haryana assembly elections
-
హస్తం అస్తవ్యస్తం
హరియాణాలో ఈసారి కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేయనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, తీవ్రంగా నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, ఎలాగూ గెలిచేది మేమేనన్న కాంగ్రెస్ నేతల అతి ఆత్మవిశ్వాసం.. వెరసి హస్తం పార్టీని మరోసారి అధికారానికి దూరంచేశాయి. మోదీ–షా ద్వయం రాజకీయ చతురత ధాటికి కాంగ్రెస్ మూడోసారీ ఓటమిని మూటగట్టుకుంది. స్వీయ తప్పిదాలు సైతం కాంగ్రెస్‌ను విజయానికి ఆమడదూరంలో ఆపేశాయి. కేవలం జాట్ వర్గం పైనే గంపెడాశలు పెట్టుకోవడం, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ సింగ్ హూడా అడుగుజాడల్లో నడవడం, కుమారి సెల్జా వంటి దళిత నాయకురాలికి ప్రాధాన్యత తగ్గించడం, అగ్రనేతల మధ్య లోపించిన ఐక్యత వంటి అంశాలు కాంగ్రెస్‌ను పదేళ్ల తర్వాత అధికారం పీఠంపై కూర్చోనివ్వకుండా చేశాయి.ఏకమైన జాట్ వ్యతిరేక ఓట్లుమొదట్నుంచీ రాష్ట్రంలోని జాట్ ఓట్లనే కాంగ్రెస్ నమ్ముకుంది. జాట్యేతర దళితులు, ఓబీసీలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారన్న సంకేతాలను కాంగ్రెస్ పసిగట్టలేకపోయింది. ఇది కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం. బీజేపీ అత్యధిక టికెట్లను ఓబీసీలు, బ్రాహ్మణులకే ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ భూపీందర్ నిర్ణయాలపై ఆధారపడింది. దీన్ని అలుసుగా తీసుకున్న భూపీందర్ కేవలం తన అనుచరగణానికే పెద్దపీట వేశారు. ఎక్కువ మందికి టికెట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలను శాసించే భూపీందర్ పరోక్షంగా పార్టీ ఓటమికి కారణమయ్యారు.గెలుపు గుర్రాలా? కాదా? అనేది చూసుకోకుండా తన అనుచరవర్గానికే అత్యధికంగా పార్టీ టికెట్లు దక్కేలాచేశారు. రాష్ట్రంలో 90 స్థానాలుంటే 72 చోట్ల కాంగ్రెస్ టికెట్ పొందిన వాళ్లు భూపేందర్ మనుషులే. తాను గెలిచి తన వారినీ గెలిపించుకుంటానన్న భూపీందర్ అతివిశ్వాసమే కాంగ్రెస్ పుట్టి ముంచిందని తెలుస్తోంది. కుమారి సెల్జా తన అనుచరుల్లో 9 మందికి టికెట్ దక్కేలా చేశారు. రణ్‌దీప్ సూర్జేవాలా సైతం తన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. దీంతో గెలుపు గుర్రాలను పక్కనబెట్టిన కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది.దూరంగా ఉండిపోయిన సెల్జాబీజేపీకి దగ్గరవుతున్న దళితులను కాంగ్రెస్ వైపునకు తిప్పే సత్తా ఉన్న దళిత నాయకురాలు కుమారి సెల్జా. అయితే ఈమె ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించలేదు. సిర్సా ఎంపీ అయిన సెల్జాను పార్టీ అధిష్టా నమే హరియాణా ఎన్నికల్లో కలగజేసు కోవద్దని సూచించినట్లు సమాచారం. దీని వెనుక భూపీందర్ హస్తముందని వార్తలొచ్చాయి. పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ సెల్జా పాల్గొనలేదు. కీలక ప్రచార ఘట్టాల్లోనూ ఆమె జాడ లేదు. ఒకే పార్టీలో వేర్వేరుగా ప్రచారంరాష్ట్ర నేతలంతా కలిసి ఒకే ప్రచార కార్యక్రమం చేస్తే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అందుకు భిన్నంగా ముఖ్య నేతలు ఎవరికి వారే భిన్న కార్యక్రమాలు చేపట్టి దేనికీ అగ్రతాంబూలం దక్కకుండా చేసుకున్నారు. భూపీందర్ వర్గం విడిగా ‘ఘర్ ఘర్ కాంగ్రెస్’ అంటూ ఇంటింటికీ ప్రచారం మొదలెట్టింది. వీళ్లకు పోటీగా కాంగ్రెస్‌లోనే సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలాలు ‘కాంగ్రెస్ సందేశ్’ యాత్రను మొదలెట్టారు. హరియాణా జనాభాలో 26–28 శాతం మంది జాట్లు ఉంటారు. ఇక్కడ 17 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. మెజారిటీ మార్కును చేరుకోవడానికి అవకాశాలను పెంచే ఈ ఎస్సీ స్థానాలపై కాంగ్రెస్ పెద్దగా దృష్టిపెట్టలేదు. దెబ్బకొట్టిన ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులుప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీనిని ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అవరోధంగా తయారయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులకు మళ్లాయి. దీంతో ఎవరికీ సరైన మెజారిటీ రాలేదు. ఇది బీజేపీకి లాభం చేకూర్చింది. చాలా స్థానాల్లో గెలుపు మార్జిన్లు చాలా స్వల్పంగా ఉండటం చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బాగా చీలినట్లు అర్థమవుతోంది. బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా కేవలం 0.85 శాతం కాగా, ఒంటరిగా పోటీ చేసిన ఆప్‌కు 1.79 శాతం ఓట్లు రావడం గమనార్హం.మరోవైపు దళితుల ఓట్లు పెద్దగా కాంగ్రెస్‌కు పడలేదు. జననాయక్ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, ఆజాద్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు ప్రధానంగా దళితుల ఓట్లపై దృష్టిపెట్టాయి. దీంతో దళితులు కేవలం ఒక్క పార్టీకే ఓటేయకుండా వేర్వేరు పార్టీలకు ఓట్లేయడంతో ఓట్లు చీలాయి. ఇవి పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చగా కాంగ్రెస్ నష్టపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ జాట్ల ఆధిపత్యం కొనసాగుతుందన్న భావనతో ఇతర కులాలు, వర్గాలు ఉద్దేశపూర్వకంగానే ఒక్క బీజేపీకే ఓటేశాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. బరిలో నిల్చొని దాదాపు 10 స్థానాల్లో విజయావకాశాలను కాంగ్రెస్ రెబల్స్ దెబ్బతీశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హరియాణాలో హ్యాట్రిక్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. 48 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించింది. గెలుపు తమదేననే ధీమాతో వెళ్లిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నష్టాన్ని నివారించలేకపోయింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. సీపీఎంతో కలిసి కూటమికి 49 స్థానాలు లభించాయి. హరియాణా ప్రజలు తప్పుడు ప్రచారాన్ని తిరస్కరించారు. అభివృద్ధికి గ్యారంటీని గెలిపించారు. భగవద్గీత బోధించిన నేలపై సత్యం, అభివృద్ధి, సుపరిపాలనకు దక్కిన విజయమిది. ఏ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా దీర్ఘకాలం పాటు ప్రజలు మద్దతిస్తూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్‌కు ‘నో ఎంట్రీ’చూపించారు. అధికారాన్ని జన్మహక్కుగా భావించే కాంగ్రెస్‌కు మళ్లీ అవకాశమివ్వడం చాలా అరుదు. వరుసగా మూడోసారి బీజేపీకి మెజారిటీ ఇచ్చిన హరియాణా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కూటములు కడుతూ భాగస్వాములపై ఆధారపడే కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి. ఒక్కోసారి ఆ పార్టీలనే మింగేస్తుంటుంది.జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం సాధించిన విజయం. మంచి ఫలితాలు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు అభినందనలు. బీజేపీ సాధించిన ఫలితాలను చూసి గర్వంగా ఉంది. మా పార్టీపై నమ్మకముంచి, ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – బీజేపీ కార్యాలయంలో మోదీచండీగఢ్: పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారీ హరియాణాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. జాట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ చతికిలపడితే ఓబీసీ, దళితులు, బ్రాహ్మణుల ఓట్లను సమీకరించి బీజేపీ జయకేతనం ఎగరేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిన ఎంపీ సీట్లతో కుదుపులకు లోనైన కమలనాథుల విజయరథ జైత్రయాత్ర.. హరియాణాలో మాత్రం సాఫీగా సాగింది.మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలయ్యాక ఆరంభ రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. తర్వాత ఉదయం 10, 11 గంటల సమయం దాటగానే ఫలితాల సరళిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యత క్రమంగా తగ్గుతూ బీజేపీ పుంజుకుంది. అది అలాగే తుదికంటా కొనసాగి కమలనాథులకు విజయాన్ని కట్టబెట్టింది. మంగళవారం వెల్లడైన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీకి 39.94 శాతం ఓట్లు పడగా దాదాపు అదే స్థాయిలో కాంగ్రెస్‌కు 39.09 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కంటే కేవలం 0.85 శాతం ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఏకంగా 11 సీట్లను ఎక్కువ గెల్చుకోవడం గమనార్హం. చాలా చోట్ల అత్యల్ప తేడాతో కాంగ్రెస్ ఓడినట్లు వార్తలొచ్చాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించగా వాటిని నిరాధార ఆరోపణలుగా కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) పార్టీ కేవలం రెండు చోట్ల గెలిచింది. స్వతంత్రులు మూడు స్థానాల్లో నెగ్గారు. దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. సొంతంగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 1.79 శాతం ఓట్లతో గెలుపు బోణీ కొట్టలేక ఉసూరుమంది. మల్లయోధురాలి గెలుపు పట్టు బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ(లాద్వా), కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా(గర్హీ సాంప్లా–కిలోయీ) విజయం సాధించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం కొద్దిలో చేజార్చుకున్న మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ ఎన్నికల్లో మాత్రం విజయాన్ని తొలి ప్రయత్నంలోనే ఒడిసిపట్టుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఈమె జూలానా నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. హిసార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్నివాస్ రాణాపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ స్వతంత్య్ర అభ్యరి్థగా పోటీచేసి గెలిచారు.జేజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, హరియాణా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు, బీజేపీ నేత భవ్య బిష్ణోయ్ ఓటమిని చవిచూశారు. భవ్య ఓడిపోయిన అదమ్‌పూర్ స్థానం గత ఐదు దశాబ్దాలుగా బిష్ణోయ్‌లకు కంచుకోటగా ఉంది. ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా సైతం ఓడిపోయారు. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేసిన బీజేపీ తన కేబినెట్ మంత్రులను మాత్రం గెలిపించుకోలేకపోయింది. అసెంబ్లీ స్పీకర్, బీజేపీ నేత జ్ఞాన్‌చంద్ గుప్తా, ఎనిమిది మంది మంత్రులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో 10 స్థానాల్లో గెలిచిన జననాయక్ జనతా పార్టీ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 13 మందిమహిళల విజయం 90 స్థానాలున్న అసెంబ్లీలోకి ఈసారి 13 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ ఫొగాట్, సావిత్రి జిందాల్‌సహా 13 మంది గెల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళా అభ్యర్థులు గెలిచారు. బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు మహిళలు విజయం సాధించారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం: సీఎం సైనీ పార్టీని విజయతీరాలకు చేర్చినందుకు ఓటర్లకు బీజేపీ నేత, ముఖ్యమంత్రి సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ మోదీ నాయకత్వంలో ప్రభుత్వ విధానాలకు ప్రజలు పట్టంకట్టారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం దక్కిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఈ గెలుపు ఘనత పూర్తిగా మోదీజీదే’ అని సీఎం అన్నారు. -
అవినీతి, బంధుప్రీతికి అండగా కాంగ్రెస్: మోదీ ధ్వజం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారంలో చివరి రోజు సైతం (గురువారం) ప్రధాని నరేందర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, బంధుప్రీతి కులతత్వం, మతతత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ధ్వజమెత్తారు.గత కొన్ని రోజులుగా తాను హర్యానా అంతటా పర్యటించానని, ప్రజలు ఉత్సాహంగా బీజేపీని ముచ్చటగా మూడోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ విభజన రాజకీయాలను అంగీకరించే పరిస్థితులు లేవని విమర్శించారు. 201 నుంచి రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందన్న మోదీ.. ఈ పదేళ్లలో హర్యానా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషిచేసిందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించిందని పేర్కొన్నారుఇక హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను మోదీ ఎత్తిచూపుతూ.. ‘హర్యానా ప్రజలకు కాంగ్రెస్ అంటే అవినీతి, కులతత్వం, మతతత్వం, బంధుప్రీతికి హామీ అని తెలుసు. తండ్రీకొడుకుల రాజకీయాల ప్రాథమిక లక్ష్యం స్వార్థం మాత్రమే. నేడు హిమాచల్ నుంచి కర్ణాటక వరకు కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ విధానాలు ప్రజలను నాశనం చేస్తున్నాయి. అందుకే హర్యానా ప్రజలు ఆ పార్టీని అస్సలు కోరుకోవడం లేదు. ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలోనే కాంగ్రెస్‌లో అంతర్గత పోరు రచ్చకెక్కింది. ఆ పార్టీ రాష్ట్రంలో ఎప్పటికీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచలేదు.ఈ రోజు ప్రపంచం మొత్తం ఎంతో ఆశతో, అంచనాలతో భారత్ వైపే దిస్తోంద. అలాంటి పరిస్థితుల్లో హర్యానా ప్రజలు దేశాన్ని బలోపేతం చేసే ప్రభుత్వాన్ని(బీజేపీ ఎన్నుకోవడం ఎంతో ముఖ్యం. కాంగ్రెస్ భారతదేశాన్ని ఎప్పటికీ బలోపేతం చేయలేదు. హర్యానా ప్రజలు మరోసారి తమ ఆశీర్వాదాలను బీజేపీకి అందించాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో బ్రేక్‌లు పడింది. అటు అధికార బబీజేపీతో సహా కాంగ్రెస్, ఆప్, ఇతర స్థానిక పార్టీలు హోరాహోరీగా సభలు, సమావేశాలు నిర్వహించి విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడ్డాయి. మరో రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. -
ఆప్ మద్దతు లేకుండా కుదరదు: హర్యానా ఎన్నికలపై కేజ్రీవాల్
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ మద్దతు లేకుండా హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు కాదని అన్నారు.శుక్రవారం జగధ్రిలో పార్టీ అభ్యర్ధి ఆదర్శ్‌పాల్ గుజ్జర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆప్ అధినేత.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని తెలిపారు.. బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాషాయ పాలకులు అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని ప్రజలకు అందించడం మినహా ప్రజల మేలు కోసం చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు, . ఈసారి రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని అన్నారు.‘హర్యానాలో ఏ ప్రభుత్వం కొలువుతీరినా ఆప్ మద్దతుతోనే సాధ్యమవుతుంది. ఆప్ మంచి స్థాయిలో స్ధానాలను చేజిక్కించుకుంటుంది. తమ పార్టీ తోడ్పాటు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాని పరిస్ధితి నెలకొంటుంది’ అని రోడ్‌షోలో పార్టీ మద్దతుదారులను ఉద్ధేశించి పేర్కొన్నారు.‘కేజ్రీవాల్ నిజాయితీ లేని వ్యక్తి అని ప్రజలు అనుకుంటే, నాకు ఓటు వేయకండి. నీ నేను మీరు వారు నమ్మితే, అప్పుడు మాత్రమే నాకు ఓటు వేయండి., ఢిల్లీ ప్రజలు నన్ను తిరిగి ఎన్నుకున్న తర్వాతే తిరిగి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాను. నేను అనుకుంటే సీఎం సీటులో ఉండిపోగలను. కానీ నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక ప్రజలే నిర్ణయించుకుంటారు. ఏ నాయకుడూ ఈ స్థాయి ధైర్యాన్ని ప్రదర్శించలేదని నేను భావిస్తున్నాను’ అని కేజ్రీవాల్ తెలిపారు.చదవండి: జమ్ముకశ్మీర్‌లో బస్సు బోల్తా.. ముగ్గురు బీఎస్ఎజవాన్ల మృతిఇదిలా ఉండగా 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. హర్యానాలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. వీటిటోపాటు , ఆప్, జననాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్), ఇండియన్ నేషనల్ లోక్ దళ్, బహుజన్ సమాజ్ పార్టీ కూడా బరిలోకి దిగుతున్నాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 31, జేజేపీ 10 స్థానాల్లో విజయం సాధించాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా కాంగ్రెస్, ఆప్ పొత్తుతో బరిలోకి దిగాలని భావించిన సంగతి తెలిసిందే. అయితే సీట్ల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. వేర్వేరుగానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
Haryana: ఆ 11 స్థానాల్లో పోటాపోటీ
హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా తారస్థాయికి చేరుతోంది. పాలక బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ బలహీనపడిందన్న (2019లో మొత్తం పది సీట్లనూ బీజేపీ నెగ్గగా.. 2024లో కాంగ్రెస్ సగం స్థానాలను చేజిక్కించుకుంది) విపక్షాల వాదనకు బలం చేకూర్చేందుకు కాంగ్రెస్‌కు, దాన్ని పూర్వపక్షం చేసేందుకు అధికార పారీ్టకి ఈ ఎన్నికల్లో ఘన విజయం అత్యవసరంగా మారింది. ఢిల్లీ , పంజాబ్ వెలుపల ఉనికి చాటుకోజూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఈ ఎన్నికలు అగి్నపరీక్ష వంటివే. కాంగ్రెస్ సమరోత్సాహంతో కనిపిస్తుండగా, పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతతో సతమతమవుతోంది. రైతు ఆందోళనల వంటివి ఆ పారీ్టకి మరింత సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాలు ఈ రెండు పారీ్టలతో పాటు జేజేపీ, ఐఎన్ఎల్డీ వంటి ప్రాంతీయ పార్టీల హోరాహోరీ పోరుకు వేదికగా మారాయి. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆ హాట్ సీట్లపై ఫోకస్... గర్హీ సంప్లా కిలోయీ హుడా కంచుకోట రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా కంచుకోట. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇప్పటిదాకా ఓటమే ఎరగని నేత ఆయన. దాంతో ఈ స్థానాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్‌కు అత్యవసరం. 25 శాతం జనాభాతో హరియాణాలో ప్రబల శక్తిగా ఉన్న జాట్ల ఓట్లు ఈ స్థానంలో నిర్ణాయకం. వారిలో తమపై తీవ్ర ఆగ్రహం నెలకొని ఉండటం బీజేపీని కలవరపెడుతోంది. హుడాపై గాంగ్స్టర్ రాజేశ్ హుడా భార్య మంజు హుడాను బీజేపీ పోటీకి నిలిపింది. ఆమె తండ్రి మాజీ పోలీసు అధికారి కావడం విశేషం.బద్లీ బీజేపీకి గట్టి పరీక్షబీజేపీ నుంచి రాష్ట్ర పార్టీ మాజీ చీఫ్, జాట్ నేతఓం ప్రకాశ్ ధన్‌ఖడ్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. 2014లో నెగ్గగా 2019లో కాంగ్రెస్ ప్రత్యర్థి కుల్దీప్ వత్స్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారీ ఆయనతోనే అమీతుమీ తేల్చుకుంటున్నారు. హోదాల్ బరిలో పీసీసీ చీఫ్ ఈ ఎస్సీ రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ బరిలో ఉన్నారు. దాంతో బీజేపీ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన జగదీశ్ నాయర్‌ను పక్కన పెట్టి హరీందర్‌సింగ్ రామ్ రతనన్కు టికెటిచి్చంది.హిస్సార్ బీజేపీకి జిందాల్ సవాల్! అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ కీలకంగా మారే ఈ స్థానం ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోనే ధనిక మహిళ అయిన పారిశ్రామిక దిగ్గజం సావిత్రి జిందాల్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగడమే అందుకు కారణం. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలే బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి విజయం సాధించడం తెలిసిందే. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కమల్ గుప్తాకే హిస్సార్ టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి మళ్లీ రామ్నివాస్ రారా బరిలో ఉన్నారు.తోశాం వారసత్వ పోరుకాంగ్రెస్ నుంచి పూర్వాశ్రమంలో క్రికెట్ అడ్మిని్రస్టేటర్ అయిన అనిరుధ్ చౌదరి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రుతి చౌదరితో ఆయన తలపడుతున్నారు. వీరిద్దరూ దివంగత సీఎం బన్సీలాల్ మనవడు, మనవరాలు కావడం విశేషం. దాంతో అన్నాచెల్లెళ్ల పోరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి రాజ్యసభకు ఎన్నికైన కిరణ్ చౌదరి కూతురే శ్రుతి.కైతాల్ బరిలో సుర్జేవాలా జూనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా 2019లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి లీలారామ్ గుర్జర్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి గుర్జర్‌పై సుర్జేవాలా కుమారుడు ఆదిత్య బరిలో ఉన్నారు. తండ్రి ఓటమికి ఆయన బదులు తీర్చుకోగలరా అన్నది ఆసక్తికరంగా మారింది. జూలానా హై ప్రొఫైల్ పోరు ఈసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న స్థానం. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆ పార్టీ తరఫున ఇక్కడి నుంచి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. బీజేపీ కెపె్టన్ యోగేశ్ బైరాగికి టికెట్ ఇవ్వగా, ఆప్ నుంచి మరో రెజ్లర్ కవితా దేవి బరిలో దిగడం విశేషం. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల వివాదంలో మోడీ సర్కారు వ్యవహార శైలి బీజేపీకి ఇక్కడ బాగా ప్రతికూలంగా మారవచ్చని అంటున్నారు.అంబాలా కంటోన్మెంట్ కాంగ్రెస్‌కు ఇంటి పోరుబీజేపీ దిగ్గజం అనిల్ విజ్ ఇక్కడ ఆరుసార్లు గెలిచారు. మనోహర్‌లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో హోంమంత్రిగా చక్రం తిప్పారు. కానీ నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో చేరకుండా దూరం పాటిస్తున్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు వేళ బీజేపీ నేతలేవరూ వెంట లేకపోవడం చర్చకు తావిచ్చింది. కాంగ్రెస్ ఇక్కడ ఇంటి పోరుతో సతమతం అవుతోంది. పరీ్వందర్ సింగ్ పరీని బరిలో దించగా పార్టీ సీనియర్ నేత నిర్మల్‌సింగ్ కుమార్తె చిత్రా శర్వర ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు. గత ఎన్నికల్లో కూడా ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అనిల్ విజ్ చేతిలో 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.ఉచానా జేజేపీ అడ్డా! మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా సిట్టింగ్ స్థానం. రాష్ట్రంపై జేజేపీ పట్టు సడలుతున్న దృష్ట్యా ఈసారి ఇక్కడ ఘన విజయం ఆయనకు అత్యంత కీలకం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేజేపీ 10 సీట్లు నెగ్గి కింగ్ మేకర్‌గా ఆవిర్భవించడం, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం తెలిసిందే. బీజేపీ నుంచి దేవేందర్ అత్రి, కాంగ్రెస్ నుంచి బ్రిజేంద్ర సింగ్ ఆయనకు పోటీ ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ అయిన బ్రిజేంద్ర గత మార్చిలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు.లడ్వా సీఎం సైనీకి పరీక్ష! గత మార్చిలో ఖట్టర్ స్థానంలో సీఎంగా పగ్గాలు చేపట్టిన సైనీ ఇక్కడ బరిలో ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఖట్టర్ కంచుకోట అయిన కర్నాల్ నుంచి గెలిచిన ఆయన ఈసారీ అక్కడినుంచే పోటీ చేయాలని భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు పారీ్టకి అత్యంత సురక్షితమైన ఈ స్థానం నుంచి అయిష్టంగానే బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నెగ్గడం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే మేవాసింగ్ ఈసారి కూడా బరిలో అన్నారు.ఎలెనాబాద్ ఐఎన్ఎల్డీకి అగి్నపరీక్ష జేజేపీ మాదిరిగానే నానాటికీ ప్రభ తగ్గుతున్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ)కు ఇక్కడ విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి భారత్ సింగ్ బెనివాల్, బీజేపీ నుంచి ఆరెస్సెస్ మూలాలున్న అమర్ చంద్ మెహతా ఆయనకు పోటీ ఇస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే?
భారత స్టార్ రెజ్లర్‌గా పేరొందిన వినేశ్ ఫొగట్ ఆస్తుల విలువ వెల్లడైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసిన సందర్భంగా తన దగ్గర ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను ఆమె వెల్లడించింది. కాగా ఒలింపిక్ పతకం గెలవాలన్న వినేశ్ ఫొగట్ కల ప్యారిస్‌లో చెదిరిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగష్టులో జరిగిన విశ్వక్రీడల్లో మహిళల యాభై కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరిన ఆమె.. స్వర్ణ పతక పోరులో తలపడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.నిరాశతో వెనుదిరిగినిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా వినేశ్ పోటీలో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించిన వినేశ్‌కు అక్కడా నిరాశే మిగిలింది. నిబంధనల ప్రకారం ఒక్క గ్రాము అదనపు బరువు ఉన్నా పోటీకి అనుమతించరని కోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా.. ఫైనల్ వరకు తన ప్రయాణం నిబంధనల ప్రకారమే సాగింది కాబట్టి కనీసం సంయుక్త రజతం ఇవ్వాలన్నా అభ్యర్థనను తిరస్కరించింది.కుస్తీకి స్వస్తిఈ పరిణామాల నేపథ్యంలో కలత చెందిన వినేశ్ ఫొగట్ కుస్తీకి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. అయితే, అభిమానుల కోరిక మేరకు మళ్లీ రెజ్లర్‌గా తిరిగి వస్తానని సంకేతాలు ఇచ్చినా.. రాజకీయరంగ ప్రవేశం చేయడం ద్వారా తానిక ఆటకు పూర్తిగా దూరమైనట్లు వినేశ్ చెప్పకనే చెప్పింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఇటీవలే హస్తం పార్టీ కండువా కప్పుకొంది.రాజకీయ నాయకురాలిగా మారిన వినేశ్అంతేకాదు.. జింద్‌లోని జులనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తి వివరాలను పేర్కొంది. ఆ వివరాల ప్రకారం... ‘వినేశ్ ఫొగట్ పేరిట మూడు కార్లు ఉన్నాయి. వోల్వో ఎక్స్‌సీ 60(ధర దాదాపు రూ. 35 లక్షలు), హుందాయ్ క్రెటా (రూ. 12 లక్షలు), టయోటా ఇన్నోవా(రూ. 17 లక్షలు) వినేశ్ వద్ద ఉన్నాయి.ఆస్తి ఎన్ని కోట్లంటే?వీటిలో టయోటా కొనుగోలు చేసేందుకు రూ. 13 లక్షలు లోన్ తీసుకున్న వినేశ్.. ప్రస్తుతం దశల వారీగా చెల్లిస్తోంది. ఇక తన స్థిరాస్తుల విలువ రూ. 2 కోట్ల మేర(సోనిపట్‌లోని ప్లాట్ విలువ) ఉంటుందని ఆమె పేర్కొంది. 2023-24 ఏడాదికి గానూ తాను రూ. 13,85,000 ఆదాయం పొందినట్లు వినేశ్ తెలిపింది. తన చేతిలో ప్రస్తుతం రూ. 1.95 వేల నగదు ఉన్నట్లు వెల్లడించింది’. కాగా రెజ్లర్‌గా ఎదిగిన క్రమంలోనే 30 ఏళ్ల వినేశ్ ఈ మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.నా కల సంగీత నెరవేరుస్తుందివినేశ్ ఫొగట్ ఇప్పుడే రాజకీయాల్లో చేరడం తనకు ఇష్టం లేదన్న ఆమె పెదనాన్న, కోచ్ మహవీర్ ఫొగట్.. తన కుమార్తె సంగీతను లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు సిద్ధం చేస్తానని అన్నారు. ‘‘వినేశ్ వచ్చే విశ్వ క్రీడల్లో పాల్గొంటుందని భావించాను. కానీ తను రాజకీయాల్లో చేరింది. అందుకే సంగీత ఫొగట్‌ను 2028 ఒలింపిక్స్‌కు సిద్ధం చేయాలని నిశ్చయించుకున్నా.దేశానికి తనే పతకం తీసుకువస్తుంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న కారణంగా సంగీత ఈ ఏడాది జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోయింది. ఈసారి మాత్రం అలా జరగదు’’ అని మహవీర్ ఫొగట్ పేర్కొన్నారు. కాగా నాటి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో జరిగిన ఉద్యమంలో వినేశ్, సంగీత, సంగీత భర్త బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిఇదిలా ఉంటే.. వినేశ్తో కలిసి సంగీత ఫొగట్ భర్త బజరంగ్ కూడా కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. వీరిద్దరు స్పోర్ట్స్ కోటాలో తాము పొందిన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. కాగా వినేశ్ ఫొగట్ భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా రెజ్లరే. అతడు రైల్వేలో పనిచేస్తున్నాడు.చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు -
పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు
భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషపై భారత స్టార్ రెజ్లర్‌గా వెలుగొందిన వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండానే తనతో దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారని.. నాకేదో అండగా ఉన్నట్లుగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించింది. తన విషయంలో చాలా రాజకీయాలు నడిచాయని.. అందువల్లే తన మనసు విరిగిపోయిందని తెలిపింది.అనూహ్య రీతిలో అనర్హత వేటుఅందుకే విరక్తిపుట్టి ఇక కుస్తీకి స్వస్తి పలకాలనే కఠిన నిర్ణయానికి వచ్చానంటూ వినేశ్ ఉద్వేగానికి లోనైంది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, స్వర్ణ పతక బౌట్‌కు ముందు అనూహ్య రీతిలో ఆమెపై వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.నో మెడల్ఫలితంగా.. వినేశ్‌కు స్వర్ణం లేదంటే రజతం ఖాయమనుకున్న భారతీయుల కల చెదిరిపోయింది. అయితే, ఫైనల్ చేరే వరకు తన ప్రయాణం నిబంధనలకు అనుగుణంగానే సాగింది కాబట్టి.. కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలని వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. అనేక వాయిదాల అనంతరం వినేశ్ ఫొగట్ అభ్యర్థనను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా పోటీ నుంచి తప్పుకోవాల్సిందేనని.. అలాంటి పరిస్థితిలో పతకం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.ఆస్పత్రిలో ఉండగా పీటీ పరామర్శఇదిలా ఉంటే.. ఫైనల్‌కు ముందు బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించిన వినేశ్ ఫొగట్ అస్వస్థకు గురై ప్యారిస్ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో భారతీయులంతా సోషల్ మీడియా వేదికగా ఆమెకు అండగా నిలబడగా.. ఐఏఓ అధ్యక్షురాలు పీటీ ఉష సైతం హాస్పిటల్‌కు వెళ్లి వినేశ్‌ను పరామర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉష నెట్టింట షేర్ చేసింది.నాడు ఢిల్లీ వీధుల్లో పోరాటంఅయితే, వినేశ్ గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న అప్పటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల ఉద్యమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌తో కలిసి ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసింది. ఈ నేపథ్యంలో ప్యారిస్‌లో వినేశ్‌పై అనర్హత వేటు పడగానే అటు బీజేపీ పెద్దలు, పీటీ ఉష, కేంద్రం నియమించిన న్యూట్రీషనిస్టులపై ఆమె అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు.వినేశ్దే బాధ్యత అన్నట్లుగా ఈ నేపథ్యంలో ఉష స్పందిస్తూ.. బరువు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సదరు అథ్లెట్లదేనని.. ఇందులో తాము చేయడానికి ఏమీ లేదంటూ కుండబద్దలు కొట్టింది. ఈ పరిణామాల క్రమంలో రెజ్లింగ్‌కు స్వస్తి పలుకుతున్నాని ప్రకటించిన వినేశ్ ఫొగట్.. ఇటీవలే రాజకీయాల్లో ప్రవేశించింది. బజరంగ్ పునియాతో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది.అందుకే నా గుండె పగిలిందిఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. పీటీ ఉష తనకు కష్టసమయంలో ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించింది. ‘‘పీటీ ఉష మేడమ్ ఆస్పత్రిలో నన్ను చూడటానికి వచ్చారు. ఒక ఫొటో తీసుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని మీరు అనవచ్చు. అయితే, ప్యారిస్ క్రీడాగ్రామంలోనూ రాజకీయాలు నడిచాయి.అందుకే నా గుండె పగిలింది. రెజ్లింగ్ వదలొద్దు అని చాలా మంది నాకు చెబుతూ ఉంటారు. కానీ ఇంకా ఆటలో కొనసాగడం వల్ల నాకేం ఒరుగుతుంది? అక్కడ ప్రతీదీ రాజకీయమే. మనం ఆస్పత్రిలో పడి ఉన్నపుడు బయట ఏం జరుగుతుందో తెలియదు కదా.పీటీ ఉషది నాటకంనా జీవితంలో అత్యంత దుర్భర సమయంలో ఓ వ్యక్తి వచ్చి నాతో ఫొటో దిగి.. నాకు అండగా ఉన్నానన్న ప్రచారం కోసం దానిని సోషల్ మీడియాలో పెట్టడం సరైందేనా? మద్దతు పలకడం కాదది.. అండగా ఉన్నట్లు నటించడం. నిజానికి మెడల్ కోసం నా తరఫున ఒలింపిక్ సంఘం దేశం పేరుతో పిటిషన్ వేయాలి. కానీ నాకెవరూ అండగా లేకపోవడంతో నా పేరు మీదనే కేసు ఫైల్ చేశాను’’ అని కాంగ్రెస్ నేత, 30 ఏళ్ల వినేశ్ ఫొగట్ పీటీ ఉషను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా పీటీ ఉష రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ ఆమెను ఈ పదవికి నామినేట్ చేసింది.చదవండి: నా ఓటమికి సంతోషించేవాళ్లు దేశ ద్రోహులే: వినేశ్ ఫోగట్ -
కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం!
ఛండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్ యూనిట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.‘ఆప్ హర్యానా చీఫ్‌గా నేను 90 అసెంబ్లీ స్థానాలకు పోటీకి సిద్ధమవుతున్నాను. పొత్తు గురించి పార్టీ హైకమాండ్ నుంచి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈరోజు నిర్ణయం రాకపోతే, సాయంత్రంలోగా మొత్తం 90 స్థానాలకు మా జాబితాను విడుదల చేస్తాం’ అని గుప్తా తెలిపారు.కాగా హర్యాలో పోటీకి ఆప్ పూర్తిగా సిద్దంగా ఉందని పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొలిక్కివచ్చిందని, పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన అనంతరం అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తుపై కొనసాగుతున్న తరుణంలో.. పార్టీ తరపున చర్చలకు నాయకత్వం వహిస్తున్న ఆప్ ఎంపీ రాఘవ్ మాట్లాడుతూ.. పొత్తుపై సానుకూల ఫలితం వస్తుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. ఇరు పార్టీలకు ప్రయోజనం కలిగించేలా పొత్తు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారుఅక్టోబర్ 5న జరిగే హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించాయని పలువురు చెబుతున్నా కార్యాచరణలో అది సాధ్యమయ్యేలా లేదని సమాచారం. కొన్ని సీట్లపై ఆప్ పట్టుబడుతుండటంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని తెలుస్తోంది. 20 స్ధానాలు కావాలని ఆప్ డిమాండ్ చేస్తుండగా సింగిల్ డిజిట్ స్ధానాలనే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుండటంతో చర్చలు ఓ కొలిక్కిరావడం లేదని తెలిసింది. -
హ్యాండిచ్చిన బీజేపీ.. మీడియా ముందు మాజీ ఎమ్మెల్యే కంటతడి
మరో నెల రోజుల్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు వేగం పెంచాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి జరిగే ఎన్నికల కోసం 67 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈలిస్ట్‌లో విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మినహాయించింది.దీంతో పార్టీ నుంచి ఆశించిన వారికి టికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఇప్పటికే బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడం రంజిత్ సింగ్ చౌతాలా గురువారం తన మంత్రి పదవకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.తాజాగా పార్టీ అధిష్టానం నుంచి తనకు టికెట్ నిరాకరించడంతో మరో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్ కంటతడి పెట్టుకున్నారు. అయితే బివానీ జిల్లలోని తోషమ్ నియోజకవర్గం నుంచి శశి రంజన్ పోటీ చేయాలని భావించారు. కానీ ఆయనకు టికెట్ దక్కకపోవడంతో కలత చెంది శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.బీజేపీ ప్రకటించిన జాబితాలో నా పేరు వస్తుందని అనుకున్నాను. పార్టీ నా విలువను చూస్తుందని, నా నియోజకవర్గాన్ని చూస్తుందని అనుకున్నాను. నా పేరు పరిశీలనలో ఉందని నేను ప్రజలకు హామీ ఇచ్చాను. నేను ఇప్పుడు ఏమి చేయాలి? నిస్సహా స్థితిలో ఉన్నాను.’ అంటూ కంటతపడి పెట్టుకున్నాడు. అయితే అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యేను ఓదార్చేందుకు ప్రయత్నించినా ఆయన మాత్రం ఏడుస్తూనే ఉన్నారు.Shashi Ranjan Parmar, former BJP candidate from Tosham, broke down in tears after losing his ticket to Shruti Choudhry, Has called a meeting with his supporters on September 6 at Bhiwani. may contest as independent #HaryanaElections2024 #BJP #Tosham #ShashiRanjan #ShrutiChoudhry pic.twitter.com/VgQimmX4Of— Sushil Manav (@sushilmanav) September 5, 2024అయితే పార్టీ కార్యకర్తలకు, తనకు ఓటేసిన ప్రజలకు అండగా ఉండాలని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చెప్పగా..‘నాకే ఎందుకు ఇలా జరుగుతోంది. నన్ను ఎందుకు పార్టీ పట్టించుకోవడం లేదు. చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చారు.కాగా హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 12. నామినేషన్ల పరిశీలన సెప్టెంబర్ 13న జరనుంది. సెప్టెంబర్ 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. -
ఎన్నికల వేళ హరియాణాలో బీజేపీకి షాక్
చండీగఢ్: హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5వ తేదీన జరగనున్న ఎన్నికలు అధికార బీజేపీలో కాక పుట్టిస్తున్నాయి. బుధవారం బీజేపీ ప్రకటించిన 67 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాలో తమ పేర్లు లేవనే ఆగ్రహంతో మంత్రి రంజిత్ సింగ్, ఎమ్మెల్యే లక్ష్మణ్‌దాస్ నాపాతోపాటు పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్, మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ తిరుగుబాటు ప్రకటించారు. మాజీ డెప్యూటీ ప్రధానమంత్రి దేవీ లాల్ కుమారుడైన రంజిత్ సింగ్ మంత్రి పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మద్దతుదారుల అభిప్రాయం మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నానని, ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేస్తానని రంజిత్ సింగ్ గురువారం ప్రకటించారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న రంజిత్ సింగ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. -
Haryana Assembly Elections 2024: ఎన్నికల బరిలో వినేశ్ ఫొగాట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ తరఫున హరియాణా శాసనసభ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి ఆమె పోటీచేసే అవకాశముందని కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. మరో ప్రముఖ మల్లయోధుడు భజరంగ్ పునియా సైతం బాద్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశముంది. ఈ ఇద్దరు రెజ్లర్లు బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాం«దీతో భేటీ అయ్యారు. దీంతో హస్తం పారీ్టలో వీరిద్దరి చేరిక ఖాయమైందని వార్తలొచ్చాయి. రాహుల్‌తో వినేశ్, పునియాలు దిగిన ఫోటోను కాంగ్రెస్ తన అధికారిక ఖాతా ’ఎక్స్’లో పోస్ట్ చేసిన అనంతరం వీరి పోటీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని గురు లేదా శుక్రవారం జరగబోయే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఖరారుచేస్తారని తెలుస్తోంది. వీరిద్దరి పోటీపై గురువారం నాటికి స్పష్టత వస్తుందని హరియాణా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపక్ బాబరియా మంగళవారం పేర్కొనడం తెల్సిందే. -
కాంగ్రెస్‌లోకి వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా.. హర్యానా ఎన్నికల్లో పోటీ!
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు హీటెక్కాయి. అభ్యర్థలు ఎంపిక, ప్రచారాలపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్‌తో సహా ప్రాంతీయ పార్టీలు వేగం పెంచాయి. అధికారమే అవధిగా వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.భారత స్టారల్ రెజర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అగ్రనేత, లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఇరువురు హస్తం కండువా కప్పుకున్నారు. వినేశ్, బజరంగ్ వచ్చే హర్యానా అసెంబ్లీ ఎన్నికట్లో పోటీ చేయనున్నారు. అయితే వినేశ్ ఫోగట్ జులనా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ జననాయక్ జనతా పార్టీకి చెందిన అమర్జీత్ ధండా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక పునియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు.కాగా గతేడాది భారత రెజ్లింగ్ సమాక్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల అనంతరం బ్రిజ్ భూషన్‌కు బీజేపీ కైసర్‌గంజ్ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో కుమారుడు కరణ్ సింగ్‌కు కేటాయించింది. కాగా 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన ఆప్!
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల రోజులే సమయం ఉండటంతో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా సాగుతోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్ని కల్లో మెరుగైన ప్రదర్శనతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. మిత్రపక్షాలను కలుపుకొని రాష్ట్రాన్ని హస్తగతం చేసుకునేందుకు తమ ఆలోచనలకు పదును పెడుతోంది.ఈ క్రమంలో రాష్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో పొత్తులపై చర్చించేందుకు నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆప్‌తో తొలి భేటీ అయ్యింది. అయితే ఆప్ దాదాపు 20 సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు 20 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పార్టీ అగ్రనేత ఒకరు జాబితాను కాంగ్రెస్‌కు అందించినట్లు సమాచారం.అయితే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కనబర్చిన మెరుగైన పనితీరు ఆధారంగా ఆప్ 20 సీట్లు డిమాండ్ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని వల్ల తమకు అసెంబ్లీ సీట్లలో దామాషా వాటా దక్కుతుందని ఆప్ విశ్వసిస్తోంది. కానీ ఇందుకు కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ వెనుకాడుతోంది.ఇక అధికార బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా దృష్టి సారించిన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఆప్‌తో పొత్తుకు సుముఖంగా ఉన్న హస్తం.. మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై మాత్రం నిర్ణయం తీసుకోవడం సవాల్‌గా మారింది. అయితే కూటమిలో భాగంగా ఆప్‌కు ఎన్ని సీట్లను కేటాయించాలన్న ప్రతిపాదనతో తిరిగి రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. పార్టీ నాయకులను కోరినట్లు సమాచారం.కాగా 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
Haryana Assembly elections 2024: బీజేపీ, కాంగ్రెస్... నువ్వా నేనా
హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో అధికార బీజేపీ, కాంగ్రెస్ నువ్వా, నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. అయితే ఇటీవలి లోక్‌సభ ఎన్ని కల్లో మెరుగైన ప్రదర్శనతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార పారీ్టకి ముచ్చెమటలే పట్టిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల ఆగ్రహం వంటివి బీజేపీని కుంగదీస్తున్నాయి. వీటిని గరిష్టంగా సొమ్ము చేసుకునే ప్రయత్నాలకు హస్తం పార్టీ పదును పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతాలవారీగా చూస్తే పలు కంచుకోటల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఆ మేరకు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు స్థానిక పార్టీ జేజేపీ పుంజుకుంటూ కమలానికి గట్టి సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా కీలకమైన ప్రాంతాల్లో ఈసారి ‘ఓటు షిఫ్టు’ ఎలా ఉండనుందన్నది తుది ఫలితాలను శాసించే అవకాశాలు కని్పస్తున్నాయి... బీజేపీ నేల చూపులు... 2019 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బీజేపీ, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కీలక అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతాన్ని బాగా కోల్పోయింది. ఉదాహరణకు ఫిరోజ్‌పూర్ జిర్కా, నూహ్ అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఏకంగా 16 శాతం చొప్పున ఓట్లు తగ్గాయి. మరోవైపు నారాయణ్‌గఢ్ వంటి చోట్ల పార్టీ ఓటు శాతం 14 శాతానికి పైగా పెరిగినా పెద్దగా లాభం లేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 10 స్థానాలకు పదింటినీ ఒడిసిపట్టగా తాజా ఎన్నికల్లో వాటిలో సగం సీట్లకు కోత పడింది. కాంగ్రెస్ పైపైకి... కాంగ్రెస్ మాత్రం ఈ లోక్‌సభ ఎన్నికల్లో పలు అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుని లాభపడింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి అంబాలా కంటోన్మెంట్ స్థానంలో ఏకంగా 39.8 శాతం, అంబాలా సిటీలో 36.6 శాతం చొప్పున ఓట్లు పెరిగాయి! ఓట్ల శాతం తగ్గిన అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నష్టం జరగకపోవడం విశేషం. ఉదాహరణకు పంచ్కులలో 4.5 శాతం, కాల్కాలో 2 శాతం మాత్రమే ఓట్లు తగ్గాయి. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేక చతికిలపడ్డ కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ భారీగా పుంజుకుంటున్న కీలక ప్రాంతాలు: బాగ్రీ, జాట్లాండ్ వీటిలో 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆదరణ పెరిగింది.బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటున్నకంచుకోటలు: అహిర్వాల్, జీటీ రోడ్ బెల్ట్ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పటికీ బీజేపీ ఆధిపత్యమే సాగుతున్నా 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతంలో తగ్గుదల నమోదైంది.బీజేపీకి ఓట్లు బాగా తగ్గిన ప్రాంతం: బ్రజ్ అహిర్వాల్, జీటీ రోడ్ బెల్ట్ ప్రాంతాల్లో బీజేపీ పటిష్టంగానే కని్పస్తున్నా జాట్లాండ్, బాగ్రీల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. బ్రజ్ ప్రాంతంలో ఇరు పారీ్టలూ గట్టిగా తలపడుతున్నాయి. దాంతో అందరి దృష్టీ అక్టోబర్ 5న జరిగే పోలింగ్ మీదే ఉంది!ప్రస్తుత పరిస్థితి...పోలింగ్‌కు ఇంకా నెల రోజులే ఉన్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ కంచుకోటలపై పట్టు మరింత పెంచుకోవడంతో పాటు బలహీపడుతున్న ప్రాంతాల్లో నష్టాలను కట్టడి చేయడంపై ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే క్రమంగా బలపడుతున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నుంచి రెండు పారీ్టలకూ గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా జాట్లాండ్, బాగ్రీ ప్రాంతాల్లో జేజేపీ జోరు మీదుంది. ఈ నేపథ్యంలో హరియాణాలో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగడం ఖాయంగా కన్పిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పారీ్టలవారీ ఓటింగ్ శాతాన్ని బట్టి చూసినా అదే తేటతెల్లమవుతోంది. అదే ట్రెండు కొనసాగితే 2019లో మాదిరిగానే ఈసారి కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాట్లాండ్, బాగ్రీ ప్రాంతాల్లో ఎవరిది పై చేయి అవుతుందనే దాన్నిబట్టి తుది ఫలితం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.అంకెల్లో...→ 90 అసెంబ్లీ స్థానాలకు గాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో 74 స్థానాల పరిధిలో బీజేపీ ఓట్ల శాతం కాస్తో కూస్తో పెరిగింది. → కానీ 16 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఓట్ల శాతం బాగా తగ్గింది. → దాంతో 2019 ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 5 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు బీజేపీ కోల్పోయింది. → మరోవైపు కాంగ్రెస్ బాగా పుంజుకుంది. పోటీ చేసిన 81 సీట్లకు గాను 68 చోట్ల ఓట్ల శాతాన్ని బాగా పెంచుకుంది. → దాంతో 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతం కాస్త తగ్గినా ఏకంగా 5 లోక్‌సభ సీట్లు ఒడిసిపట్టగలిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Haryana: అందరి దృష్టి ఆ సీటుపైనే..
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ ఒకటిన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలోని 90 స్థానాల్లో ఒకటైన బధ్రా అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి నిలిచింది . ఈ సీటు హర్యానాలోని కీలకమైన సీట్లలో ఒకటి.బధ్రా అసెంబ్లీ స్థానం భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ సీటులో మొత్తం 1.5 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 97,247, మహిళా ఓటర్ల సంఖ్య 86,708. ఈ స్థానంలో జాట్ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సీటుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి ఒకసారి ఎన్నికల్లో గెలిచిన వారు మరోమారు విజయం సాధించలేదు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో బధ్రా అసెంబ్లీ స్థానం నుంచి జననాయక్ జనతా పార్టీ నేత నైనా చౌతాలా భారీ విజయాన్ని దక్కించుకున్నారు. నైనాకు 52,543 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రణబీర్ సింగ్ మహేంద్రకు 38,898 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సుఖ్వీందర్‌కు 32,685 ఓట్లు వచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సుఖ్విందర్ మాంధీ విజయం సాధించగా, 2009లో ఐఎన్ఎల్డీ నేత కల్నల్ రఘ్బీర్ సింగ్ బధ్రా ఎన్నికల్లో విజయం సాధించారు. -
హరియాణాలో ఆప్ బలపరీక్ష!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రస్తుత హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిధ్దమైంది. తాము అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న హరియాణాలో వీలైనన్ని ఎక్కువ సీట్లలో గెలవడం ద్వారా తన బలాన్ని పెంచుకునే ఎత్తులు వేస్తోంది. రాష్ట్రంలోని 90 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిధ్దమైన ఆప్ ఢిల్లీ, పంజాబ్‌ల సరిహద్దుల వెంట ఉన్న 27 నియోజకవర్గాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పొత్తులకు దూరంగా.. ఒంటరి పోరాటం 2019 ఎన్నికల్లోనూ హరియణా అసెంబ్లీలో 46 స్థానాల్లో పోటీ పడిన ఆప్ కేవలం 0.48 శాతం ఓట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. ఆ పారీ్టకి చెందిన 35 మందికి పైగా అభ్యర్థులకు వెయ్యి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల అనంతరం మొదలైన రైతు ఉద్యమాల సమయంలో ఆప్ ఆ రాష్ట్రంలో పుంజుకునే ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచి్చన హరియాణా రైతులకు అటు పంజాబ్‌లోని, ఇటు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సహకరించింది. ఆప్‌కు పెరిగిన బలాన్ని దృష్టిలో పెట్టుకునే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆప్‌తో పొత్తులు పెట్టుకుంది. హరియాణాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు గానూ ఆప్ కురుక్షేత్ర నుంచి ఒక్క స్థానంలోనే పోటీ చేసింది. ఆప్ పార్టీ అభ్యర్థి సుశీల్ గుప్తా 29,021 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీకి చెందిన నవీన్ జిందాల్ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఒంటరిగానే బరిలోకి దిగుతున్న ఆప్, రాష్ట్రంలోని పెహోవా, షహబాద్, కలయత్, గుహ్లా, అంబాలా, తోహానా, రతియా, నర్వానా, రానియా, కలన్వాలి, దబ్వాలీ, సోహ్నా, బల్లాబ్‌ఘర్, బహదూర్ఘర్తో వంటి సరిహద్దు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆప్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఇక్కడ ఇప్పటికే ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ భార్య గురుప్రీత్ కౌర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత ఇప్పటికే రాష్ట్రంలో ప్రచారం మొదలు పెట్టారు. తమ పార్టీ ప్రధాన హామీలైన ఉచిత విద్యుత్, యువతకు ఉపాధి, ప్రతి విద్యారి్థకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ. వెయ్యి సాయం అంశాలను వారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో అభ్యర్థుల ప్రకటన పూర్తయిన వెంటనే ఆప్ తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది. హరియాణాలో అక్టోబర్ ఒకటిన ఎన్నికలు జరుగనున్నాయి. -
Vinesh vs Babita?: రాజకీయాల్లోకి వినేశ్?.. అక్కతో పోటీకి సై!
భారత స్టార్ రెజ్లర్, ఒలింపియన్ వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో అడుగుపెట్టనుందా?.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనుందా?.. అక్కపై పోటీకి సిద్దమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి వినేశ్ సన్నిహిత వర్గాలు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ చేరి.. వినేశ్ ఫొగట్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.పతకం చేజారిందిఇంతరకు భారత మహిళా రెజ్లర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా స్వర్ణ పతక బౌట్‌కు అర్హత సాధించింది వినేశ్ ఫొగట్. అయితే, నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఫైనల్లో పాల్గొనకుండా ఆమెపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు కనీసం సంయుక్త రజతం ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌కు అప్పీలు చేయగా.. నిరాశే ఎదురైంది.ఈ పరిణామాల నేపథ్యంలో వినేశ్ ఫొగట్‌కు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమెకు మద్దతుగా పెద్ద సంఖ్యలో నెటిజన్లు సోషల్ మీడియాను హోరెత్తించారు. ఇక వినేశ్ ప్యారిస్ నుంచి తిరిగి రాగానే.. దేశ రాజధాని ఢిల్లీలో ఆమెకు అపూర్వ స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో వినేశ్ అడుగుపెట్టగానే.. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ఆమె మెడలో మాల వేసి సత్కరించారు. ఆయన కుటుంబ సభ్యులు సైతం వినేశ్‌కు సాదరస్వాగతం పలికారు.అక్కపై పోటీకి సై?ఈ నేపథ్యంలో వినేశ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతోందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాను మాత్రం క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టబోవడం లేదని ఆమె స్పష్టతనిచ్చింది. అయితే, జాతీయ మీడియా తాజా కథనాల ప్రకారం.. వినేశ్ ఫొగట్ పొలిటికిల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి వినేశ్ కుటుంబ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘అవును... అయినా వినేశ్ ఎన్నికల్లో ఎందుకు పోటీచేయకూడదు?.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫొగట్ వర్సెస్ బబితా ఫొగట్, బజరంగ్ పునియా వర్సెస్ యోగేశ్వర్ దత్.. చూసే అవకాశం లేకపోలేదు. వినేశ్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఆమె ఏ పార్టీలో చేరబోతోందో చెప్పలేం’’ అని పేర్కొన్నాయి. బావ మద్దతు వినేశ్‌కే?కాగా బబితా ఫొగట్ మరెవరో కాదు.. వినేశ్ పెదనాన్న, చిన్ననాటి కోచ్ మహవీర్ ఫొగట్ కూతురు. ఆమె బీజేపీ తరఫున ఈ ఏడాది అసెంబ్లీ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. బజరంగ్ పునియా కూడా మహవీర్ అల్లుడే. రెజ్లర్ సంగీత ఫొగట్ భర్త.. అతడు కూడా రెజ్లరే. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వినేశ్‌కు మద్దతుదారుడు.చదవండి: Court of Arbitration for Sport: ఒక్క గ్రాము ఎక్కువున్నా అనర్హతే -
Haryana: ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ మధ్యలో లోకల్
అధికార బీజేపీ. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్. వీటికి తోడు ఐఎన్ఎల్డీ, జేజేపీ, బీఎస్పీ. ఇలా నానా పార్టీలతో కిక్కిరిసిపోయిన హరియాణా రాజకీయ రంగస్థలంపై ఆసక్తికరమైన అసెంబ్లీ ఎన్నికల పోరుకు తెర లేచింది. ఎన్ని పార్టీలున్నా రాష్ట్రంలో ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటూ వస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి షాకే ఇచ్చింది. 2019లో రాష్ట్రంలో మొత్తం పదికి పది లోక్‌సభ స్థానాలనూ బీజేపీ గెలుచుకోగా ఈసారి వాటిలో సగానికి సగం ‘హస్త’గతమయ్యాయి. ఆ ఊపుతో రెట్టించిన ఉత్సాహంతో కని్పస్తున్న కాంగ్రెస్‌ను నిలువరించడం కమలనాథులకు అగి్నపరీక్షే కానుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు రెండు ప్రధానపార్టీల్లో ఎవరి పుట్టి ముంచుతాయన్నది ఆసక్తికరంగా మారింది...కురుక్షేత్రయుద్ధం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణా ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగ్ ఏర్పడింది. 90 అసెంబ్లీ సీట్లకు గాను 40 స్థానాలతో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లున్న జేజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం రాష్ట్రంలో ఓటరు తీర్పు స్పష్టంగానే ఉండనుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ‘‘బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని్పస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు అద్దంపట్టాయి. ఆ పార్టీకి ఓట్ల శాతం భారీగా తగ్గింది’’ అని వారంటున్నారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), బీఎస్పీ వంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరి పుట్టి పుట్టి ముంచుతాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంతో పోలిస్తే ఆ పార్టీలు బాగా బలహీనపడ్డా వాటికి పడే ఓట్లు అంతిమ ఫలితాన్ని తేల్చడంలో కీలకం కానున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ మూడు పార్టీలతో పాటు స్వతంత్రులు కాంగ్రెస్ ఓటుబ్యాంకునే చీల్చి తమను ఒడ్డున పడేస్తారని బీజేపీ గట్టి ఆశలు పెట్టుకుంది. దానికి తోడు ఎప్పట్లాగే జాటేతర ఓట్లన్నీ తమకే పడతాయంటోంది. కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో జాతీయాంశాలు, మోదీ ఫ్యాక్టర్ వంటివేవీ లేవు గనుక బీజేపీ ఓటు బ్యాంకుకు మరింత భారీగా గండి పడటం ఖాయమని చెబుతోంది. ముళ్లబాటలో బీజేపీ... 2014లో హరియాణాలో సొంతంగా అధికారం సాధించిన బీజేపీ, 2019లో జేజేపీ పొత్తుతో దాన్ని నిలుపుకుంది. ఈసారి మాత్రం ఆ పార్టీకి పరిస్థితి ముళ్లబాటనే తలపిస్తోంది. జాటేతర ఓట్లన్నీ గుండుగుత్తగా పడటం రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమల వికాసానికి ప్రధాన కారణంగా నిలిచింది. దాంతో మనోహర్‌లాల్ ఖట్టర్ రూపంలో జాటేతర నేతను బీజేపీ సీఎంను చేసింది. ఆయన తొమ్మిదేళ్లకు పైగా పదవిలో కొనసాగారు. రైతు ఆందోళనలు, గట్టిగా పుంజుకున్న కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న సవాలు నేపథ్యంలో గత మార్చిలో నాయబ్‌సింగ్ సైనీ రూపంలో ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేసింది. ఈ ఎత్తుగడ లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా కలిసి రాకున్నా ఏకంగా 35 శాతమున్న ఓబీసీ ఓట్లను ఒడిసిపట్టే లక్ష్యంతో సైనీ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. అగ్ర కులాల, పట్టణ ఓటర్లపై పట్టును నిలుపుకునేందుకూ బీజేపీ ప్రయతి్నస్తోంది. వారికి వరుసగా తాయిలాలు ప్రకటిస్తోంది. బ్రాహ్మణుడైన మోహన్‌లాల్ బదోలీ రూపంలో ఇప్పటికే అగ్రవర్ణ నేతను రాష్ట్ర పార్టీకి అధ్యక్షున్ని చేసింది. ప్రచార దూకుడూ పెంచనుంది.అడ్వాంటేజ్ కాంగ్రెస్, కానీ...! ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం భూపీందర్ హుడా, ఆయన కుమారుడు దీపీందర్, పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్, సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా మొత్తం 90 అసెంబ్లీ స్థానాల పరిధిలోనూ కలియదిరుగుతున్నారు. ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే పరిస్థితి కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే భూపీందర్, సెల్జా వర్గాల కుమ్ములాటలు పార్టీని కలవరపెట్టే అంశం. ఈ ఇంటి పోరును ఏ మేరకు కట్టడి చేస్తుందన్న దానిపైనే కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నది రాజకీయ వర్గాల అంచనా.ప్రాంతీయ పార్టీలన్నీ కుదేలే... జేజేపీ, ఐఎన్ఎల్డీ రెండూ కొన్నేళ్లుగా ఆదరణ కోల్పోతూ వస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 26 శాతమున్న జాట్లే వాటి ప్రధాన బలం. వారు ఇటీవల కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. రైతుల ఆందోళనలు తారస్థాయిలో ఉన్న వేళ బీజేపీకి కొమ్ముకాయడం జేజేపీకి భారీగా చేటు చేసింది. జాట్లు పూర్తిగా దూరమయ్యారు. జేజేపీ ఓటు బ్యాంకుకు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా గండికొట్టింది. ఈసారి బీఎస్పీతో పొత్తు బాగా కలిసొస్తుందని ఆశలు పెట్టుకున్న ఐఎన్ఎల్డీదీ ఇదే పరిస్థితి. నేతల కీచులాటలు పార్టీని బాగా కుంగదీస్తున్నాయి. బీఎస్పీతో గతంలో పెట్టుకున్న పొత్తు దారుణంగా వికటించిన అనుభవం మరింత భయపెడుతోంది. ఆప్ పరిస్థితీ అంతంతే... పంజాబ్‌ను చేజిక్కించుకున్న ఊపులో హరియాణాలోనూ పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్న సంకేతాలు కని్పంచడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టి పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ ఆప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను దూరం పెట్టి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతోంది!జేజేపీ... కకావికలైన కింగ్‌మేకర్ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ). 2018 డిసెంబర్లో హరియాణా రాజకీయ యవనికపై పుట్టుకొచ్చిన కొత్త పార్టీ. చౌతాలా కుటుంబంలో కుమ్ములాటల ఫలితంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) నుంచి వేరుపడి దుష్యంత్ చౌతాలా ఏర్పాటు చేసుకున్న జేజేపీ 2019లో తొలిసారి అసెంబ్లీ బరిలో దిగింది. 10 సీట్లే గెలిచినా హంగ్ ఏర్పడటంతో కింగ్‌మేకర్‌గా మారింది. కానీ ఐదేళ్లు తిరిగేసరికి నానా ఎదురుదెబ్బలతో బాగా బలహీనపడింది. 2021 రైతు ఆందోళన సమయంలో బీజేపీకి మద్దతు ఉపసంహరించకపోవడం జేజేపీకి చెప్పలేనంత చేటు చేసింది. అనంతరం రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 19 చోట్ల బరిలో దిగి బీజేపీకి పూర్తిగా దూరమైంది. దీనికి తోడు అసమ్మతి, ఫిరాయింపులతో దుష్యంత్ చౌతాలాకు తల బొప్పి కడుతోంది. గత ఏప్రిల్‌లో జేజేపీ రాష్ట్ర చీఫ్ నిషాన్‌సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పదిమంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఇప్పటికే బీజేపీకి జైకొట్టారు. దుష్యంత్ తండ్రి అభయ్ చౌతాలాకు అత్యంత నమ్మకస్తునిగా మెలిగిన ఎమ్మెల్యే అనూప్ ధనక్ శుక్రవారం పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలో బీజేపీలో చేరనున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. దాంతో ఇప్పుడు పార్టీలో దుష్యంత్, ఆయన తల్లి, మరో ఎమ్మెల్యే మాత్రం మిగిలారు. ఈ నేపథ్యంలో పునరై్వభవం దేవుడెరుగు, పార్టీ పుట్టి మునగకుండా చూసుకోవడమే దుష్యంత్‌కు పెను సవాలుగా మారింది. కాంగ్రెస్‌కు కలిసొచి్చన జాట్, రైతు, దళిత ఓట్లు రాష్ట్రంలో నిర్ణాయక శక్తి అయిన జాట్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గారు. వారికి తోడు రైతు, దళిత ఓట్లు కూడా ఆ పార్టీకే భారీగా పడ్డాయి. 90 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 42 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించినట్టు ఓటింగ్ సరళి తేలి్చంది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా చుట్టడం తెలిసిందే. ఆ వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ దానికి 30 స్థానాలకు మించలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Election Commission of India: మోగింది ఎన్నికల భేరీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో దశాబ్ద కాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆర్టీకల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం తొలిసారిగా ఎన్నికల సందడి ప్రారంభం కాబోతోంది. జమ్మూకశ్మీర్‌తోపాటు హరియాణా శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 90 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు దశల్లో, 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి ఒక దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో సెపె్టంబర్ 18, సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలియజేశారు. జమ్మూకశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్–డిసెంబర్లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను సాధారణంగా ఐదు దశల్లో నిర్వహిస్తుంటారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. దీనిపై విమర్శలు వచ్చాయి. అందుకే జమ్మూకశ్మీర్‌లో తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకుంటున్నామని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈసారి కేవలం మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయబోతున్నామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాల వల్లే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసినట్లు వివరించారు. 2019లో హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఒకే సమయంలో జరిగాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఆరంభంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సైతం జరగాల్సి ఉందని, వీటిలో రెండు రాష్ట్రాలకు కలిపి ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, హరియాణాలో పోలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. మీడియా సమావేశంలో రాజీవ్ కుమార్‌తోపాటు ఎన్నికల సంఘం కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెపె్టంబర్ 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.ముగ్గురు జెంటిల్మెన్ మళ్లీ వచ్చేశారు ముగ్గురు పెద్దమనుషులు(జెంటిల్మెన్) మళ్లీ వచ్చేశారని మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ చమత్కరించారు. తన సహచర కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూను విలేకరులకు పరిచయం చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ‘లాపతా జెంటిల్మెన్’ అంటూ ట్రోలింగ్ నడిచింది. ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కనిపించకుండాపోయారని, లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జూన్ 3న విలేకరుల సమావేశంలో రాజీవ్ కుమార్ మాట్లాడుతూ... లాపతా జెంటిల్‌మన్లు త్వరలో తిరిగివస్తారని చెప్పారు. తాము ఎక్కడికీ వెళ్లలేదని, ఇక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు. -
Jairam Ramesh: హరియాణా, ఢిల్లీలో ఆప్‌తో పొత్తు లేనట్టే!
న్యూఢిల్లీ: హరియాణా, ఢిల్లీలో మరో ఏడాదిలోగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) మధ్య పొత్తు కుదిరే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. కానీ, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పారీ్టలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి పారీ్టలు తప్పనిసరిగా పొత్తు పెట్టుకోవాలన్న నిబంధన ఏదీ లేదని స్పష్టంచేశారు. అవగాహన కుదిరిన చోట కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. -
హరియాణా అసెంబ్లీకి ఒంటరిగానే ఆప్
చండీగఢ్: హరియాణలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంటామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్–మేలో, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌లో జరిగే అవకాశాలున్నాయి. హరియాణాలోని జింద్‌లో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో కేజ్రీవాల్ పై నిర్ణయం ప్రకటించారు. ‘హరియాణ ప్రజలిప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని మాత్రమే నమ్ముతున్నారు. పంజాబ్, ఢిల్లీల్లో ఆప్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు. అందుకే, ఈ రాష్ట్ర ప్రజలు కూడా మార్పును కోరుతున్నారు. ఆప్కే అధికార మివ్వాలని భావిస్తున్నారు’అని కేజ్రీవాల్ చెప్పారు. రాష్ట్రాన్ని పాలించిన పార్టీల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. ఆయా పార్టీల నేతలు తమ జేబులనే నింపుకున్నారని ఆరోపించారు. -
ఎందుకు మనసు మార్చుకున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదిపిన బీజేపీ, దుష్వంత్ నాయకత్వంలోని ‘జన్నాయక్ జనతా పార్టీ’తో చేతులు కలిపింది. దుష్వంత్కు డిప్యూటి ముఖ్యమంత్రి పదవిని ఎరవేసి మద్దతు కూడకట్టింది. ఇలాంటి విషయాల్లో పావులు కదపడంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పుడు ముందే ఉంటారనే విషయం తెల్సిందే. అయితే గత (2019) లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీకి బ్రహ్మరథం పట్టిన హరియాణా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ మెజారిటీని కూడా బీజేపీకి ఎందుకు అందించలేదు? అంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నారు? గత లోక్‌సభ ఎన్నికల్లో పదికి పది స్థానాలను గెలుచుకున్న బీజేపీకి 58.2 శాతం ఓట్లు వచ్చాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి ఆరు సీట్లు తక్కువగా 40 సీట్లు గెలుచుకున్న కమలం పార్టీకి 36. 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఐదు నెలల కాలంలోనే 22 శాతం ఓట్లు తగ్గాయి ఎందుకు? ఆరెస్సెస్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజాకర్షణలో వెనకబడ్డారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఎదురైన అసమ్మతిని సర్దుబాటు చేసుకోవడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టింది. మరోపక్క హరియాణాలో ఎక్కువ ఉన్న జాట్లు ఓటు వేయక పోవడం వల్ల పోలింగ్ శాతం తగ్గిందని భావిస్తున్నారు. ఎందుకు? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. హరియాణా ఓటరు తెలివి మీరాడని, లోక్‌సభ ఎన్నికల్లో ఒకలాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలాగా వ్యవహరించే వివేచన వచ్చిందేమో! అన్నట్లుగా జాతీయ టీవీ యాంకర్లు మాట్లాడారు. సాధారణంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒక్కసారి జరిగినప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఓటు వేసిన పార్టీకే, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తారని ఇప్పటి వరకు నిర్వహించిన అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. లోక్‌సభకు, అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలు జరిగినప్పుడు ఓటరు ఎప్పుడూ భిన్నంగానే ఆలోచిస్తాడని, అయితే అందుకు అనేక కారణాలు ఉంటాయని రాజకీయ పండితులు గతంలో అభిప్రాయపడ్డారు. అయితే ఈసారి హరియాణా ప్రజల స్పందనకు స్పష్టమైన కారణాలు కనిపించక పోవడం అంటే బీజేపీ పట్ల గుడ్డి అభిమానం తగ్గుతుందన్నదనడానికి సూచన అని కొంత మంది రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: దుష్యంత్ నన్ను మోసం చేశారు) -
జాట్లే దెబ్బకొట్టారా?
హరియాణాలో ఫలితాలు ఎందుకిలా తల్లకిందులయ్యాయని ఆలోచిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పదికి పది లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ విజయదుంధుభి మోగించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని... అవే ఫలితాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తాయని అంతా భావించారు. ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలూ ఇదే అంచనాతో ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలో బీజేపీ ఓట్ల శాతం 58. ఇది ఈ అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి 36కు పడిపోయింది. అంటే 22 శాతం ఓట్లని బీజేపీ కోల్పోయింది. బీజేపీ స్థానిక అంశాలను పక్కనబెట్టి జాతీయాంశాలైన కశ్మీర్ లాంటి సమస్యలను తెరపైకి తేవడం ప్రజలకు అంతగా రుచించలేదని పరిశీలకులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే పరిస్థితి గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిబింబించింది. మరోవంక కాంగ్రెస్ ఓటు శాతం 2014 అసెంబ్లీ ఎన్నికలకంటే 9 శాతం పెరిగి 29 శాతంగా మారితే, జేజేపీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) ఓటు శాతం 7 శాతం తగ్గింది. బీజేపీ అసెంబ్లీ స్థానాలు తగ్గినప్పటికీ, 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓట్ల శాతం 2 వరకూ పెరిగింది. హరియాణాలో బీజేపీ వ్యతిరేకత ఎంతగా పనిచేసినా జాట్ల ఓట్లు అత్యంత ప్రధానమైనవని భావించకతప్పదు. జాట్ సామ్రాజ్యంలో జాట్యేతర ముఖ్యమంత్రిగా ఖట్టర్ వ్యతిరేకతను పోగుచేసుకొని, జాట్ సామాజిక వర్గ ఓట్ల సమీకరణకు అవకాశం ఇచ్చినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. -
బీజేపీకి పదవి... కాంగ్రెస్‌కు పరువు!!
బీజేపీకి ఆశాభంగం. శివసేనకు నిరుత్సాహం. కాంగ్రెస్, ఎన్సీపీల్లో పరువు దక్కిన ఉత్సాహం! స్థూలంగా ఇదీ... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చిత్రం. ఈ సారి అధికార బీజేపీ, శివసేనలు కూటమిగా ఎన్నికల బరిలో దిగగా, కాంగ్రెస్, ఎన్సీపీలూ జట్టుకట్టి పోటీ చేశాయి. అయితే 220 స్థానాలు సాధించి దేవేంద్ర ఫడ్నవిస్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని ధీమాగా ప్రకటించిన బీజేపీ బొటాబొటీ సీట్లతో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతూండగా... ఉనికిలోనే ఉండదనుకున్న కాంగ్రెస్, ఎన్సీపీ అటు ఇటుగా వంద సీట్లు సాధించి తమ ఉనికిని బలంగా చాటుకున్నాయి. అసంతృప్తులు అధికార కూటమికి చేటు చేయగా.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన ప్రచారం ఆ పార్టీతోపాటు భాగస్వామి కాంగ్రెస్‌కూ కలిసొచ్చింది. వలసలతో బలం పెరగలేదు... మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు పలువురిని బీజేపీ తమవైపునకు తిప్పుకోగలిగినా పార్టీ బలం పెంచలేకపోయాయి. పైపెచ్చు అసంతృప్తుల రూపంలో కొంత నష్టం చేశాయనే చెప్పాలి. సహకార బ్యాంకు కుంభకోణంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును చేర్చడం ద్వారా మరాఠా ఓటును కొల్లగొట్టాలనుకన్న కమలనాథుల ఆశలు నెరవేరకపోగా పశ్చిమ మహారాష్ట్రలో పవార్ వర్గీయులు మరింత బలపడేందుకు అవకాశం ఏర్పడింది. పవార్ ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి పట్టును చాటుకున్నారు. 2014లో పశ్చిమ మహారాష్ట్రలోని మొత్తం 66 స్థానాలకుగాను ఎన్సీపీ 18 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ సారి ఈ సంఖ్య 30కి చేరువ కావడం విశేషం. బారామతిలో అజిత్ పవార్ సుమారు 1.62 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం.. సతారా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఛత్రపతి శివాజీ వారసుడు, ఎన్సీపీ నుంచి బీజేపీకి మారిపోయిన ఉదయన్‌రాజే భోసాలే సైతం ఓటమి పాలు కావడం పవార్ ప్రభ ఇంకా తగ్గలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. బీజేపీ గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లు అనేకం ఈసారి ఎన్సీపీ వశమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ గత ఎన్నికల్లో సాధించిన 11 స్థానాల్లో చాలావాటిని నిలబెట్టుకోగలిగింది. శివసేన పశ్చిమ మహారాష్ట్రలో నాలుగు స్థానాల్లో మాత్రమే కొద్ది ఆధిక్యత కనబరచగలిగింది. రెబెల్స్ కొంప ముంచారా? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు విడివిడిగా పోటీ చేసి మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 122, శివసేన 62 స్థానాలు గెలుచుకోగలిగాయి. ఈసారి కలిసికట్టుగా బరిలోకి దిగినా గతంలో కంటే తక్కువ సీట్లు సాధించగలిగాయి. ప్రతిపక్ష పార్టీల నేతలను తమవైపునకు తిప్పుకునే క్రమంలో బీజేపీ, శివసేనల్లో అసంతృప్తులు పెరిగిపోవడం, టికెట్ల పంపిణీలో గందరగోళం విజయావకాశాలను దెబ్బతీశాయని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ మెరుగుపడిందా? కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఎన్నికలు నిరాశ కలిగించేవే. భాగస్వామిపార్టీ ఎన్సీపీ మెరుగైన ప్రదర్శన కనపరచడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. గత ఎన్నికలకన్నా రెండు మూడు సీట్లు ఎక్కువ సాధించినా సంతోషపడాల్సినంత విషయం కాదు. 147 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ దాదాపు 45 స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి 42 సీట్లే దక్కాయి. రాహుల్, సోనియా, ప్రియాంక వంటి అగ్రనేతలెవరూ ప్రచారంలో పెద్దగా పాల్గొనకపోవడం, నాయకత్వ లేమి విజయావకాశాలను దెబ్బతీశాయని అంటున్నారు. కాంగ్రెస్ తన శక్తియుక్తులను వెచ్చింది ఉంటే బీజేపీ మరిన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చేదని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్! మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో అధికార బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు తల్లకిందులయ్యాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా మినహాయించి మరెవరూ ఓటరు నాడిని పట్టలేకపోయారు. న్యూస్ 18–ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్ మహారాష్ట్రలో బీజేపీ–శివసేనకు 244 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కానీ వాస్తవానికి ఆ కూటమి 161 దగ్గరే నిలిచిపోయింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీకి కలిసి 39 స్థానాలు మాత్రమే వస్తాయని చెబితే అనూహ్యంగా ఆ కూటమి 103 స్థానాలను దక్కించుకుంది. ఇక ఏబీసీ సీ ఓటరు బీజేపీ, శివసేనకి 230, కాంగ్రెస్ కూటమికి 54, రిపబ్లిక్ జన్‌కీ బాత్ బీజేపీ కూటమికి 223, కాంగ్రెస్, ఎన్సీపీకీ 54 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. ఒక్క ఇండియా టుడే మాత్రమే బీజేపీ –శివసేనకు 166 నుంచి 194 వస్తాయని, కాంగ్రెస్, ఎన్సీపీకి 72 నుంచి 90 వస్తాయని అంచనా వేసింది. ఇది మాత్రమే వాస్తవ ఫలితాలకు కాస్తంత దగ్గరగా వచ్చింది. హరియాణా అసెంబ్లీ విషయానికొచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని అంచనావేశాయి. ఏ సంస్థ కూడా ఐఎన్ఎల్డీ చీలిక వర్గం దుష్యంత్ చౌతాలా దూసుకుపోతారని, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు స్థానాలను గెలుచుకోగలదని అంచనా వేయలేదు. కేవలం ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా మాత్రమే హర్యానాలో హంగ్ వస్తుందని అంచనా వేసింది. -
హరియాణాలో హంగ్
న్యూఢిల్లీ/చండీగఢ్: హరియాణాలో రెండోసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు తప్పాయి. రాష్ట్ర అసెంబ్లీలో 90 సీట్లుండగా ‘ఈసారి 75కు పైగా సీట్లు మనవే’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ... ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలు కూడా సాధించలేకపోయింది. సీఎం ఖట్టర్ కేబినెట్లోని మెజారిటీ మంత్రులు అనూహ్యంగా ఓటమి చవిచూశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా బీజేపీతో పోటీగా మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. ఫలితాల సరళిని బట్టి కొత్తగా అవతరించిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారింది. 90 సీట్లున్న హరియాణా అసెంబ్లీలో తాజా ఫలితాలను బట్టి బీజేపీ 40, కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకున్నాయి. మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన జేజేపీ 10 సీట్లలో, స్వతంత్ర అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. వీటిని బట్టి, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు దుష్యంత్ చౌతాలాతో పాటు, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్లు కానున్నారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తొహానా స్థానం నుంచి ఓటమి పాలైన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ సుభాష్ బరాలా... పార్టీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బీజేపీయేతరులు ఏకం కావాలి: హూడా బీజేపీయేతర పక్షాలన్నీ తమతో చేతులు కలపాలని కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా పిలుపునిచ్చారు. మిశ్రమ ఫలితాల నేపథ్యంలో అధికారం చేజిక్కించుకునేందుకు యంత్రాంగాన్ని వాడుకుని స్వతంత్రులపై ఒత్తిడి పెంచుతూ, వారిని బీజేపీ ఎటూ వెళ్లకుండా చేస్తోందని హూడా ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి సెల్జా మాట్లాడుతూ.. ‘బీజేపీని ప్రజలు తిరస్కరించారు. న్యాయం కోసం కొత్త మార్పును కోరుకున్నారు’ అని పేర్కొన్నారు. ఇది బీజేపీకి నైతిక ఓటమి: కాంగ్రెస్ హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి నైతిక ఓటమి రుచి చూపాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఉన్న 90 సీట్లలో 47 సీట్లతో గతంలో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పుడు 40 స్థానాలకు పడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఇప్పుడు దాదాపు 31 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తుకు గతంలో కంటే మంచి ఫలితాలు వచ్చాయని, బీజేపీ మెజార్టీ తగ్గిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది: దుష్యంత్ తాజా ఫలితాలపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా మాట్లాడుతూ.. సీఎం ఖట్టర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ‘ఎవరికి మద్దతిచ్చేదీ ఇప్పుడే చెప్పలేం. ముందుగా మా పార్టీ తరఫున గెలిచిన వారితో సమావేశం ఏర్పాటు చేసి, అసెంబ్లీ నేతను ఎన్నుకుంటాం. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా’ అని అన్నారు. 75 సీట్లలో గెలవాలన్న బీజేపీ లక్ష్యంపై ఆయన స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నారు. అందుకే ఆ పార్టీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది’అని వ్యాఖ్యానించారు. గెలిచిన ప్రముఖులు వీరే... ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై సుమారు 45 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సీనియర్ మంత్రి అనిల్ విజ్ అంబాలా కంటోన్మెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిపై 20 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ అతిరథులైన మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా, కుల్దీప్ బిష్ణోయి, కిరణ్ ఛౌధరీ విజయం సాధించారు. ఉచానా కలాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రేమ్లతపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా 47వేలకు పైగా ఓట్లతో ఘన విజయం నమోదు చేసుకున్నారు. ఇంకా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీకి చెందిన ఒకే ఒక అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా ముందంజలో ఉండగా హరియాణా లోఖిత్ పార్టీ (హెచ్ఎల్పీ) అధ్యక్షుడు గోపాల్ కందా సిర్సా స్థానంలో గెలుపు సాధించారు. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ విజయం సాధించారు. ప్రముఖుల ఓటమి హరియాణా మంత్రివర్గంలోని కెప్టెన్ అభిమన్యు, కవితా జైన్, కృష్ణకుమార్ బేడీతో పాటు రెజ్లర్ బబితా ఫొగట్ ఓటమిపాలయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా, అసెంబ్లీ స్పీకర్ కన్వర్పాల్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ ఓటమిపాలయ్యారు. లోక్తంత్ర సురక్ష పార్టీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ రాజ్‌కుమార్ సైనీ గొహానాలో ఓడిపోయారు. జాట్ల కంచుకోటలో కాంగ్రెస్ జాట్ల కంచుకోటలైన రొహ్తక్, జజ్జర్, సోనిపట్ జిల్లాల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. కేవలం సోనిపట్ జిల్లాలోని రాయ్ సీటును మాత్రం బీజేపీ గెలుచుకోగలిగింది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ 10చోట్లకు పైగా గెలిచి, మరో 11 చోట్ల ముందంజ లో ఉంది. దక్షిణ హరియాణా, ఫరీదాబాద్ జిల్లాల్లో బీజేపీ ప్రభావం చూపగలిగింది. బీజేపీ ముందు 3 దారులు!! హంగ్ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ఏం చేస్తాయి? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తమ నేత దుష్యంత్ చౌతాలాని ముఖ్యమంత్రిని చేస్తే మద్దతిస్తామని ఇప్పటికే జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) తేల్చి చెప్పింది. బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఈ విషయంలో బీజేపీ ముందు మూడు మార్గాలున్నాయి. 1. మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రిగానే ఉంచి దుష్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు బీజేపీ ముందుకు రావచ్చు. ఇది బీజేపీకి సమస్యేమీ కాదు. అయితే జాట్యేతర ముఖ్యమంత్రి ఖట్టర్ కింద డిప్యూటీ సీఎంగా చేరడం జాట్ ఓట్ల పునాదులపై గెలిచిన దుష్యంత్ చౌతాలా రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారవచ్చు. 2. జేజేపీ మినహా ఇతర స్వతంత్ర అభ్యర్థుల మద్దతు పొందే అవకాశం బీజేపీకి ఉంది. ఇప్పటికే ఏడుగురు స్వతంత్రులతో టచ్‌లో ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే ఖట్టర్ తిరిగి అధికార పగ్గాలు చేపట్టవచ్చు. హెచ్ఎల్పీ అధ్యక్షుడు గోపాల్ గోయల్ కందా, సప్నా చౌదరికి బీజేపీ వర్గాలతో సాన్నిహిత్యం ఉంది. వారిద్వారా మిగిలిన స్వతంత్ర అభ్యర్థులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. 3. ఈ ఎన్నికల్లో జాట్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించే అవకాశమూ ఉంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కనుక బీజేపీ సీఎం పదవిని దుష్యంత్ చౌతాలాకు అప్పగించే అవకాశమూ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే అది అంత తేలిక కాదు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుంచి సీఎంగా.. బీజేపీ నేత, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రోహ్తక్ జిల్లా మహమ్ తెహసిల్‌లోని నిదాన గ్రామంలో 1954 మే 5న జన్మించారు. తండ్రి హర్బాస్ లాల్ ఖట్టర్ వ్యాపారి. భారతదేశ విభజన సమయంలో ఇక్కడకు వలస వచ్చిన కుటుంబానికి చెందినవారు. ఖట్టర్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అవివాహితుడు. హరియాణాకు 10వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో 24 ఏళ్ల వయసులో ఖట్టర్ ఆర్ఎస్ఎస్లో చేరారు. 1980 నుంచి దాదాపు 14 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పని చేశారు. 1994లో బీజేపీలో చేరారు. క్షేత్రస్థాయి కార్యకర్తగా బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2014 హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న ఖట్టర్.. బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2014లో మొట్టమొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో హరియాణా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. -
ఈ కుర్రాళ్లకు కాలం కలిసొస్తే...
బాల్ థాకరే వారసుడిగా వచ్చిన ఆదిత్య... ఓం ప్రకాష్ చౌతాలా మనవడిగా బరిలోకి దిగిన దుష్యంత్... ఇద్దరూ కుర్రాళ్లే. తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగినవారే!!. అయితేనేం... శివసేన భారీ విజయాన్ని దక్కించుకుని... సీఎం కుర్చీని రెండున్నరేళ్లు తమకివ్వాలని బేరాలకు దిగింది. బీజేపీ ఇవ్వని పక్షంలో కాంగ్రెస్– ఎన్సీపీలతో జట్టుకట్టి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. అలాగే హరియాణాలో 10 సీట్లు గెలిచి దుష్యంత్ చౌతాలా జేజేపీ కూడా కింగ్ మేకర్‌గా మారింది. దుష్యంత్‌ను సీఎంను చేసినవారికే మద్దతిస్తామని షరతు పెడుతోంది. కాలం గనక కలిసొచ్చి వీళ్లిద్దరూ ముఖ్యమంత్రులయితే... మొదటి బంతికి సిక్స్ కొట్టేసినట్లే. దుష్యంత్... దేవీలాల్ వారసుడు!! హరియాణాలోని హిస్సార్ జిల్లా, దరోలిలో 1988 ఏప్రిల్ 3న దుష్యంత్ జన్మించారు. తల్లి నైనా సింగ్ చౌతాలా, తండ్రి అజయ్ చౌతాలా. తండ్రి పార్లమెంటు మాజీ సభ్యుడు. రాజకీయ దిగ్గజం, తాత ఓం ప్రకాష్ చౌతాలా. నాలుగు సార్లు హరియాణా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఐఎన్ఎల్డీ అధ్యక్షుడు. ముత్తాత దేవీలాల్. మాజీ ఉప ప్రధాని కూడా!!. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన దుష్యంత్ 2014లో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నుంచి పోటీ చేసి హిసార్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. అప్పటికి ఆయన వయసు 26 ఏళ్లు. తక్కువ వయసులోనే లోక్ సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు కూడా. లోక్కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నల్సార్ నుంచి ఎల్ఎల్ఎమ్ చేశారు. మేఘనా చౌతాలాని ఏప్రిల్ 18, 2017న పెళ్లి చేసుకున్నారు. అన్నదమ్ముల పోరు... అన్నదమ్ములు అజయ్ చౌతాలా, అభయ్ చౌతాలాల మధ్య తలెత్తిన విభేదాలు ఐఎన్ఎల్డీలో చీలికకు దారితీశాయి. టీచర్ రిక్రూట్ మెంట్లో అవినీతి ఆరోపణలతో ఓం ప్రకాష్ చౌతాలా 2013లో జైలుకెళ్ళాల్సి వచ్చింది. తరువాత ఎంపీగా గెలిచిన దుష్యంత్ చౌతాలా... అభయ్ చౌతాలా నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. కుటుంబ రాజకీయాలు పార్టీని మరింత విచ్ఛిన్నం చేశాయి. 2018 డిసెంబర్లో ఐఎన్ఎల్డీ నుంచి దుష్యంత్‌ని బహిష్కరించారు. దీంతో 2018 డిసెంబర్ 9న జననాయక్ జనతాపార్టీని (జేజేపీ) దుష్యంత్ ఏర్పాటు చేశారు. తన ముత్తాత దేవీలాల్‌తో పాటు దుష్యంత్ చౌతాలా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించారు. చట్టసభలోకి ‘ఠాక్రే’ ముంబై: బాల్ ఠాక్రే కావచ్చు... ఉద్ధవ్ థాకరమే కావచ్చు. శివసేన అధిపతులుగా వీరు తమ ఇంట్లోంచే పార్టీని నడిపించారు. కార్యకర్తల్ని చట్టసభలకు పంపించారు కానీ... తామెన్నడూ ఎన్నికల బరిలో నిలవలేదు. కానీ వారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే (29) మాత్రం ఎన్నికల బరిలో నిలిచి... గెలిచారు. ఆ కుటుంబం నుంచి చట్టసభలో అడుగుపెడుతున్న తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముంబయిలోని వర్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆదిత్య ఠాక్రే బాంబే స్కాటిష్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. సెయింట్ జేవియర్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ చేశారు. తరవాత కేసీ కళాశాలలో న్యాయ విద్య చదివారు. సాహిత్యంపై అభిరుచి కలిగిన ఆదిత్య ఠాక్రే తాను రాసిన కవితలతో 2007లో ‘మై థాట్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్’అనే పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘ఉమ్మీద్’పేరిట ప్రైవేట్ పాటల ఆల్బమ్నూ వెలువరించారు. ఆదిత్య ఠాక్రే 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కింది స్థాయిలో కార్యకర్తలతో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. ముంబయిలో షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లను రాత్రంతా తెరిచి ఉంచేందుకు అనుమతించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జన ఆశీర్వాద్ యాత్ర పేరిట మహారాష్ట్ర మొత్తం చుట్టివచ్చారు. -
బీజేపీ గెలిచింది కానీ..!
ముంబై/చండీగఢ్: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి అధికారాన్ని నిలుపుకున్నప్పటికీ.. ఆశించిన మెజారిటీ రాలేదు. మరోవైపు, గెలుపు సునాయాసమనుకున్న హరియాణాలో బీజేపీ ఊహించని రీతిలో చతికిలపడింది. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. హంగ్ ఏర్పడటంతో హరియాణాలో 10 స్థానాలు గెలుచుకున్న జననాయక జనతా పార్టీ(జేజేపీ) కింగ్ మేకర్‌గా మారింది. అక్టోబర్ 21న జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి విజయం, హరియాణాలో బీజేపీ గెలుపు అంతా ఖాయమనుకున్నారు. ఈ సంవత్సరం మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయిలో ఆధిక్యత చూపడంతో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమేనని భావించారు. ప్రచారంలోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేదని భావించారు. కానీ అనూహ్యంగా మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి, హరియాణాలో కాంగ్రెస్ పుంజుకున్నాయి. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శివసేన కూటమికి 200కి పైగా సీట్లు వస్తాయని భావించారు. కానీ కాషాయ కూటమి 161 స్థానాల్లో(బీజేపీ 105, శివసేన 56) మాత్రమే విజయం సాధించింది. అయితే, మెజారిటీ రావడంతో రెండో సారి అధికారం చేపట్టనుంది. అనూహ్యంగా పుంజుకున్న ఎన్సీపీ 54 సీట్లలో, కాంగ్రెస్ 45 సీట్లలో విజయం సాధించాయి. హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లలో గెలుపొంది, మెజారిటీకి 6 స్థానాల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో 15 స్థానాలే గెలుచుకున్న కాంగ్రెస్‌కు ఇది డబుల్ ధమాకానే. 10 స్థానాల్లో విజయం సాధించిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) కింగ్ మేకర్‌గా నిలిచింది. ఐఎన్ఎల్డీ ఒక స్థానంలో ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు. జేజేపీని గత సంవత్సరమే దుష్యంత్ చౌతాలా స్థాపించారు. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మద్దతివ్వాలా లేక కాంగ్రెస్‌కా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని దుష్యంత్‌చౌతాలా చెప్పారు. కాగా, హరియాణాలో బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం స్పష్టం చేశారు. మరోవైపు, హరియాణాలో బీజేపీయేతర పార్టీలన్నీ ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా పిలుపునిచ్చారు. కాగా, మహారాష్ట్ర, హరియాణా ఫలితాలను బీజేపీ స్వాగతించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌పై ఆయా రాష్ట్రాల ప్రజలు మరోసారి విశ్వాసం చూపారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పార్టీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. బీజేపీపై మళ్లీ విశ్వాసం చూపించారు: మోదీ న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఆ పార్టీ ముఖ్యమంత్రులపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చే ఐదేళ్లలో వారు మరింత కష్టపడతారని చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ల నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, 2014లో పాలనా పగ్గాలు చేపట్టేనాటికి ఎటువంటి అనుభవం లేనప్పటికీ గడచిన ఐదేళ్లలో వారు స్వచ్ఛమైన పరిపాలనను ప్రజలకు అందించి, ప్రజల విశ్వాస్వాన్ని గెలుపొందారని పేర్కొన్నారు. 2014కు ముందు రెండు రాష్ట్రాల్లో జూనియర్ భాగస్వామిగా ఉన్న బీజేపీ అటు తర్వాత కీలకస్థానానికి చేరిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఫలితాలపై సమీక్ష గురువారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రధాని నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో తాజా అసెంబ్లీ ఫలితాలను సమీక్షించారు. మహారాష్ట్రతో పాటు, మెజారిటీకి ఆరు సీట్ల దూరంలో నిలిచిన హరియాణాలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయాలని బోర్డు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
హరియాణా: కింగ్ మేకర్ మద్దతు ఎవరికి?
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 90 సీట్లలో బీజేపీ 40 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 31, జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 సీట్లలో గెలిచాయి. ఏడుగురు స్వతంత్రులు, ఇతరులు ఇద్దరు విజయం సాధించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం 46. దేవి లాల్ వారసుడిగా, బలమైన జాట్ ఓట్లు ఉన్న జననాయక్ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ఇప్పుడు కింగ్ మేకర్‌గా మారారు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది కీలకంగా మారింది. దుష్యంత్ తమ వెంట రాకుంటే స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు కర్ణాటక వ్యూహాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. జేజేపీ-కాంగ్రెస్: కర్ణాటక మోడల్ జేజేపీని సంప్రదించిన కాంగ్రెస్.. దుష్యంత్‌కు హరియాణా సీఎం పదవిని కట్టబెట్టి బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్లాలని చూస్తోంది. కర్ణాటకలో జేడీఎస్‌తో జత కట్టినట్టుగానే హరియాణాలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. సైద్ధాంతిక పరంగా చూసినట్లయితే.. కాంగ్రెస్, జేజేపీకి హరియాణాలో భూపిందర్ సింగ్ హుడా కాంగ్రెస్‌కు బలమైన జాట్ నేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో దుష్యంత్ చౌతాలాతో విభేదించి కూటమిని చిక్కుల్లో పడేసే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. జేజేపీ-బీజేపీ: బలమైన కేంద్రం కేంద్రంలో బీజేపీ బలంగా ఉండడంతో.. కేంద్రంలోని నాయకులు జోక్యం చేసుకుని దుష్యంత్ చౌతాలాకు హామీ ఇచ్చి బీజేపీ-జేజేపీ కూటమి ఏర్పాటు చేయవచ్చు. అయితే దుష్యంత్ సీఎం పదవిని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దుష్యంత్ తమతో జట్టు కట్టకున్నా స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. -
‘బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి’
ముంబై: హరియాణా ఎన్నికల ఫలితాల సరళిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించాడు. ప్రజల కష్టాలను బీజేపీ ఏ మాత్రం పటించుకోలేదని ఆరోపించాడు. అధికారం కోసం బీజేపీ ఎన్ని కుట్రలైనా పన్నుతుందని, వాటిని తిపికొట్టాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తామని అన్నారు. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని అడ్డుకుంటామని అన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్య పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. అయితే, 2014 అసెంబ్లీ ఎన్నికలు, 2019లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అఖండ విజయాన్ని సాధించిన విషయం విధితమే. -
వాళ్ల కూతురిని తప్పక గెలిపిస్తారు: బబిత
చండీగఢ్ : అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉన్నానని బీజేపీ అభ్యర్థి, స్టార్ రెజ్లర్ బబితా ఫొగట్ విశ్వాసం వ్యక్తం చేశారు. దాద్రీ నియోజకవర్గ ప్రజలు తమ కూతురిని తప్పక గెలిపించితీరతారని వ్యాఖ్యానించారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు అక్టోబరు 21న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బబితా ఫోగట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘ ఒలంపిక్స్ పతకాల కోసం నాలుగేళ్ల ముందు నుంచే సన్నద్ధమవుతాం. ప్రస్తుతం ఈరోజు కూడా అదే విధంగా నేను ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను. ఇక్కడి ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలే నాకు అతిపెద్ద బలం. వారి ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నాను. ప్రజలపై, నాపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ల ఆశీసులు తమ కూతురిపై ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తున్నాను అని బబిత పేర్కొన్నారు. కాగా దేశ వ్యాప్తంగా జరిగిన తాజా ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరియాణా, మహారాష్ట్రలోని పలు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే బబిత బరిలోకి దిగిన దాద్రీ నియోజకవర్గంలో జాట్ల ప్రాబల్యం అధికం. ఇక్కడ ఇంతవరకు బీజేపీ స్వతహాగా ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో ఈస్థానం నుంచి ఐఎన్ఎల్డీ తరఫున గెలుపొందిన రాజ్‌దీప్ ఫొగట్.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీ బబితాను బరిలో దించింది. ఈ నేపథ్యంలో బబిత గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జాట్ల ఆడపడుచు కాబట్టి బబిత విజయం ఖాయమని కొంతమంది వాదిస్తుండగా.. బీజేపీకి ఇక్కడ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు కాబట్టి బబితా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బబిత వెనుకంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమెతో పాటు టిక్‌టాక్ స్టార్, బీజేపీ అభ్యర్థి సొనాలీ కూడా వెనుకపడినట్లు సమాచారం. కాగా ఫొగట్ సిస్టర్స్ రెజ్లింగ్‌లో సాధించిన విజయాల నేపథ్యంలో బాలీవుడ్లో తెరకెక్కిన ‘దంగల్’ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
కౌంటింగ్ అప్డేట్స్ : ఎన్నికల ఫలితాలపై స్పందించిన మోదీ
ముంబై/చండీగఢ్ : మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించగా.. హరియాణాలో హంగ్ ఏర్పడింది. దీంతో ఆ రాష్ట్రంలో కాసేపు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా పది స్థానాలు గెలిచిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) కింగ్ మేకర్‌గా మారింది. దీంతో జేజేపీ మద్దతు కోసం ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు పావులు కదిపాయి. అయితే జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా బీజేపీకి మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్రతో పాటు హరియాణాలో కూడా కాషాయ జెండా రెపరెపలాడనుంది. మహారాష్ట్ర మొత్తం స్థానాలు 288 పార్టీ ఆధిక్యం గెలుపు బీజేపీ 0 102 శివసేన 0 56 కాంగ్రెస్ 0 46 ఎన్సీపీ 0 54 ఎంఐఎం 0 2 ఇతరులు 0 28 హరియాణా మొత్తం స్థానాలు 90 పార్టీ ఆధిక్యం గెలుపు బీజేపీ 0 40 కాంగ్రెస్ 0 31 ఐఎన్ఎల్డీ 0 1 జేజేపీ 0 10 ఇతరలు 0 8 హరియాణా, మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు: మోదీ ‘మమల్ని ఆశీర్వదించిన హరియాణా ప్రజలకు కృతజ్ఞతలు. రాష్ట్ర అభివృద్దికి అదే ఉత్సాహం, అంకిత భావంతో పనిచేస్తాం. ప్రభుత్వ పథకాలు, అభివృధ్దిని ఇంటింటికి తీసుకెళ్లడానికి కష్టపడిని ప్రతీ ఒక్క కార్యకర్తను అభినందిస్తున్నాను’ హరియాణా ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ చేసిన ట్వీట్ ‘మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిని ఎంతో నమ్మకం, ప్రేమతో మరోసారి ఆశీర్వదించారు. ప్రజల మద్దతు మాకు మరోసారి లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాము. మహారాష్ట్ర అభివృద్దికి నిత్యం కృషి చేస్తూనే ఉంటాం. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం నిరంతరం అహర్నిశలు కష్టపడిన బీజేపీ, శివసేనతో పాటు ఎన్డీఏ కూటమికి చెందినీ ప్రతీ ఒక్క కార్యకర్తకు సెల్యూట్ చేస్తున్నా’ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ చేసిన ట్వీట్. రిజల్ట్స్ అప్డేట్స్ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి సంఖ్యా బలాన్ని ఈ కూటమి సాధించింది. అయితే సీఎం పీఠం కోసం శివసేన పట్టుబట్టినట్లు సమాచారం. ఇక బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపించిన మహారాష్ట్ర ప్రజలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆరుగురు మంత్రులు ఓటమి చెందడం షాక్‌కు గురిచేసిందన్నారు. అదేవిధంగా లోక్‌సభ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి చవిచూడటం బాధ కలిగించిందన్నారు. అయితే ఈ ఓటములపై రేపు(శుక్రవారం) సమీక్ష నిర్వహించనున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాంటు చేసేందుకు కావాల్సిన సంఖ్యా బలాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు సాధించలేకపోయాయి. దీంతో హరియాణాలో హంగ్ ఏర్పడింది. అయితే 10 స్థానాలు గెలుచుకున్న జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. అయితే జేజేపీ మద్దతు బీజేపీకే ఉందని హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేజేపీ మద్దతు ఇస్తుందన్న విశ్వాసంతో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉందని దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ హరియాణా ప్రజలు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కింగ్‌మేకర్‌గా నిలిచింది. జేజేపీ మద్దతు ఎవరికి ఇస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. దీంతో జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలాతో బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాలు చర్చలు సాగిస్తున్నాయి. దీనిలో భాగంగా ఢిల్లీకి రావాలని హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు బీజేపీ చీఫ్ అమిత్ షా పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం భుపిందర్ సింగ్‌తో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఫోన్లో మాట్లాడారు. హరియాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భుపిందర్తో సోనియా పేర్కొన్నట్లు సమాచారం. వర్లి(మహారాష్ట్ర) శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ-శివసేన కూటమి అభ్యర్థి ఆదిత్య ఠాక్రే 67,427 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ మానేపై గెలుపొందారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఘనవిజయం సాధించారు. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఫడ్నవీస్ కాంగ్రెస్ అభ్యర్థి ఆశీశ్ దేశ్‌ముఖ్‌పై గెలుపొందారు. హరియాణా సీఎం మనహర్లాల్ ఖట్టర్ కర్నాల్ శాసనసభ నియోజకవర్గంలో విజయం సాధించారు. అయితే హరియాణాలో ఎన్నికల ఫలితాల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ప్రస్తుతం హరియాణా కింగ్ మేకర్, జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా ఘనవిజయం సాధించారు. ఉచానా కలాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ అభ్యర్థి ప్రేమ్ లతపై గెలుపొందారు. బిహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌లో 5 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జేడీయూ ఏమాత్రం ప్రభావం చూపడంలో లేదు. మూడు చోట్ల ఆర్జేడీ ముందంజలో ఉంది. ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరో స్థానంలో ముందంజలో ఉన్నారు. అదంపూర్(హరియాణా) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ ఓటమిపాలయ్యారు. పరిల్లో బీజేపీ అభ్యర్థి, దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తే, మంత్రి పంకజ్ ముండే ఓటమి పాలయ్యారు. బారామతిలో లక్షా 62 వేల ఓట్ల భారీ మెజారీటీతో ఎన్సీపీ సినియర్ నేత అజిత్ పవార్ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ 83.6 శాతం ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. బిహార్‌లో ఎంఐఎం బోణి కొట్టింది. కిషన్‌గంజ్ ఉప ఎన్నికలో మజ్లిస్ విజయం సాధించింది. కేరళలో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. రెండు చోట్ల సీపీఎం, రెండు చోట్ల కాంగ్రెస్, మరో చోట ఐయూఎంఎల్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. తొహానాలో ఆయన ఓటమి దిశగా సాగుతున్నారు. గుజరాత్లో 6 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. మూడు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. మహారాష్ట్రల్లో బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి భారీ మెజారిటీని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బీజేపీ సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 50-50 ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన కలవనుందనే వార్తలను ఆయన ఖండించారు. అయితే ఐదేళ్ల పాలనలో సగం కాలం పాటు తమ పార్టీకి చెందిన వ్యక్తి సీఎం ఉండేలా చూడాలని శివసేన వర్గాలు భావిస్తున్నట్టుగా సమాచారం హరియాణాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం మనోహార్‌లాల్ ఖట్టర్‌ను ఢిల్లీ రావాల్సిందిగా బీజేపీ అధిష్టానం ఆదేశించింది. మరోవైపు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాతో ఫోన్లో మాట్లాడారు. హంగ్ ఏర్పడితే ఏం చేయాలనే దానిపై సోనియా ఆయనతో చర్చించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పూర్తిగా చతికలపడింది. మైనార్టీ ఓట్లను ఒకతాటిపైకి తీసుకురావడంలో ఆ పార్టీ విఫలమైంది. ఎంఐఎం రూపంలో కాంగ్రెస్ కూటమి ఓట్లకు భారీగా గండి పండింది. మైనార్టీ ఓట్లను మజ్లిస్ పార్టీ భారీగా చీల్చింది. దీంతో కూటమిలో కాంగ్రెస్ కంటే ఎన్సీపీ మెరుగ్గా రాణించింది. గతంతో పోలిస్తే.. ఈసారి కాంగ్రెస్ గెలుపొందే స్థానాల సంఖ్య తగ్గేలా కనిపిస్తోంది. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆదిత్య ఠాక్రే విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఆయన ప్రస్తుతం 12వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికి వరకు వచ్చిన ట్రెండ్స్‌ను బట్టి హరియాణాలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కనిపించడం లేదు. ఒకవేళ హంగ్ ఏర్పడితే జేజేపీ కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. తాత ఓం ప్రకాశ్‌తో విభేదించి సొంత పార్టీ పెట్టిన దుష్యంత్.. ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో సత్తా చాటారు. పదికి పైగా స్థానాల్లో జేజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో జేజేపీని బుజ్జగించేందుకు కాంగ్రెస్, బీజేపీలు మంతనాలు జరుపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే జేజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కర్నాల్‌లో హరియాణా ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టర్ ముందంజలో ఉన్నారు. రాంపూర్ నియోజకవర్గం(ఉప ఎన్నిక)లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా ఆధిక్యంలో ఉన్నారు. కొంకణ్ ప్రాంతంలో శివసేన ఆధిక్యం కొనసాగిస్తుండగా.. విదర్భలో బీజేపీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. మహారాష్ట్రలో మూడు స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన రెజ్లర్ బబితా ఫొగాట్ వెనుకంజలో ఉన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ముందంజలో ఉంది. శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే వర్లి నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ దూసుకెళ్తుంది. నాగ్‌పూర్ సౌత్ నుంచి బరిలో ఉన్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో ఉన్నారు. హరియాణాలో బీజేపీ ముందజలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో 25 స్థానాల ఆధిక్యంలో బీజేపీ కూటమి -
ఏకపక్షమేనా..?
మహారాష్ట్ర, హరియాణాలో మళ్లీ కమలమే వికసిస్తుందా, మోదీ షా ద్వయాన్ని ఎదుర్కొనే శక్తి విపక్షాలకు ఉందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. గురువారం ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మరాఠాల ప్రభావం అత్యధికంగా ఉండే మహారాష్ట్రలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవీస్‌కు, జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే హరియాణాలో పంజాబీ అయిన ఖట్టర్‌కు పగ్గాలు అప్పగించి బీజేపీ చేసిన ప్రయోగాన్ని ఓటర్లు ఎంతవరకు ఆమోదిస్తారో, వరసగా రెండోసారి సీఎంలు అయ్యే చాన్స్ వారికి వస్తుందా అన్నది నేటి ఫలితాలతో తెలిసిపోనుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. మహారాష్ట్రలో... మహారాష్ట్ర శాసనసభ 288 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3,237 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేస్తే మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ 147 స్థానాల్లో, ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీ చేశాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం రాజకీయ వ్యూహాల ముందు విపక్షాలు నిలబడలేవని ఇంచుమించుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేస్తున్నాయి. కేదార్నాథ్ గుడి వద్ద సీఎం ఫడ్నవీస్ దంపతులు కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుని అత్యంత చాకచక్యంగా మోదీ ఈ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వినియోగించుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఫడ్నవీస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అన్ని రంగాల సుస్థిరాభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోవడం బీజేపీకి కలిసొస్తుందని విశ్లేషకుల అంచనా. రైతు సమస్యలు మినహా ఫడ్నవీస్ పాలనపై పెద్దగా విమర్శలేవీ లేకపోవడం వల్ల ఈ సారి ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనే అంచనాలున్నాయి. ఠాక్రే కుటుంబ వారసుడు ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో ఉండడం ఈ సారి విశేషంగా చెప్పుకోవాలి. మొత్తం 25 వేల మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ విధుల్లో ఉన్నారు. ఉప ఎన్నికల ఫలితాలూ ప్రతిష్టాత్మకమే మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లోని రెండు లోక్‌సభ స్థానాలు, 51 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఇవాళే ఉంది. ఈ ఫలితాలతో వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలకు వచ్చిన ఇబ్బందేమీ లేకపోయినప్పటికీ బీజేపీ తన కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఉప ఎన్నికల్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హరియాణా పీఠం ఎవరిది ? హరియాణాలో మోదీ మ్యాజిక్ పనిచేస్తుందని, బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇంచుమించుగా చెబితే ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా దానికి విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించడంతో ఈ రాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. హరియాణాలో కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రత వంటి అంశాలపైనే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికంగా దృష్టి పెడితే కాంగ్రెస్ రైతు సమస్యలు, నిరుద్యోగం, శాంతి భద్రతల అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ హోరాహోరీగా పోటీ ఇచ్చింది. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే హరియాణాలో పోలింగ్ 76.54 నుంచి 68 శాతానికి భారీగా పడిపోవడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దేవీలాల్ స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ (ఐఎన్ఎల్డీ) చీలిక వర్గం, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలో ఏర్పడిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీకి 32–44, కాంగ్రెస్‌కు 30–42, ఇక జేజేపీకి 6–10 స్థానాలు వస్తాయని ఇండియా టుడే పోల్స్‌లో వెల్లడైంది. -
పోలింగ్ ప్రశాంతం
న్యూఢిల్లీ/చండీగఢ్/ముంబై: దేశంలో మినీ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో 288, హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాలకు రెండు పార్లమెంటు స్థానాలకు సోమవారం పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మహారాష్ట్రలో 60.46% మంది, హరియాణాలో 65% మంది తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. క్యూల్లో ఓటర్లు నిలుచుని ఉన్నందున ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. 51 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపు 57% పోలింగ్ నమోదైందని వెల్లడించింది. కేరళలో భారీగా వర్షం కురిసినప్పటికీ ప్రజలు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు తెలిపింది. కాగా, ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటల సమయానికి మహారాష్ట్రలో 60.46% పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో 63.38% పోలింగ్ నమోదు కావడం విశేషం. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. ముంబైలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతోపాటు వచ్చిన ఓ వృద్ధుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ‘ఈ రోజు హీరో ఖన్నా సాబ్. ఆర్మీలో పనిచేసిన ఈయన వయసు 93 ఏళ్లు. ఓటేయడానికి వచ్చారు. ఇది అందరికీ స్ఫూర్తినిచ్చే అంశం’ అంటూ ఇరానీ పేర్కొన్నారు. హరియాణాలో 65% నమోదు గత ఎన్నికలతో పోలిస్తే హరియాణాలో ఈసారి తక్కువ మంది ఓటేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 65% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం పేర్కొంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది 76.54% కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ 70.36% మంది ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. పోలింగ్‌పై ఫిర్యాదులు.. అపశ్రుతులు ఉల్లంఘనలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 250 వరకు ఫిర్యాదులు చేసిందని ఎన్నికల సంఘం తెలిపింది. రాంటెక్ నియోజకవర్గంలో ఓ వ్యక్తి ఈవీఎంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్తు బటన్ నొక్కగా బీజేపీకి ఓటు పడినట్లు చూపినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పుర్సల్ గొండి గ్రామంలో ఎన్నికల విధులకు వెళ్తూ బాపు పాండు గవాడే(45) అనే ఉపాధ్యాయుడు మరణించాడు. భోసారి నియోజకవర్గంలో అబ్దుల్ రహీం షేక్(62) ఓటేసేందుకు వచ్చి అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచాడు. ఉప ఎన్నికల్లో మోస్తరు ఓటింగ్ దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 56.84% పోలింగ్ నమోదైంది. అతితక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 47.05% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళలో ముఖ్యంగా ఎర్నాకులంలో భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచినప్పటికీ ఓటర్లు వెనుకంజవేయలేదు. ఇక్కడ 53.27% మంది ఓటేశారు. కేరళలో అత్యధికంగా అరూర్‌లో 75.74% ఓటింగ్ నమోదైంది. కాగా, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఖోన్సా వెస్ట్ నియోజకవర్గంలో అత్యధికంగా 90% ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో 74%, తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో 84% మంది ఓటు వేశారు. తమిళనాడులోని విక్రవండి నియోజకవర్గంలో 84.36%, గుజరాత్లో 51%, బిహార్‌లో 49.50% పంజాబ్‌లో 60%, రాజస్తాన్‌లో 66% పోలింగ్ నమోదైంది. వ్యాపార దిగ్గజాలు పోలింగ్‌కు దూరం టాటా గ్రూప్‌నకు చెందిన రతన్ టాటా, ఎన్. చంద్రశేఖరన్, అంబానీ సోదరులు, సజ్జన్ జిందాల్ వంటి వ్యాపార దిగ్గజాలు సోమవారం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అయితే, చాలా ముఖ్యమైన పనుల్లో వారు వేరే ప్రాంతంలో బిజీగా ఉన్నందునే ఓటెయ్య లేకపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా ముకేశ్, అనిల్ అంబానీ సోదరులు తమ కుటుంబాలతో కలిసి వచ్చి ఓటు వేస్తుంటారు. కానీ, ఈసారి వారు రాలేదు. అందుకు కారణాలు కూడా వెల్లడి కాలేదు. సోమవారం పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ వ్యాపార వేత్తల్లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ సీఈవో కేకి మిస్త్రీ, మరికో చైర్మన్ హర్‡్ష మరివాలా, ఎం అండ్ ఎం ఎండీ పవన్ గోయెంకా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాల్లో ఒక ముంబై మహానగరానికి సంబంధించి 38 నియోజకవర్గాలున్నాయి. ముంబైలో ఓటు వేసిన బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు, ఊర్మిళా మతోండ్కర్, మాజీ క్రికెటర్ సచిన్, అంజలి దంపతులు -
కాషాయ ప్రభంజనమే!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ అనంతరం సోమవారం పలు మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. గెలిచే సంఖ్యలో కొద్ది తేడాలున్నా గెలుపైతే ఖాయమేనని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి సునాయాసంగా డబుల్ సెంచరీ సాధిస్తుందని న్యూస్ 18– ఐపీఎస్ఓఎస్, ఏబీపీ– సీ ఓటరు పోల్స్ తేల్చాయి. బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించడానికి 3 స్థానాల దూరంలో ఆగిపోయిందని న్యూస్ 18– ఐపీఎస్ఓఎస్ పేర్కొంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ సగటును పరిగణనలోకి తీసుకుంటే బీజేపీ శివసేన కూటమికి 211, కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమికి 64 సీట్లు వస్తాయని తేలింది. హరియాణాలో కూడా బీజేపీ విజయం లాంఛనమేనని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 90 స్థానాల అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని పేర్కొన్నాయి. టైమ్స్ నౌ పోల్ బీజేపీ 71, కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 57, కాంగ్రెస్‌కు 17 స్థానాలు ఇచ్చింది. న్యూస్ ఎక్స్ 77 సీట్లు బీజేపీవేనంది. టీవీ9 భారత్‌వర్‡్ష ఎగ్జిట్ పోల్ మాత్రం బీజేపీ మెజారిటీ కన్నా ఒక స్థానం ఎక్కువగా 47 సీట్లు గెలుస్తుందంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో, ఇతరులు 20 స్థానాల్లో గెలుస్తారని చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి 46.4 శాతం వస్తాయని ఐఏఎన్ఎస్– సీఓటర్ సర్వే పేర్కొంది. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి 47.2 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి 38.3% ఓట్లు పొందగా, ఈ సారి 36.9% ఓట్లు వస్తాయని ఐఏఎన్ఎస్– సీఓటర్ సర్వే తెలిపింది. -
మహారాష్ట్రలో ఓటు వేసిన ప్రముఖులు
-
బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఆయనే..
న్యూఢిల్లీ : ఈవీఎంల్లో ఏ బటన్ నొక్కినా ప్రతి ఓటూ పాలక పార్టీకే వెళుతుందని హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఓ బీజేపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ వ్యాఖ్యలు చేసి ఈసీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే బక్షిత్ సింగ్ విర్క్‌ను ఉద్దేశిస్తూ బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఆయనేనని రాహుల్ వ్యాఖ్యానించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా రాహుల్ ఈ మేరకు ట్వీట్ చేయడంతో పాటు బీజేపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు. కాగా తాను పోటీ చేస్తున్న అసంధ్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్ధి బక్షిత్ సింగ్ విర్క్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మీలో ఎవరు ఓటు వేసేందుకు వెళ్లినా మాకు తెలుస్తుంది..మాకు తెలియదని అనుకోకండి..మీరు ఎవరికి ఓటేశారో తెలుసుకోవాలనుకుంటే మేం తెలుసుకోగలం ఎందుకంటే మోదీజీ చాలా తెలివైనవారు..మనోహర్ లాల్ (హర్యానా సీఎం) తెలివైన వార’ంటూ ఆయన మాట్లాడుతున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. మీరు ఎవరికి ఓటు వేసిన అది కమలం గుర్తుకే వెళుతుంది..ఈవీఎంల్లో మేం ఇందుకు తగిన ఏర్పాటు చేశామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వీడియోపై తీవ్రంగా స్పందించిన ఈసీ బీజేపీ అభ్యర్థి విర్క్‌కు నోటీసులు జారీ చేసింది. అసంద్ నియోజకవర్గంలో పోలింగ్ పర్యవేక్షణకు ప్రత్యేక అబ్జర్వర్‌ను నియమించింది. కాగా తాను మాట్లాడినట్టు నకిలీ వీడియోను వైరల్ చేస్తున్నారని, ఈవీఎంలపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. -
మహారాష్ట్ర, హరియాణాలలో ముగిసిన పోలింగ్
ముంబై/చండీగఢ్ : చెదురుమదురు ఘటనలు మినహా మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ మందకొడిగానే సాగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మహారాష్ట్రలో 55శాతం, హరియాణాలో62 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు కూడా నేడు ఉప ఎన్నికలు జరిగాయి. పోలింగ్ అప్డేట్స్ @ 5pm మహారాష్ట్ర, హరియాణా లో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో 45 శాతం పోలింగ్ నమోదు కాగా, హరియాణాలో 55శాతం నమోదైంది. సాయంత్రం 6గంటలకు పోలింగ్ ముగియనున్నది. బీజేపీ రికార్డు బద్దలు కొట్టబోతోంది మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అత్యంత మెజార్టీతో గెలవబోతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 222 స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుందని జోస్యం చెప్పారు. ‘ 220 స్థానాలు కాదు 222 స్థానాల్లో బీజేపీ జెండా ఎగరేయబోతుంది. గతంలో ఒక్కసారి కాంగ్రెస్ 222 స్థానాల్లో విజయం సాధించింది. ఈ రికార్డును ఈసారి బ్రేక్ చేయబోతున్నాం. మహారాష్ట్రలో బలమైన ప్రభుత్వాన్ని నిర్మించబోతున్నాం’ అని ప్రకాశ్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ అప్డేట్స్ సాయంత్రం 4 గంటల వరకు మహారాష్ట్రాలో 44 శాతం పోలింగ్ నమోదు కాగా, హరియాణాలో 51 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో పోలింగ్ మండకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 38 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. మహారాష్ట్రతో పోలిస్తే హరియాణాలో పోలింగ్ కొంచెం మెరుగ్గా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు హరియాణాలో 48శాతం పోలింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది. అమితాబ్ బచ్చన్ తన భార్య జయ బచ్చన్, కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యరాయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలోని జుహు పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య గౌరితో కలిసి ముంబైలోని బంద్రావెస్ట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 177లో ఓటు వేశారు. పోలింగ్ అప్డేట్స్ మహారాష్ట్రలో ఒంటి గంట వరకు 30.89 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలోని రత్నాగిరి, భండారా జిల్లాలోని కొన్ని బూత్‌ల్లోని ఈవీఎంలలో లోపాలు తలెత్తడంతో పోలింగ్ ఆలస్యమైంది. అలాగే ముంబైలోని వర్లీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పోలింగ్ కొద్దిసేపు నిలిపివేశారు. ఈవీఎంల పనితీరుకు సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ ఎన్నికల సంఘానికి 187 ఫిర్యాదులు చేసింది. ఉత్సాహంగా ఓటేస్తున్న బాలీవుడ్ తారలు.. బాలీవుడ్ ప్రముఖులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. హేమమాలిని, ఉర్మిళ మంటోడ్కర్, దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్, ధర్మేంద్ర, అనిల్ కపూర్ వేర్వేరు పోలింగ్ బూత్‌ల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ తనయుడు, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన భార్య జెనీలియా, తల్లి వైశాలి దేశ్‌ముఖ్ కూడా ఓటు వేశారు. అనంతరం తన నివాసంలో.. తండ్రి చిత్ర పటం ముందు భార్య, తల్లితో కలిసి ఫొటో దిగారు. మధ్యాహ్నం 12 గంటల వరకు హరియాణాలో 23.82 శాతం, మహారాష్ట్ర 17.01 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ అంచనా వేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే స్మృతి పోలింగ్ చేరుకున్న సమయంలో ఓ ఆస్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్దుడు ఈ రోజు ఉదయం నుంచి స్మృతి కోసం పోలింగ్ బూత్ వద్ద ఎదురుచూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె పోలింగ్ బూత్ వద్దకు రాగానే ఆయన్ను కలిసి.. అప్యాయంగా పలకరించారు. ఉదయం 11 గంటల వరకు హరియాణాలో 23.12 శాతం, మహారాష్ట్రలో 16.34 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, ఆయన భార్య షర్మిల ఠాక్రేలు శివాజీ పార్క్‌లోని బాలమోహన్ విద్యామందిర్ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, ఆయన సతీమణి రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రేలు బాంద్రా(తూర్పు)లో వారి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఆదిత్య ఠాక్రే వర్లి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి అంజలి, కుమారుడు అర్జున్ బాంద్రా(పశ్చిమ) పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన సతీమణి అమృత, తల్లి సరిత నాగ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్‌కి సైకిల్‌పై సీఎం హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పోలింగ్ బూత్‌కి సైకిల్‌పై వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. హరియాణాలో ఉదయం 10 గంటల వరకు 10.72 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనవరాలు, అల్లుడితో కలిసి ఆయన పోలింగ్ బూత్‌కు వచ్చారు. ఓటేసిన సినీ ప్రముఖులు.. సినీ ప్రముఖులు జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్, రవి కిషన్, కిరణ్‌రావ్, అమీర్‌ఖాన్, మాధురి దీక్షిత్‌లు వివిధ పోలింగ్ బూత్‌ల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత మాజీ టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి, అతని భార్య ప్రముఖ నటి లారా దత్తాలు ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్రలో 5.29 శాతం, హరియాణాలో 6.07 శాతం పోలింగ్ నమోదైంది. జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా కుటుంబసభ్యులతో కలిసి ట్రాక్టర్లో పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. సిర్సాలోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రణ్‌దీప్ సుర్జేవాలా, ఆయన భార్య హరియాణాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కైతాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. గుడిలో పూజలు.. తాత ఆశీర్వాదం ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు ఆదిత్య ఠాక్రే. వర్లి నియోజకవర్గం నుంచి శివసేన తరఫున బరిలో ఉన్న ఆయన.. పోలింగ్ సందర్భంగా సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే తన తాత, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఆశీర్వాదం తీసుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన సతీమణి కాంచన్ గడ్కరీలు నాగ్‌పూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. బీజేపీ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలోని అదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన రెజ్లర్ బబితా ఫొగాట్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒలంపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన బరోడా నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే బారామతిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను అభివృద్ధికి ఓటు వేసినట్టు తెలిపారు. కాగా, ఆ అసెంబ్లీ స్థానంలో ఎన్సీపీ తరఫున అజిత్ పవార్ పోటీ చేస్తున్నారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్‌లోని మహాల్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. ఎన్సీపీ సీనియర్ నాయకులు అజిత్ పవార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన బరిలో ఉన్నారు. మరోసారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలని అజిత్ భావిస్తున్నారు. ప్రముఖ నటి శుభ ఖోటే అంధేరి పశ్చిమ నియోజకర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని సందేశం.. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీలకు జరుగుతున్న పోలింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని చోట్ల రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు చేసి ప్రజాస్వామ్య పండగను సుసంపన్నం చేయాలని అన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పోటీలో ఉన్న ప్రముఖులు.. మహారాష్ట్రలో: బీజేపీకి చెందిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (నాగ్‌పూర్–నైరుతి), కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్ (భోకర్), పృథ్వీరాజ్ చవాన్ (కరాడ్) శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (వర్లి) హరియాణాలో: సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ (కర్నాల్), కాంగ్రెస్ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా (గర్హి సంప్లా–కిలోయి), రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా (కైతాల్), కుల్దీప్ బిష్ణోయి (ఆదమ్పూర్), దుష్యంత్ చౌతాలా (ఉచన్‌కలాన్) ఉప ఎన్నికలు జరిగే రాష్ట్రాలు.. యూపీలో 11, గుజరాత్ 6, బిహార్ 5, అస్సాం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడు 2, పంజాబ్ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్తాన్ 2, అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, మేఘాలయ, తెలంగాణల్లో ఒక్కోటి చొప్పున స్థానాలకు..మహారాష్ట్రలోని సతారా, బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్థానాలకు కూడా సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. -
నేడే ఎన్నికలు
ముంబై/చండీగఢ్: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీలతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నేడు జరగనున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 సీట్లు, హరియాణాలోని 90 స్థానాలకు ఎన్నికలు, 18 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ సీట్లకు, రెండు లోక్‌సభ స్థానాల(సతారా, సమస్తిపూర్)కు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బందోబస్తు కోసం మహారాష్ట్రలో 3 లక్షల మందిని, హరియాణాలో 75 వేల మంది పోలీసులను మోహరించారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ప్రచారంలో బీజేపీ పైచేయి సాధించగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాలు వరుసగా రెండోసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకుగాను ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ అంశాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారంలో వాడుకుంది. దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యంపై కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. ఉప సమరం జరిగే రాష్ట్రాలు.. యూపీలో 11, గుజరాత్ 6, బిహార్ 5, అస్సాం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడు 2, పంజాబ్ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్తాన్ 2, అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, మేఘాలయ, తెలంగాణల్లో ఒక్కోటి చొప్పున స్థానాలకు..మహారాష్ట్రలోని సతారా, బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్థానాలకు కూడా నేడు పోలింగ్ జరగనుంది. బరిలో ప్రముఖులు మహారాష్ట్రలో: బీజేపీకి చెందిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (నాగ్‌పూర్–నైరుతి), కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్ (భోకర్), పృథ్వీరాజ్ చవాన్ (కరాడ్) శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (వర్లి) హరియాణాలో: సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ (కర్నాల్), కాంగ్రెస్ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా (గర్హి సంప్లా–కిలోయి), రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా (కైతాల్), కుల్దీప్ బిష్ణోయి (ఆదమ్పూర్), దుష్యంత్ చౌతాలా (ఉచన్‌కలాన్) విపక్షమే లేనప్పుడు అన్ని ర్యాలీలా: సేన రాష్ట్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీనిచ్చే ప్రతిపక్షమే లేదంటూనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు పదుల సంఖ్యలో ర్యాలీలు నిర్వహించడం ఎందుకంటూ బీజేపీని మిత్రపక్షమైన శివసేన నిలదీసింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ రాసిన వ్యాసంలో.. ‘ఎన్నికల ప్రచార పర్వంలో తమకు పోటీ ఇచ్చే ప్రతిపక్షమే లేదని సీఎం అంటున్నారు. అలాంటప్పుడు ప్రధాని 10, హోం మంత్రి 30, సీఎం 100 ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నట్లు?’ అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎన్నో ఫస్ట్లు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి ఎన్నికల్ని వివిధ కోణాల నుంచి చూస్తే ఎన్నో ఫస్ట్లు కనిపిస్తాయి. ► 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగే తొలి ఎన్నికలివి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా మోదీ ఇమేజ్ చెక్కు చెదరని నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ► కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు. కశ్మీర్ అసెంబ్లీ అనుమతి లేకుండా రాష్ట్రాన్ని విభజించారన్న విమర్శలు వచ్చినప్పటికీ, రావణకాష్టంలా రగులుతున్న సమస్యకు ఏదో ఒక పరిష్కారం వచ్చిందనే అభిప్రాయమైతే జనంలో కనిపించింది. అందుకే ఈసారి ప్రచారంలో స్థానిక అంశాలను పట్టించుకోకుండా ఆర్టికల్ 370 రద్దునే ప్రధాని మోదీ ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. జాతీయ భావాన్ని రగిల్చి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ► ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలివి. బీజేపీ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన చర్య ఇది. దీని ప్రభావం ముస్లిం ఓటర్లపై ఎలా పడుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలతో ముస్లింలు, ముఖ్యంగా మహిళా ముస్లింలను బీజేపీ ఏ మేరకు ఆకర్షించగలదో తేలిపోనుంది. ► 2014 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థులు ఎవరో ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది. గెలిచిన తర్వాత అనూహ్యంగా మరాఠాల ఆధిపత్యం ఉన్న మహా రాష్ట్రలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవీస్‌ను, జాట్ల ప్రాబల్యం ఉన్న హరియాణాలో పంజాబీ అయిన ఖట్టర్‌ను సీఎంలుగా చేసింది. ఇప్పుడు వారే సీఎంలుగా ఎన్నికలకు వెళుతోంది. మరి మరాఠా, జాట్ల దారి ఎటో తెలిసిపోతుంది. ► ఇక కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలివి. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో పార్టీపై దృష్టిపెట్టలేక పోతున్నారు. దశ, దిశను నిర్దేశించే నాయకత్వలేమితో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు ఇంకెన్ని చేదు అనుభవాలను మిగల్చబోతున్నాయో ! విపక్షమే లేనప్పుడు అన్ని ర్యాలీలా: సేన రాష్ట్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీనిచ్చే ప్రతిపక్షమే లేదంటూనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు పదుల సంఖ్యలో ర్యాలీలు నిర్వహించడం ఎందుకంటూ బీజేపీని మిత్రపక్షమైన శివసేన నిలదీసింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ రాసిన వ్యాసంలో.. ‘ఎన్నికల ప్రచార పర్వంలో తమకు పోటీ ఇచ్చే ప్రతిపక్షమే లేదని సీఎం అంటున్నారు. అలాంటప్పుడు ప్రధాని 10, హోం మంత్రి 30, సీఎం 100 ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నట్లు?’ అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్ నాశనం చేసింది
రెవారీ/ఎలెనాబాద్: శనివారం ప్రధాని హరియాణాలోని రెవారీ, ఎలెనాబాద్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే తాత్కాలిక ఆర్టికల్ 370ని రద్దు చేయకుండా కాంగ్రెస్ 70 ఏళ్లు కాలయాపన చేసింది. 370 రద్దు చేస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని విస్మరించింది. ఆ రాష్ట్రంలో పరిస్థితులు విషమిస్తున్నా పట్టించుకోకుండా నిద్ర పోయింది. ఇదే అదనుగా పాకిస్తాన్ కశ్మీర్లో ఒక భాగాన్ని ఆక్రమించుకుంది. సోదర భావాన్ని బోధించే సూఫీ సంస్కృతి నశించింది. ఇలా కాంగ్రెస్ విధానాలతో దేశం, కశ్మీర్ నాశనమయ్యాయి. ఢిల్లీలోని అప్పటి పాలకులు ప్రధాని పదవిని కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నించారు’ అని విమర్శించారు. -
పాకిస్తాన్‌తో మీ బంధమేంటి?
హిసార్/గొహన: హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీపై విమర్శలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదునుపెట్టారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను పొరుగుదేశం పాకిస్తాన్ భారత వ్యతిరేకతను అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు వాడుకుందన్నారు. పాకిస్తాన్‌తో ఉన్న సంబంధమేంటో చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వంటి పార్టీలు ప్రజల సెంటిమెంట్లను అర్థం చేసుకోలేవని, అలాగే దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాలను గౌరవించలేవని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఆగస్టు 5వ తేదీనుంచి కాంగ్రెస్ పార్టీ బాధలో ఉందన్నారు. ఆ పార్టీ, అలాంటి ఇతర పార్టీలు ఆ రోజు నుంచి చికిత్స లేని జబ్బుతో బాధపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఆ రోజు గుర్తుందా? అలాంటి నిర్ణయం తీసుకోగలమని ఎవరైనా ఊహించారా? 70 ఏళ్లుగా జమ్మూకశ్మీర్, లదాఖ్ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆర్టికల్ 370ని ఆరోజు తొలగించాం’ అని గుర్తు చేశారు. ‘స్వచ్ఛ భారత్, సర్జికల్ స్ట్రైక్స్ గురించి మేం మాట్లాడితే వారికి కడుపులో నొప్పి. బాలాకోట్ పేరెత్తితే ఆ నొప్పి మరింత పెరుగుతుంది’ అని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘మోదీని వ్యతిరేకించండి. ఆయనపై ఎన్నైనా ఆరోపణలు చేయండి. ఎన్ని అబద్ధాలనైనా ప్రచారం చేయండి. ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఆ దూషణలు నన్నేం చేయలేవు’ అన్నారు. మోదీని ఎంతైనా తిట్టండి.. కానీ భారతమాతను గౌరవించండి, దేశానికి నష్టం కలిగేలా వ్యవహరించకండి అని కాంగ్రెస్‌ను కోరారు. ‘కాంగ్రెస్‌కు దేశ సమైక్యతపైన, అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం పైన, భరతమాతపైన, ఈ నేలపైన ఎలాంటి గౌరవం లేదు. అలాంటి పార్టీని మనమెందుకు గౌరవించాలి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీని శిక్షించాలా? వద్దా’ అని ఓటర్లను ప్రశ్నించారు. సోనిపట్ జిల్లా రైతుల, జవాన్ల, పహిల్వాన్ల భూమి అని మోదీ ప్రశంసించారు. ఈ ప్రాంతంపై తమదే పట్టు అని భావించేవారికి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. -
జాట్లు ఎటువైపు?
హరియాణాలో 2016లో వెల్లువెత్తిన జాట్ రిజర్వేషన్ ఉద్యమం యావత్ దేశాన్నే ఒక కుదుపు కుదిపేసింది. పంజాబ్, రాజస్తాన్, ఢిల్లీలతో సహా దేశవ్యాప్తంగా 8.2 కోట్ల మంది జాట్ సామాజిక వర్గానికి చెందినవారున్నారు. ఒక్క హరియాణాలోనే వీరు 29 శాతం మంది ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అత్యధిక మంది ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. జాట్ల ఆధిపత్యంలోని హరియాణాలో తిరిగి పాగావేసేందుకు బీజేపీ ‘‘అబ్ కీ బార్ సత్తార్ పార్’ (ఈసారి 70 సీట్లను దాటాలి) అనే నినాదంతో బరిలోకి దిగింది. 18 ఏళ్ల తరువాత తొలిసారి 2014లో జాట్యేతర సామాజికవర్గం నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ అధికారం చేపట్టారు. అయితే రాష్ట్రంలో పాలకుల భవితవ్యాన్ని ఖరారుచేసే ఈ సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో ఎటువైపు నిలుస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్తర హరియాణా... 2014లో స్థానాలు చండీగఢ్, పంచకుల, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్ లలో బీజేపీ అత్యధిక స్థానాలు సా«ధించుకుంది. ఈ ప్రాంతంలో జాట్యేతరులదే ఆధిక్యం. బీజేపీ సామాజిక ఎత్తుగడలో భాగంగానే గత ఎన్నికల్లో ఈ ప్రాంతంపై దృష్టిసారించింది. చాలా కాలంగా గుర్తింపునకు నోచుకోని జాట్యేతర పంజాబీ భాషమాట్లాడే బనియా సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలన్న కాషాయ పార్టీ ఎత్తుగడ ఫలించింది. ఈసారి సైతం బీజేపీ విజయాన్ని కైవసం చేసుకునేందుకు ఇదే వ్యూహాన్ని ప్రయోగిస్తోంది. మాజీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సీఎం ఖట్టర్ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడని బీజేపీ ప్రకటించడం అందులో భాగమే. జాట్ బెల్ట్... ‘ఛత్తీస్ బిర్‌దారీస్’’ (36 సామాజికవర్గాలు) చాలా కాలంగా ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తున్నాయి. హిసార్, భివానీ, మహేంద్రఘర్, రోహతక్, ఝజ్జార్, సోనిపట్, జింద్, కైతాల్ ప్రాంతాల్లో జాట్ సామాజికవర్గం అధికం. గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న భజన్‌లాల్, భూపేందర్ హుడా, ఓం ప్రకాశ్ చౌతాలాలు ఇదే ప్రాంతం నుంచి గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. గతఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి పెద్దగా కలిసిరానిమాట వాస్తవం. అంతమాత్రాన ఈసారి జాట్లు బీజేపీకి ఓట్లు వేయరనడం ఒట్టిమాటేనంటున్నాయి బీజేపీ శ్రేణులు. 2014లో రోహతక్, సోనాపేట్, ఝజ్జార్‌లు కాంగ్రెస్‌కి పట్టున్న ప్రాంతాలైనప్పటికీ ఈ ప్రాంతాల్లో ఆ పార్టీ కేవలం 15 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈసారి కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ స్థానిక పాలనాంశాలను తెరపైకి తెస్తే, బీజేపీ మాత్రం ఖట్టర్ క్లీన్ రికార్డుపైనా, ప్రధాని మోదీ ఛరిష్మానీ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి. గతంలో కేవలం జాట్లు అధికంగా ఉన్న, హుడా కుటుంబాలకు పెట్టని కోటలైన రోహతక్, సోనాపేట్ రెండు జిల్లాలకే విద్య, ఉద్యోగాలు పరిమితమయ్యాయనీ బీజేపీ అంటోంది. ఖత్తార్ ప్రభుత్వం దశాబ్దాల అనంతరం అన్ని ప్రాంతాలకూ సమాన ఉద్యోగావకాశాలు కల్పించిందన్నది బీజేపీ వాదన. ఇదే జాట్లు, జాట్ యేతర సామాజిక వర్గాల మధ్య విభజనని మరింత స్పష్టంచేస్తోంది. -
370పై అంత ప్రేమ ఎందుకు?
బల్లబ్‌గఢ్(హరియాణా): ఆర్టికల్ 370 అంటే ఎందుకు తమకంత ప్రేమో కాంగ్రెస్ పార్టీ జమ్మూకశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు వివరించాలని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370పై వారికున్న ప్రేమ కారణంగానే వేలాది మంది జవాన్లు సరిహద్దుల్లో ప్రా ణాలు కోల్పోయారన్నారు. హరియాణాలో సోమ వారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. అధికారంలోకి వస్తే తాము రద్దు చేసిన ఆర్టికల్ 370ని మళ్లీ అమల్లోకి తీసుకువస్తామని హామీ ఇచ్చే ధైర్యం ఉందా? అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌ను హింస నుంచి తప్పించి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని హరియాణా ప్రజలతో పాటు దేశమంతా కోరుకుంటోందని ఎన్నికల ప్రచారంలో మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు విఫలయత్నం చేశాయన్నారు. ఆర్టికల్ 370 రద్దు వంటి కఠిన నిర్ణయాల గురించి గత ప్రభుత్వాలు కనీసం ఆలోచించలేదని, హరియాణా ఓటర్లు సహా దేశ ప్రజలంతా తమకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వడం వల్లనే ఆ నిర్ణయం తీసుకోగలిగామని మోదీ వివరించారు. ఈ నిర్ణయం వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతిన్న కొందరు మాత్రం వీధుల్లోకి ఎక్కి నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. చచ్చిన ఎలుకను పట్టారు సోనిపట్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని చచ్చిన ఎలుక అంటూ పోలుస్తూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఖర్ఖోడాలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ స్థానంలో బయటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నుకోలేకపోయింది. గాంధీ కుటుంబంలోని సోనియానే మళ్లీ ఎన్నుకుంది. ఇదంతా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. అది కూడా చచ్చిన ఎలుక’అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.1.25 లక్షల కోట్ల మేర ఓటర్లకు తాయిలాలు ప్రకటించడంపై ఆయన.. ప్రభుత్వ ఖజానా ఏమైనా వాళ్ల బాబు సొమ్మనుకుంటున్నారా? అని మండిపడ్డారు. -
రైతులకు వడ్డీ లేని రుణాలు
చండీగఢ్: మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు తనఖా లేకుండా రూ. 3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణం, షెడ్యూల్ కులాల వారికి రూ. 3 లక్షల వరకు షరతుల్లేని రుణం ఇస్తామని బీజేపీ ప్రకటించింది. త్వరలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలకోసం ఆ పార్టీ ఆదివారం మేనిఫెస్టో విడుదల చేసింది. ‘ఇది పూర్తి నిబద్ధతలో రూపొందించిన పత్రం. సమాజంలోని అన్ని వర్గాలు ప్రయోజనం పొందేలా మేనిఫెస్టోను తయారు చేశాం’అని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చండీగఢ్‌లో ప్రకటించారు. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, అవినీతి రహిత పాలన ఇవ్వాలన్న వాగ్దానాన్ని తాము నెరవేర్చామని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని అన్నారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. ► రైతులకు 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణం ► కర్షకుపంటలకు కనీస మద్దతు ధర. కిసాన్ కళ్యాణ్ ప్రధీకరణకోసం వెయ్యి కోట్ల బడ్జెట్ ► యువజన అభివృద్ధి, స్వయం ఉపాధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు. రూ. 500 కోట్లతో 25 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ► ఐదెకరాల లోపు ఉన్న 14 లక్షల మంది రైతులకు రూ. 3 వేల వృద్ధాప్య పెన్షన్. ► విద్యార్థులకు ఉన్నత విద్యకోసం షరతులు లేని రుణాలు ► విద్యార్థినుల కోసం పింక్ బస్సు సేవలు. వారి ఆత్మరక్షణ కోసం ప్రత్యేక శిక్షణ. -
పాక్ ఉగ్రవాదంపై పోరాడితే భారత్ మద్దతు
హర్యాణా: హర్యాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ...పాకిస్తాన్ ప్రధానమంత్రికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాడితే భారత్ మద్దతిస్తుందని, ఒకవేళ సైనిక సహాయాన్ని కోరినా ఇవ్వడానికి సిద్దమని ఆయన స్పష్టం చేవారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో జరిగిన యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలలో భవిష్యత్తులో అణుయుద్దం జరిగే అవకాశం ఉందంటూ ఇమ్రాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని రాజ్‌నాథ్ మండిపడ్డారు. కశ్మీర్‌కు స్వేచ్చ కల్పిస్తామని ఇమ్రాన్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికలలో భారత్‌ను దోషిగా నిలబెట్టాలన్న పాక్ వ్యూహం బెడిసి కొట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. అదే వేదికపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నారని రాజ్‌నాథ్ కొనియాడారు. కాగా ఈ నెల 21న హర్యాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2014లో జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 90 అసెంబ్లీ సీట్లకు గాను 47సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
హరియాణాలో రాజకీయ వేడి
హరియాణాలో రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అగ్రనాయకులంతా హరియాణాలో మకాం వేస్తున్నారు. దీంతో హోరాహోరీ నెలకొంది. రాష్ట్రంలో 2009 వరకు కాంగ్రెస్ హవా కొనసాగినా 2014 తొలిసారి బీజేపీ పాగా వేసింది. గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పదికి పది స్థానాల్లోనూ విజయఢంకా మోగించిన కమలం ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనని ధీమాతో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో అంతర్గ కుమ్ములాటలు కూడా బీజేపీకి మరింత బలాన్నిస్తున్నాయి. అయితే కుమారి సెల్జా నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఎలాగైనా పగ్గాలు చేజిక్కించుకోవాలని కసరత్తు చేస్తోంది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుంది. ‘కశ్మీర్’ పనిచేస్తుందా? బీజేపీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ ప్రజాప్రదర్శనలాంటి పలు కార్యక్రమాలు చేపట్టింది. అస్సాంలో మాదిరిగా హరియాణాలో అక్రమ వలసల నివారణకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కోనున్న ప్రధాన సవాల్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) నుంచే. అయితే మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలైన కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, ముస్లిం మైనారిటీ మహిళల హక్కులను కాపాడే త్రిపుల్ తలాక్ రద్దు చట్టం ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలన్నది నిపుణుల అంచనా. హరియాణాలో 18 ఏళ్ళ తరువాత జాట్‌యేతరుడైన ఖట్టర్ సీఎం అయ్యారు. అయినా జాట్ల ఉద్యమాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్న వేళ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి. మోదీతో సహా బీజేపీ అగ్రనేతలంతా ప్రచారానికి దిగుతున్నారు. దీంతో అంతర్గత కుమ్ములాటలు చల్లారే అవకాశం ఉంది. భూపేందర్ స్థానమెక్కడ? హరియాణాలో 27 శాతం జాట్ సామాజికవర్గాలే ఉన్నాయి. గతంలో ఐదుగురు ముఖ్యమంత్రులు ఇదే సామాజికవర్గం నుంచి ఉన్నారు. స్వయంగా భూపేందర్ సింగ్ హుడా, అతని కుమారుడు దీపేందర్ సింగ్ హుడా సోనాపేట్, రోహతక్‌ల నుంచి 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. జాట్ సామాజిక వర్గం ఆధిపత్యంలోని ఈ ప్రాంతం ఒకప్పుడు భూపేందర్‌కి బలమైన ప్రాంతం. ఈసారి సైతం కష్టతరమేనని నిపుణులు అభిప్రాయం. కాంగ్రెస్‌లో లుకలుకలు రాష్ట్రంలో పునర్వైభవాన్ని తీసుకొచ్చే మాట అటుంచి, అసలు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అంతేలేదు. స్వయంగా రాహుల్ గాంధీయే ఏరికోరి పీసీసీ అధ్యక్షుడిని చేసిన దళిత నేత అశోక్ తన్వర్‌ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ పై ఈ వర్గాలు తాడోపేడో అన్నట్టున్నాయి. అంతేకాదు. ఏకంగా ఢిల్లీలో సోనియా నివాసం ముందు ధర్నాకి కూడా దిగారు. దీంతో విసిగిపోయిన శ్రేణులు బీజేపీలో చేరిపోయారు. రేపటి నుంచి రాహుల్ ప్రచారం ప్రారంభమౌతున్నా కాంగ్రెస్‌ని నిరాశాభావం వెంటాడుతోంది. -
ఉద్యోగాల్లో మహిళలకు 33% కోటా
చండీగఢ్: హరియాణా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మహిళలపైనే దృష్టి సారించింది. శుక్రవారం విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు, రైతులకు రుణ మాఫీ హామీలను ప్రకటించింది. ఈ మేనిఫెస్టోను సంకల్పయాత్రగా అభివర్ణించిన ఆ పార్టీ హరియాణా రోడ్‌వే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం కోటా అమలు చేస్తామంది. రైతులకు రుణమాఫీ, ఎస్సీ విద్యార్థులు, అత్యంత వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏడాదికి 12 వేల రూపాయల స్కాలర్ షిప్, పదకొండు, పన్నెండు తరగతులకు ఏడాదికి 15 వేల రూపాయలు స్కాలర్ షిప్ ఇస్తామని హరియాణా కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
హరియాణాలో డేరా రాజకీయం
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఆధ్యాత్మిక బాట పట్టాయి. డేరాలు, బాబాల చుట్టూ తిరుగుతూ మద్దతు కోసం పోటీ పడుతున్నాయి. హరియాణాలో ఆధ్మాత్మిక సంస్థల ప్రభావం ఓటర్లపై విపరీతంగా ఉంటుంది. తమ ఆ«ధ్యాత్మిక గురువులు ఏ పార్టీకి ఓటు వెయ్యమని చెబితే వారికే గుడ్డిగా ఓటు వేసే అనుచరగణం అధిక సంఖ్యలోనే ఉంది. అందుకే రాజకీయాలన్నీ డేరాల చుట్టూ తిరుగుతున్నాయి. డేరా సచ్చా సౌదా గురువు: గుర్మీత్ రామ్ రహీమ్ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలి జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గుర్మీత్ రామ్ రహీమ్ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఈ డేరాలో 15 మంది సభ్యులతో కూడిన ఒక రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ సమావేశాల్లో వచ్చే ఫలితాలకనుగుణంగా ఏ పార్టీకి మద్దతివ్వాలో నిర్ణయిస్తామని కమిటీ సభ్యుడు జోగిందర్ సింగ్ చెప్పారు. డేరా సచ్చా సౌదా ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాల్లో ఉంది. సత్లోక్ ఆశ్రమ్స్ గురువు: రామ్‌పాల్ ఈ డేరా గురు రామ్‌పాల్ కూడా 2014 నవంబర్ నుంచే జైల్లో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన రాజకీయాలను శాసిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రామ్‌పాల్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. కానీ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో అన్న మీమాంసలో ఉన్నారు. ‘‘లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అంశాల్లో చాలా తేడా ఉంది. అక్టోబర్ 15న సర్వసభ్య సమావేశంలో చర్చించి ఏ పార్టీకి మద్దతునివ్వాలో తేల్చుకుంటాం‘‘అని గురు రామ్‌పాల్ డేరా మీడియా ఇన్చార్జ్ చాంద్ రథి వెల్లడించారు. రోహ్తక్ చుట్టుపక్కలున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురు రామ్‌పాల్ డేరా ప్రభావం ఎక్కువగా ఉంది. డేరా బాబా శ్రీ బాలక్ పురి గురువు: కరణ్ పురి ఈ సారి ఎన్నికల్లో కరణ్ పురి డేరా ఎన్నికలకు దూరంగా ఉండా లని నిర్ణయించుకుంది. హరియాణా లో నివసిస్తున్నా పంజాబీల్లో అధిక ప్రభావం కలిగిన ఈ డేరా తమ అనుచరులకు ఎలాంటి పిలుపు ఇవ్వడం లేదు. అయితే ఈ డేరాను బీజేపీ నాయకులు అత్యధికంగా సందర్శిస్తున్నారు. డేరా గౌకరణ్ ధామ్ గురువు: కపిల్ పురి కాంగ్రెస్‌కు కపిల్పురి మద్దతుదారు. కాంగ్రెస్ నేత భూపీందర్ హూడాకు అనుకూలం. ఈ సారి ఎన్నికల్లో జోక్యం చేసుకోమని చెబుతున్నప్పటికీ బీజేపీకి మద్దతు ఇవ్వాలంటూ గౌకరణ్ ధామ్ డేరా తమ అనుచరగణానికి సంకేతాలు పంపుతోంది. -
‘2024 నాటికి వారిని దేశం నుంచి పంపిస్తాం’
చండీగఢ్: అస్సాంలో ఎన్ఆర్సీని విజయవంతంగా అమలు చేసిన బీజేపీ.. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అమిత్ షా ఎన్ఆర్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గెంటేస్తామని తెలిపారు. హరియాణా కథియాల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అది మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మెండుగా ఉంది. 2024లో మరోసారి ఓట్ల కోసం మీ ముందుకు వస్తాం. కానీ ఆ లోపే బీజేపీ ప్రభుత్వం దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని దేశం నుంచి పంపించి వేస్తుంది. దాదాపు 70 ఏళ్లుగా ఈ అక్రమ వలసదారులు మన ప్రజలకు అందుతున్న అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ.. ధైర్యంగా ఉంటున్నారు. బీజేపీ, మోదీ ప్రజలకు మాట ఇచ్చారు. ఇక మీదట ఈ అక్రమ వలసదారులు దేశంలో ఉండబోరు’ అన్నారు. అలానే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు అమిత్ షా. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, అక్రమ వలసదారుల గెంటివేత వంటివి దేశానికి మేలు చేసే అంశాలని.. కానీ అవి కాంగ్రెస్‌కు రుచించడం లేదని అమిత్ షా మండిపడ్డారు. (చదవండి: దేశమంతటా పౌర రిజిస్టర్) -
కాంగ్రెస్‌కి సవాలు విసిరిన టిక్‌టాక్ స్టార్
చంఢీగఢ్: హర్యానాలోని అదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ కాంగ్రెస్‌కు సవాలు విసురుతున్నారు. దమ్ముంటే అదంపూర్‌లో ఈసారి గెలిచిచూపించాలని కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిషాని ఉద్దేశించి సవాలు చేశారు. కాంగ్రెస్ కంచుకోట, రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథిలోనే ఓటమిని చవిచూసిన పార్టీని ఇక్కడ కూడా ఓడించడం తమకు పెద్ద కష్టమేమీ కాదని ఆమె అన్నారు. అమేథి ఫలితాలే ఇక్కడా పునరావృత్తమవుతాయని సోనాలీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా అదంపూర్ ప్రజలు కాంగ్రెస్‌కే ఓటు వేస్తున్నారని కానీ.. జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యమని ఆమె విమర్శించారు. హర్యానాకు చెందిన సొనాలీ ఫోగట్‌కు టిక్ టాక్‌లో లక్షల మంది ఫాలోవర్లతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె వీడియోలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతోనే ఈ టిక్ టాక్ స్టార్‌ను బీజేపీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపింది. అదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను బీజేపీ సొనాలీకి కేటాయించింది. ఇటీవల బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో సొనాలీ ఫోగట్ పేరును చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అదంపూర్‌లో ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అదంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిషానికే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. ఈ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ 2000 ,2005 ఎన్నికల్లో గెలుపొందారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి గత ఎనిమిది సార్లు జరిగిన ఎన్నికల్లో భజన్ లాల్‌కు చెందిన కుటుంబం సభ్యులే గెలుపొందారు. దీంతో బీజేపీ అదంపూర్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా టిక్ టాక్ స్టార్‌కు టికెట్ కేటాయిస్తూ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. -
చిచ్చురేపిన టికెట్ల లొల్లి.. కాంగ్రెస్‌కు షాక్!
సాక్షి, చంఢీగఢ్: వరుస ఓటములు, అంతర్గత కలహాలతో తికమవుతున్న కాంగ్రెస్ పార్టీకి హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేత అశోక్ తన్వర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ.. రెండు రోజుల కిందట పీసీపీ పదవి నుంచి వైదొలిగిన అశోక్.. తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నాలుగు పేజీల సుదీర్ఘ లేఖను రాశారు. పార్టీలోని అంతర్గత కలహాలా కారణంగా.. సిద్ధాంతాలు పూర్తిగా దారితప్పాయాని, గ్రూపు రాజకీయాలతో పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరిందని లేఖలో పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి కాగా రాష్ట్రంలో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ పార్టీ చీఫ్ సోనియా నివాసం ఎదుట తన్వర్ అనుచరులు కొందరు బుధవారం నిరసన తెలిపిన విషయం తెలిసిందే. హరియాణాలో పార్టీ ‘హూడా కాంగ్రెస్’గా మారిపోయిందని మాజీ సీఎం భూపీందర్ హూడాపై సోనియా గాంధీకి రాసిన లేఖలో తన్వర్ ఆరోపించారు. ఆయనకు గులాంనబీ ఆజాద్ అండగా ఉన్నారన్నారు. గత ఐదేళ్లుగాపార్టీకి ద్రోహం చేసిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. 90 టికెట్లలో 50 వరకు తనవారికే హూడా కేటాయించుకున్నారని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశతో పార్టీ ఎన్నికల కమిటీల నుంచి రాజీనామా చేస్తున్నానని, ఇకపై సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాజాగా పార్టీకి పూర్తిగా రాజీనామా చేశారు. కాగా ఆయన ఏ పార్టీలో చేరుతారనేది తెలియాల్సి ఉంది. బీజేపీ నేతలతో ఇదివరకే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. -
కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: త్వరలో జరగనున్న మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీల కీలక పరిణామాలు సంభవించాయి. టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు నేతలు ఢిల్లీలోని పార్టీ చీఫ్ సోనియా నివాసం ఎదుట నిరసనలకు దిగారు. ఈ ఆరోపణలతో హరియాణా రాష్ట్ర మాజీ చీఫ్ అశోక్‌తన్వర్ పార్టీ ఎన్నికల కమిటీల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, పార్టీ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానన్నారు. రాష్ట్రంలో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ పార్టీ చీఫ్ సోనియా నివాసం ఎదుట తన్వర్ అనుచరులు కొందరు బుధవారం నిరసన తెలిపారు. హరియాణాలో పార్టీ ‘హూడా కాంగ్రెస్’గా మారిపోయిందని మాజీ సీఎం భూపీందర్ హూడాపై సోనియా గాంధీకి రాసిన లేఖలో తన్వర్ ఆరోపించారు. ఆయనకు గులాంనబీ ఆజాద్ అండగా ఉన్నారన్నారు. గత ఐదేళ్లుగాపార్టీకి ద్రోహం చేసిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. 90 టికెట్లలో 50 వరకు తనవారికే హూడా కేటాయించుకున్నారని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశతో పార్టీ ఎన్నికల కమిటీల నుంచి రాజీనామా చేస్తున్నానని, ఇకపై సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేయాలా వద్దా అనేది తన మద్దతుదారులకే వదిలేస్తున్నానన్నారు. అదేవిధంగా ముంబైలో..అభ్యర్థుల టికెట్ల కేటాయింపులపై కాంగ్రెస్‌లో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తను సూచించిన ఒకే ఒక్క అభ్యర్థికి టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనబోనని ముంబై విభాగం మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ప్రకటించారు. ‘పార్టీ నుంచి వైదొలిగే సమయం రాలేదని భావిస్తున్నా. కానీ, పార్టీ వైఖరి నా సేవలు అవసరం లేదని భావిస్తున్నట్లుగా ఉంది. దీన్నిబట్టి ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదనుకుంటున్నా’అని ట్విట్టర్లో ప్రకటించారు. -
బీజేపీ జాబితాలో బబిత, యోగేశ్వర్
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు 78 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేయనుండగా ప్రముఖ క్రీడాకారులు బబితా పొగట్, యోగేశ్వర్ దత్‌లకు కాషాయ పార్టీ నుంచి టికెట్లు దక్కాయి. తొలి జాబితాలో 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి పోటీ చేసే అవకాశం లభించగా, ఏడుగురు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా తొహన నుంచి, పొగట్ దరి నుంచి బరిలో నిలుస్తారు. యోగేశ్వర్ దత్‌కు బరోడా స్ధానం కేటాయించారు. అక్టోబర్ 21న హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 24న ఫలితాలు వెల్లడిస్తారు. -
మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూలు విడుదల చేసింది. దీంతోపాటు తెలంగాణలోని హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన మరుక్షణం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా మీడియాకు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. కాగా, హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 17 స్థానాలు షెడ్యూలు కులాలకు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఎస్టీ నియోజకవర్గాలేవీ లేవు. మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాలకు గాను 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వు అయి ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ 2014 నవంబరు 10వ తేదీన కొలువుదీరగా శాసనసభ కాల పరిమితి 2019 నవంబరు 9వ తేదీతో ముగియనుంది. అలాగే, హరియాణా శాసనసభ 2014, నవంబరు 3వ తేదీన కొలువుదీరగా 2019, నవంబరు 2న ముగియనుంది. 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఒక లోక్‌సభ స్థానం, వివిధ రాష్ట్రాల్లోని 64 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఎంపీ రామచంద్ర పాశ్వాన్ మరణించడంతో బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సమస్తిపూర్ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు హుజూర్నగర్ సహా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 64 శాసన సభ స్థానాలకూ అక్టోబరు 21న ఎన్నిక జరగనుంది. ప్రధానంగా కర్ణాటకలో 15, యూపీలో 11, బిహార్, కేరళ రాష్ట్రాల్లో 5, అస్సాం, గుజరాత్‌లలో 4 చొప్పున స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో అక్కడ ఎక్కువ స్థానాల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల నిబంధనావళి తక్షణం అమల్లోకి వస్తుంది. సుప్రీంను ఆశ్రయిస్తాం: కర్ణాటక ఎమ్మెల్యేలు సాక్షి, బెంగళూరు: ఎన్నికల సంఘం ప్రకటనపై అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు బెంగళూరులో మాట్లాడుతూ.. తమపై అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈసీ నిర్ణయంపై స్టే కోరుతామన్నారు. మొత్తం 17 మందిపై అనర్హత వేటు పడగా ఈసీ 15 స్థానాలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం గమనార్హం. మిగతా ఇద్దరి ఎన్నికకు సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున నిర్ణయం తీసుకోలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. వీరికి అనర్హత వేటు పడిన వారితో సంబంధం లేదని వివరించారు. జూలైలో కర్ణాటకలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో హెచ్డీ కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోగా, బీజేపీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. -
ఉత్తరాన పొత్తు కుదిరింది!
చండీగఢ్: సార్వత్రిక ఎన్నికలు ముగిసి దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి తగ్గినా.. ఉత్తర భారతంలోని హర్యానాలో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల జరుగనున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారమే హర్యానాలో పర్యటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోవైపు పొత్తులపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. దీనిలో భాగంగానే బీఎస్పీతో పొత్తుకు ముందడుగేసింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా ఆదివారం బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనపై ఇరువురు చర్చించారు. దీనికి మాయావతి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాజస్తాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అదే పొత్తును హర్యానాలో కూడా కొనసాగించాలని ఇరుపార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే దీనిపై బహిరంగ ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికల ప్రకటన వెలువడనుంది. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పది ఎంపీ స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఇది చరిత్రాత్మక విజయం: మోదీ
న్యూఢిల్లీ: హర్యానా, మహారాష్ర్టల్లో బీజేపీ సాధించిన విజయం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇది పార్టీకి గర్వకారణమని, సంతోషించదగిన పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కోసం అలుపెరగక శ్రమించిన పార్టీ శ్రేణులకు సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని హామీ ఇచ్చారు. -
మహరాష్ట్ర, హర్యానాల్లో మోదీ మ్యాజిక్
మహరాష్ట్ర, హర్యానాల్లో బీజేపీకే పట్టం అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ హవా హర్యానాలో వికసించిన కమలం, సొంతంగా మెజారిటీ మహరాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ బేషరతుగా బయట నుంచి మద్దతిస్తామన్న ఎన్సీపీ పరిశీలిస్తామని ప్రకటించిన కమలనాథులు నేడు శాసనసభాపక్ష నేతలను ఎన్నుకునే అవకాశం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం: ప్రధాని మోదీ న్యూఢిల్లీ: మోదీ మ్యాజిక్ మరోసారి పనిచేసింది. అన్నీ తానై వ్యవహరించి మరో రెండు రాష్ట్రాలను ‘కమలం’ ఖాతాలో వేశారు. దీంతో కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఎదురైన తొలి పరీక్షలో ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతంగా నెగ్గారు. మహరాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయదుందుభి మోగించింది. గత లోక్‌సభ ఎన్నికల హవాను బీజేపీ కొనసాగించింది. మోదీ ప్రభంజనంలో కాంగ్రెస్ తదితర పక్షాలన్నీ కొట్టుకొనిపోయాయి. హర్యానాలో కమలనాథులు పూర్తి మెజారిటీ సాధించి తొలిసారిగా అధికార పీఠాన్ని చేజిక్కుంచుకున్నారు. మహారాష్ర్టలోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అత్యధిక సీట్లు గెలుపొంది రాష్ర్టంలో అధికార పగ్గాలు చేపట్టడాన్ని ఖాయం చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. 90 సీట్లున్న హర్యానాలో బీజేపీ 47 స్థానాలను సొంతం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను చిత్తుచేసింది. 19 సీట్లతో ఐఎన్ఎల్డీ రెండో స్థానంలో నిలవగా, కేవలం 15 చోట్ల నెగ్గిన కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకున్న కమల దళం ఈసారి ఏకంగా అధికారాన్నే చేజిక్కించుకోవడం విశేషం. ఇక రాజకీయ పోటీ తీవ్రంగా ఉన్న మహారాష్ర్టలోనూ 288 సీట్లకు గాను మరో మూడు చిన్న పార్టీలతో కలిసి బీజేపీనే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ సొంతంగా 122 సీట్లను కూటమి ఖాతాలో వేసుకుని సాధారణ మెజారిటీకి మరో 23 సీట్ల దూరంలో నిలిచింది. అయినా రాష్ర్టంలో అధికారం చేపట్టడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. దీర్ఘకాలంగా మిత్రపక్షంగా ఉండి ఈ ఎన్నికల ముందే తన బంధాన్ని తెంచుకున్న శివసేన మద్దతు తీసుకునేందుకు ద్వారాలు తెరిచే ఉండగా.. మరోవైపు అనూహ్యంగా ఎన్సీపీ కూడా ఇందుకు ముందుకొచ్చింది. తాము బయటినుంచి బేషరతుగా మద్దతిస్తామని ఎన్సీపీ ప్రకటించింది. 15 ఏళ్లుగా కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకున్న ఎన్సీపీ ఈసారి ఒంటరిగానే పోటీ చేసింది. 41 సీట్లు సాధించిన ఈ పార్టీ సహకారంతోనూ బీజేపీ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలుంది. 63 సీట్లు నెగ్గిన శివసేనను కాదని ఎన్సీపీ మద్దతు తీసుకునేందుకూ కమలనాథులు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీతో జట్టు కట్టేందుకు తమకు అభ్యంతరం లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా స్పష్టమైన సంకేతాలిచ్చారు. మొత్తానికి రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ మోదీనే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రధాని హోదాలో కూడా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. మహరాష్ట్రలో 27, హర్యానాలో 11 బహిరంగ సభల్లో పాల్గొని పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. హర్యానాలో బీజేపీకి ఓట్ల శాతం 9 నుంచి ఏకంగా 33కు పెరగగా..మహరాష్ట్రలో ఇది 14 శాతం నుంచి 27.8 శాతానికి చేరింది. కాగా, హైదరాబాద్‌లో బలంగా ఉన్న మజ్లిస్ పార్టీ మహారాష్ర్టలో ఈసారి ఖాతా తెరిచింది. ఇక్కడ తొలిసారి పోటీ చేసి రెండు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇక గత అసెంబ్లీలో 13 సీట్లున్న ఎంఎన్ఎస్ పార్టీ ఈసారి ఒక్క స్థానానికే పరిమితమైంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే బీజేపీ పార్లమెంటరీ బోర్డు అత్యవసరంగా భేటీ అయింది. మోదీ, అమిత్ షాతో పాటు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మా స్వరాజ్, శివరాజ్‌సింగ్ చౌహాన్ వంటి పార్టీ సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. మహారాష్ర్టలో ప్రభుత్వ ఏర్పాటుకు అవలంబించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చిం చారు. బయటినుంచి మద్దతిచ్చేందుకు సిద్ధమని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించడంతో ఈ అవకాశంపైనా బీజేపీ నేతలు దృష్టిసారించారు. సీఎంలను ఎంపిక చేసేందుకు వీలుగా రెండు రాష్ట్రాలకు ఇద్దరు చొప్పున పరిశీలకులను పంపాలని పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. మహారాష్ర్టకు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నద్దాను.. హర్యానాకు మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మను పరిశీలకులుగా ఎంపిక చేసింది. ఇక 2 రాష్ట్రాల్లో కొత్తగా గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలంతా సోమవారం సమావేశమై తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశముంది. మరోవైపు అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ ఈ 2 రాష్ట్రాల్లో పార్టీ విజయంతో మోదీ సర్కారు పనితీరుకు ప్రజామోదం లభిం చినట్లేనన్నారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ రహిత భారత్ లక్ష్యం దిశగా మరో రెండడుగులు ముందుకు పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ హవా సునామీలా విరుచుకుపడిందని, విపక్షాలన్నీ అందులో కొట్టుకుపోయాయని షా అన్నారు. కాగా మహారాష్ర్టలో శివసేనతో మితృత్వాన్ని పునరుద్ధరించుకోవడమే మేలని బీజేపీ అగ్రనేత అద్వానీ అభిప్రాయపడ్డారు. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. తమ పార్టీ కోరితే శివసేనతో చర్చించడానికి తాను సిద్ధమేనని అద్వానీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యాయన్నారు. మరోవైపు ఎన్సీపీ మద్దతు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని బీజేపీ మహారాష్ర్ట చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొనడం గమనార్హం. -
ఇరు రాష్ట్రాలలో విజయం సాధించిన అభ్యర్థులు
హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఓట్ల లెక్కింపులో ఇదే విషయం స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో రెండవ స్థానంలో శివసేన, ఆ తర్వాత స్థానాలు వరుసగా కాంగ్రెస్, ఎన్సీపీ నిలిచేలా ఉన్నాయి. హర్యానాలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇక్కడ రెండవ స్థానంలో ఐఎన్ఎల్డీ, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉన్నాయి. ఇరు రాష్ట్రాలలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు: బీజేపీ - 55 శివసేన - 29 కాంగ్రెస్ - 25 ఎన్సీపీ - 21 ఇతరులు - 17 గెలుపొందినవారు: అజిత్ పవర్ (ఎన్సీపీ) వైభవ్ నాయక్ (శివసేన) దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ) పృధ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్) ఓడిపోయినవారు: నారాయణ రాణె (కాంగ్రెస్) హర్యానాలోని మొత్తం 90 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు: బీజేపీ - 45 కాంగ్రెస్ - 14 ఐఎన్ఎల్డీ - 19 హెచ్జేసీ - 2 ఇతరులు - 6 విజయం సాధించినవారు: భూపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్) -
ఓటమిని ఒప్పుకుంటున్నా: హుడా
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా అంగీకరించారు. ప్రజాతీర్పును ఒప్పుకుంటున్నానని ఆదివారం విలేకరులతో అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు. గతంలో తాము విజయం సాధిస్తే, ఇప్పుడు బీజేపీ గెలిచిందన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలన లో చేసిన అభివృద్ధిని కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీ విజయానికి నరేంద్ర మోడీ ప్రభంజనం కారణమన్న వాదనతో ఆయన విభేదించారు. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో బీజేపీ పూర్తి ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. -
రెండు రాష్ట్రాల్లో భారీ పోలింగ్
మహారాష్ట్రలో 64 శాతం, హర్యానాలో 76 శాతం {పశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు హర్యానా చరిత్రలో ఇదే భారీ పోలింగ్ ముంబై/చండీగఢ్: లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రం లోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీ ఎన్నికలు బుధవారం భారీ పోలింగ్‌తో చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతం గా ముగిశాయి. పంచముఖ పోటీ నెలకొన్న మహారాష్ట్రలో 64 శాతం పోలింగ్, త్రిముఖ పోటీ నెలకొన్న హర్యానాలో ఆ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయిలో 76 శాతం పోలింగ్ నమోదైంది. హర్యానాలో 1967లో చివరిసారి నమోదైన భారీ పోలింగ్ 72.65 శాతం కంటే ఈసారి దాదాపు నాలుగు శాతం ఎక్కువ రికార్డయింది. పూర్తి వివరాలు అందాక పోలింగ్ ఇంకా పెరిగే అవకాశముందని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. హర్యానాలో 2009 ఎన్నికల్లో 72.37 శాతం, మహారాష్ట్రలో 59.49 శాతం పోలింగ్ జరిగింది. తాజా ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 19న జరగనుంది. మహారాష్ట్రలో..: 8.35 కోట్లమంది ఓటర్లున్న మహారాష్ట్రలో పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఉదయం వేగంగా మొదలై మధ్యాహ్నానికి తగ్గి, సాయంత్రానికి మళ్లీ పుంజుకుంది. మొత్తం 288 సీట్లకు ఎన్నిక లు జరిగాయి. 4,119 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఓటేసిన ప్రముఖుల్లో మాజీ సీఎం పృథీరాజ్ చవాన్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. నాగపూర్ జిల్లాలోని పారశివనిలో పిడుగుపడడడంతో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ పోలీసు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. గడ్చిరోలి జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో నక్సలైట్లు పోలీసులపై, ఎన్నికల సిబ్బందిపై కాల్పులు జరిపారు చాముర్తి తాలూకా మక్కెపెల్లి వద్ద బ్యాలట్ బాక్సులు తీసుకెళ్తున్న సిబ్బంది లక్ష్యంగా నక్సల్స్ మందుపాతర పేల్చి కాల్పులు జరపగా ఒక పోలీసు గాయపడ్డాడు. గెదా గ్రామం వద్ద పోలింగ్ బూత్‌కు దగ్గర్లో నక్సల్స్, పోలీసుల మధ్య 15 నిమిషాలు కాల్పులు జరిగాయి. హర్యానాలో..: హర్యానాలోని మొత్తం 90 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 1.63 కోట్ల మంది ఓటర్లున్న ఈ రాష్ట్రంలో 1,351 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్వల్ప ఘర్షణలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్, బీజేపీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న హర్యానాలో సీఎం భూపీందర్‌సింగ్ హూడా(కాంగ్రెస్), అభయ్ చౌతాలా(ఏఎన్ఎల్డీ) తదితర ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో భారీ పోలింగ్ నమోదైంది. హిస్సార్ జిల్లాలోని బర్వాలా, మేవాత్ జిల్లా పున్హానా తదితర చోట్ల ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది పోలీసులు సహా 32 మంది గాయపడ్డారు. కాగా, మహారాష్ట్ర, హర్యానాల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు అన్నీ ధీమా వ్యక్తం చేశాయి. తరలి వచ్చిన సినీతారలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ అగ్రతారలు, వివిధ రంగాల ప్రముఖులు బిజీబిజీ షెడ్యూళ్లను పక్కనపెట్టి మరీ పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ముంబైలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనాలీ బింద్రే, హేమమాలిని, రేఖ, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్ తదితరులు ఓటు వేశారు. -
అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం
హర్యానా, మహారాష్ర్టల్లో రేపే పోలింగ్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు న్యూఢిల్లీ: హర్యానా, మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా పోటాపోటీ ప్రచారం నిర్వహించిన ప్రధాన రాజకీయ పార్టీలు చివరి రోజున సాధ్యమైనంత విస్తృతంగా సభలు నిర్వహించాయి. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెర పడటంతో రెండు రాష్ట్రాల్లోనూ లౌడ్స్పీకర్లు మూగబోయాయి. మహారాష్ర్టలోని 288 సీట్లు, హర్యానా అసెంబ్లీలోని 90 సీట్లకు బుధవారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం సాధించిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాన్ని పునరావృతం చేయాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. ఎన్నో బాధ్యత లతో ఊపిరిసలపకుండా ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఏకంగా 30 సభల్లో ఆయన ప్రసంగించడం విశేషం. బీజేపీ పూర్తిగా మోదీ చరిష్మాపైనే ఆశలు పెట్టుకుంది. ఇక మహారాష్ర్టలో నిన్నమొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న శివసేనను ఎక్కడా విమర్శించకుండా ప్రధాని జాగ్రత్తపడ్డారు. కాంగ్రెస్, ఎన్సీపీలనే లక్ష్యంగా చేసుకుని ప్రచారం నిర్వహించారు. ఇక అభివృద్ధి మంత్రం పఠిస్తూ కాంగ్రెస్ తన ప్రచారాన్ని కొనసాగించింది. అటు హర్యానాలోనూ కాంగ్రెస్ అవినీతినే ప్రచారాస్త్రంగా చేసుకుని మోదీ ప్రసంగాలు సాగాయి. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ లావాదేవీల వ్యవహారం ఎన్నికల్లో చర్చనీయాంశమైంది. ఐఎన్ఎల్డీ నేతలపైనా విమర్శలు గుప్పించారు. కాగా, మహారాష్ర్టలో 8.25 కోట్ల మంది ఓటర్లు.. 1,699 మంది స్వతంత్రులు సహా 4,119 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. బీజేపీ 257 సీట్లలో, దాని మిత్రపక్షాలు 31సీట్లలో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీలు మొత్తం స్థానాలకు తమ అభ్యర్థులను పోటీకి దింపాయి. శివసేన కూడా మెజారిటీ స్థానాల్లో పోటీలో నిలిచింది. 1989 తర్వాత ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇటు హర్యానాలో బీజేపీ తొలిసారిగా మొత్తం 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈసారి హర్యానాలో రెండు కొత్త పార్టీలు(హర్యానా జనచేతన పార్టీ, హర్యానా లోకహిత్ పార్టీ) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కాంగ్రెస్‌కు ఎలాగైనా మూడోసారి అధికారాన్ని కట్టబెట్టడానికి సీఎం భూపిందర్‌సింగ్ హూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీ తన ప్రచారంతో బీజేపీ, ఐఎన్ఎల్డీలపై దాడి చేశారు. ఇక టీచర్ల నియామకం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా జైలు పాలవడంతో ఎన్నికల్లో పోటీకి దూర మయ్యారు. దీంతో ఐఎన్ఎల్డీని గట్టెక్కించే బాధ్యత ఆయన కుమారుడు అభయ్ సింగ్‌పై పడింది. ఈ నెల 19న రెండు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ జరగనుంది. కాగా, రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ప్రకటించినప్పట్నుంచి సోమవారం వరకు.. ఓటర్లకు పంచేందుకు ఉద్దేశించిన రూ. 18 కోట్ల నగదు, 4.5 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారసత్వానికి స్వస్తి చెప్పండి మహారాష్ట్ర ప్రజలకు మోదీ పిలుపు కంకావ్లీ(మహారాష్ట్ర): కాంగ్రెస్, ఎన్సీపీలవి కుటుంబ వారసత్వ రాజకీయాలని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్రంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కంకావ్లీ, రత్నగిరి, పాల్ఘర్లలో జరిగిన సభల్లో ప్రసంగించారు. ‘కాంగ్రెస్, ఎన్సీపీల నాయకులు భూస్వామ్య వ్యవస్థ నెలకొల్పారు. తండ్రి అధికారంలోకి వస్తాడు, కొన్ని జిల్లాల సంగతి చూసుకోవాలని తన పిల్లలకు చెబుతాడు. కాంగ్రెస్, ఎన్సీపీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయి. రాష్ట్రం వారసత్వ రాజకీయాల బంధనాల నుంచి బయటపడాలి’ అని అన్నారు. సుపరిపాలన కోసం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఇవ్వాలని కోరారు. పాల్ఘర్ సభలో మాట్లాడుతూ.. పాక్ జైళ్లలో మగ్గుతున్న పాల్ఘర్ జిల్లా జాలర్ల కష్టాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అంశాన్ని పాక్ ముందు లేవనెత్తిందని అన్నారు. తాను పాక్ ప్రధానితో మాట్లాడానని, గత పదేళ్లలో తొలిసారి ఆ దేశం 200 మంది భారత జాలర్లను, 50 పడవలను వదలిపెట్టిందన్నారు. -
వారసత్వ రాజకీయాలు వద్దు: మోదీ
హిస్సార్: హర్యానాలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 'కుటుంబ పాలన' నుంచి హర్యానాకు విముక్తి కల్పించాల్సిన అవసరముందన్నారు. హిస్సార్ లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. హర్యానాలో అన్ని రాజకీయ పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని మోదీ విమర్శించారు. బీజేపీకి పూర్తి ఆధిక్యం కట్టబెట్టాలని ఆయన కోరారు. -
ఢిల్లీ... హర్యానా పక్కనే ఉంది... రండి
హర్యానా: హర్యానా రైతులను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. 60 ఏళ్లలో ఏం చేయలేని వారు... నా 60 రోజుల పాలన గురించి ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. దేశం అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీని సాగనంపాలని హర్యానా ప్రజలకు మోడీ హితవు పలికారు. హర్యానా రాష్ట్ర శాసనసభకు ఈ నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హర్యానాలోని కర్నల్‌లో నరేంద్ర మోడీ ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... బీజేపీతోనే అభివృద్ది సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. కర్ణుడు జన్మించిన నేలపై నుంచి మాట్లాడుతున్నానంటూ ఢిల్లీ... హర్యానా పక్కనే ఉంది.... నేను మీ పక్కనే కూర్చున్నానని... రాష్ట్రంలో బీజేపీని తీసుకురండి... తద్వారా మధ్యవర్తులు లేకుండా మనమంతా మాట్లాడుకుందాం రండి అంటూ మోడీ తన ప్రసంగంతో తనదైన శైలిలో హర్యానా ప్రజలకు ఆకట్టుకున్నారు. ఈ ఎన్నికలు హర్యానా భవిష్యత్ మార్చేవని అన్నారు. హర్యానాలో రియల్ మాఫియాకు చెక్ పెడదామన్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండే హర్యానాలో ధాన్యంపై పన్ను విధించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మోడీ ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేశారు.