రజత పతకాలతోపాటు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. చివరి తేదీ ఈ నెల 20. రిజిస్ట్రేషన్ రుసుము రూ.100. మరిన్ని వివరాల కోసం 9505551099, 9705199924 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్పాన్సర్ చేస్తోంది. -
త్వరలో సాక్షి ఇండియా జియో బీ-2014
* జాగ్రఫీలో ప్రతిభ గల విద్యార్థుల కోసం నిర్వహణ * అర్హులు.. 8, 9, 10వ తరగతుల విద్యార్థులు * రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ.. ఈనెల 18 * డిసెంబర్ 4న ఫైనల్స్.. విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాక్షి, హైదరాబాద్: పిల్లలూ.. మీరు రోజూ స్కూల్లో చూసే గ్లోబ్లో అసలు పాములే ఉండని దేశం ఎక్కడుందో గుర్తుపట్టగలరా?.. బంధువులు మరణిస్తే చేతి వేళ్లు కట్ చేసుకునే జాతి ఏంటో చెప్పగలరా?.. ఇలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే పేరుప్రఖ్యాతులతోపాటు బంగారు, వెండి, కాంస్య పతకాలను గెలుచుకునే అవకాశాన్ని సాక్షి మీడియా గ్రూప్ కల్పిస్తోంది. జాగ్రఫీలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఇండియా స్పెల్ బీ భాగస్వామ్యంతో ‘సాక్షి ఇండియా జియో బీ-2014’ పేరిట ప్రత్యేక పోటీ నిర్వహించనుంది. హైదరాబాద్ నగరంలో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. పోటీలో భాగంగా ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, రీజినల్ జాగ్రఫీ, క్లైమటాలజీ, కోస్టల్ జాగ్రఫీ, హిస్టారికల్ అండ్ టైమ్ జాగ్రఫీ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రశ్నల సరళి, విజేతల ఎంపిక విధానాన్ని వివరించేందుకు ఈనెల 8, 9, 15, 16 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు సాక్షి టెలివిజన్‌లో డెమో క్లాస్‌లు ప్రసారం చేస్తారు. ‘ఆధునికత పెరిగే కొద్దీ పిల్లలకు ప్రకృతితో సంబంధం తగ్గిపోతోంది. ప్రకృతిని, భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత భవిష్యత్ తరాలపై ఉంది. అందుకే పిల్లలను ప్రకృతితో అనుసంధానించాలి. ప్రకృతి మనకు ఏమి ఇస్తుందో తెలిస్తేనే కదా దాన్ని రక్షించుకోవాలనే ఆలోచన కలుగుతుంది. భూమ్మీది వింతలు, విశేషాలు, అందాలు.. అభివృద్ధి, ఆధునీకరణ నేపథ్యంలో అవెలా నాశనమవుతున్నాయన్న విషయం తెలిస్తే.. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకే సాక్షి ఇండియా జియో బీ-2014 పోటీని నిర్వహిస్తున్నాం’ అని సాక్షి మీడియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఇలాంటి పోటీ నిర్వహించడం ఇదే ప్రథమమన్నారు. ఈ పోటీని రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 10 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. విజేతలకు బంగారు, వెండి, రజత పతకాలతోపాటు సర్టిఫికెట్లు అందజేస్తారు. డిసెంబర్ 4న బంజారాహిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ఫైన ల్స్ జరుగుతాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. చివరి తేదీ ఈ నెల 18. రిజిస్ట్రేషన్ రుసుము రూ.500. పాల్గొనదలచిన వారు వివరాల కోసం 9505551099, 9705123924 నంబర్లలో సంప్రదించవచ్చు. -
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష 2013 ప్రశ్న పేపర్స్
OPTIONAL SUBJECTS PUBLIC ADMINISTRATION (PAPER-II) Time: 3 Hours Max. Marks: 250 INSTRUCTIONS n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Question Nos. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE question from each Section. SECTION-A 1. Attempt the following in about 150 words each. 10 × 5 = 50 a) "The Charter Act of 1853 marked the beginning of parliamentary system in India." Explain. b) "Civil service neutrality is founded on the application of the principles of Rule of Law." Comment. c) "The second generation reforms in the Panchayati Raj institutions have changed Panchayats from an agency of development at local level into a political institution." Discuss. d) "Finance Commission in India performs the job of statistics aggregation." Comment. e) "Planning enables comprehensive and scientific understanding of problems." Examine the statement in the context of planning methodology. 2. a) "Bureaucratic agencies, characterized by established procedures, specialization, leadership, clear objectives, are not ideal to handle disaster management." Examine with reference to the need for administrative flexibility in managing disasters. (In about 250 words) 20 Marks b) "The liberal-democratic ideology of the West influenced the shaping of value premises of the Indian Constitution." Discuss. (In about 250 words) 20 Marks c) "Autonomy to public sector undertakings is a myth." Analyse in the context of the use of government expenditures by politicians who control governments at different levels. (In about 150 words) 10 Marks 3. a) "Laws are enacted without involving the police in the conception stage, with the result implementation of these laws leaves much to be desired." Examine the role of police in protection of children. (In about 250 words) 20 Marks b) "Central Secretariat is the nodal agency for administering the Union subjects and establishing coordination among the various activities of the government." Discuss. (In about 250 words) 20 Marks c) Is there a need to dispense with the Office of the Governor? Examine in the context of coalition governments. (In about 150 words) 10 Marks 4. a) "There is a tendency of centralism in Indian federalism, but it is not because of its institutional framework but because of its socialist goals and centrally devised plan development." Explain the statement in the context of Union-State relationship. (In about 250 words) 20 Marks b) "Use of Information and Communication Technology (ICT) in Panchayat's functions enhances efficiency, transparency and accountability and also induces mass ICT culture." Examine. (In about 250 words) 20 Marks c) "Judicial review of administrative tribunal's decisions defeats the very objective of establishing tribunals." Comment with reference to Central Administrative Tribunal. (In about 150 words) 10 Marks SECTION-B 5. Attempt the following in not more than 150 words each. 10 × 5 = 50 a) "Public Administration today tends to be less public in quantitative terms, but more responsive to public needs than before in qualitative terms." Examine with reference to citizen-centric administration. b) "Performance budgeting failed because it was applied to sectors/ programmes where quantitative evaluation was not feasible." Examine the principles underlying performance budgeting techniques. c) "The design of the Indian Police was to subjugate the Indian People in the aftermath of 1857." Analyse in the context of the Indian Police Act of 1861. d) "Reducing the size (geographical area) of the district will provide relief to the overburdened and overworked collector." Comment. e) "The concept of social audit is more comprehensive than that of traditional audit." Comment. 6. a) "Gandhian model of decentralization is similar to the process of reinventing governance." Analyse in the context of good governance. (In about 250 words) 20 Marks b) "Accounting is the essence of producing promptly and clearly the facts relating to financial conditions and operations that are required as a basis of management." Substantiate the statement in the context of accounting methods and techniques in government. (In about 250 words) 20 Marks c) Explain the important recommendations of V. T. Krishnamachary Committee (1962) on Indian and State Administrative Services and problems of District Administration. (In about 150 words) 10 Marks 7. a) "The 73rd Amendment, it is felt, may accentuate fiscal indiscipline by establishing between States and Local Governments a system of transfers similar to the one in place between the Central and State Governments." (World Bank) Comment. (In about 250 words) 20 Marks b) "Municipal Administration in India faces both structural and operational challenges." Examine in the context of post-74th Amendment Act. (In about 250 words) 20 Marks c) "Self-Help Groups (SHGs) have contributed to a change in the role of rural women in development-from symbolic participation to empowerment." Discuss. (In about 150 words) 10 Marks 8. a) "There is both criminalisation of politics and politicisation of criminals in India." Examine and identify the challenges they cause for law and order administration. (In about 250 words) 20 Marks b) "The basic ethical problem for an administrator is to determine how he/she can use discretionary power in a way that is consistent with democratic values." Comment with reference to corruption in administration. (In about 250 words) 20 Marks c) Justify the constitutional provision to treat certain expenditure as charged upon the Consolidated Fund of India. (In about 150 words) 10 Marks GEOGRAPHY (Paper-II) Time: 3 Hours Max. Marks: 250 INSTRUCTIONS n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Questions No. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE from each section. n Word limit in questions, wherever specified, should be adhered to. n Illustrate your answers with suitable sketches, maps and diagrams, wherever considered necessary. SECTION A 1. On the outline map of India provided to you, mark the location of all of the following. Write in your QCA Booklet the significance of these locations, whether physical/ commercial/ economic/ ecological/ environmental/ cultural, in not more than 30 words for each entry: 2 × 5 = 10 i) Mishmi Hills ii) Lipulekh Pass iii) Beas River iv) Rihand Dam v) Amarnath b) Explain the topographical and structural characteristics of the Siwalik Range. (150 words) 10 c) Discuss the mechanism of Indian Monsoon. (150 words) 10 d) Identify the main industrial clusters of India and account for their development. (150 words) 10 e) Explain the method of delineating crop-association regions with reference to India. (150 words) 10 2. a) Discuss the potentiality and present status of horticulture in the Western and Central Himalaya. (250 words) 20 b) Delineate the coalfields of India and mention their distinctive features. (150 words) 15 c) Explain the role of multinationals in globalization of industries in India. (150 words) 15 3. a) Distributional pattern of industries in India does not provide requisite basis for division of the country into distinct industrial regions. Elaborate. (250 words) 20 b) Discuss the role of institutional factors in shaping the pattern of Indian agriculture. (150 words) 15 c) What do you understand by 'Young India? How can the present state of population composition be converted into an asset for the country? (150 words) 15 4. a) Comment on the feasibility of interlinking of rivers of India and its possible contribution to resolution of water crisis. (250 words) 20 b) Define agricultural productivity. Mention the methods of its measurement and bring out the disparities in its regional distribution. (150 words) 15 c) Discuss the problems in realization of benefits of globalization and liberalization in industrial sector of India. (150 words) 15 SECTION-B 5. For Question Nos. 5(a) to 5(d), write on each in about 150 words and answer Question No. 5(e) as directed therein: a) City-regions as territorial unit for regional planning and development 10 b) Snags in the Food Security Policy of India 10 c) Demographic dividend and its implications on Indian socio-economic environment 10 d) Planning and development of 'Tribal Regions' in India 10 e) On the outline map of India provided to you, mark the location of all of the following. Write in your QCA Booklet the significance of these locations, whether physical / commercial / economic / ecological / environmental / cultural, in not more than 30 words for each entry: 2 × 5 = 10 i) Rajgir ii) Sindri iii) National Highway No.24 iv) Churk v) Indira Gandhi Canal 6. a) Write a note on geopolitics of the Indian Ocean realm. (250 words) 20 b) Comment on the basis of creation of new States in India in 2000. (150 words) 15 c) Enumerate the basic indicators of development and explain their application in identification of the spatial diversity in development in India. (150 words) 15 7. a) Write a note on the emergence of National Settlement System in colonial India and discuss the factors contributing to urbanization in post-independence period. (250 words) 20 b) Define slums and explain their problems. (150 words) 15 c) Discuss the objectives of "Vision 2020" in creation of viable village complex in India for "Inclusive Rural Development" programme. (150 words) 15 8. a) Identify the earthquake-prone zones and suggest strategy for their management. (250 words) 20 b) Describe the impact of linguistic diversity on the development of various regions of India. (150 words) 15 c) Describe how urbanization creates air and water pollution in India. (150 words) 15 -
ఆదరణ పెరుగుతున్న కెరీర్.. కార్టోగ్రాఫర్
ఒక ప్రాంత భౌగోళిక పరిస్థితులను, రూపురేఖలను తెలుసుకోవడానికి ఏకైక ఆధారం.. పటాలు(మ్యాప్స్). దేశాల మధ్య సరిహద్దులు, కొండలు, నదులు, సముద్రాలు, మైదానాలు, పీఠభూములు, నగరాలు, పట్టణాలు, పల్లెలు.. ఇలా భూమిపై ఉండే సమస్తాన్ని కళ్లముందుంచేవి పటాలే. మ్యాప్‌ల రూపకర్తలనే కార్టోగ్రాఫర్లు అంటారు. ఆధునిక కాలంలో ఎన్నో రంగాల్లో పటాల అవసరం ఉంటోంది. విదేశాల్లో డిమాండ్ కలిగిన కార్టోగ్రఫీ కెరీర్ ప్రస్తుతం మన దేశంలోనూ క్రమంగా ఆదరణ పొందుతోంది. అవకాశాలు ఎన్నెన్నో... కార్టోగ్రఫీ కోర్సులను అభ్యసించినవారికి రక్షణ శాఖ, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ), అగ్రికల్చర్ ఇంజనీరింగ్, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, టెలి కమ్యూనికేషన్స్, ఉన్నత విద్య, పరిశోధనా కేంద్రాలు, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, నేషనల్ సర్వే అండ్ మ్యాపింగ్ సంస్థలు, జియోలాజికల్ సర్వే, లాండ్ మేనేజ్మెంట్, ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీసెస్, జాతీయ పార్కులు, ఫారెస్ట్ సర్వీస్, ఐటీ పరిశ్రమ, భూగర్భ గనుల సంస్థలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, రవాణా, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. సర్వేలు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కార్టోగ్రాఫర్ల భాగస్వామ్యం తప్పనిసరి. కంప్యూటర్/మ్యాథమెటికల్/డిజైన్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగంలో సులువుగా రాణించొచ్చు. జియోమాటిక్స్ కన్సల్టెంట్, రీసెర్చ్ ఫెలో, పోస్ట్-డాక్టోరల్ ఫెలో, జీఐఎస్ అనలిస్ట్/కో-ఆర్డినేటర్, మ్యాపింగ్ సైంటిస్ట్, ప్రొఫెసర్, టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్, జీఐఎస్ సేల్స్ మేనేజర్, ఇంటర్నెట్ ప్రొడక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అప్లికేషన్స్ ప్రోగ్రామర్.. ఇలా వివిధ హోదాల్లో పనిచేయొచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: కార్టోగ్రాఫర్లు విధుల్లో భాగంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరగాల్సి ఉంటుంది. ఇందులో శారీరక శ్రమ, ఒత్తిళ్లు అధికం. వీటిని తట్టుకొనేవారే కార్టోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకోవాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎప్పటికప్పుడు వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకోవాలి. అర్హతలు: భారత్‌లో కార్టోగ్రఫీలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ తర్వాత గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించి, పీజీ కూడా పూర్తి చేస్తే మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. బీఎస్సీ జాగ్రఫీ, ఎంఎస్సీ జాగ్రఫీ, ఎంఎస్సీ అప్లయిడ్ జాగ్రఫీ, ఎంఎస్సీ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంఎస్సీ రిమోట్ సెన్సింగ్, ఎంఎస్సీ జియో ఇన్ఫర్మాటిక్స్, ఎంటెక్ జియోఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ జీఐఎస్ వంటి కోర్సులు చేసినవారు కూడా ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. వేతనాలు: కార్టోగ్రాఫర్లకు పని చేస్తున్న సంస్థను బట్టి జీతభత్యాలు అందుతాయి. ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు పొందొచ్చు. కనీసం రెండేళ్ల అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వేతనం ఉంటుంది. కార్పొరేట్ సంస్థలు రూ.లక్షల్లో వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇండియన్ నేషనల్ కార్టోగ్రాఫిక్ అసోసియేషన్ వెబ్సైట్: www.incaindia.org మద్రాస్ యూనివర్సిటీ వెబ్సైట్: www.unom.ac.in అన్నామలై యూనివర్సిటీ వెబ్సైట్: http://annamalaiuniversity.ac.in/ జామియా మిలియా ఇస్లామియా-ఢిల్లీ వెబ్సైట్: www.jmi.ac.in ఉత్కళ్ యూనివర్సిటీ-భువనేశ్వర్ వెబ్సైట్: http://utkaluniversity.ac.in/ -
ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ర్టంలో ఉంది?
1. భారతదేశం ఏ రకమైన శీతోష్ణస్థితిని కలిగి ఉంది? 1) ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి 2) ఖండాంతర్గత శీతోష్ణస్థితి 3) ఉష్ణమండల సముద్ర ప్రభావ శీతోష్ణస్థితి 4) ఏదీకాదు 2. మన దేశంలో పశ్చిమం వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్న నదులు? 1) కృష్ణా, గోదావరి 2) నర్మద, తపతి, మాహి, సబర్మతి 3) గంగా, బ్రహ్మపుత్ర 4) ఏవీ కావు 3. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం? 1) జైసల్మీర్ (రాజస్థాన్) 2) అనంతపురం (ఆంధ్రప్రదేశ్) 3) కచ్ (గుజరాత్) 4) ఏదీకాదు 4. మనదేశంలో నైరుతి రుతుపవన కాలం? 1) జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 2) సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 3) జూన్ నుంచి జూలై వరకు 4) జూలై నుంచి నవంబర్ వరకు 5. ఈశాన్య రుతుపవనాలు (తిరోగమన రుతు పవనాలు) వీచేకాలం? 1) జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 2) సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 3) జూన్ నుంచి జూలై వరకు 4) సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 6. నైరుతి రుతుపవనాల కారణంగా మొదట ఏ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి? 1) తమిళనాడు 2) కేరళ 3) తెలంగాణ 4) ఆంధ్రప్రదేశ్ 7. ఈశాన్య రుతుపవనాలు మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి? 1) పంజాబ్ 2) కేరళ 3) తెలంగాణ 4) ఆంధ్రప్రదేశ్ 8. పస్తుతం హిమాలయాలున్న భూభాగంపై మధ్య మహాయుగంలో ఉన్న సముద్రం? 1) టెథిస్ 2) డూన్ 3) 1,2 4) ఏదీకాదు 9. భారత ద్వీపకల్ప పీఠభూమిని పూర్వం ఏమని పిలిచేవారు? 1) గోండ్వానా పీఠభూమి 2) పామీర్ పీఠభూమి 3) 1,2 4) ఏదీకాదు 10. హిమాలయాలు ఏ రకమైన పర్వతాలు? 1) ముడత పర్వతాలు 2) ప్రాచీన ముడత పర్వతాలు 3) అగ్ని పర్వతాలు 4) నవీన ముడుత పర్వతాలు 11. సిమ్లా పట్టణం ఏ పర్వత శ్రేణిలో ఉంది? 1) కంబన్ శ్రేణి 2) శివాలిక్ శ్రేణి 3) ధౌల్‌దార్ శ్రేణి 4) ఏదీకాదు 12. అరుణాచల్ ప్రదేశ్‌లోని బాహ్య హిమాలయాలను ఏమని పిలుస్తారు? 1) శివాలిక్ కొండలు 2) మిష్మి కొండలు 3) గురుశికార్ కొండలు 4) హిందూకుష్ కొండలు 13. డెహ్రాడూన్ వేసవి విడిది కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది? 1) ఉత్తరప్రదేశ్ 2) హిమాచల్‌ప్రదేశ్ 3) ఉత్తరాఖండ్ 4) జార్ఖండ్ 14. పపంచంలో రెండో అతి ఎత్తై శిఖరం (ఓ2) ఏ పర్వత శ్రేణిలో ఉంది? 1) కంబన్ శ్రేణి 2) శివాలిక్ శ్రేణి 3) ధౌల్‌దార్ శ్రేణి 4) కారకోరం శ్రేణి 15. మడ అడవులు (సుందర వనాలు) ఏ రాష్ర్టంలో ఎక్కువగా ఉన్నాయి? 1) జార్ఖండ్ 2) పశ్చిమ బెంగాల్ 3) ఉత్తరాఖండ్ 4) జార్ఖండ్ 16. ఆరావళి పర్వతాలలో ఎత్తై ఓ2 శిఖరం? 1) అనైముడి 2) దొడ్డబెట్ట 3) గురుశీకార్ పర్వతం 4) ఏదీకాదు 17. ఆరావళి పర్వతాలు ఏ రకమైనవి? 1) అతి పురాతన ముడుత పర్వతాలు 2) ప్రాచీన ముడుత పర్వతాలు 3) అగ్ని పర్వతాలు 4) నవీన ముడుత పర్వతాలు 18. ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ర్టంలో ఉంది? 1) బీహార్ 2) పశ్చిమ బెంగాల్ 3) ఉత్తరాఖండ్ 4) జార్ఖండ్ 19. ఆరావళి పర్వత శ్రేణి ఏ రాష్ర్టంలో ఉంది? 1) బీహార్ 2) రాజస్థాన్ 3) ఉత్తరాఖండ్ 4) జార్ఖండ్ 20. ఊటీ ఏ కొండల్లో ఉంది? 1) శివాలిక్ కొండలు 2) మిష్మి కొండలు 3) గురుశికార్ కొండలు 4) నీలగిరి కొండలు 21. సింధు నది ముఖ్య ఉపనదులు? 1) నర్మద, తపతి, 2) మాహి, సబర్మతి 3) జీలం, చీనాబ్, బియాస్, సట్లేజ్, రావి 4) ఏదీకాదు 22. బహ్మపుత్రానదిని అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏమని పిలుస్తారు? 1) దిహాంగ్ 2) పద్మ 3) మాహి 4) ఏదీకాదు 23. అసోం దుఖఃదాయనిగా అని ఏ నదిని పిలుస్తారు? 1) తపతి 2) సబర్మతి 3) జీలం 4) బ్రహ్మపుత్ర 24. కృష్ణా నది జన్మస్థానం? 1) గంగోత్రి 2) నీలగిరి 3) మహాబలేశ్వర్ 4) ఏదీకాదు 25. సింధు నది జన్మస్థానం? 1) గంగోత్రి 2) నాసిక్త్రయంబకం 3) మహాబలేశ్వర్ 4) మానస సరోవరం 26. అమర్ కంటక్ వద్ద జన్మించే నది? 1) తపతి 2) నర్మద 3) మాహి 4) సబర్మతి 27. తపతి నది జన్మస్థానం? 1) ముల్టాయి 2) నాసిక్త్రయంబకం 3) మహాబలేశ్వర్ 4) మానస సరోవరం 28. ఏ రుతుపవనాల కారణంగా కోరమండల్ తీరంలో అధిక వర్షం కురుస్తుంది? 1) ఈశాన్య రుతుపవనాలు 2) నైరుతి రుతుపవనాలు 3) రెండిటి కారణంగా 4) ఏదీకాదు 29. కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళికను (ఈ్కఅ్క) ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు? 1) 1972 2) 1974 3) 1973 4) 1975 30. మహానది ఏ రాష్ర్టంలో ఎక్కువ దూరం ప్రవహిస్తోంది? 1) పశ్చిమ బెంగాల్ 2) ఒడిశా 3) మహారాష్ట్ర 4) గుజరాత్ 31. బెంగాల్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు? 1) దామోదర్ నది 2) సబర్మతి 3)జీలం 4) బ్రహ్మపుత్ర 32. సుగంధ నూనెను తయారుచేయడానికి ఉపయోగపడే రూసా గడ్డి ఏ జిల్లాలో పండిస్తున్నారు? 1) ఆదిలాబాద్ 2) కరీంనగర్ 3) వరంగల్ 4) నిజామాబాద్ 33. భారతదేశ సగటు అటవీ శాతం? 1) 23.5 2) 24.5 3) 20.55 4) 22.7 34. అడవుల విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, చివరిస్థానంలో ఉన్న రాష్ర్టం? 1) పశ్చిమ బెంగాల్ 2) ఒడిశా 3) మహారాష్ట్ర 4) హర్యానా 35. వైశాల్యం పరంగా అత్యధిక శాతంలో అడవులు గల రాష్ర్టం? 1) పశ్చిమ బెంగాల్ 2) ఒడిశా 3) మహారాష్ట్ర 4) అరుణాచల్‌ప్రదేశ్ 36. మృత్తికా క్రమక్షయం అంటే? 1) సహజ కారణాల వల్ల సారవంతమైన నేలలపైపొర కొట్టుకొని పోవడం 2) సారవంతమైన నేలలు 3) నల్లరేగడి నేలలు 4) ఏదీకాదు 37. ఉష్ణమండల చెర్నోజేమ్ మృత్తికలుగా పేరుగాంచినవి? 1) బంకమట్టి నేలలు 2) ఒండ్రు మట్టి నేలలు 3) నల్లరేగడి నేలలు 4) ఏదీకాదు 38. మౌసమ్ అనేది ఏ భాషా పదం? 1) అరబిక్ 2)ఉర్దూ 3) పర్షియన్ 4) గ్రీక్ 39. మనదేశంలో ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రత (-400 ఇ) ఎక్కడ నమోదైంది? 1) న్యూఢిల్లీ 2) ద్రాస్ (కార్గిల్, కాశ్మీర్) 3) సిమ్లా (హిమాచల్‌ప్రదేశ్) 4) శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్) 40. అత్యధిక వర్షపాతం (1141సెం.మీ) నమోదయ్యే మాసిన్రాం ప్రాంతం ఏ రాష్ర్టంలో ఉంది? 1) మేఘాలయ 2) అరుణాచల్‌ప్రదేశ్ 3) సిక్కిం 4) మిజోరం 41. తమిళనాడులో అత్యధిక వర్షపాతానికి కారణమయ్యే రుతుపవనాలు? 1) తిరోగమన రుతుపవనాలు 2) ఈశాన్య రుతుపవనాలు 3) నైరుతి రుతుపవనాలు 4) 1,2,3 42. పత్తిపంటకు చాలా అనుకూలమైన నేలలు? 1) బంకమట్టి నేలలు 2) ఒండ్రు మట్టి నేలలు 3) నల్లరేగడి నేలలు 4) ఏదీకాదు 43. భంగర్, ఖాదర్ మృత్తికలు గల నేలలు? 1) బంకమట్టి నేలలు 2) ఒండ్రు నేలలు 3) నల్లరేగడి నేలలు 4) ఏదీకాదు 44. మృత్తికా పరిరక్షణ పద్దతులు? 1) కాంటూర్ బండింగ్, ఫర్రోయింగ్, స్ట్రిప్ క్రాపింగ్ 2) విస్తాపన వ్యవసాయం 3) 1,2 4) ఏదీకాదు 45. దక్కన్ లావా నేలలుగా పేరుగాంచినవి? 1) బంకమట్టి నేలలు 2) ఒండ్రు నేలలు 3) నల్లరేగడి నేలలు 4) ఏదీకాదు 46. జనసాంద్రత అనగా? 1) చదరపు కిలోమీటరుకు నివసించే సగటు జనాభా 2) చదరపు మీటరుకు నివసించే సగటు జనాభా 3) చదరపు కిలోమీటరుకు నివసించే జనాభా 4) ఏదీకాదు 47. {పపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపు కుంటాం? 1) జులై 10 2) జులై 9 3) జులై 11 4) జులై 1 48. తెలంగాణలో అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లా? 1) మహబూబ్‌నగర్ 2) కరీంనగర్ 3) వరంగల్ 4) నిజామాబాద్ 49. తెలంగాణ రాష్ర్ట మొత్తం జనాభా? 1) 4 కోట్ల 52 లక్షలు 2) 3 కోట్ల 72 లక్షలు 3) 3 కోట్ల 52 లక్షలు 4) 4 కోట్ల 42 లక్షలు 50. అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా? 1) నిజామాబాద్ 2) కరీంనగర్ 3) వరంగల్ 4) రంగారెడ్డి 51. తెలంగాణలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా? 1) నల్గొండ 2) కరీంనగర్ 3) వరంగల్ 4) నిజామాబాద్ 52. తెలంగాణలో ఎస్టీ జనాభా అధికంగా గల జిల్లా? 1) ఖమ్మం 2) కరీంనగర్ 3) వరంగల్ 4) ఆదిలాబాద్ 53. భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయానికి తోడ్పడే నీటి పారుదల వనరు? 1) బావులు 2)చెరువులు 3) కాలువలు 4) నదులు 54. పెరియార్, మెట్టూరు కాలువలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి? 1) కేరళ 2) కర్ణాటక 3) తమిళనాడు 4) ఏదీకాదు 55. చెరువుల ద్వారా సాగయ్యే భూమి ఏ రాష్ర్టంలో ఎక్కువగా ఉంది? 1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ 3) తమిళనాడు 4) కేరళ 56. కాలువలు, బావుల ద్వారా సాగయ్యే భూమి అత్యధికంగా ఉన్న రాష్ర్టం? 1) ఉత్తరప్రదేశ్ 2) తెలంగాణ 3) తమిళనాడు 4) కేరళ సమాధానాలు: -
భారతదేశం మధ్య నుంచి పోయే రేఖ?
భూగోళశాస్త్రం సౌరకుటుంబం - భూమి సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుని చుట్టూ తిరిగే ఎనిమిది గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, లఘు గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు మొదలైనవాటన్నింటినీ కలిపి సౌరకుటుంబంగా పిలుస్తారు. సూర్యునితోపాటు విశ్వంలో ఉన్న మిలియన్ల కొద్ది నక్షత్రాల కూటమిని ‘గెలాక్సీ’ అంటారు. గెలాక్సీల సముదాయాన్ని పాలపుంత (పాలవెల్లి) లేదా ఆకాశగంగ అంటారు. నక్షత్రాలన్నీ స్వయం ప్రకాశకాలు. సూర్యగోళంలో కేంద్రక సంలీనం ద్వారా అణు సంఘటనం జరిగి నిరంతరంగా ఉష్ణశక్తి విడుదలవుతుంది. ఈ శక్తిని సౌర వికిరణం (సోలార్ రేడియేషన్) అంటారు. సూర్యుని ఉపరితలంపై 6000నిఇ, కేంద్రంలో 10 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. సౌర కుటుంబం ఆవిర్భావం గురించి తెలిపే ముఖ్యమైన సిద్ధాంతాలు: ► నీహారిక (నెబ్యులా) పరికల్పన: ఇమాన్యువల్ కాంట్ ప్రతిపాదించారు. ► గ్రహకాల పరికల్పన: చాంబర్లీన్, మౌల్టన్ ప్రతిపాదించారు. ► విశ్వ ఆవిర్భావ (బిగ్ బ్యాంగ్) సిద్ధాంతం: జార్జెస్ లిమిటియర్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతాలు గ్రహాల పుట్టుక గురించి వివరించాయి. గ్రహాలు (Planets) సూర్యుని చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో గ్రహాలు పరిభ్రమిస్తాయి. ఇవి స్వయం ప్రకాశకాలు కావు. సూర్యకాంతి వీటిపై పడి పరావర్తనం చెందడం వల్ల ప్రకాశిస్తాయి. సౌరకుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. 1. బుధుడు (Mercury), 2. శుక్రుడు (Venus), 3. భూమి (Earth), 4. కుజుడు లేదా అంగారకుడు (క్చటట), 5. గురువు లేదా బృహస్పతి (Jupiter), 6. శని (Saturn), 7. వరుణుడు (Uranus), 8. ఇంద్రుడు (Neptune) (2006 ఆగస్టు 24 వరకు ‘యముడు (Pluto)’ తొమ్మిదో గ్రహంగా ఉండేది. తర్వాత ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ (ఐఏయూ) దీన్ని తొలగించింది.) ఉపగ్రహాలు (శాటిలైట్స్): గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళాలను ఉపగ్రహాలు అంటారు. ఇవి కూడా స్వయం ప్రకాశకాలు కావు. గ్రహాల నుంచి పరావర్తనం చెందిన సూర్యకాంతి వల్ల ఇవి ప్రకాశిస్తాయి. బుధ, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. భూమి, చంద్రుని మధ్య దూరం 3,84,365 కి.మీ. ‘గానిమెడ్’ ఉపగ్రహాలన్నింటిలో పెద్దది. ఇది బృహస్పతి ఉపగ్రహం. శని ఉపగ్రహమైన ‘టైటాన్’ రెండో అతి పెద్ద ఉపగ్రహం. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి 27 1/2 గంటలు పడుతుంది. చంద్రుడి ఆత్మ భ్రమణానికి (తన చుట్టూ తాను తిరగడం) కూడా అంతే సమయం పడుతుంది. అందువల్ల మనం ఎప్పుడూ చంద్రుడి ఒక వైపును మాత్రమే చూడగలుగుతాం. చంద్రుడిని ‘శిలాజ గ్రహం’ అని కూడా పిలుస్తారు. భూమి భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దగా ఉంటుంది. సూర్యుడి నుంచి భూమికి సగటు దూరం 149.5 మిలియన్ కి.మీ. ఇది మారుతూ ఉంటుంది. జూలై 4న 152 మి.కి.మీ. (అపహేళీ), జనవరి 3న 147 మి.కి.మీ.(పరిహేళీ) ఉంటుంది. సూర్యుని నుంచి భూమి మూడో స్థానంలో ఉంటుంది. పరిమాణం దృష్ట్యా గ్రహాల్లో ఐదవది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. భూమి వైపు నిరంతరం ప్రసరించే సూర్యశక్తిని ‘సూర్యపుటం’ అంటారు. భూమి సగటున ఒక చ.సెం.మీ. ఉపరితల విస్తీర్ణానికి రెండు కేలరీల శక్తికి సమానమైన సూర్యపుటాన్ని గ్రహిస్తుంది. దీన్నే ‘సౌరస్థిరాంకం’ అంటారు. భూమి గ్రహిస్తున్న ఈ శక్తిలో పరావర్తనం చెందుతున్న శక్తి శాతాన్ని ‘ఆల్బిడో’ అంటారు. భూమి ఆల్బిడో 30 శాతం. సూర్యపుటం వేసవిలో ఎక్కువగా, చలికాలంలో తక్కువగా ఉంటుంది. భూమి సూర్యపుటం ద్వారా గ్రహిస్తున్న శక్తినంతా తిరిగి దీర్ఘ తరంగాలుగా విశ్వంలోకి పంపిస్తుంది. ఈ ప్రక్రియను ‘భూ వికిరణం’ అంటారు. వాతావరణంలోని కింది పొరలు దీని ద్వారానే వేడెక్కుతాయి. భూ చలనాలు - ఫలితాలు భూభ్రమణం: భూమి తన అక్షంపై తన చుట్టూ తాను పశ్చిమం నుంచి తూర్పునకు గంటకు 1610 కి.మీ. వేగంతో తిరుగుతుంది. దీన్ని ‘భూభ్రమణం’ అంటారు. భూ ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభి ద్వారా గీసిన ఊహారేఖను ‘అక్షం’ అంటారు. భూమి ఒకసారి తనచుట్టూ తాను తిరిగి రావడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు (సుమారు ఒక రోజు) పడుతుంది. భూ భ్రమణం వల్ల రాత్రి, పగలు ఏర్పడతాయి. సముద్రంలో సంభవించే పోటుపాట్లు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయి. భూ పరిభ్రమణం: భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని ‘భూ పరిభ్రమణం’ అంటారు. భూ పరిభ్రమణానికి 365 1/4 రోజులు (ఒక సంవత్సరం) పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల పగలు, రాత్రి వేళల్లో తేడాలు, రుతువులు ఏర్పడుతున్నాయి. భూమి తన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీల్లో భూ మధ్య రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడతాయి. ఆ రెండు రోజుల్లో రాత్రి, పగళ్లు సమానంగా ఉంటాయి. వీటిని ‘విషవత్తులు’ అంటారు. అదేవిధంగా జూన్ 21న కర్కటరేఖపై, డిసెంబర్ 22న మకరరేఖపై సూర్యకిరణాలు లంబంగా పడతాయి. ఈ రెండు రేఖలను ‘ఆయన రేఖలు’ అంటారు. గ్రహణాలు సూర్యగ్రహణం: సూర్యుడు కనపడకుండా భూమికి చంద్రుడు అడ్డువచ్చినప్పుడు ‘సూర్యగ్రహణం’ ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజుల్లోనే సంభవిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపైకి వస్తాయి. చంద్రగ్రహణం: సూర్య కిరణాలు చంద్రునిపై పడకుండా భూమి అడ్డు వచ్చినప్పుడు ‘చంద్రగ్రహణం’ ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజుల్లో సంభవిస్తుంది (అన్ని పౌర్ణమిల్లో ఏర్పడదు). సూర్యుడు, భూమి, చంద్రుడు వరుసగా ఒకే సరళరేఖపై ఉంటాయి. ► బుధుడు: సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం. అత్యంత వేగంగా తిరుగుతుంది. అతి చిన్న గ్రహం. దీనికి ఉపగ్రహాలు లేవు. ► శుక్రుడు: అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. దీన్ని ఉదయతార, వేగుచుక్క, సాయంత్రపు తార అంటారు. దీనికి ఉపగ్రహాలు లేవు. తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. భూమికి అత్యంత దగ్గరగా ఉంటుంది. అత్యధిక పగటికాలం, వేడి ఉండే గ్రహం. ►భూమి: ఎత్తై పర్వత ప్రాంతాలున్న గ్రహం. అంతర గ్రహాల్లో పెద్దది. నీలి వర్ణంలో ఉంటుంది. నీరున్న ఏకైక గ్రహం. అత్యధిక సాంద్రత కలిగి ఉంది. ►అంగారకుడు: ఎరుపు వర్ణంలో ఉంటుంది. అరుణ గ్రహం అంటారు. ► గురుడు: అతి పెద్ద గ్రహం. అతి ఎక్కువ ఉపగ్రహాలున్నాయి. అత్యల్ప పగటి కాలం ఉంటుంది. ►శని: అత్యల్ప సాంద్రత ఉన్న గ్రహం. రెండో పెద్ద గ్రహం. సుందర వలయాలుంటాయి. అందమైన గ్రహం. ►వరుణుడు: శుక్రుడిలా తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. టెలిస్కోప్‌తో కనుగొన్న మొదటి గ్రహం. ►ఇంద్రుడు: శీతల గ్రహం. సూర్యుడికి దూరంగా ఉంది. అక్షాంశాలు - రేఖాంశాలు భూమిపైనున్న ఒక ప్రదేశాన్ని నిర్దిష్టంగా గుర్తించడానికి వీలుగా భూ గోళంపై ఉత్తర చివరన ఒక బిందువును, దక్షిణ చివరన ఒక బిందువును నిర్దారించారు. ఈ ఉత్తర, దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూగోళంపై గీసిన వృత్తాన్ని ‘భూ మధ్య రేఖ’ అంటారు. దీన్నే 0ని అక్షాంశమని పిలుస్తారు. దీనికి ఉత్తరాన ఉన్న అర్ధ భాగాన్ని ఉత్తరార్ధ గోళమని, దక్షిణాన ఉన్న అర్ధ భాగాన్ని దక్షిణార్ధ గోళమని అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా ఒక డిగ్రీ తేడాతో ఉత్తర, దక్షిణ ధ్రువాల వరకు గీసిన వృత్తాలను అక్షాంశ రేఖలంటారు. వీటినే సమాంతర రేఖలని పిలుస్తారు. ఉత్తరార్ధ గోళంలో 90 అక్షాంశాలు, దక్షిణార్ధ గోళంలో 90 అక్షాంశాలుంటాయి. భూ మధ్యరేఖతో కలిపి మొత్తం 181 అక్షాంశాలుంటాయి. 231/2ని ఉత్తర అక్షాంశాన్ని ‘కర్కటరేఖ’ అని, 231/2ని దక్షిణ అక్షాంశాన్ని ‘మకరరేఖ’ అని, 661/2ని డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ‘ఆర్కిటిక్ వలయం’ అని, 661/2ని దక్షిణ అక్షాంశాన్ని ‘అంటార్కిటిక్ వలయం’ అని పిలుస్తారు. ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూ మధ్య రేఖను ఖండిస్తూ భూమిచుట్టూ లంబంగా గీసిన రేఖలను ‘రేఖాంశాలు’ అంటారు. ఇవి ఒక డిగ్రీ అంతరంతో మొత్తం 360 ఉంటాయి. లండన్‌లోని గ్రీనిచ్ మీదుగా వెళుతున్న రేఖాంశాన్ని 0ని రేఖాంశంగా గుర్తించారు. దీన్ని గ్రీనిచ్ రేఖాంశంగా పిలుస్తారు. ఈ ప్రధాన రేఖాంశానికి తూర్పుగా 180, పశ్చిమంగా 180 రేఖాంశాలుంటాయి. 180ని తూర్పు, పశ్చిమ రేఖాంశంగా మాత్రం ఒకటే ఉంటుంది. ఈ రేఖను ‘అంతర్జాతీయ దినరేఖ’ అంటారు. ఇది పసిఫిక్ మహాసముద్రం మీదుగా పోతుంది. ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. కాబట్టి రేఖాంశాలను ‘మధ్యాహ్నరేఖలు’ అని కూడా అంటారు.అక్షాంశ, రేఖాంశాలు రెండూ ఊహారేఖలే. వీటి సహాయంతో భూగోళంపై ఒక ప్రదేశం ఉనికిని సులభంగా గుర్తించవచ్చు. భూమి తన చుట్టూ తాను ఒక డిగ్రీ రేఖాంశం దూరం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. గ్రీనిచ్ రేఖపై ఉండే కాలాన్ని ప్రామాణిక కాలమానంగా (జీఎస్టీ) గుర్తిస్తున్నారు. వివిధ దేశాల్లో ప్రజల సౌకర్యార్థం వివిధ స్థానిక ప్రామాణిక కాలాలను నిర్ణయించారు. భారతదేశం మధ్య నుంచి పోయే 821/2ని తూర్పు రేఖాంశాన్ని దేశంలో కాల నిర్ణయానికి ప్రామాణికంగా తీసుకున్నారు. భారత ప్రామాణిక కాలం జీఎస్టీకి 51/2 గంటలు ముందుంటుంది (821/2నిణ 4 నిమిషాలు = 330 నిమిషాలు = 5.30 గంటలు). మాదిరి ప్రశ్నలు 1. నెప్ట్యూన్పై వాతావరణం దేనికి సమానంగా ఉంటుంది? 1) శని 2) యురేనస్ 3) గురుడు 4) అంగారకుడు 2. భారతదేశంలోని ఏ నగరం ద్వారా 821/2ని తూర్పు రేఖాంశం వెళుతోంది? 1) న్యూఢిల్లీ 2) అహ్మదాబాద్ 3) అలహాబాద్ 4) ముంబయి 3. భూభ్రమణ వేగం ఎంత (కి.మీ./గం.)? 1) 1510 2) 1770 3) 1610 4) 1870 4. భూమికి సూర్యుని తర్వాత అతి దగ్గరగా ఉండే నక్షత్రం? 1) ప్రాక్సిమాసెంటారీ 2) ఆల్ఫాసెంటారీ 3) బెటల్గక్స్ 4) ఆండ్రోమెడా 5. కిందివాటిలో భారతదేశం మధ్య నుంచి పోయే రేఖ? 1) భూమధ్యరేఖ 2) గ్రీనిచ్ రేఖ 3) మకరరేఖ 4) కర్కటక రేఖ 6. భూమధ్య రేఖపై సూర్య కిరణాలు లంబంగా పడే రోజు? 1) డిసెంబర్ 22 2) సెప్టెంబర్ 23 3) జూన్ 21 4) మార్చి 20 7. కిందివాటిలో కాలాన్ని బట్టి వీచే పవనాలు? 1) వ్యాపార పవనాలు 2) రుతు పవనాలు 3) స్థానిక పవనాలు 4) పశ్చిమ పవనాలు 8. పవనాలు, సముద్ర ప్రవాహాల మార్గాల్లో మార్పు సంభవించడానికి కారణం? 1) భూ భ్రమణం 2) భూ పరిభ్రమణం 3) గ్రహణాలు 4) అక్షాంశ, రేఖాంశాలు 9. కిందివాటిలో ‘కవల గ్రహాలు’ ఏవి? 1) భూమి, అంగారకుడు 2) భూమి, శుక్రుడు 3) యురేనస్, శని 4) శని, నెప్ట్యూన్ 10. వేసవిలో 0ని అక్షాంశం వద్ద పగటి ప్రమాణం ఎన్ని గంటలు ఉంటుంది? 1) 24 2) 12 3) 18 4) 6 11. వాతావరణ కింది పొరలు దేని వల్ల వేడెక్కుతాయి? 1) సౌర వికిరణం 2) సూర్యపుటం 3) భూ వికిరణం 4) సౌర స్థిరాంకం 12. భూ ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత ఎంత? 1) 6ని సెల్సియస్ 2) 10ని సెల్సియస్ 3) 13ని సెల్సియస్ 4) 15ని సెల్సియస్ 13. భూమి నుంచి 1000 మీటర్ల ఎత్తుకు వెళితే ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది? 1) 6ని 2) 1ని 3) 8ని 4) 2ని 14. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. 1) లితోస్-శిల 2) ఆట్మోస్ - ఆవిరి 3) హదర్ - నీరు 4) పైవన్నీ సమాధానాలు 1) 2; 2) 3; 3) 3; 4) 1; 5) 4; 6) 2; 7) 2; 8) 1; 9) 2; 10) 2; 11) 3; 12) 3; 13) 1; 14) 4. -
‘ఇండియన్ రూర్’గా పేరొందిన ప్రాంతం
భూగోళశాస్త్రం 1. భారతదేశంలోని ఎత్తై హిమాలయ శిఖరం? ఎ) ఎవరెస్ట్ బి) కాంచనగంగ సి) ఓ2 (గాడ్విన్ ఆస్టిన్) డి) దవళగిరి 2. మయూరాక్షి కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) బీహార్ బి) ఉత్తరప్రదేశ్ సి) తమిళనాడు డి) పశ్చిమ బెంగాల్ 3. కింది వాటిలో అంతర్జాతీయ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏది? ఎ) భాక్రానంగల్ బి) దామోదర్ వ్యాలీ సి) హిరాకుడ్ డి) కోసి ప్రాజెక్ట్ 4. అత్యధిక రోడ్ల సౌకర్యం ఉన్న రాష్ట్రం? ఎ) తమిళనాడు బి) గుజరాత్ సి) మహారాష్ట్ర డి) పంజాబ్ 5. దిల్వారా దేవాలయం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఎ) హిమాలయ బి) ఆరావళి సి) సహ్యద్రి డి) సాత్పురా 6. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎ) న్యూఢిల్లీ బి) ముంబై సి) హైదరాబాద్ డి) బెంగళూరు 7. తపాల శాఖ గ్రీన్ చానల్ ప్రధాన ఉద్దేశం? ఎ) స్థానిక ఉత్తరాల బట్వాడాను వేగవంతం చేయడం బి) రాష్ట్ర రాజధానుల మధ్య హాట్ మెయిల్ సదుపాయం కల్పించడం సి) వ్యాపార సంస్థల ఉత్తరాలను వేగంగా బట్వాడా చేయడం డి) మనియార్డర్ల బట్వాడా వ్యవస్థను ప్రజలకు తక్కువ సేవా రుసుంతో అందించడం 8. మన దేశంలో అతిపెద్ద పరిశ్రమ? ఎ) సిమెంట్ బి) ప్లాస్టిక్ సి) సాఫ్ట్వేర్ డి) వస్త్ర 9. ఏ ఖనిజ ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది? ఎ) అభ్రకం బి) ఇనుము సి) మాంగనీసు డి) మోనజైట్ 10. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఎ) 1970 బి) 1971 సి) 1972 డి) 1973 11. మన దేశంలో ప్రధాన రబీ పంట? ఎ) మొక్కజొన్న బి) గోధుమలు సి) జొన్నలు డి) వరి 12. నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి మొదటగా అత్యంత ప్రాధాన్యమిచ్చిన పంచవర్ష ప్రణాళిక? ఎ) 4వ బి) 6వ సి) 8వ డి) 5వ 13. విస్తీర్ణంలో అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం? ఎ) పాండిచ్చేరీ బి) చండీగఢ్ సి) లక్షద్వీప్ డి) దాద్రానగర్ హవేలీ 14. తక్కువ ఎరువులు వాడి, ఎక్కువ దిగుబడి పొందడానికి అనుకూల మృత్తికలు? ఎ) నల్లరేగడి నేలలు బి) ఓండ్రు నేలలు సి) ఎర్రమట్టి నేలలు డి) లేటరైట్ నేలలు 15. ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా నమోదైంది? ఎ) 1901-11 బి) 1911-21 సి) 1921-31 డి) 1931-40 16. భారతదేశంలో వ్యవసాయానికి అతి ముఖ్యమైన నీటి పారుదల వ్యవస్థ? ఎ) కాలువలు బి) బావులు సి) చెరువులు డి) పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా 17. {పపంచ భూభాగంలో భారతదేశ విస్తీర్ణత శాతం? ఎ) 2.42 బి) 3.26 సి) 1.74 డి) 4.28 18. కింది వాటిలో సరికాని జత? ఎ) తమిళనాడు-కోరమాండల్ తీరం బి) ఆంధ్రప్రదేశ్-సర్కార్ తీరం సి) ఒడిశా-కొంకణ్ తీరం డి) కేరళ-మలబార్ తీరం 19. నైరుతి రుతుపవన కాలం? ఎ) మార్చి-ఆగస్ట్ బి) ఏప్రిల్-జూలై సి) మే-అక్టోబర్ డి) జూన్-సెప్టెంబర్ 20. మంచి గంధం చెట్లు ఏ అడవుల్లో పెరుగుతాయి? ఎ) సతతహరితారణ్యాలు బి) ఆకురాల్చు అడవులు సి) అల్ఫైన్ అడవులు డి) ఉష్ణమండల అరణ్యాలు 21. ఐఎస్టీ (ఐఖీ-భారత ప్రామాణిక సమయం)ని నిర్ధారించడానికి ఏ రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు? ఎ) 5 1/20 తూర్పు రేఖాంశం బి) 82 1/20 తూర్పు రేఖాంశం సి) 5 1/20 పశ్చిమ రేఖాంశం డి) 82 1/20 పశ్చిమ రేఖాంశం 22. దేశ తీరరేఖ పొడవు (కి.మీ.లలో)? ఎ) 6,100 బి) 5,200 సి) 6,650 డి) 5,872 23. మెక్‌మోహన్ రేఖ ఏయే దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయిస్తుంది? ఎ) భారత్-శ్రీలంక బి) భారత్-పాకిస్థాన్ సి) భారత్-చైనా డి) భారత్-బంగ్లాదేశ్ 24. {పపంచంలో ఎత్తై పీఠభూమి? ఎ) లాబ్రాడార్ బి) కొలరాడో సి) పెటగోనియా డి) పామీర్ 25. దొడబెట్ట శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) కేరళ బి) పాండిచ్ఛేరి సి) తమిళనాడు డి) కర్ణాటక 26. {పపంచంలో భారతదేశ జనాభా శాతం ? ఎ) 17.5 బి) 16.8 సి) 18.4. డి) 15.75 27. మన దేశంలో మహిళల అక్షరాస్యత శాతం? ఎ) 58.6 బి) 59.5 సి) 63.4 డి) 65.46 28. కింది వాటిలో నది ఆధార ఓడరేవు? ఎ) చెన్నై బి) తిరువనంతపురం సి) కోల్‌కతా డి) విశాఖపట్నం 29. దేశంలో అతి పొడవైన 7వ నెంబర్ జాతీయ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఎ) కాశ్మీర్-కన్యాకుమారి బి) వారణాసి-కన్యాకుమారి సి) లడఖ్-రామేశ్వరం డి) ఢిల్లీ-రామేశ్వర 30. ‘ఇండియన్ రూర్’గా పేరొందిన ప్రాంతం? ఎ) అహ్మదాబాద్ బి) ముంబై సి) చోటానాగ్పూర్ డి) హుబ్లీ 31. తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లా? ఎ) ఆదిలాబాద్ బి) మహబూబ్‌నగర్ సి) హైదరాబాద్ డి) రంగారెడ్డి 32. విస్తీర్ణంలో అతి పెద్ద రాష్ట్రం? ఎ) ఉత్తరప్రదేశ్ బి) మహారాష్ట్ర సి) రాజస్థాన్ డి) పశ్చిమ బెంగాల్ 33. {పాచీన కాలంలో ఏర్పడిన ఓండ్రు మైదానాలను ఏమని పిలుస్తారు? ఎ) భంగర్ బి) బాభర్ సి) ఖాదర్ డి) టెరాయి 34. మన దేశంలో తీవ్రమైన కరవు ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఎ) 1983 బి) 1987 సి) 1991 డి) 1993 35. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అడవుల విస్తీర్ణత శాతం? ఎ) 20 బి) 23 సి) 24 డి) 29 36. అసోం దుఖఃదాయని అని ఏ నదీని పిలుస్తారు? ఎ) దామోదర్ బి) బ్రహ్మపుత్ర సి) సట్లేజ్ డి) మహానది 37. కింది వాటిలో సరికాని జత? ఎ) శ్వేత విప్లవం-పాలు బి) హరిత విప్లవం-సంకరజాతి విత్తనాలు సి) నీలి విప్లవం-పాల్ట్రీపరిశ్రమ డి) ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్-పాలు 38. దుర్గాపూర్ (పశ్చిమబెంగాల్)లోని ఉక్కు కార్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు? ఎ) అమెరికా బి) బ్రిటన్ సి) రష్యా డి) జర్మనీ 39. దక్షిణ రైల్వే మండలం ముఖ్య పాలనా కేంద్రం? ఎ) సికింద్రాబాద్ బి) చెన్నై సి) బెంగళూరు డి) తిరువనంతపురం సమాధానాలు: 1) సి; 2) డి; 3) డి; 4) సి; 5) బి; 6) ఎ; 7) ఎ; 8) డి; 9) ఎ; 10) ఎ; 11) బి; 12) సి; 13) సి; 14) ఎ; 15)బి; 16) బి; 17) ఎ; 18) సి; 19) డి; 20) బి; 21) బి; 22) ఎ; 23) సి; 24) డి; 25) సి; 26) ఎ; 27) డి; 28) సి; 29) బి; 30) సి; 31) డి; 32) సి; 33) ఎ; 34) బి; 35) ఎ; 36) బి; 37) సి; 38) డి; 39) బి గత పోలీస్ కానిస్టేబుట్/ ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు 1. నీలి విప్లవం అంటే? ఎ) వాణిజ్య పంటల ఉత్పత్తి బి) నీలి మందు ఉత్పత్తి సి) నీలి లోహ ఉత్పత్తి డి) చేపల ఉత్పత్తి 2. భారత రైల్వే కర్మాగారం డీజిల్ విభాగం ఎక్కడ ఉంది? ఎ) పెరంబూర్ బి) పాటియాల సి) వారణాసి డి) కపుర్తల 3. కింది వాటిలో ఏ పంటకు ఒక హెక్టారుకు ఎక్కువ నీరు అవసరం? ఎ) చెరకు బి) గోధుమలు సి) మొక్కజొన్న డి) బార్లీ 4. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత శాతం పెరిగింది? ఎ) 17.19 బి) 16.64 సి) 18.12 డి) 17.64 5. ఇందిరాసాగర్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఎ) మహానది బి) చంబల్ నది సి) నర్మద డి) యమున 6. ఎకఖీ, ఐఖీ మధ్య ఎంత సమయం తేడా (గంటల్లో)? ఎ) 61/2 బి) 4 సి) 41/2 డి) 51/2 7. కాకతీయ కాలువ ఏ నీటి ప్రాజెక్ట్‌లో భాగం? ఎ) నాగార్జునసాగర్ బి) తెలుగు గంగ సి) శ్రీరామ్ సాగర్ డి) ప్రాణహిత-చెవేళ్ల 8. ఏ నదీ లోయలో బొగ్గు నిల్వలు విస్తారంగా లభిస్తాయి? ఎ) బ్రహ్మపుత్ర బి) నర్మద సి) కావేరీ డి) దామోదర్ 9. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఎ) ముంబై బి) చెన్నై సి) పుణే డి) అహ్మదాబాద్ 10. మౌంట్ అబు ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) రాజస్థాన్ బి) బీహార్ సి) కేరళ డి) తమిళనాడు 11. కింది వాటిలో వార్షిక ఉష్ణోగ్రత అంతరం అధికంగా గల నగరం? ఎ) కోల్‌కతా బి) ఢిల్లీ సి) హైదరాబాద్ డి) కొచ్చిన్ 12. కింది వాటిలో ప్రధానంగా బావుల ద్వారా వ్యవసాయం చేసే ప్రాంతం? ఎ) ఉత్తర కోస్తా ఆంధ్రా బి) దక్షిణ కోస్తా ఆంధ్రా సి) రాయలసీమ డి) తెలంగాణ సమాధానాలు: 1) డి; 2) బి; 3) ఎ; 4) డి; 5) సి; 6) డి; 7) సి; 8) డి; 9) ఎ; 10) ఎ; 11) బి; 12) డి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్-1లో జాగ్రఫీ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో విశ్లేషణ ఇవ్వండి? -పి.శ్రీవాణి, విద్యానగర్ గతంలో కంటే 2013లో జాగ్రఫీ, పర్యావరణం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈ విభాగాల నుంచి 27 ప్రశ్నలు అడిగారు. వర్తమాన అంశాలకు సంబంధించిన ప్రశ్నలు రాలేదు. బేసిక్స్ అంశాలపై కచ్చితమైన అవగాహన ఉన్నవారు, లాంగ్‌టర్మ్ ప్రిపరేషన్ ఉన్నవారు మాత్రమే సమాధానాలు గుర్తించేలా ఉన్నాయి. 2013లో వచ్చిన ప్రశ్నలు రెండు విధాలుగా ఉన్నాయి. 1. పర్యావరణానికి సంబంధించిన బేసిక్ అంశాలు. 2. పర్యావరణంతో ముడిపడిన జాగ్రఫీ అంశాలు. విపత్తు నిర్వహణపై ఎలాంటి ప్రశ్నలు రాలేదు.2013లో వర్తమాన అంశాలకు సంబంధించి ప్రశ్నలు రానంత మాత్రాన ఈసారి ఇలాగే ఉంటుందని చెప్పలేం. తప్పనిసరిగా సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ జాగ్రఫీని చదవాల్సిందే. ఇన్పుట్స్: గురజాల శ్రీనివాసరావు(జాగ్రఫీ), సీనియర్ ఫ్యాకల్టీ బ్యాంక్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షల్లో జనరల్ ఇంగ్లిష్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే ఏయే అంశాలపై పట్టు సాధించాలి? - ఎం.మాధవి, మధురానగర్ బ్యాంక్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వేస్ వంటి పరీక్షల్లో తప్పనిసరి విభాగం జనరల్ ఇంగ్లిష్. ఇవేకాకుండా దేశవ్యాప్తంగా జరిగే వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లోనూ జనరల్ ఇంగ్లిష్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. ఇంగ్లిష్‌లో ముఖ్యంగా.. గ్రామర్, వొకాబ్యులరీ, అసంపూర్ణంగా ఉన్న వాక్యాలను పూరించడం, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, కాంప్రహెన్షన్ ఆఫ్ ప్యాసేజ్, తప్పులను గుర్తించడం, ఖాళీలను పూరించడం, ప్రిపోజిషన్స్, జాతీయాలు/సామెతలు, అక్షర దోషాలు, పదాలను సరైన క్రమంలో అమర్చడం వంటివాటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంగ్లిష్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే ఏకైక మార్గం.. వీలైనంత మేర సిలబస్‌లోని అన్ని అంశాలను ప్రాక్టీస్ చేయడం. ముందుగా మీరు ఏ పరీక్ష అయితే రాయాలనుకుంటున్నారో ఆ పరీక్షకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను సేకరించి.. ప్రశ్నల సరళిని పరిశీలించాలి. ఏయే అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారో గమనించాలి. తర్వాత వాటిని సాధన చేయాలి. వివిధ వెబ్‌పోర్టల్స్ అందించే ఆన్లైన్ మాక్ టెస్టులను రాయాలి. దీనివల్ల పరీక్షల ముందు మీకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం, టీవీలో వార్తలు చూడటం వల్ల వాక్య నిర్మాణం, స్పెల్లింగ్ వంటి అంశాలు తెలుస్తాయి. అదేవిధంగా రెన్ అండ్ మార్టిన్.. హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ బుక్ ఇంగ్లిష్‌లో ప్రాథమిక అంశాలను, గ్రామర్‌ను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీటితోపాటు మ్యాగజైన్లు, ఇతర మాధ్యమాల ద్వారా మోడల్ పేపర్లను సాధన చేయాలి. అందుబాటులో ఉన్న సమయంలో వీలైనంత వరకు ప్రాక్టీస్ చేస్తే జనరల్ ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించొచ్చు. రిఫరెన్స్ బుక్స్: ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్ - ఆర్ఎస్ అగర్వాల్, వికాస్ అగర్వాల్ (ఎస్.చంద్ ప్రచురణ) ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ - హరిమోహన్ ప్రసాద్, ఉమారాణి సిన్హా (టాటా మెక్‌గ్రాహిల్ ఎడ్యుకేషన్ ప్రచురణ) ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ ఫోర్త్ ఎడిషన్ - ఎడ్గర్ థోర్ప్ (పియర్సన్ ప్రచురణ) ఇన్పుట్స్: కె. లలితాబాయ్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లిష్, హైదరాబాద్. -
గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
డైట్‌సెట్ - 2014 భూగోళశాస్త్రం బొమ్మనబోయిన శ్రీనివాస్ సీనియర్ ఫ్యాకల్టీ, హన్మకొండ 1. భూమికి అతిదగ్గరగా ఉన్న నక్షత్రం? సూర్యుడు 2. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టేకాలం? 8 నిమిషాలు 3. యురేనస్, నెఫ్ట్యూన్, ఫ్లూటోలకు మరో పేరు? యురేనస్‌ను వరుణ గ్రహమని, నెప్ట్యూన్‌ను ఇంద్రగ్రహమని, ఫ్లూటోను యముడు అని పిలుస్తారు 4. సూర్యుడి నుంచి దూరంలో 3వ స్థానంలో ఉండే గ్రహం? భూమి 5. అతి ఎక్కువ ఉపగ్రహాలున్న గ్రహం? శని 6. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమని పిలుస్తారు? పాలవెల్లి (ఆకాశగంగ) 7. సూర్యగోళం భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది? 1.3 మిలియన్లు 8. సూర్యగ్రహంపై ఉష్ణోగ్రత ఎంత? సూర్యుని ఉపరితలంపై 6000ని సెంటి గ్రేడ్, కేంద్రంలో 10 లక్షల డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది 9. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం? బుధుడు 10. భూమి, సూర్యుని నుంచి సగటున ఎంత దూరంలో ఉంది? 149.5 మిలియన్ల కి.మీ. 11. ఉపగ్రహాలు లేని గ్రహాలు? బుధుడు, శుక్రుడు 12. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం? చంద్రుడు 13. చంద్రునికి, భూమికి మధ్య సగటు దూరం? 3,84,365 కి.మీ. 14. సూర్య కుటుంబంలో అంతర గ్రహాలుగా వేటిని పిలుస్తారు? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు (కుజుడు) 15. {Vహాలన్నింటిలో అతిపెద్ద గ్రహం? గురుడు (బృహస్పతి/జుపిటర్) 16. {Vహాల పరిమాణంలో భూమి ఎన్నోది? 5వది 17. {Vహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు? చాంబర్లీన్, మౌల్టన్ 18. సౌరకుటుంబంలో తిరిగే శిలాశకలాలను ఏమని పిలుస్తారు? లఘుగ్రహాలు (ఆస్ట్టరాయిడ్స) 19. భూమిపై రాత్రి, పగలు దేనివల్ల ఏర్పడతాయి? భూభ్రమణం 20. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే సమయం? 23 గం. 56 నిమిషాల 4.09 సెకన్లు 21. భూ పరిభ్రమణం వల్ల ప్రధానంగా భూమిపై జరిగే పరిణామం? రుతువులు ఏర్పడడం 22. భూ పరిభ్రమణానికి పట్టే కాలం? 365 1/4 రోజులు 23. భూమి, సూర్యుడికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని ఏమంటారు? అపహేళి (ఇది జూలై 4న సంభవిస్తుంది) 24. సూర్యుడు, భూమికి మధ్య అత్యల్ప దూరం ఉండే స్థితిని ఏమంటారు? పరిహేళి (జనవరి 3న ఏర్పడుతుంది) 25. విషవత్తులు అంటే? భూమధ్య రేఖపై సూర్యకిరణాలు లంబం గా పడే రోజుల్లో రాత్రి, పగటి సమయాలు సమానంగా ఉంటాయి. మార్చి 21, సెప్టెంబరు 23 తేదీల్లో ఈవిధంగా ఉంటుంది. ఈ రెండు రోజులను విషవత్తులు అంటారు. 26. ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభి ద్వారా గీసిన ఊహారేఖను ఏమంటారు? అక్షం 27. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష్య అంటారు. ఆ కక్ష్య పొడవు? 965 మిలియన్ కి.మీ. 28. కర్కట, మకర రేఖలపై సూర్యకిరణాలు లంబంగా ఎప్పుడు పడతాయి? సూర్యకిరణాలు కర్కటరేఖ ప్రాంతంలో జూన్ 21న, మకర రేఖ ప్రాంతంలో డిసెంబరు 22న లంబంగా పడతాయి 29. భూ ఉపరితలం నుంచి భూమిలోపలికి వెళ్లే కొద్దీ ప్రతి 32 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుంది? 1ని సెంటిగ్రేడ్ 30. భూ వ్యాసార్ధం ఎంత? 6440 కి.మీ. 31. భూ నాభి వద్ద సుమారుగా ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? 6000ని సెంటిగ్రేడ్ 32. భూ ఉపరితలంపైనున్న పొరను ‘సియాల్(Sia)’ అంటారు. ఈ పొరలో ఏ రసాయనాల మిశ్రమం ఉంటుంది? సిలికా (i), అల్యూమినియం(A) 33. సియాల్ కింద ఉన్న పొరను ఏమంటారు? సియాల్ కింద ఉన్న పొరను ‘సిమా (Sima)’గా పిలుస్తారు. ఈ పొరలో సిలికా (Si), మెగ్నీషియమ్ (Mg)ల మిశ్రమం ఉంటుంది 34. నిఫె పొరలో వేటి మిశ్రమం ఉంటుంది? సియా కింది పొరను ‘నిఫె(Nife)’ అంటారు. దీనిలో నికెల్ (Ni), ఇనుము (Fe)ల మిశ్రమం ఉంటుంది. 35. భూమి లోపలికి పోయేకొద్దీ ఉష్ణోగ్రత, పీడనంలో మార్పులు? పెరుగుతాయి 36. భూగోళాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించే రేఖ? భూమధ్య రేఖ (0ని అక్షాంశ రేఖ) 37. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖలను ఏమంటారు? అక్షాంశాలు 38. 23బీని ఉత్తర అక్షాంశరేఖను, 23బీని దక్షిణ అక్షాంశ రేఖను ఏమని పిలుస్తారు? ర్కటరేఖ, మకరరేఖ 39. భూగోళంపై ఎన్ని రేఖాంశాలుంటాయి? 360. వీటిని మధ్యాహ్న రేఖలని కూడా పిలుస్తారు. 40. లండన్‌లో ‘గ్రీనిచ్’ మీదుగా పోయే రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ఇది ఎన్ని డిగ్రీల రేఖాంశం? 0ని రేఖాంశం 41. భూమి తన చుట్టూ తాను 1ని దూరం తిరగడానికి పట్టే కాలం? 4 నిమిషాలు 42. సూర్యుడు, చంద్రుడు, భూమి వరుసగా ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు ఏర్పడే గ్రహణం? సూర్య గ్రహణం. ఇది అమావాస్య రోజుల్లో ఏర్పడుతుంది. 43. సూర్యుడు, భూమి, చంద్రుడు వరుసగా ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు ఏర్పడే గ్రహణం? చంద్రగ్రహణం. ఇది పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది. 44. {పచ్ఛాయ, పాక్షిక ఛాయ అంటే ఏమిటి? భూమిలో సగం మాత్రమే సూర్యుడికి ఎదురుగా ఉంటుంది. మిగతా సగభాగం తన నీడలోనే ఉండి చీకటిగా ఉంటుంది. ఆ నీడ భాగాన్ని ‘ప్రచ్ఛాయ (్ఖఝఛట్చ)’ అంటారు. ఆ నీడ చుట్టూ ఉన్న భాగాన్ని ‘పాక్షిక ఛాయ (్క్ఛఠఝఛట్చ)’ అంటారు. 45. భూమివైపు నిరంతరం ప్రసరించే సూర్య శక్తిని ఏమంటారు? సూర్యపుటం 46. భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం అవుతున్న శక్తి శాతాన్ని ఏమంటారు? ఆల్బిడో 47. సూర్యుని నుంచి నిరంతరం విడుదల చేసే శక్తిని ఏమంటారు? సౌరవికిరణం 48. సూర్యుని వ్యాసం, భూమి వ్యాసం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 100 రెట్లు 49. భూమి సగటున ఒక చ.సెం.మీ. ఉపరితల విస్తీర్ణానికి నిమిషానికి ఎన్ని కేలరీల శక్తికి సమానమైన,సూర్యపుటాన్ని గ్రహిస్తుంది? 2 కేలరీలు 50. భూమి ఆల్బిడో ఎంత? 30 శాతం 51. భూమి ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత? 13ని సెల్సియస్ 52. ఒక ప్రదేశం ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తారు? ఉష్ణమాపకం ద్వారా 53. ఒకే ఉష్ణోగ్రతలున్న ప్రదేశాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? సమోష్ణోగ్రత రేఖలు 54. భూమధ్యరేఖ నుంచి దూరంగా పోయే కొద్దీ పగటి ప్రమాణంలో జరిగే మార్పు? పెరుగుతుంది 55. వేసవి కాలంలో 0ని అక్షాంశం (భూమధ్య రేఖ) వద్ద పగటి ప్రమాణం ఎంత? 12 గంటలు 56. వేసవిలో 90ని అక్షాంశం వద్ద పగటి ప్రమాణం ఎంత? ఆరు నెలలు 57. అపహేళి సమయంలో (జూలై 4) భూమి నుంచి సూర్యుని దూరం ఎంత? 152 మిలియన్ కి.మీ. 58. పరిహేళి సమయంలో (జనవరి 3) భూమి నుంచి సూర్యుడి దూరం ఎంత? 147 మిలియన్ కి.మీ. 59. వాతావరణం కింద ఉండే పొరలు ఎలా వేడెక్కుతాయి? భూవికిరణం ద్వారా 60. మిస్ట్రాల్, బోరా అనేవి? శీతల పవనాలు 61. ఎడారుల్లో వీచే ఉష్ణ పవనాలను ఏమంటారు? ఫాన్, ఛినూక్ 62. భూమిపై నుంచి సగటున ప్రతి వేయి మీటర్ల ఎత్తుకు పోయేకొద్దీ ఎన్ని సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది? 6ని సెంటిగ్రేడ్. దీన్ని సాధారణ క్షీణతా క్రమం అంటారు. 63. వాతావరణ పీడనాన్ని ఎలా కొలుస్తారు? భారమితితో 64. వాతావరణ పీడన విస్తరణను ఏ రేఖల ద్వారా చూపుతారు? సమభార రేఖలు 65. పొడిగా ఉండే గాలి కంటే నీటి ఆవిరి బరువు ఎలా ఉంటుంది? తక్కువగా 66. భూభ్రమణం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని ఏమంటారు? కొరియాలిస్ ఎఫెక్ట్ 67. బాష్పీభవనం అంటే? ద్రవరూపంలోని నీరు ఆవిరి రూపంలోకి మారడం 68. ఉత్పతనం అంటే? ఘనరూపంలోని మంచు ద్రవరూపంలోకి మారకుండానే నేరుగా వాయురూపంలోకి మారే ప్రక్రియ 69. {దవీభవనం అంటే? నీటి ఆవిరి నీరుగా లేదా మంచుగా మార్పు చెందడం 70. ఫాన్, ఛినూక్, లూ, బోరా, మిస్ట్రాల్, శాంటా అనేవి? స్థానిక పవనాలు 71. {పపంచ పంచదార గిన్నెగా ప్రసిద్ధి చెందిన దేశం? క్యూబా 72. భూకంపాల వల్ల తీవ్ర నష్టాలకు గురయ్యే ప్రాంతం? భూకంప అధికేంద్రం వద్ద ఉండే ప్రాంతం 73. భూకంపం వల్ల భూ ఉపరితలంపై అధిక నష్టాలకు కారణమవుతున్న తరంగాలు? ’L’ తరంగాలు 74. భూకంప తరంగాలను గుర్తించి నమోదు చేసే పరికరం? సిస్మోగ్రాఫ్ 75. భూకంప తరంగాల తీవ్రతను దేనితో కొలుస్తారు? రిక్టర్ స్కేల్ 76. సముద్ర భూతలంపై ఏర్పడే భూకంపాలను ఏమంటారు? సునామీలు (జపనీస్ పదం) 77. మనదేశంలో అధికంగా భూకంపాలకు గురయ్యే ప్రాంతం? అసోం 78. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు? 8848 మీటర్లు (ప్రపంచంలోనే ఎత్తైది) 79. ఏ సముద్రంలో అతి తక్కువ లవణీయత ఉంది? బాల్టిక్ సముద్రం 80. అతి ఎక్కువ లవణీయత ఉండే సముద్రం? మృతసముద్రం (Dead Sea) 81. సూర్య చంద్రుల గురుత్వాకర్షణ ప్రభావంతో సముద్రాల నీటి మట్టాల్లో ఏర్పడే హెచ్చుతగ్గులను ఏమంటారు? పోటుపాటులు 82. భూ ఉపరితలంపై సముద్రాలు ఎంత ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నాయి? 71% 83. భూ ఉపరితలానికి దిగువన ఏర్పడిన శిలాద్రవాన్ని ‘మేగ్మా’ అంటారు. భూ ఉపరి తలాన్ని చేరిన శిలాద్రవాన్ని ఏమంటారు? లావా 84. నిద్రాణాగ్ని అగ్నిపర్వతాలకు ఉదాహరణ? ఫ్యూజియామ (జపాన్), హేల్యకోలా (హవాయి) చక్రవాతాలు - వాటి పేర్లు - హిందూ మహాసముద్రంలో ఏర్పడేవి - తుఫాన్లు (సైక్లోన్స) - పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేవి - టైఫూన్లు - మెక్సికో సింధు శాఖ, కరేబియన్ సముద్రంలో ఏర్పడేవి- హరికేన్లు - ఆస్ట్రేలియాలో ఏర్పడేవి - విల్లీ విల్లీ ఆదిమజాతులు - నివసించే ప్రాంతాలు - రెడ్ ఇండియన్లు - అమెజాన్ నదీ పరివాహ ప్రాంతం - పిగ్మీలు - కాంగో నదీ ప్రాంతం - సమాంగ్లు, సకామిలు - మలేషియా అడవులు - హెడ్ హంటర్స - బోర్నియో ద్వీపం - కాబు - సుమత్రా ద్వీపం - బుష్మెన్ - కలహరి ఎడారి -
వాళ్లకు అది కూడా తెలీదట!
అమెరికన్లు అందరికంటే మేధావులు, వారి జనరల్ నాలెడ్జి, ఐక్యూ గొప్పగా ఉంటాయి, అందుకే ఆ దేశం అగ్రరాజ్యంగా నిలబడుతోంది అన్న అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ ఆ దేశస్థుల అమాయకత్వం ఏ స్థాయిలో ఉంటుందో వివరించింది ఒక సర్వే. దాని ప్రకారం... 26 శాతం మంది అమెరికన్లకు కనీసం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందన్న ప్రాథమిక అంశం గురించి కూడా తెలీదని తేలింది! అమెరికాకే చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రతి రెండేళ్లకోసారి ఇలా జనాల్లోని అమాయకత్వాన్ని వెలికితీసే పని పెట్టుకొంటుంది. అంటే బేసిక్ సైన్స్ గురించి కొన్ని ప్రశ్నలను అడుగుతూ మేధస్సు స్థాయిని నిర్ధారిస్తూ ఉంటుంది. ఈసారి చేసిన సర్వేలో పై విషయాన్ని కనిపెట్టిందన్నమాట! భూగోళశాస్త్రం గురించి అడిగిన ప్రాథమిక ప్రశ్నలకు చాలామంది అమెరికన్లు సమాధానం చెప్పలేకపోయారని, భూభ్రమణం అంటే కూడా వారికి సరైన అవగాహన లేదని సర్వేయర్లు పేర్కొన్నారు. మన సౌరకుటుంబంలో ఎన్ని గ్రహాలున్నాయి, వాటి పేర్లు ఏమిటి, భూమికి ఇతర గ్రహాలకు గల ప్రధానమైన తేడాలు ఏమిటి, చంద్రుడు గ్రహమా, నక్షత్రమా, ఉపగ్రహమా... ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియక అమెరికన్లు నీళ్లు నమిలారట. ‘అందరూ చదువుకున్నవాళ్లనే అడిగాం, వారికి ప్రాథమిక అంశాల గురించి కనీస అవగాహన లేకపోవడం విషాదకరం’ అని సర్వే నిర్వహించిన ఫౌండేషన్ వ్యాఖ్యానించడం గమనార్హం! -
జాగ్రఫీ
వ్యవసాయ రంగం - 2 వ్యవసాయ పంటల సాగు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుపోషణ, చేపల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, తేనెటీగల పెంపకం లాంటి పథకాలన్నింటినీ వ్యవసాయ రంగం అని పిలుస్తారు. భారతదేశ వ్యవసాయ రంగం ‘సాంద్రజీవనాధార వ్యవసాయ’ రకానికి చెందింది. వ్యవసాయ రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణిస్తారు. కారణం.. * దేశంలో దాదాపు 64 శాతం మంది ప్రజలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. * దేశంలోని కార్మికుల్లో 2/3వ వంతు మంది ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. * అనేక పరిశ్రమలకు ఈ రంగం ముడి పదార్థాలను సమకూరుస్తోంది. * దేశ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 13.5 శాతంగా ఉంది(2012-13 సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం). 1950-51లో ఇది 55 శాతంగా ఉండేది. అయినప్పటికీ ప్రపంచ దేశాల జాతీయ ఆదాయాల్లో వాటి వ్యవసాయ రంగాల వాటాను పరిశీలిస్తే భారత వ్యవసాయ రంగం వాటా ఇప్పటికీ అధికంగానే ఉంది. వ్యవసాయ రుతువులు భారతదేశంలో సంవత్సరాన్ని మూడు వ్యవసాయ రుతువులుగా విభజించారు. అవి... ఖరీఫ్: ఇది నైరుతి రుతుపవన కాలంతో ఏకీభవిస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు కొనసాగుతుంది. పంట కాలవ్యవధి ఐదు నెలలు. ఎక్కువ నీటిని వినియోగించుకొనే పంటలను ఈ రుతువులో సాగు చేస్తారు. అవి వరి, చెరకు, జనుము, మొక్కజొన్న, జొన్న, పత్తి, పొగాకు మొదలైనవి. రబీ: ఇది ఈశాన్య రుతుపవన కాలంతో ఏకీభవిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. పంట కాలవ్యవధి నాలుగు నెలలు. సాధారణంగా తక్కువ నీటిని వినియోగించుకొనే పంటలను ఈ రుతువులో సాగు చేస్తారు. అవి గోధుమ, బార్లీ, శెనగలు, ఆవాలు. జెయిద్: ఇది వేసవి రుతువుతో ఏకీభవిస్తుంది. సాధారణంగా నీటి పారుదల వసతులను కల్పించు కోవడం ద్వారా ఈ రుతువులో పంటలను సాగు చేస్తారు. మార్చి నుంచి మే వరకు తక్కువ పంట కాల వ్యవధి ఉన్న పంటలను సాగు చేస్తారు. అవి.. వరి, మొక్కజొన్న, దోస, గుమ్మడి, వేరుశెనగ, ఆకు, కాయగూరలు. భారతదేశంలో వ్యవసాయ ప్రాంతాలు: నేలలు, నీటి పారుదల వనరులు, శీతోష్ణస్థితి వైవిధ్యాల ఆధారంగా దేశాన్ని 5 వ్యవసాయ ప్రాంతాలుగా విభజించారు. అవి: సమశీతోష్ణ హిమాలయ ప్రాంతం: దీన్ని రెండు ఉప విభాగాలుగా విభజించారు. అవి.. ఎ) తూర్పు హిమాలయ ప్రాంతం: ఈ ప్రాంతంలో సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్లు ఉన్నాయి. ఇక్కడ 250 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇక్కడ ప్రధానంగా సాగుచేసే పంటలు తేయాకు, వరి. బి) పశ్చిమ హిమాలయ ప్రాంతం: ఇక్కడ ఉత్తరాంచల్‌లోని కుమయోన్, ఘర్వాల్ జిల్లాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా కొండలు, కులు, కాంగ్రా లోయలు, జమ్మూ కాశ్మీర్‌లు ఉన్నాయి. ప్రధానంగా ఉద్యానవన పంటలు, మొక్కజొన్న, బంగాళాదుంపలు, వరిని సాగుచేస్తారు. ఈ ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదవుతోంది. ఉత్తరమెట్ట ప్రాంతం: ఈ ప్రాంతంలో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, బీహార్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర గుజరాత్, మధ్యప్రదేశ్ ఉత్తర ప్రాంతం, రాజస్థాన్లున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గోధుమ, బార్లీ, ఉలవలు, మొక్కజొన్న, పత్తి, సజ్జలను సాగు చేస్తారు. తూర్పు మాగాణి ప్రాంతం: ఈ ప్రాంతంలో అసోం, మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశా, తూర్పు ఆంధ్రప్రదేశ్, తూర్పు తమిళనాడు, తూర్పు మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. ఇక్కడ వరి, చెరకు, జనుములను సాగు చేస్తారు. పశ్చిమ మాగాణి ప్రాంతం: ఇందులో కేరళ, పశ్చిమ సముద్ర తీర ప్రాంతాలు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా తేయాకు, కాఫీ, రబ్బరు, జీడిమామిడి, సుగంధ ద్రవ్యాలను సాగు చేస్తారు. దక్షిణ మధ్యస్త వర్షపాత ప్రాంతం: ఇందులో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, దక్షిణ గుజరాత్, పశ్చిమ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ తమిళనాడు, తూర్పు మహారాష్ర్ట, కర్ణాటకలోని కొన్ని భాగాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా జొన్న, సజ్జ, వేరు శెనగ, ఆముదాలు, పత్తి పంటలను సాగు చేస్తారు. పశు సంపద మన దేశంలో అత్యంత సంపన్నవంతమైన పశు సంపద ఉంది. ఇది దేశ వ్యవసాయ రంగంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. 2005లో చేపట్టిన పశువుల 17వ గణాంకాల ప్రకారం భారత్ ప్రపంచంలో అతి పెద్ద పశు సంపదల దేశం. ప్రపంచంలోని మొత్తం పశు సంపదలో భారత్ 17 శాతాన్ని కలిగి ఉంది. పాలిచ్చే జాతి పశువులు (ఆవులు) గిర్: గుజరాత్‌లోని సౌరాష్ర్ట ప్రాంతంలో ఈ జాతి పశువులున్నాయి. ఇది అత్యధికంగా పాలిచ్చే జాతి. సాహిల్వాల్: ఈ జాతి ఆవులు పంజాబ్, హర్యానా, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. సింధి: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం దీని జన్మస్థలం. గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ జాతి ఎక్కువ సంఖ్యలో ఉంది. అయితే వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం దీనికి ఉన్నందున దేశ వ్యాప్తంగా పాల ఉత్పత్తి కేంద్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. దేవ్‌ని: రాష్ట్రంలోని పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఈ జాతి ఆవులు ఎక్కువగా ఉన్నాయి. బండిని లాగే ఎద్దులు నగోరి: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతం, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఇవి ఎక్కువగా ఉంటాయి. బచేర్: బీహార్‌లోని బాగల్పూర్, ముజఫర్‌పూర్, చంపారన్ జిల్లాల్లో ఈ జాతి ఎద్దులు అధికంగా కనిపిస్తాయి. మాల్వి: మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలు వీటి ఆవాస స్థలం. ఖేరిఘడ్: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్, ఖేరి జిల్లాల్లో ఈ జాతి సంపద ఎక్కువగా ఉంది. హల్లికార్/అమృత్ మహల్: దక్షిణ కర్ణాటకలోని తుంకూర్, హసన్, మైసూర్ జిల్లాల్లో ఈ జాతి అధికంగా ఉంటుంది. ఖిల్లారి: మహారాష్ర్టలోని షోలాపూర్, సతారా జిల్లాల్లో ఈ జాతి ఉంది. ఉభయ ప్రయోజనకర జాతులు ధారక్పర్: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం దీని జన్మ స్థలం. మన దేశంలో గుజరాత్, రాజస్థాన్‌లో ఉన్నాయి. మేవతి: పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని మధుర, ఆగ్రా ప్రాంతాల్లో ఈ జాతులున్నాయి. కంక్రేజ్: గుజరాత్‌లోని తూర్పు మైదానాలు దాంగ్రి: మహారాష్ర్ట ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ కృష్ణలోయ: దక్షిణ మహారాష్ర్ట, ఉత్తర కర్ణాటక పశ్చిమ ఐరోపా నుంచి దిగుమతి చేసుకున్న జాతులు: జెర్సీ, హోలస్టైన్, ఫ్రైషియన్, స్విస్ బ్రౌన్. గేదెలు దేశంలోని మొత్తం పాల ఉత్పత్తుల్లో గేదెలు 64శాతం పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. మన దేశంలో వివిధ జాతుల గేదెలున్నాయి. అవి... ముర్రా: హర్యానాలోని రోహతక్, హిస్సార్, గుర్గావ్ జిల్లాల్లో ఈ జాతి గేదెలున్నాయి. భద్వారి: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, ఇటావా జిల్లాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ జఫర్బాది: గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతం సూర్తి: గుజరాత్ మైదానాలు నీలిరావి: పంజాబ్‌లోని ఫిరోజాబాద్ ప్రాంతం యహసానా: గుజరాత్, మధ్యప్రదేశ్ నాగపూరి (ఎల్లిక్పూరి): మహారాష్ర్టలోని విదర్భ ప్రాంతంలో ఈ జాతి గేదెలున్నాయి. గొర్రెలు గొర్రెల సంఖ్య, ఉత్పత్తిలో రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉంది. వివిధ జాతుల గొర్రెలు... కాశ్మీర్‌లోయ, భదర్వా, భాహర్వార్, రాంపూర్: జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో ఈ జాతి గొర్రెలున్నాయి. జైసల్మేరి, మాల్పూరి, పుగల్, ముగ్రా: రాజస్థాన్, హర్యానా డెక్కాని, నెల్లూరు, మాంధ్య: మహారాష్ర్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మేకలు మేకల సంఖ్యలో బీహార్ ప్రథమ స్థానంలో ఉంది. వీటినే పేదవాడి ఆవులుగా పిలుస్తారు. వివిధ జాతుల మేకలు... చంబా, గద్దె, చేగు, కాశ్మీరి: హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కాశ్మీర్ల్లో ఈ జాతి మేకలున్నాయి. షష్మిన్: కాశ్మీర్ జమునా పరి, బార్బరి: పశ్చిమ యూపీ, హర్యానా బీటల్: పంజాబ్ మార్వారి, మెహసానా, కథియావారి: రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ సూర్తి, డెక్కాని: దక్షిణ ద్వీపకల్పంలో ఈ జాతి మేకలున్నాయి. -
జాగ్రఫీ
వ్యవసాయ రంగం-1 * భూమిపై మానవుడు వ్యవసాయాన్ని ప్రారంభించి దాదాపు 12,000 సంవత్సరాలవుతోంది. ప్రపంచంలో ఇప్పటికీ 50 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో వ్యవసాయం ఆ ప్రాంత నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణస్థితి, మృత్తికలు, జీవసంబంధ కారకాలు. సామాజిక -ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. * 1936లో విట్లెసే అనే శాస్త్రవేత్త 13 రకాల వ్యవసాయ ప్రాంతాలను గుర్తించాడు. వాటిలో ముఖ్యమైనవి.... 1. సంచార పశుచారణ ప్రాంతాలు(నోమాడిక్ హెర్డింగ్): ఇందులో పశుపోషణ మాత్రమే ఉంటుంది. పంటల సాగు ఉండదు. ఈ ప్రాంతాల్లో ప్రజలు పశుపోషణపై ఆధారపడి జీవిస్తారు. మధ్య, నైరుతి ఆసియాలు, ఉత్తర ఆఫ్రికా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టర్కీలోని అనటోలియా పీఠభూమి ప్రాంతాలు, సూడాన్, సహారా ఎడారికి చెందిన అర్ధశుష్క ప్రాంతాలు, తూర్పు ఆఫ్రికాలోని ఉన్నత భూములు ఈ ప్రాంతాల కిందికి వస్తాయి. మొహయిర్ అనే ఉన్నికి ప్రసిద్ధిగాంచిన ఆంగోరా మేకలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. 2. వాణిజ్యపరమైన పశుగ్రాస ప్రాంతాలు (లైవ్‌స్టాక్ రాంచింగ్ రీజియన్‌స): ఇవి సమశీతోష్ణ, ఉష్ణమండల గడ్డిమైదాన ప్రాం తాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలు వ్యవసాయానికి పనికిరావు. ఇవి ఎక్కువగా మధ్య ఆసియాలోని స్టెప్పీలు, ఉత్తర అమెరికా, అర్జెంటీనాలోని పంపాలు, దక్షిణా ఆఫ్రికాలోని వెల్డులు, వెనెజువెలాలోని ఒరినాకో బేసిన్లో గల లానోలు, బ్రెజిల్‌లోని కాంపోలు, ఆస్ట్రేలియాలోని డౌన్స ప్రాంతాల్లో ఉన్నాయి. క్షీర సంపదను ఇచ్చే పశుజాతిని ఈ ప్రాంతాల్లో అధికంగా పెంచుతారు. 3. విస్తాపన (లేదా) మారక వ్యవసాయ ప్రాంతాలు(షిఫ్టింగ్ కల్టివేషన్ రీజియన్‌స): ఇవి కొండవాలుల్లో గిరిజనులు సాగుచేసే అతిపురాతన వ్యవసాయ ప్రాంతాలు. ఇక్కడ ప్రధానంగా కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్నలు లాంటి చిరుధాన్యాలను సాగు చేస్తారు. ఈ వ్యవసాయ విధానాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. వెనెజువెలాలో కొనౌకొ, మెక్సికోలో మిల్పా, బ్రెజిల్లో రోకా, మలేషియాలో లడౌంగ్, ఫిలిఫ్పైన్సలో కెయిన్జిన్, వియత్నాం, లావోస్‌లలో రే, శ్రీలంకలో చెనా, మయన్మార్‌లో తాంగ్యా అని పిలుస్తారు. అదేవిధంగా భారతదేశంలోని అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో జూమ్ అని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బేవార్, దాహియా, పెషా, పెండౌ అని, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో పోడో అని, రాజస్థాన్‌లో వాత్రా అని, పశ్చిమ కనుమల్లో కుమారి అని, కేరళలో పోడో అని అంటారు. 4. సాంద్ర జీవనాధార వ్యవసాయం(ఇంటెన్సివ్ సబ్స్టెన్స అగ్రికల్చర్ రీజియన్‌స): దీన్ని రుతుపవన వ్యవసాయం అని కూడా వ్యవహరిస్తారు. ఇది ఆసియాలోని రుతుపవన భూములకు పరిమితమైంది. ఇక్కడి ప్రధాన పంటలు వరి, గోధుమలు. ప్రపంచంలో 2/3వ వంతు ప్రజలు ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. 5. తోట పంటల వ్యవసాయ ప్రాంతాలు (ప్లాంటేషన్ అగ్రికల్చర్ రీజియన్‌స): తోట పంటలు లేదా వాణిజ్య పంటల సాగు ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రత్యేకమైంది. ఆసియా, ఆఫ్రికా, అమెరికాలలోని ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ రకమైన వ్యవసాయం ఎక్కువగా అమల్లో ఉంది. ఇది ఒక ఫ్యాక్టరీ- మేనేజ్మెంట్ లాంటి వ్యవసాయం. ఇందులో భూకమతాల పరిమాణం భారీగా ఉంటుంది. ఈ విధానంలో రబ్బర్, కాఫీ, తేయాకు, పత్తి, కొబ్బరి, కోకో, అరటి లాంటి పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. 6. మిశ్రమ వ్యవసాయం: ఇందులో పంటలు, పశుపోషణ కలిసి ఉంటాయి. భూకమతాలు చిన్నవిగా ఉంటాయి. పశ్చిమ యూరప్, దక్షిణ తూర్పు ఆస్ట్రేలియా, దక్షిణ తూర్పు కెనడా, తూర్పు, పశ్చిమ అమెరికా, అర్జెంటీనా, ఉరుగ్వేల్లోని పంపా మైదానాల్లో ఈ విధానం అమల్లో ఉంది. 7. పాడి పశువుల పెంపక ప్రాంతాలు(డెయిరీ ఫార్మింగ్ రీజియన్‌స): తేమతో కూడిన పచ్చిక బయళ్లు పెరిగే ప్రాంతాల్లో పాడిపశువుల పోషణ అమల్లో ఉంది. బ్రిటన్, డెన్మార్క, నెదర్లాండ్స, స్కాండినేవియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా ప్రాంతాలు పాడిపశువుల పెంపకానికి ప్రసిద్ధి చెందాయి. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. 8. ఉద్యానవన సాగు ప్రాంతాలు(హార్టికల్చర్ ఫార్మింగ్ రీజియన్‌స): ఇక్కడ కూరగాయలు, పూలు, పండ్లను అధికంగా సాగు చేస్తారు. అమెరికాలో దీన్ని ట్రక్ ఫార్మింగ్ అని పిలుస్తారు. వాయువ్య యూరప్, బ్రిటన్, డెన్మార్క, బెల్జియం, నెదర్లాండ్స, ఫ్రాన్స, జర్మనీ దేశాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైన సాగు అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ప్రపంచంలో కూరగాయలు, పండ్ల ఉత్పత్తిలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, భారతదేశం ద్వితీయ స్థానంలో ఉంది. 9. వాణిజ్యపరమైన ధాన్యసాగు ప్రాంతాలు(కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ రీజియన్‌స): ఇవి ప్రధానమైన ఏకీకృత గోధుమ క్షేత్రాలు. ప్రపంచంలో ఇవి ఎక్కువగా స్టెప్పీలు, డౌన్స, పంపాలలో విస్తరించి ఉన్నాయి. 10. మధ్యధరా వ్యవసాయ ప్రాంతాలు (మెడిటెరేనియన్ అగ్రికల్చర్ రీజియన్‌స): ఈ ప్రాంత శీతోష్ణస్థితికి అనుగుణంగా(తడి శీతాకాలాలు, పొడి వేసవి) ఇక్కడ ఎక్కువగా ఆలివ్, అత్తి, ఖర్జూరం, ద్రాక్ష, సిట్రస్ వంటి పండ్ల తోటలను సాగు చేస్తారు. ఈ ప్రాంతాలు ఎక్కువగా దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, కాలిఫోర్నియా తూర్పు ప్రాంతం, చిలీ మధ్య ప్రాంతం, దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లలో విస్తరించి ఉన్నాయి. 11. ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు(కలెక్టివ్ ఫార్మింగ్ రీజియన్‌స): రష్యాలో కమ్యూనిటీ ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలను కోల్కోజెస్ అని, ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలను సోవ్కోజెస్ అని పిలుస్తారు. 12. సాంద్ర వ్యవసాయ విధానం(ఇంటెన్సివ్ అగ్రికల్చర్): రుతుపవన ప్రభావం ఉన్న ఆసియా దేశాల్లో వరి పంటను ఈ విధానంలో ఎక్కువగా సాగు చేస్తారు. ఈ విధానంలోని ముఖ్య అంశాలు.. నీటి పారుదల సౌకర్యం ఉంటుంది. జనసాంద్రత అధికంగా ఉంటుంది. వ్యవసాయ పనుల్లో మానవ శ్రమ అధికంగా ఉంటుంది. భూకమతాల పరిమాణం చిన్నది ఎరువులు, క్రిమిసంహారక మందులను ఎక్కువగా వినియోగిస్తారు. పంట దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. 13. విస్తృత వ్యవసాయ విధానం(ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్): మధ్య అక్షాంశ ప్రాంతాల్లో గోధుమ పంటకు సంబంధించి ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తారు. ఈ ప్రాంతాలు సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితికి దూరంగా ఉంటాయి. ఇక్కడ వర్షపాతం 60 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ విధానాన్ని మధ్య ఆసియాలోని స్టెప్పీ ప్రాంతాలు, ఉత్తర అమెరికాలోని కేంద్ర, పశ్చిమ ప్రాంత మైదానాలు, ఆస్ట్రేలియాలోని డౌన్స ప్రాంతాలు, అర్జెంటీనాలోని పంపాలలో ఎక్కువగా అనుసరిస్తారు. ఈ విధానంలోని మౌలిక అంశాలు... నీటి పారుదల సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. జనసాంద్రత తక్కువగా ఉంటుంది. వ్యవసాయం ఎక్కువ యాంత్రీకరణ చెంది ఉంటుంది. భూకమతాల పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. మానవ శ్రమను తక్కువగా ఉపయోగిస్తారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం తక్కువగా ఉంటుంది. పంట దిగుబడులు తక్కువగా ఉంటాయి. -
జాగ్రఫీ, పర్యావరణ అంశాల సమన్వయంతో...
కలల కెరీర్ సివిల్ సర్వీసెస్ దిశగా అడుగులు వేస్తూ.. మొదటి దశ ప్రిలిమ్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని అత్యంత కీలకమైన మెయిన్స్ దశకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు.. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఓ అభ్యర్థి బుద్ధికుశలతను, సామాజిక, సమకాలీన సమస్యలపై అవగాహనను పరీక్షించాలన్న ఉద్దేశంతో మెయిన్స్‌లో మార్పులు చేశారు. కామన్ పేపర్సతోపాటు ఎస్సే, ఆప్షనల్‌గా జాగ్రఫీని ఎంచుకున్న అభ్యర్థులు ప్రిపరేషన్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి.. ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి, సమాధానాలు రాయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమైన అంశాలు తదితర అంశాలపై సూచనలు.. ఎ.డి.వి. రమణరాజు, సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్. మానవునికి సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ, పరిపాలన, సాంస్కృతిక అంశాలన్నింటినీ ప్రభావితం చేసే విజ్ఞానశాస్త్త్రమే భూగోళశాస్త్రం. సమన్వయంతో: మారిన విధానంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ మెయిన్స పరీక్షల కోసం నిర్దేశించిన సిలబస్ అంశాలను విశ్లేషిస్తే.. జాగ్రఫీ ఆప్షనల్తో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రయోజనాలు బహుళంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సబ్జెక్టులోని అధిక శాతం అంశాలను పేపర్-1 (ఎస్సే), పేపర్-2 (జనరల్ స్టడీస్-1-Indian Heritage and Culture, History and Geography of the World and Society), పేపర్-4 (జనరల్ స్టడీస్-3-Technology, Economic Development, Bio-diversity, Environment, Security and Disaster Management)లలో భాగంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాగ్రఫీ, పర్యావరణ విభాగాలకు సంబంధించిన అంశాలను సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. జాగ్రఫీకి సంబంధించి ఏ మూల నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. జాగ్రఫీ ఆప్షనల్తో పరీక్షకు సిద్ధమవుతున్నవారికి ఈ పేపర్లో మంచి స్కోర్ సాధించడానికి వీలుంది. జాగ్రఫీ ఆప్షనల్ పేపర్-1: ఇందులో భౌతిక, మానవ భూగోళ శాస్త్రాలకు సంబంధించిన భావనలు, సిద్ధాంతాలను పొందుపరిచారు. ఇందులో సెక్షన్-ఎను పరిశీలిస్తే.. భూస్వరూప శాస్త్రానికి సంబంధించి భూ అయస్కాంతత్వం (జియోమాగ్నటిజం) ప్రాథమిక భావనలు, భూ అభినితి (జియోసింక్లైన్), భూ సమస్థితి, డబ్ల్యు.జె. మోర్గాన్ ప్రతిపాదించిన పలకవిరూపక సిద్ధాంతం ఆధారంగా భూకంపాలు, సునామీలు ఏర్పడే విధానం- విశ్లేషణ, మోరిస్, పెంక్లు ప్రతిపాదించిన భూ స్వరూప చక్ర ప్రక్రియలు, వాటి మధ్యగల తేడాలు, పోలికలు, విశ్లేషణ, అనువర్తిత భూ స్వరూప శాస్త్త్రం, వాలుల అభివృద్ధి, విశ్లేషణ, జియోహైడ్రాలజీ మొదలైన అంశాలు కీలకమైనవి. వీటిపై పరిపూర్ణ పట్టు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. శీతోష్ణస్థితి శాస్త్రానికి సంబంధించి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ దాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఊర్ద్వ ఉష్ణోగ్రతా విస్తరణ, ఉష్ణ సమతుల్యం, రుతుపవనాలు, జెట్‌స్ట్రీమ్, వాయురాశులు, వాతాగ్రాలు, సమ శీతోష్ణ మండల, ఉష్ణమండల చక్రవాతాలు, వాటి మధ్యగల తేడాలు, వర్షపాత రకాలు, విస్తరణ, కొప్పెన్, థార్న్ థ్వైట్లు ప్రతిపాదించిన ప్రపంచ శీతోష్ణ స్థితుల వర్గీకరణ, ఆయా వర్గీకరణల మధ్యగల తేడాలు, జల సంబంధిత చక్రం, అనువర్తిత శీతోష్ణస్థితి శాస్త్రం మొదలైన విశ్లేషణాత్మక దృష్టితో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సముద్ర శాస్త్రానికి సంబంధించి అట్లాంటిక్, హిందూ, పసిఫిక్ మహాసముద్రాల భూతల విభజన, సముద్రజల లవణీయత, దాన్ని ప్రభావితం చేసే అంశాలు, సముద్ర నిక్షేపాలు, ప్రవాళ బిత్తికలు, అవి విక్షాళనం చెందడానికి గల కారణాలు, సముద్ర జల కాలుష్యం, దానికి గల కారణాలు తదితరాలపై పూర్తి స్థాయిలో అవగాహన పొందడానికి ప్రయత్నించాలి. జైవిక భూగోళ శాస్త్రానికి సంబంధించి మృత్తిక వర్గీకరణ, విసృ్తతి, మృత్తిక క్రమక్షయం, నిమ్నీకరణకు గల కారణాలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అటవీ నిర్మూలన వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సామాజిక అడవుల పెంపకం, ఆగ్రో ఫారెస్ట్రీ మొదలైన అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీకి సంబంధించి ఆవరణశాస్త్ర ప్రాథమిక భావనలు, పర్యావరణంపై మానవ ప్రభావం, ఆవరణ వ్యవస్థల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలు, వాటి సంరక్షణ, జీవ వైవిధ్యత సంరక్షణలో సుస్థిరాభివృద్ధి పాత్ర, నూతన పర్యావరణ విధానం, పర్యావరణ వైపరీత్యాలు, వాటి నివారణ చర్యలు మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. పేపర్-1, సెక్షన్-బి: ఇందులోని కీ లక అంశాలను పరిశీలిస్తే.. మానవీయ భూగోళ శాస్త్త్రంలోని దృక్పథాలకు సంబంధించి పర్యావరణ వాదం, పరిణామాత్మక విప్లవం, ద్వంద్వ భావన, రాడికల్, ప్రవర్తనా వాద దృక్పథాలు, ప్రపంచ సాంస్కృతిక మండలాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఆర్థిక భూగోళ శాస్త్రానికి సంబంధించి, వనరులు వాటి విస్తరణ, ఇంధన సమస్య, ప్రపంచ వ్యవసాయ మండలాలు - రకాలు, ఆహార భద్రత, దుర్భిక్షం -కారణాలు - ప్రభావాలు - నివారణ చర్యలు మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. జనాభా భూగోళ శాస్త్రానికి సంబంధించి ప్రపంచ జనాభా పెరుగుదల, విస్తరణను ప్రభావితం చేసే అంశాలు, ప్రపంచ జనాభాలో వలసలకు గల కారణాలు, ఉచ్ఛ-నిమ్న-అభిలషణీయ జనాభా భావనలు, జనాభా సిద్ధాంతాలు, ప్రపంచ జనాభా సమస్యలు, విధానాలు, పట్టణ జనాభా క్రమానుగత శ్రేణి, ప్రెమేట్ నగర భావన, రాంక్-సెజ్ నియమం, శాటిలైట్ టౌన్‌స, పట్టణ-గ్రామీణ ఉపాంతపు అంచు, పట్టణీకరణ వల్ల ఎదురయ్యే సమస్యలు, నివారణ చర్యలు మొదలైన అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. ప్రాంతీయ భూగోళ శాస్త్త్రంలో ప్రాంతీయత భావన, రకాలు, ప్రాంతీయ అసమానతలకు గల కారణాలు, వాటి అభివృద్ధి వ్యూహాలు, ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడంలో పర్యావరణ సంబంధిత అంశాల పాత్ర మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. మానవ భూగోళ శాస్త్త్రంలోని నమూనాలు, సిద్ధాంతాలు, శాసనాలకు సంబంధించి మాల్ధూషియనీ, మార్ష్కియన్, జనాభా పరివర్తన నమూనాలు, క్రిష్టలర్ కేంద్ర స్థాన సిద్ధాంతం, లోస్చే, క్రిష్టలర్ సిద్ధాంతాల మధ్యగల తేడాలు, ఓస్టోవ్‌స నమూనాలోని వృద్ధి దశలు, హృదయభూమి, అంచుల భూమి సిద్ధాంతాలు మొదలైన అంశాలను చదవాల్సి ఉంటుంది. పేపర్-2: ఇందులో భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికంగా దృష్టి సారించాల్సినవి: భారతదేశ భూభౌతిక అమరికకు సంబంధించి భారతదేశం - పొరుగు దేశాలతో ఉన్న భూ సరిహద్దు సమస్యలు, వాటి నేపథ్యం, హిమాలయ, ద్వీపకల్ప నదీ వ్యవస్థల మధ్యగల తేడాలు, భారతదేశ నైసర్గిక స్వరూపాలు, వాటి ప్రాముఖ్యత, భారతదేశ శీతోష్ణస్థితిపై రుతుపవనాల పాత్ర, దేశ భూభాగంలో రుతుపవన విస్తరణ విధానం, దాన్ని ప్రభావితం చేసే అంశాలు, భారతదేశంలో వర్షపాత విస్తరణపై ఉష్ణమండల చక్రవాతాలు, పశ్చిమ అలజడుల ప్రభావం, దుర్భిక్షం, వరదలు, భారతదేశంలో ఉద్భిజ సంపద, రకాలు తదితరాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి.. భారతదేశంలో భూగర్భ, ఉపరితల జలవనరుల పరిమాణం విస్తృతి, అవి ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి నిర్వహణ, శక్తి వనరులు, ఖనిజ వనరులు, వాటి సంరక్షణ, ఇంధన సమస్యలు మొదలైన అంశాలను చదవాలి. వ్యవసాయ రంగానికి సంబంధించి భారతదేశంలో వ్యవసాయ మౌలిక వసతులు, సాగునీటి సౌకర్యాలు, విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు మొదలైన అంశాలు కీలకమైనవి. వీటిని విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. అదేవిధంగా పంటల విధానం, పంటల సరళి (క్రాప్ కాంబినేషన్), వ్యవసాయ రంగంలో హరిత విప్లవం పాత్ర దానివల్ల ఏర్పడే సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరమైన సమస్యలు, ఆగ్రో-క్లైమాటిక్ ప్రాంతాలు, ఆగ్రో - ఎకలాజికల్ రీజియన్‌స మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. పరిశ్రమలకు సంబంధించి నూలు వస్త్త్ర పరిశ్రమ, ఇనుము-ఉక్కు, అల్యూమినియం, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఉనికి, వాటి ఏర్పాటుకు దేశంలోని అనుకూల అంశాలు. పారిశ్రామిక నివాసాలు, పారిశ్రామిక సముదాయాలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌లు), ఎకోటూరిజం మొదలైన అంశాలను చదవాలి. రవాణా, సమాచార రంగాలకు సంబంధించి జాతీయ రహదారుల అభివృద్ధి కోసం చేపట్టిన ఎన్‌హెచ్‌డీపీ ప్రాజెక్టు అమలు తీరు, బూట్ (ఆైఖీ) (బిల్డ్, ఆపరేట్, ట్రాన్సఫర్) పాత్ర , రోడ్డు రవాణా, రైల్వే రవాణా మధ్యగల పరస్పర పూరకాలు, వ్యతిరేకాలు (కాంప్లిమెంటరీ, కాంట్రడిక్టర్స) దేశ వాణిజ్యంలో ప్రధాన ఓడరేవుల ప్రాముఖ్యత, ఓడరేవుల అభివృద్ధిలో పీ3 (ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్) పాత్ర మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. సాంస్కృతిక అంశాలకు సంబంధించి భారత సమాజంలో భాషాపరమైన, జాతి పరమైన వైవిధ్యతలు, గిరిజన ప్రాంతాలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. జనావాసాలకు సంబంధించి భారతదేశంలో గ్రామీణ జనావాసాల రకాలు, విధానాలు, వాటి భౌతిక స్వరూపాలు, భారతీయ నగరాల భౌతిక స్వరూపాలు, విధుల పరంగా భారతీయ నగరాల వర్గీకరణ, మెట్రోపాలిటన్ ప్రాంతాలు, మురికివాడలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్యలు, నివారణ చర్యలను విశ్లేషణాత్మక దృష్టితో చదవాలి. ప్రాంతీయ ప్రణాళికలు, అభివృద్ధికి సంబంధించి దేశంలో ప్రాంతీయ అసమానతలను రూపుమాపడంలో ప్రాంతీయ ప్రణాళికల పాత్ర, పంచాయతీరాజ్, వికేంద్రీకరణ ప్రణాళికలు, వాటర్‌షెడ్ నిర్వహణ, వెనుకబడిన ప్రాంతాలు, ఎడారి, దుర్భిక్ష, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ప్రణాళికలు మొదలైన అంశాలను స్థూలంగా అధ్యయనం చేయాలి. రాజకీయ పరమైన దృక్పధాలకు సంబంధించి భారత సమాఖ్య విధానానికి సంబంధించిన భౌగోళిక పరమైన ప్రేరకాలు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రాంతీయ ధోరణులు, అంతర్రాష్ట్ర అంశాలు, భారత అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించిన అంశాలు, దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతాలలో భౌగోళిక రాజకీయాలు, సీమాంతర ఉగ్రవాదం మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. సమకాలీన అంశాలకు సంబంధించి పర్యావరణ పరమైన విపత్తులకు సంబంధించి భూపాతాలు (ల్యాండ్స్లైడ్స), భూకంపాలు, భారతదేశంలో భూకంపజోన్స, సునామీజోన్స, పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన అంశాలు, పర్యావరణ ప్రభావ నిర్ధారణ (ఇఐఎ), పర్యావరణ నిర్వహణ భావనలు, నదీ అనుసంధానం మొదలైన అంశాలను చదవాలి. పరిధి పెరిగింది గతంతో పోలిస్తే జనరల్ స్టడీస్ పేపర్లో జాగ్రఫీ సబ్జెక్టు పరిధి విస్తృతమైంది. గతేడాది కేవలం ఇండియా జాగ్రఫీని మాత్రమే సిలబస్‌లో పేర్కొంటే ఈసారి వరల్డ్ జాగ్రఫీని అదనంగా చేర్చారు. ఓ విషయం గురించి చదువుతున్నప్పుడు ఆ అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఆలోచించి చదవాలి. అప్పుడే ప్రిపరేషన్ సఫలీకృతమవుతుంది. జాగ్రఫీలోని అంశాలకు ఆకాశమే హద్దు. అందువల్ల ప్రిపరేషన్లో భాగంగా తొలుత బేసిక్ విషయాలపై పట్టు సాధించాలి. ఆ తర్వాత ముఖ్యమైన అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. సమాధానాలు ఇలా అభ్యర్థులు నేరుగా ఎస్సే రాయడానికి ఉపక్రమించడం అభిలషణీయం కాదు. ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, అర్థం చేసుకోవాలి. వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు. అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సిద్ధం చేసుకున్న స్ట్రక్చర్ల ఆధారంగా ఎస్సే రాయాలి. ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి. వ్యాసంలో అతిముఖ్యమైన సమాచారాన్ని అండర్లైన్ చేయాలి. ఎస్సే రాయడంలో సమతూకం పాటించడం చాలా ప్రధానం. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు. వివిధ సమస్యల పరిష్కారానికి అభ్యర్థి సూచనలు నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి. -
జాగ్రఫీ
భారతదేశంలో నదీ వ్యవస్థ-2 ద్వీపకల్ప నదీ వ్యవస్థ: ద్వీపకల్ప భూభాగం పడమర నుంచి తూర్పునకు వాలి ఉంది. దీంతో 90శాతం నదులు పడమరలో జన్మించి తూర్పునకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. మిగిలిన 10 శాతంలో కొన్ని ఉత్తర దిశలో ప్రవహించి గంగానదీ వ్యవస్థతోనూ, మరికొన్ని పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలోనూ కలుస్తున్నాయి. అందువల్ల ద్వీపకల్ప నదీ వ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి 1) తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు 2) పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు 3) ఉత్తర దిశగా ప్రవహించి గంగానది వ్యవస్థలో కలిసే నదులు 1) తూర్పుగా ప్రవహించే ద్వీపకల్ప నదీ వ్యవస్థ: ఎ) మహానది:ఛత్తీస్‌గఢ్ దండకారణ్య ప్రాంత ంలో గల రాయ్‌పూర్ జిల్లాలోని షిహావాలో మహానది జన్మించింది. ఇది ఒడిశాలో బంగాళాఖాతంలో కలుస్తోంది. మహానది ఎగువ ప్రాంతంలో టీ కప్పు ఆకృతిలో ఛత్తీస్‌గఢ్ మైదానం ఉంది. ఈ నది పరివాహక ప్రాంతం ఛత్తీస్‌గఢ్, మహారాష్ర్ట, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో ఉంది. ఉపనదులు: హశ్డో, షియోనాథ్, జంక్, ఓంజ్, టెల్, మాడ్. బి) గోదావరి: ద్వీపకల్ప భూభాగంలో అతి పెద్ద నదీ వ్యవస్థ. దీన్నే వృద్ధగంగ/దక్షిణ గంగ/ భారతదేశ రైన్ నది అని కూడా పిలుస్తారు. దీని పరివాహక ప్రాంతం మహారాష్ర్టలో (48.6 శాతం), ఆంధ్రప్రదేశ్‌లో (23.8 శాతం), మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో (20.7 శాతం), ఒడిశాలో(5.5 శాతం), కర్ణాటకలో (1.4 శాతం) ఉంది. ఇది మహారాష్ర్టలోని నాసిక్ సమీపాన గల త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లో జన్మించి ఆంధ్రప్రదేశ్‌లోకి బాసర వద్ద ప్రవేశిస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల ద్వారా ఈ నది ప్రవహిస్తూ, ఏడు శాఖలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తోంది. అందుకే దీన్ని సప్తగోదావరి అని కూడా పిలుస్తారు. అవి గౌతమీ, వశిష్ట, వైనతేయ, తుల్య, భరధ్వాజ, కౌశిక, ఆశ్రేయ. గోదావరి మొత్తం పొడవు 1,465 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నది 770 కి.మీ. దూరం ప్రవహిస్తోంది. ఉపనదులు: మంజీర (కుడివైపు ఉపనది), ప్రాణహిత, వార్థా, వెన్‌గంగ, పెన్‌గంగ, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, సీలేరు, మాచ్‌ఖండ్, మానేరు, కడెం. సి) కృష్ణానది: ఇది ద్వీపకల్ప భూభాగంలో 2వ పెద్దనది. దీని పరివాహక ప్రాంతం మహారాష్ర్టలో 27 శాతం, కర్ణాటకలో 44 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 29 శాతం విస్తరించి ఉంది. ఇది మహారాష్ర్టలోని మహాబలేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లో జన్మించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రవహిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోకి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలంలోని తంగడి అనే ప్రాంతంలో ప్రవేశిస్తుంది. కర్నూలు, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల ద్వారా ప్రవహిస్తూ హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ నది మొత్తం పొడవు 1420 కి.మీ. ఇది ఆంధ్రప్రదేశ్‌లో 720 కి.మీ. దూరం ప్రవహిస్తోంది. విజయవాడకు దిగువన 64 కి.మీల దూరంలో ఇది రెండు పాయలుగా విడిపోతుంది. ఈ రెండు పాయల మధ్యగల ఎత్తై సారవంతమైన మైదానాన్ని దివిసీమ అని పిలుస్తారు. ఉపనదులు: తుంగభద్ర, భీమ, ఘటప్రభ, మలప్రభ, దూద్‌గంగా, పంచ్‌గంగా, దిండి, మూసి, కొయన, మున్నేరు. డి) పెన్నా: ఈ నది కర్ణాటకలోని నంది దుర్గ కొండల్లో జన్మిస్తుంది. అనంతపురం జిల్లాలోని హిందూపూర్ సమీపంలో రాష్ట్రంలోకి ప్రవేశించి కడప, నెల్లూరు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ ఊటుకూరు అనే ప్రదేశంలో బంగాళాఖాతంలో కలుస్తోంది. దీన్నే పినాకిని అని అంటారు. ఈ నదిని రాయలసీమ జీవనాడిగా కూడా పిలుస్తారు. ఉపనదులు: జయమంగళ, చిత్రావతి, పాపాఘ్ని, కుందేరు, చెయ్యేరు, సగిలేరు. ఇ) గుండ్లకమ్మ: ఈ నది ప్రకాశం జిల్లా కంభం చెరువులో జన్మించి వినుకొండ, ఒంగోలుల ద్వారా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తోంది. ఎఫ్) వంశధార: ఒడిశాలో తూర్పు కనుమల రూపాంతరమైన జయ్‌పూర్ కొండల్లో జన్మించి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అదే జిల్లాలో కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో ఇది అతి పెద్దది. జి) నాగావళి: దీన్నే లాంగుల్యా నది అని కూడా పిలుస్తారు. ఒడిశాలోని రాయఘడ్ కొండల్లో జన్మించి శ్రీకాకుళం జిల్లాలోని మోపసు బందరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. హెచ్) స్వర్ణముఖి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కొండల్లో జన్మించి శ్రీకాళహస్తి మీదుగా నెల్లూరు జిల్లాలో ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తోంది. ఐ) సువర్ణ రేఖ: ఛత్తీస్‌గఢ్‌లోని చోటానాగ్‌పూర్‌లో జన్మించి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తోంది. జె) వైతరణి: ఒడిశాలోని కియోంజార్ పీఠభూమి వద్ద జన్మించి హోన్సు వద్ద బ్రాహ్మణి నదిని కలుపుకొని బంగాళాఖాతంలో కలుస్తోంది. కె) బ్రాహ్మణి: ఒడిశాలోని కోయల్, శాంకా నదుల కలయిక ద్వారా బ్రాహ్మణి నది ఏర్పడింది. ఒడిశాలోని రూర్కెలా ఇనుము, ఉక్కు కర్మాగారానికి ఈ నది నుంచే నీటిని అందిస్తున్నారు. ఎల్) కావేరి: కర్ణాటక కూర్గ జిల్లాలోని తలైకావేరి అనే ప్రదేశంలో జన్మించి తమిళనాడులోని శ్రీరంగం వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. దీని పరివాహక ప్రాంతం కర్ణాటకలో 41 శాతం, తమిళనాడులో 56 శాతం, కేరళలో 3శాతం విస్తరించి ఉంది. దీన్నే దక్షిణ గంగా అని పిలుస్తారు. కారణం గంగానదిలా సంవత్సరమంతా దాదాపు పదినెలలు ఈ నదిలో నీటి ప్రవాహం ఉంటుంది. ఉపనదులు: ఆర్కావటి, లక్ష్మణతీర్థ, హేమంగి, భవాని, కబిని, కుందా. 2) పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు: ఎ) నర్మద: మధ్యప్రదేశ్‌లోని అమరకంటక్ పీఠభూమిలో జన్మించి సోన్ నదికి వ్యతిరేకదిశలో మహారాష్ర్ట, గుజరాత్ల ద్వారా ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియాలో కలిసే నదుల్లో ఇది అతి పెద్దది. కపిలధార, దువధార (మార్పుల్) జలపాతాలు ఈ నదిపై మధ్యప్రదేశ్ భూభాగంలో ఉన్నాయి. ఉపనదులు: తావా, హిరన్, బంజర్, షక్కర్ బి) తపతి: మధ్యప్రదేశ్‌లోని సాత్పురా కొండల్లో ముల్తాయ్ అనే ప్రదేశంలో జన్మించి నర్మదానదికి సమాంతరంగా అదే దిశలో మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, గుజరాత్ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. అందువల్ల దీన్ని నర్మద చెలికత్తె, నర్మద కవల అని కూడా పిలుస్తారు. ఉపనదులు: పూర్ణా, బేతుల్, గిర్న, అరుణావతి. సి) సబర్మతి: రాజస్థాన్ ఉదయపూర్ జిల్లాలోని ఆరావళి పర్వతాల్లో జయసముద్ర సరస్సులో జన్మిస్తోంది. తర్వాత దక్షిణ దిశలో ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద అరేబియాలో కలుస్తుంది. డి) మహి: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పుట్టి రాజస్థాన్ ద్వారా ప్రవహిస్తూ గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద అరేబియాలో కలుస్తోంది. అలాగే గోవాలోని జూవారీ, మాండోవి నదులు, కర్ణాటకలోని శరావతి, నేత్రావతి నదులు, కేరళలోని పెరియార్, పంబ నదులు పశ్చిమ కనుమల్లో జన్మించి పశ్చిమ దిశలో ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.