హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ ఒకటిన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలోని 90 స్థానాల్లో ఒకటైన బధ్రా అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి నిలిచింది . ఈ సీటు హర్యానాలోని కీలకమైన సీట్లలో ఒకటి.
బధ్రా అసెంబ్లీ స్థానం భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ సీటులో మొత్తం 1.5 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 97,247, మహిళా ఓటర్ల సంఖ్య 86,708. ఈ స్థానంలో జాట్ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సీటుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి ఒకసారి ఎన్నికల్లో గెలిచిన వారు మరోమారు విజయం సాధించలేదు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో బధ్రా అసెంబ్లీ స్థానం నుంచి జననాయక్ జనతా పార్టీ నేత నైనా చౌతాలా భారీ విజయాన్ని దక్కించుకున్నారు. నైనాకు 52,543 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రణబీర్ సింగ్ మహేంద్రకు 38,898 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సుఖ్‌వీందర్‌కు 32,685 ఓట్లు వచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సుఖ్‌విందర్ మాంధీ విజయం సాధించగా, 2009లో ఐఎన్‌ఎల్‌డీ నేత కల్నల్ రఘ్‌బీర్ సింగ్ బధ్రా ఎన్నికల్లో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment