మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. సీట్ల సద్దుబాటుకు సంబంధించి మహాయుతి (బీజేపీ, శివసేన, ఎస్సీపీల కూటిమి)లో రాజకీయ గందరగోళం నెలకొన్నదనే వార్తలు వస్తున్న తరుణంలో మరో ఆస్తకికర పరిణామం చోటుచేసుకుంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల సద్దుబాటు ఫార్ములాను ఆగస్టు 15 నాటికి మహాయుతి ఖరారు చేయనుంది. కూటమిలోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలు గతంలో గెలిచిన స్థానాలలోనే తిరిగి పోటీ చేసేలా ఫార్ములా రూపొందించనున్నట్లు ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.
ఈ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే స్పందిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో బీజేపీ వారైనా, షిండే లేదా అజిత్ పవార్ వర్గం వారైనా వారి మనోభావాలను గౌరవిస్తామన్నారు. అయితే అక్కడక్కడ ఒకటి లేదా రెండు సీట్ల కేటాయింపులలో తేడా ఉండవచ్చన్నారు. పొత్తు విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య చర్చలు జరగాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment