ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి ముదురుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రాష్ట్ర రాజకీయాలు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోవడానికి అదానీయే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
అంతేగాక 2019లో అదానీ తన ఢిల్లీ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారని, బీజేపీ- ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరారని శరర్ పవార్ ఆరోపించారు. ఈ సమావేశానికి తనతోపాటు, అమిత్ షా, తన మేనల్లుడు అజిత్ పవార్, అదానీ హాజరైనట్లు తెలిపారు.
అయితే ఆ ఆరోపణలను తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. గౌతమ్ అదానీ తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. గతంలో అదానీ తమ సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చించేందుకు ఫడ్నవీస్, అమిత్ షాలతో సహా బీజేపీ అగ్రనేతలు, శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ సహా ఎన్సీపీకి చెందిన నేతలంతా అదానీ ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన చర్చల్లో భాగమయ్యారని అజిత్ పవార్ కూడా ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment