త్వరలో సాక్షి ఇండియా జియో బీ-2014 | India will soon sakshi the Geo Bee -2014 | Sakshi
Sakshi News home page

త్వరలో సాక్షి ఇండియా జియో బీ-2014

Published Sun, Dec 14 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

త్వరలో సాక్షి ఇండియా జియో బీ-2014

త్వరలో సాక్షి ఇండియా జియో బీ-2014

  • జాగ్రఫీలో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం నిర్వహణ
  • అర్హులు 7, 8, 9, 10వ తరగతుల విద్యార్థులు
  • రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ ఈ నెల 20
  • జనవరి 23న ఫైనల్స్.. విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలు
  • సాక్షి, హైదరాబాద్: పిల్లలూ.. మీరు రోజూ స్కూళ్లో చూసే గ్లోబ్‌లో అసలు పాములే ఉండని దేశం ఎక్కడుందో గుర్తుపట్టగలరా?.. బంధువులు మరణిస్తే చేతి వేళ్లు కట్ చేసుకునే జాతి ఏంటో చెప్పగలరా?.. ఇలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే పేరుప్రఖ్యాతులతోపాటు బంగారు, వెండి, కాంస్య పతకాలను గెలుచుకునే అవకాశాన్ని సాక్షి మీడియా గ్రూప్ కల్పిస్తోంది. జాగ్రఫీలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఇండియా స్పెల్ బీ భాగస్వామ్యంతో ‘సాక్షి ఇండియా జియో బీ-2014’ పేరిట ప్రత్యేక పోటీని నిర్వహించనుంది.

    హైదరాబాద్‌లో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. పోటీలో భాగంగా ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, రీజినల్ జాగ్రఫీ, క్లైమటాలజీ, కోస్టల్ జాగ్రఫీ, హిస్టారికల్ అండ్ టైమ్ జాగ్రఫీ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రశ్నల సరళి, విజేతల ఎంపిక విధానాన్ని వివరించేందుకు ఈనెల 14, 15, 16, 17 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు సాక్షి టెలివిజన్‌లో డెమో క్లాస్‌లు ప్రసారం చేస్తారు. ‘ఆధునికత పెరిగే కొద్దీ పిల్లలకు ప్రకృతితో సంబంధం తగ్గిపోతోంది. ప్రకృతిని, భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత భవిష్యత్ తరాలపై ఉంది.

    అందుకే పిల్లలను ప్రకృతితో అనుసంధానించాలి. అందుకే భూమ్మీది వింతలు, విశేషాలు, ఆధునీకరణ నేపథ్యంలో అవెలా నాశనమవుతున్నాయన్న విషయం తెలిస్తే.. ప్రకతిని, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకే సాక్షి ఇండియా జియో బీ-2014 పోటీని నిర్వహిస్తున్నాం’ అని సాక్షి మీడియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి తెలిపారు. దీని వల్ల విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్‌తోపాటు ప్రకతి పట్ల ప్రేమ పెరుగుతుందన్నారు.

    జియో బీ పోటీని మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 28న, ప్రీ ఫైనల్స్ జనవరి 10న, ఫైనల్స్ జనవరి 23న జరుగుతాయి. విజేతలకు బంగారు, వెండి, రజత పతకాలతోపాటు సర్టిఫికెట్లు అందజేస్తారు.  ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. చివరి తేదీ ఈ నెల 20. రిజిస్ట్రేషన్ రుసుము రూ.100. మరిన్ని వివరాల కోసం 9505551099, 9705199924 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్పాన్సర్ చేస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement