
హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్ధుల తొలి జాబితా వెల్లడైంది.
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు 78 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేయనుండగా ప్రముఖ క్రీడాకారులు బబితా పొగట్, యోగేశ్వర్ దత్‌లకు కాషాయ పార్టీ నుంచి టికెట్లు దక్కాయి. తొలి జాబితాలో 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి పోటీ చేసే అవకాశం లభించగా, ఏడుగురు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా తొహన నుంచి, పొగట్ దరి నుంచి బరిలో నిలుస్తారు. యోగేశ్వర్ దత్‌కు బరోడా స్ధానం కేటాయించారు. అక్టోబర్ 21న హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 24న ఫలితాలు వెల్లడిస్తారు.