
అమెరికాలో విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారించారు. ట్రంప్ విధానాల నేపథ్యంలో కెనడియన్ విశ్వవిద్యాలయా లు అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయ డం, యూనివర్సిటీ నిధులను తగ్గించడంవంటి చర్యల ఫలితంగా.. యూనివ ర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొ లంబియా (యూబీసీ), యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్శిటీ ఆఫ్ వాటర్లూ వంటి కెనడియన్ విశ్వవిద్యాలయాలకు అమెరికా విద్యార్థుల దరఖాస్తులు పెరిగాయి. వాంకోవర్‌లో ఉన్న యూబీసీ క్యాంపస్‌లో 2024తో పోలిస్తే మార్చి1 నాటికి యూఎస్ పౌరుల నుంచి గ్రాడ్యుయేషన్ దరఖాస్తుల్లో 27% పెరుగుదల నమోదైంది.
ఈ సంస్థ కొన్ని ప్రోగ్రామ్స్ కోసం అడ్మిషన్లను ఈవారం కూ డా తిరిగి తెరిచింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్ 2025 నాటికి యూఎస్ విద్యార్థుల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. టొరంటో విశ్వవిద్యాలయానికి కూడా సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో యూఎస్ నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటర్లూ విశ్వవిద్యాలయంలో, సెపె్టంబర్ 2024 నుంచి యూఎస్ వెబ్ ట్రాఫిక్ 15% పెరిగింది. ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు క్యాంపస్‌ను వ్యక్తిగతంగా సందర్శిస్తున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఆకర్షణకు కారణాలు..
ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా వీసాలను రద్దు చేయడం, విదేశీ విద్యార్థుల సోష ల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించడం, కాలేజీలకు ఫెడరల్ ఫండింగ్ తగ్గించడం ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పలువురు విద్యార్థులు, కుటుంబాల్లో భవిష్యత్తుపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. స్టూడెంట్ వీసాలు, యూనివర్సిటీ ఫండింగ్‌పై అమెరికాలో నిరసనలు, దావాలు ఎదుర్కొంటున్న సమయంలో కెనడా విద్యకు మరింత స్థిరమైన, స్నేహపూర్వక గమ్యస్థానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడా కొన్ని పరిమితులున్నాయి. తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై కెనడా ప్రభుత్వం కూడా పరిమితి విధించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
పెరిగిన క్యాంపస్ టూర్లు..
యూబీసీలో యూఎస నుంచి అండర్ గ్రాడ్యుయేయేషన్ అప్లికేషన్‌లు కేవలం 2% మాత్రమే పెరిగినా, అమెరి కన్–నిర్దేశిత క్యాంపస్ టూర్లు మాత్రం 20% పెరిగాయి. ఆసక్తి పెరుగుతోందని, ఎక్కువ మంది విద్యార్థులు కెనడియన్ విశ్వవిద్యాలయాలను వాస్తవ అవకాశంగా చూస్తున్నారని ఇది సూచిస్తుంది. తమ క్యాంపస్‌లకు అంతర్జాతీయ విద్యార్థులను పంపే మొదటి మూడు దేశాల్లో అమెరికా ఇప్పటికే ఒకటి అని యూబీసీ వార్షిక నివేదిక పేర్కొంది. ఇప్పటికే సుమారు 1,500 మంది యూఎస్ విద్యార్థులు యూబీసీలో గ్రాడ్యుయేషన్, అండర్‌గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు.