new admissions
-
గుర్తింపే ఇవ్వలేదు.. చేరికలపై గురి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. అనుబంధ గుర్తింపు ఇచ్చేంత వరకూ కొత్తగా అడ్మిషన్లు చేపట్టవద్దని ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి కార్యకలాపాలపై నిఘా పెట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అవసరమైతే పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టాలని సూచించింది. కానీ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జూనియర్ కాలేజీలూ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. ఎప్పుడో జూన్‌లో మొదలయ్యే తరగతుల కోసం అన్ని జిల్లాల్లోనూ పోటాపోటీగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి.విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షించేందుకు యాజమాన్యాలు ప్రత్యేకంగా ఏజెంట్లను, పూర్వ విద్యార్థులు, కాలేజీ సిబ్బందిని రంగంలోకి దింపాయి. వారికి టార్గెట్లు పెడుతున్నాయి. తాయిలాల ఎర వేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లాల్లో అధికారులు ప్రవేశాలను అడ్డుకోవడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కళ్ళెదుటే కాలేజీలు బోర్డులు పెట్టి మరీ విద్యార్థులను చేర్చుకుంటున్నా, పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే ఇలాంటివి ఇంతవరకు తమ దృష్టికి రాలేదని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.అనుమతికి అవకాశం లేకున్నా అడ్మిషన్లు!వాస్తవానికి జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది. అయితే ఇంతవరకూ ఏ కాలేజీ దరఖాస్తు చేయలేదు. మే 5 వరకూ గడువు ఉండటమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 1,200కు పైగా ప్రైవేటు జూని యర్ కాలేజీలున్నాయి. వీటిల్లో 350 కాలేజీలు గృహ, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్నాయి. ఈ కాలేజీలపై రెండేళ్ళ క్రితమే అగి్నమాపక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటికి అనుమతి ఇవ్వలేమని పేర్కొంది.ఈ కాలేజీల్లో దాదాపు 80 వేల మంది చదువుతున్నారు. వీటిల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. కానీ విద్యార్థుల నుంచి యథావిధిగా అడ్మిషన్లు మొదలు పెట్టాయి. నిబంధనలన్నీ కాగితాల్లోనే ఉంటాయని, తమకు అనుమతి వచ్చి తీరుతుందని ఆ కాలేజీలు నమ్మబలుకుతున్నాయి. వాస్తవానికి ఎప్పటికప్పుడు కాలేజీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటుందని చెబుతూ బోర్డును వేడుకుంటున్నాయి. మరోవైపు రాజకీయంగానూ ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే బాటను నమ్ముకుని అడ్మిషన్లు చేపడుతున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి.భారీగా పెరిగిన ఫీజులుమరోవైపు ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈసారి భారీ యెత్తున ఫీజులు డిమాండ్ చేస్తున్నాయి. జేఈఈ, రాష్ట్ర ఇంజనీరింగ్ సెట్‌కు కలిపి కోచింగ్ ఇస్తామంటున్నాయి. వేసవి ముగిసే నాటికే సిలబస్ పూర్తి చేస్తామని, మిగిలిన రోజులంతా కోచింగ్‌పై దృష్టి పెడతామని చెబుతున్నాయి. ఇందుకోసం గత ఏడాది రూ.70 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజు వసూలు చేశాయి. ఈసారి ఇది రూ.లక్ష నుంచి రూ.4.20 లక్షలకు పెంచేశాయి. ఈ క్రమంలో కార్పొరేట్ కాలేజీలు రకరకాల ఆశలు కల్పిస్తున్నాయి. కొన్నేళ్ళుగా జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో సాధించిన విజయాలతో ప్రచారం చేసుకుంటున్నాయి.ఏజెంట్లు, సిబ్బంది కూడా దీన్నే ఆయుధంగా వాడుకుంటున్నారు. ముందే అడ్మిషన్ తీసుకుంటే 15 శాతం వరకు రాయితీ ఉంటుందని చెబుతున్నారు. ఒకసారి టెన్త్ పరీక్ష ఫలితాలు వెల్లడైతే ఎలాంటి రాయితీ ఉండదంటూ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పిల్లల్ని చేర్చే క్రమంలో వాకబు చేయడానికి వచ్చే తల్లిదండ్రులను గంటల కొద్దీ కౌన్సెలింగ్ చేసి సీట్లు అంటగడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కెనడా వర్సిటీల వైపు అమెరికా విద్యార్థుల చూపు
అమెరికాలో విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారించారు. ట్రంప్ విధానాల నేపథ్యంలో కెనడియన్ విశ్వవిద్యాలయా లు అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయ డం, యూనివర్సిటీ నిధులను తగ్గించడంవంటి చర్యల ఫలితంగా.. యూనివ ర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొ లంబియా (యూబీసీ), యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్శిటీ ఆఫ్ వాటర్లూ వంటి కెనడియన్ విశ్వవిద్యాలయాలకు అమెరికా విద్యార్థుల దరఖాస్తులు పెరిగాయి. వాంకోవర్‌లో ఉన్న యూబీసీ క్యాంపస్‌లో 2024తో పోలిస్తే మార్చి1 నాటికి యూఎస్ పౌరుల నుంచి గ్రాడ్యుయేషన్ దరఖాస్తుల్లో 27% పెరుగుదల నమోదైంది. ఈ సంస్థ కొన్ని ప్రోగ్రామ్స్ కోసం అడ్మిషన్లను ఈవారం కూ డా తిరిగి తెరిచింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్ 2025 నాటికి యూఎస్ విద్యార్థుల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. టొరంటో విశ్వవిద్యాలయానికి కూడా సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో యూఎస్ నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటర్లూ విశ్వవిద్యాలయంలో, సెపె్టంబర్ 2024 నుంచి యూఎస్ వెబ్ ట్రాఫిక్ 15% పెరిగింది. ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు క్యాంపస్‌ను వ్యక్తిగతంగా సందర్శిస్తున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకర్షణకు కారణాలు.. ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా వీసాలను రద్దు చేయడం, విదేశీ విద్యార్థుల సోష ల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించడం, కాలేజీలకు ఫెడరల్ ఫండింగ్ తగ్గించడం ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పలువురు విద్యార్థులు, కుటుంబాల్లో భవిష్యత్తుపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. స్టూడెంట్ వీసాలు, యూనివర్సిటీ ఫండింగ్పై అమెరికాలో నిరసనలు, దావాలు ఎదుర్కొంటున్న సమయంలో కెనడా విద్యకు మరింత స్థిరమైన, స్నేహపూర్వక గమ్యస్థానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడా కొన్ని పరిమితులున్నాయి. తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై కెనడా ప్రభుత్వం కూడా పరిమితి విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరిగిన క్యాంపస్ టూర్లు.. యూబీసీలో యూఎస నుంచి అండర్ గ్రాడ్యుయేయేషన్ అప్లికేషన్లు కేవలం 2% మాత్రమే పెరిగినా, అమెరి కన్–నిర్దేశిత క్యాంపస్ టూర్లు మాత్రం 20% పెరిగాయి. ఆసక్తి పెరుగుతోందని, ఎక్కువ మంది విద్యార్థులు కెనడియన్ విశ్వవిద్యాలయాలను వాస్తవ అవకాశంగా చూస్తున్నారని ఇది సూచిస్తుంది. తమ క్యాంపస్‌లకు అంతర్జాతీయ విద్యార్థులను పంపే మొదటి మూడు దేశాల్లో అమెరికా ఇప్పటికే ఒకటి అని యూబీసీ వార్షిక నివేదిక పేర్కొంది. ఇప్పటికే సుమారు 1,500 మంది యూఎస్ విద్యార్థులు యూబీసీలో గ్రాడ్యుయేషన్, అండర్‌గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. -
ప్రైవేటుకు గుడ్‌బై.. సర్కారు బడికి జై
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలకు ప్రవేశాల తాకిడి పెరుగుతోంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో సర్కారు బడుల్లో చేరుతున్నారు. గతంలో పిల్లలు వివిధ కారణాలతో సర్కారు బడులను వదిలిపెట్టి ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు పొందేవారు. కానీ ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలకు గుడ్‌బై కొట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు సర్కారు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 2,39,449 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 2021–22 విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రెండు నెలల వ్యవధిలోనే ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలు సర్కారు బడుల్లో చేరడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యాసంస్థలతో కలిపి అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 27.5 లక్షల విద్యా ర్థుల నమోదు ఉండగా.. ఇప్పటికే దాదాపు 10% విద్యార్థులు అదనంగా అడ్మిషన్లు తీసుకోవడంపై విద్యాశాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా దెబ్బ .. ప్రైవేటు బాదుడు కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నరగా విద్యాసంస్థలు మూతబడి ఉన్నాయి. కొన్ని రోజులు పాక్షికంగా తెరిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులను ప్రభుత్వం అనుమతించలేదు. ఉపాధ్యాయులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇప్పటివరకు బోధన ప్రక్రియంతా ఆన్లైన్ పద్ధతిలోనే కొనసాగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇలాగే బోధన జరుగుతున్నా.. ఫీజుల కింద రూ.వేలు డిమాండ్ చేస్తున్నాయి. సకాలంలో చెల్లించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. బోధన కార్యక్రమాలు అంతంతగానే ఉండటం, కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యాసంస్థల వైపే మళ్లుతున్నారు. సర్కారు బడుల్లో సైతం అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండటంతో.. మరో ఆలోచన లేకుండా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఒకటో తరగతికి బాగా గిరాకీ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,39,449 కొత్త అడ్మిషన్లు నమోదు కాగా.. ఇందులో కేవలం ఒకటో తరగతిలోనే 1,25,034 అడ్మిషన్లు జరిగాయి. గత విద్యా సంవత్సరం 12 నెలల కాలంలో ఒకటో తరగతి అడ్మిషన్లు 1,50,071 కాగా.. ఆ సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది రెండు నెలల్లోనే 80 శాతానికి పైగా చేరికలు చోటు చేసుకున్నాయి. ఇక ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు 1,14,415 మంది ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వీరంతా ఒకటి నుంచి 12వ తరగతి వరకు వివిధ క్లాసుల్లో అడ్మిషన్లు పొందారు. విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతో పాటు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూల్స్), పట్టణ ఆశ్రమ పాఠశాలలు (యూఆర్ఎస్)ల్లో కొత్త చేరికలు జరిగాయి. 2019–20 విద్యా సంవత్సరంలో ఒకటినుంచి 12వ తరగతి వరకు 68,813 కొత్త ప్రవేశాలు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు మూడున్నర రెట్లు అడ్మిషన్లు జరగడం గమనార్హం. బడులు పూర్తిగా తెరిస్తే రెట్టింపు ప్రవేశాలకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అక్టోబర్ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం: యూజీసీ
న్యూఢిల్లీ: దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో నూతన అకడమిక్ సెషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుందని యూజీసీ ప్రకటించింది. కొత్త అకడమిక్ సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియలు సెప్టెంబర్ 30కి పూర్తవుతాయని తెలిపింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డులు ఫలితాలు వెల్లడించిన అనంతరమే అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ఆరంభించాలని వర్సిటీలు, కాలేజీలను ఆదేశించింది. ఈ ఫలితాలన్నీ జూలై 31 లోపు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగితే కొత్త అకడమిక్ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి ఆరంభమవుతుందని వివరించింది. అప్పటి పరిస్థితులను బట్టి ఆఫ్‌లైన్, ఆన్లైన్ తరగతులు, పరీక్షల్లాంటివి నిర్వహించాలని సూచించింది. పరిస్థితులు బాగాలేనందున ఒకవేళ ఎవరైనా విద్యార్థి అడ్మిషన్ క్యాన్సిలైనా, వేరే చోటికి మారినా వారు చెల్లించిన ఫీజులను పూర్తిగా వాపసు చేయాలని కళాశాలలను, యూనివర్సిటీలను ఆదేశించింది. అలాగే ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 31కల్లా పూర్తి చేయాలని కోరింది. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. -
సర్కారు బడికి స్పందన కొంతే..
కొత్తగా చేరిన విద్యార్థులు 57,974 మంది వివిధ కారణాలతో వెళ్లిపోయిన విద్యార్థుల సంఖ్య 53వేలకు పైగానే మెుత్తంగా గత సంవత్సరం కంటే పెరిగిన విద్యార్థులు 4311 తెరుచుకున్న 42 పాఠశాలలు.. 44 పాఠశాలల్లో అడ్మిషన్లు నిల్ విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య చాలా స్పల్పంగా ఉంది. జిల్లాలో 2049 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 360 యూపీఎస్‌లు, 510 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిల్లో 2015–2016 విద్యాసంవత్సరం 1నుంచి పదో తరగతి వరకు మొత్తంగా 2,42,413 మంది విద్యార్థులుండగా ఈ సంవత్సరం ( 2016–2017) బడిబాట తరువాత 2,46,724 మంది విద్యార్థులున్నారు. గత ఏడాదితో పోలిస్తే 4,311 మంది విద్యార్థులు పెరిగారు. గత ఏడాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులతోపాటు మిగతా తరగతుల్లో విద్యార్థులు సుమారు 53వేల మందికి పైగానే అవుట్గోయింగ్ విద్యార్థులుగా గుర్తించారు. ఈసారి బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాగస్వాములై ఎక్కువగా విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా మరికొన్ని చోట్ల తగ్గినట్లు కూడా తెలుస్తోంది. బడిబాట ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతిలో కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు 24,581మంది ఉండగా అందులో బాలురు 12,539మంది, బాలికలు 12,042 ప్రవేశాలు పొందారు. ఇక 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొత్తగా 33,393మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా అందులో బాలురు 16,303మంది, బాలికలు 17,090 మంది ఉన్నారు. మొత్తంగా జిల్లాలో 1నుంచి 10వ తరగతి వరకు కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుల సంఖ్య 57,974. పెరిగిన విద్యార్థుల సంఖ్య ఇలా.. జిల్లాలో బడిబాట ద్వారా అక్కడక్కడ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగారు. నెల్లికుదరు మండలం జామతండాలో ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 30మంది ఉండగా ప్రస్తుతం 100మంది విద్యార్థులున్నారు. నర్సంపేటలోని హనుమాన్దేవ్ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో గత ఏడాది 390మంది ఉండగా ఈఏడాది 426 మంది ఉన్నారు. నర్సంపేట మండలం సర్వాపురం ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 42మంది ఉంటే.. ప్రస్తుతం 73మంది ఉన్నారు. జీడయ్యపల్లి ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 70 మంది విద్యార్థులుంటే ప్రస్తుతం 133 మంది ఉన్నారు. గూడూరు మండలం అయోధ్యపురం ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 165మంది ఉంటే ప్రస్తుతం 331మంది. అదే మండలం గాజులగట్టు యూపీఎస్‌లో గత ఏడాది 72మంది ఉంటే ప్రస్తుతం 140మంది, సీతానాగారం పీఎస్‌లో గత ఏడాది 26మంది ఉంటే ప్రస్తుతం 52మంది ఉన్నారు. అలాగే కొమ్ములవంచ ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది ఆరుగురు ఉంటే ప్రస్తుతం 26 మంది విద్యార్థులున్నారు. మహబూబాబాద్ జీపీఎస్‌లో గత ఏడాది 172మంది విద్యార్థులుంటే ప్రస్తుతం 233 మంది విద్యార్థులున్నారు. అదేమండలం కొత్తరెడ్యాల యూపీఎస్‌లో గత ఏడాది 104మంది ఉంటే ప్రస్తుతం 132మంది విద్యార్థులున్నారు. చేర్యాల మండలం ముస్త్యాలపల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో గత ఏడాది 166మంది ఉంటే విద్యార్థుల సంఖ్యపెరిగి ప్రస్తుతం 304 మంది ఉన్నారు. తెరుచుకున్న 42పాఠశాలలు జిల్లాలో అసలే విద్యార్థులు లేని ప్రాథమిక పాఠశాలలు 86 ఉండగా ఈ విద్యాసంవత్సరంలో 42 పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ చాలా తక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మొత్తంగా అయా పాఠశాలలు అన్నీ కలిపితే 368మంది విద్యార్థులే చేరినట్లు రికార్డులను బట్టితెలుస్తోంది. మిగతా 44 పాఠశాలలకు అడ్మిషన్లు లేవు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులను వర్క్అడ్జస్ట్మెంట్కింద అవసరం ఉన్నచోటుకు పంపాల్సిందే.