ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ర్టంలో ఉంది? | Social Practice bits | Sakshi
Sakshi News home page

ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ర్టంలో ఉంది?

Published Thu, Oct 2 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ర్టంలో ఉంది?

ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ర్టంలో ఉంది?

1.    భారతదేశం ఏ రకమైన శీతోష్ణస్థితిని కలిగి ఉంది?
     1) ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి
     2) ఖండాంతర్గత శీతోష్ణస్థితి
     3) ఉష్ణమండల సముద్ర ప్రభావ శీతోష్ణస్థితి
     4) ఏదీకాదు
 
 2.    మన దేశంలో పశ్చిమం వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్న నదులు?
     1) కృష్ణా, గోదావరి
     2) నర్మద, తపతి, మాహి, సబర్మతి
     3) గంగా, బ్రహ్మపుత్ర    4) ఏవీ కావు
 
 3.    దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం?
     1) జైసల్మీర్ (రాజస్థాన్)
     2) అనంతపురం (ఆంధ్రప్రదేశ్)
     3) కచ్ (గుజరాత్)    4) ఏదీకాదు
 
 4.    మనదేశంలో నైరుతి రుతుపవన కాలం?
     1) జూన్ నుంచి సెప్టెంబర్ వరకు
     2) సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు
     3) జూన్ నుంచి జూలై వరకు
     4) జూలై నుంచి నవంబర్ వరకు
 
 5.    ఈశాన్య రుతుపవనాలు (తిరోగమన రుతు పవనాలు) వీచేకాలం?
     1) జూన్ నుంచి సెప్టెంబర్ వరకు
     2) సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు
     3) జూన్ నుంచి జూలై వరకు
     4) సెప్టెంబర్ నుంచి డిసెంబర్
 
 6.    నైరుతి రుతుపవనాల కారణంగా మొదట ఏ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి?
     1) తమిళనాడు     2) కేరళ
     3) తెలంగాణ     4) ఆంధ్రప్రదేశ్
 
 7.    ఈశాన్య రుతుపవనాలు మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి?
     1) పంజాబ్     2) కేరళ
     3) తెలంగాణ     4) ఆంధ్రప్రదేశ్
 
 8.    పస్తుతం హిమాలయాలున్న భూభాగంపై మధ్య మహాయుగంలో ఉన్న సముద్రం?
     1) టెథిస్         2) డూన్
     3) 1,2         4) ఏదీకాదు
 
 9.    భారత ద్వీపకల్ప పీఠభూమిని పూర్వం ఏమని పిలిచేవారు?
     1) గోండ్వానా పీఠభూమి    2) పామీర్ పీఠభూమి
     3) 1,2         4) ఏదీకాదు
 
 10.    హిమాలయాలు ఏ రకమైన పర్వతాలు?
     1) ముడత పర్వతాలు
     2) ప్రాచీన ముడత పర్వతాలు
     3) అగ్ని పర్వతాలు    4) నవీన ముడుత పర్వతాలు
 
 11.    సిమ్లా పట్టణం ఏ పర్వత శ్రేణిలో ఉంది?
     1) కంబన్ శ్రేణి     2) శివాలిక్ శ్రేణి
     3) ధౌల్‌దార్ శ్రేణి     4) ఏదీకాదు
 
 12.    అరుణాచల్ ప్రదేశ్‌లోని బాహ్య హిమాలయాలను ఏమని పిలుస్తారు?
     1) శివాలిక్ కొండలు    2) మిష్మి కొండలు
     3) గురుశికార్ కొండలు     4) హిందూకుష్ కొండలు
 
 13.    డెహ్రాడూన్ వేసవి విడిది కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
     1) ఉత్తరప్రదేశ్     2) హిమాచల్‌ప్రదేశ్
     3) ఉత్తరాఖండ్     4) జార్ఖండ్
 
 14.    పపంచంలో రెండో అతి ఎత్తై శిఖరం (ఓ2) ఏ పర్వత శ్రేణిలో ఉంది?
     1) కంబన్ శ్రేణి     2) శివాలిక్ శ్రేణి
     3) ధౌల్‌దార్ శ్రేణి     4) కారకోరం శ్రేణి
 
 15.    మడ అడవులు (సుందర వనాలు) ఏ రాష్ర్టంలో ఎక్కువగా ఉన్నాయి?
     1) జార్ఖండ్         2) పశ్చిమ బెంగాల్
     3) ఉత్తరాఖండ్     4) జార్ఖండ్
 
 16.    ఆరావళి పర్వతాలలో ఎత్తై ఓ2 శిఖరం?
     1) అనైముడి     2) దొడ్డబెట్ట
     3) గురుశీకార్ పర్వతం     4) ఏదీకాదు
 
 17.    ఆరావళి పర్వతాలు ఏ రకమైనవి?
     1) అతి పురాతన ముడుత పర్వతాలు
     2) ప్రాచీన ముడుత పర్వతాలు
     3) అగ్ని పర్వతాలు
     4) నవీన ముడుత పర్వతాలు
 
 18.    ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ర్టంలో ఉంది?
     1) బీహార్        2) పశ్చిమ బెంగాల్
     3) ఉత్తరాఖండ్     4) జార్ఖండ్
 
 19.    ఆరావళి పర్వత శ్రేణి ఏ రాష్ర్టంలో ఉంది?
     1) బీహార్        2) రాజస్థాన్
     3) ఉత్తరాఖండ్     4) జార్ఖండ్
 
 20.    ఊటీ ఏ కొండల్లో ఉంది?
     1) శివాలిక్ కొండలు     2) మిష్మి కొండలు
     3) గురుశికార్ కొండలు    4) నీలగిరి కొండలు
 
 21.    సింధు నది ముఖ్య ఉపనదులు?
     1) నర్మద, తపతి,     2) మాహి, సబర్మతి
     3) జీలం, చీనాబ్, బియాస్, సట్లేజ్, రావి
     4) ఏదీకాదు
 
 22.    బహ్మపుత్రానదిని అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏమని పిలుస్తారు?
     1) దిహాంగ్         2) పద్మ
     3) మాహి         4) ఏదీకాదు
 
 23.    అసోం దుఖఃదాయనిగా అని ఏ నదిని పిలుస్తారు?
     1) తపతి         2) సబర్మతి
     3) జీలం        4) బ్రహ్మపుత్ర
 
 24.    కృష్ణా నది జన్మస్థానం?
     1) గంగోత్రి        2) నీలగిరి
     3) మహాబలేశ్వర్     4) ఏదీకాదు
 
 25.    సింధు నది జన్మస్థానం?
     1) గంగోత్రి         2) నాసిక్‌త్రయంబకం
     3) మహాబలేశ్వర్     4) మానస సరోవరం
 
 26.    అమర్ కంటక్ వద్ద జన్మించే నది?
     1) తపతి    2) నర్మద     3) మాహి    4) సబర్మతి
 
 27.    తపతి నది జన్మస్థానం?
     1) ముల్టాయి     2) నాసిక్‌త్రయంబకం
     3) మహాబలేశ్వర్     4) మానస సరోవరం
 
 28.     ఏ రుతుపవనాల కారణంగా కోరమండల్ తీరంలో అధిక వర్షం కురుస్తుంది?
     1) ఈశాన్య రుతుపవనాలు
     2) నైరుతి రుతుపవనాలు
     3) రెండిటి కారణంగా    4) ఏదీకాదు
 
 29.    కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళికను (ఈ్కఅ్క) ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
     1) 1972    2) 1974     3) 1973     4) 1975
 
 30.    మహానది ఏ రాష్ర్టంలో ఎక్కువ దూరం ప్రవహిస్తోంది?
     1) పశ్చిమ బెంగాల్     2) ఒడిశా
     3) మహారాష్ట్ర     4) గుజరాత్
 
 31.    బెంగాల్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు?
     1) దామోదర్ నది     2) సబర్మతి
     3)జీలం        4) బ్రహ్మపుత్ర
 
 32.    సుగంధ నూనెను తయారుచేయడానికి ఉపయోగపడే రూసా గడ్డి ఏ జిల్లాలో పండిస్తున్నారు?
     1) ఆదిలాబాద్     2) కరీంనగర్
     3) వరంగల్     4) నిజామాబాద్
 
 33.    భారతదేశ సగటు అటవీ శాతం?
     1) 23.5     2) 24.5    3) 20.55     4) 22.7
 
 34.    అడవుల విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, చివరిస్థానంలో ఉన్న రాష్ర్టం?
     1) పశ్చిమ బెంగాల్     2) ఒడిశా
     3) మహారాష్ట్ర     4) హర్యానా
 
 35.    వైశాల్యం పరంగా అత్యధిక శాతంలో అడవులు గల రాష్ర్టం?
     1) పశ్చిమ బెంగాల్     2) ఒడిశా
     3) మహారాష్ట్ర     4) అరుణాచల్‌ప్రదేశ్
 
 36.    మృత్తికా క్రమక్షయం అంటే?
     1)    సహజ కారణాల వల్ల సారవంతమైన నేలలపైపొర కొట్టుకొని పోవడం
     2) సారవంతమైన నేలలు
     3) నల్లరేగడి నేలలు     4) ఏదీకాదు
 
 37.    ఉష్ణమండల చెర్నోజేమ్ మృత్తికలుగా పేరుగాంచినవి?
     1) బంకమట్టి నేలలు     2) ఒండ్రు మట్టి నేలలు
     3) నల్లరేగడి నేలలు     4) ఏదీకాదు
 
 38.    మౌసమ్ అనేది ఏ భాషా పదం?
     1) అరబిక్     2)ఉర్దూ     3) పర్షియన్     4) గ్రీక్
 
 39.    మనదేశంలో ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రత
 (-400 ఇ) ఎక్కడ నమోదైంది?
     1) న్యూఢిల్లీ        2) ద్రాస్ (కార్గిల్, కాశ్మీర్)
     3) సిమ్లా (హిమాచల్‌ప్రదేశ్)
     4) శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్)
 
 40.    అత్యధిక వర్షపాతం (1141సెం.మీ) నమోదయ్యే మాసిన్రాం ప్రాంతం ఏ రాష్ర్టంలో ఉంది?
     1) మేఘాలయ     2) అరుణాచల్‌ప్రదేశ్
     3) సిక్కిం         4) మిజోరం
 
 41.    తమిళనాడులో అత్యధిక వర్షపాతానికి కారణమయ్యే రుతుపవనాలు?
     1) తిరోగమన రుతుపవనాలు
     2) ఈశాన్య రుతుపవనాలు
     3) నైరుతి రుతుపవనాలు         4) 1,2,3
 
 42.    పత్తిపంటకు చాలా అనుకూలమైన నేలలు?
     1) బంకమట్టి నేలలు     2) ఒండ్రు మట్టి నేలలు
     3) నల్లరేగడి నేలలు     4) ఏదీకాదు
 
 43.    భంగర్, ఖాదర్ మృత్తికలు గల నేలలు?
     1) బంకమట్టి నేలలు     2) ఒండ్రు నేలలు
     3) నల్లరేగడి నేలలు     4) ఏదీకాదు
 
 44.    మృత్తికా పరిరక్షణ పద్దతులు?
     1) కాంటూర్ బండింగ్, ఫర్రోయింగ్, స్ట్రిప్ క్రాపింగ్
     2) విస్తాపన వ్యవసాయం
     3) 1,2    4) ఏదీకాదు
 
 45.    దక్కన్ లావా నేలలుగా పేరుగాంచినవి?
     1) బంకమట్టి నేలలు    2) ఒండ్రు నేలలు
     3) నల్లరేగడి నేలలు     4) ఏదీకాదు
 
 46.    జనసాంద్రత అనగా?
     1) చదరపు కిలోమీటరుకు నివసించే సగటు జనాభా
     2) చదరపు మీటరుకు నివసించే సగటు జనాభా
     3) చదరపు కిలోమీటరుకు నివసించే జనాభా
     4) ఏదీకాదు
 
 47.    {పపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపు కుంటాం?
     1) జులై 10         2) జులై 9
     3) జులై 11         4) జులై 1
 
 48.    తెలంగాణలో అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లా?
     1) మహబూబ్‌నగర్     2) కరీంనగర్
     3) వరంగల్     4) నిజామాబాద్
 
 49.    తెలంగాణ రాష్ర్ట మొత్తం జనాభా?
     1) 4 కోట్ల 52 లక్షలు     2) 3 కోట్ల 72 లక్షలు
     3) 3 కోట్ల 52 లక్షలు     4) 4 కోట్ల 42 లక్షలు
 
 50.    అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా?
     1) నిజామాబాద్     2) కరీంనగర్
     3) వరంగల్     4) రంగారెడ్డి
 
 51.    తెలంగాణలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా?

     1) నల్గొండ         2) కరీంనగర్
     3) వరంగల్     4) నిజామాబాద్
 
 52.    తెలంగాణలో ఎస్టీ జనాభా అధికంగా గల జిల్లా?

     1) ఖమ్మం         2) కరీంనగర్
     3) వరంగల్     4) ఆదిలాబాద్
 
 53.    భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయానికి తోడ్పడే నీటి పారుదల వనరు?
     1) బావులు 2)చెరువులు 3) కాలువలు 4) నదులు
 
 54.    పెరియార్, మెట్టూరు కాలువలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
     1) కేరళ         2) కర్ణాటక
     3) తమిళనాడు     4) ఏదీకాదు
 
 55.    చెరువుల ద్వారా సాగయ్యే భూమి ఏ రాష్ర్టంలో ఎక్కువగా ఉంది?
     1) ఆంధ్రప్రదేశ్     2) తెలంగాణ
     3) తమిళనాడు     4) కేరళ
 
 56.    కాలువలు, బావుల ద్వారా సాగయ్యే భూమి అత్యధికంగా ఉన్న రాష్ర్టం?

     1) ఉత్తరప్రదేశ్     2) తెలంగాణ
     3) తమిళనాడు     4) కేరళ
 
 సమాధానాలు:

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement