Dietcet
-
మే చివరి వారంలో డైట్‌సెట్, ఎడ్‌సెట్
- ఈ వారంలోనే నోటిఫికేషన్ జారీకి చర్యలు - లక్షన్నర మంది విద్యార్థులకు ఊరట సాక్షి, హైదరాబాద్: ఏడాదిగా అస్తవ్యస్తంగా తయారైన ఉపాధ్యాయ విద్యా ప్రవేశాలను ఎట్టకేలకు గాడిన పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యు కేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో 2017– 18 విద్యా సంవత్స రంలో ప్రవేశాలకు డైట్‌సెట్, ఎడ్‌సెట్ నోటిఫి కేషన్ల జారీకి ఓకే చెప్పింది.ఈ ప్రవేశ పరీక్షలను మే చివరిలో నిర్వహించనుంది. ఈ మేరకు అధికారులను ఆదేశించింది. మే చివరిలో ఈ పరీక్షలను జరిపితే జూన్‌లో ఫలితాల వెల్లడి, ప్రవేశాల కౌన్సెలింగ్ జరపాలంది. జులై 1 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జరిపిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూ స్తున్న దాదాపు లక్షన్నర మంది విద్యార్థులకు ఊరట కలిగింది. గతేడాది డీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వమే జీరో ఇయర్ చేసింది. దీంతో డీఎడ్ కోసం ఎదురుచూసిన వారు విద్యాసంవత్సరం నష్టపోవడంతోపాటు 15 వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. మరోవైపు బీఎడ్ కోర్సులో రెండో దశ ప్రవేశాలకు అను మతించలేదు. మేనేజ్మెంట్ కోటా భర్తీకి ఉత్త ర్వులు జారీ చేయలేదు. దీంతో రెండో విడత కౌన్సెలింగ్ లేకుండానే విద్యా సంవత్సరం గడిచిపోయింది. మేనేజ్మెంట్ కోటా భర్తీకి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ ఇవ్వకపోయి నా, యాజమాన్యాలే సీట్లను భర్తీ చేసుకున్నా యి. ఫలితంగా మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన 4 వేల మంది విద్యార్థులు, మేనేజ్మెంట్ కోటాలో చేరిన మరో 2 వేల మంది విద్యార్థులతో యాజమాన్యాలు కాలే జీలను కొనసాగించాయి. రెండో విడత కౌన్సె లింగ్లో భర్తీ చేయాల్సిన 8 వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. దీంతో యాజమాన్యాలు హై కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు చెప్పినా రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టకుండా ఆ తీర్పుపై ఉన్నత విద్యాశాఖ గత జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇలా విద్యా సంవత్సరం కూడా గడిచిపోయింది. దీంతో 2017–18 విద్యా సంవత్సరంలో బీఎడ్‌లో ప్రవేశాలకు ఎడ్‌సెట్ నిర్వహణ అంశాన్ని కూడా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. గత జనవరిలో అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించినా ఎడ్‌సెట్–2017 నిర్వహణకు నియమించలేదు. గతేడాది డీఎడ్ కు జీరో ఇయర్ చేసిన ప్రభుత్వం ఈసారి బీఎడ్‌కు అలానే చేస్తుందా? అనే ఆందోళనతో వివిధ సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. దీంతో 2017–18లో డీఎడ్, బీఎడ్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది బీఎడ్ మేనేజ్మెంట్ కోటాలో యాజమాన్యాలే భర్తీ చేసుకున్న సీట్లకు ర్యాటిఫికేషన్ ఇవ్వనుంది. వర్సిటీల వీసీలతో సమావేశం జరిపి, ఎడ్‌సెట్–2017కు కన్వీనర్‌ను నియమించడంతోపాటు నోటిఫి కేషన్ జారీకి చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి అధికారులను ఆదేశించింది. మరోవైపు డైట్‌సెట్–2017కు ఇప్పటికే కన్వీనర్‌గా శేషుకుమారిని నియమించిన ప్రభుత్వం ప్రవేశాల మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ వెలువడనుంది. -
డైట్‌సెట్ కీ విడుదల- 30న ఫైనల్ కీ
హైదరాబాద్: ఏపీ డైట్‌సెట్-2015 ప్రిలిమనరీ 'కీ'ని బుధవారం విడుదల చేశారు. ప్రాథమిక కీ కోసం http://deecet.ap.cgg.gov.in వెబ్సైట్లో సందర్శించవచ్చు. అభ్యర్ధులు కీని పరిశీలించి అభ్యంతరాలను ఈనెల 28వ తేదీలోపు తమకు తెలియచేయాని కన్వీనర్ పి.పార్వతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా తెలియచేయాలని సూచించారు. ఈమెయిల్ అడ్రస్ diecet.gov@gamil.com కు పంపాలని పేర్కొన్నారు. ఈ అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్కీని ఆగస్టు 30వ తేదీన ప్రకటిస్తామని కన్వీనర్ వివరించారు. -
ఏదీ 'సెట్' కాలేదు
సకాలంలో వృత్తి విద్యా ప్రవేశాలు మిథ్య సుప్రీంకోర్టు ఆదేశించినా ఏటా ఇదే పరిస్థితి అన్ని కోర్సుల్లోనూ ప్రవేశాలు గందరగోళమే ఇంజనీరింగ్ ప్రవేశాలు ఇప్పటికీ అసంపూర్ణమే! ఈసెట్, పాలిసెట్ అలాట్మెంట్లు మాత్రమే పూర్తి ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, లాసెట్.. అన్నీ అంతే! అడ్మిషన్ల కోసం లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. విధానపర నిర్ణయాల్లో జాప్యం.. తప్పుడు నిర్ణయాల ఫలితం.. ఏదైతేనేం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల పరిస్థితి ఏటా గందరగోళంగా మారుతూనే ఉంది.. అడ్మిషన్లలో తీవ్ర జాప్యం జరుగుతూనే ఉంది.. విద్యా సంవత్సరం ప్రారంభమైనా కౌన్సెలింగ్ కోసమే విద్యార్థులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంటూనే ఉంది.. గడిచిన ఐదారేళ్లలో ఏ విద్యా సంవత్సరంలోనూ సరిగ్గా తరగతులు ప్రారంభమైంది లేదు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశించినా అదే పరిస్థితి. ఈసారి కూడా అదే దుస్థితి. రాష్ట్ర విభజన సమస్యలు, అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం, ప్రభుత్వాల మొండిపట్టు వంటివన్నీ ప్రవేశాలు ఆలస్యం కావడానికి కారణమయ్యాయి. ఈసారీ పరిస్థితి అంతే. విద్యా సంవత్సరం సకాలంలో ప్రారంభం కావాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తి ఏ ఒక్క కోర్సు ప్రవేశాల్లోనూ కనిపించడం లేదు. జూలై 31 నాటికే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కోర్సులకు అయితే ప్రవేశాల షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, పాలిసెట్, లాసెట్ అన్నింటి పరిస్థితీ ఇంతే. ఏటా ప్రవేశాలు అక్టోబర్ వరకు కొనసాగుతుండటంతో.. లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంసెట్..: విద్యార్థులకు ఆవేదనే! ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ విద్యార్థులకు ఆవేదనే మిగిల్చింది. కాలేజీలకు అఫిలియేషన్లు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మొండిపట్టు వంటివాటి కారణంగా కౌన్సెలింగ్ జాప్యమైంది. మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగినా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో రెండో దశ కౌన్సెలింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. మొదటి దశలో సీట్లు పొందిన వారు ఇతర కాలేజీల్లోకి మారలేకపోయారు, పూర్తిస్థాయిలో ఆప్షన్లు పెట్టుకోక సీట్లు పొందలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం లేకుండా పోయింది. చివరకు విద్యార్థులే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అవకాశం వస్తుందో లేదో తెలియదు. మొదటి దశలో చేరిన 1.04 లక్షల మంది విద్యార్థులకు మాత్రం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక ఎంసెట్ మేనేజ్మెంట్ కోటా భర్తీ, బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొంది. పీజీఈసెట్: అంతా గందరగోళం పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొదట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్ఆప్షన్లకు అవకాశం ఉంది. ఎడ్‌సెట్..: అఫిలియేషన్లకే దిక్కులేదు ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్)లో ప్రవేశాలు చేపట్టాల్సిన కాలేజీలకు ఇంతవరకు అఫిలియేషన్ల ప్రక్రియే పూర్తి కాలేదు. ఈ నెల 21వ తేదీ నుంచి 28 వరకు సర్టిఫికెట్ల తనిఖీ, 23వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినా... ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఈ కౌన్సెలింగ్‌తో తెలంగాణ, ఏపీల్లోని 69,068 బీఎడ్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన 1,47,188 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలోని 261 కాలేజీల్లో 27,744 సీట్లు అందుబాటులో ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లోని 386 కాలేజీల్లో 41,324 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. డైట్‌సెట్..: పరిస్థితి మరీ దారుణం ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం డైట్‌సెట్‌లో అర్హత సాధించిన 2,25,000 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రవేశాలకు సంబంధించి 650కు పైగా ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. అఫిలియేషన్లు లభిస్తే తప్ప ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసే పరిస్థితి లేదు. అనేక డీఎడ్ కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వానికి సిఫారసులు అందాయి. దీంతో ప్రభుత్వాలు ఎన్నింటికి, ఎప్పుడు అనుమతిస్తాయో.. పాఠశాల విద్యా శాఖలు అఫిలియేషన్లు ఇస్తాయో తెలియదు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని సీట్ల భర్తీ కూడా ఆగిపోయింది. 2012లో అయితే ఏకంగా ఫిబ్రవరిలో తరగతులు ప్రారంభించారు. ఇక ఈసారి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. పీఈసెట్: ఇంకా రాని షెడ్యూల్ వ్యాయమ ఉపాధ్యాయ కోర్సులైన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ)లో ప్రవేశాల కోసం ఇంకా షెడ్యూల్ జారీ కాలేదు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 6వ తేదీ నుంచి చేపట్టాలని మాత్రం నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల్లోని దాదాపు 40 కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టాల్సి ఉంది. ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేసి.. వచ్చే నెల 6 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 7వ తేదీ నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని, 11న సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఐసెట్..: ఆలస్యం తప్పేలా లేదు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను శనివారం జారీ చేశారు. కానీ కాలేజీలకు అఫిలియేషన్లు లభించాల్సి ఉంది. 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల తనిఖీ, 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రవేశాల కోసం ఐసెట్‌లో అర్హత సాధించిన 1,19,756 మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక దీనిపై దృష్టి సారించాలని భావించడంతో.. దీనికి ఆలస్యం తప్పడం లేదు. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కలిపి మొత్తం 1.20 లక్షల వరకు సీట్లను భర్తీ చేయాల్సి ఉండగా.. తెలంగాణలోని 539 కాలేజీల్లో దాదాపు 64 వేల సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 628 కాలేజీల్లో 56 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. లాసెట్దీ అదే పరిస్థితి.. లాసెట్‌లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను ఇంకా జారీ చేయాల్సి ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన యూజీ లాసెట్, పీజీ లాసెట్‌లో అర్హత సాధించిన వారు 19 వేల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇక ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ (ఈసెట్) ప్రవేశాలు పూర్తయి, 12న తరగతులు ప్రారంభమయ్యాయి. పీజీఈసెట్ గందరగోళం పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొద ట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్ఆప్షన్లకు అవకాశం ఉంది. -
డైట్‌సెట్‌లో రావివలస విద్యార్థిని స్టేట్‌ఫస్ట్
గంట్యాడ: డైట్‌సెట్‌లో గంట్యాడ మండలం రావివలస విద్యార్థిని స్టేట్ ఫస్ట్ సాధించింది. ఈ ఫలితాలను ఇటీవల ప్రకటించగా, శనివారం విడుదల చేశారు. నూతన ఆంధ్రప్రదేశ్‌లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. రావివలస గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఆదినారాయణ, మంగమ్మల ప్రథమ కుమార్తె గంట జ్యోతి డైట్‌సెట్‌లో ఆమె 100కు 86 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది. ఈమెను తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్ సిరిపురపు రాము, మాజీ సర్పంచ్ గంట అప్పల సత్యంలు అభినందించారు. ఈమె 10వతరగతి వరకు ఎస్వీడీ గంగాధర ప్రైవేటు పాఠశాలలో చదివింది. ఇంటర్మీడియెట్ విజయ నగరం శ్రీనివాస కళాశాలలో చదివింది. మండలానికి వన్నె తెచ్చిన చదువుల సరస్వతిని గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు కడుబండి శ్రీనువాసరావు, పార్టీ మండల కన్వీనర్ కృష్ణబాబు, ఎంపిపి బి.దేవుడమ్మ, జెడ్పీటీసీ కె.రమేష్కుమార్లు ఫోన్లో అభినందనలు తెలిపారు. -
గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
డైట్‌సెట్ - 2014 భూగోళశాస్త్రం బొమ్మనబోయిన శ్రీనివాస్ సీనియర్ ఫ్యాకల్టీ, హన్మకొండ 1. భూమికి అతిదగ్గరగా ఉన్న నక్షత్రం? సూర్యుడు 2. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టేకాలం? 8 నిమిషాలు 3. యురేనస్, నెఫ్ట్యూన్, ఫ్లూటోలకు మరో పేరు? యురేనస్‌ను వరుణ గ్రహమని, నెప్ట్యూన్‌ను ఇంద్రగ్రహమని, ఫ్లూటోను యముడు అని పిలుస్తారు 4. సూర్యుడి నుంచి దూరంలో 3వ స్థానంలో ఉండే గ్రహం? భూమి 5. అతి ఎక్కువ ఉపగ్రహాలున్న గ్రహం? శని 6. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమని పిలుస్తారు? పాలవెల్లి (ఆకాశగంగ) 7. సూర్యగోళం భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది? 1.3 మిలియన్లు 8. సూర్యగ్రహంపై ఉష్ణోగ్రత ఎంత? సూర్యుని ఉపరితలంపై 6000ని సెంటి గ్రేడ్, కేంద్రంలో 10 లక్షల డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది 9. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం? బుధుడు 10. భూమి, సూర్యుని నుంచి సగటున ఎంత దూరంలో ఉంది? 149.5 మిలియన్ల కి.మీ. 11. ఉపగ్రహాలు లేని గ్రహాలు? బుధుడు, శుక్రుడు 12. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం? చంద్రుడు 13. చంద్రునికి, భూమికి మధ్య సగటు దూరం? 3,84,365 కి.మీ. 14. సూర్య కుటుంబంలో అంతర గ్రహాలుగా వేటిని పిలుస్తారు? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు (కుజుడు) 15. {Vహాలన్నింటిలో అతిపెద్ద గ్రహం? గురుడు (బృహస్పతి/జుపిటర్) 16. {Vహాల పరిమాణంలో భూమి ఎన్నోది? 5వది 17. {Vహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు? చాంబర్లీన్, మౌల్టన్ 18. సౌరకుటుంబంలో తిరిగే శిలాశకలాలను ఏమని పిలుస్తారు? లఘుగ్రహాలు (ఆస్ట్టరాయిడ్స) 19. భూమిపై రాత్రి, పగలు దేనివల్ల ఏర్పడతాయి? భూభ్రమణం 20. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే సమయం? 23 గం. 56 నిమిషాల 4.09 సెకన్లు 21. భూ పరిభ్రమణం వల్ల ప్రధానంగా భూమిపై జరిగే పరిణామం? రుతువులు ఏర్పడడం 22. భూ పరిభ్రమణానికి పట్టే కాలం? 365 1/4 రోజులు 23. భూమి, సూర్యుడికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని ఏమంటారు? అపహేళి (ఇది జూలై 4న సంభవిస్తుంది) 24. సూర్యుడు, భూమికి మధ్య అత్యల్ప దూరం ఉండే స్థితిని ఏమంటారు? పరిహేళి (జనవరి 3న ఏర్పడుతుంది) 25. విషవత్తులు అంటే? భూమధ్య రేఖపై సూర్యకిరణాలు లంబం గా పడే రోజుల్లో రాత్రి, పగటి సమయాలు సమానంగా ఉంటాయి. మార్చి 21, సెప్టెంబరు 23 తేదీల్లో ఈవిధంగా ఉంటుంది. ఈ రెండు రోజులను విషవత్తులు అంటారు. 26. ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభి ద్వారా గీసిన ఊహారేఖను ఏమంటారు? అక్షం 27. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష్య అంటారు. ఆ కక్ష్య పొడవు? 965 మిలియన్ కి.మీ. 28. కర్కట, మకర రేఖలపై సూర్యకిరణాలు లంబంగా ఎప్పుడు పడతాయి? సూర్యకిరణాలు కర్కటరేఖ ప్రాంతంలో జూన్ 21న, మకర రేఖ ప్రాంతంలో డిసెంబరు 22న లంబంగా పడతాయి 29. భూ ఉపరితలం నుంచి భూమిలోపలికి వెళ్లే కొద్దీ ప్రతి 32 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుంది? 1ని సెంటిగ్రేడ్ 30. భూ వ్యాసార్ధం ఎంత? 6440 కి.మీ. 31. భూ నాభి వద్ద సుమారుగా ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? 6000ని సెంటిగ్రేడ్ 32. భూ ఉపరితలంపైనున్న పొరను ‘సియాల్(Sia)’ అంటారు. ఈ పొరలో ఏ రసాయనాల మిశ్రమం ఉంటుంది? సిలికా (i), అల్యూమినియం(A) 33. సియాల్ కింద ఉన్న పొరను ఏమంటారు? సియాల్ కింద ఉన్న పొరను ‘సిమా (Sima)’గా పిలుస్తారు. ఈ పొరలో సిలికా (Si), మెగ్నీషియమ్ (Mg)ల మిశ్రమం ఉంటుంది 34. నిఫె పొరలో వేటి మిశ్రమం ఉంటుంది? సియా కింది పొరను ‘నిఫె(Nife)’ అంటారు. దీనిలో నికెల్ (Ni), ఇనుము (Fe)ల మిశ్రమం ఉంటుంది. 35. భూమి లోపలికి పోయేకొద్దీ ఉష్ణోగ్రత, పీడనంలో మార్పులు? పెరుగుతాయి 36. భూగోళాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించే రేఖ? భూమధ్య రేఖ (0ని అక్షాంశ రేఖ) 37. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖలను ఏమంటారు? అక్షాంశాలు 38. 23బీని ఉత్తర అక్షాంశరేఖను, 23బీని దక్షిణ అక్షాంశ రేఖను ఏమని పిలుస్తారు? ర్కటరేఖ, మకరరేఖ 39. భూగోళంపై ఎన్ని రేఖాంశాలుంటాయి? 360. వీటిని మధ్యాహ్న రేఖలని కూడా పిలుస్తారు. 40. లండన్‌లో ‘గ్రీనిచ్’ మీదుగా పోయే రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ఇది ఎన్ని డిగ్రీల రేఖాంశం? 0ని రేఖాంశం 41. భూమి తన చుట్టూ తాను 1ని దూరం తిరగడానికి పట్టే కాలం? 4 నిమిషాలు 42. సూర్యుడు, చంద్రుడు, భూమి వరుసగా ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు ఏర్పడే గ్రహణం? సూర్య గ్రహణం. ఇది అమావాస్య రోజుల్లో ఏర్పడుతుంది. 43. సూర్యుడు, భూమి, చంద్రుడు వరుసగా ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు ఏర్పడే గ్రహణం? చంద్రగ్రహణం. ఇది పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది. 44. {పచ్ఛాయ, పాక్షిక ఛాయ అంటే ఏమిటి? భూమిలో సగం మాత్రమే సూర్యుడికి ఎదురుగా ఉంటుంది. మిగతా సగభాగం తన నీడలోనే ఉండి చీకటిగా ఉంటుంది. ఆ నీడ భాగాన్ని ‘ప్రచ్ఛాయ (్ఖఝఛట్చ)’ అంటారు. ఆ నీడ చుట్టూ ఉన్న భాగాన్ని ‘పాక్షిక ఛాయ (్క్ఛఠఝఛట్చ)’ అంటారు. 45. భూమివైపు నిరంతరం ప్రసరించే సూర్య శక్తిని ఏమంటారు? సూర్యపుటం 46. భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం అవుతున్న శక్తి శాతాన్ని ఏమంటారు? ఆల్బిడో 47. సూర్యుని నుంచి నిరంతరం విడుదల చేసే శక్తిని ఏమంటారు? సౌరవికిరణం 48. సూర్యుని వ్యాసం, భూమి వ్యాసం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 100 రెట్లు 49. భూమి సగటున ఒక చ.సెం.మీ. ఉపరితల విస్తీర్ణానికి నిమిషానికి ఎన్ని కేలరీల శక్తికి సమానమైన,సూర్యపుటాన్ని గ్రహిస్తుంది? 2 కేలరీలు 50. భూమి ఆల్బిడో ఎంత? 30 శాతం 51. భూమి ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత? 13ని సెల్సియస్ 52. ఒక ప్రదేశం ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తారు? ఉష్ణమాపకం ద్వారా 53. ఒకే ఉష్ణోగ్రతలున్న ప్రదేశాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? సమోష్ణోగ్రత రేఖలు 54. భూమధ్యరేఖ నుంచి దూరంగా పోయే కొద్దీ పగటి ప్రమాణంలో జరిగే మార్పు? పెరుగుతుంది 55. వేసవి కాలంలో 0ని అక్షాంశం (భూమధ్య రేఖ) వద్ద పగటి ప్రమాణం ఎంత? 12 గంటలు 56. వేసవిలో 90ని అక్షాంశం వద్ద పగటి ప్రమాణం ఎంత? ఆరు నెలలు 57. అపహేళి సమయంలో (జూలై 4) భూమి నుంచి సూర్యుని దూరం ఎంత? 152 మిలియన్ కి.మీ. 58. పరిహేళి సమయంలో (జనవరి 3) భూమి నుంచి సూర్యుడి దూరం ఎంత? 147 మిలియన్ కి.మీ. 59. వాతావరణం కింద ఉండే పొరలు ఎలా వేడెక్కుతాయి? భూవికిరణం ద్వారా 60. మిస్ట్రాల్, బోరా అనేవి? శీతల పవనాలు 61. ఎడారుల్లో వీచే ఉష్ణ పవనాలను ఏమంటారు? ఫాన్, ఛినూక్ 62. భూమిపై నుంచి సగటున ప్రతి వేయి మీటర్ల ఎత్తుకు పోయేకొద్దీ ఎన్ని సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది? 6ని సెంటిగ్రేడ్. దీన్ని సాధారణ క్షీణతా క్రమం అంటారు. 63. వాతావరణ పీడనాన్ని ఎలా కొలుస్తారు? భారమితితో 64. వాతావరణ పీడన విస్తరణను ఏ రేఖల ద్వారా చూపుతారు? సమభార రేఖలు 65. పొడిగా ఉండే గాలి కంటే నీటి ఆవిరి బరువు ఎలా ఉంటుంది? తక్కువగా 66. భూభ్రమణం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని ఏమంటారు? కొరియాలిస్ ఎఫెక్ట్ 67. బాష్పీభవనం అంటే? ద్రవరూపంలోని నీరు ఆవిరి రూపంలోకి మారడం 68. ఉత్పతనం అంటే? ఘనరూపంలోని మంచు ద్రవరూపంలోకి మారకుండానే నేరుగా వాయురూపంలోకి మారే ప్రక్రియ 69. {దవీభవనం అంటే? నీటి ఆవిరి నీరుగా లేదా మంచుగా మార్పు చెందడం 70. ఫాన్, ఛినూక్, లూ, బోరా, మిస్ట్రాల్, శాంటా అనేవి? స్థానిక పవనాలు 71. {పపంచ పంచదార గిన్నెగా ప్రసిద్ధి చెందిన దేశం? క్యూబా 72. భూకంపాల వల్ల తీవ్ర నష్టాలకు గురయ్యే ప్రాంతం? భూకంప అధికేంద్రం వద్ద ఉండే ప్రాంతం 73. భూకంపం వల్ల భూ ఉపరితలంపై అధిక నష్టాలకు కారణమవుతున్న తరంగాలు? ’L’ తరంగాలు 74. భూకంప తరంగాలను గుర్తించి నమోదు చేసే పరికరం? సిస్మోగ్రాఫ్ 75. భూకంప తరంగాల తీవ్రతను దేనితో కొలుస్తారు? రిక్టర్ స్కేల్ 76. సముద్ర భూతలంపై ఏర్పడే భూకంపాలను ఏమంటారు? సునామీలు (జపనీస్ పదం) 77. మనదేశంలో అధికంగా భూకంపాలకు గురయ్యే ప్రాంతం? అసోం 78. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు? 8848 మీటర్లు (ప్రపంచంలోనే ఎత్తైది) 79. ఏ సముద్రంలో అతి తక్కువ లవణీయత ఉంది? బాల్టిక్ సముద్రం 80. అతి ఎక్కువ లవణీయత ఉండే సముద్రం? మృతసముద్రం (Dead Sea) 81. సూర్య చంద్రుల గురుత్వాకర్షణ ప్రభావంతో సముద్రాల నీటి మట్టాల్లో ఏర్పడే హెచ్చుతగ్గులను ఏమంటారు? పోటుపాటులు 82. భూ ఉపరితలంపై సముద్రాలు ఎంత ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నాయి? 71% 83. భూ ఉపరితలానికి దిగువన ఏర్పడిన శిలాద్రవాన్ని ‘మేగ్మా’ అంటారు. భూ ఉపరి తలాన్ని చేరిన శిలాద్రవాన్ని ఏమంటారు? లావా 84. నిద్రాణాగ్ని అగ్నిపర్వతాలకు ఉదాహరణ? ఫ్యూజియామ (జపాన్), హేల్యకోలా (హవాయి) చక్రవాతాలు - వాటి పేర్లు - హిందూ మహాసముద్రంలో ఏర్పడేవి - తుఫాన్లు (సైక్లోన్స) - పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేవి - టైఫూన్లు - మెక్సికో సింధు శాఖ, కరేబియన్ సముద్రంలో ఏర్పడేవి- హరికేన్లు - ఆస్ట్రేలియాలో ఏర్పడేవి - విల్లీ విల్లీ ఆదిమజాతులు - నివసించే ప్రాంతాలు - రెడ్ ఇండియన్లు - అమెజాన్ నదీ పరివాహ ప్రాంతం - పిగ్మీలు - కాంగో నదీ ప్రాంతం - సమాంగ్లు, సకామిలు - మలేషియా అడవులు - హెడ్ హంటర్స - బోర్నియో ద్వీపం - కాబు - సుమత్రా ద్వీపం - బుష్మెన్ - కలహరి ఎడారి -
29,820 మందికి డీఎడ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థుల్లో 29,820 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. సీట్లు పొందిన వారి జాబితాను బుధవారం ప్రకటించినట్లు పేర్కొన్నారు. 25 ప్రభుత్వ డైట్ కాలేజీల్లో 3,100 సీట్లను, 642 ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో 26,720 సీట్లను విద్యార్థులకు కేటాయించినట్లు వివరించారు. మొత్తంగా 62,457 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23 నుంచి 26 వరకు కాలేజీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, కాలేజీల్లో చేరిన విద్యార్థులకు 27 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఇక రెండో కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లకు డిసెంబర్ 2 నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. -
డీఎడ్ వార్షిక షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్‌సెట్, కాలేజీల అనుమతులు, ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. ఏటా కాలేజీల అనుమతుల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో నిర్ణీత నెలల్లో అనుమతులు, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, ప్రవేశాలు, తరగతుల ప్రారంభం వంటి అంశాలతో అకడమిక్ కేలండర్‌ను ఖరారు చేసింది. దీనిని ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెస్తూ ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాంతీయ యూనివర్సిటీల వారీగా వాటి పరిధిలోని జిల్లాలకు చెందిన కాలేజీలను విభజించారు. ప్రతీ కాలేజీలో 80 శాతం కన్వీనర్ కోటా సీట్లను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని, నిబంధనల ప్రకారం మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేయాలని అందులో వివరించారు. ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలివే.. * ఏటా మార్చి మొదటి వారంలో డైట్‌సెట్ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహిస్తారు. మార్చి రెండో వారంలో మైనారిటీ కోటా ప్రవేశాలను చేపడతారా? లేదా? అనే అంశంపై ఆప్షన్ ఇచ్చుకునేందుకు నోటిఫికేషన్. * మార్చి నాలుగో వారంలో డైట్‌సెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ * మే మొదటి వారంలో డైట్‌సెట్ నిర్వహణ. మూడో వారంలో ఫలితాలు. * ఆ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టేందుకు అనుమతులు అవసరమైన కాలేజీల జాబితాను మే చివరిలో వారంలో అందజేస్తారు. * అకడమిక్ కేలండర్‌ను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి రూపొందిస్తుంది. * జూన్ మొదటి వారం నుంచి రెండో వారం వరకు మొదటి దశ కౌన్సెలింగ్. వెబ్ ఆప్షన్లు సీట్ల కేటాయింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్ల కేటాయింపు ఖరారు లేఖలు అందజేస్తారు. * జూన్ మూడో వారం నుంచి నాలుగో వారం వరకు రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. * జూలై మొదటి వారంలో మైనారిటీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్లను మైనారిటీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. * జూలై రెండో వారం నుంచి నాలుగో వారం వరకు స్పాట్ అడ్మిషన్లు ఉంటాయి. * ఆగస్టులో మొదటి పని దినం నాడు తరగతులు ప్రారంభిస్తారు.