
ముంబయి:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఆదివారం(అక్టోబర్20) విడుదల చేసింది.99 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.ఈ జాబితాలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఉన్నారు. ఫడ్నవిస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే కామఠీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ భోకర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
శివసేన,ఎన్సీపీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గాలకు నవంబరు 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: వయనాడ్ ఎవరిది..? నవ్య వర్సెస్ ప్రియాంక