గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
డైట్‌సెట్ - 2014
భూగోళశాస్త్రం
బొమ్మనబోయిన శ్రీనివాస్
సీనియర్ ఫ్యాకల్టీ,
హన్మకొండ
1. భూమికి అతిదగ్గరగా ఉన్న నక్షత్రం?
సూర్యుడు
2. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టేకాలం?
8 నిమిషాలు
3. యురేనస్, నెఫ్ట్యూన్, ఫ్లూటోలకు మరో పేరు?
యురేనస్‌ను వరుణ గ్రహమని, నెప్ట్యూన్‌ను ఇంద్రగ్రహమని, ఫ్లూటోను యముడు అని పిలుస్తారు
4. సూర్యుడి నుంచి దూరంలో 3వ స్థానంలో ఉండే గ్రహం?
భూమి
5. అతి ఎక్కువ ఉపగ్రహాలున్న గ్రహం?
శని
6. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమని పిలుస్తారు?
పాలవెల్లి (ఆకాశగంగ)
7. సూర్యగోళం భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది?
1.3 మిలియన్లు
8. సూర్యగ్రహంపై ఉష్ణోగ్రత ఎంత?
సూర్యుని ఉపరితలంపై 6000ని సెంటి గ్రేడ్, కేంద్రంలో 10 లక్షల డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది
9. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం?
బుధుడు
10. భూమి, సూర్యుని నుంచి సగటున ఎంత దూరంలో ఉంది?
149.5 మిలియన్ల కి.మీ.
11. ఉపగ్రహాలు లేని గ్రహాలు?
బుధుడు, శుక్రుడు
12. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం?
చంద్రుడు
13. చంద్రునికి, భూమికి మధ్య సగటు దూరం?
3,84,365 కి.మీ.
14. సూర్య కుటుంబంలో అంతర గ్రహాలుగా వేటిని పిలుస్తారు?
బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు (కుజుడు)
15. {Vహాలన్నింటిలో అతిపెద్ద గ్రహం?
గురుడు (బృహస్పతి/జుపిటర్)
16. {Vహాల పరిమాణంలో భూమి ఎన్నోది?
5వది
17. {Vహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
చాంబర్లీన్, మౌల్టన్
18. సౌరకుటుంబంలో తిరిగే శిలాశకలాలను ఏమని పిలుస్తారు?
లఘుగ్రహాలు (ఆస్ట్టరాయిడ్‌స)
19. భూమిపై రాత్రి, పగలు దేనివల్ల ఏర్పడతాయి?
భూభ్రమణం
20. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే సమయం?
23 గం. 56 నిమిషాల 4.09 సెకన్లు
21. భూ పరిభ్రమణం వల్ల ప్రధానంగా భూమిపై జరిగే పరిణామం?
రుతువులు ఏర్పడడం
22. భూ పరిభ్రమణానికి పట్టే కాలం?
365 1/4 రోజులు
23. భూమి, సూర్యుడికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని ఏమంటారు?
అపహేళి (ఇది జూలై 4న సంభవిస్తుంది)
24. సూర్యుడు, భూమికి మధ్య అత్యల్ప దూరం ఉండే స్థితిని ఏమంటారు?
పరిహేళి (జనవరి 3న ఏర్పడుతుంది)
25. విషవత్తులు అంటే?
భూమధ్య రేఖపై సూర్యకిరణాలు లంబం గా పడే రోజుల్లో రాత్రి, పగటి సమయాలు సమానంగా ఉంటాయి. మార్చి 21, సెప్టెంబరు 23 తేదీల్లో ఈవిధంగా ఉంటుంది. ఈ రెండు రోజులను విషవత్తులు అంటారు.
26. ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభి ద్వారా గీసిన ఊహారేఖను ఏమంటారు?
అక్షం
27. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష్య అంటారు. ఆ కక్ష్య పొడవు?
965 మిలియన్ కి.మీ.
28. కర్కట, మకర రేఖలపై సూర్యకిరణాలు లంబంగా ఎప్పుడు పడతాయి?
సూర్యకిరణాలు కర్కటరేఖ ప్రాంతంలో జూన్ 21న, మకర రేఖ ప్రాంతంలో డిసెంబరు 22న లంబంగా పడతాయి
29. భూ ఉపరితలం నుంచి భూమిలోపలికి వెళ్లే కొద్దీ ప్రతి 32 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుంది?
1ని సెంటిగ్రేడ్
30. భూ వ్యాసార్ధం ఎంత?
6440 కి.మీ.
31. భూ నాభి వద్ద సుమారుగా ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది?
6000ని సెంటిగ్రేడ్
32. భూ ఉపరితలంపైనున్న పొరను ‘సియాల్(Sia)’ అంటారు. ఈ పొరలో ఏ రసాయనాల మిశ్రమం ఉంటుంది?
సిలికా (i), అల్యూమినియం(A)
33. సియాల్ కింద ఉన్న పొరను ఏమంటారు?
సియాల్ కింద ఉన్న పొరను ‘సిమా (Sima)’గా పిలుస్తారు. ఈ పొరలో సిలికా (Si), మెగ్నీషియమ్ (Mg)ల మిశ్రమం ఉంటుంది
34. నిఫె పొరలో వేటి మిశ్రమం ఉంటుంది?
సియా కింది పొరను ‘నిఫె(Nife)’ అంటారు. దీనిలో నికెల్ (Ni), ఇనుము (Fe)ల మిశ్రమం ఉంటుంది.
35. భూమి లోపలికి పోయేకొద్దీ ఉష్ణోగ్రత, పీడనంలో మార్పులు?
పెరుగుతాయి
36. భూగోళాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించే రేఖ?
భూమధ్య రేఖ (0ని అక్షాంశ రేఖ)
37. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖలను ఏమంటారు?
అక్షాంశాలు
38. 23బీని ఉత్తర అక్షాంశరేఖను, 23బీని దక్షిణ అక్షాంశ రేఖను ఏమని పిలుస్తారు?
ర్కటరేఖ, మకరరేఖ
39. భూగోళంపై ఎన్ని రేఖాంశాలుంటాయి?
360. వీటిని మధ్యాహ్న రేఖలని కూడా పిలుస్తారు.
40. లండన్‌లో ‘గ్రీనిచ్’ మీదుగా పోయే రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ఇది ఎన్ని డిగ్రీల రేఖాంశం?
0ని రేఖాంశం
41. భూమి తన చుట్టూ తాను 1ని దూరం తిరగడానికి పట్టే కాలం?
4 నిమిషాలు
42. సూర్యుడు, చంద్రుడు, భూమి వరుసగా ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు ఏర్పడే గ్రహణం?
సూర్య గ్రహణం. ఇది అమావాస్య రోజుల్లో ఏర్పడుతుంది.
43. సూర్యుడు, భూమి, చంద్రుడు వరుసగా ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు ఏర్పడే గ్రహణం?
చంద్రగ్రహణం. ఇది పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది.
44. {పచ్ఛాయ, పాక్షిక ఛాయ అంటే ఏమిటి?
భూమిలో సగం మాత్రమే సూర్యుడికి ఎదురుగా ఉంటుంది. మిగతా సగభాగం తన నీడలోనే ఉండి చీకటిగా ఉంటుంది. ఆ నీడ భాగాన్ని ‘ప్రచ్ఛాయ (్ఖఝఛట్చ)’ అంటారు. ఆ నీడ చుట్టూ ఉన్న భాగాన్ని ‘పాక్షిక ఛాయ (్క్ఛఠఝఛట్చ)’ అంటారు.
45. భూమివైపు నిరంతరం ప్రసరించే సూర్య శక్తిని ఏమంటారు?
సూర్యపుటం
46. భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం అవుతున్న శక్తి శాతాన్ని ఏమంటారు?
ఆల్బిడో
47. సూర్యుని నుంచి నిరంతరం విడుదల చేసే శక్తిని ఏమంటారు?
సౌరవికిరణం
48. సూర్యుని వ్యాసం, భూమి వ్యాసం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ?
100 రెట్లు
49. భూమి సగటున ఒక చ.సెం.మీ. ఉపరితల విస్తీర్ణానికి నిమిషానికి ఎన్ని కేలరీల శక్తికి సమానమైన,సూర్యపుటాన్ని గ్రహిస్తుంది?
2 కేలరీలు
50. భూమి ఆల్బిడో ఎంత?
30 శాతం
51. భూమి ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత?
13ని సెల్సియస్
52. ఒక ప్రదేశం ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తారు?
ఉష్ణమాపకం ద్వారా
53. ఒకే ఉష్ణోగ్రతలున్న ప్రదేశాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు?
సమోష్ణోగ్రత రేఖలు
54. భూమధ్యరేఖ నుంచి దూరంగా పోయే కొద్దీ పగటి ప్రమాణంలో జరిగే మార్పు?
పెరుగుతుంది
55. వేసవి కాలంలో 0ని అక్షాంశం (భూమధ్య రేఖ) వద్ద పగటి ప్రమాణం ఎంత?
12 గంటలు
56. వేసవిలో 90ని అక్షాంశం వద్ద పగటి ప్రమాణం ఎంత?
ఆరు నెలలు
57. అపహేళి సమయంలో (జూలై 4) భూమి నుంచి సూర్యుని దూరం ఎంత?
152 మిలియన్ కి.మీ.
58. పరిహేళి సమయంలో (జనవరి 3) భూమి నుంచి సూర్యుడి దూరం ఎంత?
147 మిలియన్ కి.మీ.
59. వాతావరణం కింద ఉండే పొరలు ఎలా వేడెక్కుతాయి?
భూవికిరణం ద్వారా
60. మిస్ట్రాల్, బోరా అనేవి?
శీతల పవనాలు
61. ఎడారుల్లో వీచే ఉష్ణ పవనాలను ఏమంటారు?
ఫాన్, ఛినూక్
62. భూమిపై నుంచి సగటున ప్రతి వేయి మీటర్ల ఎత్తుకు పోయేకొద్దీ ఎన్ని సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత తగ్గుతుంది?
6ని సెంటిగ్రేడ్. దీన్ని సాధారణ క్షీణతా క్రమం అంటారు.
63. వాతావరణ పీడనాన్ని ఎలా కొలుస్తారు?
భారమితితో
64. వాతావరణ పీడన విస్తరణను ఏ రేఖల ద్వారా చూపుతారు?
సమభార రేఖలు
65. పొడిగా ఉండే గాలి కంటే నీటి ఆవిరి బరువు ఎలా ఉంటుంది?
తక్కువగా
66. భూభ్రమణం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని ఏమంటారు?
కొరియాలిస్ ఎఫెక్ట్
67. బాష్పీభవనం అంటే?
ద్రవరూపంలోని నీరు ఆవిరి రూపంలోకి మారడం
68. ఉత్పతనం అంటే?
ఘనరూపంలోని మంచు ద్రవరూపంలోకి మారకుండానే నేరుగా వాయురూపంలోకి మారే ప్రక్రియ
69. {దవీభవనం అంటే?
నీటి ఆవిరి నీరుగా లేదా మంచుగా మార్పు చెందడం
70. ఫాన్, ఛినూక్, లూ, బోరా, మిస్ట్రాల్, శాంటా అనేవి?
స్థానిక పవనాలు
71. {పపంచ పంచదార గిన్నెగా ప్రసిద్ధి చెందిన దేశం?
క్యూబా
72. భూకంపాల వల్ల తీవ్ర నష్టాలకు గురయ్యే ప్రాంతం?
భూకంప అధికేంద్రం వద్ద ఉండే ప్రాంతం
73. భూకంపం వల్ల భూ ఉపరితలంపై అధిక నష్టాలకు కారణమవుతున్న తరంగాలు?
’L’ తరంగాలు
74. భూకంప తరంగాలను గుర్తించి నమోదు చేసే పరికరం?
సిస్మోగ్రాఫ్
75. భూకంప తరంగాల తీవ్రతను దేనితో కొలుస్తారు?
రిక్టర్ స్కేల్
76. సముద్ర భూతలంపై ఏర్పడే భూకంపాలను ఏమంటారు?
సునామీలు (జపనీస్ పదం)
77. మనదేశంలో అధికంగా భూకంపాలకు గురయ్యే ప్రాంతం?
అసోం
78. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు?
8848 మీటర్లు (ప్రపంచంలోనే ఎత్తైది)
79. ఏ సముద్రంలో అతి తక్కువ లవణీయత ఉంది?
బాల్టిక్ సముద్రం
80. అతి ఎక్కువ లవణీయత ఉండే సముద్రం?
మృతసముద్రం (Dead Sea)
81. సూర్య చంద్రుల గురుత్వాకర్షణ ప్రభావంతో సముద్రాల నీటి మట్టాల్లో ఏర్పడే హెచ్చుతగ్గులను ఏమంటారు?
పోటుపాటులు
82. భూ ఉపరితలంపై సముద్రాలు ఎంత ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నాయి?
71%
83. భూ ఉపరితలానికి దిగువన ఏర్పడిన శిలాద్రవాన్ని ‘మేగ్మా’ అంటారు. భూ ఉపరి
తలాన్ని చేరిన శిలాద్రవాన్ని ఏమంటారు?
లావా
84. నిద్రాణాగ్ని అగ్నిపర్వతాలకు ఉదాహరణ?
ఫ్యూజియామ (జపాన్),
హేల్యకోలా (హవాయి)
చక్రవాతాలు - వాటి పేర్లు
- హిందూ మహాసముద్రంలో ఏర్పడేవి - తుఫాన్‌లు (సైక్లోన్‌స)
- పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేవి - టైఫూన్‌లు
- మెక్సికో సింధు శాఖ, కరేబియన్ సముద్రంలో ఏర్పడేవి- హరికేన్‌లు
- ఆస్ట్రేలియాలో ఏర్పడేవి - విల్లీ విల్లీ
ఆదిమజాతులు - నివసించే ప్రాంతాలు
- రెడ్ ఇండియన్‌లు - అమెజాన్ నదీ పరివాహ ప్రాంతం
- పిగ్మీలు - కాంగో నదీ ప్రాంతం
- సమాంగ్‌లు, సకామిలు - మలేషియా అడవులు
- హెడ్ హంటర్‌స - బోర్నియో ద్వీపం
- కాబు - సుమత్రా ద్వీపం
- బుష్‌మెన్ - కలహరి ఎడారి