సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థుల్లో 29,820 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. సీట్లు పొందిన వారి జాబితాను బుధవారం ప్రకటించినట్లు పేర్కొన్నారు. 25 ప్రభుత్వ డైట్ కాలేజీల్లో 3,100 సీట్లను, 642 ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో 26,720 సీట్లను విద్యార్థులకు కేటాయించినట్లు వివరించారు. మొత్తంగా 62,457 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23 నుంచి 26 వరకు కాలేజీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, కాలేజీల్లో చేరిన విద్యార్థులకు 27 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఇక రెండో కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లకు డిసెంబర్ 2 నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
29,820 మందికి డీఎడ్ సీట్ల కేటాయింపు
Published Thu, Nov 21 2013 1:42 AM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM
Advertisement