‘ఇండియన్ రూర్’గా పేరొందిన ప్రాంతం | area ​​the so-called Indian rurga | Sakshi
Sakshi News home page

‘ఇండియన్ రూర్’గా పేరొందిన ప్రాంతం

Published Thu, Aug 21 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

‘ఇండియన్ రూర్’గా పేరొందిన ప్రాంతం

‘ఇండియన్ రూర్’గా పేరొందిన ప్రాంతం

 భూగోళశాస్త్రం
  1.    భారతదేశంలోని ఎత్తై హిమాలయ శిఖరం?
     ఎ) ఎవరెస్ట్        బి) కాంచనగంగ
     సి) ఓ2 (గాడ్విన్ ఆస్టిన్)    డి) దవళగిరి
 
 2.    మయూరాక్షి కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
     ఎ) బీహార్        బి) ఉత్తరప్రదేశ్
     సి) తమిళనాడు     డి) పశ్చిమ బెంగాల్
 
 3.    కింది వాటిలో అంతర్జాతీయ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏది?
     ఎ) భాక్రానంగల్    బి) దామోదర్ వ్యాలీ
      సి) హిరాకుడ్    డి) కోసి ప్రాజెక్ట్
 
 4.    అత్యధిక రోడ్ల సౌకర్యం ఉన్న రాష్ట్రం?
     ఎ) తమిళనాడు     బి) గుజరాత్
     సి) మహారాష్ట్ర    డి) పంజాబ్
 
 5.    దిల్వారా దేవాలయం ఏ పర్వత శ్రేణిలో ఉంది?
     ఎ) హిమాలయ     బి) ఆరావళి
     సి) సహ్యద్రి     డి) సాత్పురా
 
 6.    ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
     ఎ) న్యూఢిల్లీ        బి) ముంబై
     సి) హైదరాబాద్    డి) బెంగళూరు
 
 7.    తపాల శాఖ గ్రీన్ చానల్ ప్రధాన ఉద్దేశం?
     ఎ)    స్థానిక ఉత్తరాల బట్వాడాను వేగవంతం చేయడం
     బి)    రాష్ట్ర రాజధానుల మధ్య హాట్ మెయిల్ సదుపాయం కల్పించడం
     సి)    వ్యాపార సంస్థల ఉత్తరాలను వేగంగా బట్వాడా చేయడం
      డి)    మనియార్డర్ల బట్వాడా వ్యవస్థను ప్రజలకు తక్కువ సేవా రుసుంతో అందించడం
 
 8.    మన దేశంలో అతిపెద్ద పరిశ్రమ?
     ఎ) సిమెంట్     బి) ప్లాస్టిక్
     సి) సాఫ్ట్‌వేర్     డి) వస్త్ర
 
 9.    ఏ ఖనిజ ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది?
     ఎ) అభ్రకం        బి) ఇనుము
     సి) మాంగనీసు    డి) మోనజైట్
 
 10.    ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
     ఎ) 1970         బి) 1971
     సి) 1972        డి) 1973
 
 11.    మన దేశంలో ప్రధాన రబీ పంట?

     ఎ) మొక్కజొన్న    బి) గోధుమలు
     సి) జొన్నలు     డి) వరి
 
 12.    నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి మొదటగా అత్యంత ప్రాధాన్యమిచ్చిన పంచవర్ష ప్రణాళిక?
     ఎ) 4వ        బి) 6వ
     సి) 8వ        డి) 5వ
 
 13.    విస్తీర్ణంలో అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం?
     ఎ) పాండిచ్చేరీ     బి) చండీగఢ్
     సి) లక్షద్వీప్        డి) దాద్రానగర్ హవేలీ
 
 14.    తక్కువ ఎరువులు వాడి, ఎక్కువ దిగుబడి పొందడానికి అనుకూల మృత్తికలు?
     ఎ) నల్లరేగడి నేలలు    బి) ఓండ్రు నేలలు
     సి) ఎర్రమట్టి నేలలు    డి) లేటరైట్ నేలలు
 
 15.    ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా నమోదైంది?
     ఎ) 1901-11    బి) 1911-21
     సి) 1921-31    డి) 1931-40
 
 16.    భారతదేశంలో వ్యవసాయానికి అతి ముఖ్యమైన నీటి పారుదల వ్యవస్థ?
     ఎ) కాలువలు     బి) బావులు
     సి) చెరువులు    డి) పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా
 
 17.    {పపంచ భూభాగంలో భారతదేశ విస్తీర్ణత శాతం?
     ఎ) 2.42        బి) 3.26
     సి) 1.74         డి) 4.28
 
 18.    కింది వాటిలో సరికాని జత?
     ఎ) తమిళనాడు-కోరమాండల్ తీరం
     బి) ఆంధ్రప్రదేశ్-సర్కార్ తీరం
     సి) ఒడిశా-కొంకణ్ తీరం
     డి) కేరళ-మలబార్ తీరం
 
 19.    నైరుతి రుతుపవన కాలం?
     ఎ) మార్చి-ఆగస్ట్    బి) ఏప్రిల్-జూలై
     సి) మే-అక్టోబర్     డి) జూన్-సెప్టెంబర్
 
 20.    మంచి గంధం చెట్లు ఏ అడవుల్లో పెరుగుతాయి?
     ఎ) సతతహరితారణ్యాలు
     బి) ఆకురాల్చు అడవులు    సి) అల్‌ఫైన్ అడవులు
     డి) ఉష్ణమండల అరణ్యాలు
 
 21.    ఐఎస్‌టీ (ఐఖీ-భారత ప్రామాణిక సమయం)ని నిర్ధారించడానికి ఏ రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు?
     ఎ) 5 1/20 తూర్పు రేఖాంశం
     బి) 82 1/20 తూర్పు రేఖాంశం
     సి) 5 1/20 పశ్చిమ రేఖాంశం
     డి) 82 1/20 పశ్చిమ రేఖాంశం
 
 22.    దేశ తీరరేఖ పొడవు (కి.మీ.లలో)?
     ఎ) 6,100        బి) 5,200
     సి) 6,650        డి) 5,872
 
 23.    మెక్‌మోహన్ రేఖ ఏయే దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయిస్తుంది?
     ఎ) భారత్-శ్రీలంక     బి) భారత్-పాకిస్థాన్    సి) భారత్-చైనా    డి) భారత్-బంగ్లాదేశ్
 
 24.    {పపంచంలో ఎత్తై పీఠభూమి?
     ఎ) లాబ్రాడార్     బి) కొలరాడో
     సి) పెటగోనియా     డి) పామీర్
 
 25.    దొడబెట్ట శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది?
     ఎ) కేరళ        బి) పాండిచ్ఛేరి
     సి) తమిళనాడు    డి) కర్ణాటక
 
 26.    {పపంచంలో భారతదేశ జనాభా శాతం ?
     ఎ) 17.5        బి) 16.8
     సి) 18.4.         డి) 15.75
 
 27.    మన దేశంలో మహిళల అక్షరాస్యత శాతం?
     ఎ) 58.6         బి) 59.5
     సి) 63.4        డి) 65.46
 
 28.    కింది వాటిలో నది ఆధార ఓడరేవు?
     ఎ) చెన్నై        బి) తిరువనంతపురం
     సి) కోల్‌కతా        డి) విశాఖపట్నం
 
 29.    దేశంలో అతి పొడవైన 7వ నెంబర్ జాతీయ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది?
     ఎ) కాశ్మీర్-కన్యాకుమారి
     బి) వారణాసి-కన్యాకుమారి
     సి) లడఖ్-రామేశ్వరం
     డి) ఢిల్లీ-రామేశ్వర
 
 30.    ‘ఇండియన్ రూర్’గా పేరొందిన ప్రాంతం?
     ఎ) అహ్మదాబాద్    బి) ముంబై
     సి) చోటానాగ్‌పూర్     డి) హుబ్లీ
 
 31.    తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లా?
     ఎ) ఆదిలాబాద్    బి) మహబూబ్‌నగర్
     సి) హైదరాబాద్     డి) రంగారెడ్డి
 
 32.    విస్తీర్ణంలో అతి పెద్ద రాష్ట్రం?
     ఎ) ఉత్తరప్రదేశ్    బి) మహారాష్ట్ర
     సి) రాజస్థాన్     డి) పశ్చిమ బెంగాల్
 
 33.    {పాచీన కాలంలో ఏర్పడిన ఓండ్రు మైదానాలను ఏమని పిలుస్తారు?
     ఎ) భంగర్         బి) బాభర్
     సి) ఖాదర్        డి) టెరాయి
 
 34.    మన దేశంలో తీవ్రమైన కరవు ఏ సంవత్సరంలో ఏర్పడింది?
     ఎ) 1983        బి) 1987
     సి) 1991         డి) 1993
 
 35.    భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అడవుల విస్తీర్ణత శాతం?
     ఎ) 20         బి) 23
     సి) 24        డి) 29
 
 36.    అసోం దుఖఃదాయని అని ఏ నదీని పిలుస్తారు?
     ఎ) దామోదర్    బి) బ్రహ్మపుత్ర
     సి) సట్లేజ్        డి) మహానది
 
 37.    కింది వాటిలో సరికాని జత?
     ఎ) శ్వేత విప్లవం-పాలు
     బి) హరిత విప్లవం-సంకరజాతి విత్తనాలు
     సి) నీలి విప్లవం-పాల్ట్రీపరిశ్రమ
     డి) ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్-పాలు
 
 38.    దుర్గాపూర్ (పశ్చిమబెంగాల్)లోని ఉక్కు కార్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు?
     ఎ) అమెరికా    బి) బ్రిటన్
     సి) రష్యా         డి) జర్మనీ
 
 39.    దక్షిణ రైల్వే మండలం ముఖ్య పాలనా కేంద్రం?
     ఎ) సికింద్రాబాద్     బి) చెన్నై
     సి) బెంగళూరు    డి) తిరువనంతపురం
 
 సమాధానాలు:
     1) సి;    2) డి;    3) డి;    4) సి;    5) బి;
     6) ఎ;    7) ఎ;    8) డి;    9) ఎ;    10) ఎ;
     11) బి;    12) సి;    13) సి;    14) ఎ;    15)బి;
     16) బి;    17) ఎ;    18) సి;    19) డి;    20) బి;
     21) బి;    22) ఎ;    23) సి;    24) డి;    25) సి;
     26) ఎ;    27) డి;    28) సి;    29) బి;    30) సి;
     31) డి;    32) సి;    33) ఎ;    34) బి;    35) ఎ;
     36) బి;    37) సి;    38) డి;    39) బి
 
 గత పోలీస్ కానిస్టేబుట్/
 ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు
 
 1.    నీలి విప్లవం అంటే?
     ఎ) వాణిజ్య పంటల ఉత్పత్తి
     బి) నీలి మందు ఉత్పత్తి
     సి) నీలి లోహ ఉత్పత్తి
     డి) చేపల ఉత్పత్తి
 
 2.    భారత రైల్వే కర్మాగారం డీజిల్ విభాగం ఎక్కడ ఉంది?
     ఎ) పెరంబూర్    బి) పాటియాల
     సి) వారణాసి    డి) కపుర్తల
 
 3.    కింది వాటిలో ఏ పంటకు ఒక హెక్టారుకు ఎక్కువ నీరు అవసరం?
     ఎ) చెరకు         బి) గోధుమలు
     సి) మొక్కజొన్న    డి) బార్లీ
 
 4.    2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత శాతం పెరిగింది?
     ఎ) 17.19         బి) 16.64
     సి) 18.12        డి) 17.64
 
 5.    ఇందిరాసాగర్ ఆనకట్ట ఏ నదిపై ఉంది?
     ఎ) మహానది    బి) చంబల్ నది
     సి) నర్మద         డి) యమున
 
 6.    ఎకఖీ, ఐఖీ మధ్య ఎంత సమయం తేడా (గంటల్లో)?
     ఎ) 61/2        బి) 4
     సి) 41/2         డి) 51/2
 
 7.    కాకతీయ కాలువ ఏ నీటి ప్రాజెక్ట్‌లో భాగం?
     ఎ) నాగార్జునసాగర్    బి) తెలుగు గంగ
     సి) శ్రీరామ్ సాగర్    డి) ప్రాణహిత-చెవేళ్ల
 
 8.    ఏ నదీ లోయలో బొగ్గు నిల్వలు విస్తారంగా లభిస్తాయి?
     ఎ) బ్రహ్మపుత్ర    బి) నర్మద
     సి) కావేరీ         డి) దామోదర్
 
 9.    ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
     ఎ) ముంబై        బి) చెన్నై
     సి) పుణే        డి) అహ్మదాబాద్
 
 10.    మౌంట్ అబు ఏ రాష్ట్రంలో ఉంది?
     ఎ) రాజస్థాన్    బి) బీహార్
     సి) కేరళ        డి) తమిళనాడు
 
 11.    కింది వాటిలో వార్షిక ఉష్ణోగ్రత అంతరం అధికంగా గల నగరం?
     ఎ) కోల్‌కతా        బి) ఢిల్లీ
     సి) హైదరాబాద్    డి) కొచ్చిన్
 
 12.    కింది వాటిలో ప్రధానంగా బావుల ద్వారా వ్యవసాయం చేసే ప్రాంతం?
     ఎ) ఉత్తర కోస్తా ఆంధ్రా
     బి) దక్షిణ కోస్తా ఆంధ్రా
     సి) రాయలసీమ
     డి) తెలంగాణ
 
 సమాధానాలు:
     1) డి;    2) బి;    3) ఎ;    4) డి;
     5) సి;    6) డి;    7) సి;    8) డి;
     9) ఎ;    10) ఎ;    11) బి;    12) డి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement