ఇది చరిత్రాత్మక విజయం: మోదీ
ఇది చరిత్రాత్మక విజయం: మోదీ
Published Mon, Oct 20 2014 12:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
న్యూఢిల్లీ: హర్యానా, మహారాష్ర్టల్లో బీజేపీ సాధించిన విజయం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇది పార్టీకి గర్వకారణమని, సంతోషించదగిన పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయం కోసం అలుపెరగక శ్రమించిన పార్టీ శ్రేణులకు సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement